breaking news
Moral policing case
-
బాలికపై లైంగిక వేధింపులు.. ‘ఇలాంటివి పద్ధతిగా కూడా చేయోచ్చు తెలుసా?
పాట్నా: బిహార్‌లోని జముయి జిల్లాలో జరిగిన మైనర్ జంట (బాలుడు, బాలిక) వేధింపుల ఉదంతం ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ ఘటనపై స్పందిస్తూ జముయి బిహార్ మంత్రి శ్రేయసి సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సెప్టెంబర్ 19వ జముయి-లఖిసరాయ్ రోడ్డులో సాయంత్రం కోచింగ్ ముగించుకుని స్కూటీపై ఇంటికి తిరిగి వస్తున్న 10వ తరగతి చదువుతున్న బాలుడు,బాలికను కొందరు దుండగులు అడ్డుకున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఆ గుంపు, ఆ మైనర్లపై దాడి చేయడమే కాకుండా, బాలిక పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రాధేయపడుతున్నప్పటికీ వదలకండా వేధించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి శ్రేయసి సింగ్ మాట్లాడుతూ.. సమాజంలో ఇటువంటి ఘటనలు సిగ్గుచేటని ఖండించారు. అయితే, ఇదే సమయంలో ఆమె మాట్లాడుతూ..‘మోరల్ పోలీసింగ్‌ను మరింత హుందాగా, డీసెంట్ పద్ధతిలో కూడా చేయవచ్చు’ అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. చట్టసభల్లో ఉండి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మోరల్ పోలీసింగ్‌ను పరోక్షంగా సమర్థించినట్లే ఉందంటూ ప్రతిపక్షాలు, నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బాధితుల తరఫు నుంచి ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన వెంటనే స్పందించి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారని, ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారని ఆమె తెలిపారు. పోలీసుల చర్యలపై తాము సంతృప్తిగా ఉన్నామని పేర్కొన్నప్పటికీ, ఆమె చేసిన మోరల్ పోలీసింగ్ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌తో పాటు బిహార్ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సుమోటోగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాయి. ఇదీ చదవండి : బాలికపై లైంగిక దాడి.. నిందితుడి ఎన్కౌంటర్ -
‘మోరల్ పోలీసింగ్’ కేసులో మలుపు
ముంబై : మధ్ ఐలాండ్ మోరల్ పోలీసింగ్ కేసు మలుపు తిరిగింది. మాల్వణీ పోలీసులకు స్థానికులు మద్దతుగా నిలిచారు. దాడుల్లో పాల్గొన్న పోలీసు అధికారులను బదిలీ చేస్తే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం ఎదుట ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు తనిఖీ నిర్వహించడంతో ఇప్పుడు తాము సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నామని, రాక్షసుల కళ్ల నుంచి తమ ఆడవాళ్లు బయటపడినట్లుగా ఉందని అంటున్నారు. ‘పోలీసుల తీరును ఖండిస్తూ పత్రికలు రాయడం బాధించింది. పోలీసులు మాకు మద్దతుగా నిలిచారు. ఒకవేళ బాధ్యత సక్రమంగా నిర్వహించినందుకు పోలీసులపై చర్యలు తీసుకుంటే వారికి మేము మద్దతుగా నిలుస్తాం. ఆ అధికారులను బదిలీ చేస్తే సీఎం నివాసం ఎదుట ఆందోళన చేపడతాం’ అని ఉత్తర ముంబైలోని మలాడ్‌లో మధ్ గ్రామ నివాసి నరేశ్ జాదవ్ హెచ్చరించారు. ‘ఈ మోరల్ పోలీసింగ్ అనే అంశం లేవనెత్తడం వెనక హోటళ్ల యజమానులు ఉన్నారు. ఎందుకంటే ఈ దాడుల వల్ల వారి వ్యాపారం దెబ్బతిన్నది. అందుకే ఇలా చేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు సకాలంలో దాడులు చేశారు’ అని జాదవ్ అన్నారు. ‘హోటళ్లు, లాడ్జీలు, కాట్టేజీల్లో వ్యభిచారం పెరిగిపోయింది. దానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత ఐదేళ్లలో పోలీసులకు ఎన్నో సార్లు లేఖలు రాశాం. గతంలో మా ఆడవాళ్లు బయటకు తల వంచుకుని వెళ్లేవాళ్లు. ఇప్పుడు పోలీసుల దాడుల తర్వాత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారికి థ్యాంక్స్ చెబితే సరిపోదు’ అని డోంగార్పాడా గ్రామంలో నివసించే రాకేశ్ రాజ్‌పుత్ అన్నారు. మధ్ ఐలాండ్, ఆక్సా ప్రాంతాల్లో ఆగస్టు 6న పోలీసులు జరిపిన దాడుల్లో 13 జంటలతో పాటు మరో 35 మంది అరెస్టయ్యారు. ఈ వ్యవహారంపై 9వ తేదీన ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా విచారణకు ఆదేశించారు. ‘పోలీసులు చేసిన పనిని అభినందించాలి. వ్యభిచారం చేస్తున్న వారిని పట్టుకుని వారు మంచి పనిచేశారు’ అని కన్సారీ మాతా ఆదివాసీ సమాజ్ సేవా సంఘ్ అధ్యక్షులు రేణుకా దివే అన్నారు. దాడులు జరిపిన గ్రామాలు ఏ ప్రాంత పరిధిలో వస్తాయో తెలపాలని కోరుతూ మాల్వణీ పోలీస్ స్టేషన్‌కు లేఖ కూడా రాశామని, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. కానీ ఈ విషయంపై ఎవరూ స్పందించలేదని ఆరోపించారు. ‘ఆటో రిక్షా వాళ్లతో లాడ్జీలు, హోటళ్ల వాళ్లు కుమ్మక్కై వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారని స్థానికులు చెప్పారు. అలా చేస్తున్న ఆటో రిక్షాలపై నిఘా ఉంచాలని పోలీసులను కోరాం. అలాగే ఈవ్ టీజింగ్ కూడా పెరిగిపోయిందని చెప్పాం’ అని దివే పేర్కొన్నారు. అప్పుడే ఫిర్యాదులు అందాయి.. ‘ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కొన్ని నెలల క్రితమే కాంగ్రెస్ ఎమ్మెల్యే అస్లాం షేక్ పోలీసులను కోరారు. మధ్ ఐలాండ్‌లోని డొంగార్పాడా, ఆక్సా, ఢార్వలీ గ్రామాల ప్రజలు కూడా పోలీసులకు పలు మార్లు విజ్ఞప్తి చేశారు. మొత్తం వ్యవహారానికి సంబంధించి కొందరు మహిళలను అరెస్టు చేశాం. వారు ముంబైలోని పలు ప్రాంతాల్లో వ్యభిచార గృహాలను నడుపుతున్నట్లు తెలిసింది’ అని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.


