రూ. 2 లక్షల కోట్లు : జపాన్‌కు ధీటుగా హై-స్పీడ్ బుల్లెట్ రైలు | India Is Building Its FastestEver Bullet Train To Match Japans E10 | Sakshi
Sakshi News home page

రూ. 2 లక్షల కోట్లు : జపాన్‌కు ధీటుగా హై-స్పీడ్ బుల్లెట్ రైలు

Sep 22 2026 4:30 PM | Updated on Sep 22 2026 4:52 PM

India Is Building Its FastestEver Bullet Train To Match Japans E10

సొంత హై-స్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో భారతదేశం జపాన్‌ను అధిగమించి దూసుకు పోనుంది. దేశీయంగా మరింత రైల్వే సాంకేతికతను అభివృద్ధి చేసి, విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారతీయ రైల్వే శాఖ సొంతంగా గంటకు 350 కి.మీ వేగంతో వెళ్లే 'B35' బుల్లెట్ రైళ్లను అభివృద్ధి చేయనుంది. 2030 నాటికి ఈ స్వదేశీ బుల్లెట్ రైళ్లతో పాటు అవసరమైన మౌలిక వసతులను సిద్ధం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

2030 నాటికి ఈ స్వదేశీ బుల్లెట్ రైళ్లను అభివృద్ధి చేయడంతో పాటు, వాటిని నడపడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా నిర్మించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (MAHSR) ప్రాజెక్ట్ కోసం కేంద్ర మంత్రివర్గం అధిక బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. దీని మొత్తం వ్యయం ఇప్పుడు రూ. 2 లక్షల కోట్లకు పైగా చేరింది. ఇది 2015లో వేసిన తొలి అంచనాకు దాదాపు రెట్టింపు. ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేందుకు కేంద్ర బడ్జెట్ నుంచి సుమారు రూ. 1 లక్ష కోట్లు రానున్నాయి. డిసెంబర్ 2024లో తన ప్రస్తుత E5 సిరీస్ రైళ్ల తయారీని క్రమంగా నిలిపివేస్తామని, 2030 నాటికి కొత్త 'E10' రైళ్ల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు జపాన్   ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత్ తన స్వతంత్ర తయారీపై దృష్టి పెట్టింది.

B28 రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థ
B35 తో పాటు గంటకు 280 కి.మీ వేగంతో నడిచే 'B28' హై-స్పీడ్ రైళ్లను కూడా భారత్ అభివృద్ధి చేస్తోంది. అలాగే, రైలు వేగాన్ని నియంత్రించడానికి, రైళ్ల మధ్య సురక్షితమైన దూరాన్ని పాటించడానికి చైనా CTCS తరహాలోనే స్వదేశీ 'భారత్ రైలు కంట్రోల్ సిస్టమ్' (BTCS) ను రూపొందిస్తున్నారు.

 

రైల్వే మంత్రిత్వ శాఖ గతంలో విడుదల చేసిన వివరాల ప్రకారం, ముంబై-అహ్మదాబాద్ కారిడార్  MAHSR ప్రాజెక్ట్ 508 కిలోమీటర్ల మేర  ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ. 2 లక్షల కోట్లకు పైగా చేరింది. ఇందులో భాగంగా గుజరాత్, మహారాష్ట్ర, దాద్రా & నగర్ హవేలీ గుండా వెళ్లే 508 కి.మీ మార్గంలో ముంబై, సూరత్, అహ్మదాబాద్‌లతో సహా మొత్తం 12 స్టేషన్లు నిర్మించనున్నారు.ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML)తో కలిసి  ఈ కొత్త రైలు సెట్‌లను డిజైన్ చేసి తయారు చేస్తున్నాయి.

ఇదీ చదవండి: రోజుకు రూ. 50 వేలు : ఈమె వ్యాపారం ఏంటో తెలుసా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement