Nvidia సీఈఓ పదవి పోయింది?.. వలపుల వలలో జెన్సన్ హువాంగ్‌ విలవిల! | Nvidia Is Preparing to Oust CEO Jensen Huang | Sakshi
Sakshi News home page

Nvidia సీఈఓ పదవి పోయింది?.. వలపుల వలలో జెన్సన్ హువాంగ్‌ విలవిల!

Nov 12 2026 5:16 AM | Updated on Nov 12 2026 5:28 AM

Nvidia Is Preparing to Oust CEO Jensen Huang

వాషింగ్టన్‌: టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎన్‌విడియా గూఢచార వివాదం రోజుకో కొత్తలుపు తిరుగుతోంది. చైనా నిఘా వర్గాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను ఆ పదవి నుంచి తొలగించేందుకు కంపెనీ బోర్డు తీవ్ర కసరత్తు చేస్తోంది.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, జెన్సన్ హువాంగ్ కేవలం చైనా ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌తో వివాహేతర సంబంధం మాత్రమే కాకుండా... కంపెనీలో తన ప్రత్యక్ష సహాయకురాలిగా పనిచేస్తున్న మరో ఎగ్జిక్యూటివ్‌తో కూడా సన్నిహితంగా ఉన్నారన్న అంశం ఇప్పుడు బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది.

కంపెనీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన 
ఎన్‌విడియా కార్పొరేట్ నిబంధనల  ప్రకారం.. కంపెనీ అంతర్గత భద్రతకు, ప్రయోజనాలకు భంగం కలిగించేలా అంతర్గత వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండటం నిషిద్ధం. అయితే, జెన్సన్ హువాంగ్ వ్యవహారం ఈ నిబంధనలను నేరుగా ఉల్లంఘించేలా ఉందని బోర్డు భావిస్తోంది.

ఇప్పటికే ఆలిస్ హువాంగ్‌తో తన సంబంధంపై జెన్సన్ హువాంగ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. దీంతో చైనా స్పై రాకెట్ వ్యవహారంలో అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన టెక్నాలజీ, ఏఐ చిప్ డేటా ఏమైనా లీకైందా అనే కోణంలో ఎన్‌విడియా బోర్డు ఒక స్వతంత్ర దర్యాప్తునకు   ఆదేశించింది.    

ప్రస్తుతానికి జెన్సన్ హువాంగ్ సీఈఓగానే కొనసాగుతున్నప్పటికీ, ఈ పరిణామాలు గమనిస్తే ఆయనను ఆ పదవి నుంచి తప్పించే దిశగా బోర్డు అడుగులు వేస్తున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తానికి, అమెరికా టెక్ దిగ్గజాన్ని పట్టిపీడిస్తున్న ఈ ఎపిసోడ్ సిలికాన్ వ్యాలీ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మక కార్పొరేట్ కుదుపుగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement