హర్ముజ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. వాణిజ్య నౌకపై దాడి | 11 indians injured after panama flagged vessel attacked in hormuz | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. వాణిజ్య నౌకపై దాడి

Oct 6 2026 6:18 PM | Updated on Oct 6 2026 6:31 PM

11 indians injured after panama flagged vessel attacked in hormuz

ఢిల్లీ: హర్ముజ్ జలసంధిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక MT On Peaceపై మంగళవారం దాడి జరిగింది. ఈ దాడిలో  మొత్తం 12 మంది సిబ్బంది గాయపడగా, వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు. ఈ ఘటనపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడిని ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

భారత విదేశాంగ శాఖ తన ప్రకటనలో “హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న పనామా జెండాతో ఉన్న వాణిజ్య నౌక MT On Peaceపై మంగళవారం జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాం. నౌకలో ఉన్న మొత్తం 19 మంది సిబ్బందిలో 17 మంది భారతీయులు ఉన్నారు. మొత్తం 12 మంది సిబ్బంది గాయపడినట్లు తెలిసింది. వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు” అని తెలిపింది.

ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత ప్రభుత్వం  విచారణ వ్యక్తం చేసింది. ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరికలు జారీ చేసింది.  వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే ఆగిపోవాలి. అంతర్జాతీయ జలమార్గాల ద్వారా నౌకాయానం, వాణిజ్య కార్యకలాపాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలి” అని  పేర్కొంది.

గాయపడిన నౌక సిబ్బందిని ఒమన్ అధికారుల సహాయంతో నౌక నుంచి సురక్షితంగా తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారిని ఒమన్‌లోని ఖసబ్ ప్రాంతానికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. గాయపడిన వారికి వైద్య సహాయం అందించడంలో సహకరించిన ఒమన్ అధికారులకు భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.

అయితే, MT On Peaceపై జరిగిన ఈ దాడికి ఎవరు బాధ్యులన్నది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. 


ఇదీ చదవండి: రాష్ట్ర నేతనే బురిడీ కొట్టించిన కిలాడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement