బాలికపై లైంగిక వేధింపులు.. ‘ఇలాంటివి పద్దతిగా కూడా చేయోచ్చు తెలుసా? | Bihar Minister Shreyasi Singh has courted controversy with her remarks on moral policing | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక వేధింపులు.. ‘ఇలాంటివి పద్దతిగా కూడా చేయోచ్చు తెలుసా?

Sep 22 2026 3:26 PM | Updated on Sep 22 2026 4:27 PM

Bihar Minister Shreyasi Singh has courted controversy with her remarks on moral policing

పాట్నా: బిహార్‌లోని జముయి జిల్లాలో జరిగిన మైనర్ జంట (బాలుడు, బాలిక) వేధింపుల ఉదంతం ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ ఘటనపై స్పందిస్తూ జముయి బిహార్ మంత్రి శ్రేయసి సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.   

సెప్టెంబర్ 19వ జముయి-లఖిసరాయ్ రోడ్డులో సాయంత్రం కోచింగ్ ముగించుకుని స్కూటీపై ఇంటికి తిరిగి వస్తున్న 10వ తరగతి చదువుతున్న బాలుడు,బాలికను కొందరు దుండగులు అడ్డుకున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఆ గుంపు, ఆ మైనర్లపై దాడి చేయడమే కాకుండా, బాలిక పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రాధేయపడుతున్నప్పటికీ వదలకండా వేధించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి శ్రేయసి సింగ్ మాట్లాడుతూ.. సమాజంలో ఇటువంటి ఘటనలు సిగ్గుచేటని ఖండించారు. అయితే, ఇదే సమయంలో ఆమె మాట్లాడుతూ..‘మోరల్‌ పోలీసింగ్‌ను మరింత హుందాగా, డీసెంట్‌ పద్ధతిలో కూడా చేయవచ్చు’ అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. చట్టసభల్లో ఉండి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మోరల్‌ పోలీసింగ్‌ను పరోక్షంగా సమర్థించినట్లే ఉందంటూ ప్రతిపక్షాలు, నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.  

బాధితుల తరఫు నుంచి ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన వెంటనే స్పందించి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారని, ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారని ఆమె తెలిపారు. పోలీసుల చర్యలపై తాము సంతృప్తిగా ఉన్నామని పేర్కొన్నప్పటికీ, ఆమె చేసిన  మోరల్‌ పోలీసింగ్‌ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌తో పాటు బిహార్ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సుమోటోగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాయి.  

ఇదీ చదవండి : బాలికపై లైంగిక దాడి.. నిందితుడి ఎన్‌కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement