Epstein Files
-
అమెరికాలో సంచలన సృష్టించిన ఎప్స్టీన్ ఫైళ్ల విడుదల
వాషింగ్టన్: అమెరికాలో సంచలన సృష్టించిన ఎప్స్టీన్ ఫైళ్ల విడుదల అయ్యాయి. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వేలపేజీల రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. ఈ రహస్య పత్రాలను అమెరికా డీవోజే(డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్) బహిర్గతం చేసింది. పారదర్శకత కోసమే ఫైళ్లు విడుదల చేశామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ ఇంటర్వ్యూలు, గ్రాండ్ జ్యూరీ కీలక సాక్ష్యాలు బయటపడ్డాయి. తద్వారా 2008 నాటి వివాదాస్పద ఒప్పందాల వెనక ఉన్న రహస్యాలపై ఉత్కంఠ నెలకొనగా, ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాగా, ఐదు సంవత్సరాల క్రితం జైలు గదిలో అతను ఆత్మహత్య చేసుకున్నా… అతని చుట్టూ తిరిగిన రహస్యాల కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న “ఎప్స్టీన్ ఫైళ్లు” ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ రాజకీయ నాయకుడు కాదు. సినీ తార కూడా కాదు. కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతుల మధ్య తిరిగిన వ్యక్తి. అపర కుబేరుడైన ఎప్స్టీన్అతనికి సొంతంగా ఉన్న లిటిల్ సెయింట్ జేమ్స్ అనే చిన్న దీవిని తమ కామ క్రీడలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలపై లైంగిక దోపిడి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథలు దాదాపు ఒకేలా ఉన్నాయి — చిన్న ఉద్యోగ ఆఫర్లు, ఆకర్షణలు, తర్వాత బెదిరింపులు. లోపల జరిగినవి బయటకు చెప్పాలంటే చంపేస్తామని హెచ్చరికలు.ఎప్స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయలేడని చాలా మంది నమ్ముతున్నారు. అతని వెనుక ఒక వ్యవస్థ పనిచేసిందా? అతన్ని రక్షించిన శక్తులు ఉన్నాయా? అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి.అసలేంటి ఎప్స్టీన్ ఫైల్స్ .. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన పత్రాలు ఈ కేసును మరింత వేడెక్కించాయి. కోర్టు రికార్డులు, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్స్ — ఇవన్నీ కలిపి లక్షల పేజీల డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రముఖుల పేర్లు కనిపించడంతో సంచలనం రేగింది.మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, హిల్లరీ క్లింటన్ వంటి పేర్లు కోర్టు పత్రాల్లో ప్రస్తావనకు వచ్చాయి. అలాగే ఎలాన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి వ్యాపారవేత్తల పేర్లు కూడా విమాన లాగ్స్ లేదా కమ్యూనికేషన్ రికార్డుల్లో కనిపించాయి. చివరికి మన భారత దేశానికి చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉండడం సంచలనంగా మారింది.ఎప్స్టీన్ 2002 నుంచి 2005 మధ్య ఫ్లోరిడాలో యువతులను లైంగిక దోపిడికి గురి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో అరెస్టై జైలులో ఉన్న సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సహచరురాలు గిస్లేన్ మాక్స్వెల్ ప్రస్తుతం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తోంది.మరోవైపు ట్రంప్ -ఎప్స్టీన్ మధ్య ఉన్న సంబంధం కూడా పెద్ద చర్చగా మారింది. వీరిద్దరి ఫోటోలు, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్ వివరాలు గతంలోనే బయటకు వచ్చాయి.వీరిద్దరి ఫోటోలు అమెరికా రాజకీయాల్లో చిచ్చురేపుతోంది. మరి ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ఈ ఫైళ్లలో ఏముందో, ఏమౌతుందో అనే ఆసక్తి నెలకొంది. -
ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్‌పై దారుణం, ట్రంప్‌కు మరో షాక్
ఇరాన్‌పై భీకర దాడులు వరుసగా 7వ రోజు కూడా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగింది. ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరికొన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ (Department of Justice) తాజాగా విడుదల చేసింది. దివంగత లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ (Epstein Files) కేసులో భాగంగా వీటిని బహిర్గతంచేసింది.తాజాగా విడుదలలైన ఈ పత్రాలు ప్రకారం ఎప్స్టీన్ ద్వారా ట్రంప్‌కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్‌గా ఉన్నప్పుడు (13 -15 ఏళ్ల వయస్సులో) ట్రంప్ లైంగికంగా వేధించారని పేర్కొంటున్నాయి.ఎప్స్టీన్ ఆ బాలికను న్యూయార్క్ లేదా న్యూజెర్సీకి తీసుకెళ్లి ట్రంప్‌కు పరిచయం చేశాడు. ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతణ్ని కొరికి గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది.అంతేకాదు ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె ఆరోపించింది.రాజకీయ దుమారంఈ పత్రాలు గతంలోనే విడుదల కావాల్సి ఉన్నా, పొరపాటున "డూప్లికేట్" (నకలు) అని మార్క్ చేయబడటం వల్ల అప్పట్లో బయటకు రాలేదని న్యాయశాఖ తెలిపింది. దీనిపై స్పందించిన డెమోక్రాట్లుట్రంప్ ప్రభుత్వం ఎప్స్టీన్ కేసులో కీలక వివరాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించిందని డెమోక్రాట్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టడానికి అటార్నీ జనరల్ పామ్ బాండీకి సమన్లు (Subpoena) జారీ చేయాలని హౌస్ కమిటీ నిర్ణయించింది.అయితే ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ పత్రాల్లో ఉన్నవి అవాస్తవాలు, సంచలనం కోసం సృష్టించిన ఆరోపణలని గతంలోనే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఎప్స్టీన్ కేసులో వాస్తవాలు బయటికి రాకుండా ఉండేందుకు ఇరాన్‌పై దాడులకు పూనుకున్నాడని ట్రంప్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే! -
నేను ఏ తప్పూ చేయలేదు: క్లింటన్
వాషింగ్టన్: సెక్స్ రాకెట్ సూత్రధారి జెఫ్రీ ఎప్స్టీన్ కేసును దర్యాప్తు జరుపుతున్న కాంగ్రెస్ సభ్యుల బృందం ఎదుట మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ హాజరయ్యారు. తానెలాంటి తప్పూ చేయలేదని, ఎప్స్టీన్ వేధింపులకు సంబంధించి తనకు ఏమాత్రం తెలియదని చెప్పారు. న్యూయార్క్‌లోని చప్పాక్వాలో శుక్రంగా గోప్యంగా జరిగిన విచారణ సందర్భంగా రెండు దశాబ్దాల క్రితం అతడితో కొనసాగించిన సంబంధాలపై సభ్యులడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ఎదుట మాజీ అధ్యక్షుడొకరు విచారణకు హాజరవడం ఇదే మొదటిసారి కానుంది. కాగా, బిల్ క్లింటన్‌పై ప్రత్యేకంగా ఎటువంటి అభియోగాలు లేనప్పటికీ ఇటీవల విడుదల చేసిన వీడియోల్లో ఆయన పలు సందర్భాల్లో కనిపించడం దుమారం రేపింది. గురువారం ఆయన భార్య హిల్లరీ క్లింటన్ సైతం కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. మాజీ విదేశాంగ మంత్రి కూడా అయిన హిల్లరీని సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. అయితే, ఎప్స్టీన్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడున్నాడనే విషయం తనకు తెలియదని చెప్పారు. అతడితో సమావేశమైనట్లు కూడా తనకు గుర్తు లేదన్నారు. ఎప్స్టీన్ గురించి తామడిగిన ప్రశ్నల్లో చాలా మటుకు క్లింటన్ దంపతులు సమాధానమివ్వకుండా దాటేశారని కమిటీ చైర్ బాధ్యతల్లో ఉన్న జేమ్స్ కోమర్ చెప్పారు. ఉన్నత స్థానాల్లో కొనసాగే వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని తెలియ జెప్పడమే తమ ప్రయత్నం వెనుక ఉద్దేశమన్నారు. -
బికినీ అమ్మాయిలతో స్టీఫెన్ హాకింగ్
ఎప్స్టీన్ ఫైల్స్‌లో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌కు ఇరువైపులా బికీనీ ధరించిన ఇద్దరు మహిళలు ఉన్న ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఓ దీవిలోని ఎప్స్టీన్ ఎస్టేట్‌లో హాకింగ్ గడిపినట్లు బయటపడింది. చేతిలో కాక్టెయిల్ పట్టుకుని, సన్ లౌంజర్పై పడుకుని ఉన్న హాకింగ్‌ను ఆ మహిళలు పట్టుకుని ఉన్నారు. 'ది ఇండిపెండెంట్' కథనం ప్రకారం.. హాకింగ్‌తో ఉన్న ఆ ఇద్దరు అమ్మాయిలు.. ఆయనకు సేవ చేసేవారని తెలిపింది. వారు హాకింగ్‌కు దీర్ఘకాలంగా సేవలందిస్తున్న సంరక్షకులని.. హాకింగ్‌కు ఉన్న అనారోగ్య కారణాల దృష్ట్యా వారికి 24 గంటల వైద్య సహాయం అవసరం కాబట్టే.. వారు అక్కడ ఉన్నారని వెల్లడించింది.ఓ సందర్భంలో హాకింగ్ జలాంతర్గామిలో ప్రయాణించినట్లు కూడా ఫోటో ఉంది. అండర్ వాటర్ వెసల్‌ను హాకింగ్ కోసం ఎప్స్టీన్ మార్పులు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2006లో సెయింట్ థామస్‌లోని రిట్జ్ కార్లటన్ హోటల్లో జరిగిన సైన్స్ సదస్సు సమయంలో ఆ ఫోటో తీసినట్లు భావిస్తున్నారు. సెయింట్ జేమ్స్ దీవిలో ఉన్న ఎప్స్టీన్ రిసార్టును విజిట్ చేసిన 21 మంది శాస్త్రవేత్తల్లో హాకింగ్ కూడా ఒకరు. హాకింగ్‌కు చెందిన 250 ఫోటోలు ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఉన్నట్లు సమాచారం. దీనిపై హాకింగ్ కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. ఆ ఇద్దరు మహిళలు యూకేకు చెందిన ఆయన దీర్ఘకాలిక సంరక్షకులని తెలిపారు ఆయన ప్రవర్తనపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేసినా తప్పేనంటూ.. ఆరోపణలను కొట్టిపారేశారు. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్‌లో హాకింగ్ పేరు కనీసం 250 సార్లు ప్రస్తావించబడింది. తాజా పత్రాలలో భాగంగా విడుదలైన ఈ ఫోటోలో, హాకింగ్ ఇద్దరు మహిళల మధ్య చిరునవ్వుతో కనిపిస్తున్నారు.స్టీఫెన్ హాకింగ్ జనవరి 8, 1942న ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్ చదివారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాస్మోలజీ (విశ్వాంతరాళ శాస్త్రం)లో పిహెచ్డీ చేశారు. 21 ఏళ్ల వయసులో ఆయనకు అరుదైన మోటార్ న్యూరాన్ వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా ఆయన శరీరం పూర్తిగా పక్షవాతానికి గురైంది. మాట్లాడే శక్తిని కోల్పోవడంతో, ఒక ప్రత్యేకమైన వాయిస్ సింథసైజర్ (కంప్యూటర్ సాయంతో మాట్లాడే పరికరం) ద్వారా తన భావాలను పంచుకునేవారు.హాకింగ్ ప్రధానంగా విశ్వం పుట్టుక, నల్ల బిలాలు (Black Holes), సాపేక్ష సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు. హాకింగ్ రేడియేషన్ (Hawking Radiation) బ్లాక్ హోల్స్ నుండి కూడా వికిరణం (Radiation) వెలువడుతుందని ఆయన నిరూపించారు. దీనినే 'హాకింగ్ రేడియేషన్' అంటారు. విశ్వం ఒక బిందువు నుండి ప్రారంభమైందని (Big Bang Theory) గణితశాస్త్ర పరంగా నిరూపించారు. సామాన్యులకు కూడా సైన్స్ అర్థం కావాలనే ఉద్దేశంతో ఆయన అనేక పుస్తకాలు రాశారు. మార్చి 14, 2018న (ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుట్టినరోజున) హాకింగ్ తన 76వ ఏట కన్నుమూశారు. -
ఎప్ స్టీన్ కేసులో కొత్త ట్విస్ట్.. ట్రంప్ ఫైళ్లు మాయం?
-
తప్పు చేశా.. క్షమించండి
న్యూయార్క్: సెక్స్ కుంభకోణం సూత్రధారి, అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్తో తనకు సంబంధాలున్న మాట నిజమేనని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఎట్టకేలకు అంగీకరించారు. ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలు కొనసాగించినట్లు వెల్లడించారు. అయితే, చట్టవిరుద్ధమైన పనులేవీ చేయలేదని పేర్కొన్నారు. ఎప్స్టీన్ నేరాల్లో తాను పాలుపంచుకోలేదని స్పష్టంచేశారు. అయినప్పటికీ తన వల్ల ‘గేట్స్ ఫౌండేషన్’కు చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎప్స్టీన్ను కలవడం తప్పేనని, తనను పెద్ద మనసుతో క్షమించాలని ఫౌండేషన్ సిబ్బందికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఒక నివేదికను తాజాగా బహిర్గతం చేసింది. తనపై వచ్చిన ఆరోపణలపై మంగళవారం జరిగిన టౌన్‌హాల్ సమావేశంలో బిల్ గేట్స్ వివరణ ఇచ్చారని పేర్కొంది. ‘‘ఎప్స్టీన్ ఫైల్స్‌లో భాగంగా విడుదల చేసిన ఫొటోల్లో మహిళలతో నేను ఉన్నట్లు చూపించారు. ఆ ఫొటోల్లో మహిళల ముఖాలను తారుమారు చేశారు. నిజానికి ఎప్స్టీన్ సహాయకులతో ఫొటో దిగాను. ఎప్స్టీన్ వినతి వల్లే దిగాల్సి వచ్చింది. అతడి చుట్టూ ఉన్న మహిళలతో ఏనాడూ నేను కాలం గడపలేదు. ఎప్స్టీన్ బారిన పడిన బాధిత మహిళలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎప్స్టీన్ను కలవడం ద్వారా పెద్ద తప్పు చేశా. అతడితో సమావేశాలకు గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులను కూడా తీసుకెళ్లడం ఇంకా పెద్ద తప్పు. మైనర్లతో వ్యభిచారం కేసులో ఎప్స్టీన్ 2008లో దోషిగా తేలాడు. మూడేళ్ల తర్వాత.. 2011లో అతడిని కలిశా. అతడి నేపథ్యం గురించి సరిగ్గా తనిఖీ చేసుకోలేదు. ఎప్స్టీన్తో సంబంధాల గురించి 2013లో నా భార్య మెలిండా ఆందోళన వ్యక్తంచేసింది. అయినప్పటికీ 2014 దాకా అతడిని పలుమార్లు కలిశా. ఎప్స్టీన్తో కలిసి ప్రైవేట్ జెట్ విమానాల్లో ప్రయాణించా. జర్మనీ, ఫ్రాన్స్, న్యూయార్క్, వాషింగ్టన్లో అతడితో సమావేశమయ్యా. కానీ, ఎప్స్టీన్ ఐలాండ్‌లో ఏనాడూ ఒక్కరాత్రి కూడా గడపలేదు. నా వల్ల గేట్స్ ఫౌండేషన్‌కు మచ్చ రావడం బాధగా ఉంది. నా వ్యవహార శైలి, ప్రవర్తన ఫౌండేషన్ విలువలకు, లక్ష్యాలకు విరుద్ధంగానే ఉన్నాయి. చివరిసారిగా 2014లో ఎప్స్టీన్ను కలిశా. ఎప్స్టీన్ విషయంలో నా భార్య మెలిండాకు మొదటినుంచీ అనుమానాలున్నాయి. ఎప్స్టీన్తో సంబంధాల వల్ల నా పేరు ప్రతిష్టలు మంట గలుస్తున్నాయని చివరికి గ్రహించా. ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలు కొనసాగించిన సంగతి నిజమే. వారిలో ఒకరు బ్రిడ్జ్ ప్లేయర్. బ్రిడ్స్ ఈవెంట్లలో ఆమె నన్ను కలిశారు. మరొకరు న్యూక్లియర్ ఫిజిసిస్ట్. బిజినెస్ కార్యక్రమాల్లో భాగంగా మేము కలుసుకున్నాం’’అని బిల్ గేట్స్ వ్యాఖ్యానించిట్లు వార్తా సంస్థ స్పష్టంచేసింది. లక్షలాది పత్రాలు విడుదల ఎప్‌స్టీప్ ఫైళ్లను అమెరికా న్యాయ శాఖ గత నెలలో బయటపెట్టిన సంగతి తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, టెక్నాలజీ రంగ దిగ్గజాలు ఎప్స్టీన్తో సన్నిహితంగా మెలిగారని తెలియజేసింది. ఎప్స్టీన్తో బిల్ గేట్స్‌కు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈ దస్త్రాల్లో తేలడంతో సంచలనాత్మకంగా మారింది. ఇదీ చదవండి: భారత్‌కు అమెరికా కొత్త ‘షాక్’.. 126% టారిఫ్! -
ఎప్స్టీన్ ఫైళ్ల కేసు.. మరో కీలక పరిణామం
లండన్: ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం తాలూకు టేపుల రగడ బ్రిటన్‌లో మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్స్టీన్తో సన్నిహిత సంబంధాలు నెరిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మండేల్సన్ (72)ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అయితే మండేల్సన్పై లైంగిక దుష్ప్రవర్తన వంటి ఆరోపణలేమీ లేవు. దాదాపు పదిహేనేళ్ల కింద బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆయన ఎప్స్టీన్కు చేరవేశారన్న అభియోగాలపై దర్యాప్తు సాగుతోంది. ఎప్స్టీన్ బాగోతానికి సంబంధించి బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ ఆండ్రూను ఐదు రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.2010లో జెఫ్రీ ఎప్స్టీన్కు ఆండ్రూ వాణిజ్య నివేదికలను పంపారన్న ఆరోపణలపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత, ప్రభుత్వ పదవిలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్నఆరోపణపై దర్యాప్తు ప్రారంభించామనీ, తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ నేరంపై విచారణ జరుపుతున్నప్పుడు, దర్యాప్తు సమగ్రతను, నిష్పాక్షికతను కాపాడటం చాలా ముఖ్యమని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్కు ఆండ్రూ రహస్య సమాచారం ఇచ్చాడనే నివేదికలపై విచారణకు కింగ్ చార్లెస్ III సహకరిస్తారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపిన సంగతి తెలిసిందే.మరోవైపు.. ఎప్స్టీన్ కేసులో బాధితురాలు రినా ఓహ్ ఎదుర్కొన్న చేదు అనుభవాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా బ్రిటీష్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్ట్ తరువాత లైంగిక వేధింపుల పర్వంపై 40 ఏళ్ల రీనా విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ఎప్స్టీన్ లాంటిపవర్పుల్ వ్యక్తి సామాన్యులను, మానసికంగా బలహీనంగా ఉన్నవారిని ఎలా లోబరుచుకుంటారో, ఎలాంటి వేధింపులకు గురిచేస్తారో వివరించింది. -
చిన్మయి, తన తండ్రిపై నెటిజన్ దిగజారుడు కామెంట్
సోషల్‌మీడియా వినియోగం పెరుగుతున్న కొద్ది కొందరు నెటిజన్లు తమ విచక్షణ కోల్పోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పశువులకంటే హీనంగా మారిపోతున్నారు. తండ్రీ కూతుళ్ల బంధంపై విషం చిమ్మే స్థాయికి కూడా చేరిపోతున్నారు. ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియోపై 'ఫన్ & డాంక్' పేరుతో ప్రణీత్ హన్మంతు చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించిన విషయం గుర్తే ఉండుంటుంది కదా.. అయితే, తాజాగా ఇదే రీతిలో ప్రముఖ సింగర్ చిన్మయిపై ఒక నెటిజన్ 'మీ తండ్రి నిన్ను తప్పకుండా అత్యాచారం చేసే ఉంటాడు' అని నీచమైన కామెంట్ చేశాడు.ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలికలపై లైంగిక వేధింపుల గురించి ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో వైరల్ అవుతుంది. ఈ అంశంపై సింగర్ చిన్మయి కూడా రియాక్ట్ అయింది. భారత ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి భవనంలో ఎప్‌స్టీన్‌లు ఉంటారు. ఈ విషయంలో గుడ్డిగా మత పెద్దలను కూడా నమ్మకండి. వారితో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. భారతదేశంలో లక్షలాది మంది బాల లైంగిక నేరస్థులు ఉన్నారని గుర్తుంచుకోండి. నేను చెబుతుంది మీరు నమ్మకపోతే.. మీకు తెలిసిన అమ్మాయిని అడగండి. మొదటిసారి ఎప్పుడు, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురి అయిందో చెబుతుంది.' అని పోస్ట్ చేసింది. దీనికి సమాధానంగా చిన్మయిపై ఒక నెటిజన్ విషం చిమ్మాడు. 'మీ తండ్రి కూడా నిన్ను తప్పకుండా అత్యాచారం చేసే ఉంటాడు' అని తెగబడ్డాడు. దీంతో ఆమె కూడా తిరిగి కౌంటర్ ఇచ్చింది.అతనికి కౌంటర్‌గా చిన్మయి ఇలా పోస్ట్ చేసింది.. 'నా తండ్రి నన్ను అత్యాచారం చేయలేదు. కానీ, కూతుళ్లు తమ తండ్రులచే అత్యాచారం చేయబడతారని మీరు ఖచ్చితంగా ఊహించుకుంటారని తెలుస్తోంది. మీరు ఏమిటో, మీ సంస్కృతి ఏమిటో తెలుస్తుంది. మిమ్మల్ని ఎవరు పెంచారో కూడా ఈ ప్రవర్తనలోనే కనపడుతుంది.' అని ఆమె రిప్లై ఇచ్చింది.No - Akula Reddy.I wasn’t raped by my father. But you definitely fantasise daughters getting raped by their fathers. And use that so commonly to a woman on Twitter Shows what you are, your culture,Your people, your society is and DEFINITELY SHOWS WHO RAISED YOU. pic.twitter.com/lBIr6agCdB— Chinmayi Sripaada (@Chinmayi) February 20, 2026 -
వాడు పెద్ద సైకో.. నన్ను వాడుకున్నాడు
-
మాజీ యువరాజు ఆండ్రూ విడుదల
లండన్: సెక్స్ రాకెట్ సూత్రధారి జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలతోపాటు అధికార దుర్వినియోగం, దు్రష్పవర్తన కేసులో అరెస్టయిన బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్–విండ్సర్ శుక్రవారం విడుదలయ్యారు. థేమ్స్ వ్యాలీ పోలీసులు ఆయనను 11 గంటలపాటు ప్రశ్నించారు. విడుదలైన అనంతరం ఆండ్రూ నార్ఫోక్లోని వుడ్ఫామ్ హోమ్‌కు చేరుకున్నారు. మరోవైపు అండ్రూపై దర్యాప్తు కొనసాగుతోంది. విండ్సర్ రాజప్రాసాదంలో ఆయన గతంలో నివాసం ఉన్న రాయల్ లాడిŠజ్లో పోలీసులు శుక్రవారం సైతం సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ కీలక సమాచారాన్ని, కొన్ని ట్రేడ్ రిపోర్టులను ఎప్స్టీన్కు చేరవేసిన కేసులో ఆండ్రూను గురువారం ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 66వ పుట్టిన రోజునాడే అరెస్టయ్యారు. ఆండ్రూకు సంబంధించిన ఒక నివాసంలో సోదాలు పూర్తయ్యాయని, మరో నివాసంలో ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. గత కొన్ని శతాబ్దాల్లో బ్రిటిష్ రాజకుటుంబంలో ఒక సభ్యుడు అరెస్టు కావడం ఇదే మొదటిసారి. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరిసారిగా 1554లో అప్పటి రాణి ఎలిజబెత్–1(ఎలిజబెత్ ట్యూడర్) తోబుట్టువు అరెస్టయ్యారు. మరోవైపు అధికార దుర్వినియోగం కేసులో మాజీ యువరాజు ఆండ్రూపై ఆరోపణలు రుజువైతే కఠిన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అరెస్టు తర్వాత ఆండ్రూ ఇంకా స్పందించలేదు. -
ఇక ‘ఏలియన్’ ఫైల్స్
వాషింగ్టన్: ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్ తాలూకు కలకలం సద్దుమణగకముందే ప్రపంచవ్యాప్తంగా అంతకుమించి ఆసక్తి రేపగల మరో ఫైల్స్ వెలుగులోకి రానున్నాయి. గ్రహాంతరవాసులు, అంతరిక్షానికి సంబంధించిన అంతు తెలియని విషయాల తాలూకు పరిశోధనల ఫైల్స్‌ను బహిర్గతం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు! ఆ ఫైల్స్, వాటి తాలూకు వివరాలను విడుదల చేయాలని సంబంధిత ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశిస్తానంటూ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్ట్ చేశారు. ప్రజల్లో నెలకొని ఉన్న ఆసక్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గ్రహాంతర జీవులు, గుర్తు తెలియని ఎగిరే వస్తువుల (యూఎఫ్ఓ) గురించి అత్యంత సంక్లిష్టమైన, చాలా ఆసక్తికరమైన, ముఖ్యమైన సమాచార ప్రభుత్వ ఫైళ్లను విడుదల చేయాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఇతర సంబంధిత ఏజెన్సీల చీఫ్‌లను ఆదేశిస్తానంటూ ఆ పోస్ట్‌లో పంచుకున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి నిజమేనంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటన వెలువడటం విశేషం. అయితే, ఒబామా అత్యంత రహస్యమైన సమాచారాన్ని బయటపెట్టారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ఆయన భారీ తప్పిదానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. పాడ్‌కాస్ట్ హోస్ట్ బ్రియాన్ టైలర్ కోహెన్ ఇటీవలే ఒబామాను ఇంటర్వ్యూ చేశారు. గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా అని కోహెన్ ప్రశ్నించగా ఒబామా ఆసక్తికరంగా బదులిచ్చారు. ‘‘ఈ విశ్వం చాలా పెద్దది. అనంత విశ్వంలో ఎక్కడో ఓ చోట జీవం ఉండే అవకాశం ఉంటుంది. కానీ సౌర వ్యవస్థల మధ్య చాలా దూరముంది. కనుక గ్రహాంతరవాసులు ఒకవేళ నిజంగానే ఉన్నా వారు మనల్ని సందర్శించే అవకాశం తక్కువ. అయితే నేను అధ్యక్షునిగా ఉండగా గ్రహాంతరవాసులు మనుషులను సంప్రదించారనే ఎలాంటి ఆధారాలూ దొరకలేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. గ్రహాంతరవాసులను పట్టి, అమెరికాలోని నెవడాలో ఏరియా 51గా పిలిచే అత్యంత రహస్య సైనిక స్థావరంలో బంధించి ఉంచారన్న వార్తలు కూడా నిజం కాదన్నారు. గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నదీ లేనిదీ తనకూ తెలియదని ట్రంప్ కూడా గతంలో పలుమార్లు చెప్పారు.దశాబ్దాల ఆసక్తిగ్రహాంతరవాసుల ఉనికిపై మనుషుల ఆసక్తి ఇప్పటిది కాదు. వారు కనిపించారంటూ దశాబ్దాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటిలో చాలావరకు పుకార్లుగానే మిగిలిపోయాయి. భూమికి అవతల జీవముందని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలూ లభించలేదు. కాకపోతే అమెరికా గగనతలంపై ఎన్నోసార్లు ఫ్లయింగ్ సాసర్లు, యూఎఫ్ఓలు సంచరించాయనే వార్తలు చాలాసార్లు వచ్చాయి. గగనతలంలో గుర్తు తెలియని వస్తువులను చూశామంటూ పలువురు పైలట్లు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. యూఎఫ్ఓలపై నాసా దశాబ్దాల పాటు ముమ్మరంగా పరిశోధనలు సాగించింది కూడా. అయితే గ్రహాంతరవాసులు ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలలేదని 2024లో ఓ నివేదికలో నాసా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
వాడు పెద్ద సైకో..నన్ను వాడుకున్నాడు.. ఎప్ స్టీన్ బాధితురాలు రీనా వీడియో
-
ఎప్స్టీన్ ఫైల్స్ : పోలీసు కస్టడీ నుంచి బ్రిటన్ మాజీ ప్రిన్స్ విడుదల
అమెరికా వ్యాపారవేత్త, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాల కేసులో అరెస్ట్ అయిన బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్ .. పోలీసుల కస్టడీ నుంచి విడుదలయ్యారు. సుమారు 11 గంటల విచారణ అనంతరం ఆయనను విడిచిపెట్టారు. కాగా ప్రభుత్వ పదవిలో ఉండి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలపై థేమ్స్ వ్యాలీ పోలీసులు ఆండ్రూను గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. తన 66వ పుట్టిన రోజునే ఆండ్రూను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఆ తర్వాత ఆయనను దాదాపు రోజుంతా ఐల్షామ్ పోలీసు స్టేషన్లో ఉంచి విచారించారు. అయితే 'రిలీజ్డ్ అండర్ ఇన్వెస్టిగేషన్' కింద పంపించేశారు. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే, బ్రిటన్ చట్టాల ప్రకారం గరిష్టంగా జీవితఖైదు పడే అవకాశం ఉంది.అసలేమి జరిగిందంటే?ఆండ్రూ మౌంట్‌బాటన్.. 2001 నుండి 2011 వరకు బ్రిటన్ వాణిజ్య రాయబారిగా పనిచేశారు. ఈ సమయంలో ఆయన కీలక సమాచారాన్ని ఎప్స్టీన్కు చేరవేసినట్టు నివేదికలు వెల్లడించాయి. వియత్నాం, సింగపూర్, హాంగ్‌కాంగ్ వంటి దేశాల పర్యటనలకు సంబంధించిన అత్యంత రహస్య వాణిజ్య రిపోర్టులు తన మిత్రుడు ఎప్స్టీన్కు ఈమెయిల్ చేశారని తాజాగా వెల్లడైన ఎప్స్టీన్ ఫైల్స్ బహిర్గతం చేశాయి. తన సోదరుడి అరెస్ట్‌పై కింగ్ చార్లెస్ స్పందించారు. "చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని స్పష్టం చేశారు. రాజకుటుంబం పోలీసుల విచారణకు పూర్తి సహకారం అందిస్తుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. -
బిల్ గేట్సూ... మన నైతికత!
దాదాపు 48 గంటల ఊగిసలాట తర్వాత ఎట్టకేలకు ఢిల్లీలో భారీ యెత్తున జరుగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) శిఖరాగ్ర సదస్సులో గురువారం కీలక ప్రసంగం చేయాల్సిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెనక్కి తగ్గారు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణలొచ్చి, ఒక కేసులో శిక్ష కూడా పడి జైల్లో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్తో సాన్నిహిత్యం ఉందని వెల్లడైనప్పటి నుంచి గేట్స్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకే ఈ భంగపాటు. గురువారం నాటి ఏఐ సదస్సు కార్యక్రమం గురించి నిర్వాహకులు వెబ్సైట్లో మంగళవారం ఉంచిన జాబితాలో గేట్స్ పేరు లేదు. ఇక అక్కడినుంచి మొదలైంది ప్రహసనం! ఎప్స్టీన్ ఫైల్స్‌లో ప్రస్తావన ఉంది గనుక ఆయన హాజరు కాబోరని ప్రభుత్వ వర్గాలు చెప్పడం, అదేం కాదు... వస్తున్నారంటూ గేట్స్ ఫౌండేషన్ వివరణ, ఆ వెంటనే వెబ్సైట్లో మళ్లీ ఆయన పేరు దర్శనమీయటం, కేంద్ర సమాచార మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం తప్పించుకునే ధోరణిలో జవాబీయటం పెద్ద చర్చకు దారితీసింది. తెరవెనుక ఏం జరిగిందోగానీ... గేట్స్ హాజరు కాబోరని చివరి నిమిషంలో నిర్ధారణ అయింది. చిత్రమేమంటే... ఈలోగా సోమవారం ఆయన విశిష్ట అతిథిగా అమరావతిలో ప్రత్యక్షం కావటం, చంద్రబాబు పాలనను చూసి పొంగిపోయి ఉదారంగా ప్రశంసలు కురిపించటం పూర్తయిపోయింది. ఆయన్ను ‘తీసుకు రాగలినందుకు’ కూటమి పక్షాలన్నీ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్న తరుణంలోనే పిడుగుపాటులా ఏఐ సదస్సు ఎపిసోడ్ వెల్లడై పరువు పాతాళానికి పడిపోయింది. అలాంటి వ్యక్తిని ఆహ్వానించినందుకు సామాజిక మాధ్యమాల్లో చీవాట్లు మొదలయ్యాయి. ఆయన నేపథ్యాన్ని గమనించకుండా తీసుకొచ్చి పొగిడించుకున్నంత మాత్రాన భ్రమల్లో పడేదెవరు? ‘అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక...’ అన్న నానుడి బాబు మరిస్తే ఎలా?అయిదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నా, ఇప్పటికీ ఎప్స్టీన్ ప్రేతాత్మ అనేకుల్ని వెన్నాడుతోంది. 30 లక్షల పేజీలున్న ‘ఎప్స్టీన్ ఫైల్స్’ను అమెరికా న్యాయశాఖ గత నెలలో బట్టబయలు చేసినప్పటినుంచీ పీఠాలు కదులుతున్నాయి. శిఖరాలు కూలు తున్నాయి. ఇందులో ఆడ, మగ కూడా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధినేత క్లింటన్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్ తదితరుల పేర్లున్నాయి. బ్రిటన్ రాజు చార్లెస్ సోదరుడు ప్రిన్స్ ఆండ్రూ గురువారం అరెస్టయ్యారు. బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మాన్ శాక్స్ న్యాయ సలహాదారు క్యాథరిన్ రుమెల్లర్ పదవికి రాజీనామా చేశారు. ఎంతో అయిష్టంగా ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నానన్నందుకు ఆ సంస్థ చీఫ్ డేవిడ్ సోలొమాన్కు చీవాట్లు పడుతున్నాయి. ప్రముఖ నౌకా రవాణా నిర్వహణ సంస్థ డీపీ వరల్డ్ చీఫ్ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయమ్ తప్పుకున్నారు. అమెరికా ప్రముఖ న్యాయ సహాయ సంస్థ పాల్వీస్ చీఫ్ బ్రాడ్ కార్ప్ రాజీనామా చేశారు. ఇంకా బ్రిటన్ మాజీ రాయబారి, ఎంపీ లార్డ్ పీటర్ మాండెల్సన్, శత కోటీశ్వరురాలైన బ్యాంకర్ అరియానే డి రోత్స్, ఆర్థికవేత్త లారీ సమ్మర్స్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ వగైరాల పేర్లున్నాయి. ఆఖరికి మన కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి అమెరికాలో రాయబారిగా ఉండగా ఆయనతో సంభాషించినందుకు ఈ ఫైల్స్లోకెక్కారు. వీరంతా ఎప్స్టీన్ నేరాల్లో భాగస్వాములని కాదు. ఈ మెయిళ్లలో అతన్ని ‘విలాస పురుషుడి’గా ప్రశంసించినవారు మొదలుకొని, అతగాడు అడిగిన పనులు చేసిపెట్టినవారి వరకూ ఎందరో ఉన్నారు. ఎవరినుంచి అయినా సమాజం నైతిక విలువలు ఆశిస్తుంది. అవి లోపించాయని గ్రహిస్తే ఎంతటివారినైనా తృణీకరిస్తుంది. బిల్ గేట్స్‌కు ఏపీలో నీరాజనాలు పట్టడం చూసినా, ఏఐ సదస్సులో ఆయన పాల్గొనటంపై బాహాటంగా బయటపడిన ఊగిసలాట గమనించినా ఈ విషయంలో మనం పాశ్చాత్య దేశాలకన్నా వెనకబడి ఉన్నామా అన్న సంశయం ఏర్పడి విచారం కలిగిస్తుంది. మన పురాణాలు, ఇతిహాసాలు మాత్రమే కాదు... మన రాజ్యాంగం సైతం మహిళల పట్ల ఎంత బాధ్యతాయుతంగా మెలగాలో చెబుతుంది. కానీ బిల్ గేట్స్ ఎపిసోడ్ ఆ విషయంలో మనకంతగా పట్టింపులేదన్న అభిప్రాయం కలిగిస్తుంది. -
బిల్ గేట్స్ కు నో ఎంట్రీ... బిల్ గేట్స్ పై ఆరోపణలు
-
‘తప్పులేదు.. దాచలేదు..’ అదే పాటలో ట్రంప్
వాషింగ్టన్: లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో తనకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తాను పూర్తిగా నిర్దోషిగా తేలానని, దర్యాప్తు సంస్థలు కూడా తనకు క్లీన్ చిట్ ఇచ్చాయని అన్నారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు, దాచడానికి నా దగ్గర ఏమీ లేదు’ అని విలేకరుల ఎదుట ట్రంప్ వివరణ ఇచ్చారు. డెమొక్రాట్లు తనపై బురద చల్లాలని చూశారని, అయితే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.ఎప్స్టీన్ కేసులో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో పాటు పలువురు డెమొక్రాట్ నేతల పేర్లు బయటకు వచ్చాయని, అది వారి సమస్య అని ట్రంప్ పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ ‘ట్రంప్ డెరాంజ్మెంట్ సిండ్రోమ్’తో బాధపడుతున్నారని, అందుకే అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ విమర్శించారు. ఎప్స్టీన్ తన ఎదుగుదలను అడ్డుకోవాలని చూశారని కూడా ట్రంప్ తెలిపారు. #WATCH | During a Press Gaggle on Air Force One, US President Donald Trump says, "I have nothing to hide. I have been exonerated. I have nothing to do with Jeffrey Epstein. I have been totally exonerated on Epstein..."(Source: The White House) pic.twitter.com/hKPUOHZork— ANI (@ANI) February 17, 2026జస్టిస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన రికార్డుల ప్రకారం 2000వ దశకం మధ్యలో ఎప్స్టీన్పై దర్యాప్తు జరుగుతున్న సమయంలో ట్రంప్ పోలీసు అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎప్స్టీన్ ప్రవర్తన గురించి చాలా కాలంగా అందరికీ తెలుసని, అధికారుల చర్యలు తీసుకోవడం మంచిదేనని అప్పట్లో ట్రంప్ అన్నట్లు ఎఫ్‌బీఐ ఇంటర్వ్యూలో వెల్లడయ్యింది. అలాగే తన ‘మార్ ఏ లాగో’ క్లబ్‌లోకి ఎప్స్టీన్ను రాకుండా నిషేధించానని ట్రంప్ తెలిపారు. ఒకానొక సందర్భంలో టీనేజర్లు అక్కడ కనిపించడంతో తాను ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చానని ట్రంప్ దర్యాప్తులో వెల్లడించారు.ఎప్స్టీన్ ఉదంతంలో ట్రంప్‌తో సహా పలువురు ప్రముఖులపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ట్రంప్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని, తదుపరి విచారణ అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎప్స్టీన్ అనుచరురాలు గిస్లైన్ మాక్స్వెల్ కేసులో భాగంగా 2021లో ‘మార్ ఏ లాగో’ క్లబ్‌కు కోర్టు నోటీసులు పంపిన మాట నిజమేనని రికార్డులలో తేలింది. ప్రస్తుతం మాక్స్వెల్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తుండగా, ఎప్స్టీన్ 2019లో జైలులో మృతి చెందారు.ఇది కూడా చదవండి: భూమిపైకి ఏలియన్స్.. ఒబామా వ్యాఖ్యల కలకలం! -
ట్రెండింగ్‌లో బిల్‌గేట్స్ క్విట్ ఇండియా హ్యాష్‌టాగ్
ఓవైపేమో తమ దేశాన్ని ఒక ప్రయోగశాలగా తమ ప్రజలని బలిపశువులుగా అభివర్ణించారని బిల్‌గేట్స్‌పై సామాజిక మాద్యమాలలో "బిల్‌గేట్స్ క్విట్ ఇండియా" అని నిరసన ప్రదర్శనలు జరుగుతుంటే.. మరోవైపేమో కూటమి ప్రభుత్వం ఆయనకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తమ జాతిని తమ ప్రజలను అవమానించిన వారికి ఇంత రాచ మర్యాదలు చేయాల్సిన అవసరం ఏంటని సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.కొంతమందికి ప్రజల ప్రాణాలన్నా..వారి మనోభావాలన్నా లెక్కే ఉండదు. వారికి కావాల్సింది సంపన్నులకు కొమ్ముకాయడం.. వారిని బుట్టలో వేసే యత్నం చేయడం అంతే.. తాజాగా కూటమి ప్రభుత్వం చేసే పని దానికే నిదర్శనంగా నిలుస్తోంది. ఓవైపేమో తమ దేశాన్ని పేద ప్రజలని అవమానించిన వ్యక్తిని.. బిల్‌గేట్స్ క్విట్ ఇండియా అని దేశంలోకి రావద్దంటూ నిరసన ప్రదర్శనలు జరుగుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లోనేమో కూటమి నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.నిరసన ఎందుకు..?గతంలో ఓ సందర్భంలో భారత్‌పై బిల్‌గేట్స్ తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఇండియాని ఓ ప్రయోగశాలగా వాడవచ్చని అన్నారు. ఆ దేశంలో ఎటువంటి ప్రయోగాలయినా చేసుకోవచ్చని తెలిపారు. అంటే ఇక్కడి మట్టికి గానీ ప్రజలకు గానీ ఆయన విలువనివ్వలేదు. ఏటువంటి ప్రయోగాలకైనా వీరిని వాడుకోవచ్చనే ఉద్దేశంలో ఆయన మాట్లాడారు. దీంతో ఈ అంశం నెట్టింట్లో తీవ్రంగా ట్రోలయింది. బిల్‌గేట్స్ క్విట్ ఇండియా అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండయ్యింది.ఐదుగురు పిల్లల మృతిఇదిలా ఉంచితే 2009లో మెలిండా ఫౌండేషన్ సహాకారంతో రూపొందించిన HPV వ్యాక్సిన్ వికటించి ఖమ్మంలో ఐదుగురు చిన్నారులు మృతిచెందారు. మరెంతో మంది ఇతర సమస్యలతో బాధపడ్డారు. ఇది అప్పట్లో చాలా వివాదమైంది. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు తిరిగి ఆ వ్యాక్సిన్ ప్రయోగానికి బిల్‌గేట్స్‌కు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పిల్లల ప్రాణాలకు ఏమవుతుందా అనే ఆందోళన నెలకొంది.ఎప్స్టీన్ ఫైల్స్అయితే ఇటీవల ప్రపంచాన్ని కుదిపేసిన ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలోనూ బిల్‌గేట్స్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన రష్యన్ అమ్మాయిలతో నిద్రపోతున్నాడని లైంగిక సంక్రమణ వ్యాధుల బారిన పడ్డారని దీంతో తన భార్య మెలిండా గేట్స్‌కు రహస్యంగా ఇవ్వగల యాంటీ బయాటక్స్ కోసం అడుగుతున్నారని ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఉంది. దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశం హాట్‌టాఫిక్‌గా మారింది.ప్రపంచవ్యాప్తంగా ఇంత వ్యతిరేకత ఉండి, మాతృదేశాన్ని అవమానకరంగా మాట్లాడి, ప్రజల చేతిలో నిరసనకు గురువుతున్న వ్యక్తికి.. చంద్రబాబు ఇంత హైప్ ఇవ్వడం ప్రజలను ఆవేదనకు గురిచేస్తుంది.In 2009, five children died in Khammam district in Telangana after the administration of the HPV vaccine. Many others suffered short and long term side effects. Now @ncbn invites the same Bill Gates to continue his experiments on Indian children #BillGates_QuitIndia pic.twitter.com/CUKxXBv02i— Dee (@DeeEternalOpt) February 15, 2026 Even after knowing about the Bill Gates - Epstein files- Pandemic Connection, how can our people allow @BillGates to dictate tech, health, agriculture and digitisation policies in India? #BillGates_QuitIndia https://t.co/xiGeciMFhr pic.twitter.com/aXlhBLeFYr— Awaken India Movement (@awakenindiamvmt) February 14, 2026 -
బాలికలను ట్రాప్ చేసి.. అతికిరాతకంగా.. విస్తుపోయే నిజాలు
-
ఎప్ స్టీన్ సీక్రెట్ ఫైల్స్ లో షాకింగ్ నిజాలు.. వందల మంది అమ్మాయిలు బలి
-
భరతమాతనే... అమెరికాకు అమ్మేశారు
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై మోదీ సర్కారును విపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఒప్పందం పేరిట మన తల్లి భరతమాతనే అమెరికాకు అమ్మేశారంటూ నిప్పులు చెరిగారు. ‘‘వ్యవసాయం, ఇంధనంతో సహా అన్ని రంగాలనూ అమెరికా చేతికి అప్పగించేశారు. ఆ దేశానికి పూర్తిస్థాయి లొంగిపోయారు. దేశాన్ని ఇలా అడ్డంగా అమ్మేసినందుకు మీకు కనీసం సిగ్గుగా అనిపించడం లేదా?’’అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బుధవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చలో రాహుల్ ప్రసంగించారు. అమెరికాతో ఏకపక్ష ఒప్పందాన్ని మోదీ సర్కారు ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. ‘‘పలు విషయాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా నేరుగా విపరీతమైన ఒత్తిడి పెట్టింది. పూర్తిగా ఆయన మెడలు వంచి నొక్కిపట్టింది. అందుకే దేశాన్ని మోదీ అమెరికాకు అమ్మేశారు. కేవలం అధికారం కాపాడుకోవడానికి జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టారు. లేదంటే ఇలాంటి ఏకపక్ష ఒప్పందానికి ఆయనే కాదు, ఏ భారత ప్రధానీ అంగీకరించబోడు’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యర్థి మెడను దొరకబుచ్చుకున్నాక దాన్ని గట్టిగా నొక్కిపడతారు. దాంతో అతను అల్లాడిపోతాడు. లొంగిపోయానంటూ చేతులెత్తేస్తాడు. మోదీ చేసింది సరిగ్గా అదే’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘వాణిజ్య ఒప్పందం ద్వారా మన రైతుల ప్రయోజనాల విషయంలో కేంద్రం పూర్తిగా రాజీ పడింది. జౌళి రంగాన్ని నేలమట్టం చేశారు. మన డేటాను, రైతులను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, మన శక్తియుక్తులను, చిన్న, మధ్యతరహా వ్యాపారాలనూ అమ్మేశారు. ఇంధన భద్రతను గాలికొదిలేశారు. ఇకపై మనం ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలో నిర్ణయించేది అమెరికాయే తప్ప మన ప్రధాని కాదు! పైగా ఆ కొనుగోళ్లను అగ్ర రాజ్యమే నిత్యం పర్యవేక్షిస్తుంటుంది. వారు చెప్పిన వాళ్ల దగ్గర కొనకపోతే మనపై మళ్లీ 50 శాతం టారిఫ్‌లు బాదుతారు. మన ఆర్థిక, ఇంధన రంగాలను మనపైకే ఆయుధాలుగా గురి పెట్టేందుకు అమెరికాను కేంద్రం అనుమతించింది’’అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రయోజనాల కోసమే... వాణిజ్య ఒప్పందం పేరుతో మోదీ సర్కారు అమెరికాకు దాసోహమన్న తీరు చాలా విషాదకరమని రాహుల్ అన్నారు. ‘‘మోదీ కేవలం తాను మాత్రమే లొంగిపోలేదు. 150 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తునే అమెరికాకు అప్పగించేశారు. అధికార బీజేపీ ఆర్థిక ఆయువుపట్లలో ఒకరిపై అమెరికాలో కేసు నడుస్తుండటమే ఇందుకు కారణం. సొంత పార్టీ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికే దేశాన్ని అగ్ర రాజ్యానికి మోదీ అమ్మకం పెట్టారు’’అంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘డిజిటల్ వాణిజ్య నిబంధనలపై నియంత్రణను కేంద్రం పూర్తిగా అమెరికాకు వదిలేసుకుంది. డేటా లోకలైజేషన్‌ను తొలగించేసింది. అమెరికా నుంచి డేటా వరదకు గేట్లెత్తేందుకు ఒప్పుకుంది. బడా టెక్ కంపెనీలకు 20 ఏళ్ల ట్యాక్స్ హాలిడేలు ప్రకటించేసింది. మొదట్లో మనపై కేవలం 3 శాతంగా ఉండే అమెరికా టారిఫ్‌లు ఇప్పుడు 18 శాతానికి పెరిగాయి. అమెరికా వస్తూత్పత్తులపై భారత టారిఫ్‌లు మాత్రం 16 శాతం నుంచి ఎకాయెకి సున్నాకు పడిపోయాయి. అమెరికా దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 146 బిలియన్ డాలర్లకు పెరగనున్నాయి’’అంటూ రాహుల్ మండిపడ్డారు. ‘‘కేంద్రం మన వ్యవసాయ రంగాన్ని అమెరికాకు బార్లా తెరిచేసింది. దాంతో అక్కడి వ్యవసాయోత్పత్తులు మన మార్కెట్లను ముంచెత్తనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా మన రైతులు భారీ సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు. మోదీకి ముందు ఏ ప్రధానీ ఇలాంటి సిగ్గుచేటైన పని చేయలేదు. ఇకముందు మరే ప్రధానీ చేయబోడు’’అన్నారు. అధికార పక్ష సభ్యులు పదేపదే లేచి రాహుల్ ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. చేతనైతే వాటికి రుజువులు చూపాలని సవాలు చేయగా అందుకు తాను సిద్ధమేనని రాహుల్ బదులిచ్చారు.మేమైతే ఇలా చేసేవాళ్లం ‘‘యుద్ధాల శకం ముగిసిందని మోదీ అంటున్నారు. కానీ నిజానికి మనమున్నదే యుద్ధాల శకంలో! ఇలాంటప్పుడు మన బలాలేమిటో అవగాహన ఉండాలి. ప్రజలే మన నిజమైన బలం’’అని రాహుల్ అన్నారు. ‘‘ఇండియా కూటమే గనుక అధికారంలో ఉంటే వాణిజ్య ఒప్పందం విషయంలో పూర్తిగా భిన్నంగా వ్యవహరించేది. డేటా మన అతి పెద్ద ఆస్తి. అది అమెరికాకు అందుబాటు ఉండాలంటే భారత్‌ను అమెరికా సేవకునిలా గాక సమాన భాగస్వామిగా పరిగణించాలని ట్రంప్‌కు కుండబద్దలు కొట్టేవాళ్లం. ఆ హోదాలోనే చర్చలు జరిపేవాళ్లం. దేశ ఇంధన భద్రతపై, మన రైతుల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని, వాటిపై చర్చలకు తావు లేదని ఆయన ముఖం మీదే చెప్పేవాళ్లం. పాక్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ అల్పాహార భేటీ వంటి ఉదంతాలపై కచి్చతంగా అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్లం’’అని చెప్పుకొచ్చారు.ఎప్స్టీన్ ఫైల్స్‌లో అంబానీ, పురీ అమెరికాతో పాటు పలు దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం టేపుల్లో కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురీ, వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేర్లు కూడా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఎప్స్టీన్ ఫైల్స్: కష్టాల్లో కీర్ స్టార్మర్
లండన్: అమెరికాలో మొదలైన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం బ్రిటన్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా కీర్ స్టార్మర్ ప్రభుత్వ పునాదులనే కదిలిస్తోంది! సంపన్నులు, రాయబారులు, అగ్రనేతలు, రాజకుటుంబీకుల లైంగికావసరాలు తీర్చేందుకు అమాయక యువతులు, ముఖ్యంగా మైనర్లను అక్రమంగా సరఫరా చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఎప్స్టీన్ బతికున్నప్పటి కంటే చనిపోయాక ఈ అంశం మరింత ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రిటన్ ప్రభుత్వ పెద్దల పదవులకు ఎసరుపెడుతోంది. ఇప్పటికే ఒకరిని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్వయంగా తొలగించగా పశ్చాత్తాపంతో మరొకరు రాజీనామా చేశారు. తాజాగా సోమవారం స్టార్మర్ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ విభాగ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిమ్ అలాన్ తన పదవికి రాజీనామాచేశారు. పదవి చేపట్టిన కేవలం 5 నెలలకే ఆయన తప్పుకోవాల్సి రావడం గమనార్హం. ‘‘స్టార్మర్ ప్రభుత్వంలో కొత్త బృందం కొలువు తీరేందుకు మార్గం సుగమం చేస్తూ నేను వైదొలగుతున్నా.ప్రధానికి, ఆయన కొత్త బృందానికి విజయం చేకూరాలని కోరుకుంటున్నా’’అని టిమ్ వ్యాఖ్యానించారు. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంతో సంబంధమున్న అమెరికాలో బ్రిటన్ రాయబారి పీటర్ మాండెల్సన్‌ను గతేడాది సెపె్టంబర్లో స్టార్మర్ తొలగించారు. మాండెల్సన్‌ను ఆ పదవికి ఎంపిక చేయడానికి తన సిఫార్సే కారణమని చింతిస్తూ స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్ స్వీనీ ఆదివారం రాజీనామా చేశారు.గోర్డన్ బ్రౌన్ ప్రధానిగా ఉన్న కాలంలో వాణిజ్య శాఖ మంత్రి హోదాలో మాండెల్సన్ బ్రిటన్ విధానపర నిర్ణయాలను ఎప్స్టీన్కు రహస్యంగా ముందే చేరవేసినట్లు ఎప్స్టీన్ పత్రాల్లో తాజాగా తేలింది. దీంతో కీలక పదవుల్లో సమర్థుల నియామకంలో ప్రధానిగా స్టార్మర్ ఘోరంగా విఫలమయ్యారని విపక్ష పారీ్టలతో పాటు సొంత లేబర్ పార్టీ ఎంపీలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనకు ప్రధానిగా కొనసాగే అర్హత లేదని తిట్టిపోస్తున్నారు. స్టార్మర్ రాజీనామా చేయాల్సిందే ప్రధానిగా స్టార్మర్ తప్పుకోవాలని స్కాట్లాండ్లో లేబర్ పార్టీ నేత అనాస్ సర్వార్ డిమాండ్‌చేశారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ వంటి కీలక పదవుల నుంచే రాజీనామాల పర్వం మొదలవడంతో స్టార్మర్ వెంటనే నష్ట నివారణ చర్యలు ఆరంభించి కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మాండెల్సన్ నియామకంలో తప్పిదం చేశానని స్టార్మర్ క్షమాపణలు చెప్పినా విమర్శలు ఆగడం లేదు. ఈ వారం జరగబోయే పార్లమెంటరీ లేబర్ పార్టీ సమావేశంలో స్టార్మర్ మరోసారి తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే సోమవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ ప్రాంతానికి చేరుకున్న కేబినెట్ మంత్రులు పలువురు స్టార్మర్‌కు మద్దతు పలకడం విశేషం. ‘‘ఆయన పదవిలోకి వచ్చి 18 నెలలే అవుతోంది. ఆయన పనిని సవ్యంగా చేయనిస్తాం’’అని విద్యా శాఖ మంత్రి బ్రిగ్జెడ్ ఫిలిప్సన్, హోం మంత్రి షబానా మహ్మూద్ అన్నారు.తొలిసారిగా స్పందించిన రాజకుటుంబం ఎప్స్టీన్ వ్యవహారానికి యూకే అధికార వర్గాలతో సంబంధం ఉండటంపై బ్రిటన్ రాజకుటుంబం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు యువరాజు ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ నివసించే అధికారిక రాజప్రాసాదం ‘కెన్సింగ్టన్ ప్యాలెస్’సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది.‘‘యువరాజు కుటుంబం తాజా పరిణామాలపై చాలా మనస్తాపం చెందింది. అధికార వర్గాలతో సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడటం విస్మయం కల్గిస్తోంది. ఈ పరిణామాలను విలియం, కేట్ గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉదంతంలో ఆనాడు బాధితులుగా మిగిలిపోయిన అమాయక టీనేజర్లు, యువతుల పోరాటానికి రాజకుటుంబం తమ సంఘీభావం వ్యక్తం చేస్తోంది’’అని కెన్సింగ్టన్ ప్యాలెస్ పేర్కొంది. అయితే రాజు చార్లెస్–3కు తమ్ముడు, ఇటీవల రాజకుటుంబ హోదా వదలుకున్న ఆండ్రూపై విచారణ జరిపే విషయాన్ని ప్రకటనలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఎప్స్టీన్కు చెందిన ద్వీపాల్లోని విలాసవంత ఎస్టేట్లకు పలుమార్లు ఆండ్రూ వెళ్లినట్లు వెల్లడైన విషయం విదితమే. -
‘ఎప్స్టీన్’ ఆరోపణలు.. దలైలామా ఏమన్నారంటే..
ధర్మశాల: లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో ఆధ్యాత్మిక గురువు దలైలామాకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దలైలామా ఎన్నడూ ఎప్స్టీన్ను కలవలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆయన తరపున మరెవరూ కూడా ఎప్స్టీన్తో సమావేశం అయ్యేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని కార్యాలయం పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని, వాటిలో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది.అమెరికాలో సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్ బహిర్గతం కావడంతో పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఉన్నత స్థాయి వ్యక్తులకు ఎప్స్టీన్తో ఉన్న సంబంధాలు, సంభాషణల వివరాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దలైలామా పేరు కూడా ప్రస్తావనకు రావడంతో చర్చ మొదలైంది. అయితే తమ గౌరవానికి భంగం కలిగించేలా సాగుతున్న ఈ ప్రచారాన్ని దలైలామా కార్యాలయం తోసిపుచ్చింది. Press StatementSome recent media reports and social media posts concerning the “Epstein files” are attempting to link His Holiness the Dalai Lama with Jeffrey Epstein.We can unequivocally confirm that His Holiness has never met Jeffrey Epstein or authorised any meeting or… pic.twitter.com/QtV6B3Wr0u— Dalai Lama (@DalaiLama) February 8, 2026అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన సుమారు 30 లక్షల ఫైళ్లను విడుదల చేసింది. ఇందులో 2,000కు పైగా వీడియోలు, దాదాపు లక్షా ఎనభై వేల ఫోటోలు ఉన్నట్లు సమాచారం. ఈ పత్రాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తదిర ప్రముఖుల పేర్లు ఉన్నాయి.పేర్లు ఉన్నంత మాత్రాన వారు తప్పు చేసినట్లు కాదని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ జాబితాలో దలైలామా పేరు ఉండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాకు చెందిన ఒక సంపన్న ఆర్థికవేత్త, బాలికలు, యువతులపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా కేసుల్లో దోషిగా తేలి జైలుకు వెళ్లాడు. 2008లో ఫ్లోరిడాలో మొదటిసారి శిక్ష అనుభవించిన ఆయన, 2019లో ఫెడరల్ దర్యాప్తులో తిరిగి అరెస్టయ్యాడు. అయితే విచారణ ఎదుర్కొంటున్న సమయంలో జైలులోనే ఆయన స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు.ఇది కూడా చదవండి: ఓపెన్ ఏఐ మరో షాక్.. ఇక స్మార్ట్ ఫోన్లకు చెక్! -
ఎప్స్టీన్ ఫైల్స్ చరిత్ర ఇదే..!
అమెరికాలో జెఫ్రీ ఎప్స్టీన్ పేరు మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐదు సంవత్సరాల క్రితం జైలు గదిలో అతను ఆత్మహత్య చేసుకున్నా… అతని చుట్టూ తిరిగిన రహస్యాల కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న “ఎప్స్టీన్ ఫైళ్లు” ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.జెఫ్రీ ఎప్స్టీన్ రాజకీయ నాయకుడు కాదు. సినీ తార కూడా కాదు. కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతుల మధ్య తిరిగిన వ్యక్తి. అపర కుబేరుడైన ఎప్స్టీన్అతనికి సొంతంగా ఉన్న లిటిల్ సెయింట్ జేమ్స్ అనే చిన్న దీవిని తమ కామ క్రీడలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలపై లైంగిక దోపిడి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథలు దాదాపు ఒకేలా ఉన్నాయి — చిన్న ఉద్యోగ ఆఫర్లు, ఆకర్షణలు, తర్వాత బెదిరింపులు. లోపల జరిగినవి బయటకు చెప్పాలంటే చంపేస్తామని హెచ్చరికలు.ఎప్స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయలేడని చాలా మంది నమ్ముతున్నారు. అతని వెనుక ఒక వ్యవస్థ పనిచేసిందా? అతన్ని రక్షించిన శక్తులు ఉన్నాయా? అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి.అసలేంటి ఎప్స్టీన్ ఫైల్స్ ..ఇప్పుడు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన పత్రాలు ఈ కేసును మరింత వేడెక్కించాయి. కోర్టు రికార్డులు, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్స్ — ఇవన్నీ కలిపి లక్షల పేజీల డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రముఖుల పేర్లు కనిపించడంతో సంచలనం రేగింది.మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, హిల్లరీ క్లింటన్ వంటి పేర్లు కోర్టు పత్రాల్లో ప్రస్తావనకు వచ్చాయి. అలాగే ఎలాన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి వ్యాపారవేత్తల పేర్లు కూడా విమాన లాగ్స్ లేదా కమ్యూనికేషన్ రికార్డుల్లో కనిపించాయి. చివరికి మన భారత దేశానికి చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉండడం సంచలనంగా మారింది. అయితే వీరిలో చాలా మంది తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.ఎప్స్టీన్ 2002 నుంచి 2005 మధ్య ఫ్లోరిడాలో యువతులను లైంగిక దోపిడికి గురి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో అరెస్టై జైలులో ఉన్న సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సహచరురాలు గిస్లేన్ మాక్స్వెల్ ప్రస్తుతం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తోంది.మరోవైపు ట్రంప్ మరియు ఎప్స్టీన్ మధ్య ఉన్న సంబంధం కూడా పెద్ద చర్చగా మారింది. వీరిద్దరి ఫోటోలు, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్ వివరాలు బయటకు వచ్చాయి.వీరిద్దరి ఫోటోలు అమెరికా రాజకీయాల్లో చిచ్చురేపుతోంది. ట్రంప్ పేరు ఈ స్థాయిలో బయటికి రావడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనుందనేది రానున్న రోజుల్లో తెలుస్తోంది.అయితే ప్రజలు ఎందుకు ఇంకా ఆసక్తిగా చూస్తున్నారు? కారణం ఒక్కటే — ఇంకా అనేక ప్రశ్నలు సమాధానం లేకుండానే ఉన్నాయి. ఫ్లోరిడాలో ఎప్స్టీన్కు ఎందుకు తేలికైన శిక్ష విధించబడింది? అతని వెనుక మరెవరైనా ఉన్నారా? జైలులో అతని మరణంపై పూర్తిగా స్పష్టత ఉందా?ఎప్స్టీన్ ఫైళ్లు కేవలం ఒక కేసు పత్రాలు కావు. అవి అధికారం, డబ్బు, ప్రభావం, రహస్యాల కలయిక. ప్రతి విడుదల కొత్త పేర్లను తెస్తోంది… కానీ పూర్తి నిజం ఇంకా బయటకు రాలేదు. అసలు ప్రశ్న మాత్రం అదే ..ఇంకా విడుదల కాని పత్రాల్లో ఏముంది? ఇంకా ఎవరి పేర్లు బయటకు రావాల్సి ఉంది?ప్రపంచం ఇంకా ఆ సమాధానాల కోసం ఎదురుచూస్తోంది. -
ఎప్స్టీన్ ఫైల్స్.. ఎట్టకేలకు స్పందించిన బిల్‌గేట్స్
అమెరికాతో పాటు పలు దేశాల రాజకీయాలను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల వ్యవహారం ఎప్స్టీన్ ఫైల్స్‌పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఎట్టకేలకు స్పందించారు. జెఫ్రీ ఎప్స్టీన్తో తాను టైం స్పెండ్ చేయడం పెద్ద తప్పైపోయిందని.. అందుకు అందరికీ క్షమాపణలు చెబుతున్నానని అన్నారాయన. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు. ఆస్ట్రేలియా 9న్యూస్ చానెల్ చీఫ్ పొలిటికల్ ఎడిటర్ చార్లెస్ క్రౌచర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంపై స్పందించారు. ‘‘2011లో తొలిసారి ఎప్స్టీన్ను కలిశా. అప్పటి నుంచి మూడు ఏళ్లపాటు కొన్ని విందు కార్యక్రమాల్లో మేం పాల్గొన్నాం అంతే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనికుల నుంచి ‘గ్లోబల్ హెల్త్’ పేరిట విరాళాలు తెచ్చి పెడతానని అతను నాతో అన్నాడు. అది వృథా ప్రయత్నమని నేను అతనికి చెప్పాను. అతని దీవికి ఏనాడూ నేను వెళ్లింది లేదు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడిందీ లేదు. అతనితో గడిపిన ప్రతీ నిమిషం పట్ల నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. అందుకు అందరినీ క్షమాపణలు కోరుతున్నా అని బిల్‌గేట్స్ వ్యాఖ్యానించారు. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల తాలుకా మెయిల్స్, మరికొన్ని ఫొటోలు వెలుగులోకి రావడాన్ని బిల్‌గేట్స్ తోసిపుచ్చారు. ఎప్స్టీన్ రాసిన డ్రాఫ్ట్ ఈ-మెయిల్స్‌లో ఉన్న ఆరోపణలు అసత్యమని, ఆ ఈ-మెయిల్ ఎప్పుడూ తాను పంపలేదని తెలిపారు. మరోవైపు.. బిల్‌గేట్స్ వ్యక్తిగత ప్రతినిధి సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారు. గేట్స్ తనతో స్నేహం కొనసాగించలేదన్న కోపంతోనే ఎప్స్టీన్ అలా డ్రాప్ట్ మెయిల్స్‌ను సృష్టించి ఉంటాడని తెలిపారు. జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్.. టీచర్, ప్రముఖ ఆర్థికవేత్త. అమెరికాలో పలు రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులకు ఆర్థిక సలహాదారుడిగా పని చేశాడు. అలా.. క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పరిచయం పెంచుకున్నాడు. అతనికి సంబంధించిన ప్రైవేట్ దీవుల్లో మైనర్లతో హైఫ్రొఫైల్ సెక్స్ రాకెట్ నిర్వహించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎప్స్టీన్, అతనికి సహకరించిన వ్యక్తిగత సిబ్బంది గిస్లేన్ మ్యాక్స్‌వెల్‌ను అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన అదే ఏడాది(2019)లో ఎప్స్టీన్ జైల్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు(ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయి). ఈ కేసులో ఎప్స్టీన్ ప్రైవేట్ ఐల్యాండ్ నుంచి సేకరించిన పలు వివరాలు.. సెక్స్‌రాకెట్‌లో పలువురు ప్రముఖులు ఉండడంతో ఎప్స్టీన్ ఫైల్స్‌గా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో.. అమెరికా న్యాయ శాఖ (DOJ) తాజాగా రిలీజ్ చేసిన ఫైల్స్‌లో కొన్ని డ్రాఫ్ట్ ఈమెయిల్స్‌లో బిల్ గేట్స్ పేరు ప్రస్తావించబడింది. అందులో గేట్స్‌పై అనైతిక సంబంధాలు, రష్యన్ యువతుతో గడిపినందుకు సుఖ వ్యాధి (STD) సోకిందనే.. ఆరోపణలు వెలుగు చూశాయి. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది. అయితే.. ఈ వ్యవహారంపై బిల్ గేట్స్ మాజీ సతీమణి మిలిండా గేట్స్ సైతం స్పందించడంతో చర్చ తీవ్రతరమైంది. మెలిండా, బిల్‌గేట్స్‌లు 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఎప్స్టీన్తో బిల్ గేట్స్ సంబంధాలు కూడా తమ వైవాహిక జీవితంలో విబేధాలకు ఒక కారణమనే రీతిలో ఆమె స్పందించారు. ఎప్స్టీన్ ఫైల్స్‌పై స్పందిస్తూ.. ఇవి నా వివాహ జీవితంలోని అత్యంత బాధాకరమైన కాలాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నాయి అని అన్నారామె. అయితే.. సుఖ వ్యాధి అంశంపై స్పందిస్తూ.. ‘‘ఏ ప్రశ్నలు మిగిలి ఉన్నాయో, వాటికి సమాధానం చెప్పాల్సింది నా మాజీ భర్తే. నేను కాదు’’ అని స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు.. 2022లో సీబీఎస్ మార్నింగ్స్ ఇంటర్వ్యూలో కూడా ఆమె.. బిల్ గేట్స్‌కు ఎప్స్టీన్తో ఉన్న పరిచయం తనకు అసౌకర్యం కలిగించిందని అన్నారు కూడా. -
ఎప్స్టీన్ ఫైల్స్ : ఫొటో దెబ్బకి ఎంపీ రాజీనామా
లండన్: ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైళ్లు అమెరికాలో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంకీ ఎప్స్టీన్ పేజీలను విడుదల చేశారు. వాటిల్లో మాజీ యూకే రాయబారి ప్రస్తుత అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు పీటర్ బెంజమిన్ మాండెల్సన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందిఎప్స్టిన్ ఫైల్స్‌లో పీటర్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. పీటర్ లోదస్తులతో ఉండగా.. ఆయనతో ఓ మహిళా సన్నిహితంగా ఉంది. ఆ ఫొటోలపై దుమారం చెలరేగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ ఫొటో గురించి అడగ్గా.. 'తెలియదు గుర్తులేదు మర్చిపోయా'. దాట వేశారు. ప్రస్తుతం,ఈ అంశంపై యూకే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోందిఇక ఎప్స్టీన్ ఫైల్స్‌లో 2003-04 మధ్య కాలంలో ఎప్స్టీన్కు పీటర్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఎప్స్టీన్ నుంచి పీటర్‌కు సుమారు 75వేల డాలర్లు అందగా.. 25వేల డాలర్లకు సంబంధించి లావాదేవీల వివరాలు ఉండటం గమనార్హం. పీటర్‌తో అస్పష్టంగా ఉన్న మహిళ గురించి వివరాలు గురించి ఆయన్ని మీడియా ఆరా తీసింది. ఫోటోలు ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలియదు. ఆ ప్రదేశాన్ని, స్త్రీని తాను గుర్తించ లేకపోతున్నానని, ఏ సందర్భంలో ఆ ఫొటోను దిగాల్సి వచ్చిందో గుర్తించ లేకపోతున్నారని చెప్పుకొచ్చారు. -
ట్రంప్ కోసమే మోదీ అలా చేశారు.. భారత్ రియాక్షన్ ఇదే
ఎప్స్టీన్ ఫైల్స్ ప్రస్తుతం అమెరికాలో ఈ వ్యవహారం ఎంత హాట్‌టాఫిక్‌గా మారిందో అంతా తెలిసిందే. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌తో పాటు బిల్గ్రేడ్స్, మైకేల్ జాక్సన్ లాంటి ప్రముఖుల అంతరంగిక వ్యవహారాలు అందులో ఉన్నాయి. అయితే ఆ ఫైళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్థావన ఉండడంతో భారత్ దానిపై వివరణ ఇచ్చింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ దీనిపై స్పందించారు.ఇటీవల అమెరికా న్యాయవిభాగం జెఫ్రీ ఎప్స్టీన్ దర్యాప్తునకు సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. అయితే ఇందులో చాలా మంది ప్రముఖుల అంతరంగిక విషయాలకి సంబంధించిన సమాచారంపై ఆరోపణలున్నాయి. అయితే అందులో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ట్రంప్ సూచన మేరకే జరిగిందని ఉంది. ఎప్స్టీన్ మెయిల్స్‌లలో..2017లో ట్రంప్- మోడీ భేటీ జరిగింది. అప్పుడు ట్రంప్ మోదీని ఇజ్రాయెల్ పర్యటించాల్సిందిగా సూచించారు. దీంతో మోదీ ఆ ఏడాది ఇజ్రాయెల్ పర్యటన చేశారు. అని మెయిల్లో ఉంది.అంతేకాకుండా 2014లో ప్రస్తుత కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి.. ప్రధానిగా మోదీ ఎన్నికైన తర్వాత భారత్‌తో సంబంధాలు ఎందుకు మెరుగుపరుచుకుకోవాలో అని మెయిల్లో తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. " ఎప్స్టీన్ ఫైళ్లలో 2017లో భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించిన విషయం మినహా అంతకు మించి ఏది నిజం కాదు. మిగతా ప్రస్థావనలు అన్నీ ఒక నేరస్థుడు చెప్పిన అసత్య ప్రకటనలు" అని ఆయన అన్నారు. అవి పూర్తిగా అవాస్తవాలు అని తెలిపారు.అయితే రెండు రోజుల క్రితం అమెరికా న్యాయశాఖ విభాగం ఎప్స్టీన్కు సంబంధించి 30 వేల పత్రాలు, 2వేల వీడియోలు, విడుదల చేశారు. అందులో ఆ దేశ మాజీ అధ్యక్షులతో పాటు బిల్గ్రేట్స్, ఎలాన్ మస్క్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉంది. -
30 లక్షల పేజీల పత్రాలు
న్యూయార్క్: అమెరికా కుబేరుడు, ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్పై దర్యాప్తునకు సంబంధించిన కీలక పత్రాలను అమెరికా న్యాయ శాఖ తాజాగా విడుదల చేసింది. 30 లక్షల పేజీల పత్రాలతోపాటు 2 వేల వీడియోలు, 1.80 లక్షల ఫొటోలు బయటపెట్టడం గమనార్హం. పలువురు యువతులు, బాలికలపై ఎప్స్టీన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ వంటి ప్రముఖులు, ధనవంతులతో ఎప్స్టీన్ జరిపిన సంభాషణలపైనా దర్యాప్తు జరిగింది. దర్యాప్తు వివరాలు, పత్రాలను చట్ట ప్రకారమే బహిర్గతం చేసినట్లు న్యాయశాఖ వెల్లడించింది. వీటిని శుక్రవారం తమ వెబ్సైట్లో పొందుపర్చింది. ఇందులో ఆండ్రూ మౌంట్‌బాటన్ విండ్సర్ (ప్రిన్స్ ఆండ్రూ), ఎలాన్ మస్క్ తదితర మిత్రులతోనూ ఎప్స్టీన్ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఈ–మెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఎప్‌స్టీన్‌తోపాటు ఆయన ప్రియురాలు మాక్స్వెల్ నిర్వాకాలపై దర్యాప్తు వివరాలు బయటపెట్టాలని ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ చట్టాన్ని తీసుకొచ్చింది. న్యాయ శాఖ గత నెలలో పరిమితంగా కొన్ని పత్రాలు విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తాజాగా మొత్తం ఫైళ్లు బయటపెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎప్స్టీన్ బంధం చర్చనీయాంశంగా మారుతోంది. చాలామంది ప్రముఖులకు అమ్మాయిలను ఎరవేసి, తన పనులు పూర్తిచేసుకున్నట్లు ఎప్స్టీన్పై ఆరోపణలు వచ్చాయి. అయితే, అతడితో చాలా ఏళ్ల క్రితమే సంబంధాలు తెంచేసుకున్నానని ట్రంప్ ఇటీవల వివరణ ఇచ్చారు. జెఫ్రీ ఎప్స్టీన్ 1953 జనవరి 20న న్యూయార్క్‌లో జన్మించాడు. లైంగిక వేధింపులకు సంబంధించి ఆయనపై పలు అభియోగాలు నమోదయ్యాయి. 18 ఏళ్లలోపు బాలికలను వేధించినట్లు నిరూపణ జరిగింది. 2019 ఆగస్టు 10 న్యూయార్క్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఎప్స్టీన్ ఫైల్స్‌లో మీరా నాయర్
న్యూయార్క్: జెఫ్రీ ఎప్స్టీన్పై అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన దర్యాప్తు పత్రాల్లో బాలీవుడ్ దర్శకురాలు, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ పేరు సైతం ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ప్రియురాలు మాక్స్వెల్ ఇచ్చిన విందుకు మీరా నాయర్ హాజరైనట్లు ఓ ఈమెయిల్ సందేశాన్ని ఈ పత్రాల్లో ప్రస్తావించారు. మాక్స్వెల్ ఇంట్లో జరిగిన ఓ సినిమా ప్రదర్శనకు, ఆ తర్వాత జరిగిన విందులో ఆమె పాల్గొన్నట్లు ఇందులో ఉంది. 2009 అక్టోబర్ 21న ఈ ఈమెయిల్‌ను అమెరికన్ ప్రచురణకర్త పెగ్గీ సీగెల్ మరొకరికి పంపించారు. బిల్ క్లింటన్, జెఫ్ బెజోస్ కూడా హాజరైనట్లు మెయిల్లో పోస్టుచేశారు. ఈ సినిమా మహిళలకు బాగా నచ్చిందని పేర్కొన్నారు. అయితే, అది ఏ సినిమా అన్నది మెయిల్లో స్పష్టంగాలేదు. అందుబాటులో ఉన్న వివరాలను బట్టి చూస్తే అది ‘అమెలియా’అనే చిత్రం. మీరా నాయర్ దర్శకత్వం వహించారు. అమెరికా పైలట్ అమెలియా ఇయర్హర్ట్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హిల్లరీ స్వాంక్, రిచర్డ్ గెరే నటించారు. విమానంలో ప్రపంచాన్ని చుట్టి రావాలన్న ప్రయత్నంలో అమెలియా 1937లో పసిఫిక్ సముద్రంపై ఉండగా అదృశ్యమయ్యారు. అయితే, ఎప్స్టీన్ పత్రాల్లో తన పేరు ప్రస్తావనకు రావడంపై మీరా నాయర్ ఇంకా స్పందించలేదు. -
USA: ఎప్స్టీన్ స్కాండిల్... ప్రముఖుల పేర్లు
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ స్కాండిల్‌కు సంబంధించి మూడు మిలియన్ల పత్రాలను అమెరికా లా డిపార్ట్మెంట్ విడుదల చేసింది. వీటిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్, పాప్ స్టార్ మైకేల్ జాక్సన్‌కు సంబంధించి సంచలన విషయాలు ప్రచురించింది.అమెరికాని ఊపు ఊపేసిన ఎప్స్టీన్ సంబంధించి దాదాపు 3ం లక్షల పత్రాలు, 2వేల వీడియోలు అమెరికా న్యాయ విభాగం అధికారులు విడుదల చేశారు. అయితే అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్, పాప్ స్టార్ మైకెల్ జాక్సన్‌ల ఫోటోలు బయిటకు వచ్చాయి. వాటితో పాటు ఈ ఫైల్స్‌లో మైక్రోసాప్ట్ ఫౌండర్ బిల్గ్రేట్స్ పేరు కూడా ఉంది. అంతేకాకుండా ఈ మెయిల్ లో బిల్గ్రేట్స్, రష్యాన్ అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నారని ఆయన మెయిల్లో ఉన్నట్లు డైలీ మెయిల్ నివేదిక తెలిపింది.2013 జులై 18న ఎఫ్‌స్టీన్ తనకు తానుగా ఒక సుదీర్గమైన మెయిల్ రాసుకున్నారని అందులో గేట్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆరు సంవత్సరాల స్నేహానికి ముగింపు పలికారని తెలిపారు. బిల్‌గేట్స్ ఈ అంశంపై గతంలోనే చింతించారు. ఎఫ్‌స్టీన్‌తో తనకు పరిచయం ఉండడంతో చాలా విచారకరమన్నారు. అయితే ఎఫ్‌స్టీన్‌తో పరిచయమే తమ విడాకులకు ప్రధాన కారణమని బిల్‌గేట్స్ మాజీ ప్రేయసి మెలిండా అన్నారు. అయితే ప్రస్తుతం విడుదలైన ఫైల్స్‌లో బాధితుల పేర్లు, ఫోటోలు, ఎట్టిపరిస్థితుల్లో బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అక్కడి న్యాయశాఖ అధికారులు తెలిపారు. -
అబ్బే.. అది ట్రంప్ బ్యాచ్ పనేం కాదట!
అమెరికాలో రాజకీయ దుమారం చెలరేగిన వేళ.. ఎప్స్టీన్ సె* కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్‌లో మాయమైన ట్రంప్ ఫొటో తిరిగి ప్రత్యక్షం అయ్యింది. ఫోటోను తొలగించడంలో ట్రంప్ బ్యాచ్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే.. అందులో నిజం లేదని, తాత్కాలికంగా రివ్యూ కోసమే వాటిని తొలగించినట్లు అమెరికా న్యాయశాఖ తాజాగా ఒక స్పష్టత ఇచ్చింది.జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన ఫొటోను, కీలక పత్రాలను డెమొక్రట్లతో కూడిన హౌజ్ఓవర్ కమిటీ సమక్షంలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ బయటపెట్టింది. ఇందులో ఎప్స్టీన్కు సంబంధించిన వేల ఫొటోలు, కీలక సమాచారంతో కూడిన లక్షల ప్రతాలు ఉన్నాయి. అయితే.. అందులో నుంచి కొన్ని ఫొటోలు, డాక్యుమెంట్లు కనిపించకుండా పోవడంతో డెమొక్రటిక్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రత్యేకించి ట్రంప్ తన భార్య మెలానియా.. ఎప్స్టీన్, అతని సహయకురాలు గిస్లేన్ మాక్స్‌వెల్‌తో దిగిన ఫొటో, అలాగే ట్రంప్ కొందరు అమ్మాయిలతో దిగిన ఫొటోలు మాయమయ్యాయి.ఈ చర్యను ట్రంప్‌ను రక్షించేందుకు చేసిన ప్రయత్నమని డెమొక్రాట్లు ఆరోపించారు. మరోవైపు.. హౌస్ మైనారిటీ లీడర్ హకీమ్ జెఫ్రీస్ ఈ వ్యవహారంపై పూర్తి విచారణ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో.. ట్రంప్ ఫోటోను అమెరికా న్యాయ శాఖ మళ్లీ పునఃప్రచురించింది.అయితే.. ఆ ఫొటో తొలగింపు వెనుక ఎవరి ప్రమేయం లేదని న్యాయశాఖ స్పష్టత ఇచ్చింది. ఎవరి వ్యక్తిగత ప్రయోజనం కోసమే వాటిని తొలగించలేదు. ఆ ఫొటోల్లో ఎప్స్టీన్ బాధితులు ఎవరైనా ఉన్నారా? అని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు రివ్యూకు పంపారు. సమీక్ష అనంతరం అందులో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఎలాంటి మార్పులు లేకుండానే తిరిగి ప్రచురించాం. ఇది బాధితుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశమే అని ఎక్స్ ఖాతాలో జస్టిస్ డిపార్ట్మెంట్ ఒక పోస్ట్ చేసింది.ప్రముఖ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందిన జెఫ్ ఎప్స్టీన్కు ట్రంప్, బిల్‌గేట్స్, బిల్ క్లింటన్, మైకేల్ జాక్సన్.. పలువురు సినీ ప్రముఖలతోనూ మంచి సంబంధాలు ఉండేవి. అయితే.. అందులో కొందరి లైంగిక ఆనందం కోసం జెఫ్రీ ఎప్స్టీన్ అమ్మాయిలను సరఫరా చేసేవాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మీటూ ఉద్యమ సమయంలో ఆయన అరెస్ట్ అయ్యాక.. సంచలనాలు వెలుగు చూడొచ్చని అంతా భావించారు. ఈ క్రమంలో.. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అప్పటి నుంచి ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది.ట్రంప్ హయాంలో ఎప్స్టీన్ ఫైల్స్ విషయాలు బయటకు వస్తాయని అంతా భావించారు. అయితే అలా జరగకపోవడంతో ట్రంప్ తీరుపైనే డెమొక్రట్లు, ట్రంప్ వ్యతిరేకులు అనుమానాలు వ్యక్తం చేయసాగారు. అయితే ఎప్స్టీన్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టత ఇస్తూ వస్తున్నారు. అటు డెమొక్రట్లతో పాటు ఇటు రిపబ్లికన్ల నుంచి ఎదురైన ఒత్తిళ్ల నడుమ చివరకు ఫైల్స్ బయటకు వచ్చాయి. ఇందులో ఎప్స్టీన్కు సంబంధించిన ఫోటోలు, ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్టులు, కాల్ లాగ్స్, కోర్టు పత్రాలు ఉన్నాయి. అయితే, బాధితులను ఎఫ్‌బీఐ చేసిన ఇంటర్వ్యూలు, అభియోగాలపై అంతర్గత న్యాయశాఖ నివేదికలు లేవంటూ డెమొక్రటిక్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే.. లక్షల పేజీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని.. బాధితుల గోప్యతను కాపాడేందుకు సమీక్ష ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని.. ఇందులో 200 మందికి పైగా న్యాయవాదులు పాల్గొంటున్నారని న్యాయశాఖ అంటోంది. సమీక్ష ముగిశాక.. అందులో వివరాలను యధాతథంగానే ప్రచురిస్తామని స్పష్టత ఇస్తోంది. -
ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ డాటా గాయబ్
అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ కలకలం కొనసాగుతోంది. డెడ్‌లైన్ గడువు దగ్గర పడుతుండడంతో కీచకుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధం ఉన్న ఫొటోలను, కీలక పత్రాలను బయట పెడుతున్నారు. ఈ క్రమంలో.. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని ఫైల్స్ మాయం కావడం సంచలనంగా మారింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌కు సంబంధిం తాజాగా.. 24 గంటల్లోనే కనీసం 16 ఫైళ్లు అదృశ్యమయ్యాయి. అందులో ఒక ఫోటోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎప్స్టీన్లతో పాటు ట్రంప్ భార్య మెలానియా, ఎప్స్టీన్ క్రైమ్ పార్ట్నర్ గిస్లేన్ మ్యాక్స్‌వెల్ ఉన్నట్లు తెలుస్తోంది. మాయమైన ఫైల్స్‌లో ట్రంప్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉందనేది హౌజ్ ఓవర్‌సైట్ కమిటీలోని డెమొక్రట్ల ప్రధాన ఆరోపణ. మరోవైపు.. ఆ ఫైల్స్‌ను ఎందుకు తొలగించాల్సి వచ్చిందనేదానిపై అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ఇప్పటిదాకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పొరపాటున జరిగిందా?.. ఏదైనా కారణంతో చేశారా? అనేదానిపై ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే విడుదలైన ఆ డాక్యుమెంట్లలో.. బాధితులను దర్యాప్తు ఏజెన్సీ ఎఫ్‌బీఐ చేసిన ఇంటర్వ్యూలు, అంతర్గత మెమోలు వంటి కీలక పత్రాలు కనిపించకపోవడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యి.. కొంత కాలం తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఎప్స్టీన్ తనకు సంబంధించిన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే రెండు దీవుల్లో(ప్రైవేట్ ఐల్యాండ్)లో.. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి(ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు). ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. మీటూ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న టైంలో ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అయితే.. అలా జరగలేదు. ఎప్స్టీన్ కస్టమర్ల జాబితాలో ట్రంప్ కూడా ఉన్నారని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే.. ఒకప్పుడు అతనితో స్నేహం ఉండేదని, అరెస్ట్ తర్వాత అతన్నొక మానవ మృగంగా భావించి దూరం పెట్టానని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఆ ఫైల్స్‌ను పారదర్శకంగా రిలీజ్ చేయించేందుకు తాను సిద్ధమని అంటూనే.. జాప్యం చేస్తూ వచ్చారాయన. ఈ క్రమంలో.. సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తుండటంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. వాటిని బయట పెట్టాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ కూడా బిల్లును ఆమోదించడంతో ఇటీవలే దానిపై సంతకం పెట్టారు. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాల్సి ఉంది.లేటెస్ట్ రిలీజ్లో.. మొత్తం 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, 3,500 ఫైల్స్, భారీగా ఫోటోలను ఇప్పటిదాకా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది. ఇందులో.. ఆయుర్వేదం, అందులో పేర్కొన్న పలు మసాజ్ పద్ధతుల గురించిన ప్రస్తావన ఉండటం విశేషం. అలాగే.. ట్రంప్ సహా పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్న ఫోజులు, ఆయన ఐల్యాండ్‌లో సేదతీరిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఐల్యాండ్స్‌లోని విలాసాలు.. అలాగే కొన్ని నగ్న ఫొటోలు కూడా అందులో ఉన్నాయి. డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు సంబంధించి మాత్రం చాలా ఫొటోలు ఉండటం విశేషం. వాటిలో ఆయన హాట్ టబ్‌లో, పూల్‌లో పలువురు మహిళలతో సేదదీరుతూ కనిపిస్తున్నారు. ఆయనేగాక పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నాటి పలువురు హాలీవుడ్ హీరోలు ఎప్ స్టీన్ పార్టీలకు హాజరైన ఫొటోలు కూడా విడుదలైన ఫైల్స్‌లో ఉన్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఫొటోల్లో.. ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు ఇబ్బంది కలిగించే అంశాలేవీ పెద్దగా లేవు. ఆయనకు సంబంధించి అభ్యంతరకరంగా లేని కొన్ని ఫొటోలు మాత్రమే ఉన్నాయి. -
మళ్లీ ఎప్ స్టీన్ కలకలం
వాషింగ్టన్: అమెరికన్లు కొద్ది రోజులుగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జెఫ్రీ సెక్స్ కుంభకోణం తాలూకు మరిన్ని ఫైల్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. మొత్తం 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, 3,500 ఫైల్స్, భారీగా ఫోటోలను న్యాయ శాఖ శుక్రవారం విడుదల చేసింది. రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖుల లైంగికానందం కోసం ఎప్ స్టీన్ మహిళలను, ముఖ్యంగా బాలికలను సరఫరా చేసిన వైనం 20 ఏళ్ల కింద అమెరికాలో సంచలనం రేపడం తెలిసిందే. దాని తాలూకు ప్రకంపనాలు ఇప్పటికీ సద్దుమణగలేదు. అయితే తాజా ఫైల్స్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇబ్బంది కలిగించే అంశాలేవీ పెద్దగా లేవు. ఆయనకు సంబంధించి అభ్యంతరకరంగా లేని కొన్ని ఫొటోలు మాత్రమే ఉన్నాయి. విపక్ష డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు సంబంధించి మాత్రం చాలా ఫొటోలు ఉండటం విశేషం. వాటిలో ఆయన హాట్ టబ్‌లో, పూల్‌లో పలువురు మహిళలతో సేదదీరుతూ కనిపిస్తున్నారు. ఆయనేగాక పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నాటి పలువురు హాలీవుడ్ హీరోలు ఎప్ స్టీన్ పార్టీలకు హాజరైన ఫొటోలు కూడా విడుదలైన ఫైల్స్‌లో ఉన్నాయి. 20 ఏళ్ల కేసు: 2005 మార్చిలో ఒక బాలిక కుటుంబం ఫిర్యాదుతో ఎప్ స్టీన్ లీలలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామ్ బీచ్ కౌంటీలోని తన నివాసంలో పలువురు రాజకీయ తదితర ప్రముఖుల లైంగికానందం కోసం ఎప్ స్టీన్ పలువురు బాలికను వాడుకున్నాడని వారు ఆరోపించారు. జనాగ్రహం నేపథ్యంలో అరెస్టైన అతడు 2019లో జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎప్ స్టీన్ కస్టమర్ల జాబితాలో ట్రంప్ కూడా ఉన్నారని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తుండటంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. వాటిని బయట పెట్టాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ కూడా బిల్లును ఆమోదించడంతో ఇటీవలే దానిపై సంతకం పెట్టారు.ఆయుర్వేదం ప్రస్తావన!ఎప్ స్టీన్ ఫైల్స్‌లో ఆయుర్వేదం, అందులో పేర్కొన్న పలు మసాజ్ పద్ధతుల గురించిన ప్రస్తావన ఉండటం విశేషం. ’5 వేల ఏళ్ల పురాతనమైన భారత సహజ చికిత్సా ప్రక్రియను ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా చాలామంది అనుసరిస్తున్నారు’ అని వాటిలో పలుచోట్ల చెప్పుకొచ్చారు. అంతేగాక ’మసాజ్ చేసే కళ’ పేరిట పలు వ్యాసాలు కూడా వాటిలో ఉన్నాయి! -
ట్రంప్.. క్లింటన్.. బానన్.. బిల్‌గేట్స్.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో మరో బాంబు!
ప్రపంచాన్ని కుదిపేస్తున్న హైఫ్రొఫైల్ సెక్స్ స్కాండల్ ‘ఎప్స్టీన్ ఫైల్స్’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెమోక్రట్స్ నేతృత్వంలోని హౌజ్ ఓవర్‌సైట్ కమిటీ మరికొన్ని ఫొటోలను తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో రాజకీయ, వ్యాపార ప్రముఖులకు సంబంధించిన మొత్తం 19 ఫొటోలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రంప్ ఆప్తుడు స్టీవ్ బానన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ ట్రెజరీ సెక్రటరీ ల్యారీ సమర్స్, బిల్ గేట్స్, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ వూడీ అలెన్, ప్రిన్స్ ఆండ్రూ.. ఇలా పలువురు జెఫ్రీ ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్నట్లు అందులో ఉంది. ఇందులో.. డొనాల్డ్ ట్రంప్ కొంత మంది అమ్మాయిలతో(వాళ్ల మఖాల బ్లర్ చేసి ఉన్నాయి) కలిసి దిగిన ఫొటో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. మరొక ఫొటోలో ఎప్స్టీన్తో కలిసి ట్రంప్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇంకొక ఫొటోలో ఒక అమ్మాయితో(ముఖం కనిపించకుండా చేశారు) కలిసి ఫొటోకు ఫోజు ఇచ్చారాయన. ఇంకొక ఫొటోలో ట్రంప్ పేరిట కండోమ్ ఉండడం గమనార్హం. వీటితో పాటు క్లింటన్ ఎప్స్టీన్తో దిగిన ఫొటోలు, ఎప్స్టీన్ ఎస్టేట్‌లో బిల్‌గేట్స్ సహా పలువురు ప్రముఖులు సందడి చేసిన ఫొటోలు ఉన్నాయి.ట్రంప్.. ఎప్స్టీన్ ఒకప్పుడు మంచి స్నేహితులే. అయితే లైంగిక దాడి కేసులో ఎప్స్టీన్ అరెస్ట్(2004) తర్వాత ఆ బంధానికి ఎండ్‌కార్డ్ పడింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఇదే విషయాన్ని ఆయన చెబుతూ వస్తుంటారు. బానన్‌తో ఎప్స్టీన్ సెల్ఫీ.. పక్కన ఐల్యాండ్‌లోని ఓ గోడ మీద ఫొటోలో బిల్గేట్స్తాజాగా రిలీజ్ అయిన ఫొటోలు.. పలు ఈవెంట్లలో, పిచ్చాపాటి సంభాషణల్లో దిగిన ఫొటోలే ఉన్నాయి. అంతేగానీ.. అందులో ఉన్నవాళ్లంతా ఎప్స్టీన్ పాపాల్లో భాగం అయినట్లు మాత్రం ఎక్కడా లేదని చెబుతూ ఈ ఫొటోలను రిపబ్లికన్లు తేలికగా తీసుకుంటున్నారు. మరోవైపు ట్రంప్ కూడా ఆ ఫొటోలు అంతగా చర్చించుకోవాల్సిన విషయమేమీ కాదని అన్నారు. ‘‘నేను వాటిని చూడలేదు. కానీ అందరికీ ఈ వ్యక్తి(బానోన్ను ఉద్దేశిస్తూ..) తెలుసు. అతను పామ్ బీచ్‌లో ఎక్కడైనా కనిపించేవాడు. అతనితో వందలాది మంది ఫోటోలు ఉన్నాయి. అది పెద్ద విషయం కాదు. నాకు దాని గురించి ఏమీ తెలియదు’’ అంటూ బదులిచ్చారు. 🇺🇸⚡️Reporter: There were new Epstein photos released today showing..What was your reaction?Trump: I haven't seen them, but everybody knew this man (Bannon). He was all over Palm Beach. There are 100s and 100s of people that have photos with him. I know nothing about it. pic.twitter.com/KKWGtyr4Q2— Osint World (@OsiOsint1) December 12, 2025కామ పిశాచి.. ఎప్స్టీన్!అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యి.. కొంత కాలం తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఎప్స్టీన్ తనకు సంబంధించిన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే రెండు దీవుల్లో(ప్రైవేట్ ఐల్యాండ్)లో.. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి(ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు). ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. మీటూ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న టైంలో ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే..ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ ఏడాది జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని.. సన్నిహితంగా ఉన్న ప్రమఖలపైనా నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే..ఎప్స్టీన్తో ట్రంప్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ట్రంప్ ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపించాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ సెక్స్ స్కాండల్‌ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు కూడా).. ట్రంప్‌ను కూడా ఎఫ్‌బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో.. ఇది డెమోక్రాట్ల మోసం అంటూ తొలి నుంచి ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్.. చివరకు నవంబర్ 30వ తేదీన అధ్యక్ష హోదాలో ఫైల్స్ విడుదలకు ఓ సంతకం చేశారు. ఆ సమయంలో ఇక దాచడానికి ఏమీ లేదు.. విడుదలకు పూర్తి మద్దతు ఇస్తున్నా అని ఆయన ప్రకటించడం గమనార్హం. దాని ప్రకారం.. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 30 రోజుల్లో అన్ని ఫైళ్లను హౌజ్ ఓవర్‌సైట్ కమిటీకి అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎప్స్టీన్ ప్రైవేట్ ల్యాండ్స్‌కు సంబంధించి.. అందులో ఉన్న 150 ఫొటోలను, డాక్యుమెంట్లను కమిటీ బయటపెట్టింది. 20,000 పేజీల డాక్యుమెంట్లలో ఎప్స్టీన్కు ప్రముఖ రాజకీయ, మీడియా, హాలీవుడ్, విదేశీ నాయకులతో ఈ-మెయిల్ సంభాషణలు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ల ద్వారానే ప్రిన్స్ ఆండ్రూ పేరు ప్రముఖంగా బయటపడింది. మాజీ ట్రెజరీ కార్యదర్శి లారీ సమర్స్తో ఎప్స్టీన్ చేసిన ఈ-మెయిల్లు, అలాగే ట్రంప్ మాజీ సలహాదారు బానన్‌కు సహాయం చేయాలనే ఆఫర్లు బయటపడ్డాయి.అంతేకాదు ఐల్యాండ్‌లోని విలాసవంతమైన వసతుల ఫొటోలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మరోపక్క.. గిస్లేన్ మాక్స్వెల్ కేసుకు సంబంధించిన గ్రాండ్ జ్యూరీ మెటీరియల్స్ కూడా విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాలి, కాబట్టి మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
‘ఎప్స్టీన్ ఫైళ్లు'.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ రహస్య ఫైళ్లను బహిరంగంగా విడుదల చేయాలంటూ న్యాయ శాఖను ఆదేశించే బిల్లుపై సంతకం చేసినట్లు ప్రకటించారు. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఆయన.. ‘మా అద్భుతమైన విజయాల నుండి దృష్టి మరల్చేందుకు ‘ఎప్స్టీన్ ఫైళ్లు' అంశాన్ని డెమొక్రాట్లు ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు.‘ఎన్డీటీవీ’ అందించిన కథనంలోని వివరాల ప్రకారం ఈ బిల్లు ‘ఎప్స్టీన్ ఫైళ్లు పారదర్శకత చట్టం’ పేరుతో కాంగ్రెస్‌లో ద్వైపాక్షిక మద్దతు పొందింది. మంగళవారం హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో 427-1 ఓట్ల భారీ తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం. ట్రంప్ వ్యతిరేకత తర్వాత కూడా రిపబ్లికన్లతో సహా మెజారిటీ చట్టసభ సభ్యులు ఈ పారదర్శకతకు మద్దతు తెలిపారు. ఈ పరిణామం ఎప్స్టీన్ బాధితులకు, ఈ కేసులోని నిజానిజాలు తెలుసుకోవాలని కోరుకుంటున్న ప్రజలకు ఉపశమనం కలిగింది.ఈ చట్టం ప్రకారం.. న్యాయ శాఖ (డీఓజే) ఎప్స్టీన్కు సంబంధించిన అన్ని ఫైళ్లు, కమ్యూనికేషన్లను 30 రోజుల్లోపు విడుదల చేయవలసి ఉంటుంది. 2019లో ఫెడరల్ జైలులో ఎప్ స్టీన్ మరణంపై జరిగిన దర్యాప్తుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయాలని ఈ బిల్లు కోరుతోంది. ఎప్స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, అతని మరణంపై అనేక సందేహాలు, కుట్ర కోణాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రకటన కీలకంగా మారింది. అయితే ఈ బిల్లులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తుల కోసం ఎప్స్టీన్ బాధితులకు సంబంధించిన కొన్ని సవరణలను (Redactions) చేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. అంటే రాజకీయంగా ఎంతటి సున్నితమైన లేదా ఇబ్బందికరమైన సమాచారం ఉన్నా, అది తప్పనిసరిగా బహిర్గతం చేయవలసి ఉంటుంది. త్వరలోనే ఎప్స్టీన్ ఫైళ్లు వెల్లడి కానుండటంతో, దీనిలో ఏయే ప్రముఖుల పేర్లు బయటపడతాయో అనే ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.ఇది కూడా చదవండి: ‘ఏడ్చినా.. పట్టించుకోను’.. టీచర్ వేధింపులకు విద్యార్థి బలి -
ట్రంప్ యూటర్న్.. ఎప్స్టీన్ ఫైల్స్‌పై కొత్త ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సరికొత్త నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాలంటూ తన పరిపాలనపై ఒత్తిడి పెరిగిన దరిమిలా దీనిపై ఓటింగ్‌కు ఆయన హౌస్ రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు.ఎప్స్టీన్ ఫెడరల్ రికార్డులను బహిర్గతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంతకాలం చేసిన ప్రచారానికి అకస్మాత్తుగా ముగింపు పలికారు. ఆదివారం రాత్రి త ట్రూత్ సోషల్‌లో.. ట్రంప్ తన మునుపటి డిమాండ్‌ను పక్కన పెడుతూ ‘ఎప్స్టీన్ ఫైళ్లను విడుదల చేయడానికి హౌస్ రిపబ్లికన్లు ఓటు వేయాలి. ఎందుకంటే మన దగ్గర దాచడానికి ఏమీ లేదు’ అని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా న్యాయ శాఖపై ఒత్తిడి తెచ్చిన ఈ బిల్లు హౌస్ లోపల తీవ్రమైన నాటకీయ పరిణామాలకు దారితీసింది. గత వారంలో ఈ చర్యపై ఫ్లోర్ ఓటింగ్‌ను నిరోధించేందుకు ట్రంప్, స్పీకర్ మైక్ జాన్సన్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే డెమొక్రాట్లతో కలిసి ఓటు వేయడానికి దాదాపు 100 మంది రిపబ్లికన్లు సిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. ఈ బిల్లుపై ఓటింగ్ మంగళవారం జరగనుంది. NEW: Epstein survivors release the most powerful PSA I have ever seen. Make this go viral so every member of the House of Representatives sees it. pic.twitter.com/Cb5mUqQDFd— Aaron Parnas (@AaronParnas) November 16, 2025ఎప్స్టీన్ ఫైళ్లలో ఏముంది?లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్, అతని సహచరి గిస్లైన్ మాక్స్‌వెల్‌లు పలువురు బాలికలను, మైనర్లను తమ మాన్హాటన్ భవనం, ఫ్లోరిడా ఎస్టేట్, వర్జిన్ ఐలాండ్స్‌లోని సొంత ద్వీపం తదితర ప్రదేశాలకు తరలించి, లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన ఫైల్స్‌లో బాధితుల సాక్ష్యాలు, వారికి డబ్బులు చెల్లించిన వివరాలు, రిక్రూట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. ఈ విధమైన వేధింపులకు గురైన బాధితుల సంఖ్య వెయ్యికి పైనే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.ఎప్స్టీన్ సామాజిక సర్కిల్లో పలువురు అమెరికా రాజకీయ నేతలు, ప్రముఖులు, సంపన్నుల పేర్లు ఉన్నాయి. ఇవి ఎప్స్టీన్ బ్లాక్ బుక్, విమాన ప్రయాణాల లాగ్‌లు (ఫ్లైట్ లాగ్స్),ఇతర పత్రాల నుండి బహిర్గతమయ్యాయి. కొన్ని పత్రాలలో డొనాల్డ్ ట్రంప్ పేరు, అతని కార్యకలాపాల గురించి ఎప్స్టీన్ దగ్గర పనిచేసే ఉద్యోగులు, పైలట్, ఇతరుల మధ్య జరిగిన ఈ మెయిల్ సంభాషణలు ఉన్నాయి. ట్రంప్‌తో తనకున్న సంబంధం, అతని విమాన ప్రయాణాలు, ఎప్స్టీన్ రాసిన ఈ మెయిల్స్ ఇందులో ఉన్నాయి. అయితే ట్రంప్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తదితర ప్రముఖుల పేర్లు కూడా పత్రాలలో కనిపించాయి. అయితే ఈ పేర్లు కేవలం కాంటాక్ట్ బుక్‌లు, విమాన లాగ్‌లు లేదా ఎప్స్టీన్ బర్త్‌డే బుక్ లోని సందేశాల రూపంలో ఉన్నాయే తప్ప, వారంతా నేరాలలో భాగస్వామ్యం అయ్యారని స్పష్టంగా రుజువు చేసే సాక్ష్యాలు బహిరంగంగా విడుదల కాలేదు.అలాగే ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్పై 2008లో జరిగిన వివాదాస్పద ప్లీ డీల్, అప్పటి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) అధికారులు తీసుకున్న నిర్ణయాలు, 2019లో జరిగిన అరెస్ట్ వివరాలు కూడా ఉన్నాయి. ఎఫ్‌బీఐ (ఎఫ్‌బీఐ) దర్యాప్తులో 300 గిగాబైట్ల డేటా, భౌతిక సాక్ష్యాలు లభించాయి. ఇందులో ఎప్స్టీన్ ఫొటోలు, మైనర్ల లైంగిక చర్యల వీడియోలు, చిత్రాలు, బాధితులకు సంబంధించిన సున్నితమైన వివరాలు ఉన్నాయి.ఇది కూడా చదవండి: Pakistan: మళ్లీ ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’ టార్గెట్.. రైలు వెళ్లగానే పేలుడు -
అదంతా పచ్చి అబద్ధం: ఎలాన్ మస్క్
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్‌తో డొనాల్డ్ ట్రంప్‌ను కొంతకాలం ఎలాన్ మస్క్(Elon Musk) ఇరుకునపెట్టడం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మస్క్.. ఒక్కసారిగా చల్లబడ్డారు. ఈ తరుణంలో మస్క్ పేరే ఎప్స్టీన్ ఫైల్స్‌లో కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉందని, అందుకే ఆ ఫైల్స్‌ను బయటపెట్టడం లేదంటూ ఈ ఏడాది జూన్‌లో మస్క్ సంచలన ఆరోపణలకు దిగారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ.. వరుసబెట్టి చేసిన ట్వీట్లన్నింటినీ డిలీట్ చేసుకుంటూ వచ్చారాయన. ఈ తరుణంలో.. అమెరికా హౌజ్ ఓవర్‌సైట్ కమిటీ విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ తాలుకా డాక్యుమెంట్లలో మస్క్ పేరు కనిపించింది.అందులో.. ఒక దగ్గర ఎలాన్ మస్క్ డిసెంబర్ 6న ఐల్యాండ్‌కు రావాలి అని ఉంది. దీంతో ఎప్స్టీన్కు చెందిన ప్రైవేట్ ద్వీపానికి మస్క్ వెళ్లారా? అనే ప్రశ్న మొదలైంది. అయితే.. ఎలాన్ మస్క్ ఈ ఆరోపణను ఖండించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే.. మస్క్ ఎప్స్టీన్ ఫైల్స్‌పై ఇలా స్పందించడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఆయనకు, ఎప్స్టీన్కు మధ్య సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. తానెప్పుడు ఎప్స్టీన్ ఐల్యాండ్‌కు వెళ్లలేదని మస్క్ చెబుతూ వస్తున్నారు. మరోవైపు.. 8,544 పేజీల డాక్యుమెంట్లలో విమాన ప్రయాణాల వివరాలు, క్యాలెండర్లు, ఎప్స్టీన్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు ఉన్నాయి. కేవలం మస్క్ పేరు మాత్రమే కాదు.. అందులో ట్రంప్ సహా బిల్‌గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. అయితే పేర్లు ఉన్నంత మాత్రానా వాళ్లు ఎప్స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో భాగస్వాములు అయి ఉంటారనే నిర్ధారణ లేదని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చెబుతూ వస్తుండడం గమనార్హం.ఎవరీ ఎప్స్టీన్..అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్(Jeffrey Epstein)హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్.. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలపై ఎప్స్టీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే.. ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని, ప్రాముఖ్యమైన వ్యక్తులపై నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే.. ఎప్స్టీన్తో ట్రంప్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రంప్ వివాహ వేడుకలోనూ ఎప్స్టీన్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో.. ఈ సెక్స్ స్కాండల్‌ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు).. ట్రంప్‌ను కూడా ఎఫ్‌బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.ఆ విగ్రహం తొలగింపుఎప్స్టీన్ ఫైల్స్‌తో ట్రంప్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ దగ్గర ట్రంప్- ఎప్స్టీన్ చేతులు కలిపి సరదాగా ఉన్న ఓ విగ్రహాన్ని సెప్టెంబర్ 23వ తేదీన ఏర్పాటు చేశారు. Best Friends Forever అనే క్యాప్షన్ అక్కడ ఉంచారు. ఇది జనాలను విపరీతంగా ఆకర్షించింది. అయితే.. నిబంధనల ఉల్లంఘన పేరిట ఆ మరుసటిరోజే అధికారులు దానిని అక్కడి నుంచి తొలగించారు. సీక్రెట్ షేక్‌హ్యాండ్ అనే సంస్థ ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


