సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణమైన వాహనాలనే అనుమతిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యంపై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ నెలలో ఢిల్లీలో గాలి నాణ్యత కొంత మెరుగ్గా ఉండటానికి అనుకూల గాలులే ప్రధాన కారణమని ధర్మాసనం పేర్కొంది. అయితే కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు తీసుకున్న చర్యలతో పాటు ప్రకృతి సహకారం కూడా ఉందని వ్యాఖ్యానించింది.
కాలుష్యకారక వాణిజ్య వాహనాల ప్రవేశాన్ని వచ్చే ఐదేళ్లలో క్రమంగా నిలిపివేసే ప్రణాళికను పరిశీలించాలని సూచించింది. ఢిల్లీ సరిహద్దుల్లో గోదాములు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి నిత్యావసర వస్తువులను ఎలక్ట్రిక్ లేదా ఇతర కాలుష్య రహిత వాహనాల ద్వారా నగరంలోకి తరలించే విధానాన్ని ప్రతిపాదించింది.అయితే ఈ ఆంక్షలు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం ఎన్‌సీఆర్ ప్రాంతానికి వర్తించేలా చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: ఎర్రకోట పేలుడు కేసు నిందితుడికి సుప్రీం షాక్


