ట్రంప్ కోసమే మోదీ అలా చేశారు.. భారత్ రియాక్షన్ ఇదే | India has condemned the Epstein Files and the topic | Sakshi
Sakshi News home page

ట్రంప్ కోసమే మోదీ అలా చేశారు.. భారత్ రియాక్షన్ ఇదే

Feb 2 2026 12:55 AM | Updated on Feb 2 2026 12:58 AM

India has condemned the Epstein Files and the topic

ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తుతం అమెరికాలో ఈ వ్యవహారం ఎంత హాట్‌టాఫిక్‌గా మారిందో అంతా తెలిసిందే. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌తో పాటు బిల్‌గ్రేడ్స్, మైకేల్‌ జాక్సన్ లాంటి ప్రముఖుల అంతరంగిక వ్యవహారాలు అందులో ఉన్నాయి. అయితే ఆ ఫైళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్థావన ఉండడంతో భారత్ దానిపై వివరణ ఇచ్చింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ దీనిపై స్పందించారు.

ఇటీవల అమెరికా న్యాయవిభాగం జెఫ్రీ ఎప్‌స్టీన్‌ దర్యాప్తునకు సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. అయితే ఇందులో చాలా మంది ప్రముఖుల అంతరంగిక విషయాలకి సంబంధించిన సమాచారంపై ఆరోపణలున్నాయి. అయితే అందులో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ట్రంప్ సూచన మేరకే జరిగిందని ఉంది. ఎప్‌స్టీన్ మెయిల్స్‌లలో..2017లో ట్రంప్- మోడీ భేటీ జరిగింది. అప్పుడు ట్రంప్ మోదీని ఇజ్రాయెల్ పర్యటించాల్సిందిగా సూచించారు. దీంతో మోదీ ఆ ఏడాది ఇజ్రాయెల్ పర్యటన చేశారు. అని మెయిల్‌లో ఉంది.

అంతేకాకుండా 2014లో ప్రస్తుత కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి.. ప్రధానిగా  మోదీ ఎన్నికైన తర్వాత భారత్తో సంబంధాలు ఎందుకు మెరుగుపరుచుకుకోవాలో అని మెయిల్‌లో తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై  విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. " ఎప్‌స్టీన్‌ ఫైళ్లలో 2017లో భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించిన విషయం మినహా అంతకు మించి ఏది నిజం కాదు. మిగతా ప్రస్థావనలు అన్నీ ఒక నేరస్థుడు చెప్పిన అసత్య ప్రకటనలు" అని ఆయన అన్నారు. అవి పూర్తిగా అవాస్తవాలు అని తెలిపారు.

అయితే రెండు రోజుల క్రితం అమెరికా న్యాయశాఖ విభాగం ఎప్‌స్టీన్‌కు సంబంధించి 30 వేల పత్రాలు, 2వేల వీడియోలు, విడుదల చేశారు. అందులో ఆ దేశ మాజీ అధ్యక్షులతో పాటు బిల్‍గ్రేట్స్, ఎలాన్‌ మస్క్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement