సత్యదేవుని సాక్షిగా ఒకటయ్యారు
కోనసీమ: విభిన్న సంస్కృతులు, భాషలు, ఆచార వ్యవహారాలకు వారధులుగా వారిద్దరూ సత్యదేవుని సాక్షిగా మనువాడారు. దేవస్థానంలో దక్షిణ కొరియాకు చెందిన జియోన్, విశాఖపట్టణానికి చెందిన ఎన్.కృష్ణ దీపక్ శనివారం రాత్రి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం ఆదివారం సత్యదేవుని వ్రతమాచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వ్రత పురోహితుడు మంధా కారుణ్య ఆంగ్లంలో వ్రత కథ వివరించి వారితో చేయించారు. అనంతరం వధువు జియోన్ మాట్లాడుతూ తనకు హిందూ సంస్కృతి, ఆచారాలు బాగా నచ్చాయని, సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి దర్శనం, స్వామివారి వ్రతం బాగా జరిగాయని తెలిపారు.


