న్యూజెర్సీలో బ్రిడ్జిని ఢీకొన్న నౌక, ట్రాఫిక్‌కు అంతరాయం | Between New Jersey And Philadelphia Cargo Ship Hits Bridge Major Traffic Delays | Sakshi
Sakshi News home page

న్యూజెర్సీలో బ్రిడ్జిని ఢీకొన్న నౌక, ట్రాఫిక్‌కు అంతరాయం

Nov 14 2026 3:36 PM | Updated on Nov 14 2026 3:36 PM

Between New Jersey And Philadelphia Cargo Ship Hits Bridge Major Traffic Delays

ఫిలడెల్ఫియా: అమెరికాలోని న్యూజెర్సీలో కార్గో నౌక ఒకటి ఢీకొనడంతో వంతెన దెబ్బతింది. ఈ వంతెన అవసరమైనప్పుడు రెండు భాగాలుగా విడిపోయి నౌకలకు దారిస్తుంది. లేని సమయంలో వంతెనలా ఉపయోగపడుతుంది. అయితే గురువారం డెలవేర్‌ నదిపై ఉన్న టకోనీ–పాల్మెరా  వంతెనను 1,115 మీటర్ల పొడవైన నౌక ఢీకొంది ఫలితంగా విడిపోయిన భాగాలను మళ్లీ కలపలేకపోతున్నారు. ఈ ఘటన కారణంగా పాల్మెరా, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని ఫిలడెల్ఫియా ప్రజా ప్రతినిధి రెడ్‌ నీల్సన్‌ తెలిపారు. 

అమెరికా కోస్ట్‌ గార్డ్‌ నౌకను బ్రిస్టల్‌లోని కిండర్‌ మోర్గన్‌కు తరలించింది. అక్కడ నౌకను క్షుణ్ణంగా పరిశీలించ నున్నారు. నౌకకు సంబంధించిన ఇతర వివరాలేవీ ఇప్పటివరకూ వెల్లడి కాలేదు. నౌక మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో వంతెనను ఢీకొట్టింది. ఆ సమయంలో నౌకలు ప్రయాణించేందుకు వీలుగా వంతెన రెండు భాగాలుగా విచ్చు కుని ఉంది. ఆ తరువాత ఇంకో నౌక వెళ్లేంతవరకూ కూడా వంతెన అదే స్థితిలో ఉందని, ఆ తరువాత కిందకు దిగివచ్చి పూర్తిస్థాయిలో మూసుకుపోలేదని తెలుస్తోంది. 

ఇదీ చదవండి: నాగా సంప్రదాయ సంస్థలపై గౌహతి హైకోర్టు ఆగ్రహం

ఈ ఉక్కు వంతెన ఫిలడెల్ఫియా ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది. మూడు వరుసల్లో వాహనాలు వెళుతూంటాయి. రెండు ఫిలడెల్ఫి వైపు, ఒకటి న్యూజెర్సీవైపు. రోజూ కనీసం 76, 200 వాహనాలు ఈ వంతెనపై ప్రయాణిస్తూంటా యని  అంచనా.  1929లో ప్రారంభమైన ఈ వంతెన పరిస్థితి బాగానే ఉందని ఫెడరల్‌ హైవే  అడ్మిని స్ట్రేషన్‌ ఈ ఏదాది మొదల్లో నిర్వహించిన ఒక సర్వే తెలిపిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. అన్ని లేన్‌లను తిరిగి తెరిచే ముందు పూర్తి భద్రతను నిర్ధారించడానికి, అధికారులు ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: మహిళ దారుణ హత్య, వంట పాత్రలో బాడీ పార్ట్స్‌ : తిన్నాడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement