విజయ్‌ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచన | Deepam Row: HC Tells Vijay Govt To Follow SC Order | Sakshi
Sakshi News home page

విజయ్‌ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచన

Nov 24 2026 7:39 PM | Updated on Nov 24 2026 7:45 PM

Deepam Row: HC Tells Vijay Govt To Follow SC Order

చెన్నై: తిరుపరంకుండ్రం కొండపై దీపథూన్‌ వద్ద దీపం వెలిగించే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నవంబర్ 24న దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేసింది.

అంతేకాదు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశామనే కారణంతో ఆదేశాల అమలును నిలిపివేయలేరని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌, ఆలయ అధికారులతో సహా సంబంధిత అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని సూచించింది.

అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించాలని బహిరంగంగా పిలుపునిచ్చే నేతలపై ఆంక్షలు విధించింది. దీపం వివాదంలో ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న 258 మందిని కూడా వెంటనే విడుదల చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

నవంబర్‌ 20న సుప్రీంకోర్టు దీపథూన్‌ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రజల ప్రవేశం, ఊరేగింపులు, సమావేశాలు, నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ విజయ్‌ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై బీజేపీ, అన్నాడీఎంకే టీవీకే ప్రభుత్వాన్ని విమర్శించాయి.

ఇదీ చదవండి: పాఠశాలలో విద్యార్థి కాల్పులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement