బనారసీ చీరలో నీతా అంబానీ లుక్‌ : లగ్జరీ బ్యాగ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ | Nita Ambani Carries Custom Hermes Birkin Bag At NMACC Event In New York | Sakshi
Sakshi News home page

బనారసీ చీరలో నీతా అంబానీ లుక్‌ : లగ్జరీ బ్యాగ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

May 23 2025 12:04 PM | Updated on May 23 2025 3:56 PM

NMACC Event In New York Nita Ambani Look Hermes Birkin Bag

రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అంతర్జాతీయ వేదికపై  భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు.   దేశంలో ముంబైలో నెలకొల్పిన  'నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీతా న్యూయార్క్‌లోని ఐకానిక్ లింకన్ సెంటర్‌లో 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్'  పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అంతేకాదు స్వయంగా భరతనాట్యం నృత్యకారిణి నీతా  అంబానీ ఈ వేదికపై  ప్రదర్శన ఇవ్వనున్నారు.

బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ భారతీయత, ష్యాషన్‌ పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు.వ్యాపారం , ఫ్యాషన్ రంగంలో ఎప్పుడూ ప్రత్యేకమైన శైలే. ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతిని అందరినీ ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు.  ప్రీ-ఈవెంట్ లుక్‌లో అచ్చమైన బంగారం, వెండి జరీతో  గండభేరుండ మోటిఫ్‌లతో  చేతితో నేసిన ఎరుపు రంగు బనారసి చీరను ధరించారు.  దీనికి  సింపుల్‌ జ్యుయల్లరీ ఎంచుకున్నారు.  దీనికి జతగా ధరించిన   కస్టమ్ హెర్మ్స్ బ్యాగ్ షో మరింత హైలైట్‌గా నిలిచింది. రాబోయే ఈవెంట్‌పై పనిచేస్తున్న ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా  దీనికి సంబంధించిన ఫోటో, వివరాలను పంచుకున్నారు.  ఈ లగ్జరీ బ్యాగ్‌ను  పదేళ్ల క్రితం ఆమె కోసం ప్రత్యేకంగా రూపొందించారట. నీతా అంబానీ ఇప్పటికే తన లుక్‌తో భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి  మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.


 

సెప్టెంబర్ 12 నుండి 14 వరకు న్యూయార్క్‌లో ఇండియా వీకెండ్‌
NMACC సెప్టెంబర్ 12 నుండి 14, 2025 వరకు న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్‌లో ఇండియా వీకెండ్‌ను నిర్వహించనుంది. 2023లో భారతదేశ సంస్కృతి, వారసత్వం, నాటకం, నృత్యం, జానపదాలు, కళలను ప్రోత్సహించే  లక్ష్యంతో ఏర్పాటైన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ మరో అడుగు ముందుకేసిందని నీతా అంబానీ ప్రకటించారు.  ప్రపంచ వేడుకగా  తొలిసారి న్యూయార్క్‌లోని ప్రఖ్యాత లింకాన్‌ సెంటర్‌లో  ఎన్‌ఎంఏసీసీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు డ్యాన్స్‌, సంగీతం, ఫ్యాషన్, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నామని ఆమె తెలిపారు.  ఈ వేడుకలో భారతదేశం, దేశానికి  చెందిన   5 వేల ఏళ్లనాటి వైభవాన్ని చాటి చెప్పేందుకు ఉత్సాహంగా ఉన్నామని  చెప్పారు నీతా అంబానీ.

చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్‌ లుక్‌కి ఫిదా

గ్రాండ్ స్వాగత్ ఉత్సవంతో   ఈవేడుకలు ప్రారంభమవుతాయి. ఇందులో అంబానీ చేనేత ఎంపోరియం, స్వదేశ్ కోసం ఫ్యాషన్ షో కూడా ఉంటుంది. ప్రతి డిజైన్‌ను మనీష్ మల్హోత్రా క్యూరేట్ చేస్తారు. మరోవైపు, నగరంలో తన రెస్టారెంట్ బంగ్లాను నడుపుతున్న మిచెలిన్ స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా, దేశంలోని విభిన్న రుచులతో ప్రత్యేకంగా రూపొందించిన మెనూను అందిస్తారు. ఇంకా శంకర్ మహదేవన్, శ్రేయ ఘోషల్ ,రిషబ్ శర్మ వంటి సంగీతకారులు , గాయకులు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్‌ చర్య, భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement