ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా | Nvidia CEO Jensen Huang resigns after tech giant rocked by second affair allegation | Sakshi
Sakshi News home page

ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా

Nov 12 2026 7:36 PM | Updated on Nov 12 2026 7:43 PM

Nvidia CEO Jensen Huang resigns after tech giant rocked by second affair allegation

ప్రపంచ అగ్రగామి చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సహ-వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. వరుస వివాదాలు, వివాహేతర సంబంధాల ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బోర్డు సభ్యుడిగా కూడా హువాంగ్ వైదొలిగారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆయన రాజీనామాను తక్షణమే ఆమోదించారు.

హువాంగ్ స్థానంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈవోగా నియమించినట్లు బోర్డు ప్రకటించింది. ఫుల్‌టైమ్‌ సీఈవో ఎంపిక ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు బోర్డు తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement