ఆగని ‘పచ్చ’ అరాచకాలు | TDP Rowdies Attack On YSRCP Leaders | Sakshi
Sakshi News home page

ఆగని ‘పచ్చ’ అరాచకాలు

Nov 23 2026 10:10 AM | Updated on Nov 23 2026 10:10 AM

TDP Rowdies Attack On YSRCP Leaders

గొట్టిముక్కల సర్పంచ్‌ అభ్యర్థి సింగం అంజమ్మపై దాడి చేస్తున్న టీడీపీ మూకలు

సాక్షి, పల్నాడు: మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వేళ గురజాల, మాచర్ల నియోజకవర్గాలలో వైఎస్సార్‌ సీపీ బలపర్చిన అభ్యర్థులపై ఆదివారం టీడీపీ మూకలు అరాచకానికి తెగబడ్డాయి. దాచేపల్లి మండలం మాదినపాడు నామినేషన్‌ కేంద్రం వద్దకు కొత్తూరు నుంచి వైఎస్సార్‌ సీపీ బలపరిచన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు వచ్చారు. టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో దూసుకొచ్చారు. నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించివేశారు.

 కొత్తూరు సర్పంచ్‌ అభ్యర్థి బాణవత్‌ అనూరాధ, వార్డు అభ్యర్థులు అనమ్మ, పద్మ, లక్ష్మి ,మాజీ సర్పంచ్‌ బొడ్డు నరసింహారావులపై దాడి చేశారు. పొందుగల సర్పంచ్‌ అభ్యర్థి షేక్‌ ఇమామ్‌వలి, వార్డు అభ్యర్థులు రామాపురం నామినేషన్‌ కేంద్రం వద్దకు బయలుదేరగా సీఐ ఖాజావలి అడ్డుకున్నారు. నేతలు ఆందోళన చేశారు. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాలలో నామినేషన్‌ కేంద్రాల వద్ద కూడా టీడీపీ గూండాలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. రెంటచింతల సర్పంచ్‌ అభ్యర్థి గాలి ప్రతాప్‌రెడ్డి, 18 వార్డుల అభ్యర్థులు హెకోర్టు అనుమతితో గురజాల ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లారు. 

ఏడో వార్డు అభ్యర్థి పేర్ల లక్ష్మయ్య, 12వ వార్డు అభ్యర్థి వేంపాటి ప్రతాప్‌రెడ్డి, 17వ వార్డు అభ్యర్థి బత్తుల లింగయ్యలపై టీడీపీ గూండాలు దాడిచేసి నామినేషన్‌ పత్రాలు చించివేశారు. ఆదూరి సాగర్‌మర్రెడ్డి, వేంపాటి ప్రతాప్‌రెడ్డి, బంకూరి తిరుపతిరావు, పేర్ల ముత్తయ్యలకు గాయాలయ్యాయి. గురజాల మండలం గొట్టిముక్కలకు వైఎస్సార్‌ సీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి సింగం          అంజమ్మపైనా టీడీపీ మూకలు దాడి చేసి, నామినేషన్‌  పత్రాలు చించివేశాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement