రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికీ కూటమి ప్రభుత్వం మేలు చేయలేదని.. ప్రతి ఇంటా ఇప్పుడు అదే చర్చ జరగుతుందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో ఆయన ఇవాళ(మార్చి 17, మంగళవారం) సమావేశమయ్యారు.
‘‘జగన్ ఎలా అన్నీ చేయగలిగాడు?.. మరి చంద్రబాబు ఎందుకు చేయడం లేదన్న చర్చ సాగుతోంది.
జగన్ మంచి ఆలోచనతో ప్రజలకు మేలు చేయాలని తలంచాడు.
ఆ దిశలోనే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు చేపట్టాం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.


