
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కాన్స్ ఫిలి ఫెస్టివల్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) మరోసారి సంచలనం రేపింది. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిలుక లాంటి గౌనుతో పాటు చిలుక క్లచ్‌తో తొలిసారి మురిపించిన ఈ బ్యూటీ ఈ సారి ఏకంగా గోల్డ్, డైమండ్స్‌తో రూపొందించిన 'బికినీ' బ్యాగ్‌తో కనిపించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ డైమండబ్యాగ్ ధర ఎంతో తెలుసా?
గత కొన్నేళ్లుగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ సందడిలో ఎక్కువగా వినిపించే పేరు ఊర్వశి రౌతేలా. అలాగే వివాదాలకు కూడా తక్కువేమీ కాదు. మొన్న చిలక క్లచ్‌తో వివాదాన్ని రూపి, కొంతమందినెటిజన్లను ఆకట్టుకోవడంలో విఫలమైనప్పటికీ, ఖరీదైన బ్యాగ్‌తో రెడ్ కార్పెట్‌పైకి తిరిగి వచ్చింది. దీని ధర. రూ. 5.29 లక్షల బస్ట్ గోల్డ్ బికినీ బ్యాగ్‌ను ప్రదర్శించడం చర్చకు దారి తీసింది. అంతేకాదు ఈ ఫెస్టివల్లో మొదటి రోజు ఆమో ధరించిన చిలుక క్లచ్ కూడా జుడిత్ లీబర్ బ్రాండ్‌కు సంబంధించిందే.. దీని ధర రూ. 4.86లక్షలు.
బంగారు రంగు ఫిష్‌టైల్-స్టైల్ గౌనులో నటి లా వెన్యూ డి ఎల్'అవెనిర్ (కలర్స్ ఆఫ్ టైమ్) ఉర్వశి రౌతేలా ఈ ప్రదర్శనకు హాజరైంది. ఈ గౌను అభిమానులను మంత్రముగ్ధులను చేసినప్పటికీ, హైలైట్‌గా నిలిచించి మాత్రం గోల్డ్ బికినీ బ్యాగ్.
ఇదీ చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు
లగ్జరీ బ్రాండ్ జుడిత్ లీబర్ బస్ట్-షేప్డ్ బికినీ బ్యాగ్‌ను ధరించింది. మెటాలిక్ గోల్డ్ బికినీ టాప్‌తోపాటు, ఖరీదైన రత్నాలు, స్ఫటికాలు, వివిధ ఆకారాలు, కట్‌లు, ఫ్యాన్సీ నెక్లెస్‌ల కలగలుపుతో తయారు చేశారు. చేయబడింది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, బ్యాగ్ షాంపైన్-టోన్డ్ మెటల్ హార్డ్‌వేర్‌తో పుల్-ట్యాబ్ మాగ్నెటిక్ క్లోజర్‌ను కలిగి ఉంది. షోల్టర్ చైన్‌తోపాటు, మెటాలిక్ లెదర్-లైన్డ్ ఇంటీరియర్‌తో కూడా వచ్చింది. ఇక ధర విషయాని వస్తే దీని ధర 6,195 అమెరికన్ డాలర్లు. అంటే దాదాపు రూ. 5,29,000 అవుతుంది. ఈ బస్ట్ బ్యాగ్ ఎనిమిది ఇతర వేరియంట్లలో అందుబాటులో ఉంది.
చదవండి: బనారసీ చీరలో నీతా అంబానీ లుక్ : లగ్జరీ బ్యాగ్ స్పెషల్ ఎట్రాక్షన్
ఫోటోషూట్ కోసం ఊర్వశి ఏం చేసిందంటే..
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025, ఊర్వశి రౌతేలా మెట్లపై ఫోటోషూట్ సమయంలో ఎవ్వరినీ లోపలికి రావడానికి వీల్లేకుండా, దారిని బ్లాక్ చేసిందట. రెడ్ కార్పెట్ కి వెళ్లేముందు హోటల్ మెట్ల మార్గంలో ఫోటోషూట్ చేయించుకుంది. ఈ సందర్భంగా ఇతర అనేక మంది ఇతర అతిథులకు ఆటంకం కల్పించింది. కనీసం వారినిచూసి అని పక్కకు తప్పుకోకుండా, తన పోజుల్లో మునిగిపోవడంతో వారు అసౌకర్యానికి గురయ్యారని సమాచారం.