ఎన్విడియా కొత్త సీఈఓ ఎవరు? రేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు | Nvidia Jensen Huang Succession race 3 Indian-Origin Faces Among 11 | Sakshi
Sakshi News home page

ఎన్విడియా కొత్త సీఈఓ ఎవరు? రేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు

Nov 13 2026 1:23 PM | Updated on Nov 13 2026 1:23 PM

Nvidia Jensen Huang Succession  race 3 Indian-Origin Faces Among 11

ప్రముఖ చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా (Nvidia) వ్యవస్థాపకుడు జెన్సెన్ హువాంగ్  (Jensen Huang) కంపెనీ  సీఈఓ, ప్రెసిడెంట్ పదవులతో పాటు బోర్డు బాధ్యతల నుంచి కూడా తక్షణమే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం టెక్‌ ప్రపంచంలో సంచలనం రేపింది. అనుమానిత చైనా గూఢచారితో సహా పలు వివాహేతర సంబంధాల ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా దీర్ఘకాలిక సీఈఓ జెన్సెన్ హువాంగ్ రాజీనామా చేశారు. దీంతో ఆ సంస్థ బోర్డు శాశ్వత వారసుడి కోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ రేసులో 11 మంది రేసులో ఉండగా, ఇందులో ముగ్గురు భారత సంతతికి చెందిన దిగ్గజాలు ఉండటం విశేషం.

ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకటైన ఎన్విడియాను నడిపించడానికి సాంకేతిక పరిజ్ఞానం, దూరదృష్టి, ఆర్థిక నైపుణ్యం మరియు భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లను తట్టుకునే అనుభవం ఉన్న నాయకుడి కోసం బోర్డు అన్వేషిస్తోంది. హువాంగ్  రాజీనామాతో ప్రస్తుతం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) కోలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  అయితే  కొత్త సీఈఓ కోసం ఓసీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ బక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొలెట్ క్రెస్ పేరు కూడా పరిశీలనలో ఉంది. మరోవైపు నవంబర్ 17న ఎన్విడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ నాయకత్వ మార్పు  కీలకంగా మారనుంది.

భారత సంతతికి చెందిన ముగ్గురు అభ్యర్థులు:
 సంజయ్ మెహ్రోత్రా (Micron CEO) : భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త, మెమరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా పేరు ప్రధానంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సంజయ్‌ నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన, గతంలో శాన్‌డిస్క్ (SanDisk) సహ వ్యవస్థాపకుడిగా పనిచేశారు. ఏఐ (AI) సర్వర్లకు అవసరమైన హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ చిప్‌ల తయారీ ద్వారా మైక్రాన్‌ను 1 ట్రిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. జూన్ 27, 1958న

నికేష్ అరోరా (Palo Alto Networks CEO):  ఈయన కూడా  యూపీ చెందిన వారే. 2018 నుండి సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓగా ఉన్నారు. గతంలో సాఫ్ట్‌బ్యాంక్ అధ్యక్షుడిగా, గూగుల్‌లో దశాబ్ద కాలం పాటు ఉన్నత పదవుల్లో పనిచేశారు. అయితే, ఆయనకు చిప్ తయారీ రంగంలో నేరుగా అనుభవం తక్కువ.

థామస్ కురియన్ (Google Cloud CEO): కేరళకు  చెందిన థామస్‌ గూగుల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ మరియు ఏఐ సేవలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్విడియాకు ప్రధాన కస్టమర్లుగా ఉన్న రంగాలపై ఆయనకు పూర్తి పట్టు ఉంది, కానీ చిప్ డిజైనింగ్ అనుభవం లేదు.

అంతర్గత   ఇతర చిప్ రంగ ప్రముఖులు:
కోలెట్ క్రెస్ (Nvidia Interim CEO & CFO): 2013 నుండి ఎన్విడియా సీఎఫ్‌ఓగా ఉన్నారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్, సిస్కో, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుత సంక్షోభం నుండి కంపెనీని గట్టెక్కించడానికి వాల్ స్ట్రీట్ వర్గాలతో ఆమెకున్న సంబంధాలు ఉపయోగపడతాయి.

ఇయాన్ బక్ (Nvidia VP): 2004లో ఎన్విడియాలో చేరారు. ఎన్విడియాను కేవలం వీడియో గేమ్ చిప్‌ల సంస్థ నుండి ఏఐ హార్డ్‌వేర్ దిగ్గజంగా మార్చిన 'CUDA' సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

రెనే హాస్ (Arm CEO): గతంలో ఎన్విడియాలో ఏడేళ్ల పాటు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2022 నుండి బ్రిటిష్ చిప్ డిజైన్ సంస్థ 'ఆర్మ్' (Arm) సీఈఓగా ఉన్నారు. చిప్ ఆర్కిటెక్చర్ రంగంలో ఆయనకు లోతైన అవగాహన ఉంది.

పాట్ గెల్సింగర్ (Former Intel CEO): ఇంటెల్ సంస్థలో 30 ఏళ్ల పాటు పనిచేసి, 2021లో సీఈఓగా బాధ్యతలు చేపట్టి 2024లో వైదొలిగారు. చిప్ డిజైనింగ్ మరియు తయారీ రెంటిపై పూర్తి పట్టు ఉన్న అరుదైన వ్యక్తులలో ఒకరు.

లిసా సు (AMD CEO): ఎన్విడియా ప్రధాన ప్రత్యర్థి ఏఎండీ (AMD) సీఈఓ. తైవాన్‌లో జన్మించిన ఈమెకు జెన్సెన్ హువాంగ్ దూరపు బంధువు కూడా. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ చైనా మార్కెట్లో ఏఎండీ వ్యాపారాన్ని కాపాడుకోవడంలో ఆమె విజయం సాధించారు.

మాట్ మర్ఫీ (Marvell Technology CEO): కస్టమ్ చిప్ తయారీ సంస్థ మార్వెల్ టెక్నాలజీ సీఈఓ. క్లౌడ్ దిగ్గజాల కోసం ఏఐ మౌలిక సదుపాయాల చిప్‌లను రూపొందిస్తూ కంపెనీని విజయపథంలో నడిపిస్తున్నారు.

జానీ స్రౌజీ (Apple Chief Hardware Officer): ఆపిల్ సంస్థలో 'ఆపిల్ సిలికాన్' (Apple Silicon) ఇన్-హౌస్ చిప్‌ల తయారీ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి. ఎన్విడియాకు చిప్‌లను తయారు చేసి ఇచ్చే TSMC సంస్థతో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
రేసులో టిమ్‌ కుక్‌ కూడా

టిమ్ కుక్ (Former Apple CEO): స్టీవ్ జాబ్స్ మరణానంతరం 15 ఏళ్ల పాటు ఆపిల్‌ను నడిపించి, కంపెనీ విలువను 350 బిలియన్ డాలర్ల నుండి 4.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చారు. సెప్టెంబర్ 2026లో ఆపిల్ సీఈఓ పదవి నుండి వైదొలిగిన టిమ్ కుక్ పేరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఎన్విడియా సీఈఓ పదవికి సిఫార్సు చేయడం గమనార్హం. 

ఇదీ చదవండి: రూ. కోటి సంపాదిస్తున్నా, మిడిల్‌ క్లాస్‌ బతుకే : ఎన్‌ఆర్‌ఐ స్టోరీ‌ వైరల్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement