నేను ఏ తప్పూ చేయలేదు: క్లింటన్‌ | Bill Clinton Tells GOP-led Panel He Had No Knowledge Of Epstein Crimes, Read Story For More Details | Sakshi
Sakshi News home page

నేను ఏ తప్పూ చేయలేదు: క్లింటన్‌

Feb 28 2026 4:04 AM | Updated on Feb 28 2026 1:06 PM

Bill Clinton tells GOP-led panel he had no knowledge of Epstein crimes

వాషింగ్టన్‌: సెక్స్‌ రాకెట్‌ సూత్రధారి జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసును దర్యాప్తు జరుపుతున్న కాంగ్రెస్‌ సభ్యుల బృందం ఎదుట మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ హాజరయ్యారు. తానెలాంటి తప్పూ చేయలేదని, ఎప్‌స్టీన్‌ వేధింపులకు సంబంధించి తనకు ఏమాత్రం తెలియదని చెప్పారు. న్యూయార్క్‌లోని చప్పాక్వాలో శుక్రంగా గోప్యంగా జరిగిన విచారణ సందర్భంగా రెండు దశాబ్దాల క్రితం అతడితో కొనసాగించిన సంబంధాలపై సభ్యులడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 

కాంగ్రెస్‌ ఎదుట మాజీ అధ్యక్షుడొకరు విచారణకు హాజరవడం ఇదే మొదటిసారి కానుంది. కాగా, బిల్‌ క్లింటన్‌పై ప్రత్యేకంగా ఎటువంటి అభియోగాలు లేనప్పటికీ ఇటీవల విడుదల చేసిన వీడియోల్లో ఆయన పలు సందర్భాల్లో కనిపించడం దుమారం రేపింది. గురువారం ఆయన భార్య హిల్లరీ క్లింటన్‌ సైతం కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. మాజీ విదేశాంగ మంత్రి కూడా అయిన హిల్లరీని సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు.

 అయితే, ఎప్‌స్టీన్‌ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడున్నాడనే విషయం తనకు తెలియదని చెప్పారు. అతడితో సమావేశమైనట్లు కూడా తనకు గుర్తు లేదన్నారు. ఎప్‌స్టీన్‌ గురించి తామడిగిన ప్రశ్నల్లో చాలా మటుకు క్లింటన్‌ దంపతులు సమాధానమివ్వకుండా దాటేశారని కమిటీ చైర్‌ బాధ్యతల్లో ఉన్న జేమ్స్‌ కోమర్‌ చెప్పారు. ఉన్నత స్థానాల్లో కొనసాగే వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని తెలియ జెప్పడమే తమ ప్రయత్నం వెనుక ఉద్దేశమన్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement