తల్లిపై కత్తితో కొడుకు దాడి : తర్వాత భవనంపైనుంచి పడి..! | assam Teen Stabs Mother Then Falls To Death From Building | Sakshi
Sakshi News home page

తల్లిపై కత్తితో కొడుకు దాడి : తర్వాత భవనంపైనుంచి పడి..!

Nov 14 2026 1:02 PM | Updated on Nov 14 2026 1:02 PM

assam Teen Stabs Mother Then Falls To Death From Building

అస్సాం రాజధాని గువహటిలో  విషాద ఘటన  చోటు  చేసుకుంది.  9వ తరగతి విద్యార్థి తల్లిని పదునైన ఆయుధంతో  తీవ్రంగా గాయపర్చాడు. ఆ తర్వాత నగరంలోని ఏబీసీ (ABC) ప్రాంతంలో ఉన్న ఒక భవనంపై నుండి పడి ఆ బాలుడు మరణించడం  కలకలం రేపింది. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో అసలు ఏం జరిగిందో  అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

తూర్పు జ్యోతినగర్‌లోని హల్దీ మిల్ ప్రాంతంలో    మైనర్‌ విద్యార్థి తన తల్లి చంద్రాణి కలితపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దాడి జరిగిన వెంటనే చంద్రాణిని గువహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH) కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో  చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే  ఉన్నట్టు తెలుస్తోంది. తల్లినికత్తితో పొడిచిన తర్వాత ఆ బాలుడు తన ఇంటి నుండి బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలో రికార్డయ్యాయి. ఆ తర్వాత ఆ బాలుడు గువహటిలోని ఏబీసీ ప్రాంతంలో ఒక భవనంపై నుండి పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతను చికిత్స పొందుతూ మరణించాడు. బాలుడి మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. తల్లిపై  ఎందుకు దాడి చేశాడు? భవంనంపై అతనే పడిపోయాడా? లేక మరెవ్వరైనా తోసేసి ఉంటారా? అసలు ఏం జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇదీ చదవండి: ఎన్విడియా కొత్త సీఈఓ ఎవరు? రేసులో భారత సంతతి దిగ్గజాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement