పాత కంప్యూటర్ స్పీడ్ పెంచే జియో సర్వీస్ | Reliance Jio launches JioPC Price Starts at Rs 1000 | Sakshi
Sakshi News home page

పాత కంప్యూటర్ స్పీడ్ పెంచే జియో సర్వీస్

Sep 4 2026 5:01 PM | Updated on Sep 4 2026 5:32 PM

Reliance Jio launches JioPC Price Starts at Rs 1000

కంప్యూటర్ కొన్నేళ్లు వాడిన తర్వాత నెమ్మదించడం సహజమే. స్టోరేజ్ తగ్గిపోవడం, ర్యామ్ సరిపోకపోవడం, కొత్త సాఫ్ట్‌వేర్‌లు సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమయంలో.. చాలామంది కొత్త కంప్యూటర్ కొనాలని ఆలోచిస్తారు. కానీ అలాంటి వారికోసం రిలయన్స్ జియో 'జియోపీసీ' సేవలను తీసుకొచ్చింది.

జియోపీసీ అనేది ఒక క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్ సర్వీస్. అంటే.. మీ దగ్గర ఉన్న పాత కంప్యూటర్‌లోనే క్లౌడ్ ద్వారా అదనపు ర్యామ్, స్టోరేజ్, కంప్యూటింగ్ పవర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతో కంప్యూటర్ పాతదైనా కొత్త అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించే అవకాశం ఉంటుంది.

గతంలో జియోపీసీ అనేది కేవలం జియోహోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఏ కంపెనీకి చెందిన ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా.. ఈ సేవను తీసుకోవచ్చు. అంటే జియో సిమ్ లేదా జియో బ్రాడ్‌బ్యాండ్ తప్పనిసరి కాదు.

రూ.1,000 నుంచే ప్లాన్స్!
జియోపీసీలో ప్రస్తుతం రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. సాధారణ జియోపీసీ ప్లాన్‌లో 8జీబీ ర్యామ్, 500 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. జియోపీసీ అల్ట్రాలో 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ లభిస్తుంది.

రెండు నెలల జియోపీసీ ప్లాన్ ధర రూ.1,000 నుంచి ప్రారంభమవుతుంది. జియోపీసీ అల్ట్రా రెండు నెలలకు రూ.1,200గా ఉంది. ఏడాదికి కావాలంటే కూడా దీనికోసం తగిన ప్లాన్ ఎంచుకోవచ్చు. దీనికోసం సంస్థ మల్టిపుల్ ప్లాన్స్ అందిస్తోంది. మూడు, నాలుగేళ్లుగా కంప్యూటర్లను వాడుతున్న వారికి జియోపీసీ చాలా ఉపయోగపడుతుంది. ఎనిమిదేళ్ల పాత కంప్యూటర్లలో కూడా జియోపీసీ ద్వారా ఏఐ ఆధారిత అప్లికేషన్లను ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఎందుకంటే.. ఎక్కువ కంప్యూటింగ్ అవసరమయ్యే పనులు క్లౌడ్‌లో జరుగుతాయి.

పాత కంప్యూటర్ ఉపయోగించేవారు.. రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియోపీసీ ఉపయోగించుకుంటే బహుశా వెంటనే కొత్త కంప్యూటర్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు, ఇళ్లలో కంప్యూటర్ వాడేవారు, చిన్న వ్యాపారాలు, ప్రొఫెషనల్స్‌కు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. రూ.4600 పెరిగిన బంగారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement