breaking news
Controversy
-
గాజువాకలో కోటి గాజుల గణపతి వివాదం.. పోలీస్ VS నిర్వాహకులు!
-
చైనా కండకావరం.. లైవ్‌లోనే ఏకిపారేశాడు
దక్షిణ చైనా సముద్ర వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరుగుతున్న డిఫెన్స్ డైలాగ్‌కు ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో సీ. టియోడోరో హాజరయ్యారు. అయితే ఆయన మాట్లాడుతున్న టైంలో చైనా తరఫున ఓ నోట్ అందింది. ప్రసంగం మధ్యలో అందిన ఆ లేఖను టియోడోరో అక్కడే బహిరంగంగా చదివి వినిపించడంతో పాటు.. చైనా తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టియోడోరో ప్రసంగిస్తుండగా తెల్లటి కోటు ధరించిన ఓ వ్యక్తి ఆయన వెనుక నుంచి వచ్చి టేబుల్‌పై ఓ కాగితాన్ని ఉంచాడు. సియోల్‌లోని చైనా రాయబార కార్యాలయానికి చెందిన మిలిటరీ అటాషే ఆ నోట్‌ను సిబ్బందికి అందించినట్లు సమావేశ నిర్వాహకులు తెలిపారు. అయితే అది టియోడోరో బృందం నుంచి వచ్చిన సందేశమని భావించిన సిబ్బంది.. ప్రసంగం మధ్యలోనే దాన్ని మంత్రికి అందించారు.నోట్ తీసుకున్న టియోడోరో.. ‘‘ఇది చైనా నుంచి వచ్చినదని అనుకుంటున్నాను. దీన్ని చదవనా?’’ అంటూ సభికులను ఉద్దేశించి అన్నారు. అనంతరం దానిలోని విషయాలను బహిరంగంగా చదివారు.‘అంతర్జాతీయ చట్టాన్ని అవమానించారు’దక్షిణ చైనా సముద్రంపై 2016లో జరిగిన మధ్యవర్తిత్వ తీర్పుపై చైనా తన వైఖరిని నోట్లో స్పష్టం చేసింది. ఆ తీర్పు అంతర్జాతీయ చట్టంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించిందని పేర్కొంది. అయితే ఈ వాదనను టియోడోరో తీవ్రంగా తప్పుబట్టారు. తన ప్రసంగం మధ్యలో ఇలా నోట్ పంపడం దక్షిణ కొరియాను, ఈ కార్యక్రమ నిర్వాహకులను, అక్కడి ప్రతినిధులను అవమానించడమేనని అన్నారు. అంతర్జాతీయ చట్టానికి సంబంధించిన నిబంధనలను చైనా గౌరవించడం లేదని విమర్శించారు.ఇది బెదిరించడమే..చైనా చర్యను.. బెదిరించడం, వేధించడమే అవుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నోట్‌ను చైనా ఎంత నిరాశలో ఉందో గుర్తుచేసే జ్ఞాపికగా దాచుకుంటానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నోట్‌ను అందించిన వ్యక్తిని ఉద్దేశించి కూడా టియోడోరో వ్యంగ్యంగా మాట్లాడారు. అతను తన దేశానికి గొప్ప సేవ చేశాడంటూ వ్యాఖ్యానించారు.PHILIPPINES SHREDS CHINA OVER SOUTH CHINA SEA RULING IN FRONT OF THE WORLDYOU LOST : PHILIPPINE DEFENCE CHIEF PUBLICLY REBUKES CHINESE MILITARY OFFICIALA dramatic confrontation unfolded at a defence forum in seoul after a chinese military attaché handed a note to philippine… pic.twitter.com/QiwwlluQVl— Raj anand (@Rajanand7654) September 9, 2026దక్షిణ చైనా సముద్రంపై వివాదంఫిలిప్పీన్స్, చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంపై చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. 2016లో ఫిలిప్పీన్స్ దాఖలు చేసిన కేసులో మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్.. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తృత చారిత్రక హక్కుల వాదనకు చట్టపరమైన ఆధారం లేదని తీర్పునిచ్చింది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ)లోని వనరులపై చైనాకు హక్కు లేదని పేర్కొంది.అయితే ఈ తీర్పును చైనా తిరస్కరిస్తూ.. ఆ ట్రైబ్యునల్‌కు ఈ కేసుపై విచారణ జరిపే అధికారమే లేదని చెబుతోంది. మరోవైపు చైనా తమ సముద్ర హక్కులను ఉల్లంఘిస్తోందని ఫిలిప్పీన్స్ తరచూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా డిఫెన్స్ ఫోరంలో నోట్ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరోసారి తెరపైకి తెచ్చింది.ఇదీ చదవండి: ఎడారికి సముద్రపు నీరు!! ఎలా వచ్చిందో తెలుసా? -
ఈఫిల్ టవర్: హిందూ సంస్థ పర్యటనలో ‘మహిళా వివక్ష’!
ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూ సంస్థ బాప్స్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా మహిళా సిబ్బందిని విధుల నుంచి తప్పించి, వారి స్థానంలో పురుష ఉద్యోగులను నియమించారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి. దీంతో ఉద్యోగులు నిరసనకు దిగడంతో ఈఫిల్ టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.శనివారం సుమారు 100 మంది సభ్యులతో కూడిన బోచాసన్వాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (BAPS) బృందం ఈఫిల్ టవర్‌ను సందర్శించింది. బృందం వెళ్లే సమయంలో మహిళా ఉద్యోగులు కనిపించకుండా పక్కకు తప్పుకోవాలని, వారి స్థానాల్లో పురుష సిబ్బంది ఉండాలని ఆదేశించినట్లు యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.ఈ ఘటనపై ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ సెటె(SETE) కూడా స్పందించింది. పర్యటన నిర్వాహకుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు అలా స్పందించామని, అసలు అలాంటి షరతులను అంగీకరించాల్సింది కాదని సంస్థ అంగీకరించింది. ఉద్యోగులకు యాజమాన్యం క్షమాపణలు చెప్పినట్లు యూనియన్ తెలిపింది.ఈ వ్యవహారంపై పారిస్ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ విచారణకు ఆదేశించారు. మహిళలు, పురుషులు ఎలాంటి వివక్ష లేకుండా పనిచేసే హక్కు కలిగి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు యాయెల్ బ్రాన్-పివే కూడా ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ.. విదేశీ సందర్శకుల అభ్యర్థనల కోసం మహిళలను పక్కకు తప్పించడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, పారిస్ శివార్లలో బాప్స్ తొలి భారీ హిందూ దేవాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. భారత్, ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సంబంధాలను ఈ ఆలయం మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తనకు వీలు కుదిరినప్పుడు తప్పకుండా ఆ ఆలయం సందర్శిస్తానని మోదీ చెప్పారు.ఇదీ చదవండి: ‘భయం’పై నిర్భయ ప్రయోగం -
కడప DSC లో మరో బాగోతం.. విచారణలో షాకింగ్ విషయాలు!
-
ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?
-
‘నన్ను టార్గెట్ చేస్తే.. మళ్లీ కొడతా’ : స్వతంత్ర భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ (NEET) నిరసనలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్త తండ్రిపై దాడి చేసిన కేసులో నిందితుడు స్వతంత్ర భరద్వాజ్ తన వైఖరిని సమర్థించుకుంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అతని ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో సీజేపీ అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది.అయితే ఈ సందర్భంగా స్వతంత్ర భరద్వాజ్ మాట్లాడుతూ సీజేపీ నిరసనలతో విద్యార్తుల గుంపు తనపై దాడి చేసి కొట్టి చంపేలా (Lynching) ప్రవర్తించడంతో, తనను తాను రక్షించుకోవడానికే తన చేతికి ఉన్న లోహపు కడా (Iron Bracelet)తో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ తలపై కొట్టానని తెలిపాడు.“I Cracked His Head. Still Never Went Jail.” Then He Named Powerful Politicians As Protection #SwatantraBhardwaj is heard allegedly claiming that he attacked the father of a protester, causing severe head injuries that required around 60 stitches. pic.twitter.com/sdydrSQzlm— Genzdigest (@genzdigest) September 3, 2026పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ వ్యాఖ్యలు వైరల్"నేను అతని(నిషు ఆజాద్ తండ్రి) పుర్రె పగలగొట్టాను, చావు బతుకుల మధ్య అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనికి 60 కుట్లు పడ్డాయి... నిజానికి నాపై సెక్షన్ 307 (హత్యాయత్నం) పడాలి, కానీ పోలీసులు నన్ను అరెస్ట్ కూడా చేయలేదు, రాత్రంతా తిరుగుతూనే ఉన్నాను ఒక్క రోజులోనే విడుదలయ్యాను. కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్ , మోదీ కూడా నాకు అన్నయ్యలే. అందరి మద్దతు ఉంది" అంటూ గర్వంగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అయితే ఇది వివాదాస్పద మవ్వడంతో, ఆ మాటలను సరదాగా అన్నానని మాట మార్చాడు. అంతేకాదు పాడ్‌కాస్ట్‌లో తన మాటల్ని వక్రీకరిస్తున్నారంటూ మాట మార్చడంతోపాటు, ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా కామెంట్ చేయడం వైరల్‌గా మారింది. మళ్లీ తనను చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రయత్నిస్తే, చేతి కడియంతో మళ్లీ కొడతానని హెచ్చరించడం కలకలం రేపింది.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలుకాగా స్వతంత్ర భరద్వాజ్ వ్యాఖ్యలకు నిరసనగా సీజేపీ భీమ్ ఆర్మీ నిరసన చేపట్టింది. CJP ప్రతినిధి సౌరవ్ దాస్, కో-కన్వీనర్ అశుతోష్ రాంకాతో పాటు భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. భరద్వాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, అతనిపై హత్యాయత్నం, SC/ST చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట భారీ ధర్నా చేపట్టారు. ఫలితంగా భరద్వాజ్‌పై హత్యాయత్యం కేసు నమోదైంది. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని సీజేపీకి పోలీసులు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు -
ఇతర మహిళల్ని అవమానించొద్దు.. నటిపై భగ్గుమన్న బీజేపీ!
కృతి సనన్ రాఖీ యాడ్ దుమారం చల్లారక ముందే.. మరో నటి స్వరా భాస్కర్ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ సినిమాలోని ‘జౌహర్’ సన్నివేశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. మహిళల త్యాగాన్ని అవమానించేలా మాట్లాడటం సరికాదని విమర్శించింది.ఢిల్లీలో ఇటీవల జరిగిన ‘వుమన్, లైఫ్, ఫ్రీడమ్’ కార్యక్రమంలో స్వరా భాస్కర్ ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశాన్ని ప్రస్తావించారు. సినిమాలో మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మాహుతి చేసుకున్నట్లు చూపించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ లైంగిక హింసకు గురైన మహిళ ఈ సన్నివేశాన్ని చూస్తే.. తన జీవితాన్ని కొనసాగించాలనుకోవడం తప్పా అనే భావన కలగొచ్చని స్వరా ప్రశ్నించారు. ‘గౌరవం కోసం చనిపోకపోతే పిరికిదానిననే భావన కలుగుతుందా?’ అన్న కోణంలో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లైంగిక హింసకు గురైన మహిళలకు కూడా బతికే హక్కు ఉందన్న సందేశమే సమాజానికి వెళ్లాలని ఆమె పేర్కొన్నారు.జౌహర్ (Jauhar) అంటే.. యుద్ధంలో శత్రు సైన్యం చేతిలో చిక్కి అవమానం, లైంగిక హింసకు గురికాకుండా ఉండేందుకు మహిళలు సామూహికంగా అగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకునే ఆచారం.‘ఆమె పిరికిదని అనలేదు’స్వరా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వివరణ ఇచ్చారు. తాను రాణి పద్మావతిని కానీ, జౌహర్ చేసిన మహిళలను కానీ పిరికివాళ్లుగా పేర్కొనలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అనువదించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రశ్నించింది జౌహర్ చేసిన మహిళల ధైర్యాన్ని కాదని.. ఆ సన్నివేశం ఆధునిక సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందన్నదేనని వివరించారు.‘ఇతర మహిళలను గౌరవించాలి’ఈ వివాదంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి మహిళ ఇతర మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వరా పేరులోని ‘స్వర్’ (గొంతు/స్వరం)ను ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ఆమె ఎవరి గొంతుతో మాట్లాడుతున్నారనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. మహిళల త్యాగాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.పోలీసులకు ఫిర్యాదుఈ వివాదం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. బిహార్‌కు చెందిన బీజేపీ నేత కృష్ణకుమార్ సింగ్ స్వరా భాస్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హిందూ సమాజం, రాజ్‌పుత్ మహిళలను కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించినట్లు కథనాలు పేర్కొన్నాయి.కర్ణిసేన కూడా..పద్మావత్ విడుదల సమయంలోనే ఆ సినిమాలోని అంశాలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన కర్ణిసేన.. తాజా వివాదంలోనూ స్వరా భాస్కర్‌ను తప్పుబట్టింది. జౌహర్‌ను, రాజ్‌పుత్ మహిళల త్యాగాన్ని విమర్శించే ముందు చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది. కర్ణిసేన మహిళా విభాగం నేత కీర్తి రాథోర్.. స్వరా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌పుత్ మహిళల త్యాగం, ధైర్యాన్ని కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు.మళ్లీ తెరపైకి ‘పద్మావత్’ వివాదం2018లో విడుదలైన ‘పద్మావత్’లో రాణి పద్మావతి పాత్రను దీపికా పదుకొణె పోషించారు. ఆ సమయంలో కర్ణిసేన అభ్యంతరాలతో సినిమా టైటిల్ పద్మావతి కాస్త పద్మావత్‌గా మారింది. ఇక చిత్ర క్లైమాక్స్‌లో శత్రు సేనల చేతికి చిక్కకుండా రాజ్‌పుత్ మహిళలు సామూహికంగా జౌహర్ చేసినట్లు సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ సన్నివేశం అప్పట్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. స్వరా భాస్కర్ కూడా సినిమా విడుదల సమయంలో దర్శకుడు భన్సాలీకి బహిరంగ లేఖ రాసి జౌహర్ చిత్రీకరణపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడంతో వివాదం తాజాగా మళ్లీ రాజుకుంది.చరిత్రా? సమాజానికి సందేశమా?‘పద్మావత్’లో జౌహర్ చిత్రీకరణ చుట్టూ సాగుతున్న తాజా వివాదం.. చరిత్రను సినిమాల్లో ఎలా చూపించాలి? చారిత్రక ఘటనలను ఆధునిక సామాజిక విలువలతో ఎలా చూడాలి? అనే ప్రశ్నలను మరోసారి ముందుకు తెచ్చింది. ఇదే సమయంలో ‘పద్మావత్’ రచయిత ప్రకాశ్ కపాడియా కూడా జౌహర్ సన్నివేశాన్ని సమర్థించారు. అది ఆ కాలంలోని వాస్తవ పరిస్థితుల ప్రతిబింబమని, నేటి ప్రమాణాలతో మాత్రమే దాన్ని అంచనా వేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరా భాస్కర్ మాత్రం తన ఉద్దేశం ఏ మహిళనూ అవమానించడం కాదని స్పష్టం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలకు బీజేపీ, కర్ణిసేన నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో.. ‘పద్మావత్’ జౌహర్ వివాదం మరోసారి బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.వివాదాలు స్వరా భాస్కర్‌కు కొత్తేమీ కాదు. నటిగా ‘తను వెడ్స్ మను’, ‘రాంఝనా’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘నిల్ బట్టే సన్నాటా’, ‘వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత తన వ్యాఖ్యలు, రాజకీయ వైఖరితోనూ తరచూ వార్తల్లో నిలిచారు. సీఏఏ-ఎన్ఆర్సీ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడం నుంచి ‘వీరే ది వెడ్డింగ్’లోని ఓ సన్నివేశంపై వచ్చిన విమర్శల వరకు.. ఆమెపై పలు సందర్భాల్లో చర్చ జరిగింది. 2024లో యాహ్యా సిన్వార్పై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఇప్పుడు ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశంపై వ్యాఖ్యలతో మరోసారి వివాదం రేగింది.ఇదీ చదవండి: పాతికేళ్ల జలయుద్ధానికి ఎట్టకేలకు తెర -
బికినీ డ్రెస్ లో రాఖీ కట్టాల్సిన అవసరం ఏంటి..? వెనుక అసలు కథ!
-
రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు
-
కంగనా-కృతి వార్‌లోకి కేంద్ర మంత్రి.. ఏం చెప్పారంటే?
నటి కృతి సనన్ నటించిన నగల యాడ్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఈ యాడ్‌ను బీజేపీ ఎంపీ.. నటి కంగనా రనౌత్ విమర్శించడం, నటి కృతి సనన్ విమర్శలకు ఘాటు సమాధానం ఇవ్వడం, ఆ వెంటనే రాహుల్ గాంధీ కృతికి మద్దతు ప్రకటించడం, రాహుల్‌ను టార్గెట్ చేస్తూ కంగనా సెటైర్లు ఇలా రాజకీయ వివాదం నడిచింది. దీంతో సదరు జ్యువెలరీ బ్రాండ్ ఆ యాడ్నే తొలగించి.. క్షమాపణలు చెప్పింది. అయితే తాజాగా ఈ వివాదంపై.. కంగనా తీరుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. యాడ్‌లో రాఖీ కట్టే సమయంలో కృతి సనన్ ధరించిన దుస్తులపై కంగనా రనౌత్ విమర్శలు చేశారు. సంప్రదాయ పండుగకు సంబంధించిన ప్రకటనల్లో ఇలాంటి దుస్తుల వినియోగంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు కంగనా వ్యాఖ్యలను సమర్థించగా.. మరికొందరు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలను విమర్శించారు. అయితే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ఒకరికి తమ అభిప్రాయం చెప్పే హక్కు ఉన్నట్లే, ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకించే హక్కు కూడా ఇతరులకు ఉంటుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.ఓ న్యూస్‌చానెల్ పాడ్‌కాస్ట్‌లో ఈ వివాదంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును ప్రశ్నించగా.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఒక వైపుకే పరిమితం చేయలేమని అన్నారు. ‘‘మీకు నచ్చిన విధంగా మాట్లాడే స్వేచ్ఛ ఉంటే.. ఆ వ్యాఖ్యలతో విభేదించే లేదా వాటిని వ్యతిరేకించే హక్కు ఇతరులకు ఎందుకు ఉండకూడదు?’’ అని రిజిజు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు స్థానం ఉంటుందని.. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ప్రశ్నించడం కూడా అదే స్వేచ్ఛలో భాగమని పేర్కొన్నారు.ఆంక్షలు విధించలేను, కానీ..బీజేపీ ఎంపీగా ఉన్న కంగనా రనౌత్ చేసే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఆమెకు సభా నిబంధనలు, విధానాలపై సూచనలు చేయగలనని రిజిజు తెలిపారు. అయితే పార్లమెంట్ వెలుపల వ్యక్తిగత అభిప్రాయాల విషయంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని చెప్పడం తన పరిధిలో లేదని స్పష్టం చేశారు.‘గట్టర్ జనరేషన్’ వ్యాఖ్యలపైనా స్పందనఇటీవల జెన్ జీ నిరసనల సమయంలో కంగనా చేసిన ‘గట్టర్ జనరేషన్’ వ్యాఖ్యలపైనా రిజిజు స్పందించారు. ఆమె మొత్తం యువతను ఉద్దేశించి అలా మాట్లాడలేదని.. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన దివంగత తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారని వివరించారు. ప్రధానిని లేదా ఆయన కుటుంబ సభ్యులను అవమానించే భాషను తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. అయితే ప్రభుత్వాన్ని విమర్శించడం, రాజకీయంగా వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో భాగమని అన్నారు.అబ్బాయిలు, అమ్మాయిలకు ఒకే ప్రమాణంవిమర్శలు, అభిప్రాయాల విషయంలో యువతీ యువకులకు వేర్వేరు ప్రమాణాలు ఉండకూడదని రిజిజు పేర్కొన్నారు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని అన్నారు. మనుస్మృతిపై జరుగుతున్న చర్చపైనా రిజిజు స్పందించారు. ఓ మత గ్రంథంలోని కొన్ని అంశాలను వ్యతిరేకించినంత మాత్రాన ఎవరినీ మత వ్యతిరేకిగా పరిగణించకూడదన్నారు. భారతదేశం మనుస్మృతి ఆధారంగా కాకుండా రాజ్యాంగం ప్రకారం నడుస్తోందని స్పష్టం చేశారు. ప్రజలకు ఒక నమ్మకాన్ని సమర్థించే హక్కు ఉన్నట్లే.. దానిని ప్రశ్నించే హక్కు కూడా ఉందన్నారు.“ఎవరైనా ఒక విషయాన్ని నమ్మవచ్చు.. మరొకరు దానిని వ్యతిరేకించవచ్చు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి” అని రిజిజు పేర్కొన్నారు. అయితే దేశ సమగ్రతకు భంగం కలిగించేలా, హింసను ప్రోత్సహించేలా చేసే వ్యాఖ్యలకు మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.స్విమ్మింగ్ మీమ్స్‌పై రియాక్షన్అరుణాచల్ ప్రదేశ్‌లో తాజాగా ఓ నదిలో కిరెన్ రిజిజు ఈత కొట్టారు.అయితే ఆ వీడియోపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. రాహుల్ గాంధీలా చేయాలని చూసి బోల్తా పడ్డారంటూ కొందరు కామెంట్లు చేశారు. ఈ ట్రోలింగ్‌పై పాడ్‌కాస్ట్‌లో కిరెన్రిజిజు స్పందించారు. అరుణాచల్‌లో నదుల్లో ఈత కొట్టడం.. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టినట్లు కాదని, ట్రోల్ చేసేవాళ్లుక అది అర్థం కాదని అన్నారాయన. తాను అక్కడి బిడ్డనని, అక్కడి నేలా నీరు తనకు అలవాటేనని చెప్పారు. పార్లమెంట్ మళ్లీ కొలువుదీరుతుందా?పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అవసరమైతే ఇదే సెషన్లో మరోసారి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. పార్లమెంట్‌ను ఎప్పుడు సమావేశపరచాలన్నది ప్రభుత్వ నిర్ణయమని.. రాష్ట్రపతికి ప్రభుత్వం సిఫార్సు చేస్తే సభను తిరిగి పిలవొచ్చని చెప్పారు. అయితే ప్రత్యేక సమావేశం ఉంటుందా అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ‘‘నా వ్యాఖ్యలను రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు’’ అంటూ రిజిజు చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులపై(డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులు) ప్రభుత్వం మరోసారి ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.అరుణాచల్ చిన్నారికి రిజిజు భరోసా‘మమ్మల్ని చైనీస్ అని పిలవొద్దు.. మేము భారతీయులం’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన అరుణాచల్‌ప్రదేశ్ చిన్నారి టింకిల్‌తో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వీడియో కాల్లో మాట్లాడారు. ‘‘ఇప్పుడు మొత్తం భారత్ నిన్ను ప్రేమిస్తోంది’’ అంటూ చిన్నారిని రిజిజు అభినందించారు. ఆమె తల్లిదండ్రుల గురించి అడిగి.. ధైర్యంగా మాట్లాడినందుకు ప్రశంసించారు. ఇటానగర్‌కు చెందిన టింకిల్.. తనను చైనీస్ అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చేసిన వీడియో వైరల్ అయింది. ఈశాన్య ప్రాంత ప్రజలను రూపం ఆధారంగా వేరే దేశస్థులుగా భావించే ధోరణిపై మరోసారి చర్చ మొదలైంది. రిజిజు కూడా ఈశాన్య ప్రజలు భారతదేశంలో అంతర్భాగమని, వారి గుర్తింపును గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లుగా ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: మేకెదాటు వివాదంలో కొత్త ట్విస్ట్.. సాలిడ్ వార్నింగ్ -
రవితేజకి బ్యాడ్ టైం చిక్కుల్లో ఇరుముడి
-
ఆగు బ్రో.. రాహుల్ గాంధీకి కంగనా కౌంటర్
నటి కృతి సనన్ రక్షాబంధన్ ప్రకటనపై మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఆ యాడ్‌లో కృతి సనన్ వస్త్రధారణపై విమర్శలు రావడంతో ఆమెకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. మహిళలు ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని పేర్కొంటూ ‘స్మాష్ ద ప్యాట్రియార్కీ’ (పితృస్వామ్య వ్యవస్థను కూల్చేయాలి) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. అయితే దీనికి మరో నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు స్పందిస్తూ కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో.. బ్రో.. కాస్త ఆగండి. భారత్ ‘మాతా’ కీ జై.. ప్రారంభిద్దాం’ అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇందులో మాతా(తల్లి)ని హైలైట్ చేస్తూ.. రాహుల్‌కు కంగనా వెటకారంగా కౌంటర్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత అక్కడున్న అమ్మాయితో రాహుల్ గాంధీ సంభాషణ అలాగే కొనసాగుతుంది. ట్రిపుల్ తలాక్, మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదనే ధోరణితో ఆమె రాహుల్‌ను ప్రశ్నించినట్లు ఆ బొమ్మలను కంగనా తన ఇన్‌స్టాలో స్టోరీలా పోస్ట్ చేశారు. ఓ యాడ్‌లో కృతి సనన్ దుస్తులపై మొదలైన వివాదం.. రాహుల్ జోక్యంతో రాజకీయ చర్చగా మారగా, కంగనా తాజా వ్యాఖ్యలతో మరింత ఆసక్తికరంగా మారింది.రక్షాబంధన్ సందర్భంగా ఓ నగల బ్రాండ్ రూపొందించిన 32 సెకండ్ల ప్రకటనలో కృతి సనన్ ఆధునిక దుస్తుల్లో కనిపించారు. అందులో ఆమె తన సోదరుడికి రాఖీ కట్టడంతోపాటు పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టే సన్నివేశం ఉంది. కృతి ధరించిన దుస్తులు, ప్రకటనలో పండుగను చూపించిన తీరుపై సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై కంగనా రనౌత్ కూడా స్పందించారు. రక్షాబంధన్ వంటి సంప్రదాయ పండుగ సందర్భంగా కృతి ధరించిన దుస్తులపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకటనను ‘ఇంటెన్షనల్లీ క్రీపీ’(ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందికరంగా చూపించారు)గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో కంగనా–కృతి మధ్య సోషల్ మీడియా వేదికగా వాదన మొదలైంది.తనపై వస్తున్న విమర్శలకు కృతి సనన్ కూడా ఘాటుగానే స్పందించారు. ఒక మహిళ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని ఆమె ధరించే దుస్తులతోనే ఎందుకు అంచనా వేయాలని ప్రశ్నించారు. పండుగల అసలు భావం దుస్తుల్లో కాకుండా వాటి వెనుక ఉన్న అనుబంధం, విలువల్లో ఉంటుందని పేర్కొన్నారు. మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారని ప్రశ్నించారు. అలాగే కుక్కకు రాఖీ కట్టడంపైనా స్పందిస్తూ.. రక్షాబంధన్ తమ కుటుంబంలో సోదరసోదరీమణుల మధ్య పరస్పర రక్షణ, ప్రేమకు ప్రతీక అని కృతి వివరించారు. తన సోదరి, తాను ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటామని.. ఆ బంధంలో సోదరుడు మాత్రమే రక్షించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.కృతి స్పందనను రాహుల్ గాంధీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. “ఒక మహిళ ఏం ధరిస్తుంది, ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆమె ఎంపిక. తన స్వేచ్ఛను ఉపయోగిస్తున్నందుకు మహిళలను ట్రోల్ చేయడం ఆపండి” అంటూ వ్యాఖ్యానించారు. దీనికి తోడు ‘Smash the Patriarchy’ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. ఇక్కడే ఎంట్రీ ఇచ్చిన కంగనారాహుల్ గాంధీ కృతికి మద్దతు ప్రకటించిన కొద్దిసేపటికే కంగనా తనదైన శైలిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ‘భారత్ మాతాకీ జై.. ప్రారంభిద్దాం’ అని పేర్కొనడం ద్వారా రాహుల్ వ్యాఖ్యలకు వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఇంకా ఎటు దారి తీస్తుందో చూడాలి.ఇదీ చదవండి: అన్నాచెల్లెళ్ల ఆలయంలో.. రాఖీ వేడుకలు -
వివాదంలో సీఎం విజయ్ కొత్త పథకం
-
ఫోటో మార్ఫింగ్ వివాదం..! కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ వర్గం కుట్ర
-
ఇది లా విద్యార్థుల హక్కుల ధిక్కరణే!
రాజ్యాంగం ప్రకారం న్యాయవ్యవస్థ అత్యంత స్వతంత్రంగా పని చేయాలి. పౌరహక్కులకు, స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు న్యాయ వ్యవస్థ రక్షణ కవచంగా ఉండాలి. అందుకోసమే రాజ్యాంగ నిర్మాతలు న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. దేశంలోని న్యాయవ్యవస్థకు గౌరవం, ప్రజలలో నమ్మకం కలగడానికి న్యాయవాదుల పాత్ర, కృషి, నిబద్ధత విస్మరించరానివి.అలాంటి న్యాయవాదులను తయారుచేసే నల్సర్ విశ్వవిద్యా లయం విద్యార్థులు తమ ఉపకులపతి, రిజిస్ట్రార్లకు ఒక లేఖ రాశారు. తమ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించే అంశాన్ని పునః పరిశీలించాలని అందులో కోరారు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదు, ముఖ్య అతిథి ఎంపిక కూడా తుది దశకు రాలేదని తమకు తెలుసునని చెబుతూనే అధికారిక నిర్ణయం తీసుకునే ముందు తమ అభిప్రాయాన్ని వినాలని కోరారు. విద్యార్థులు స్నాతకోత్సవాన్ని బహిష్కరిస్తామని చెప్పలేదు, న్యాయవ్యవస్థను తిరస్కరించలేదు, న్యాయమూర్తి తీర్పులన్నింటినీ ప్రశ్నించలేదు. విద్యార్థుల అభ్యంతరం, ఆవేదన... ఒక నిర్దిష్ట సందర్భంలో న్యాయవ్యవస్థ ప్రవర్తించిన తీరుపై మాత్రమే. కానీ విద్యార్థులు ప్రశ్నించారనే కారణంతో వారి గొంతును నొక్కివేయడం ప్రజాస్వామ్య పద్ధతి కాదు.న్యాయ విద్య అంటే సెక్షన్లు బట్టీ పట్టడం, కోర్టులో వాదించడం మాత్రమే కాదు. న్యాయ విద్య అంటే అధికారాన్ని ప్రశ్నించడం, బలహీనుడి పక్షాన నిలబడటం, అన్యాయాలకు గురైనవారి వెంట, పౌర హక్కులకు దూరమైనవారి వెంట నిలబడి రాజ్యాంగాన్ని కాపాడటం కూడా. ప్రజాస్వామ్యానికి ప్రశ్నలు ప్రమాదకరం కాదు, ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం ప్రమాదం. న్యాయవ్యవస్థను బలహీనపరిచేది విమర్శ కాదు, న్యాయవ్యవస్థపై విమర్శ వినే ఓపిక లేకపోవడమే ప్రమాదకరం.ఆ అధికారం ఎక్కడిది?బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లా విద్యార్థులపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికార పరిధి లేదు. విద్యార్థుల ప్రవర్తన కోర్టు ధిక్కరణ చర్య కానీ లేదా దేశ చట్టాల ఉల్లంఘన కానీ కానే కాదు. కొందరు విద్యార్థులు ఒక ప్రముఖుడు తమ స్నాతకోత్స వంలో భాగం పంచుకోవడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన శాంతియుత ప్రాతినిధ్యం ఆధారంగా పట్టభద్రులవుతున్న వారిని బార్ కౌన్సిల్స్‌లో నమోదు చేసుకోవద్దని నిషేధం విధించడం కరెక్టు కాదు. తమ సొంత కాన్వొకేషన్ కొరకు ముఖ్య అతిథి ఎంపికపై విద్యార్థులు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తప్పెలా అవుతుంది?బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు... బార్ స్వతంత్రతను, సమగ్రతను పరిరక్షించడం ప్రాథమిక బాధ్యత. బార్ కౌన్సిల్ చైర్మన్ చేసిన ఈ చర్య అప్రజాస్వామికం. నిషేధాన్ని వెనక్కి తీసుకుని, చైర్మన్ ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ ఆయనపై అధికారిక విచారణ చేపట్టాలి. తక్షణమే ఆయనను తొలగించాలి. నల్సర్ విద్యార్థులు సహజ న్యాయం గురించి చదివారు. అలాగే రాజ్యాంగానికి అతీతమైన అధికారం ఏదీ లేదని నల్సార్లోనే వారికి బోధించారు. ఈ జ్ఞానంతోనే విద్యార్థులు తమ సొంత సంస్థకు హేతుబద్ధమైన లేఖ రాసి బెదిరింపులకు గురికావడం బాధాకరం. ప్రజాస్వామ్యానికి అవసరమైనది అంధభక్తి కాదు, సంస్థలను గౌరవిస్తూనే వాటిని ప్రశ్నించే సంస్కృతి కావాలి. ప్రజాస్వామ్యంలో గౌరవమంటే జవాబుదారితనం నుంచి మినహాయింపు కాదనేది అర్థం చేసుకోవాలి.– దిగుపాటి రాజగోపాల్ ‘ ఏఐఎల్యూ ఏపీ గౌరవ అధ్యక్షులు -
భూమి ఉన్నా.. అమ్ముకునే హక్కు లేనట్టే!
గుర్రంపోడు మండల పరిధిలోని ఓ రైతుకు నాలుగెకరాల భూమి ఉండగా, 20 గుంటల భూమి కాల్వ తవ్వకంలో అధికారులు సేకరించారు. ప్రస్తుతం ఆ సర్వే నెంబరులో ఉన్న భూమి అంతా ప్రభుత్వ భూమిగా పడటంతో నిషేధిత జాబితాలో చేరిపోయింది. దీంతో భూమి తనవద్దే ఉన్నా, అమ్ముకునే హక్కును కోల్పోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.నల్లగొండ పట్టణ పరిధిలో 111 మంది భూ యజమానులకు సంబంధించిన సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో చేర్చారు. గంధంవారిగూడెం గ్రామ పరిధిలో 169 మంది రైతులకు సంబంధించిన సర్వే నెంబర్లను (97 ఎకరాలు) నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో ఆందోళన చెందుతున్నారు. ఇలా ఒక్కో గ్రామంలో సగటున 150 చొప్పున భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. మిర్యాలగూడ డివిజన్‌కు చెందిన ఓ రైతు నుంచి 30 ఏళ్ల కిందట ప్రభుత్వ అవసరాల కోసం పదెకరాలు సేకరించింది. దానికి బదులు మరో ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని ఆ రైతుకు కేటాయించింది. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో అనుమతులు, తీర్మానాల అనంతరం ఆ భూమి పట్టా భూమిగా రైతుకు అప్పగించింది. అప్పటి నుంచి రికార్డుల్లోనూ అది పట్టా భూమిగానే కొనసాగుతోంది. ధరణి పోర్టల్ వచ్చిన సమయంలో పాత రికార్డుల ఆధారంగా ఆ భూమి ప్రభుత్వ భూమిగా పేర్కొని ఉండటంతో నిషేధిత జాబితాలోకి వెళ్లింది. దీంతో రైతు కుటుంబం రెవెన్యూ అధికారులను ఆశ్రయించింది. సంబంధిత రికార్డులను పరిశీలించిన అనంతరం ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. సమస్య పరిష్కారమైందని భావించిన ఆ కుటుంబానికి ఇప్పుడు భూభారతిలో మళ్లీ అదే భూమి నిషేధిత జాబితాలో వెళ్లడంతో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూమి వారిదే.. పట్టా వారి పేరుమీదే ఉంది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. రికార్డుల్లోనూ పట్టా భూమిగానే ఉంది. అవసరాలకు అమ్ముకుందామంటే మాత్రం నిషేధిత జాబితాలో ఉందని అడ్డు చెబుతున్నారు. భూమి ఉన్నా అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. అవసరానికి రుణం పొందలేని దుస్థితి ఏర్పడింది. సమస్యను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో అనేక మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. మళ్లీ అదే సమస్య..ధరణి పోర్టల్ అమల్లోకి తెచ్చిన సమయంలో అనేక పట్టా భూములు ప్రభుత్వ భూముల జాబితాలోకి వెళ్లిపోయాయి. దీంతో రైతులు అధికారుల చుట్టూ తిరిగి పరిష్కరించుకున్నారు. కొందరు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరిగితే.. మరికొందరు కలెక్టర్ కార్యాలయం, సీసీఎల్ఏ వరకు వెళ్లారు. కొన్ని కేసుల్లో న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు భూభారతి అమల్లోకి రావడంతో మళ్లీ అవే వచ్చి పడ్డాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించే క్రమంలో నిషేధిత జాబితాను రూపొందించడంతో.. ప్రైవేట్ పట్టా భూములను అందులోకి చేర్చడంతో గందరగోళం నెలకొంది. 1954 రికార్డులను ఆధారం చేసుకోవడంతోనేనా..ధరణి పోర్టల్ అమల్లో ఉన్న సమయంలో 1954కు సంబంధించిన పాత రికార్డుల ఆధారంగా భూముల వివరాలను పరిశీలించడంతో అనేక భూములు ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయి. వాస్తవానికి అవి ప్రభుత్వ అవసరాల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూములు కావడం.. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో అనుమతులతో పట్టాలుగా మారిన భూములు కావడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ఒకే సర్వే నంబర్లో కొంత భూమిని మాత్రమే ప్రభుత్వం సేకరించింది. మిగిలిన భూమి రైతుల వద్దే ఉన్నప్పటికీ మొత్తం సర్వే నంబర్ ప్రభుత్వ భూమిగా నమోదై నిషేధిత జాబితాలోకి వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి.పట్టా భూములను వేరుచేయకపోవడంతోనే..ప్రస్తుతం అమల్లోకి వచ్చిన భూభారతి రికార్డుల నవీకరణలోనూ పట్టా భూములను వేరే చేయకుండా సర్వే నెంబరు మొత్తాన్ని పాత పద్ధతిలోనే చేర్చడంతో ఈ సమస్య వచ్చింది. ప్రభుత్వ భూములను కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, వక్ఫ్, దేవాదాయ భూములు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ ప్రక్రియలో ప్రైవేట్ వ్యక్తుల అధీనంలో ఉన్న పట్టా భూములను వేరు చేయకుండా సర్వే నెంబరు మొత్తాన్ని చేర్చడంతో పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఇలాంటి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ ఐజీ స్థాయి నుంచి ఆన్లైన్లో అనుమతి రావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతే స్థానిక రెవెన్యూ అధికారులు రికార్డుల్లో మార్పులు చేసి నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించే అవకాశం ఉంది. -
మాస్ మహారాజా చిక్కుల్లో!
-
వందేమాతరం ఆపండి! సోనియా సైగలపై.. BJP ఫైర్
-
ఇమ్రాన్ ఖాన్‌కు ఏమైంది? మృతి వార్తలతో కలకలం
-
టాటా సన్స్‌లో నాయకత్వ సంక్షోభం
భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్‌లో మరోసారి నాయకత్వ ఘర్షణలు బహిర్గతమవుతున్నాయి. ఆగస్టు 18న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కంటే ముందే టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.విభేదాలకు ప్రధాన కారణాలురతన్ టాటా అనంతరం టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నోయెల్ టాటాకు, చంద్రశేఖరన్‌కు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఎయిరిండియా, టాటా డిజిటల్, ఎలక్ట్రానిక్స్ వంటి కొత్త వ్యాపారాల్లో పురోగతి స్తంభించడం, పెరిగిన నష్టాలపై నోయెల్ టాటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. చంద్రశేఖరన్ డైరెక్టర్ పదవి పొడిగింపుపై పూర్తిస్థాయి మద్దతు ఇచ్చేందుకు నోయెల్ టాటా సుముఖంగా లేరని, మరో ఐదేళ్లకు బదులుగా కేవలం రెండేళ్ల కాలాన్ని మాత్రమే ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఏజీఎంలో ఓటింగ్ ద్వారా వివాదాస్పదంగా తప్పుకోవడం కంటే ముందే గౌరవప్రదంగా రాజీనామా చేయాలని చంద్రశేఖరన్ భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు చెబుతున్నారు.చట్టపరమైన ప్రాధాన్యత.. చిక్కులుఈ వివాదానికి మరింత సంక్లిష్టతను చేకూర్చింది మహారాష్ట్ర చారిటీ కమిషనర్ నిర్ణయం. పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ ఉల్లంఘనల ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ‘సర్ రతన్ టాటా ట్రస్ట్’ ఎలాంటి కీలక సమావేశాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించారు. టాటా సన్స్‌లో దాదాపు 66% వాటా కలిగిన ట్రస్టుల ప్రతినిధులు లేకుండా ఏజీఎం నిర్వహణ, ఓటింగ్ చెల్లుబాటుపై చట్టపరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2017లో సైరస్ మిస్త్రీ నిష్క్రమణ తర్వాత టాటా సన్స్ బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరన్, గ్రూప్‌ను ఆధునిక సాంకేతిక, ఏవియేషన్ రంగాల వైపు విజయవంతంగా నడిపించారు. ఒకవేళ ఆయన ఏజీఎంకు ముందే తప్పుకుంటే గ్రూప్ షేర్లపై తాత్కాలిక ఒత్తిడి పెరగడంతో పాటు మళ్లీ కొత్త చైర్మన్ అన్వేషణ ప్రారంభం కానుంది.ఇదీ చదవండి: ‘నన్ను నగ్నంగా మార్చకండి!’ -
మహిళా జోలికొస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. ఆ మంత్రిని పీకేయండి!
-
ఎంబీబీఎస్ గైనకాలజీ పేపర్ లీక్?
తిరువనంతపురం: కేరళ ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేయూహెచ్ఎస్) నిర్వహించిన ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ గైనకాలజీ ప్రశ్నపత్రం లీకయ్యిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. జూలై 31న జరిగిన ఈ పరీక్షలో మొత్తం 15 ప్రశ్నలకు గాను 6 ప్రశ్నలు, విశ్వవిద్యాలయ వెబ్సైట్లో ముందుగానే అందుబాటులో ఉన్న మోడల్ ప్రశ్నాపత్రం నుంచి యథాతథంగా వచ్చినట్లు తేలింది. దీనివల్ల 24 మార్కులు (24 శాతం) మోడల్ పేపర్ నుంచే రావడంతో పరీక్ష విశ్వసనీయతపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఆరు నాలుగు మార్కుల ప్రశ్నలు మోడల్ పేపర్లోని క్రమ సంఖ్యతో పాటు అచ్చం అలాగే పునరావృతం కావడం విశేషం. ప్రశ్నపత్రం రూపొందించిన అధ్యాపకుడికి, దానిని పరిశీలించిన పరిశీలకుడికి (స్క్రూటినీ) మోడల్ పేపర్ ముందే ఇచ్చినప్పటికీ ఈ పొరపాటును గుర్తించడంలో విఫలమయ్యారని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. విశ్వవిద్యాలయానికి విద్యార్థులు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. మరోవైపు ఆగస్టు 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ స్ట్రక్చర్డ్ క్లినికల్ నిర్వహణ విధానంపై కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల అనుసారమే పలు మార్పులు చేశామని విశ్వవిద్యాలయం సమర్థించుకుంది.ఇది కూడా చదవండి: అత్యాచార ఆరోపణలు.. మూకదాడిలో యువకుడు మృతి -
‘అది భరతనాట్యం కాదు’.. ప్రభుదేవాపై నటి షాకింగ్ కామెంట్స్
భారతీయ సినీ నృత్యానికి కొత్త శైలిని పరిచయం చేసిన కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా. ముఖ్యంగా 1990, 2000 దశకాల్లో తన వినూత్నమైన కొరియోగ్రఫీతో ఆయన ఓ కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు. తన ప్రత్యేకమైన స్టైల్, అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. తాజాగా ఓ నృత్య ప్రదర్శనతో వివాదంలో చిక్కుకున్నారు.చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన నాట్యప్రదర్శనపై ప్రముఖ నటి, డ్యాన్సర్ ప్రీతి సంజీవ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రభుదేవా లాంటి ప్రముఖ డ్యాన్సర్ నుంచి ఇలాంటి తప్పును ఊహించలేదు అంటూ ఆమె చేసిన కామెంట్లు.. ఆయన అభిమానులను ఒకింత షాక్‌కు గురి చేశాయి. అసలేం జరిగిందంటే.. பிரபு தேவா பரதநாட்டியம் ஆடி இப்போ தான் பாக்குறேன் 🧐 pic.twitter.com/ke3sAkXEzO— ⚡𝘼𝘽𝙎𝙊𝙇𝙐𝙏𝙀𝙇𝙔 ©️𝙄𝙉𝙀𝙈𝘼 (@Absolutlycinema) July 30, 2026గురు శ్రీ ఉడిపి లక్ష్మీనారాయణ 100వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుదేవా భరతనాట్యం ప్రదర్శించారు. తన గురువుకు నివాళిగా ఆయన ప్రకటించగా.. పలువురు దానిని ప్రశంసించారు. అయితే.. ప్రీతి సంజీవ్ మాత్రం ఇలాంటి తప్పు ఊహించలేదు అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుదేవా ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటి, డ్యాన్సర్ ప్రీతి సంజీవ్ స్పందించారు. శాస్త్రీయ నృత్యమైన భరతనాట్యాన్ని సరైన పద్ధతిలో ప్రదర్శించడం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. “క్లాసికల్ డ్యాన్స్‌ను చాలాసార్లు తప్పుగా ప్రదర్శించినా ప్రజలు ప్రశ్నించకుండా ప్రశంసిస్తుంటారు. ప్రభుదేవా లాంటి ప్రముఖ డ్యాన్సర్ నుంచి ఇలాంటి తప్పును ఊహించలేదు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇలాంటి అవకాశాలను భరతనాట్యంలో ఎన్నో ఏళ్లుగా శిక్షణ పొందుతున్న యువ కళాకారులకు ఇస్తే మరింత ప్రోత్సాహంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రీతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డ్యాన్స్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుదేవాకు మద్దతుగా పలువురు వచ్చారు. ఇది పోటీ కోసం చేసిన భరతనాట్య ప్రదర్శన కాదని.. తన గురువుకు అంకితంగా చేసిన నివాళి మాత్రమేనని పేర్కొన్నారు.ప్రభుదేవా భారతీయ నృత్య రంగానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ.. ఆయన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని అభిమానులు చెబుతున్నారు. ఒక కళాకారుడి ప్రదర్శనను కేవలం సాంకేతిక అంశాల కోణంలో కాకుండా భావం, సందర్భం ఆధారంగా కూడా చూడాలని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఆమె అడిగిన దాంట్లో తప్పేం లేదని కొందరు అన్నారు. శాస్త్రీయ నృత్యాలను ఎంతవరకు సంప్రదాయ పద్ధతుల్లోనే ప్రదర్శించాలి? కళాకారులకు ప్రయోగాల స్వేచ్ఛ ఎంత ఉండాలి? అనే అంశాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొరియోగ్రాఫర్‌గా మాత్రమే కాకుండా నటుడిగా, దర్శకుడిగా కూడా ప్రభుదేవా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళం, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఆయన ఎన్నో విజయాలు సాధించారు. ఆయన స్పీడ్ స్టెప్పులు, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అభిమానులు ఆయనను ‘ఇండియన్ మైకేల్ జాక్సన్’గా పిలవడం ప్రారంభించారు. -
భారత హాకీ జెర్సీపై ‘కాషాయ’ వివాదం
న్యూఢిల్లీ: హాకీ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్ల కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) రూపొందించిన కొత్త జెర్సీ వివాదానికి దారి తీసింది. సుదీర్ఘ కాలంగా నీలం రంగు జెర్సీలోనే భారత్ (మెన్ ఇన్ బ్లూ) బరిలోకి దిగుతుండగా... ఈసారి దానిని పూర్తిగా కాషాయ రంగులోకి మార్చారు. కొత్త జెర్సీ ప్రకటన రాగానే దీనిపై తీవ్ర చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా పలువురు అభిమానులతో పాటు మాజీ కెప్టెన్లు ధన్‌రాజ్ పిళ్లై, వీరేన్ రస్కిన్హా, పర్గత్ సింగ్, అజిత్‌పాల్ సింగ్ హెచ్ఐ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దశాబ్దాలుగా నీలం రంగు జెర్సీనే భారత జట్టుకు పర్యాయపదంగా ఉంది. మేం ఎన్నో ఏళ్లు దీనిని సగర్వంగా ధరించాం. ఇదే రంగులో అభిమానులు కూడా టీమ్‌ను చూడటానికి ఇష్టపతారు. ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది’ అని రస్కిన్హా వ్యాఖ్యానించాడు. జెండాలోని త్రివర్ణాల్లో కాషాయం ఒకటి అయినా... ఇది ఏనాడూ భారత హాకీ టీమ్ సాంప్రదాయ రంగు కాదని పిళ్లై అభిప్రాయపడ్డాడు. ఇష్టం వచ్చిన రంగులు ధరించేందుకు ఇది ఫ్రాంచైజీ లీగ్ కాదని అతను అన్నాడు. భారత హాకీని కూడా కాషాయీకరణ చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించిన పర్గత్ సింగ్... హెచ్ఐ సరైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. జెర్సీపై అశోక చక్రను కాకుండా సుదర్శన చక్రాన్ని ఉంచడాన్ని కూడా వీరంతా ప్రశ్నిస్తున్నారు. ‘రంగు మార్పు కొత్తేమీ కాదు’ తాజా వివాదంపై హాకీ ఇండియా స్పందించింది. జెర్సీ రంగులో మార్పులు కొత్తేమీ కాదని, గతంలోనూ భారత్ నీలం రంగు కాకుండా వేరే రంగులతో బరిలోకి దిగిందని గుర్తు చేసింది. ‘ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో చర్చించిన తర్వాతే వారి సూచనలతో జెర్సీ రంగు మార్చాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాకీ సింథటిక్ మైదానాలు పూర్తిగా నీలం రంగులోనే ఉంటున్నాయి. అందులో కలిసిపోవడం వల్ల స్పష్టత లేక పలుమార్లు ఇబ్బంది అవుతోందనే అభిప్రాయం వ్యక్తం అయింది. కాషాయం కూడా త్రివర్ణ పతాకంలోని ఒక రంగు అని మర్చిపోవద్దు. జెర్సీ రంగులో మార్పులు గతంలోనూ జరిగాయి. 2014 ప్రపంచ కప్‌లో పసుపు రంగుతో ఆడిన భారత్ 2018లో లేత నీలం రంగు జెర్సీతో బరిలోకి దిగింది’ అని హెచ్ఐ తమ వాదనను సమర్థించుకుంది. దీనిపై కూడా పలు విమర్శలు వచ్చాయి. పుష్కర కాలం క్రితమే హాకీ కోర్టులు నీలం రంగులోకి మారాయని, అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గత రెండు ఒలింపిక్ పతకాలను బ్లూ టర్్ఫపైనే గెలిచిన విషయాన్ని వారు గుర్తు చేశారు. మరోవైపు భారత హాకీకి ప్రధాన స్పాన్సర్‌లో ఒడిషా ప్రభుత్వం వ్యవహరించడంలో కీలక పాత్ర పోషించిన నాటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘భారత హాకీ జెర్సీ రంగు నీలం నుంచి కాషాయానికి మారడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఎన్నో ఏళ్లుగా నీలం రంగుతో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. జాతీయ పతాకంలోని అశోక చక్రంనుంచి నీలి రంగును ఎంచుకున్నాం. ఒడిషా ప్రస్తుత ప్రభుత్వ ఒత్తిడితోనే రంగు మారిందని మేం భావిస్తున్నాం’ అని పట్నాయక్ అన్నారు. -
ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా?.. కంగనా ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందిస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు సరైనవి కాదని హితవు పలికారు. నీట్-యూజీ 2026 వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలను ఆమె తప్పుబట్టారు. #WATCH | Monsoon session of Parliament | Delhi: On issues being raised by the Opposition, BJP MP Kangana Ranaut says, "Parliament sessions are convened so that we can discuss all issues in detail. Government is answerable for everything and so the session is held. We want the… pic.twitter.com/Fy213UfHA2— ANI (@ANI) July 20, 2026సమస్యలపై చర్చించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి పార్లమెంటే సరైన వేదిక అని కంగనా స్పష్టం చేశారు. సభను అడ్డుకోవడం, గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. మంత్రులను తొలగించాలంటూ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయలేరని, ఎవరిని ఉంచాలి, ఎవరిని తొలగించాలనే నిర్ణయాధికారం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉంటుందని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు మరింత పట్టుదలగా ఉంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని ఆమె సవాల్ విసిరారు. వర్షాకాల సమావేశాల తొలిరోజు నీట్ వివాదం, అయోధ్య ట్రస్ట్ విరాళాల ఆరోపణలపై విపక్షాలు సభలో నినాదాలు చేశాయి. సభ్యులు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేసినప్పటికీ, గందరగోళం చెలరేగడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.ఇది కూడా చదవండి: ‘నీట్’ ఆందోళనలపై హేమామాలిని వివాదాస్పద వ్యాఖ్యలు -
మరింత ముదురుతున్న 'జానీ మాస్టర్' డాన్సర్ అసోసియేషన్ వివాదం
డాన్సర్స్ అసోసియేషన్ – ఫెడరేషన్ మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదురుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఫెడరేషన్ జానీ మాస్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దాంతో సాయంత్రం జానీ మాస్టర్ ఫెడరేషన్ నాయకులపై నిర్మాతలకు ఫిర్యాదు చేశారు. ఫిలిం ఛాంబర్లోని పెద్దలను కలిసిన జానీ మాస్టర్ యూనియన్‌లో అవినీతి చేసే వారిపై చర్యలు తీసుకుంటే ఫెడరేషన్ అడ్డుపడుతోందని ఆరోపించారు. అంతేకాక సస్పెండ్ చేసిన సభ్యులను తిరిగి తీసుకోవాలని ఫెడరేషన్ వారిపై ఒత్తిడి తెస్తోందని, నిర్మాతలను మోసం చేస్తున్న వారిపై ప్రెసిడెంట్ సుమలత చర్యలు తీసుకుంటే ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫెడరేషన్ పెద్దలు ఆమెపై లింగభేదం చూపుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.జానీ మాస్టర్ భార్య, ప్రెసిడెంట్ సుమలత కూడా నిర్మాతలతో సమావేశమైయ్యారు. ఫెడరేషన్ జోక్యం లేకుండా చూడాలని కోరారు. తప్పు చేసిన సభ్యుల ఆధారాలను ఛాంబర్ పెద్దలకు అందజేశాం. అవినీతి చేస్తున్న వారిని శిక్షించి వారికి సహకరిస్తున్న ఫెడరేషన్ పెద్దలను మందలించాలని విజ్ఞప్తి చేశారు. డాన్సర్స్ అసోసియేషన్‌లో కొంతమంది సభ్యులు నిర్మాతలను మోసం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫెడరేషన్ మాత్రం వారిని కాపాడుతోందని డాన్సర్స్ అసోసియేషన్ నాయకత్వం ఆరోపిస్తోంది. ఈ వివాదం ఫిలిం ఛాంబర్ వరకు చేరింది. ఇప్పుడు ఫెడరేషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. -
తిరుమలలో మరో వివాదం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం శ్రీరంగం నుంచి పట్టువ్రస్తాల సమర్పణ వైభవంగా జరుగుతుండగా, మరోవైపు మహాద్వారం గుండా అనుమతి లేకుండానే ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధుల కథనం ప్రకారం.. రాజారెడ్డి అనే వ్యక్తి అధికారిక అనుమతి లేకుండానే శుక్రవారం తిరుమల ఆలయ మహాద్వారం ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అదే సమయంలో తమిళనాడు దేవదాయశాఖ మంత్రి, కమిషనర్, వారి కుటుంబ సభ్యులతో కూడిన బృందానికి టీటీడీ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు సమాచారం. అయితే, ఆ అధికారిక జాబితాలో లేని వ్యక్తి వారితో పాటు లోపలికి వెళ్లాడని ఆరోపిస్తున్నారు. మహాద్వారం వద్ద విధులు నిర్వహించే విజిలెన్స్ అధికారులు ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతించాల్సి ఉండగా, ఈ ఘటనలో ఆ ప్రక్రియ సక్రమంగా అమలు కాలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని భక్తులు, హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
విజయ్‌కు త్రిష.. నాకేమో నవ్వు!
సాక్షి సినిమా : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష కృష్ణన్ బంధంపై తరచూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. తన తాజా చిత్రం 'విజిటర్' ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన ధ్యాన్.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకను పరోక్షంగా ప్రస్తావిస్తూ వేసిన సరదా పంచ్‌లు ప్రేక్షకులను నవ్వించాయి. అయితే ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారడంతో పాటు విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ ఈవెంట్లో తన సహనటి నవ్యా నాయర్‌ను ఉద్దేశించి ధ్యాన్ మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత మనిద్దరం కలిసి సినిమా చేస్తున్నాం. నవ్యాకు పెళ్లై, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినా నేను ఒకరోజు కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. నువ్వు తెల్లచీర కట్టుకుని ముందు వరుసలో కూర్చొని, కళ్లలో నీళ్లతో నన్ను చూస్తూ ఉండాలి" అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో సభలో నవ్వులు పూశాయి.Trisha emotions were on high during Vijay oath ceremony. An emotional moment ❤️ pic.twitter.com/GrJcW88bwg— Devanshu Mani Tripathi (@devanshu_mani) May 10, 2026ఆ తర్వాత మైక్ అందుకున్న నవ్యా నాయర్ కూడా అదే స్థాయిలో స్పందించింది. "నువ్వు సీఎం అయితే.. నువ్వు చెప్పినట్టే తెల్లచీరకు ఆకుపచ్చ అంచు, డైమండ్ నెక్లెస్ వేసుకుని ముందు వరుసలో కూర్చుంటా. కళ్లలో ఆనందబాష్పాలతో నీకు జైకొడతా. కానీ ముందు వరుసలో నాకు సీటు మాత్రం రిజర్వ్ చేయాలి" అంటూ చమత్కరించింది. దీంతో సభలో మరోసారి నవ్వుల వెల్లువ ఎగిసింది.ఇదంతా సరదా సంభాషణలా అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం తప్పు బడుతున్నారు. ఈ వ్యాఖ్యలను విజయ్ ప్రమాణ స్వీకార వేడుకతో పోలుస్తున్నారు. వాళ్లిద్దరిపైనా మండిపడుతున్నారు. The day I take the oath as CM... I think Navya will be there in the front row wearing a saree...!!- Dhyan Sreenivasan 😂 pic.twitter.com/UT5GvyK8Fq— Trollywood 𝕏 (@TrollywoodX) July 16, 2026 తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు త్రిష.. ఆయన తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభతో కలిసి ముందు వరుసలో కూర్చోవడం, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆమె భావోద్వేగానికి గురికావడం అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ ఘటననే ధ్యాన్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ప్రస్తావించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ కార్యక్రమంలో ధ్యాన్ మరో సరదా వ్యాఖ్య కూడా చేశాడు. విజయ్ ముఖ్యమంత్రి అయినట్లే.. తానూ రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కేరళ ముఖ్యమంత్రి అవుతానని జోక్ చేశాడు. అలాగే తన స్నేహితుడు, నటుడు అజు వర్గీస్‌ను ఈ సంభాషణలోకి లాగుతూ.. తనకి గవర్నర్ పదవి బాగుంటుందని నవ్వించాడు. వెంటనే అజు వర్గీస్ మీ అమ్మగారికి రాష్ట్రపతి పదవి దక్కుతుందని జోక్ చేశాడు.అయితే ఈ ఎపిసోడ్ ఎటు దారి తీస్తుందని అనుకున్నాడో ఏమో.. అజు వర్గీస్ వేదిక మీదకు వచ్చి "విజయ్ సార్, నా ఫ్రెండ్ కొంచెం పిచ్చోడు.. దయచేసి క్షమించండి" అంటూ వ్యాఖ్యానించాడు. ఆ మాటతో అక్కుడున్నవాళ్లంతా కడుపుబ్బా నవ్వుకున్నారు.ఎవరీ ధ్యాన్-నవ్యా?ధ్యాన్ శ్రీనివాసన్(Dhyan Sreenivasan) మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన శ్రీనివాసన్ కుమారుడు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన వినీత్ శ్రీనివాసన్‌కు సోదరుడు. 2013లో వచ్చిన తీరా సినిమాతో నటుడిగా పరిచయమైన ధ్యాన్, 2013లో 'తీరా' చిత్రంతో నటుడిగా పరిచయమైన ధ్యాన్ శ్రీనివాసన్.. 'ఆది కాప్యారే కూటమణి', 'కుంజిరామాయణం', 'గూడలోచన', 'వర్షంగళ్క్కు శేషం' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక.. నవ్యా నాయర్ మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి. 'నందనం', 'ఇష్టం', 'కళ్యాణరామన్', 'పందిప్పాడ' వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె, మలయాళంతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ధ్యాన్ శ్రీనివాసన్ 2017లో అర్పితా సెబాస్టియన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్యా నాయర్ 2010లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త సంతోష్ మీనన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. -
జగన్నాథ మహారథయాత్ర.. ఇస్కాన్‌పై పూరీ ఆలయ మండిపాటు
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూసే పూరీ జగన్నాథ మహారథయాత్ర నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ గర్భాలయం నుంచి బయటకు వచ్చి రథాలను అధిరోహించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దేశ విదేశాల నుంచి ఇప్పటికే లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకోగా.. మరోవైపు రథయాత్ర వేళ ఇస్కాన్‌పై పూరీ జగన్నాథ ఆలయ పరిపాలన చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీశాయి.శాస్త్రాలకు విరుద్ధంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా రథయాత్రలు నిర్వహిస్తూ భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని పూరీ జగన్నాథ ఆలయ పరిపాలన (SJTA) ఇస్కాన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల ఇస్కాన్ విడుదల చేసిన ప్రకటనల్లో వాస్తవాలు లేవని, తాము నిర్వహిస్తున్న రథయాత్రలు పూర్తిగా శాస్త్రసమ్మతమేనని చెప్పడం సరికాదని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే ఇరు వర్గాల పండితుల మధ్య చర్చలు జరిగినప్పటికీ.. ఇస్కాన్ వాదనలను శాస్త్రాలు, పురాణాల ఆధారంగా తిరస్కరించామని వెల్లడించింది. అంతేకాదు.. పూరీ గజపతి మహారాజు దిబ్యసింహ దేవ్ తమ కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారనే ప్రచారం కూడా పూర్తిగా అసత్యమని పేర్కొంది.అయితే పూరీ ఆలయ యంత్రాంగం ఆరోపణలపై ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుధిష్ఠిర్ గోవింద దాస్ స్పందిస్తూ.. ఆలయ ప్రకటనను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని, దానిని చూసిన తర్వాతే తమ వైఖరిని వెల్లడిస్తామని తెలిపారు.VIDEO | Puri, Odisha: Sand artist Sudarsan Pattnaik creates 100 miniature raths to mark the annual Jagannath Rath Yatra.#Puri #JagannathRathYatra(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/WZGhiRLLKF— Press Trust of India (@PTI_News) July 16, 2026ఇదిలా ఉండగా.. మహారథయాత్ర కోసం మూడు భారీ రథాలు ఇప్పటికే పూరీ ఆలయ సింహద్వారం వద్ద సిద్ధంగా నిలిచాయి. జగన్నాథుడి నందిఘోష, బలభద్రుడి తాళధ్వజ, సుభద్రమ్మ దర్పదళన రథాలను సంప్రదాయ పూజల అనంతరం గ్రాండ్ రోడ్డుపైకి తీసుకొచ్చారు. రథయాత్ర సందర్భంగా ఆలయ ప్రాంగణం, బడదండా (గ్రాండ్ రోడ్) భక్తులతో కిక్కిరిసిపోయింది.రథయాత్ర విశిష్టతను వివరిస్తూ ఓ మహిళా భక్తురాలు చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. "సాధారణ రోజుల్లో మేమే ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటాం. కానీ రథయాత్ర రోజున మాత్రం స్వామివారే బయటకు వచ్చి మమ్మల్ని దర్శిస్తారు. అందుకే ఈ రోజు ఎంతో ప్రత్యేకం" అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.#WATCH | Puri, Odisha | A devotee says, "...On normal days, we visit the temple to see the Lord, but today, He is coming out to see us. That is why we have come..." https://t.co/IvPIcRsACf pic.twitter.com/m6kMWASTzo— ANI (@ANI) July 16, 2026లక్షలాది మంది భక్తులు హాజరవుతుండటంతో ఒడిశా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది.పూరీతో పాటు దేశంలోని పలు నగరాల్లో కూడా ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్రలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రథయాత్రల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఒకవైపు భక్తిశ్రద్ధలతో జగన్నాథ మహారథయాత్ర ప్రారంభమవుతుండగా.. మరోవైపు రథయాత్ర నిర్వహణపై పూరీ ఆలయం, ఇస్కాన్ మధ్య కొనసాగుతున్న వివాదం కూడా ఈసారి ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. -
వాళ్ళిద్దరి ఇగో వల్లే ఈ రచ్చ.. జానీ మాస్టర్ భార్యాభర్తలు ఎలాంటివాళ్ళంటే
-
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో జానీ మాస్టర్ భార్య అరాచకాలు.? అందుకే రాజీనామా చేశాం..
-
వీళ్ల కోసమా వరల్డ్ కప్ హీరోను తీసేసింది.. సోషల్ మీడియాలో రగులుతున్న చర్చ
-
గాడ్ ఆఫ్ వార్ ను అడ్డుకుంటాం ఎన్టీఆర్ కు తమిళియన్ వార్నింగ్
-
‘రిట్జర్’ కాస్తా ‘పుట్జర్’.. ‘నెట్’ పేపర్‌పై ఫైర్!
న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)గత జూన్ 22 నుండి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా యూజీసీ నెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించింది. అయితే, జూన్ 30న జరిగిన సోషియాలజీ (సామాజిక శాస్త్రం) పరీక్షా పత్రంలో స్పెల్లింగ్ లోపాలు, తప్పుడు వ్యాకరణాలు ఉన్నాయని అంతరా చక్రవర్తి అనే పీహెచ్డీ అభ్యర్థి ‘ఎక్స్’ వేదికగా ఆరోపించడంతో ఈ పరీక్షల నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 50 శాతం ప్రశ్నపత్రం ఇటువంటి ఘోర తప్పిదాలతోనే నిండిపోయిందని సదరు అభ్యర్థి పేర్కొన్నారు.ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తల పేర్లను ఈ ప్రశ్నపత్రంలో పూర్తిగా మార్చేశారని ఆమె ఉదాహరణలతో సహా వివరించారు. ‘రిట్జర్’ అనే పేరును ‘పుట్జర్’ అని, ‘పార్సన్స్’ను ‘పార్సో’ అని, ‘ఘుర్యే’ను ‘ఘున్యే’ అని, అలాగే ఏఆర్ దేశాయ్ పేరును ‘ఏకె దేశాయ్’ అని తప్పుగా ముద్రించారని తెలిపారు. అంతేకాకుండా, ‘సోషల్’ అనే పదాన్ని ‘ఓవల్’అని రాశారని, ప్రశ్నల హిందీ అనువాదం ఐదేళ్ల పిల్లాడు చేసినట్లుగా అత్యంత దారుణంగా ఉందని, దీనివల్ల ప్రశ్నలను అర్థం చేసుకోవడానికే సగం సమయం వృథా అయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఆరోపణలను సమర్థిస్తూ మరో అభ్యర్థి కూడా ట్వీట్ చేశారు. ఈ ప్రశ్నపత్రం ఎన్టీఏ విద్యా ప్రమాణాలను ప్రశ్నిస్తోందని, సిలబస్‌కు వెలుపల ఉన్న ప్రశ్నలు ఇచ్చారని విమర్శించారు. అసలు సామాజిక శాస్త్రానికి సంబంధం లేని మాజీ విద్యాశాఖ మంత్రుల కాలక్రమాన్ని అమర్చమనే ప్రశ్నలు అడగడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు, పీహెచ్డీ ప్రవేశాలకు అర్హతను నిర్ణయించే ఇటువంటి ప్రతిష్టాత్మక పరీక్షలో ఇలాంటి తప్పులు దొర్లడంపై పలువురు విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
అమ్మతోడు జరిగింది ఇదే! డెలివరీ బాయ్ దాడిపై హీరో అఖిల్ రాజు క్లారిటీ
-
కరుప్పు, కాంతార ఓకే... 'ఇడుపు కాయితం’ నాట్ ఓకే
-
వావ్ ‘సార్థక్’.. నాడు సీబీఎస్ఈ.. నేడు టెండర్ల స్కామ్!
రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన 17 ఏళ్ల టెక్నాలజీ పరిశోధకుడు, సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ మరో సరికొత్త సంచలనానికి తెరలేపారు. ఇటీవలే సీబీఎస్ఈ వెబ్‌సైట్‌లోని లోపాలను ఎండగట్టిన ఈ కుర్రాడు ఇప్పుడు భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ (సీపీపీ) పోర్టల్ నుండి దాదాపు 1.66 కోట్ల ప్రభుత్వ కొనుగోలు రికార్డులను సేకరించి, వాటిని ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతూ, ఒక బహిరంగ డేటా పోర్టల్‌ను ప్రారంభించాడు. పారదర్శకత అనేది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే తాను ఈ సాహసోపేతమైన అడుగు వేసినట్లు సార్థక్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.మార్కుల పోరాటం.. స్కామ్ గుట్టురట్టుసార్థక్ సిద్ధాంత్ ఇటీవల సీబీఎస్ఈ క్లాస్ 12 పరీక్షలు రాశారు. అయితే ఆశించిన దానికంటే తక్కువ మార్కులు రావడంతో, రీవాల్యుయేషన్ కోసం తన స్కాన్ చేసిన జవాబు పత్రాల కాపీలను కోరారు. ఈ ప్రక్రియను లోతుగా పరిశీలిస్తున్న సమయంలో, పరీక్షల మూల్యాంకనానికి ఉపయోగించే ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానంలో, దానికి అనుబంధంగా ఉన్న ‘కోఎమ్ట్’ అనే సంస్థ టెండర్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆయన గుర్తించారు. గత రెండు వారాలుగా రేయింబవళ్లు శ్రమించి సేకరించిన ఈ కీలక డేటాను sarthaksiddhant.com అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ రికార్డులను పౌరులు, జర్నలిస్టులు, పరిశోధకులు ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని విశ్లేషించవచ్చని సార్థక్ పిలుపునిచ్చారు.రంగంలోకి రాహుల్ గాంధీఈ వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జూన్ 2వ తేదీన సార్థక్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన 8 నిమిషాల 15 సెకన్ల వీడియోను జూన్ 7న ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. సీబీఎస్ఈ, కోఎమ్ట్ సంస్థల మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని ఈ యువకుడు బట్టబయలు చేశాడని రాహుల్ ప్రశంసించారు. నేటి యువత కేవలం రీల్స్ చేస్తూ, పకోడీలు వేపుకుంటూ కూర్చోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోందని, కానీ ప్రశ్నించే తత్వమున్న ఈ యువత స్వయంగా నిజాలను వెలికితీసిందని రాహుల్ గాంధీ విమర్శించారు.వివాదాస్పద 'కోఎమ్ట్' నేపథ్యంఈ వివాదంలో చిక్కుకున్న కోఎమ్ట్ ఎడ్యుటెక్ సంస్థకు తెలంగాణతో సంబంధం ఉంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బోర్డు పరీక్షల డిజిటల్ మూల్యాంకన పనులను నిర్వహిస్తోంది. గతంలో 2019లో ఈ సంస్థ ‘గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఉండేది. ఆ ఏడాది తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షల డేటా ప్రాసెసింగ్‌లో జరిగిన లోపాల వల్ల పరీక్ష రాసిన 9.74 లక్షల మంది విద్యార్థుల్లో ఏకంగా 3 లక్షల మందికి పైగా ఫెయిల్ అయ్యారు. అప్పట్లో ఈ సంస్థపై తీవ్రస్థాయిలో అవకతవకల ఆరోపణలు వచ్చాయి. -
కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్’ మంటలు
న్యూఢిల్లీ: ఎంపీ శశి థరూర్ మరోసారి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారానికి కారణమయ్యారు. జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయంటూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్, సొంత పార్టీ నేతల నుంచే గట్టి విమర్శలకు దారితీసింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో జరిగిన భేటీపై థరూర్ సానుకూల వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది.గవర్నర్‌తో భేటీ.. థరూర్ సానుకూల వ్యాఖ్యలుశ్రీనగర్ పర్యటనలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘ఎల్జీతో అద్భుతమైన సమావేశం జరిగింది. కశ్మీర్లో పరిస్థితులు, సాధారణ స్థితి వైపు సాగుతున్న ప్రోత్సాహకరమైన పురోగతిపై చర్చించాం’ అని పేర్కొన్నారు. స్థానిక రచయితల సంఘం, మహిళా సంఘాల ప్రతినిధులతో ఎల్జీ మాట్లాడుతుండటం సానుకూల పరిణామమని, ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ భేటీ తనకు ఎంతో ఆశాజనకంగా అనిపించిందని థరూర్ రాసుకొచ్చారు. In Srinagar! Had the honour of an excellent meeting with Lieutenant-Governor Shri @manojsinha_ at Lok Bhavan today. We discussed the situation in the state and the encouraging progress towards normalcy. When I arrived he was chatting to the President of the Kashmiri Writers’… pic.twitter.com/hm1lz3qDGF— Shashi Tharoor (@ShashiTharoor) June 21, 2026సొంత పార్టీ నుంచే ఘాటు కౌంటర్థరూర్ వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రవీందర్ శర్మ తీవ్రంగా స్పందించారు. గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవడానికి థరూర్ స్థానిక ప్రజలను కలిసి ఉంటే బాగుండేదని ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏడేళ్ల క్రితం తాము కోల్పోయిన రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న సొంత పార్టీ నాయకులను కలవడానికి కనీసం సమయం కేటాయించకపోవడాన్ని శర్మ తప్పుబట్టారు.ప్రధాని మోదీపై వ్యాఖ్యల వివాదంశశి థరూర్ ఇలా సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. అమెరికా నౌకాదళ దిగ్బంధం మధ్య ముగ్గురు భారతీయ నావికుల మరణంపై, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ జరిపిన చర్చలను థరూర్ సమర్థించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అయితే, దీనిపై థరూర్ స్పందిస్తూ.. తానేమీ రాజకీయంగా ప్రశంసించలేదని, భారతీయ పౌరుల భద్రత గురించే మాట్లాడానని, దీన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని అన్నారు. -
‘ఎన్టీఏ అబుదాబి’ నిర్వాకంపై రాహుల్ నిప్పులు!
న్యూఢిల్లీ: వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ (NEET) నిర్వహణ తీరుపై మరోసారి తీవ్ర దుమారం రేగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చేసిన ఒక పొరపాటు ఒక విద్యార్థి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థికి రీ-ఎగ్జామ్ సెంటర్ ఏకంగా విదేశాల్లో (అబుదాబి) కేటాయించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం కేంద్ర ప్రభుత్వంపై, ఎన్టీఏపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థి నెల రోజులుగా ఎంతో కష్టపడి నీట్ రీ-ఎగ్జామ్ కోసం సన్నద్ధమయ్యాడు. అయితే పరీక్షకు సరిగ్గా ఒక్కరోజు ముందు అతను తన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోగా, అందులోని పరీక్షా కేంద్రం చూసి షాక్‌కు గురయ్యాడు. ఆ విద్యార్థికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ‘అబుదాబి’లో సెంటర్ కేటాయించారు. ఈ ఉదంతంపై రాహుల్ గాంధీ ఎక్స్ ‘ఎక్స్’ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎన్టీఏ పనితీరును తప్పుపట్టారు. అసలు ఇలాంటి ఘోరమైన తప్పు ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ‘విద్యార్థి ఉన్న నగరంలోనే ఒక పరీక్షా కేంద్రాన్ని సరిగ్గా కేటాయించలేని విద్యా వ్యవస్థకు, ఇలాంటి అత్యున్నత స్థాయి పరీక్షలను నిర్వహించే హక్కు ఎక్కడిది?’ అని ప్రశ్నించారు.విద్యార్థుల, వారి తల్లిదండ్రుల సహనాన్ని ఎన్టీఏ పరీక్షిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటీవల తాను కోటాలో విద్యార్థులను కలిసి వారి బాధలను పంచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత విద్యా వ్యవస్థ యువతను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని విమర్శిస్తూ.. ‘ఇది నిజమైన విద్యా వ్యవస్థ కాదు, ఇది ఒక తరానికి చెందిన డబ్బును, సమయాన్ని, మానసిక ప్రశాంతతను నిలువునా దోపిడీ చేసిందన్నారు. పిల్లల భవిష్యత్తుతో జూదం ఆడటం ఇకనైనా ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. దేశంలోని విద్యార్థులకు బాధ్యతాయుతమైన, సమాధానం చెప్పే విద్యా వ్యవస్థ, పరీక్షా యంత్రాంగం అవసరమని ఇందుకోసం తాము పోరాడి తీరుతామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్! -
నామినేషన్ వివాదం.. ఈసీని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం
ఢిల్లీ: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదం దుమారం రేపుతోంది.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ చట్టవిరుద్ధమని పేర్కొంది. తన విస్తృత అధికారాలతో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఈసీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గతంలో హరియాణా, గుజరాత్లో ఆర్వో నిర్ణయాలు ఈసీ సరిచేసిందని కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మన్వు సంఘ్వీ అన్నారు.కాగా, ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు.కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్‌లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. -
50 శాతం మార్జిన్‌తో ‘బొద్దింక’ వ్యాపారం!
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా శనివారం జరిగిన సీజేపీ నిరసనల్లో ఒక ఆసక్తిక ఘట్టం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వ్యంగ్యాత్మక ఉద్యమం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) తన మొట్టమొదటి ఆఫ్‌లైన్ నిరసన ప్రదర్శనను నిర్వహించింది. ‘నీట్’ పరీక్షల ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అభిజీత్ దిప్కే నేతృత్వంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శన ఒక వ్యాపార కేంద్రంగానూ కనిపించింది. ఈ ఉద్యమానికి సంబంధించిన లోగోలు, గుర్తులను క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారులు నిరసన స్థలంలోనే దుకాణాలు తెరిచారు. బొద్దింకల థీమ్‌తో డిజైన్ చేసిన మాస్కులు, జెండాలు, టీ-షర్టులను విక్రయిస్తూ సందడి చేశారు.లాభాల మార్జిన్‌పై నెటిజన్ల ట్రోల్స్ఈ విక్రయాలకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఒక రిపోర్టర్ మాస్కులు అమ్ముతున్న వ్యక్తిని ‘ఈ మాస్కు ప్రింటింగ్ ఖరీదు ఎంత?’ అని అడగగా, అతడు ‘15 రూపాయలు’ అని సమాధానమిచ్చాడు. ‘మరి దీన్ని ఉచితంగా పంచుతున్నారా?’ అని ప్రశ్నిస్తే.. ‘లేదు, 30 రూపాయలకు అమ్ముతున్నా’ అంటూ బదులిచ్చాడు. రూ.250 రూపాయలకు టీ-షర్టులు విక్రయించారు. మొత్తంగా చూస్తే 50 శాతం లాభంతో ఈ వ్యాపారం సాగింది.ఇది కూడా చదవండి: అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత? -
రిలీజ్ వెంటనే పెద్దికి జాన్వీ కపూర్ ఝలక్
-
రూ.15 వేల కోట్ల లగ్జరీ రిసార్ట్ : ట్రంప్‌కి భారీ ఝలక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అల్బేనియా అడ్రియాటిక్ తీరంలో ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ నిర్మించతలపెట్టిన లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్‌పై పెద్ద దుమారం చెలరేగింది. వీరు తలపెట్టిన సుమారు రూ. 15,232 కోట్ల భారీ ప్రాజెక్ట్ అక్కడి పర్యావరణ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుందంటూ అల్బేనియా రాజధాని టిరానా నగర కేంద్రంలో యువత తీవ్ర నిరసనలకు దిగింది. జారెడ్ కుష్నర్ అఫినిటీ పార్ట్నర్స్ మద్దతుతో, ఇవాంకా ట్రంప్ ప్రమేయంతో రూపొందుతున్న ప్రతిపాదిత విలాసవంతమైన పర్యాటక ప్రాజెక్టే ఈ ఆగ్రహానికి కేంద్ర బిందువు. అసలేంటీ ప్రాజెక్ట్ తెలుసుకుందాం.పర్యావరణ నష్టం, చట్టపరమైన లోపాలపై ప్రజలు, పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని టిరానా (Tirana) లో ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని, భూములను అసలు యజమానులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వరుస నిరసనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సజాన్ ద్వీపంలో, తీరప్రాంత నగరమైన వ్లోరా సమీపంలోని జ్వెర్నెక్ వద్ద నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్ట్‌తో రక్షిత జాతి అయిన ఫ్లెమింగోలకు, సముద్ర తామేళ్లకు, అలాగే రక్షిత చిత్తడి నేలల ప్రాంతంలోని ఇతర జాతులకు ముప్పు కలిగిస్తాయని వారు అంటున్నారు. తీరప్రాంతంలో బుల్డోజర్లు రావడం, బీచ్‌లకు వెళ్లకుండా ముళ్ల కంచెలు వేయడంతో స్థానికులు, నిరసనకారులు సెక్యూరిటీ గార్డులతో ఘర్షణకు దిగారు. ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు#BREAKING #usa Protests entered a fourth night in Tirana and across Albania against a luxury resort project backed by Jared Kushner’s Affinity Partners and involving Ivanka #Trump . Demonstrators oppose the development on the protected Vjosa-Narta wetland and Sazan Island, citing… pic.twitter.com/uGA0f2K9FW— Thepagetoday (@thepagetody) June 5, 2026విదేశీ డెవలపర్లకు భూమిని అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు గులాబీ రంగు ఫ్లెమింగో కటౌట్లు, అల్బేనియా నాట్ ఫర్ సేల్ అనే ప్లకార్డ్‌లతో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. అంతేకాదు అవినీతి ఆరోపణలుఎదుర్కొంటున్న పీడీ నాయకుడు సాలీ బెరిషాతో పాటు ప్రధానమంత్రి రామాను కూడా జైలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడీ రామా కార్యాలయం ముందు ప్రతిరాత్రి జరుగుతున్న ర్యాలీలను పోలీసులు వాటర్ కెనాన్లతో అదుపు చేస్తున్నారు.మరోవైపు వ్యోసా-నార్తా రక్షిత పర్యావరణ ప్రాంతాన్ని ఈ ప్రాజెక్ట్ ధ్వంసం చేస్తుందని దాదాపు 40కి పైగా స్వచ్ఛంద సంస్థలు (NGOs) ఆందోళన వ్యక్తం చేస్తూ, పనులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వానికి లేఖ రాశాయి. ప్రతిపాదిక ప్రాజెక్ట్ సుమారు 10,000 గదులతో కూడిన ఒక కొత్త నగరం అవుతుందని, ఇది వన్యప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని అల్బేనియా పర్యావరణవేత్త జోని వోర్ప్సీ విమర్శించారు.2024లో అల్బేనియాలోని అడ్రియాటిక్ తీరంలో లగ్జరీ హోటళ్లు, విల్లాలు నిర్మించనున్నట్లు జారెడ్ కుష్నర్, ఆయన భార్య ఇవాంకా ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ను రక్షిత ప్రాంతమైన వ్యోసా-నార్తా (Vjosa-Narta) డెల్టా మరియు ఒకప్పుడు రహస్య కమ్యూనిస్ట్ సైనిక స్థావరంగా ఉన్న సజాన్ (Sazan) ద్వీపంలో నిర్మించాలని ప్రణాళికలు వేశారు. సుమారు 1.6 బిలియన్ డాలర్లు (USD) ఉంటుందని అంచనా. అయితే, సజాన్ ప్రభుత్వ ఆస్తి అయినందున, ఇందులో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉంటుందని అల్బేనియా ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇక్కడ దాదాపు 4 బిలియన్ యూరోల ప్రాజెక్ట్ ఉందని, దీని వెనుక ఖతార్‌కు చెందిన 'పవర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్' సహ-యజమానులు ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. అల్బేనియాలో, పర్యావరణ పరిరక్షణతో సహా ప్రతిదీ పారదర్శకంగానే ఉందని, చాలా బాధ్యతాయుతంగా ఆ ప్రాజెక్ట్‌ను చేపట్టామని, స్థానికులకు ఉద్యోగాలు, సంపద సృష్టించడంపై దృష్టి పెట్టామని కుష్నర్ వ్యాపార భాగస్వామి, ఆషర్ అబెహ్సెరా చెప్పారు.విచారణఅల్బేనియా ప్రత్యేక అవినీతి నిరోధక ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ ప్రాజెక్ట్‌పై విచారణ ప్రారంభించింది. రక్షిత ప్రాంత హోదాను ఎలా మార్చారు? పబ్లిక్ టెండర్లు లేకుండా కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? మరియు నిధుల మూలాలు ఎక్కడివి? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది.కాగా 1990లలో కమ్యూనిజం పతనం తర్వాత అల్బేనియాలో భూ వివాదాలు ఎక్కువయ్యాయి. కమ్యూనిస్ట్ పాలనలో 45 ఏళ్ల సంపూర్ణ జాతీయీకరణలో కోల్పోయిన తమ పూర్వీకుల భూములను తిరిగి పొందాలని వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ కోసం కేటాయించిన భూములపై కొందరు స్థానికులు హక్కులు కోరుతున్నారు. అలాగే, భూముల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
వీసా పేరుతో కోట్లలో వసూళ్లు.. నందుస్ వరల్డ్ స్కాం వెనుక షాకింగ్ నిజాలు
-
ఫైనల్ కు ముందు కోహ్లిని మరోసారి గెలికిన హెడ్..
-
రేవంత్ రాజకీయ కుట్రలపై.. బీజేపీ నేత కిశోర్ రెడ్డి కామెంట్స్
-
నీట్ లీక్‌పై సుప్రీం తీవ్ర ఆగ్రహం, కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: 2026 నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నపత్రం లీక్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీక్‌పై ఆరు వారాల్లోగా ఆఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. పర్యవేక్షణ యంత్రాంగాలు, పర్యవేక్షక కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన ఎలా జరిగిందంటూ ఆందోళన వ్యక్తంచేసింది. పర్యవేక్షణ ఉన్నప్పటికీ పేపర్ లీక్ జరిగిందంటే ప్రక్రియలో లోపాలు ఉన్నట్టే అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పై ఆగ్రహం చేసింది.పరీక్షలనిర్వహణకు సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని సూచించింది. పేపర్ లీక్‌తోవిద్యార్థులుతీవ్ర మనోవేదనకు గురయ్యారని వ్యాఖ్యానించింది. నీట్ కేసులో బాధ్యులైన వారిని వెంటనే గుర్తించాలని తగిన చర్యలు చేపట్టాలంటూ ఆయాశాఖలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న నీట్ 2026 పేపర్ లీక్ వివాదానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) భారత సుప్రీంకోర్టులో ఒక ముఖ్యమైన అఫిడవిట్‌ను దాఖలు చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, జూన్ 21న జరగబోయే నీట్ 2026 పునఃపరీక్షలో విశ్వాసం, పారదర్శకత, నిష్పక్షపాతాన్ని పునరుద్ధరించడానికి తాము కట్టుబడి ఉన్నామని NTA సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ విచారణకు ఎన్టీఏ, మాజీ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. -
సీబీఎస్ఈ వివాదం : ఎట్టకేలకు మౌనం వీడిన ధరేంద్ర ప్రధాన్
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు స్పందించారు. ఓఎస్ఎం వ్యత్యాసాలకు, విద్యార్థుల అసౌకర్యానికి తాను బాధ్యతవహిస్తున్నట్లు ప్రకటించారు. మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలను గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.ఢిల్లీలో సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మాట్లాడిన ప్రధాన్, బోర్డు కొత్త డిజిటల్ మూల్యాంకన నమూనాను సమర్థించడంతో పాటు, విద్యార్థులు ఎదుర్కొన్న ఒత్తిడిని కూడా అంగీకరించారు.స్కాన్ చేసిన కాపీలు అస్పష్టంగా ఉండటం, జవాబులను సరిచూసుకోలేదని ఆరోపణలు, పోర్టల్ క్రాష్‌లు, చెల్లింపు సమస్యలు, పునఃమూల్యాంకన ప్రక్రియలో గందరగోళం వంటి అంశాలపై అటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి తాను బాధ్యత తీసుకుంటున్నానని, అవకతవకలు కనుగొనబడితే "ఎవరినీ వదిలిపెట్టబోమని" విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు. అంతేకాదు దీన్ని సరిచేసేలా పరిష్కారం కనుగొంటామనీ తామందరూ ఆ పనిపైనే పనిచేస్తున్నామని హామీ ఇచ్చారు. పరీక్ష రాసిన 17 లక్షల మంది విద్యార్థుల 98 లక్షల కాపీల జవాబు పత్రాలను భద్రపరిచామని వెల్లడించారు. ఇదీ చదవండి: భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా?కాగా సీబీఎస్ఈ మార్క్‌ల షీట్లు తారుమారు కావడం విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దీనిపై విద్యార్థులు ఆన్లైన్ వేదికగా తమ అనుభవాలను స్ర్కీన్ షాట్లతో సహా పంచుకోవడంతోఇది మరింత ముదిరింది. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ ఊపందుకుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా ప్రదాన్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. -
రీవాల్యుయేషన్ వివాదం : ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న సీబీఎస్ఈ
ఢిల్లీకి చెందిన 12వ తరగతి విద్యార్థి వేదాంత్ శ్రీవాస్తవ (Vedant Srivastava), తన రీ-వాల్యూయేషన్ ఫిజిక్స్ జవాబు పత్రం వేరే వారిది వచ్చిందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దీనిని సరిదిద్దే చర్యలు చేపట్టింది.రీ-వాల్యూయేషన్ కోసం వేదాంత్ అప్లై చేయగా, బోర్డు తనకు పంపిన ఆన్సర్ షీట్ తనది కాదని, అది వేరే విద్యార్థి జవాబు పత్రమని అతను ఎక్స్ ద్వారా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఈ విషయాన్ని వివరిస్తూ అతడు ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌లు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.I am a CBSE Class 12 student.After receiving unexpectedly low marks in Physics, we applied for photocopies of my answer sheets through the CBSE reevaluation process.Today we received the copies.And I am shattered because the Physics answer sheet uploaded by CBSE is not mine— VEDANT (@VEDANTSHRIV17) May 23, 2026తప్పు ఒప్పుకున్న సిబిఎస్ఇ (CBSE)దీంతో సిబిఎస్ఇ అధికారికంగా రంగంలోకి దిగింది. తమ కొత్త ఆన్లైన్ స్క్రిప్ట్ మానిటరింగ్ (OSM) వ్యవస్థలో సాంకేతిక లోపాల కారణంగా ఇలాంటి గందరగోళం జరిగిందని బోర్డు అంగీకరించింది. వేదాంత్ కేసే కాకుండా, మరికొన్ని కేసుల్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు ఇలాగే పరస్పరం మారిపోయాయని బోర్డు స్పష్టం చేసింది. బాధిత విద్యార్థులందరి మార్కులను సరిదిద్దే ప్రక్రియ ప్రస్తుతం వేగంగా జరుగుతోందని సీబీఎస్ఈ తెలిపింది. సీబీఎస్ఈ జాయింట్ సెక్రటరీ (కోఆర్డినేషన్) స్వయంగా వేదాంత్‌కు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ఆ లేఖతో పాటు వేదాంత్ రాసిన అసలైన ఫిజిక్స్ ఆన్సర్ షీట్‌ను బోర్డు జత చేసింది.ఈ కొత్త మార్కుల ఆధారంగా , వెబ్సైట్లో త్వరలోనే అప్డేట్ చేస్తామని వివరణం ఇచ్చింది. ఇదిలా ఉండగా, మరో 12వ తరగతి విద్యార్థిని సంజన కూడా, పునఃమూల్యాంకన ప్రక్రియలో అప్లోడ్ చేసిన కెమిస్ట్రీ జవాబు పత్రం తన చేతిరాతతో సరిపోలలేదని సోషల్ మీడియాలో ఆరోపించింది. తన వ్యక్తిగత వివరాలు ఉన్న మొదటి పేజీ తనదిగా కనిపించినప్పటికీ, లోపలి పేజీలు తన చేతిరాత శైలిని పోలి లేవని ఆమె పేర్కొంది. ఈ ఆరోపణలు, సీబీఎస్ఈ ఓఎస్ఎం (OSM) వ్యవస్థ అమలుపైనా, మూల్యాంకనం సమయంలో ఉపయోగించే డిజిటల్ స్కానింగ్, ట్యాగింగ్ ప్రక్రియల కచ్చితత్వంపైనా ఆందోళనలను తీవ్రతరం చేశాయి. ఇదీ చదవండి: 66 హార్డ్ డిస్క్‌లు, లక్షల విలువైన డేటా మాయం : షాక్‌లో డైరెక్టర్లు -
కస్టమర్ల ఇళ్లలో కెమెరాల కలకలం
బెంగళూరుకు చెందిన ప్రముఖ హోమ్ సర్వీసెస్ స్టార్టప్ ప్రోంటో ప్రస్తుతం సాంకేతిక, నైతిక వివాదంలో చిక్కుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు శిక్షణ ఇచ్చేందుకు కస్టమర్ల ఇళ్లలో వీడియోలను రికార్డ్ చేయడానికి తన సిబ్బందిని ఉపయోగించిందనే ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో టెక్ స్టార్టప్ ‘హ్యూమన్ ఆర్కైవ్’ వ్యవస్థాపకుడు రుషిల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.నాడు ఎగతాళి చేశారు.. నేడు అదే చేస్తున్నారుభవిష్యత్తులో రాబోయే హ్యూమనాయిడ్ రోబోట్లు, ఫిజికల్ ఏఐ వ్యవస్థల శిక్షణ కోసం మానవ ప్రవర్తన, కదలికలు, రియల్ వరల్డ్ పరస్పర చర్యలను (ఉదాహరణకు: లైవ్‌లో ఇళ్లు శుభ్రం చేయడం, వంట చేయడం, వస్తువులను సర్దడం) రికార్డ్ చేసే పనుల్లో ‘హ్యూమన్ ఆర్కైవ్’ సంస్థ నిమగ్నమై ఉంది. ఈ అంశంపైనే కొన్ని నెలల క్రితం (జనవరిలో) తాను ప్రోంటో వ్యవస్థాపకురాలు అంజలి సర్దానాతో చర్చించానని రుషిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆమె తన ఆలోచనను తీవ్రంగా ఎగతాళి చేసిందని ఆయన ఆరోపించారు.‘జనవరిలో నేను అంజలి సర్దానాతో మాట్లాడినప్పుడు ఆమె నన్ను చూసి నవ్వింది. ఇలాంటి డేటా సేకరిస్తున్నందుకు నన్ను ఒక తెలివితక్కువవాడిగా చిత్రీకరించింది. స్టార్టప్ వ్యవస్థాపకులను తక్కువ చేసి మాట్లాడటం ఆమెకు అలవాటు. కానీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్‌ను పట్టుకోవడానికి వాళ్లే ఆపసోపాలు పడుతున్నారు’ అని రుషిల్ తీవ్రస్థాయిలో విమర్శించారు.ఏడాదిలో భారీ వాల్యుయేషన్.. కానీ..23 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త అంజలి సర్దానా నేతృత్వంలోని ప్రోంటో అతి తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. యూఎస్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన అంజలి గతంలో బైన్ క్యాపిటల్, 8వీసీ వంటి ప్రతిష్టాత్మక వెంచర్ సంస్థల్లో పనిచేశారు. ఏప్రిల్ 2025లో ప్రారంభమైన ఈ స్టార్టప్.. ఇళ్లు ఊడ్చడం, పాత్రలు కడగడం, వంటగది-బాత్రూమ్ క్లీనింగ్, లాండ్రీ వంటి సర్వీసుల కోసం కస్టమర్లను శిక్షణ పొందిన గృహ కార్మికులతో అనుసంధానిస్తుంది. ఇది ప్రారంభమైన ఏడాదిలోపే దీని వాల్యుయేషన్ 100 మిలియన్ డాలర్లకు చేరింది. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ‘కెమెరా వివాదం’ సంస్థ ప్రతిష్టను మసకబార్చేలా కనిపిస్తోంది.కెమెరాలు ఎందుకోసమంటే..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ప్రోంటో కంపెనీ ఇళ్లలో కెమెరాలు పెట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. భవిష్యత్తులో మనుషులతో సంబంధం లేకుండా ఇళ్లలో స్వయంగా పనులు చేయగల హ్యూమనాయిడ్ రోబోట్లను తయారు చేయడానికి ఈ కెమెరా రికార్డింగులు అత్యంత కీలకం.అది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే..కస్టమర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రోంటో సంస్థ అధికారికంగా స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘కస్టమర్లు స్వచ్ఛందంగా అంగీకరించి ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప సిబ్బంది ఇళ్లకు కెమెరాలతో వెళ్లరు. ఈ అనుమతి ఒక్కసారికి మాత్రమే పరిమితం కాదు, ప్రతి బుకింగ్‌కు ముందు కస్టమర్ దీన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్ కేవలం 0.1% మంది కస్టమర్ల వద్ద మాత్రమే నడుస్తోంది. దేశంలో అమలులో ఉన్న డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) చట్ట నిబంధనలకు కట్టుబడే నెలల తరబడి కసరత్తు చేసి ఈ ప్రక్రియను రూపొందించాం’ అని సంస్థ తెలిపింది. ఏఐ, రోబోటిక్స్ రంగాన్ని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశమని, ఈ రంగంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్న ఏకైక సంస్థ తమది మాత్రమే కాదని ప్రోంటో స్పష్టం చేసింది.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
ప్రశ్నిస్తే చంపేస్తారా..! నాగేశ్వరరావుకు నేను ఉన్నా!
-
‘ఒక్కమాట మీకు నచ్చలేదని ప్రొ.నాగేశ్వర్‌ను వేధిస్తారా?’
సాక్షి, అమరావతి: రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జనసేన నాయకులు కేసులు పెట్టడాన్ని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీడియో విడుదల చేశారు. ‘ఆయన మాట్లాడిన మొత్తం అంశాలను పక్కన పెట్టి, అందులో ఒక లైను మాత్రమే పట్టుకొని సోషల్ మీడియాలో ట్రోలింగ్లు, కేసులు, బెదిరింపులు... ఏమిటివన్నీ. ఇది ప్రజాస్వామ్యమా. లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం అనే రాజకీయ గూండాయిజమా?..మీకు నిజంగా ఒక్క మాట తప్పు అనిపిస్తే దానికి ఆధారం అడగండి. రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం.. ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి’ అంటూ తూర్పారపట్టారు. ‘ఓ రాజకీయ విశ్లేషకుడిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వాళ్లను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను ప్రశ్నిస్తూనే వస్తున్నారు. చంద్రబాబును ప్రశ్నించారు, పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించారు. కేసీఆర్‌ను ప్రశ్నించారు, జగన్‌ను ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పటి ఆయన నిజాయితీ కూడా మీకు గుర్తుకు రాలేదు...ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయనపై యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా ? ప్రశ్నించే గొంతులను కేసులతో మూసేయాలని చూడడం ప్రమాదకరం. ఈ రోజు నాగేశ్వర్, రేపు ఇంకెవరో...’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందో... ఎవరి పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. ఇలాంటి అర్థం లేని కార్యక్రమాలు దయచేసి వెంటనే ఆపండి’ అంటూ జనసేన నేతలకు సూచించారు. ‘నాగేశ్వర్.. మీకు అండగా మేం ఉన్నాం. కీప్ అప్ ది గుడ్ వర్క్’ అంటూ మద్దతు తెలిపారు. -
మరో వివాదంలో సీఎం విజయ్
-
తమిళనాట మళ్లీ గీతాలాపన వివాదం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ ‘గీతాలాపన’ వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం గురువారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార ఉత్సవంలో అధికారిక గీతాల ఆలపన క్రమం తీవ్ర దుమారానికి దారితీసింది. సంప్రదాయకంగా పాడే ‘తమిళ్ తాయ్ వాజ్తు’ (తమిళ మాత వందనం)కు ముందే ‘వందేమాతరం’ ఆలపించడంపై ప్రతిపక్షాలు మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నాయి. ఇటు తమిళ అస్తిత్వం, అటు జాతీయ ప్రొటోకాల్ మధ్య నడుస్తున్న ఈ రాజకీయ యుద్ధం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.విజయ్ సర్కార్‌పై డీఎంకే, సీపీఐ ఆగ్రహంతాజా మంత్రివర్గ విస్తరణలో భాగంగా 23 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ కార్యక్రమంలో ‘వందేమాతరం’ మొదటి స్థానంలో, జాతీయ గీతం ‘జనగణమన’ రెండో స్థానంలో ఆలపించగా, ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను మూడో స్థానానికి పరిమితం చేశారు. దీనిపై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తీవ్రంగా మండిపడింది. తమిళ గుర్తింపును, సంస్కృతిని కాపాడటంలో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) విఫలమైందని డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై విమర్శించారు. అటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ గీతానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రస్తుత మార్పు గత సంప్రదాయాలను ఉల్లంఘించడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ డిమాండ్ చేశారు. రాజ్‌భవన్ ఆదేశాల మేరకే ఈ తప్పు జరిగిందని ఆయన ఆరోపించారు.కౌంటర్ ఇచ్చిన బీజేపీ: అది ‘నేషనల్ ప్రొటోకాల్’ప్రతిపక్షాల విమర్శలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంతే తీవ్రంగా స్పందించింది. ప్రమాణ స్వీకార ఉత్సవాల్లో ఇతర గీతాల కంటే ముందు ‘వందేమాతరం’ ఆలపించడం అనేది ‘నేషనల్ ప్రొటోకాల్’ (జాతీయ నియమావళి) అని బీజేపీ నాయకురాలు తమిళసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ‘తమిళ మాతను ఎవరూ అవమానించలేరు, తమిళ మాత ఎల్లప్పుడూ జాతీయవాదాన్ని గౌరవిస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. డీఎంకే దేశ వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతోందని, అందుకే ప్రజలు వారికి గతంలోనే బుద్ధి చెప్పారని ఆమె కౌంటర్ ఇచ్చారు.కేరళలోనూ ఇదే సెగ.. దేశవ్యాప్తంగా చర్చఈ వివాదం కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు, పొరుగు రాష్ట్రమైన కేరళలోనూ ఇటువంటి చర్చకు దారితీసింది. అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేబినెట్ ప్రమాణ స్వీకారంలో ‘వందేమాతరం’ పూర్తి వెర్షన్‌ను ఆలపించడంపై సీపీఐ(ఎం) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక బహుళత్వ సమాజంలో ఇది సరైనది కాదని, ఆ గీతంలోని కొన్ని భాగాలు మతపరమైన అంశాలతో కూడి ఉన్నాయని లెఫ్ట్ పార్టీలు ఆరోపించాయి. అయితే లెఫ్ట్ పార్టీల వ్యాఖ్యలు జాతీయ గీతాన్ని అవమానించడమేనని, తుష్టీకరణ రాజకీయాల్లో భాగమేనని కేరళ బీజేపీ నేతలు తిప్పికొట్టారు. మొత్తానికి ‘వందేమాతరం’ చుట్టూ ముసురుకున్న ఈ వివాదం దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. -
నేను పోరాటం కొనసాగిస్తా: వినేశ్
గోండా (ఉత్తరప్రదేశ్): ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మధ్య వివాదం మరింత తీవ్రమైంది. షోకాజ్ నోటీసుకు సమాధానమిచ్చే వరకు టోర్నిలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వరాదని డబ్ల్యూఎఫ్ఐ నిర్ణయం తీసుకోగా... తాను పారిపోనని, పోరాటం కొనసాగిస్తానని వినేశ్ స్పష్టం చేసింది. నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నిలో భాగంగా మంగళవారం మహిళల విభాగంలో బౌట్లు జరగనున్న నేపథ్యంలో వినేశ్ టోర్నీ జరిగే వేదిక వద్దకు వచ్చింది. టోర్నిలో పాల్గొనడంపై ఆమె ఇచ్చిన సంబంధిత డాక్యుమెంట్లను తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. సమీపంలో ఆమె ప్రాక్టీస్ చేసుకునేందుకు ప్రయత్నించగా, వామప్ ఏరియా గదికి తాళం కూడా వేశారు. తాను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టకుండా డబ్ల్యూఎఫ్ఐ ప్రయత్నిస్తోందని, రిటైర్ కావాలనే విధంగా కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని వినేశ్ ఆరోపించింది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గనని ఆమె స్పష్టం చేసింది. -
"సర్కే చునార్" వివాదం : సంజయ్ దత్ క్షమాపణలు, దిద్దుబాటు చర్య
ఢిల్లీ, సాక్షి: "సర్కే చునార్ తేరీ సర్కే"పాటలో అశ్లీలత, మహిళలను అసభ్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై వచ్చిన ఆందోళనలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం నటుడు సంజయ్ దత్ జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు జయ రహత్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషన్‌కు లిఖితపూర్వక క్షమాపణను సమర్పించారు. ఈ విషంయంపై విచారం వ్యక్తం చేస్తూ, సృజనాత్మక కంటెంట్‌లో మహిళలకు బాధ్యతా యుతమైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను అంగీకరిస్తానని హామీ ఇచ్చారని మహిళా కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయంఒక దిద్దుబాటు చర్యగా, సామాజిక సంక్షేమానికి , మహిళా సాధికారతకు సానుకూలంగా దోహదపడే దిశగా, సంజయ్ దత్ 50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయం చేయడానికి అంగీకరించారు. ఇకపై, సినిమాలు మరియు సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులలో మహిళలు ,పిల్లలకు గౌరవప్రదమైన మరియు సముచితమైన ప్రాతినిధ్యం ఉండేలా చూసేందుకు, తప్పనిసరి చట్టపరమైన నిబంధనలను చేర్చుతానని సంజయ్ దత్ కమిషన్‌కు హామీ ఇచ్చారు.ఈ విచారణ సందర్భంగా ఎన్సీడబ్ల్యూ అనేక అంశాలపై ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈ వివాదానికి సంబంధించి ఏప్రిల్ 6న దర్శకుడు, కిరణ్ కుమార్ అలియాస్ ప్రేమ్, రచయిత రకీబ్ ఆలం , గౌతమ్ కె.ఎం. కెవిఎన్ ప్రొడక్షన్ ప్రతినిధులు కూడా ఎన్సీడబ్ల్యూ ముందు హాజరై క్షమాపణలు తెలిపారు. మరోవైపు నటి నోరా ఫతేహిని కూడా ఈరోజు కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, ఆమె ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నందున హాజరు కాలేకపోయారు. ఆమె మరో తేదీని కేటాయించమని కమిషన్‌ను కోరారు.కాగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ నటించిన సినిమాలోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట పెద్ద వివాదానికి దారితీసింది.ఈ పాటలోని సాహిత్యం, దృశ్యాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ దుమారం చెలరేగడంతో జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సినిమా యూనిట్‌ను ఆదేశించింది. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి ఈ సాంగ్‌ను తొలగించారు. అర్జున్ జన్య స్వరకల్పనలో, మంగ్లి పాడిన ఈ పాట తీవ్ర విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. -
ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై
-
అరుణాచల్ వివాదం: ‘డ్రాగన్’కు దిమ్మతిరిగే రిటర్న్ గిఫ్ట్
న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో ఎప్పుడూ ఏదో ఒక కవ్వింపు చర్యకు పాల్పడే చైనాకు నెట్టింట మనవారు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా తమ సొంత పేర్లు పెట్టుకుని ఆనందం పొందుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రయోగం వైరల్‌గా మారింది. డ్రాగన్ దేశం చేస్తున్న పనులకు కౌంటర్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చైనాలోని ప్రముఖ నగరాలకు అచ్చమైన మన భారతీయ పేర్లు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.అరుణాచల్ ప్రదేశ్‌ను తమ దేశంలోని జాంగ్నన్ ప్రాంతంగా పిలుచుకునే చైనా.. ఇటీవల అక్కడి 15 పర్వతాలు, ఐదు నివాస ప్రాంతాలు, నాలుగు కనుమలు, రెండు నదులు, ఒక సరస్సు సహా పలు ప్రాంతాలకు తమ భాషలో పేర్లు పెడుతూ ఓ జాబితాను విడుదల చేసింది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, ఇలాంటి తప్పుడు వాదనలతో వాస్తవాలను మార్చలేరని, చైనా కుటిల యత్నాలను తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది.ఈ నేపధ్యంలో చైనా నగరాలకు భారతీయ పేర్లు సూచించమని ఏఐని అడగగా, అది ఇచ్చిన సమాధానాలు ఆశ్యర్యపోయేలా ఉన్నాయి. రాజధాని బీజింగ్ పేరును మన ఆధ్యాత్మిక నగరం బైజ్నాథ్‌గా మార్చేసింది. షాంఘై పేరును శంకరుని పేరు గుర్తు తెచ్చేలా శంఖై గా, గ్వాంగ్జౌను గంగా జ్యోతిగా, షెన్జెన్ను శాంతివనంగా మార్చింది. చెంగ్డూను చంద్రాపూర్ అని, జియాన్‌ను మహాశివుడిని గుర్తు చేసేలా శివాన్ అని, నాన్జింగ్ను నందిగ్రామ్ అని, హాంగ్జౌను హరిధామ్ అని, టియాంజిన్‌ను తేజస్ నగర్ అని, ఇక వుహాన్‌కు విశ్వనగర్ అని పేరు పెట్టింది.2017లో దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన తర్వాత మొదలైన ఈ కవ్వింపు చర్యలను 2021, 2023, 2024లో కూడా చైనా కొనసాగించింది. గత ఏడాదీ 27 ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా తిప్పికొట్టింది. 2020 గాల్వన్ లోయ ఘర్షణ తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీఓ సమ్మిట్ కోసం చైనా వెళ్లి అధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశం కావడం రెండు దేశాల మధ్య కాస్త సానుకూల వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఇలాంటి తరుణంలో చైనా మళ్లీ పాత పద్ధతిలోనే రెచ్చగొట్టే చర్యలకు దిగడం, దానికి మన నెటిజన్లు ఏఐ ద్వారా ఇలా ఫన్నీగా బదులివ్వడం ఆసక్తికరంగా మారింది.ఇది కూడా చదవండి: దేశంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. అలర్ట్ జారీ -
టీటీడీ బోర్డులో అన్యమతస్తులు
-
భార్యతో విడాకులు.. త్రిషపై రూమర్స్.. విజయ్ షాకింగ్ కామెంట్స్
-
కేడీ సాంగ్ వివాదం.. నాకు అర్థం కాదన్న డైరెక్టర్..!
కన్నడలో తెరకెక్కుతోన్న లేటేస్ట్ మూవీ కేడీ ది డెవిల్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రేంజ్లో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో ధ్రువ్ సర్జా హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి సర్కే చునార్ తేరీ సర్కే అనే సాంగ్‌ను విడుదల చేశారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ పాటను రిలీజ్ చేశారు. కానీ ఊహించని విధంగా హిందీ లిరిక్స్ వర్షన్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆ తర్వాత వెంటనే హిందీ వర్షన్ సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు.ఈ నేపథ్యంలో హిందీ లిరిక్స్ వివాదానికి దారి తీయడంపై డైరెక్టర్ ప్రేమ్ స్పందించారు. హిందీ భాషపై తనకు పట్టులేదని.. ఆ లిరిక్స్ అర్థం కూడా తనకు తెలియదన్నారు. నేను కన్నడలో మాత్రమే లిరిక్స్ రాశానని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. ఒకవైపు యుద్ధం.. మరోవైపు గ్యాస్ కొరత ఉందని.. వాటిపై చర్చించాలని అన్నారు. అంతేకానీ ఈ పాటను వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆ పాట కేవలం ఒక పార్టీలో భాగంగా సరదా కోసమే ఉంచామని వెల్లడించారు. కాగా.. ఈ మూవీలో నోరా ఫతేహి, సంజయ్‌దత్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానుంది. -
సీఎం ఇంటర్వ్యూకి రూ.11 లక్షలా?.. వివాదంలో హీరో మోహన్‌లాల్?
తిరువనంతపురం: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ల మధ్య సాగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కేరళ రాజకీయాల్లో రచ్చ చేస్తోంది. ‘కందుం మిండియుం ఇరువర్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ. 11.21 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించడం తీవ్ర చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ చర్చ అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టింది.ఆర్టీఐ ద్వారా వెలుగులోకి..తిరువల్లకు చెందిన రిజో వల్లంకుళం అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వేసిన దరఖాస్తుతో ఈ ఖర్చుల వివరాలు బయటపడ్డాయి. ఈ ఇంటర్వ్యూ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 11,21,000 ఖర్చు చేసినట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ వెల్లడించింది.రెండు రోజుల షూటింగ్ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘క్లిఫ్ హౌస్’లో రెండు రోజుల పాటు ఈ ఇంటర్వ్యూ చిత్రీకరణ జరిగింది. ప్రముఖ సినీ దర్శకుడు టీకే రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం దీనిని తెరకెక్కించింది. పినరయి విజయన్ రాజకీయ ప్రస్థానం, ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలతో రూపొందిన ఈ ఇంటర్వ్యూ టీజర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో తిరువనంతపురంలో జరిగిన ఒక భేటీలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రతిపాదన చేయగా, మోహన్‌లాల్ వెంటనే అంగీకరించినట్లు సమాచారం.విపక్షాల ధ్వజంప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పినరయి విజయన్ తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. కాగా మోహన్‌లాల్ 2011 ఎన్నికల సమయంలోనూ అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కూడా ఇలాగే ఇంటర్వ్యూ చేశారు. అయితేఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ వివాదాస్పద ఇంటర్వ్యూ కేరళ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్! -
సిగ్గుచేటు.. గరికపాటి గుడ్డు వివాదం
-
బూతు పాట : సంజయ్ దత్, నోరాఫతేహి, టీమ్‌కు మరో షాక్
సాక్షి, ఢిల్లీ: 'కేడీ: ది డెవిల్'(KD: The Devil) పాట వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అశ్లీల సాహిత్యం అంటూ రేగిన వివాదంపై జాతీయ మహిళా కమిషన్ (NCW) మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది.ఎన్సీడబ్ల్యూ సమన్లుఈ పాటలో అశ్లీలత ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్సీడబ్ల్యూ సమన్లు జారీ చేసింది. ఈ చిత్రం బృందంతోపాటు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, నోరా ఫతేహికి జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది.ఈ పాటలో అభ్యంతరకరమైన ,అశ్లీల సాహిత్యం, అలాగే వీక్షకులను, ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన అనుచితమైన అవాంఛనీయ చిత్రాలు ఉన్నాయని ఆరోపిస్తూ వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్సీడబ్ల్యూ ఈ చర్య తీసుకుంది. పాట రచయితలు, నిర్మాతల నుండి వివరణ కోరింది.ఈ సాంగ్ విడుదల కాగానే అటు పరిశ్రమ వర్గాల నుంచి, ఇటు సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ పాటలోని సాహిత్యం, కొరియోగ్రఫీ చాలా అసభ్యకరంగా ఉన్నాయని, మహిళలను కించపరిచేలా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పిల్లలపై ఇలాంటి కంటెంట్ ప్రతికూల ప్రభావం చూపుతుందని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు. అటు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించారు. అశ్లీలతలో బాలీవుడ్ అన్ని హద్దులు దాటేసిందని తీవ్రంగా మండిపడ్డారు.మరోవైపు, చిత్ర దర్శకుడి భార్య రక్షిత ఈ పాటను సమర్థించారు. గతంలో కూడా ఇలాంటి మాస్ సాంగ్స్ వచ్చాయని, ఇది కేవలం సినిమా సృజనాత్మకతలో భాగమేనని దీన్ని సమర్ధించుకున్నారు.ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారిఈ విషయంపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. వినోద రంగంలో సృజనాత్మక స్వేచ్ఛ ,బాధ్యతల పరిమితులపై చర్చను రేకెత్తించింది.ఈ పాటలు భారతీయ సినిమాలో దీర్ఘకాలంగా ఉన్న ధోరణులలో భాగమని కొందరు వాదిస్తుండగా, హానికరమైన లేదా అనుచితమైన కంటెంట్‌ను నిరోధించడానికి మరింత కఠినమైన నిబంధనలు అవసరమని మరికొందరు భావిస్తున్నారు. మరోవైపు ఎన్సీడబ్ల్యూ (NCW) చర్య వల్ల వినోద రంగంలో కంటెంట్ నియంత్రణపై విస్తృత పరిణామాలు చోటుచేసుకోవచ్చని మరికొందరి అంచనా. -
రాజేంద్రప్రసాద్ క్షమాపణలు.. విశాల్ కృతజ్ఞతలు
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కి కోలీవుడ్ నటుడు విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో ఎంజీఆర్‌ని అభిమానించేవారు, అలాగే ఆయనతో పనిచేసిన చాలా మంది బాధపడ్డారు. ఈ విషయంపై సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ వివరణ కోరింది.ఎంజీఆర్‌పై వ్యాఖ్యల పట్ల చింతిస్తూ రాజేంద్రప్రసాద్ హృదయపూర్వక క్షమాపణ కోరారు. దీనికి నేను రాజేంద్ర ప్రసాద్ గారిని అభినందిస్తున్నానని విశాల్ చెప్పారు. ఇది రాజేంద్రప్రసాద్ నిజమైన గొప్పతనం, వినయానికి నిదర్శనమని పేర్కొన్నారు.అంతకు ముందు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానన్నాడు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు.ఏం జరిగిందంటే..కాగా ఇటీవల ఓ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ కాస్త నోరు జారాడు. తెలుగు నటుడు కాంతారావును పొగిడే క్రమంలో ఎంజీఆర్‌పై చులకన వ్యాఖ్యలు చేశాడు. కాంతారావును చూసి ఎంజీఆర్ ప్యాంటు తడుపుకునేవాడని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్ సెలబ్రిటీలు విశాల్, నాజర్ మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా ఉన్నాయన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. -
జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా? సుప్రీం కోర్టు ఆగ్రహం
-
నల్లగున్నవ్.. నీకెందుకు చదువు..?
మెదక్ కలెక్టరేట్: ‘నల్లగున్నవు నీకు చదువెందుకు.. టీసీ ఇస్తాం వెళ్లిపో’.. అంటూ తమ కుమార్తెను పాఠశాలకు రానివ్వడం లేదని తల్లిదండ్రులు గురువారం కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు మొర పెట్టుకున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్‌కు చెందిన బాధిత విద్యార్థిని మనస్విని, ఆమె తల్లిదండ్రులు ఎల్లం, జ్యోతి విలేకరులకు తెలిపిన వివరాలివి. మెదక్‌లోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ (టీజీఆర్ఎస్)లో మనస్విని 7వ తరగతి చదువుతోంది. గత నెల 20న కడుపునొప్పి రావడంతో.. ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించి విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా కిడ్నీలో స్వల్పంగా రాయి ఉన్నట్లు తేలింది. నీళ్లు తాగితే సరిపోతుందని వైద్యులు చెప్పడంతో పాఠశాలలో చేర్పించారు. ఈ క్రమంలో మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు వెళ్లి ఏఎన్ఎం ఆశాజ్యోతిని సంప్రదించగా దురుసుగా ప్రవర్తించింది. ‘ఏ అడివినుంచి వచ్చిండ్రు మీరు... ఆ పిల్లకు టీసీ ఇచ్చి పంపిస్తాం’.. అని అవమానించినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం పాపకు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇటీవల పాఠశాలలో చేర్చుకోవాలని వెళ్తే ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బంది నోటికొచ్చినట్లు మాట్లాడి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీలో రాయి తగ్గినట్లు డాక్టర్ సర్టిఫికెట్ తెస్తేనే చేర్చుకుంటామని ప్రిన్సిపాల్ పాఠశాలలోకి రానివ్వడం లేదని వాపోయారు. ‘నల్లగా ఉన్న నీకు చదువెందుకు?.. టీసీ ఇచ్చి పంపిస్తాం.. వెళ్లిపో’.. అని నర్స్ ఆశాజ్యోతి, ప్రిన్సిపాల్ తారాసింగ్ పాఠశాలలోకి రానివ్వడం లేదని విద్యార్థిని బోరున విలపించింది. స్పందించిన కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రిన్సిపాల్ తారాసింగ్ వివరణ తీసుకొని విద్యార్థిని మనస్వినిని పాఠశాలకు పంపించినట్లు సమాచారం. -
లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!
మహా కుంభమేళా 2025లో పూసల దండలు అమ్ముకుంటూ ఫ్యామస్ అయిన మోనాలీసా భోంస్లే (Monalisa Bhosle) మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రియుడు నటుడు ఫర్మాన్ ఖాన్ పెళ్లాడి ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే ఈ పెళ్లి 'లవ్ జిహాద్' నెట్టింట తీవ్ర దుమారం రేగింది. దీనిపై ఈ జంట వివరణ ఇచ్చారు. గురువారం (మార్చి 12, 2026) తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ పెళ్లిపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు.తాము తమ మతాలు మార్చుకోలేదని మోనాలీసా స్పష్టం చేసింది. తాను హిందువుగా, తన భర్త ముస్లింగానే కొనసాగుతామని మోనాలీసా వివరించింది. అలాగే 'లవ్ జిహాద్' ఆరోపణలను కూడా ఆమె తోసిపుచ్చింది. ఈ వివాహం తన సొంత నిర్ణయమని తేల్చి చెప్పింది. తన తండ్రి తనతో పాటు కేరళకు వచ్చినప్పటికీ, ఈ పెళ్లి పట్ల ఆయన ఇంకా అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే ఆయనను ఒప్పించు కోగలననే ధీమా వ్యక్తం చేసింది. తన అత్త కొడుకుతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారని, కానీ తనకు ఇష్టం లేక ఫర్మాన్ ఖాన్‌ను ఎంచుకున్నానని ఆమె చెప్పారు.తల్లి దండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన తమ మతాంతర వివాహానికి సంబంధించి విమర్శలపై స్పష్టత ఇస్తూ "ప్రేమలో మత మార్పిడి అవసరం లేదు" అని ఫర్మాన్ ఖాన్ ( Farman Khan)పేర్కొన్నాడు.. అలాగే మోనాలీసా మైనర్ అంటూ వస్తున్న వార్తలను ఫర్మాన్ ఖాన్ ఖండించారు. ఆమె ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను మీడియాకు చూపించారు. మోనాలిసా కోరుకున్న విధంగా ఆచారాలను అనుసరించడానికి తాను అంగీకరించాననీ, ఎందుకంటే ఆమె ఆనందాన్నే తన ఆనందమని చెప్పు కొచ్చాడు. ఈ సందర్భంగా తమకు కేరళ ప్రజల మద్దతు లభించడం సంతోషమని,మోనాలీసాకు ఇష్టమైతే అక్కడే స్థిరపడతా మన్నాడు.ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాకు చెందిన ఖాన్, ఇండోర్ నివాసి మోనాలీసా వివాహం కేరళలోని ఒక ఆలయంలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. కేరళ ప్రభుత్వానికి చెందిన K-SMART యాప్ ద్వారా వీరి వివాహం చట్టబద్ధంగా నమోదైంది. ఈ వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ లాంటి ప్రముఖ రాజకీయ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా 'నాగమ్మ' అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇందులో ఫర్మాన్ ఖాన్ విలన్‌గా, మోనాలీసా హీరోయిన్గా నటిస్తున్నారు. -
నెయ్యి ధరల పెంపు.. టీటీడీ నిధుల దోపిడీ?
-
‘ఆందోళన వద్దు.. నేను చూసుకుంటా’: విజయ్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతూ, ఇటీవలే రాజకీయ అరంగేట్రం చేసిన ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా తన వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ జరుగుతున్న ప్రచారంపై ఆయన తొలిసారిగా స్పందించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహాబలిపురంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన అభిమానులను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘నా కారణంగా మీరు బాధపడుతుంటే అది నన్ను మరింత కలచివేస్తోంది.. ఈ సమస్యలను నేను పరిష్కరించుకుంటాను, మీరేమీ ఆందోళన చెందవద్దు’ అంటూ భరోసా ఇచ్చారు. గత కొన్ని నెలలుగా విజయ్, ఆయన భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు కోలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాటి సభలో విజయ్ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.‘ఇటీవల కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిపై పోరాడుతూ మీరు పడుతున్న బాధను నేను గమనిస్తున్నాను. మీ మనోవేదన చూస్తుంటే నాకూ బాధగా ఉంది. నా వ్యక్తిగత విషయాలను నేనే చక్కదిద్దుకుంటాను. మీరు అధైర్యపడకండి, దేనికీ భయపడాల్సిన అవసరం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, తనను ప్రాణప్రదంగా భావించే కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయవద్దని ఆయన కోరారు.మరోవైపు విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని కాసువారినా డ్రైవ్‌లో ఉన్న నివాసంలోనే తనను కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోర్టును కోరినట్లు సమాచారం. తాను బ్రిటీష్ పౌరురాలినని, భారత్‌లో తనకు మరో నివాసం లేదని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఈ వ్యవహారంలో విజయ్‌పై ఆమె చేసిన కొన్ని ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, అందుకే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నామని ఆమె ఆరోపించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది.వ్యక్తిగత వివాదాలను పక్కన పెడితే, రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విజయ్ వరాల జల్లు కురిపించారు. టీవీకే అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలను ఆయన ప్రకటించారు:మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున ఆర్థిక సాయం.పేద యువతుల వివాహానికి ఒక తులం బంగారం, పట్టుచీర కానుక.ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం.రాజకీయంగా తన గ్రాఫ్‌ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్న విజయ్‌కు ఈ వ్యక్తిగత వివాదాలు ఒక పరీక్షగా మారాయి. అయితే, తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు ముడిపెట్టవద్దని, తనపై నమ్మకం ఉంచాలని ఆయన కోరడం ద్వారా కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. 2026 ఎన్నికల కురుక్షేత్రంలో ఈ పరిణామాలు విజయ్ రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే.. -
‘శబరిమల’ సెగ ఉధృతం.. పినరయి సర్కారుకు షాక్
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరానికి గడువు సమీపిస్తున్న వేళ, అధికార ఎల్డీఎఫ్ (ఎల్డీఎఫ్)కూటమికి పలు వివాదాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో మరోమారు పాగా వేయాలని భావిస్తున్న పినరయి విజయన్ ప్రభుత్వానికి శబరిమల వివాదం, బంగారం చోరీ ఉదంతాలు పెద్ద అడ్డంకులుగా మారనున్నాయని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.ప్రముఖ వార్తా సంస్థ 'మాతృభూమి-కోర్' నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది స్టేట్’ సర్వేలో వెల్లడైన గణాంకాలు అధికార కూటమిలో గుబులు రేపుతున్నాయి. సుమారు 28,432 మంది ఓటర్ల అభిప్రాయాలను క్రోడీకరించి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ సంప్రదాయాల వివాదం, దౌత్య కార్యాలయం ద్వారా జరిగిన బంగారం చోరీ కేసులు నేటికీ ఓటర్లపై బలంగా ముద్ర వేశాయి. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికంగా 52.09 శాతం మంది.. ఈ అంశాలు రాబోయే ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు.సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 11.33 శాతం మంది మాత్రమే వీటి ప్రభావం యూడీఎఫ్ (యూడీఎఫ్)పై ఉంటుందని భావిస్తుండగా, ఎన్డీఏకు నష్టం వాటిల్లుతుందని నమ్ముతున్న వారు కేవలం 1.31 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. పినరయి విజయన్ నేతృత్వంలోని రెండో విడత ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత కంటే, గత వివాదాల నీడ ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదాలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే స్థాయికి చేరాయంటున్నారు. సుమారు 19.24 శాతం మంది ఓటర్లు ఈ అంశాలు ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపబోవని అభిప్రాయపడినప్పటికీ, సగానికి పైగా జనం ప్రతికూలత వ్యక్తం చేయడం ఎల్డీఎఫ్ అగ్రనేతలను ఆందోళనకు గురిచేస్తోంది. మరో రెండు నెలల్లో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లోనే అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో, వివాదాలను అధిగమించి హ్యాట్రిక్ విజయం సాధించాలని ఎల్డీఎఫ్ తహతహలాడుతుంటే, ప్రజాభిప్రాయాన్ని తమ వైపు తిప్పుకోవాలని యూడీఎఫ్ శ్రమిస్తోంది.ఇది కూడా చదవండి: Nepal: ‘ఆర్ఎస్పీ’ ప్రభంజనం.. ప్రధానిగా ‘బాలెన్’? -
Watch Live: లడ్డూపై మండలిలో చర్చ ప్రారంభం
-
గరికపాటి వివాదం.. ఆంధ్రను తెలుగునాడుగా!
-
చర్చకు వచ్చే దమ్ము లేదు కానీ పిచ్చి మాటలు మాట్లాడుతారా..?
-
అవును నిజమే.. తప్పు ఒప్పుకున్న బాబు!
-
అన్వేష్ కు బిగ్ షాక్.. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ కు పోలీసుల లెటర్..
-
అసలేం జరిగిందంటే? తిరుమల వివాదంపై క్లారిటీ
-
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యలపై రగడ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యలపై రగడ నెలకొంది. ఉచిత ఆర్టీసీ బస్సులను ఇంకా పెంచుతామని వీహెచ్ తెలిపారు. దీంతో ఆయన మాట్లాడుతుండగా ఆటో కార్మికులు నిరసనకు దిగారు. ఆటో కార్మికులు ఏం చేస్తారంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ తీరుపై కార్మికులు మండిపడుతున్నారు. -
దొరికిపోయా.. కాపాడండి ప్లీజ్.. లడ్డూపై దుష్ప్రచారం.. సాయం కోసం ఢిల్లీకి..
-
దేశ రాజకీయాల్లో భూకంపం
భారత్–చైనా సరిహద్దులో 2020లో జరిగిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఓ ప్రశ్న దేశాన్ని కుదిపేస్తోంది. యుద్ధం అంచున నిలిచిన వేళ సైన్యానికి రాజకీయ ఆదేశాలొచ్చాయా, లేదా? ఈ ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారిన ఒక పుస్తకం ప్రచురణ కాకముందే పార్లమెంటును కుదిపేసింది. భారత ఆర్మీ మాజీ ఛీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం (Four Stars of Destiny) అధికారికంగా ఇంకా ప్రచురణ కాలేదు. కానీ, ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు ‘క్యారవాన్’ మ్యాగజైన్ ద్వారా బయటకు రావడంతో దేశ రాజకీయాల్లో భూకంపం మొదలైంది. 2020 జూన్ నాటి సంగతి. గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఆ తర్వాత తూర్పు లద్దాఖ్ మొత్తం ఉద్రిక్తతల్లో మునిగిపోయింది. చైనా సైన్యం కైలాశ్ రేంజ్ వైపు కదలడం మొదలు పెట్టింది. ఇది కేవలం సరిహద్దు సమస్య కాదు; ఒక యుద్ధ ప్రకటన!2020 ఆగస్టు 31. రాత్రి సమయం. చైనా యుద్ధ ట్యాంకులు భారత స్థావరాలకు కిలోమీటర్ దూరంలో మోహరించాయి. భారత కమాండర్లు అప్రమత్తమై దాడిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ విధానపరంగా ఒక సమస్య వచ్చిపడింది. ఢిల్లీ నుండి ఎలాంటి ఆదేశాలూ లేవు. స్పష్టమైన ఆదేశాలు లేకుండా కాల్పులు చేయకూడదన్న నిబంధనలున్నాయి. అప్పటి ఆర్మీ చీఫ్ నరవణె రక్షణ మంత్రి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు, విదేశాంగ మంత్రి అందరికీ ఫోన్ చేసి ‘ఏం చేయాలి?’ అని అడిగారు. వెంటనే స్పందన రాలేదు. తరువాత రక్షణ శాఖ మంత్రి నుండి ఫోన్ వచ్చింది. రెండే రెండు క్లుప్త వాక్యాలు. ‘ప్రధానితో మాట్లాడాను... జో ఉచిత్ సమ్ఝో వో కరో’ (ఏది సరైనది అనుకుంటే అది చెయ్యండి). ఈ సూచన విని షాక్‌కు గురైనట్టు నరవణె రాసుకున్నారు. యుద్ధానికి సంబంధించిన ప్రాణప్రదమైన అంశం ఇది.ఇలాంటి ఉద్రిక్త సన్నివేశాలు 1971లో ఇందిరాగాంధీ హయాంలోనూ, 1999లో వాజ్‌పేయి హయాంలోనూ వచ్చాయి. వాళ్ళిద్దరూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నరవణె ఆ పుస్తకంలో చెప్పిందేమంటే ప్రధాని మోదీలో అలాంటి నిర్ణయాత్మక స్పష్టత కనిపించలేదూ అని! ప్రజాస్వామిక వ్యవస్థలో శాసన వ్యవస్థే నిర్ణయాలు తీసుకుంటుంది, దాన్ని సైన్యం పాటిస్తుంది. చైనా విషయంలో మోదీ తడబడి నట్టుగా నరవణె కథనం ద్వారా అర్థం అవుతోంది. సరిగ్గా ఈ అంశమే ప్రతిపక్షానికి ఆయుధంగా మారింది.జాతీయ భద్రత కారణంగా నరవణె పుస్తకాన్ని (Naravane Book) పరిశీలించాల్సి ఉందని రక్షణ శాఖ అంటున్నది. ఏడాదిన్నర గడిచినా సమీక్ష పూర్తి కాలేదు. ప్రచురణకు అనుమతి రాలేదు. జాతీయ భద్రత కన్నా తమకు ఎదురయ్యే రాజకీయ ఇబ్బందుల గురించే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా జంకుతున్నదనే విమర్శలూ ఉన్నాయి. ఒక ఆర్మీ మాజీ ఛీఫ్ తన యుద్ధ అనుభవాలను ప్రజలతో పంచుకోకూడదా? ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో నరవణె పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నించి నపుడు అధికార పక్షాలు అడ్డుకున్నాయి.చదవండి: నరవణె పుస్తకంపై పెంగ్విన్ కీలక ప్రకటన‘అగ్నివీర్’, ‘అగ్నిపథ్’ పథకాల మీద కూడా నరవణె అసంతృప్తిని వ్యక్తం చేశారు. శాశ్వత ఉద్యోగ భద్రత లేదనీ, జీతాలు కూడా తక్కువనీ గుర్తు చేశారు. భారత సైన్యం భవిష్యత్తు మీద ఆందోళన వ్యక్తం చేశారు. క్యారవాన్ పత్రిక (caravan magazine) ఆ పుస్తకంలోని కొన్ని అంశాలతో ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. మిగిలిన పుస్తకంలో ఇతర సందరాల్లో మోదీజీ నాయకత్వాన్ని నరవణె పొగిడి ఉండవచ్చు. మొత్తం పుస్తకం అందుబాటులోనికి వస్తేగానీ అంతిమ నిర్ణయం చెప్పలేము.- డానీ వ్యాసకర్త రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
మా వాడు మాట్లాడింది రెండు, మూడు బూతులే..! కానీ మీరు చేస్తుందేంటి...
-
టీడీపీ హయాంలోనే తిరుమల నెయ్యిలో కల్తీ!
-
కొవ్వు లేదని ఫ్రస్ట్రేషన్ తో మరో కుట్రకు ప్లాన్
-
EVM గోల్ మాల్ నుంచి డైవర్షన్ కోసమే
-
బాధితురాలి సాక్ష్యాలలో చంద్రబాబు పేరు! పారిపోయిన పవన్
-
మదర్ డెయిరీలో మరో ముసలం.. ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి రాజీనామా?
సాక్షి, నల్గొండ జిల్లా: మదర్ డెయిరీలో మరో ముసలం పుట్టింది. జనవరి 9 తేదీన చైర్మన్‌గా మందడి ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 14 రోజుల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. గతంలో మదర్ డైరీ చైర్మన్‌గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఉన్నారు. మధుసూదన్ రెడ్డి రాజీనామాతో ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రభాకర్ రెడ్డి రాజీనామా చర్చనీయాంశంగా మారింది.తనను చైర్మన్ చేస్తే రూ.12 కోట్ల పాల బిల్లులు చెల్లిస్తానంటూ ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారని.. చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మూడు కోట్లు ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, 14 రోజుల్లోనే ప్రభాకర్ రెడ్డి రాజీనామా వెనుక ఓ ప్రజాప్రతినిధి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఒత్తిడితోనే రాజీనామా చేసినట్లు ప్రచారమవుతోంది. ప్రస్తుతం మదర్ డెయిరీ రూ. 35 కోట్ల అప్పుల్లో మదర్ డెయిరీ ఉండగా.. పలువురి సొంత రాజకీయ క్రీడలో మదర్ డెయిరీని కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్నారనే ఆరోపణలుర వ్యక్తమవుతున్నాయి. -
అవిముక్తేశ్వరానందకు అనూహ్య మద్దతు
ప్రయాగ్‌రాజ్ మాఘమేళా ఎపిసోడ్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్యోతిర్మఠ శంకరాచార్యుడు స్వామి అవిముక్తేశ్వరానందను పోలీసులు పవిత్ర స్నానం చేయనివ్వకుండా అడ్డుకున్న సంగతి దుమారం రేపిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ విషయంలో యోగి సర్కార్‌తో అవిముక్తేశ్వరానంద ఓపెన్ చాలెంజ్‌కు దిగారు. ఈ తరుణంలో ఆయనకు అనూహ్య మద్దతు లభించింది.కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అవిముక్తేశ్వరానందను ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తోంది. అయోధ్యలో నిర్మాణం పూర్తికాకుండానే ఆలయాన్ని ప్రతిష్టించడం తప్పని ఆయన అన్నారు. మహా కుంభమేళా నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో గంగా నదిలో మృతదేహాలు తేలియాడడంపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆయన్ని యూపీ బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అని కాంగ్రెస్ అంటోంది.చాలామంది బీజేపీని కేవలం మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీగా భావిస్తారు. కానీ ఇప్పుడది హిందూ మతానని వదలడం లేదు. ఒక హిందూ సన్యాసినిని అవమానిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కారణంగా.. శంకరాచార్యుడు మొట్టమొదటిసారి పవిత్ర స్నానానికి దూరంగా ఉన్నారు. మొఘలులు, బ్రిటీషర్ల కాలంలోనూ ఇలా జరగలేదు. హిందువుల రక్షకులమని చెప్పుకునే ప్రభుత్వం ఇలాంటి పని చేయడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు. అవిముక్తేశ్వరానంద కంటే మోహన్ భగవత్ గొప్పవారా?.. ఆయనకేమో జెడ్‌ప్లస్ సెక్యూరిటీ నడుమ పుణ్య స్నానాలు చేయించి.. ఈయన్నేమో అడ్డుకుంటారా?. ప్రధాని మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారాయన.తిట్టిన వ్యక్తే..అవిముక్తేశ్వరానంద గతంలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 2024లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం హిందువులకు వ్యతిరేకంగా ఉందని బీజేపీ మండిపడింది. ఆ సమయంలో అవిముక్తేశ్వరానంద ఆయనకు మద్దతు ప్రకటించారు. ఆయన ప్రసంగాన్ని వక్రీకరించారని, నిజానికి రాహుల్ “హిందూ మతం హింసను తిరస్కరిస్తుంది” అని స్పష్టంగా చెప్పారని తెలిపారు. అయితే..2025 మే నెలలో మనుస్మృతిని రాహుల్ గాంధీ అవమానించారని చెబుతూ.. హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో శంకరాచార్య మఠం నోటీసు ఇచ్చినా రాహుల్ స్పందించలేదని, క్షమాపణ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది.. జనవరి 16వ తేదీన హిందువులను దూషించిన రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిరంలో అడుగు పెట్టడానికి వీల్లేదని.. ఆయన వస్తే గనుక అడ్డుకోవాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును కోరారు. ఈలోపు.. ఆ పార్టీ అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు మద్దతు ప్రకటించడం గమనార్హం.అసలేం జరిగింది.. ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠానికి 46వ శంకరాచార్యుడు(స్వయం ప్రకటిత) స్వామి అవిముక్తేశ్వరానందను మాఘమాసి అమావాస్య సందర్భంగా ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమానికి తన అనుచర గణంతో రథంపై వచ్చారు. అయితే రథం దిగి నడుచుకుంటూ వెళ్లాలని అధికారులు అభ్యంతరాలు చెప్పారు. అలా మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానంగా మారింది. పోలీసులు సాధువుల మధ్య తోపులాట జరిగింది. ఆ గొడవలో రథాన్ని నదీ సంగమానికి దూరంగా తీసుకెళ్లారు. అలా అవిముక్తేశ్వరానంద పవిత్ర స్నానం చేయలేకపోయారు.ఆయనతో పాటు 200–300 మంది భక్తులు ఉన్నారని.. అనుమతులు లేవని.. భద్రతా సమస్యల దృష్ట్యా అడ్డుకోవాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చుకున్నాయి. అయితే ఇది శంకరాచార్యుడి హోదా వ్యక్తికి జరిగిన అవమానమంటూ అక్కడే శిబిరం ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుతున్నారాయన.అవిముక్తేశ్వరానందకు నోటీసులుజ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానందకు మాఘమేళ నిర్వాహకులు షాకిచ్చారు. నిజమైన శంకరాచార్యా అవునా కాదా అని 24 గంటల్లోగా నిరూపించుకోవాలని నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మాఘ మేళ వద్ద అవిముక్తేశ్వరానంద ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంపును ఓ అధికారి వెళ్లి నోటీసులు అందించారు.సుప్రీం కోర్టులో వివాదం..ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ శంకరాచార్య స్థానంపై దశాబ్దాలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. 1989 ఏప్రిల్ 8వ తేదీన స్వరూపానంద సరస్వతి తనకు తాను శంకరాచార్య అని ప్రకటించుకున్నారు. అయితే 1989 ఏప్రిల్ 15వ తేదీన ఆ పీఠానికి చెందిన వసుదేవానంద సరస్వతిని వారసుడిగా శతానంద ప్రకటించారు. దీంతో ఆ పీఠానికి ఇద్దరు పీఠాధిపతులు కొనసాగారు. 2022 సెప్టెంబర్‌లో స్వరూపానంద సరస్వతి పరమపదించారు. ఆ మరుసటి రోజే తానే శంకరాచార్య అంటూ అవిముక్తేశ్వరానంద ప్రకటించుకున్నారు. కానీ అదే ఏడాది అక్టోబర్‌లో ఆయనపై సుప్రీంకోర్టు బ్యాన్ విధించింది. తుది తీర్పు వెల్లడించే వరకు ఎవర్నీ శంకరాచార్యగా ప్రకటించరాదు అని, పట్టాభిషేకం కూడా నిర్వహించరాదని.. ఆ పోస్టును ఎవరూ ఆక్రమించరాదని కోర్టు స్పష్టం చేసింది.అయితే.. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మాఘమేళ క్యాంపు వద్ద శంకరాచార్య అంటూ అవిముక్తేశ్వరానంద బోర్డు పెట్టుకున్నారని.. అందుకే నోటీసులు ఇచ్చామని మాఘమేళ అధికారులు చెప్తున్నారు. -
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా డాక్టర్ భర్తను బండ బూతులు తిట్టారు. తాము కొనుగోలు చేసిన రూ.కోటి విలువైన భవనాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని ఆస్రాకంటి ఆసుపత్రి యాజమానులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, బంధువులే డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు.దీంతో మహిళా డాక్టర్ భర్త షరీఫ్‌కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. తనపైనే విమర్శలా అంటూ అసభ్యంగా మాట్లాడారు. మైనారిటీ దంపతులను అసభ్యంగా దూషించారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో వైరల్‌గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యే ఆడియోపై సర్వత్రా చర్చ జరుగుతోంది.కాగా, ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఆయనకు కేటాయించిన గన్‌మెన్ షేక్షావలిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం నగరంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ నిర్వాహకులను గన్‌మెన్ షేక్షావలి, ఎమ్మెల్యే అనుచరులు కలిసి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. డబ్బు ఇవ్వకపోవడంతో నిర్వాహకులపై దాడి చేసినట్లు సమాచారం. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే గన్‌మెన్‌తో పాటు కొంతమంది టీడీపీ నేతలు దాడి చేసినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. -
గ్రోక్‌ను చుట్టుముట్టిన న్యూడ్ ఫోటోల వివాదం
న్యూఢిల్లీ: xAI సంస్థ రూపొందించిన AI అసిస్టెంట్ గ్రోక్ ను న్యూడ్ ఫోటోల వివాదం చుట్టుముట్టింది. గ్రోక్‌ను ఆసరాగా చేసుకుని ఆకతాయిలు న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రముఖుల ఫోటోలను న్యూడ్‌గా మారుస్తూ ప్రస్తుత సమాజానికి సవాల్ విసురుతున్నారు. ప్రైవేటు వ్యక్లుల ఫోటోలు ఇచ్చి న్యూడ్ పిక్స్‌గా ఇమ్మంట ప్రామ్టింగ్ చేస్తున్నారు వీటిని సోషల్ మీడియలో వైరల్ చేస్తున్నారు. దాంతో అమాయిక మహిళలు, చిన్న పిల్లలు ఈ చర్యలకు బలైపోతున్నారు. దీనిపై కేంద్రానికి ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫిర్యాదు చేశారు. Grok అనేది ఎలన్ మస్క్ స్థాపించిన xAI సంస్థ రూపొందించిన AI అసిస్టెంట్. ఇది “truth-seeking AI”గా పిలవబడుతూ, రియల్‌టైమ్ సెర్చ్, రీజనింగ్, కోడింగ్, విజువల్ ప్రాసిసింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. దీన్ని తప్పుదోవలో ఉపయోగిస్తూ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. దీని ఫలితంగా AI వినియోగంలో నైతికత, భద్రత అంశాలపై చర్చకు కారణమైంది. -
గ్రూప్–1 వివాదంపై 22న తీర్పు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్‌పై సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లలో సీజే ధర్మాసనం వాదనలు ముగించింది. వచ్చే నెల 22న తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట్ శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు. గ్రూప్–1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని కమిషన్‌ను ఆదేశించారు. ఇది సాధ్యంకాని పక్షంలో మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థి అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, అభ్యర్థుల తరఫున దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘నిబంధనల ప్రకారమే పరీక్షలు జరిగాయి. మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకోలేదు. హాల్ టికెట్ల జారీ, పరీక్ష కేంద్రాల కేటాయింపు, నిర్వహణ, మూల్యాంకనం అంతా పకడ్బందీగా నిర్వహించారు. కాపీయింగ్ జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. పరీక్ష జరిగినప్పుడు కాకుండా.. ఫలితాల తర్వాత అర్హత సాధించని వారు పిటిషన్ వేయడం సరికాదు’అని చెప్పారు. రిట్ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘ప్రభుత్వ ఆమోదం లేకుండా ఉద్యోగాలను పెంచడం నిబంధనలకు విరుద్ధం. గతంలో ఏ పరీక్షకు ఇలా ప్రిలిమ్స్, మెయిన్స్‌కు రెండు హాల్‌టికెట్లు జారీ చేయలేదు. కేవలం నాలుగు సెంటర్ల నుంచే 160 మంది వరకు ఎంపికయ్యారు. మూల్యాంకనం కూడా తప్పులతడకగా సాగింది’అని పేర్కొన్నారు. డిప్యుటేషన్ పూర్తయ్యాక కొనసాగించే హక్కు రాష్ట్రాలకు లేదు: హైకోర్టుసాక్షి, హైదరాబాద్: ఆలిండియా సర్వీస్ కేడర్ ఉద్యోగుల డిప్యుటేషన్ గడువు ముగిశాక కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సర్వీస్ కొనసాగించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కేడర్ నిబంధనల ప్రకారమే ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ ఉంటుందని చెప్పింది. దీనిపై అధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. గడువు తీరిన తర్వాత కూడా తెలంగాణలో పనిచేసిన ఇద్దరు ఐపీఎస్‌ల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ క్యాట్ ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్ కాలపరిమితిని మించి విధులు నిర్వహించిన కాలానికి అన్ని ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ తమిళనాడు కేడర్‌కు చెందిన డి.కల్పననాయక్, మహేంద్రకుమార్ క్యాట్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ వారికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించింది. గడువుకు మించి పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోలేమన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించింది. -
హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)
-
ఎవరికీ భయపడను! శివాజీ మరో సంచలన వీడియో
-
శివాజీ చిల్లర వ్యాఖ్యలపై తెలంగాణా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఫైర్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు శివాజీ నటుడు హీరోయిన్ల దుస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వేదికపై శివాజీ మహిళలను అవమానించాడో అదే వేదికపై బే షరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలను అవమానించడంఫ్యాషన్ అయిపోయిందని వ్యాఖ్యానించిన సునీతా రావు, శివాజీ నోటి దురుసుతనంపై మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.మహిళల బట్టలు గురించి మాట్లాడటానికి మీరెవరు, పురుషుల దుస్తులు ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలని మహిళలు ఎక్కడైనా మాట్లాడారా అని సునీతా ప్రశ్నించారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం శివాజీకి అలవాటేనని విమర్శించారు. సనాతన ధర్మం అంటూ మహిళలపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న శివాజీకి బీజేపీ సంస్కృతి వంట పట్టినట్లు ఉంది అంటూ మండిపడ్డారు.కాగా దండోరా సినిమా ఈవెంట్లో శివాజీ మహిళలపై దుస్తులుపై నోరు పారేసుకున్నాడు. సభ్యత సంస్కారం మరిచి అసభ్య పదజాలంతో వ్యాఖ్యాలు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. గాయని చిన్మయి, నటి అనసూయ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోలు మంచు మనోజ్, కమల్ కామరాజు కూడా తీవ్రంగా స్పందించారు. వీరితోపాటు సోషల్ మీడియాలో శివాజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో , తప్పయింది క్షమించండి అంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు. మరోవైపు మహిళా కమిషన్కూడా శివాజీపై తీవ్రంగా స్పందించి నోటీసులు జారీ చేసింది.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
బంగారుకొండ.. మానుకొండ.. మరో వీడియో రిలీజ్ చేసిన కొలికపూడి
-
చెత్త కొండ అంటావా? సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలి
-
పచ్చముఠా.. పాపం బద్దల్
-
తిరుమల లడ్డూ ప్రసాదం.. SIT రిమాండ్ రిపోర్ట్.. ఎలాంటి కల్తీ జరగలేదు!
-
దడ పుట్టిస్తున్న ‘సర్’
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట బిహార్‌లో ప్రకంపనలు సృష్టించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ డజను రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల 4న మొదలైంది. వచ్చే నెల 4తో ముగిసే ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారి(బీఎల్ఓ) పాత్ర కీలకమైనది. ఓటర్ల ఇళ్లకు పోయి ఓటర్ నమోదు పత్రాలు అందించటం, వెనక్కి తీసుకోవటం, అవసరమైన పత్రాలు జతచేశారో లేదో చూడటం వారి బాధ్యత. ఫలానా వ్యక్తి అర్హుడైన ఓటరో కాదో ప్రాథమికంగా తేల్చేది వీరే. అదే వారి చావుకొస్తోంది.బిహార్‌కు భిన్నంగా ఈ ప్రక్రియ చాలా రాష్ట్రాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. మరణాలు, బలవన్మరణాలు, అస్వస్థులు కావటం, భయాందోళనలతో అప్పగించిన పని వదిలి అదృశ్యం కావటం వంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. బిహార్‌లో బీఎల్ఓలకు ఈ స్థాయిలో సమస్యలున్న దాఖలా లేదు. నిజానికి అక్కడ బీఎల్ఓలతోనే ఓటర్లకు సమస్యలెదురైన ఉదంతాలున్నాయి. బీఎల్ఓలకు వెరిఫికేషన్‌లో సహకరించేందుకు పార్టీలు తమ కార్యకర్తలను బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏ)గా నియమించుకునేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ) అవకాశమిచ్చింది. సహజంగానే వారు పరిష్కారంలో కాక సమస్యలో భాగమవుతున్నారు. ఓటర్ల ఎదుటే బీఎల్ఓలతో వాదులాటలకు దిగటం, బెదిరించటం చాలాచోట్ల కనబడే దృశ్యాలు.పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ తదితర చోట్ల బీఎల్ఓలు ‘సర్’ ప్రక్రియలో తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చేతికి ఎముక లేకుండా భారీ వాగ్దానాలు చేయటం, అధికారం వచ్చాక ఎగనామం పెట్టడం మన దేశంలో దశాబ్దాలుగా సాగిపోతున్న ఒక దుస్సంప్రదాయం. ఈ విషయంలో న్యాయ స్థానాలకెళ్లినా ఫలితం ఉండదు. కడుపు మండి నిలదీస్తే జైలుపాలు చేయటం, కార్య కర్తలను పంపించి దౌర్జన్యం చేయించటం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది.ఇంత జరుగుతున్నా, ఈవీఎంలు ఏమార్చి ఓట్లు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు మిన్నంటుతున్నా, ఎన్నికల సంఘం పట్టనట్టు వ్యవహరిస్తోంది. అయినా ఎన్నికల వ్యవస్థపై ఉండే అచంచల విశ్వాసమే ప్రజాస్వామ్యాన్ని ఈమాత్రంగానైనా బతికిస్తోంది. ఓటు పోతే జీవచ్ఛవంతో సమానమన్న అభిప్రాయం జనంలో ప్రబలంగా ఉంది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలపాలన్నా, ఆగ్రహావేశాలు వ్యక్తంచేయాలన్నా సామాన్యు లకు ఓటును మించిన ఆయుధం మరేదీ లేకపోవటం ఇందుకు కారణం కావచ్చు.బీఎల్ఓలు ఒత్తిడికి లోనవటం వెనక ఇతరేతర సమస్యలు కూడా ఉన్నాయి. గతంలో ఓటేసే రోజునే తమ ఓటు గల్లంతైందని తెలిసేది. కానీ ఇప్పుడలా కాదు. ఓటరు తన వివరాలతోపాటు అవసరమైన పత్రాలన్నీ అందజేసిన క్షణానే అది చూచాయగా తెలిసి పోతుంది. నెల రోజుల తర్వాత పేరుందో లేదో రూఢి అవుతుంది. లేకపోవటానికి గల కారణమేమిటో అందులో ప్రస్తావిస్తారు. ఆ చిరునామాలో ఓటరు లేడనో, మరణించా డనో, తగిన పత్రాలు అందించలేదనో వెల్లడిస్తారు.దానిపై మళ్లీ పంచాయతీ. నమోదు సమయంలో బీఎల్ఏల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఒకపక్క, వాటిని తట్టుకోలేక ఏదైనా చేస్తే ప్రభుత్వం నుంచి చర్యలు మరోపక్క వారిని బాధిస్తున్నాయి. బీఎల్ఓల్లో 90 శాతం టీచర్లే. గుజరాత్ వంటిచోట్ల సాయంత్రం వరకూ విద్యాబోధనలోనూ, అటుతర్వాత రాత్రి 9వరకూ ఫీల్డ్‌లోనూ తలమునకలు కావాలి. మళ్లీ ఇంటికొచ్చి సేకరించిన పత్రాలన్నీ డిజిటల్ ఫామ్‌లోకి మార్చి పంపాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు కాకపోతే పై అధికారుల హెచ్చరికలు. సారాంశంలో ఓటర్ మొదలుకొని అందరికందరూ పెత్తనం చలాయించే వారే. ఈసీకి ఇవి పట్టవు. ‘సబ్ ఠీక్ హై’ అంటోంది.గౌరవ ప్రదమైన జీవితం వెళ్లదీయదల్చుకున్నవారు ఉద్యోగాలు చేస్తారు. అందుకు జీతంతోపాటు గౌరవ మర్యాదలూ ఆశిస్తారు. కానీ అదనపు భారాలు మోపి, వెట్టి కార్మికుల కన్నా హీనంగా చూస్తూ, బెదిరింపులకు దిగటం వల్ల వారు సమాజంలో ఆత్మ గౌరవంతో బతకగలుగుతారా? పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారా? గర్భిణులనూ, 45 ఏళ్లు దాటినవారినీ, అంగవైకల్యం ఉన్నవారినీ ఈ బాధ్యతల నుంచి తప్పించాలని గుజరాత్లో ఒక ఉపాధ్యాయ సంఘం కోరినా ఫలితం లేకపోయిందట! ఈ ధోరణి సరికాదు. దీన్ని వెంటనే చక్కదిద్దటం ఈసీ, కేంద్రం బాధ్యత. -
తిరుమల ప్రసాదంపై కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన శివజ్యోతి
-
వరి పండిస్తే క్యాన్సర్ తప్పదు: చంద్రబాబు
-
టీడీపీ.. దళితుడి వైపా? ధనికుడి వైపా?
సాక్షి, విజయవాడ: టీడీపీ తిరువూరు పంచాయితీపై నివేదిక సిద్ధమైంది. ఇవాళ చంద్రబాబు టేబుల్ మీదకు తిరువూరు పంచాయితీ రిపోర్ట్ రానుంది. కేశినేని చిన్ని దందాల చిట్ట క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. ఎన్నికల్లో సీటు కోసం చిన్నికి రూ.5 కోట్లు ఇచ్చినట్లు లెక్కలిచ్చారు.తిరువూరులో గంజాయి, మద్యం, రేషన్, ఇసుక దందాలలో కేశినేని చిన్ని పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. పార్టీ పదవులు కేశినేని చిన్ని అమ్ముకున్నారని కమిటీకి కొలికపూడి ఫిర్యాదు చేశారు. కొలికపూడి ఆరోపణలపై కమిటీకి ఎంపీ కేశినేని చిన్ని వివరణ ఇచ్చారు. కొలికపూడి కోవర్టు అంటూ కేశినేని చిన్ని ఆరోపిస్తున్నారు. నేడు చంద్రబాబు దగ్గరకు కమిటీ నివేదిక వెళ్లనుంది. టీడీపీ దళితుడి వైపా? ధనికుడి వైపా..? అంటూ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయా లేక మీడియా డ్రామాతో ముగిస్తారా? అనే చర్చ జరుగుతోంది. -
కొండా సురేఖ ఎపిసోడ్ పై సీఎం రేవంత్..
-
కొండా సురేఖ, సుమంత్ ఎపిసోడ్ పై స్పందించిన కొండా మురళి
-
Deepika Padukone: హీరోలకేనా..మాకు ఉండదా.. 8 గంటలే..ఎక్కువ టైం ఇవ్వను
-
అందరూ మహానుభావులే.. మరి ఎవరి పేరు పెట్టాలి?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రశాంతతకు మారుపేరుగా.. పెన్షనర్స్ పేరడైజ్‌గా పేరొందిన కాకినాడలో శేషజీవితం గడపాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు అనుకుంటారు. అటువంటి కాకినాడ పేరు మార్పు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కూటమి సర్కార్ ఏర్పడిన ఏడాదిన్నర తరువాత జిల్లాలు, మండలాల పునరి్వభజన, ఊరు పేర్ల మార్పు అంటూ హడావుడి చేస్తోంది. ఈ క్రమంలో కాకినాడ జిల్లా పేరు మార్చాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. 500 ఏళ్ల చరిత్ర కలిగిన కాకినాడ మార్చాలనే ప్రతిపాదనపై విభిన్న వర్గాలు భిన్న రీతుల్లో స్పందిస్తున్నాయి. పేరు మార్పు అనే అంశం తెరపైకి వచ్చినదే తడవుగా అనేక మంది ప్రముఖుల పేర్లు కూడా చర్చకు వచ్చాయి. ఒకప్పటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడతో విడదీయరాని అనుబంధం ఉన్న మహానుభావులు ఎందరో ఉన్నారు. పేదల విద్యాభివృద్ధి కోసం రూ.కోట్ల విలువైన ఆస్తులను తృణప్రాయంగా, నిస్వార్థంగా, నిబద్ధతతో దానం చేసిన ప్రముఖులకు ఇక్కడ కొదవ లేదు. పిఠాపురం మహారాజా పిఠాపురం రాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహుదూర్. ఈయన దానం చేసిన వేల ఎకరాల్లో ఇప్పుడు అనేక పాఠశాలలు, కళాశాలలు, సత్రాలు నడుస్తున్నాయి. తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను ఆయన ప్రజల మేలు కోరి ఎంతో ఉదారంగా దానం చేశారు. మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ సమీపాన కోరంగి వద్ద బలహీనవర్గాల కుటుంబంలో జన్మించిన మల్లాడి సత్యలింగ నాయకర్ స్వశక్తితో కష్టపడి ఉన్నత స్థితికి చేరుకున్నారు. అమ్మ, నాన్న చనిపోతే మేనమామ వద్ద పెరిగిన నాయకర్ 12 ఏళ్ల వయస్సులో కోరంగిలోని ఓడ రేవులో పని చేస్తూండేవారు. అక్కడి నుంచి రంగూన్ వెళ్లి పని చేయడమే కాకుండా.. కూలీలను తీసుకువెళ్లేవారు. అనంతరం ఎగుమతి, దిగుమతుల కాంట్రాక్టులు చేశారు. పిల్లలు లేకపోవడంతో సుబ్రహ్మణ్య నాయకర్ను దత్తత తీసుకున్నారు. ధనవంతులు మాత్రమే చదువుకునే రోజులవి. రూపాయి జీతానికి ఒక అధికారి నెలంతా పని చేసే రోజుల్లో నాయకర్ రూ.8 లక్షలు సంపాదించి 1,800 ఎకరాలు కొనుగోలు చేసి ఎంఎస్ఎన్ చారిటీస్ సంస్థకు ఇచ్చి, ఈ ప్రాంతంలో విద్యాభ్యున్నతికి బాటలు వేశారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఆయన రాసిన మరణ శాసనంలో ‘నా వంశంలో ఎవరైనా ప్రాణాలతో లేకుంటే నా యావదాస్తిని ప్రభుత్వానికి అప్పగించేందుకు వీలు లేదు. అవసరమైతే స్థానిక సంస్థలకు అప్పగించాలి’ అని రాశారు. తన సేవలతో ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ఇంకా ఎందరో.. కాకినాడకు చెందిన మహర్షి బులుసు సాంబమూర్తి తనకున్న కోట్ల విలువైన యావదాస్తిని దేశ స్వాతంత్య్రం కోసం అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు ధారాదత్తం చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత జ్యోతుల సీతారామ్మూర్తి ముత్తాత జ్యోతుల వెంకయ్య అప్పట్లో విక్టోరియా మహారాణికి 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. కాకినాడలో ప్రస్తుతం కుళాయి చెరువు ఉన్న ప్రాంతం అదేనని చెబుతున్నారు. హిందూ శ్మశానం కోసం 100 ఎకరాలు దానంగా ఇచ్చిన విజ్జపురెడ్డి వంశీయులతో పాటు మూడు తరాల కిందట ముత్తా వంశీయులు, మంత్రిప్రగడ, పైండా, పైడా తదితర వంశీయులు అప్పట్లో సత్రాలు నిర్మించి, అన్నదానాలకు, విద్యాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పాటునందించారు. దివంగత పంతం పద్మనాభం పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. ఆగర్భ శ్రీమంతుడు సీవీకే రావు అప్పట్లోనే విదేశాల్లో ఐఏఎస్ చదువుకుని స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. కాకినాడ మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా రెండు పదవులూ ఏకకాలంలో నిర్వహించారు. రెల్లి వృత్తి పనివార్లను గత సంస్కృతి నుంచి విముక్తికి బాటలు వేసి, వినూత్న సంస్కరణలతో నిస్వార్థ ప్రజాజీవితానికి నిలువుటద్దంగా నిలిచారు. ఇంకా ఈ జాబితాలో కేఎస్ఆర్ మూర్తి, జ్ఞానానంద కవి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కృత్తివెంటి పేర్రాజు పంతులు, మద్దూరి అన్నపూర్ణయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, మెక్లారెన్ దంపతులు, విశ్వవిజ్ఞాన మదీనా కబీర్ షా వంటి మహనీయులు ఎందరో ఉన్నారు. ‘పేరు’ కోసం పోరు జిల్లాలు, ప్రాంతాల పేర్లు మార్చాలనే ప్రతిపాదనను కూటమి సర్కారు తెర పైకి తెచ్చినప్పటి నుంచీ కాకినాడ జిల్లా పేరు మార్పు డిమాండ్ ముందుకు వచ్చింది. కాకినాడ పేరుకు ముందు పిఠాపురం రాజా, మల్లాడి సత్యలింగ నాయకర్ పేర్లు పెట్టాలనే డిమాండుతో సాధన సమితులు కూడా ఏర్పాటయ్యాయి. కలెక్టరేట్ వరకూ ర్యాలీలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే, ఘనకీర్తిని సొంతం చేసుకున్న మహానుభావులు ఎంతో మంది కాకినాడలో ఉన్నారు. వీరిలో ఎవరి పేరు పెట్టినా మరొకరిని తక్కువ చేసినట్టే అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందువలన పేరు మార్పు వద్దన్నది వారి వాదన. కాకినాడ పేరు మార్పు జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే ప్రభుత్వం ఎటు మొగ్గు చూపినా అనవసరంగా తేనెతుట్టెను కదిల్చినట్టు అవుతుందని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది.‘కాకినాడ’ పేరు ఇలా..ఈ ప్రాంతాన్ని 500 ఏళ్లు పరిపాలించిన కాకనందివాడ వంశీయుల పేరిట కాకినాడ పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. చాళుక్యుల కాలం నుంచీ ప్రసిద్ధి చెందిన కాకనందివాడ వంశీయులు ఇప్పుడు లేకపోయినా.. పూర్వ చరిత్రకు సంబంధించిన కాకినాడ పేరును యథాతథంగా ఉంచాలనే డిమాండు కూడా ఉంది. కాకనందివాడ వంశీయులు.. ఆ తరువాత ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ వారు పాలించిన సమయంలో కాకినాడకు కో కెనడాగా కూడా దేశ, విదేశాల్లో ఘన చరిత్ర ఉంది. చరిత్రాత్మక కాకినాడ 160 ఏళ్ల మున్సిపాలిటీగా ప్రసిద్ధి. పిఠాపురం మహారాజా పేరు పెట్టాలి కాకినాడ జిల్లాకు పిఠాపురం మహారాజా రావు సూర్యారావు బహదూర్ పేరు పెట్టాలి. ఆయన తెలుగు భాషకు చిరస్మరణీయమైన రచనలు అందించి, గొప్ప సంస్కరణవాదిగా తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేసిన మహనీయుడు. విద్యాభివృద్ధితో పాటు దళిత జనోద్ధరణకు విశేషంగా కృషి చేశారు. తెలుగు భాషా వికాసానికి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కవులు, రచయితలను శ్రీకృష్ణదేవరాయలు తరువాత అదే స్థాయిలో ఆదరించి, మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. తెలుగు ప్రాంతంలో సాంస్కృతిక వికాసానికి దోహదం చేసి ఆయన పేరును జిల్లాకు పెట్టడం సముచితం. – నల్లమిల్లి శేషారెడ్డి, చాన్సలర్, ఆదిత్య యూనివర్సిటీ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు పిఠాపురం మహారాజా 1852లో కాకినాడలో పీఆర్ హైసూ్కల్‌ను స్థాపించారు. అప్పట్లో బాలికా విద్యకు అవకాశం కలి్పంచారు. 1884లో పిఠాపురం రాజా కళాశాలను స్థాపించారు. రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం స్థాపించిన విద్యా సంస్థలకు భారీ విరాళం ఇచ్చారు. కాకినాడలో బ్రహ్మసమాజ మందిరం, అనాథ శరణాలయం తదితర ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. కాకినాడలో 100 ఏళ్ల క్రితం పీఆర్ డిగ్రీ కళాశాల, పిఠాపురంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వేలాది మంది విద్యార్థుల విద్యాభ్యున్నతికి బాట వేశారు. విద్యార్థి లోకంతో పాటు అటు అధ్యాపక సంఘాలు కూడా పిఠాపురం రాజా పేరు పెట్టాలని కోరుతున్నాయి. – వలవల శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రొఫెసర్, పీఆర్ డిగ్రీ కళాశాలనాయకర్ పేరు సముచితమే.. వందల ఎకరాలు దానం చేసిన మహానీయుడు నాయకర్. ఆ రోజుల్లో చాలా మంది వారసత్వంగా వచ్చిన ఆస్తులను మాత్రమే దానం చేశారు. కానీ, స్వశక్తితో సంపాదించిన యావదాస్తినీ పేద విద్యార్థుల అభ్యున్నతికి నాయకర్ ధార పోశారు. ఎటువంటి చదువు, వారసత్వంగా వచ్చిన ఆస్తి లేనప్పటికీ పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో నాయకర్ చేసిన దానం వెలకట్టలేనిది. జిల్లాకు ఆయన పేరు పెట్టడంలో సందేహించాల్సిందేమీ లేదు. – పంపన రామకృష్ణ, ఉపాధ్యక్షుడు, నాయకర్ సాధన సమితి యావదాస్తినీ ధార పోశారు కోరంగి ఓడరేవులో ఒక శ్రామికుడిగా మూటలు మోసి, తన తెలివితేటలతో రంగూన్ వెళ్లి, అక్కడ కాంట్రాక్టర్‌గా అంచెలంచెలుగా ఎదిగి, కష్టంతో సంపాదించిన యావదాస్తినీ విద్యాభివృద్ధికి దానం చేసిన మహనీయుడు నాయకర్. జిల్లాకు ఆయన పేరు పెట్టాలి. ఇందుకు అన్ని వర్గాలూ ఆమోదం తెలియజేస్తాయనే నమ్మకం ఉంది. రెక్కల కష్టంపై సంపాదించిన ఆస్తినంతటినీ దానం చేసిన, ఉదారమైన మనస్తత్వం కలిగిన నాయకర్ అందరివాడు. – మల్లాడి రాజు, అధ్యక్షుడు ఎంఎస్ఎన్ చారీ్టస్ పరిరక్షణ సమితి పేరు మార్పు వద్దు దేశ విదేశాల్లో ఘన చరిత్ర కలిగిన కాకినాడ పేరు మార్పునకు కూటమి ప్రభుత్వం అంగీకరించకూడదు. చరిత్రాత్మక కాకినాడ పేరు రాజమహేంద్రవరం కంటే కూడా ముందుగా అవతరించింది. కాకినాడతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి పిఠాపురం మహారాజా, మల్లాడి సత్యలింగ నాయకర్, బులుసు సాంబమూర్తి, సీవీకే రావు, జ్యోతుల, ముత్తా, పైడా, పైండా తదితరుల కుటుంబాలు తమ ఆస్తులను ధార పోశారు. పలు ఆస్తులు అన్యాక్రాంతంలో ఉన్నాయి. వాటిని తిరిగి ఆయా సంస్థలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలి. – దూసర్లపూడి రమణరాజు, పురపాలక సంఘం పూర్వ పాలక సభ్యుడు పేరు మార్పుతో విభేదాలు జిల్లాలో ఎన్నో ఆస్తులు ఇచ్చిన మహనీయులకు గుర్తింపు ఉండేలా అనేక నిర్మాణాలకు వారి పేరు పెట్టాలి. జిల్లాకు ఎవరికి తోచిన పేరు వారు కోరుకుంటారు. దీనివల్ల వర్గ విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మన జిల్లాకు కాకినాడ పేరు ఉంటేనే బాగుంటుంది. మెజార్టీ ప్రజల అభిప్రాయం కూడా ఇదే అనుకుంటున్నాను. – కొటికలపూడి సత్య శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు, కాకినాడ బార్ అసోసియేషన్ -
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయికి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. తిరుమల పరకామణి వివాదంపై సీబీఐతో దర్యాప్తు జరపాలని అమిత్ షాను గురుమూర్తి కోరారు. పరకామణి వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయికి విజ్ఞప్తి చేశారు.‘‘పరకామణి వివాదానికి ఏపీ సర్కార్ రాజకీయ రంగు పులుముతోంది. వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో ఆటలాడుతోంది. 100 కోట్ల హిందువుల విశ్వాసాలతో చెలగాటమాడటం దారుణం. వివాదంపై పారదర్శక, నిష్పక్షపాత దర్యాప్తు అవసరం. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. జ్యూడిషియల్ విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి’’ అని సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో గురుమూర్తి పేర్కొన్నారు.‘‘రాజకీయ ప్రతీకారం కోసం తిరుమల పరకామణి వివాదాన్ని టీడీపీ ప్రభుత్వం వాడుకుంటుంది. ఏపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దేవాలయ ప్రతిష్టను మంటగలిపేందుకు విమర్శలు చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలతో ఆటలాడుతున్నారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి. నిష్పక్షపాత పారదర్శక విచారణతోనే సత్యం బయటపడుతుంది. రాజకీయ దురుద్దేశాలకు చెక్ పడుతుంది. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు జరిపి భక్తుల విశ్వాసాలను కాపాడాలి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. -
హైకోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా అమరావతిలో DSC వేడుకలు
-
ఢిల్లీలో దారుణంగా తిట్టుకున్న ఎంపీ శబరి, సీఎం అడిషనల్ సెక్రటరీ!
సాక్షి, విజయవాడ: ఏరికోరి సీఎం చంద్రబాబు నియమించుకున్న ఐఏఎస్ అధికారితో టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాటల యుద్ధానికి దిగారు. ఒకరికొకరు తిట్టుకోవడంతో పాటు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో నడుస్తున్న ఈ పంచాయితీ హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ ఎంపీ శబరి వెర్సస్ సీఎంవో కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఢిల్లీలో దారుణంగా తిట్టుకున్నారు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజే జరిగిన ఈ వాగ్వాదం వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎంపీ శబరి ఎదురు చూడసాగారు. ఆ సమయంలో ఆమెను సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా‘‘సీఎం బాగా బిజీగా ఉన్నారు’’ అని చెప్పి అనుమతించలేదు. అప్పటిదాకా పడిగాపులు పడ్డ ఆమె ఆ సమాధానంతో ఒక్కసారిగా ఊగిపోయారు. ‘‘నేనొక ఎంపీని.. నాతో ఇలాగేనా మాట్లాడేది’’ అని గట్టిగా అరిచారు. దీనికి ఆయన ‘‘నీలా ఎవరూ నాతో ఇప్పటిదాకా ఇలా మాట్లాడలేదు’’ అంటూ మండిపడ్డారు. ఆ ఏకవచనం పిలుపుతో మరింత రగిలిపోయిన శబరి.. తనతో మర్యాదగా ప్రవర్తించాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివాదం మరింత ముదరకుండా.. కొందరు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కట్ చేస్తే.. తాజాగా ఆమె మంత్రి నారా లోకేష్‌కు ఈ వ్యవహారంపై పిర్యాదు చేశారు. లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా కార్తీకేయ మిశ్రాకు పేరుంది. ఈ క్రమంలోనే ఆయన్ని కావాలనే చంద్రబాబుకి అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో.. సీఎంవో సీనియర్ అధికారి ఒకరి చేత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. -
విశాఖ సింహాచలం అప్పన్న బంగారు ఆభరణాలకు శఠగోపం
-
కారు - బైక్ రేసింగ్.. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి ముడుపులు
-
బీజేపీ-ఆర్ఎస్ఎస్ వైరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: కేంద్రం, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్ఎస్ఎస్ శాసించదన్నారు. ‘‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదే. నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.అంతర్గత వైరుధ్యాలు ఉన్న వ్యవస్థలు ఉన్నాయని.. అయితే ఏ విధంగానూ వివాదం లేదన్న ఆయన.. ప్రతి ప్రభుత్వంతో తమకు మంచి సమన్వయం ఉందంటూ పేర్కొన్నారు. ‘‘మనం రాజీ గురించి మాట్లాడినప్పుడు, పోరాటం తీవ్రమవుతుంది. అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ మేం చర్చించుకుంటాం. సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ‘ఒకరినొకరు విశ్వసిస్తాయి’’ అని మోహన్ భగవత్ పేర్కొన్నారు. -
మరో వివాదంలో ‘విశాఖ సెంట్రల్ జైలు’.. ఇద్దరు ఖైదీలు రాసిన లేఖ వైరల్
సాక్షి, విశాఖపట్నం: మరోసారి విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో చిక్కుకుంది. ఇద్దరు ఖైదీలు రాసిన లేఖ వైరల్ అవుతోంది. విశాఖ సెంట్రల్ జైల్ అధికారులపై ఖైదీల తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు సుపరింటెండెంట్ మహేశ్ బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ సాయి ప్రవీణ్ వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఓ కిడ్నాప్ కేసులో నిందితుడైన ఉలవల రాజేశ్, మరో ఖైదీ మీర్జాఖాన్ మీడియాకి లేఖ రాశారు.రౌడీషీటర్ ఉలవల రాజేశ్ లేఖలో సంచలన అంశాలు వెల్లడించాడు. రిమాండ్‌లో తాను మొబైల్స్ వినియోగించకపోయినా సరే తనపై కుట్ర పన్నారు అంటూ లేఖలో పేర్కొన్నాడు. ‘‘సెల్ ఫోన్ సిగ్నల్ వచ్చే బ్లాక్ వద్ద నన్ను బంధించి మొబైల్ వినియోగించినట్లు నాపై తప్పుడు సాక్షాలు సృష్టించారు. జైలు అధికారుల దాష్టీకాలపై 18-3-2025న కోర్టు వాయిదాకు వచ్చినపుడు జైలు అధికారులపై జడ్జికి ఫిర్యాదు చేశాను. జడ్జి దృష్టికి ఈ వ్యవహారాలను తీసుకు వెళ్తున్నానంటూ కక్ష కట్టి నన్ను వేధిస్తున్నారు’’ అంటూ లేఖలో పేర్కొన్నాడు.‘‘తోటి ఖైదీల వలె కాకుండా నన్ను లాకప్ నుంచి అస్సలు బయటకు రాకుండా సూపరింటెండెంట్ లోపలే బంధిస్తున్నారు. అందరు ఖైదీల్లాగా ఉదయం నుంచి నన్ను బయటకు పంపడం లేదు. జడ్జికి ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుక్కోవాలని వేధిస్తున్నారు. లేకుంటే జైల్లో ఇలానే హింస తప్పదని సూపరింటెండెంట్ బెదిరిస్తున్నారు. జైల్లో మాకు చట్టప్రకారం ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా ఇవ్వడం లేదు. జైలు క్యాంటీన్‌ల్లో అనేక అవకతవకలకు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారు. జరుగుతున్న అవకతవకలపై అధికారులను నిలదీస్తే, గంజాయి వాడుతున్నారని తప్పడు కేసులు పెటడతామంటూ నాగన్న అనే మరో ముద్దాయిని బెదిరిస్తున్నారు. జైల్లో మేము పడుతున్న బాధలను బయటకు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నాం’’ అంటూ రాజేశ్, మీర్జాఖాన్ చెప్పుకొచ్చారు. -
వివాదంలో సినీ నటుడు రోలర్ రఘు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: సినీ నటుడు రోలర్ రఘు వివాదంలో చిక్కుకున్నారు. మడకశిర మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి రోలర్ రఘు హాజరయ్యారు. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజును కలిసేందుకు రోలర్ రఘు మడకశిర వెళ్లారు. ఆయన్ను.. మడకశిర నగర పంచాయతీ సమావేశానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీసుకెళ్లారు.మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో వేదికపై సినీ నటుడు రోలర్ రఘు కనిపించారు. మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి పాలకవర్గ సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు మాత్రమే అర్హులు. అయితే, యాక్టర్ రోలర్ రఘు హాజరుకావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను అభాసుపాలు చేస్తోందని పలువురు మండిపడుతున్నారు. -
డ్రెస్ కోడ్ వివాదం.. స్పందించిన డింపుల్ యాదవ్
ఉత్తర ప్రదేశ్‌లో ‘మసీదు రాజకీయం’ తీవ్ర చర్చనీయాంశమైంది. సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ కొందరి పార్టీ నేతలో ఓ మసీదులో భేటీ అయినట్లు ఉన్న ఓ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే.. ప్రార్థనా స్థలాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారని బీజేపీ విమర్శలు గుప్పించగా.. దానికి ఎస్పీ అంతే దీటుగా బదులిచ్చింది. సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తాజాగా పార్లమెంట్ సమీపంలోని ఓ మసీదుకు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే మసీదులో రాజకీయ భేటీ జరపడం ఏంటి? అని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఆయన సతీమణి, ఎంపీ డింపుల్ యాదవ్ వస్త్రధారణపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రార్థనా స్థలాన్ని ఎస్పీ పార్టీ అనధికారిక కార్యాలయంగా మార్చేశారంటూ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ మండిపడ్డారు. ఎస్పీ ఎంపీ నద్వీ ఆ మసీదుకు ఇమామ్. అలాంటి చోట రాజకీయ సమావేశాలు జరపడం ఏంటి? అని ప్రశ్నించారాయన. డింపుల్ యాదవ్ కూడా అక్కడ ఉన్నారు. అయితే ఆమె వస్త్రధారణ అభ్యంతకరంగా ఉంది. ఆమె శరీర భాగాలు(వీపు, నడుం భాగం) కనపడేలాగా ఉన్నాయి. దుపట్టాతో పూర్తి శరీరాన్ని ఆమె కప్పేసుకుని రావొచ్చు కదా.. ఎందుకు అలా చేయలేదు?. ఇది మత నియమావళిని ఉల్లంఘించడమే. ముస్లింల మనోభావాలను దెబ్బ తీయడమే అని మండిపడ్డారాయన. అంతేకాదు.. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారాయన. ఈ ఘటనను నిరసిస్తూ శుక్రవారం(జులై 25) అదే మసీదులో తాము సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారాయన. మరోవైపు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాథక్ కూడా ఈ ఘటనపై మండిపడ్డారు. ‘‘మతాన్ని రాజకీయం చేయొద్దని రాజ్యాంగం చెబుతుంది. అలాంటిది సమాజ్‌వాదీ పార్టీ రాజ్యాంగాన్ని ఎప్పుడూ ఉల్లంఘిస్తూనే ఉంటుంది. ఆ పార్టీకి రాజ్యాంగంపై ఎలాంటి గౌరవం లేదు’’ అని అన్నారాయన. బీజేపీ విమర్శలను సమాజ్‌వాదీ తిప్పి కొట్టింది. జాతీయ అంశాలను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఇటు అఖిలేష్, అటు డింపుల్ మండిపడ్డారు. ‘‘బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. వాళ్లు విమర్శిస్తున్నంతగా అక్కడేం లేదు. నద్వీ మా పార్టీ ఎంపీ. ఆయన మమ్మల్ని అక్కడికి ఆహ్వానించారు కాబట్టే వెళ్లాం. ఎలాంటి సమావేశాలు అక్కడ జరగలేదు. అసలు విషయాల్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఇలాంటి అంశాలను తెర మీదకు తెస్తోంది. బీహార్ ఓటర్ల అంశం, పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్ ఇవీ ముఖ్యమైన విషయాలు. వీటితో పాటు ప్రజా సమస్యలపై చర్చించేందుకు బీజేపీ సుముఖంగా లేదు. అందుకే ఈ అంశంతో రాజకీయం చేస్తోంది’’ అని అన్నారామె. New Delhi: On the viral pictures of SP Chief and MP Akhilesh Yadav and others sitting in a mosque, Samajwadi Party MP Dimple Yadav says, "There is nothing like that. Our MP, Imam Sahab and his wife, all of us had gone there for a social event. No meeting took place there..." pic.twitter.com/AVW5ctYwEq— IANS (@ians_india) July 23, 2025ఇక.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకుని మరోసారి రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారాయన. తన భార్య డింపుల్ వస్త్రధారణ సవ్యంగానే ఉందని, కీలక అంశాలను పక్కదోవ పట్టించేందుకే అనవసర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.బీజేపీ విమర్శలను ఇటు ఎస్పీతో పాటు అటు కాంగ్రెస్ నేతలు సైతం తిప్పి కొడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ బీజేపీవి సిగ్గులేని రాజకీయాలంటూ మండిపడ్డారు. డింపుల్ యాదవ్ వస్త్రధారణ భారతీయ సంప్రదాయాలకు తగ్గట్లే ఉందని, మహిళలను అవమానించే సంస్కృతి ఉన్న బీజేపీకి ఇలాంటి విమర్శలు సహజమేనని అన్నారాయన. -
ట్రంప్ పొగిడినా కష్టాలే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనుషుల్ని మెచ్చడం అత్యంత అరుదు. అందునా తనకు నచ్చని దేశాల అధ్యక్షులను వైట్‌హౌజ్‌కు పిలిపించుకుని మరీ అవమానించడం ఆయనొక అలవాటుగా మార్చుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఓ దేశ అధ్యక్షుడ్ని మెచ్చుకుంటే.. అది కూడా బెడిసి కొట్టింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ , దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీని తన ఓవెల్ ఆఫీస్‌లో మీడియా సమక్షంలోనే డిక్టేటర్(నియంత) అంటూ తిట్టిపోశారు. అలాగే.. రామఫోసా ముందు ఓ వీడియో ప్రదర్శించి.. సౌతాఫ్రికాలో తెల్లవాళ్లను ఊచకోతలు కోస్తున్నారంటూ ఏకంగా ఓ తప్పుడు వీడియోను ప్రదర్శించి మరీ విమర్శలు గుప్పించారు.ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మినహా ఆయన ప్రత్యేకంగా ఎవరినీ ప్రశంసించింది లేదు. తాజాగా లిబీరియా అధ్యక్షుడు జోసెఫ్ బొకాయ్పై ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. ఇప్పటిదాకా వైట్‌హౌజ్‌కు వచ్చిన ఏ నేత కూడా ఇంత అందంగా ఆంగ్లంలో మాట్లాడలేదంటూ.. Such good English అని ట్రంప్ వ్యాఖ్యానించారు. Where did you learn to speak so beautifully? అంటూ ఆరా తీశారు. తనకు తెలిసిన అమెరికన్ల కంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడారంటూ కితాబిచ్చారు.Trump to Liberia’s President “Your English is beautiful better than some Americans I know.” 🇱🇷😂FYI: English is Liberia’s official language.#Trump #Liberia #JosephBoakai #Politics pic.twitter.com/WidIjSWA3N— A.S (@DHAS013) July 10, 2025అయితే ఈ పొగడ్త వివాదాస్పదంగా మారింది. లిబీరియా అధికార భాష ఆంగ్లమే. పైగా బొకాయ్ లిబీరియాలోనే విద్యనభ్యసించారు. దీంతో ఆఫ్రికా అంతటా ట్రంప్ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఆఫ్రికన్ యూత్ యాక్టివిస్ట్ ఆర్చీ హారిస్ స్పందిస్తూ.. మా దేశం ఆంగ్ల భాష మాట్లాడే దేశం. ఈ ప్రశ్నను ప్రశంసగా కాక, అవమానంగా భావించాను అని అన్నారు.దక్షిణాఫ్రికా రాజకీయ నాయకురాలు వెరోనికా మెంటే స్పందిస్తూ.. ట్రంప్ అలా అన్నాక కూడా బొకాయ్ ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోలేదు? అని ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలపై వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యను హృదయపూర్వక ప్రశంసగా, ట్రంప్ ఆఫ్రికా దేశాలకు మిత్రుడిగా అభివర్ణించింది. లిబీరియా.. 1822లో అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ ద్వారా స్థాపించబడింది. 1847లో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆంగ్ల భాష అధికార భాషగా ఉంది, కానీ అనేక స్థానిక భాషలు కూడా మాట్లాడబడతాయి. -
HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు సహా ఐదుగురి ఎంక్వైరీ
-
మహారాష్ట్రలోని దేవేంద్ర సర్కార్ పై కొత్త వివాదం
-
తిరుమల: మరో అపచారం
కూటమి పాలనలో వరస ఆలయ అపచారాల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో గేమింగ్ యాప్ వ్యవహారం వెలుగు చూసింది. అందులో ఆలయానికి సంబంధించిన వివరాలు నమోదు కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంపై ఆన్లైన్లో గేమ్ యాప్ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ అనే సంస్థ ఈ యాప్‌ను రూపొందించింది. వర్చువల్ ఎక్స్‌పీరియెన్స్‌తో ఈ యాప్‌ను డిజైన్ చేసింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలు.. ఇందులో ఆలయ మహ ద్వార ప్రవేశం, దర్శనం, హుండీ తదితర వివరాలు కనిపిస్తున్నాయి. ఈ గేమింగ్ యాప్‌పై పలువురు భక్తులు టీటీడీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ తప్పనిసరైంది. ఈ యాప్‌తో రోబ్లెక్స్ సంస్థ బారీ ఆదాయం సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. -
నటి ఊర్మిళను రెండో పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల సురేష్
-
భారతీయ సంతతి ర్యాపర్ ఓవర్ యాక్షన్ : నెటిజన్ల తీవ్ర అగ్రహం
కెనడియన్ ర్యాపర్,మోడల్ టామీ జెనెసిస్ అత్యుత్సాహంపై సోషల్ మీడియా భగ్గుమంటోంది. తన తాజా మ్యూజిక్ వీడియో 'ట్రూ బ్లూ'లో ఆమె అవతారం కాళీ మాతను పోలి ఉండటం వివాదానికి దారి తీసింది. అసలేంటీ వివాదం? ఎవరీ టామీ జెనెసిస్ తెలుసుకుందామా.భారతీయ సంతతికి చెందిన కెనడియన్ రాపర్ టామీ తన రాబోయే ఆల్బమ్ ప్రమోషన్లో భాగంగా ట్రూ బ్లూ మ్యూజిక్ వీడియో క్లిప్పింగ్స్తోపాటు, కొన్ని చిత్రాలను శనివారం పోస్ట్ చేసింది. ట్రూ బ్లూ ప్రోమోలో నీలిరంగు బాడీ పెయింట్, బంగారు ఆభరణాలు, నుదుటిన ఎర్రటి బొట్టు, శిలువ పట్టుకుని వీడియోను పోస్ట్‌ను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. బికినీ, హై హీల్స్ ధరించి, సాంప్రదాయ భారతీయ శైలి బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడం పలువురికి ఆగ్రహం తెప్పించింది. అసభ్యకరంగా రెచ్చగొట్టే విజువల్స్, అనేక మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిందంటూ నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అటు హిందూవులు, ఇటు క్రైస్తవులను అవమానించి, వారి మనోభావాల్ని అగౌరవపరిచే చర్య అని పేర్కొన్నారు.తమిళ్-స్వీడిష్ సంతతికి చెందిన కెనడియన్ రాపర్ అసలు పేరు జెనెసిస్ యాస్మిన్ మోహన్‌రాజ్. ఈమె తాజా మ్యూజిక్ వీడియోలోకాళీమాతను అభ్యంతరకరంగా చిత్రీకరించిడంతో పాటు, క్రైస్తవ శిలువను అవమానించిందంటూ వివాదం రాజుకుంది. లైక్‌లు,వ్యూస్‌కోసం దైవాన్ని దూషించడం, మనోభావాల్ని దెబ్బతీయడం ఫ్యాషన్‌గా మారిపోయిందంటూ నెటిజన్లు మండి పడుతున్నారు."ఇది కేవలం మతాలను మాత్రమే కాదు భారతీయ సంస్కృతిని కూడా అపహాస్యం చేసిందంటూ సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ‘శ్వాస ముద్ర’ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల న్యూ స్టడీ : ఆశ్చర్యకర ఫలితాలు -
‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
భారత ఆర్థిక వృద్ధిని బహిరంగంగా విమర్శించినందుకు హాట్ మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఇటీవల తాను పోస్ట్ చేసిన వివరాలు వైరల్‌గా మారాయి. దాంతో భారత్ వృద్ధికి కట్టుబడి ఉన్నవారు ఈయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.భాటియా తన ఎక్స్‌లో ఖాతాలో ‘భారత్‌లో 41.5 కోట్ల మంది ప్రజలు రోజుకు 3.10 డాలర్ల(రూ.250)తో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అందుకు సిగ్గు పడాల్సిందిపోయి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. సిగ్గుగా వుంది’ అంటూ పోస్ట్ చేశారు. జపాన్ను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానానికి ఎగబాకుతున్నట్లు వచ్చిన వార్తలకు స్పందించిన భాటియా ఈమేరకు ఎక్స్‌లో వ్యాఖ్యలు చేశారు.భాటియా వ్యాఖ్యలను రాజకీయ, వృత్తిపరమైన నేపథ్యాలకు అతీతంగా భారతీయ వినియోగదారులు విస్తృతంగా ఖండించారు. భాటియా పోస్ట్‌లోని వివరాలు అవుట్‌డేటెడ్‌గా కొందరు కామెంట్ చేశారు. ఆయన తన మాటలను భారత రాజకీయ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారా లేక సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారా అని పలువురు యూజర్లు ప్రశ్నించారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. మరొకరు ‘మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు. భారత్ ప్రస్తుతం ఇంటున్న స్థానం నుంచి ఎలా ముందుకెళ్లాలో సూచించాల్సిందిపోయి ప్రతిసారి ఇదే పాట పడుతున్నారు. సిగ్గుగా ఉంది’ అని పోస్ట్ చేశారు.Instead of hanging your head in shame that 415 million people in India survive on $3.10/day, you brag about being the world’s 4th largest economy. Shame on you.— Sabeer Bhatia (@sabeer) June 10, 2025ఇదీ చదవండి: మెరుగైన సేవలకు ఎస్బీఐ ప్రాధాన్యం‘1997 డిసెంబర్లో హాట్‌మెయిల్‌ను 400 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అప్పటి నుంచి మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? జీరో.. మీ ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు మీరు ఎక్స్ ద్వారా ఉపన్యాసాలు ఇస్తున్నారు’ అని ఒక యూజర్ పోస్ట్ చేశారు. ‘నా ఆలోచనా విధానాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు మీలాంటి వారు దూషణలకు దిగుతారు. బలహీన మనస్తత్వం, అభద్రతా భావం’ అంటూ భాటియా స్పందించారు. మరో యూజర్ ‘నువ్వొక అసమర్థుడివి. 36-37 ట్రిలియన్ డాలర్ల అప్పులతో ప్రపంచంలోనే నెం.1 ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎందుకు గొప్పలు చెప్పుకుంటుంది’ అని ప్రశ్నించారు. దీనిపై భాటియా స్పందిస్తూ.. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని స్పష్టం చేశారు. -
కన్నడ భాష వివాదంపై స్పందించిన కమల్ హాసన్
-
క్షమాపణలు చెప్పను: కమల్ హాసన్
కన్నడ భాష వివాదం నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనని, ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోనంటూ స్పష్టం చేశారాయన. బుధవారం థగ్ లైఫ్ ఈవెంట్లో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో తనను విమర్శించిన నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ఈ ఇష్యూపై గందరగోళం నెలకొంది. అందుకే స్పష్టత ఇవ్వదల్చుకున్నా. చాలామంది చరిత్రకారులు(రాజకీయ నాయకులను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ..) నాకు భాష చరిత్ర గురించి పాఠాలు బోధిస్తున్నారు. కానీ, నాతో సహా రాజకీయ నాయకులెవరికీ భాష వ్యవహారంపై మాట్లాడే అర్హత లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. తమిళంతో పాటు మీనన్, రెడ్డి, అయ్యంగార్ ముఖ్యమంత్రులయ్యారు. చాలా కాలం కిందట కర్ణాటక నుంచి వచ్చి తమిళనాడుకు సీఎం అయిన వ్యక్తి నుంచి నాకు సమస్య ఎదురైంది. ఆ సమయంలో కర్ణాటక నాకు మద్దతు ఇచ్చింది. ఎక్కడికీ వెళ్లొద్దు.. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోండి అంటూ కన్నడ ప్రజలు ప్రేమ చూపించారు. కాబట్టి ఇప్పుడు కూడా థగ్ లైఫ్, కమల్ హాసన్‌ను ప్రజలే చూసుకుంటారు.#WATCH | Thiruvananthapuram, Kerala: On his recent remarks where he said, 'Kannada was born out of Tamil', MNM President and actor Kamal Haasan says, "... What I said was said out of love and a lot of historians have taught me language history. I didn't mean anything. Tamil Nadu… pic.twitter.com/YjW8qAUIB3— ANI (@ANI) May 28, 2025భాషా వ్యవహారం చాలా లోతైన అంశం. నాతో సహా ఏ రాజకీయ నాయకుడికి దాని గురించి మాట్లాడే అర్హత లేదు. కాబట్టి ఈ చర్చను భాషా నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాఖ వాళ్లకు వదిలేయండి. శివన్న, ఆయన తండ్రి మీద ప్రేమతో ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడిందే తప్ప అందులో మరే ఉద్దేశం లేదు. ప్రేమతోనే మాట్లాడినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి ఆ పని చేయను’’ అని కమల్ అన్నారు. ఇటీవల చెన్నైలో తన చిత్రం థగ్ లైఫ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని శివరాజ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కన్నడ సంఘాల నాయకులు ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. ‘కన్నడ- కస్తూరి’ అనే విషయాన్ని ఆ నటుడు మర్చిపోయినట్లు ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. రెండున్నర వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భాషను కమల్ మర్చిపోయినట్లు ఉందని సీనియరు నటుడు జగ్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్ర ప్రదర్శనను కర్ణాటకలో అడ్డుకుంటామని వివిధ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆయనపై నిషేధం విధిస్తామని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బి.వై.విజయేంద్ర, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ తదితరులు కమల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. -
పాపం కమల్ హాసన్.. సిద్ధరామయ్య సెటైర్లు
బెంగళూరు: కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందన్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలపై(Kamal Kannada Comment) కన్నడనాట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమల్ కామెంట్‌పై స్పందించారు.కన్నడ భాషకు(Kannada Language) ఎంతో చరిత్ర ఉంది. పాపం కమల్ హాసన్‌కు ఆ విషయం తెలియకపోయి ఉండొచ్చు అంటూ సిద్ధరామయ్య అన్నారు. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర యడియూరప్ప సైతం కమల్ వ్యాఖ్యపై మండిపడ్డారు. ‘‘మాతృభాషను ప్రేమించడం మంచిదే అయినా.. ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని అన్నారాయన. ఇది కన్నడ ప్రజలను మాత్రమే కాదు.. శివరాజ్ కుమార్ లాంటి అగ్రనటుడిని కూడా అవమానించడమే. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన కమల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి’’ అని విజయేంద్ర డిమాండ్ చేశారాయన. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ చిత్ర(Thug Life) ఈవెంట్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ ‘‘మీ భాష(కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’ అని అన్నారు. ఈ కామెంట్‌పై ఇటు రాజకీయంగా, అటు సోషల్ మీడియాలోనూ కమల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడ పరిరక్షణ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక కమల్ వ్యాఖ్యలపై భగ్గుమంది. క్షమాపణలు చెప్పకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి లీడ్ రోల్స్‌లో నటించిన థగ్ లైఫ్ సినిమా జూన్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఖబడ్దార్ కమల్.. నల్ల ఇంకు పోస్తాం -
మిస్ వరల్డ్ వివాదం 2025.. పోటీ నుండి తప్పుకున్న బ్రిటిష్ బ్యూటీ.. కారణం అదేనా..!
-
సినీ పరిశ్రమ వివాదంలోకి నన్ను లాగొద్దు: ద్వారంపూడి
సాక్షి, కాకినాడ జిల్లా: సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దంటూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సినిమా థియేటర్ల బంద్ తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలొద్దు.. ఆధారాలు ఉంటే చూపించండి’’ అని తేల్చి చెప్పారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల కాకుండా తనతో పాటుగా కొంత మంది సిని నిర్మాతలు కుట్ర పన్నారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.‘‘నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏ మాత్రం ధ్రువీకరించు కోకుండా కొన్ని మీడియా సంస్థలు వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాజకీయాలలో ఉన్నాననే అక్కసుతో ఏదో వివాదంలోకి లాగడం ఎంత వరకు సమాంజసం?’’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. -
కాన్స్‌లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్‌తో
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కాన్స్ ఫిలి ఫెస్టివల్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) మరోసారి సంచలనం రేపింది. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చిలుక లాంటి గౌనుతో పాటు చిలుక క్లచ్‌తో తొలిసారి మురిపించిన ఈ బ్యూటీ ఈ సారి ఏకంగా గోల్డ్, డైమండ్స్‌తో రూపొందించిన 'బికినీ' బ్యాగ్‌తో కనిపించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ డైమండబ్యాగ్ ధర ఎంతో తెలుసా?గత కొన్నేళ్లుగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ సందడిలో ఎక్కువగా వినిపించే పేరు ఊర్వశి రౌతేలా. అలాగే వివాదాలకు కూడా తక్కువేమీ కాదు. మొన్న చిలక క్లచ్‌తో వివాదాన్ని రూపి, కొంతమందినెటిజన్లను ఆకట్టుకోవడంలో విఫలమైనప్పటికీ, ఖరీదైన బ్యాగ్‌తో రెడ్ కార్పెట్‌పైకి తిరిగి వచ్చింది. దీని ధర. రూ. 5.29 లక్షల బస్ట్ గోల్డ్ బికినీ బ్యాగ్‌ను ప్రదర్శించడం చర్చకు దారి తీసింది. అంతేకాదు ఈ ఫెస్టివల్లో మొదటి రోజు ఆమో ధరించిన చిలుక క్లచ్ కూడా జుడిత్ లీబర్ బ్రాండ్‌కు సంబంధించిందే.. దీని ధర రూ. 4.86లక్షలు.బంగారు రంగు ఫిష్‌టైల్-స్టైల్ గౌనులో నటి లా వెన్యూ డి ఎల్'అవెనిర్ (కలర్స్ ఆఫ్ టైమ్) ఉర్వశి రౌతేలా ఈ ప్రదర్శనకు హాజరైంది. ఈ గౌను అభిమానులను మంత్రముగ్ధులను చేసినప్పటికీ, హైలైట్‌గా నిలిచించి మాత్రం గోల్డ్ బికినీ బ్యాగ్.ఇదీ చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు లగ్జరీ బ్రాండ్ జుడిత్ లీబర్ బస్ట్-షేప్డ్ బికినీ బ్యాగ్‌ను ధరించింది. మెటాలిక్ గోల్డ్ బికినీ టాప్‌తోపాటు, ఖరీదైన రత్నాలు, స్ఫటికాలు, వివిధ ఆకారాలు, కట్లు, ఫ్యాన్సీ నెక్లెస్‌ల కలగలుపుతో తయారు చేశారు. చేయబడింది. వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, బ్యాగ్ షాంపైన్-టోన్డ్ మెటల్ హార్డ్‌వేర్‌తో పుల్-ట్యాబ్ మాగ్నెటిక్ క్లోజర్‌ను కలిగి ఉంది. షోల్టర్ చైన్‌తోపాటు, మెటాలిక్ లెదర్-లైన్డ్ ఇంటీరియర్‌తో కూడా వచ్చింది. ఇక ధర విషయాని వస్తే దీని ధర 6,195 అమెరికన్ డాలర్లు. అంటే దాదాపు రూ. 5,29,000 అవుతుంది. ఈ బస్ట్ బ్యాగ్ ఎనిమిది ఇతర వేరియంట్లలో అందుబాటులో ఉంది. చదవండి: బనారసీ చీరలో నీతా అంబానీ లుక్ : లగ్జరీ బ్యాగ్ స్పెషల్ ఎట్రాక్షన్ఫోటోషూట్ కోసం ఊర్వశి ఏం చేసిందంటే..కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025, ఊర్వశి రౌతేలా మెట్లపై ఫోటోషూట్ సమయంలో ఎవ్వరినీ లోపలికి రావడానికి వీల్లేకుండా, దారిని బ్లాక్ చేసిందట. రెడ్ కార్పెట్ కి వెళ్లేముందు హోటల్ మెట్ల మార్గంలో ఫోటోషూట్ చేయించుకుంది. ఈ సందర్భంగా ఇతర అనేక మంది ఇతర అతిథులకు ఆటంకం కల్పించింది. కనీసం వారినిచూసి అని పక్కకు తప్పుకోకుండా, తన పోజుల్లో మునిగిపోవడంతో వారు అసౌకర్యానికి గురయ్యారని సమాచారం. -
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పనిచేయరూ అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.‘నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు. నేను అలా చేయను.. సమాజ సేవే చేయమంటాను. నాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పా. స్కూల్ డెవలప్మెంట్ చేయమని కోరా’ అని వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ.. అయితే, తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం కావడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ‘నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. నేను వరంగల్‌లో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకున్నారో లేదో గత ప్రభుత్వంలోని మంత్రులకు తెలుసు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు. నేను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్‌లను కావాలని ట్రోల్ చేస్తున్నారు. మా కేబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారు. పని చేస్తున్న మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కో మెట్టు ఎక్కి మంత్రినయ్యాను నాపై తప్పుడు ప్రచారాలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టను. గత ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా? ఎక్కడికి వస్తారో రండి’ అంటూ సవాల్ విసిరారు. -
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీలో చిచ్చు రేపిన నామినేటెడ్ పోస్టుల భర్తీ
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జిల్లా టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చు రాజేసింది. మాజీ మంత్రి , ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌కు అన్యాయంపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. ఆప్కాబ్ ఛైర్మన్ పదవిపై రఘురాం ఆశలు పెట్టుకోగా, ఆప్కాబ్ ఛైర్మన్ పదవి ఆయనకు ఇవ్వకపోవడంపై జగ్గయ్యపేట టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేటలోని ఓ ఫంక్షన్ హాలులో నెట్టెం రఘురాం అనుచరులు, టీడీపీ నేతలు సమావేశమయ్యారు.టీడీపీ ఆవిర్భావం నుంచి నెట్టెం రఘురాం పార్టీ కోసం పనిచేశారని.. కేడీసీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి ఆయన స్థాయిని తగ్గించారని.. నేడు ఆప్కాబ్ ఛైర్మన్ పదవి ఇవ్వకుండా అవమానపరిచారంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. నలభై ఏళ్లుగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీని కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి నెట్టెం రఘురాంకు పదవి ఇవ్వకుండా చేయడం బాధాకరమన్నారు.‘‘2024 ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని స్థానాలు గెలవడం వెనుక నెట్టెం కృషి ఎంతో ఉంది. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబు వెంట నిలబడిన వ్యక్తి నెట్టెం రఘురాం. రెండు సార్లు పార్టీ గెలుపు కోసం తన సీటును త్యాగం చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు ఇచ్చిన మాట మర్చిపోయారు. తక్షణమే రఘురాంకు ఆప్కాబ్ ఛైర్మన్ లేదా రాష్ట్రస్థాయి పదవి ఇవ్వాలి. పార్టీలో సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టం’’ అంటూ ఆ పార్టీ నేతలు తేల్చిచెప్పారు. -
ప్రవస్తి కాంట్రవర్సీపై స్పందించిన లిప్సిక ..!
-
మహారాష్ట్రలో దగ్గరవుతున్న ఠాక్రే సోదరులు
-
పోలీసుల భయంతో.. హోటల్ మూడో అంతస్తు నుంచి దూకేసి నటుడు
-
Phule movie ‘ఫూలే’ సినిమాపై అభ్యంతరాలా?
మూడు వేల ఏళ్ల కులవ్యవస్థ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మానవతావాది మహాత్మా ఫూలే. ఆయనపై అనంత్ మహాదేవన్ దర్శకత్వంలో ప్రముఖ నటులు ప్రతీక్ గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రలలో... ‘ఫూలే’ సినిమా తయారయింది. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపిస్తుందనీ... కులవాదాన్ని ప్రోత్సహిస్తుందనీ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్య క్షుడు ఆనంద్ దవేతో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు ఆరోపించడంతో సినిమా విడుదల వాయిదా పడింది. వారి అభ్యంత రాల కారణంగా... సెన్సార్ బోర్డు కూడా కుల సంబంధిత పదా లను తొలగించాలని సూచించింది. అయితే స్వయంగా బ్రాహ్మ ణుడైన ఈ చిత్ర దర్శకుడు అనంత్ మహాదేవన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, సినిమా చారిత్రక వాస్తవాల ఆధారంగా రూపొందిందనీ, ఎటు వంటి అజెండా లేదనీ చెప్పారు. మూడు వేల ఏళ్ల పాటు ఈ దేశంలోని మెజారిటీ వర్గాల ప్రజలకు క్షుద్రులు, శూద్రులు, మ్లేచ్ఛులు, ఛండాలురు అనే పేర్లు తగిలించి... బానిసలుగా చూసిన అమా నుష కులవ్యవస్థ ఈ దేశంలో రాజ్యమేలింది. తమ స్వార్థం కోసం మతాన్ని, సమా జాన్ని భ్రష్టు పట్టించిన ఆ మనువాదుల దౌర్జన్యాలను ఒంటరిగా ఎదిరించిన ధీశాలి ఫూలే. ‘మనుషులందరినీ పుట్టించినవాడు దేవుడే అయినప్పుడు... ఒక తండ్రి తన బిడ్డలలో కొందరు ఎక్కువ కొందరు తక్కువ... కొందరు ద్విజులు, కొందరు పంచ ములు అంటూ ఎలా శాసిస్తాడు? ఇవన్నీ మీరు రాసిన అబద్ధపు రాతలు! ఇక ఈ అకృత్యాలను కట్టిపెట్టండి!’ అంటూ గర్జించి, స్వార్థపర వర్గాల దౌర్జన్యాలపై సమర శంఖం పూరించాడు మహాత్మా ఫూలే.శూద్ర బిడ్డలకూ, స్త్రీలకూ చదువు చెప్పడానికి పుణే వీధుల్లో సావిత్రిబాయి ఫూలే వెళుతుంటే... అగ్రవర్ణాలు రాళ్లు వేసే దృశ్యాన్ని తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఫూలే జీవిత చరిత్రలో ఆయన ఎదుర్కొన్న అవరోధాల ప్రస్తావన ఉండకపోతే... మరేమి ఉంటుంది? జరిగిన చరిత్రను చూపెడితే... మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ బుకాయిస్తే ఎలా?– ఆర్. రాజేశమ్సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ -
కునాల్ కమ్రా: ‘కర్ర పట్టిన రాజ్యంలో.. నోరు గతేమిటి?’
ఒక పురాణ కథ చెప్పుకుందాం.. రుషుల కాలంలో అష్టావక్రుడు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన కురూపి. శరీర నిర్మాణం సరిగా లేనివాడు. అయితేనేం.. అపరిమిత జ్ఞాన సంపన్నుడు! అనేక శాస్త్రాల మీద పట్టు సంపాదించిన వాడు. ఒకసారి ఏమైందంటే.. ఒక రాజుగారి ఆస్థానంలో పండిత గోష్టి జరుగుతోంది. ఎక్కడెక్కడినుంచో దూరదేశాల నుంచి వచ్చిన మహా పండితులు అక్కడి చర్చల్లో పాల్గొంటున్నారు. ఆ సభకు అష్టావక్రుడు కూడా వచ్చాడు. ‘ఎవరివయ్యా నువ్వు.. ఇక్కడకు ఎందుకు వచ్చావు..’ అని అడిగారు రాజుగారు.అష్టావక్రుడు తన గురించి చెప్పుకుని.. పండిత గోష్టిలో పాల్గొనడానికే వచ్చాననే సంగతి వెల్లడించాడు. అలా కురూపిగా ఉన్న ఆయన ఆ మాట చెప్పగానే.. సభలో ఉన్నవాళ్లలో చాలామంది ఫక్కున నవ్వారు. అలాంటి అనాకారి తాను పండితుడినని చెప్పగానే వారికి నవ్వొచ్చింది మరి. ఆ వెంటనే అష్టావక్రుడు వెనుతిరిగి సభనుంచి వెళ్లిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. రాజుగారు కంగారు పడ్డారు. తన ఆస్థనంలో సభ నుంచి ఒక పండితుడు అలా నిరసనగా తిరిగి వెళ్లిపోవడం తనకు అవమానం కదా అని భావించి, అతడిని వారించాడు. ‘పండితుడా.. ఎందుకు వెళ్లిపోతున్నావు’ అని అడిగాడు. అందుకు జవాబుగా అష్టావక్రుడు..‘‘చర్మంతో చెప్పులు కుట్టుకుని పనిచేసే వాళ్లు నిండిన సభలో నేను పాండిత్యం చూపను.. అది నాకు అవమానం..’’ అని అన్నాడు. రాజుగారు ఖంగుతిన్నారు. ‘‘అదేమిటి ఇందరు పేరుమోసిన పండితులు కూర్చుని ఉన్న సభ నీకు.. తోలు చెప్పులు కుట్టుకునే వాళ్ల కూటమిలా కనిపిస్తున్నదా’’ అని కొంచెం కోపగించుకున్నారు కూడా!. అందుకు అష్టావక్రుడు.. ‘‘రాజా నేను మిమ్మల్ని అవమానించాలని ఈ మాట అనలేదు. చర్మాన్ని చూసి విలువను లెక్కగట్టేవాళ్లు చెప్పులు కుట్టేవాళ్లే కదా..’’ అని అన్నాడు.తన ఆకారాన్ని చూసి పాండిత్యాన్ని ఎలా నిర్ణయిస్తారని చెప్పాడు. రాజు కూడా నొచ్చుకున్నాడు. సభలోని సాటిపండితులు కూడా మన్నింపు వేడుకున్నారు. ఆ తర్వాత అష్టావక్రుడు పండితగోష్టిలో పాల్గొనడమూ.. తన పాండిత్యానికి తిరుగులేదని నిరూపించుకోవడమూ జరిగింది. ఇదీ కథ. ఎందుకో.. కునాల్ కమ్రా కు జరిగిన, జరుగుతున్న పరాభవం, హెచ్చరిక, సత్కార ఛీత్కారాలు గమనిస్తోంటే.. ఈ అష్టావక్రుడి కథ గుర్తుకు వస్తోంది. ఎలాంటి రాజ్యంలో బతుకుతున్నాం మనం..? ఒకడు కర్రపట్టుకుని కాపలా కూర్చుని.. ఈ దేశంలో ఎవడు ఏం మాట్లాడినా సరే.. నాకు నచ్చిన నాకు ప్రీతికరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి? అని శాసించే రాజ్యంలో బతుకుతున్నామా? అసభ్యపు మాటలతో, బూతులతో ఏమైనా అంటే.. వాటిని నేరాలుగా పరిగణించడానికి చట్టాలున్నాయి. ఆ చట్టాలను దుర్వినియోగం చేయడం కూడా ఉంది. ఏదైనా సరే.. చట్టం అనే ముసుగులో జరుగుతోంది. చట్టాన్ని మీరిన పనులు చేసినప్పుడు.. అలా అనిపించిన పనులు జరిగినప్పుడు జరుగుతోంది.మరి చట్టం పరిధిలోకి రానటువంటి.. సమకాలీన సంగతులను హాస్యస్ఫోరకంగా, ఆలోచింపజేసే చిరు వెక్కిరింతగా ప్రస్తావించే మాటలకు కూడా మహోద్రేకంతో రగిలిపోయి.. కర్రపట్టుకుని దండించి తీరుతాం అని బరితెగించే మూకలు రాజ్యం చేస్తున్న చోట మనం ఎన్నాళ్లు బతకగలం?. నాయకులు తమ గురించి గొప్పలు చెప్పుకునేప్పుడు.. గతచరిత్రలోని చిన్నస్థాయి నేపథ్యాలను చాలా గర్వంగా వల్లెవేసుకుంటూ ఉంటారు కదా..! అదే నేపథ్యాల గురించి ఒక వెక్కిరింత వస్తే.. ఎందుకంత ఉడికిపోతుంటారు?నోటికి వేసే తాళాలు తయారుచేసుకునే కంపెనీలకే ఇప్పుడు చెల్లుబాటు అయ్యే రోజులు. కర్ర పట్టుకుని కాపలా తిరుగుతూ ఉండే.. కిట్టని మాటలు వినిపిస్తే మూతులు పగలగొట్టాలని చూసే కర్రదండు రాజ్యం చేస్తున్న నేలమీద మనం ఎంతకాలం జీవించగలం? మాట్లాడే స్వేచ్ఛ ఈ దేశంలో ప్రతి మనిషికీ ఉన్నదని అనుకోవడం ఒక భ్రమే కదా? అందరికీ మాట్లాడే స్వేచ్ఛను ఇచ్చింది రాజ్యాంగం.. కానీ, కొందరికి కర్రపుచ్చుకుని దాడులు చేసి, చావచితగ్గొట్టే స్వేచ్ఛను ఇస్తున్నాయి ప్రభుత్వాలు!-ఎం.రాజేశ్వరి -
అలా చేస్తే అత్యాచారం కిందికి రాదు : అలహాబాద్ కోర్టు తీర్పుపై దుమారం
ఒక అత్యాచార కేసులో అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు వివాదాన్నిరేపుతున్నాయి వక్షోజాలను పట్టుకోవడం(Grabbing Breasts), పైజామా నాడాను చింపేయడం (Snapping Pyajama String) అత్యాచార యత్నం కిందికి రావంటూ హైకోర్ట్ తీర్పునిచ్చింది. ఈ చర్యలు అత్యాచారంగా పరిగణించ లేమని పేర్కొంది దీనిని పోక్సో చట్టం కింద తీవ్రమైన లైంగికదాడిగా పరిగణించవచ్చని వెల్లడించింది. అత్యాచారయత్న దశ (preparation stage) కు, వాస్తవ ప్రయత్నం (actual attempt) మధ్య తేడాను ఉందని వ్యాఖ్యానించింది. నిందితుడు అత్యాచారం చేయాలని నిశ్చయించుకున్నట్లు రికార్డులో ఉన్న ఏ సాక్ష్యమూ లేదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. దీనిపై మహిళా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రముఖ గాయని, చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) కూడా ఈ వివాదాస్పద తీర్పుపై సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది.2021 నాటి కేసులో పవన్, ఆకాశ్ అనే వ్యక్తులు 11 ఏళ్ల చిన్నారిని లైంగికంగా దాడి చేసినట్లు ఆరోపణలు నమోదైనాయి. ప్రాసిక్యూషన్ ప్రకారం, లిఫ్ట్ ఇస్తామని చెప్పి నిందితులు మైనర్ బాలిక పట్ల అభ్యంతకరంగా ప్రవర్తించారు. బలవంతంగా ఆమెను కల్వర్ట్ క్రింద లాగే ప్రయత్నం చేశారు. బాటసారులు జోక్యం చేసుకోవడంతో నిందితులు అక్కడి నుండి పారిపోయారు.వారు ఆ బాలికను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం నిందితులైన పవన్ , ఆకాష్‌లపై మోపబడిన ఆరోపణలు అత్యాచార ప్రయత్నం నేరంగా పరిగణించబడని స్పష్టం చేసింది.ఈ చర్య వల్ల బాధితురాలు నగ్నంగా లేదా వివస్త్రగా మారినట్టు సాక్షులు చెప్పలేదు. అంతేకాదు లైంగిక దాడికి ప్రయత్నించాడన్న ఆరోపణ లేవీ లేని కోర్టు తెలిపింది.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?నిందితులను ఐపీసీ సెక్షన్ 354-బి (దుస్తులను తొలగించే ఉద్దేశ్యంతో దాడి లేదా నేరపూరిత బలప్రయోగం)తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక దాడి) కింద విచారించాలని ఆదేశించింది. మరోవైపు పవన్ తండ్రి, మూడో నిందితుడు అశోక్ బాధితురాల్ని దుర్భాషలాడి, బెదిరించాడన్న ఆరోపణలున్నాయి. -
ఔరంగజేబు రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ: డిప్యూటీ సీఎం వ్యాఖ్యల దుమారం
Aurangzeb Controversy మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి తొలగింపుపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. మంగళవారం ఈ అంశంపై రాష్ట్ర శాసన మండలిలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. నాగ్‌పూర్ హింసపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే కౌన్సిల్లో ప్రసంగిస్తూ... ఎవరి సమాధిని తొలగించాలని ఇప్పుడు రైట్‌వింగ్ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయో అటువంటి వ్యక్తిని గురించి పొగడటమేమిటి? ‘ఔరంగజేబు ఎవరు? మన రాష్ట్రంలో ఆయనను కీర్తించడాన్ని మనం ఎందుకు అనుమతించాలి? రాష్ట్ర చరిత్రలో అతను ఒక మాయని మచ్చ‘ అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాలనను ఔరంగజేబు పాలనతో పోల్చడాన్ని శిందే తీవ్రంగా తప్పుపట్టారు. ఫడ్నవీస్ పాలన, ఔరంగజేబు పాలనా ఒకటేనా? ‘ఔరంగజేబు తన శత్రువులను హింసించిన విధంగా ఫడ్నవీస్ ఎప్పుడైనా ఎవరినైనా హింసించారా?‘ అంటూ శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ అనిల్ పరబ్ వైపు తిరిగి ప్రశ్నించారు.చదవండి: Nagpur issue కొనసాగుతున్న కర్ఫ్యూ, స్థానిక ఎన్నికల కోసమే ఇదంతా?దీనికి పరబ్ కోపంగా తనకు ఈ విషయంపై స్పందించే అవకాశమివ్వాల్సిందిగా చైర్మన్‌ను కోరారు. కానీ చైర్మన్ రామ్‌శిందే పరబ్‌ను అనుమతించలేదు. ఆయన మైక్రోఫోన్‌ను మ్యూట్ చేశారు. అయినప్పటికీ పరబ్, ప్రతిపక్ష నాయకుడు అంబదాస్ దన్వే, సచిన్ పరబ్ ఇతర సభ్యులతో కలిసి తమను మాట్లాడనివ్వవలసిందిగా నిరసన తెలియజేశారు. ఇంత జరుగుతున్నా శిందే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘నేనేంచేసినా బహిరంగంగా చేశా. ఔరంగజేబ్ (కాంగ్రెస్) పట్ల సానుభూతి చూపే వారి నుంచి శివసేనను కాపాడడానికే నేను ఇదంతా చేస్తున్నానని అనిల్ పరబ్ మర్చిపోకూడదు. ఔరంగజేబ్ సమాధికి రక్షణ కల్పించింది కాంగ్రెస్సే.‘ అని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు? -
లీలావతి ఎవరు? ఆమె పేరుతో ఉన్న ఆస్పత్రి ఎందుకు చిక్కుల్లో పడింది?
ముంబై: మహానగరం ముంబైలోని సుప్రసిద్ధ లీలావతి హాస్పిటల్(Lilavati Hospital) గురించి ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటారు. ముంబైలోని ప్రముఖులైవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు లీలావతి ఆస్పత్రిలో చేరారనే వార్తలను మనం అప్పుడప్పుడూ వినేవుంటాం. ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైనప్పుడు, ఆయనను చికిత్స కోసం లీలావతి ఆస్పత్రిలోనే చేర్చారు. ఇప్పుడు ఈ ఆస్పత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. దీనిని నడుపుతున్న ఛారిటబుల్ ట్రస్ట్ అవినీతికి పాల్పడిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.ఈ ఛారిటబుల్ ట్రస్ట్ ఇటీవల.. ఇదే ట్రస్ట్‌కు చెందిన మాజీలు, సంబంధిత వ్యక్తులు రూ. 1,500 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించింది. ఈ ఉదంతంలో లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (ఎల్కేఎంఎంటీ)తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు వేర్వేరుగా బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త కీర్తిలాల్ మెహతా(diamond businessman Kirtlal Mehta) తన భార్య లీలావతి మెహతా పేరు మీద ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఇందుకోసం ఆయన లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్‌ను నెలకొల్పారు. లీలావతి ఆస్పత్రికి 1997లో పునాది వేశారు. ముంబైలో మెరుగైన ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ఆస్పత్రి ఏర్పాటయ్యింది. దీనిలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారు. కీర్తిలాల్ మెహతా 2002లో అనారోగ్యానికి గురయ్యారు.దీంతో ఆయన సోదరుడు విజయ్ మెహతా ట్రస్ట్ పగ్గాలు చేపట్టారు.2006లో విజయ్ మెహతా తన కొడుకు, మేనల్లుళ్లను అక్రమంగా ట్రస్టీలుగా చేసి, కిషోర్ మెహతాను శాశ్వత ట్రస్టీ పదవి నుంచి తొలగించారనే ఆరోపణలు వినిపించాయి. అయితే 2016లో కిషోర్ మెహతా తిరిగి ట్రస్టీ అయ్యారు. ఆయన ఈ బాధ్యతలను ఎనిమిది సంవత్సరాలు పాటు నిర్వహించారు. 2024లో కిషోర్ మెహతా మరణానంతరం అతని కుమారుడు ప్రశాంత్ మెహతా శాశ్వత ట్రస్టీగా మారి, ఆసుపత్రి ఆర్థిక రికార్డులను ఆడిట్(Audit) చేయించారు. ఈ నేపధ్యంలో పలు అక్రమాలు వెలుగు చూశాయి. ఇప్పుడు దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఇది కూడా చదవండి: ఐస్ బాత్ థెరపీ అంటే ఏమిటి? వ్యాయామం తరువాత ఎందుకు చేస్తారు? -
గెలవక ముందు ‘జనసేనాని’.. గెలిచాక 'భజన సేనాని’: ప్రకాశ్ రాజ్
సాక్షి, అమరావతి: త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్న(శుక్రవారం) రాత్రి జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా, పవన్ గెలవక ముందు ‘‘జనసేనాని’’.. గెలిచిన తరువాత ‘‘భజన సేనాని" అంతేనా? అంటూ సెటైర్లు వేశారాయన. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టులను ట్వీట్‌కి ప్రకాశ్‌రాజ్ జత చేశారు.‘‘హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదంటూ అంతకుముందు మరో ట్వీట్ కూడా చేశారు ప్రకాష్‌రాజ్. ‘‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’’ అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్..’ అంటూ కామెంట్స్ చేశారాయన.కాగా, పవన్ కల్యాణ్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే కూడా స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.“ గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా #justasking pic.twitter.com/EqjtqK6qFA— Prakash Raj (@prakashraaj) March 15, 2025‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ పాఠశాలలు వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని సయీద్ హఫీజుల్లా తేల్చి చెప్పారు. -
అన్ని భాషలు సమానం... హిందీ మరింత సమానం!
దేశంలో ఇప్పుడు హిందీ వివాదం రగులుకుంది. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ దక్షణ భారతదేశంలో హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి నడుం బిగించారు. తమిళనాడులో పెరియార్ ఇవీ రామసామి నాయకర్ కాలం నుండే హిందీ వ్యతిరేకతకు చాలా చరిత్ర వుంది. స్టాలిన్ పిలుపు మీద దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పంది స్తాయో వేచి చూడాలి. మనకు జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీషు, రాష్ట్ర భాష తెలుగు (Telugu) అనే ఒక తప్పుడు అభిప్రాయం సామాన్యుల్లోనేగాక విద్యావంతుల్లోనూ కొనసాగుతోంది. ఏపీ తెలుగు, తెలంగాణ (Telangan) తెలుగు రెండూ వేరే భాషలు, ప్రజలు వేరే జాతులవారు అనే అభిప్రాయాన్ని కొన్నాళ్ళుగా కొందరు కొనసాగిస్తు న్నారు. అది ఆ యా సమూహాల ఉనికివాద కోరికలు కావచ్చు. ఇవిగాక ఈ రెండు రాష్ట్రాల్లోనూ చెరో పాతిక భాషలు మాట్లాడే సమూహాలున్నాయి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో గోండి, కోయ, కొంద, కువి, కోలామీ, పెన్గొ, మంద, యానాది, లంబాడ, సవర (Savara Language) తదితర చిన్న సమూహాలు ఓ పాతిక వరకు ఉంటాయి. అధికార భాషల ప్రాబల్యంలో చిన్న సమూహాలు చితికి పోతాయి; వాళ్ళ భాషలు అంతరించిపోతాయి. భాష కూడ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లాంటిది. తనకన్నా కింద ఉన్న కుల సమూహాన్ని అణిచివేసే సమూహాన్ని అంతకన్నా పైనున్న కుల సమూహం అణిచివేస్తుంటుంది. చిన్న సమూహాలు తమ మాతృభాషను వదులుకోవాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తారు. ఒక భాష అంతరించిపోవడం అంటే ఒక జాతి తన సంస్కృతీ సంప్రదాయాలనూ, తను సృష్టించినకళాసాహిత్యాలనూ కోల్పోవడమే అవుతుంది. అంటే ఆ జాతి ముందు జీవన్మృతిగా మారిపోతుంది. ఆ తరు వాత అంతరించిపోతుంది. బ్రిటిష్ ఇండియా మతప్రాతిపదిక మీద ఇండియా–పాకిస్తాన్‌గా చీలిపోయినట్టు మనకు తెలుసు. అయితే, ఒకేమత సమూహం అయినప్పటికీ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ భాషా ప్రాతిపదిక మీద విడిపోయిందని మనకు గుర్తు ఉండదు. మనుషులకు భాష ప్రాణమంత ముఖ్యమైనది. యూరోప్ దేశాలన్నింటిలోనూ క్రైస్తవ మతసమూహాల ఆధిక్యత ఎక్కువ. అయినప్పటికీ, అవి అన్ని దేశాలుగా విడి పోవడానికి ప్రధాన కారణం భాష. సంస్కృతాన్నిసంఘపరివారం దైవవాణిగా భావిస్తుంది. తాము నిర్మించ తలపెట్టిన ‘హిందూరాష్ట్ర’లో సంస్కృతం జాతీయ భాషగా ఉంటుందనేది ఆ సంస్థ అభిప్రాయం. అంతవరకు దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా కొనసాగించాలని వారి ఆలోచన. జాతీయ భాష మీద చర్చ రాజ్యాంగ సభలోనే జోరుగా సాగింది. మనకు అందుబాటులో ఉన్న భాషల్లో ఏదో ఒకదాన్ని జాతీయ భాషగా చేస్తే అది మిగిలిన భాషల్ని మింగేస్తుందని చాలా మంది తీవ్ర ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలు 22 భాషలకు గుర్తింపు ఇచ్చినప్పటికీ ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. అన్ని భాషలూ సమానమే. మనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న భాషలే తెలుసు. బోడో, డోగ్రీ, మైథిలి, సంథాలి తదితర భాషలకు కూడ రాజ్యాంగంలో స్థానంఉందని మనం తరచూ గుర్తించం. హిందీ జాతీయ భాష కాదు; అది కేంద్ర ప్రభుత్వానికి అధికార భాష మాత్రమే. హిందీ సరసన ఇంగ్లీషును కూడ అనుసంధాన భాషగా గుర్తిస్తున్నారు. జనాభాను బట్టి లోక్‌సభ స్థానాలు నిర్ణయం అవుతాయని మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచే సమయంలోనూ జనాభా, లోక్‌సభ సీట్లు తదితర అంశాలు ప్రాతిపదికగా మారుతాయి. అదీగాక, త్వరలో లోక్‌సభ నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగబోతోంది. ఉత్తరాది స్థానాలు మరింతగా పెరిగి దక్షిణాది స్థానాలు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్టు కొందరు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. అంచేత ఇది భాషా సమస్య మాత్రమే కాదు; రాజకీయార్థిక సమస్య. ఎవర్ని ఎవరు పాలించాలనే ప్రాణప్రదమైన అంశం ఇందులో ఉంది. 1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన... మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్ అంబేడ్కర్ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్ భయపడి నట్టే జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్‌లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది.‘యానిమల్ ఫార్మ్’ వ్యంగ్య నవలలో జార్జ్ ఆర్వెల్ ఒకచోట విరోధాభాసాలంకారం ప్రయోగిస్తాడు. ఫార్మ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న పందుల సామాజిక వర్గం ‘జంతువులన్నీ సమానం; కానీ, పందులు మరింత సమానం’ అంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి విరోధాభాసాలంకారాన్ని తరచూ ప్రయోగిస్తున్నది. రాష్ట్రాలన్నీ సమానం కానీ, హిందీ బెల్టు మరింత సమానం. ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా సమానం అంటున్నది. ఇప్పుడు ‘భాషలన్నీ సమానం; కానీ, హిందీ మరింత సమానం’ అంటూ కొత్త పాట మొదలెట్టింది.-డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
పాటలపై హక్కులెవరికి..?
సినిమా పాటల హక్కులు ఎవరివి అనే వివాదం చాలాకాలంగా చిత్ర పరిశ్రమలో నడుస్తోంది. సంగీతదర్శకుడు ఇళయరాజా ‘నా పాటపై హక్కు నాదే’ అంటుంటారు. కొందరు గాయనీగాయకులు తమకు రాయల్టీ రావాలంటున్నారు. కొందరైతే నిర్మాతలకే హక్కు అంటున్నారు. ఈ విషయంపై చెన్నైకి చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ అసోసియేషన్ సహకారంతో క్రియాలా, ఐపీ అండ్ మ్యూజిక్ సంస్థలు శనివారం చెన్నైలో సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సులో నిర్మాత ధనుంజయన్, థింక్ మ్యూజిక్ ఇండియా సంతోష్, గాయకుడు హరిచరణ్ శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కాగా సినిమా పాటలు అనేక మాధ్యమాల ద్వారా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. అసలు వీటి హక్కులు ఎవరికి చెందుతాయి? అనే విషయం గురించి క్రియాలా సంస్థ నిర్వాహకుడు, న్యాయవాది ఎంఎస్. భరత్ మీడియా సమావేశంలో వివరిస్తూ... ఒక పాట రూపొందాలంటే సంగీత దర్ళకుడు, గీత రచయిత, గాయకుడు, సౌండ్ ఇంజినీర్.. ఇలా పలువురి కృషి ఉంటుందన్నారు. అయితే వీటన్నింటికీ మూలం నిర్మాత అనీ, ఆయన పెట్టుబడితోనే పాట రూపొందుతోందనీ, పాటలకు మొదటి హక్కుదారుడు నిర్మాతనే అని అన్నారు. ఒకవేళ ఒప్పందం ఉంటే, అందులోని నిబంధనల ప్రకారం హక్కులు వర్తిస్తాయన్నారు. ఎలాంటి ఒప్పందం లేకపోతే పాటల హక్కులు నిర్మాతకే ఉంటాయన్నారు. ఒకవేళ చిత్ర నిర్మాత కన్నుమూస్తే, ఆయన కుటుంబ సభ్యులకే హక్కులు చెందుతాయని భరత్ పేర్కొన్నారు. – ‘సాక్షి’ చెన్నై, తమిళ సినిమా -
మరోసారి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై:తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడుకు రావాల్సిన సమగ్రశిక్ష అభియాన్ రూ.2190 కోట్ల రూపాయల నిధులు తామేమీ అడుక్కోవడం లేదన్నారు. మీ తండ్రి సొమ్ము అడగడం లేదని ఫైరయ్యారు.‘మేమేమీ మీ తండ్రి సంపాదించిన సొమ్ము అడగడం లేదు. మాకు హక్కుగా రావాల్సిన నిధులే మేం అడుగుతున్నాం. తమిళనాడు ప్రజలు కట్టే పన్ను డబ్బులనే మేం అడుతున్నాం. బీజేపీ బెదిరింపులకు భయపడేదే లేదు. తమిళనాడుపై హిందీని రుద్దాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని రెండు భాషల పాలసీ ప్రస్తుతం ప్రమాదంలో పడింది. ఫాసిస్టు బీజేపీపై ఈ విషయంలో పోరాడేందుకు ప్రతిపక్షం అన్నాడీఎంకే మాతో కలిసి రావాలి. తమిళనాడు ప్రజలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని చూస్తోంది’అని ఉదయనిధి మండిపడ్డారు. కాగా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) కింద మూడు భాషల పాలసీని అమలు చేసేదాకా తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇటీవలే స్పష్టం చేసిన నేపథ్యంలో ఉదయనిధి స్పందించారు. గతంలోనూ ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. -
బాయ్ కాట్ లైలా.. ఆ సినిమాపై చూపిన ప్రభావం ఎంత ?
-
ఫామ్‌హౌజ్‌కి పోయి 8 ఏళ్లు అవుతోంది: పోచంపల్లి
సాక్షి, హైదరాబాద్: ఫామ్‌హౌస్ వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు.ఫామ్‌హౌస్ కోడిపందాల కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఫామ్‌కు యజమానికిగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఈ కేసులో నిందితుడిగా కూడా చేర్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణ తీవ్ర కలకలం రేపింది. కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఫామ్‌హౌస్‌ను శివ కుమార్ వర్మ లీజ్‌కు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
మరో వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి
సాక్షి,ఎన్టీఆర్జిల్లా:ఎప్పుడూ వివాదాల్లో ఉండే తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. గురువారం(ఫిబ్రవరి 6) తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్త పల్లికంటి డేవిడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేకే ఆత్మహత్యచేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో డేవిడ్ చెప్పడం సంచలనమైంది. ‘పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశా. కొలికపూడి దళిత ఎమ్మెల్యే అయినప్పటికీ దళితుడినైన నన్ను ఎమ్మెల్యే వేధిస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. నాలాంటోళ్లు ఎంతో మంది పైకి చెప్పుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే వేధింపులతో ఇక బతకడం అనవసరం. నా చావుతోనైనా తిరువూరు పార్టీ కార్యకర్తలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’అని సెల్ఫీ వీడియోలో డేవిడ్ విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబానికి చంద్రబాబే న్యాయం చేయాలని కోరాడు. ప్రస్తుతం డేవిడ్ విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, కొలికపూడిపై ఇటీవల సొంత పార్టీలో ఫిర్యాదులు ఎక్కువవడంతో పార్టీ క్రమశిక్షణ సంఘం కూడా ఆయనను సంజాయిషీ కోరింది. గతంలో దళిత క్రైస్తవుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొలికపూడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే ఆది వర్సెస్ ఎంపీ సీఎం రమేష్.. బీజేపీ నేతల మధ్య వార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ల మధ్య పొసగడం లేదు. ఆదినారాయణరెడ్డి బంధువు పేకాట శిబిరాలు నడుపుతున్నాడంటూ కలెక్టర్, ఎస్పీకి సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు పంపిన సీఎం రమేష్.. ఆది బంధువు దేవగుడి నాగేశ్వరరెడ్డిపై కంప్లెంట్ చేశారు.ఆదినారాయణరెడ్డి వ్యవహారాలన్నీ చక్కబెట్టే నాగేశ్వరరెడ్డిపై సీఎం రమేష్ ఫిర్యాదుతో ఆదినారాయణ రెడ్డి అరాచకాలు బట్టబయలయ్యాయి. ఇప్పుడు పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు కలిసి ఉన్న ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్‌ల మధ్య డైరెక్ట్ వార్ సాగుతోంది.ఇదీ చదవండి: ‘చంద్రబాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం’ -
AP: వివాదాస్పదమైన దేవాదాయ కమిషనర్ నియామకం
సాక్షి,విజయవాడ: దేవాదాయ శాఖ కమిషనర్ నియమాకం వివాదాస్పదమైంది. దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్‌గా కూటమి ప్రభుత్వం తాజాగా రామచంద్రమోహన్‌కి బాధ్యతలు అప్పగించింది. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్‌కి కమిషనర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నాన్ ఐఏఎస్ అధికారికి దేవాదాయశాఖ కమిషనర్‌గా బాధ్యతలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ అధికారిని కాదని రామచంద్రమోహన్‌కి బాధ్యతలు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాదాయశాఖలో ఏడీసీ 1 గా ఉన్న అధికారిని పక్కనపెట్టి రామచంద్రమోహన్‌కి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడమేంటని ఇతర అధికారులు చర్చించుకుంటున్నారు.తీవ్రమైన అవినీతి ఆరోపణలు,కేసులు ఉన్న రామచంద్రమోహన్ దుర్గగుడి ఈవోగా కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకే వ్యక్తికి ఇన్ని బాధ్యతలు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.సామాజికవర్గం ఎఫెక్ట్‌తోనే రామచంద్రమోమన్కి కీలక పోస్టు దక్కిందన్న మరో ప్రచారం కూడా జరుగుతోంది. -
కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో వివాదం
సాక్షి,రాజన్నసిరిసిల్లజిల్లా: సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం(జనవరి24) సాయంత్రం సిరిసిల్లలో కొద్దిసేపట్లో కేటీఆర్ ప్రారంభిస్తారనగా కమ్యూనిటీ హాలుకు మున్సిపల్ అధికారులు తాళం వేశారు.కేటీఆర్‌తో కమ్యూనిటీ హాల్ ప్రారంభింపచేయడానికి పాలకవర్గం సిద్ధం చేసుకుంది.అయితే ఈ ప్రారంభంపై ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్ పనులు ఇంకా పూర్తి కాలేదని,ప్రోటోకాల్ పాటించి కమ్యూనిటీ హాల్‌కు విప్ ఆది శ్రీనివాస్ పేరు వేయలేదని ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలు అడ్డుకట్ట వేశారు. అయితే శుక్రవార సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించి పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పక్క నియోజకవర్గమైన వేములవాడకు కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.విప్ పదవిలో ఉన్న తమ నేత పేరును పక్క నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలపై రాయకపోవడం ఆది శ్రీనివాస్ వర్గీయుల ఆగ్రహానికి కారణమైనట్లు చెబుతున్నారు. -
కోర్టుకు నటి రమ్య హాజరు
దొడ్డబళ్లాపురం: ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య మంగళవారంనాడు బెంగళూరులోని కమర్షియల్ కాంప్లెక్స్ కోర్టు ముందు హాజరయ్యారు. హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె అనే సినిమా విడుదలను ఆపాలని గతంలో రమ్య కోర్టును ఆశ్రయించారు, ఈ కేసులో విచారణకు వచ్చారు. 2024 జూలైలో రమ్య ఆ సినిమా నిర్మాతపై కేసు వేశారు. తన అనుమతి తీసుకోకుండా సినిమాలో తన దృశ్యాలను వాడుకున్నారని ఆమె చెబుతున్నారు. కాబట్టి సినిమా విడుదల ఆపాలని, తనకు రూ.1 కోటి పరిహారం ఇప్పించాలని కోరారు. విచారణ తరువాత వాయిదా వేశారు. -
ఆ దున్నపోతు మాదే!
అనంతపురం: దేవర దున్నపోతు కోసం రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. కూడేరు మండలం ముద్దలాపురంలో ముత్యాలమ్మ, కదరగుంటలో బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా దేవర నిర్వహణకు గ్రామస్తులు పూనుకున్నారు. ఇందు కోసం దేవరలో బలి ఇచ్చేందుకు గ్రామానికి ఒక దున్నపోతును వదిలారు. ఈ రెండు దున్నపోతులు నాలుగేళ్లుగా సమీప గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఈ నెల 22న దేవర ఉండడంతో ఇటీవల గ్రామంలోకి వచ్చిన దున్నపోతును కదరకుంట గ్రామస్తులు కట్టేశారు. 21వ తేదీన ముద్దలాపురంలో దేవర ఉంది. దీంతో పక్క గ్రామంలో కట్టేసిన దున్నపోతు తమ గ్రామానికి చెందినదేనని ముద్దలాపురం గ్రామస్తులు నిర్ధారణకు వచ్చారు. తమ దున్నపోతును వదిలేస్తు దేవర చేసుకుంటామని కోరగా కడదరకుంట గ్రామస్తులు ఇందుకు ససేమిరా అన్నారు. అది తమదేనని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో ముద్దలాపురం గ్రామస్తులు శుక్రవారం ఎస్పీని కలిసేందుకు కార్యాలయానికి వెళ్లారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించే సోమవారం రోజున రావాలంటూ సిబ్బంది సూచించడంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెనుదిరిగారు. -
మంచు ఫ్యామిలీలో అడవి పంది వివాదం


