భర్త బొట్టు చెరిపించి.. ప్రియునితో తాళి కట్టించి.. | Newly Married Woman lover Temple Marriage | Sakshi
Sakshi News home page

భర్త బొట్టు చెరిపించి.. ప్రియునితో తాళి కట్టించి..

Nov 23 2026 1:10 PM | Updated on Nov 23 2026 1:10 PM

Newly Married Woman lover Temple Marriage

బెగుసరాయ్‌: బిహార్‌లో ఓ నవవధువు వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. రాత్రిపూట ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రియుడితో ఏకాంతంగా మాట్లాడదామని వెళ్లిన ఆమెను గ్రామస్థులు పట్టుకున్నారు. ఇంకేముంది.. విషయం ఊరంతా పాకిపోయింది. దీంతో రాత్రి జరిగిన వ్యవహారం కాస్తా తెల్లవారుజామున పెళ్లి పంచాయతీగా మారిపోయింది.

బెగుసరాయ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు ఉదయం ఐదు గంటలకే పంచాయతీ ఏర్పాటు చేశారు. చివరకు ఆ యువతికి ప్రియునితోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే పెళ్లి తంతు ప్రారంభించే ముందు ఓ ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. అప్పటికే వివాహిత అయిన ఆ యువతి నుదుటిపై భర్త పెట్టిన సింధూరాన్ని నీటితో శుభ్రంగా కడిగించి మరీ తొలగించారు.

ఆ తర్వాత అసలు కార్యక్రమం మొదలైంది. ప్రియుడు రోహిత్ కుమార్ ఆమె నుదుట సింధూరం పెట్టడంతో ఆలయంలో పెళ్లి తంతు పూర్తయింది. అంతేకాదు.. ఇద్దరూ తమ ఇష్టపూర్వకంగానే ఈ వివాహం చేసుకుంటున్నట్లు గ్రామస్థుల ముందు చెప్పించారు. ఈ తతంగాన్నంతా గ్రామస్థులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాత్రి ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన వ్యవహారం.. ఉదయానికి పెళ్లిగా మారడం ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇదీ కూడా చదవండి: దలైలామా వారసుడి ఎంపిక.. భారత్‌తో అమెరికా వ్యూహం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement