సౌదీ, ఇజ్రాయెల్‌లకు అమెరికా ఆయుధాలు | Amid West Asia Tensions, US Moves Ahead With Arms Sales To Israel And Saudi Arabia, More Details Inside | Sakshi
Sakshi News home page

సౌదీ, ఇజ్రాయెల్‌లకు అమెరికా ఆయుధాలు

Feb 1 2026 7:15 AM | Updated on Feb 1 2026 9:25 AM

US Supply Weapons To Israel And Saudi

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలకు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధమైంది. ఇజ్రాయెల్‌కు 667 కోట్ల డాలర్లు, సౌదీకి 900 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను పెద్ద మొత్తంలో విక్రయించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు చేసే అవకాశం ఉందన్న వార్తలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం ఈ విషయాన్ని కాంగ్రెస్‌కు తెలిపిన విదేశాంగ శాఖ, ఆ వెంటనే ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశాంగ విధానానికి అనుగుణంగా, అమెరికా ప్రయోజనాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపింది. సౌదీకి విక్రయించే వాటిలో 730 పేట్రియాట్‌ క్షిపణులు, సంబంధిత పరికరాలున్నాయి. వీటితో సౌదీ అరేబియా క్షిపణి రక్షణ వ్యవస్థ మెరుగుపడుతుందని తెలిపింది. అదేవిధంగా, 30 అపాచీ అటాక్‌ హెలికాప్టర్లు, సంబంధిత సామగ్రి, 3,250 లైట్‌ టాక్టికల్‌ వాహనాలను ఇజ్రాయెల్‌కు విక్రయించనున్నామని వివరించింది.  

Advertisement
 
Advertisement
Advertisement