‘నన్ను టార్గెట్‌ చేస్తే.. మళ్లీ కొడతా’ : స్వతంత్ర భరద్వాజ్‌ సంచలన వ్యాఖ్యలు | Will Do Again swatantra Bhardwaj Who Hit Student Father at Delhi CJP Protest | Sakshi
Sakshi News home page

‘నన్ను టార్గెట్‌ చేస్తే.. మళ్లీ కొడతా’ : స్వతంత్ర భరద్వాజ్‌ సంచలన వ్యాఖ్యలు

Sep 4 2026 4:16 PM | Updated on Sep 4 2026 4:25 PM

Will Do Again swatantra Bhardwaj Who Hit Student Father at Delhi CJP Protest

సాక్షి, న్యూఢిల్లీ:  జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ (NEET) నిరసనలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్త తండ్రిపై దాడి చేసిన కేసులో నిందితుడు స్వతంత్ర భరద్వాజ్ తన వైఖరిని సమర్థించుకుంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అతని ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి. ఈ వ్యాఖ్యలు  వైరల్‌ కావడంతో సీజేపీ అతనిపై కేసు నమోదు చేయాలని  డిమాండ్‌ చేస్తూ సీజేపీ ఆందోళన చేపట్టింది.

అయితే ఈ సందర్భంగా  స్వతంత్ర భరద్వాజ్ మాట్లాడుతూ  సీజేపీ నిరసనలతో విద్యార్తుల గుంపు తనపై దాడి చేసి కొట్టి చంపేలా (Lynching) ప్రవర్తించడంతో, తనను తాను రక్షించుకోవడానికే తన చేతికి ఉన్న లోహపు కడా (Iron Bracelet)తో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ తలపై కొట్టానని తెలిపాడు.

పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ వ్యాఖ్యలు వైరల్

"నేను అతని(నిషు ఆజాద్ తండ్రి) పుర్రె పగలగొట్టాను,  చావు బతుకుల మధ్య అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనికి 60 కుట్లు పడ్డాయి... నిజానికి నాపై సెక్షన్ 307 (హత్యాయత్నం) పడాలి, కానీ పోలీసులు నన్ను అరెస్ట్ కూడా చేయలేదు, రాత్రంతా తిరుగుతూనే ఉన్నాను ఒక్క రోజులోనే విడుదలయ్యాను. కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్ , మోదీ కూడా నాకు అన్నయ్యలే. అందరి మద్దతు ఉంది" అంటూ గర్వంగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అయితే ఇది వివాదాస్పద మవ్వడంతో, ఆ మాటలను సరదాగా అన్నానని మాట మార్చాడు. అంతేకాదు పాడ్‌కాస్ట్‌లో తన మాటల్ని వక్రీకరిస్తున్నారంటూ మాట మార్చడంతోపాటు, ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా  కామెంట్‌ చేయడం వైరల్‌గా మారింది. మళ్లీ తనను చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రయత్నిస్తే,  చేతి కడియంతో మళ్లీతో కొడతానని హెచ్చరించడం  కలకలం రేపింది.

ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్‌ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలు

కాగా  స్వతంత్ర భరద్వాజ్  వ్యాఖ్యలకు నిరసనగా  సీజేపీ భీమ్ ఆర్మీ నిరసన చేపట్టింది. CJP ప్రతినిధి సౌరవ్ దాస్, కో-కన్వీనర్ అశుతోష్ రాంకాతో పాటు భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. భరద్వాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, అతనిపై హత్యాయత్నం , SC/ST చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట భారీ ధర్నా చేపట్టారు. ఫలితంగా భరద్వాజ్‌పై హత్యాయత్యం కేసు నమోదైంది. త్వరలోనే అతడిని అరెస్ట్‌ చేస్తామని సీజేపీకి పోలీసులు హామీ ఇచ్చారు. 

ఇదీ చదవండి: సీజేపీకీ భారీ ఊరట : ఇన్‌ఫ్లూయెన్సర్‌పై హత్యాయత్నం కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement