21 ఏళ్ల క్రితం రూ. 14.5 కోట్ల ‘దీవి’ కొన్న హీరో.. ఇపుడెలా ఉంది? | Leonardo DiCaprio Bought A 104-Acre Caribbean Island For USD 1-75 Million To Create A Sustainable Holiday Destination | Sakshi
Sakshi News home page

21 ఏళ్ల క్రితం రూ. 14.5 కోట్ల ‘దీవి’ కొన్న హీరో.. ఇపుడెలా ఉంది?

Nov 14 2026 5:21 PM | Updated on Nov 14 2026 5:21 PM

 Leonardo DiCaprio Bought A 104-Acre Caribbean Island For USD 1-75 Million To Create A Sustainable Holiday Destination

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు పర్యావరణ పరిరక్షణ కార్యకర్త లియోనార్డో డికాప్రియో బెలిజ్‌లోని  'బ్లాక్‌డోర్ కే' (Blackadore Caye) అనే 104 ఎకరాల కరేబియన్ ద్వీపాన్ని కొనుగోలు చేశారు. 21 ఏళ్ల  క్రితం దీనిని సుమారు 1.75 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 14.5 కోట్లు)  సొంతం చేసుకున్నారు. ఇది బెలిజ్ విమానాశ్రయం నుండి పడవలో సుమారు 45 నిమిషాల ప్రయాణ దూరంలో, శాన్ పెడ్రో పట్టణానికి అత్యంత సమీపంలో ఉంది.  దీన్ని సుస్థిర పర్యాటక కేంద్రంగా మార్చాలని అప్పట్లో దీన్ని కొనుగోలు చేశారు.

ప్రపంచంలోని గొప్ప సముద్ర పర్యావరణ వ్యవస్థలలో ఒకటైన బెలిజ్ బారియర్ రీఫ్, స్వచ్ఛమైన కరేబియన్ జలాలు, ద్వీప జీవనం,  పురాతన మాయన్ వారసత్వం వంటివి బెలిజ్ తీరానికి పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. అయితే, విలాసవంతమైన పర్యాటక ప్రాజెక్ట్‌గా మారడానికి ముందే అక్కడి ఓ చిన్న దీవి లియోనార్డో డికాప్రియో దృష్టిని ఆకర్షించింది.జనావాసాలు లేకుండా, దాదాపు నిర్మానుష్యంగా ఉండేది ఈ ద్వీపం, దాని తీరంలో అధిక భాగాన్ని ఆక్రమించిన స్థానిక మడ అడవుల నరికివేతకు, కోతకు గురైంది. అప్పుడే ఇది  డికాప్రియో కంట పడింది.

2004లో డికాప్రియో బెలిజ్‌లో విహారయాత్రకు వెళ్లినప్పుడు, హోటలియర్ జెఫ్ గ్రామ్‌కు చెందిన 'కాయో ఎస్పాంటో' అనే అత్యంత విలాసవంతమైన రిసార్ట్‌లో బస చేశారు. అప్పుడే ఆయనకు బ్లాక్‌డోర్ కే దీవి గురించి తెలిసింది. అంబర్‌గ్రిస్ కేకు పశ్చిమాన, కరేబియన్ సముద్రంలో బెలిజ్ బారియర్ రీఫ్‌కు సమీపంలో ఉండేది. ఇక్కడ కేవ వలం విల్లాలు, విహారయాత్ర సౌకర్యాలను నిర్మించడమే కాకుండా, దెబ్బతిన్న ఆ దీవి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించి, పర్యావరణ అనుకూలమైన (సుస్థిర) పర్యాటక కేంద్రంగా దీనిని తీర్చిదిద్దాలని ఆయన భావించారు. పైకి అందమైన ఉష్ణమండల స్వర్గధామంలా కనిపించినప్పటికీ, బ్లాక్‌డోర్ కే దీవి అప్పటికే అధిక చేపల వేట, తీరప్రాంత కోత, వృక్షసంపద నష్టం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. అందుకే దాని పునరుద్ధరణనే తన పర్యాటక ప్రాజెక్ట్‌కు పునాదిగా మార్చాలని డికాప్రియో సంకల్పించారు.

ఈ ప్రైవేట్ ఐలాండ్ రిసార్ట్ విశేషాలు 
ఈ ప్రాజెక్ట్‌కు 'బ్లాక్‌డోర్ కే, ఎ రిస్టోరేటివ్ ఐలాండ్' అని పేరు పెట్టారు. చుట్టుపక్కల పర్యావరణాన్ని పునరుద్ధరిస్తూనే, పర్యాటకులకు ప్రత్యేకమైన విహారయాత్ర అనుభూతిని అందించేలా దీనిని రూపొందించారు. ఈ ప్రణాళికలో 36 రిసార్ట్ బంగ్లాలు, కొనుగోలుకు అందుబాటులో ఉండే 36 ప్రైవేట్ బీచ్‌ఫ్రంట్ విల్లాలు ఉన్నాయి. పూర్తిగా పునరుత్పాదక ఇంధనంపై ఆధారపడేలా దీనిని ప్లాన్ చేశారు. సౌరశక్తి, వర్షపు నీటి సంరక్షణ మరియు 'జీరో-వేస్ట్' (వ్యర్థాలు లేని) మౌలిక సదుపాయాలు ఇందులో ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. బెలిజ్ బారియర్ రీఫ్‌కు సమీపంలో ఉండటం వల్ల డైవింగ్, స్నార్కెలింగ్, సముద్ర జీవరాశులను వీక్షించే పర్యాటకులకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ఇంకా తెరుచుకోని రిసార్ట్ తలుపులు
వాస్తవానికి ఈ రిసార్ట్ 2018 నాటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, డిజైన్‌లో ఎదురైన కొన్ని ప్రధాన అడ్డంకుల కారణంగా అది సాధ్యపడలేదు.ముఖ్యంగా నీటిపై నిర్మించాలనుకున్న కట్టడాలు కొన్ని సముద్ర జీవావాసాలపై ప్రతికూల ప్రభావం చూపు తాయనే విమర్శలతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇంకా పర్యాటకులకు అందుబాటులోకి రాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement