వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.
గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్న పొగాకు రైతులను పరామర్శించేందుకు బుధవారం(ఆగస్టు 5వ తేదీ) దేవరపల్లి పర్యటనకు బయల్దేరి వెళ్లిన వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఆయన పర్యటన సాగిన మార్గమంతా జనసంద్రంగా మారిపోయి జై జగన్ నినాదాలతో హోరెత్తింది.


