breaking news
Nvidia
-
'ప్రాధాన్యాలను' గుర్తించడమే గెలుపు
ఐదు ట్రిలియన్ డాలర్ల విలువైన తొలి, ఏకైక కంపెనీగా ‘ఎన్విడియా’ ఇటీవలే చరిత్ర సృష్టించింది. ఎన్విడియా సహ–వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన తైవానీస్–అమెరికన్ వ్యాపారవేత్త జెన్సెన్ హూవాంగ్ కాలిఫోర్నియాలోని ‘క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (కాల్టెక్) పట్టభద్రులను ఉద్దేశించి చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం: ఇది నిజంగా సంతోషకరమైన రోజు. మీరంతా ‘కాల్టెక్’ నుంచి పట్టభద్రులవుతున్నారు. ఈ విద్యాలయంలో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరిన వారిలో కొందరు నన్నూ, మా సంస్థనూ ఎంతో ప్రభావితం చేశారు. ‘ఎన్విడియా’లోని ఇద్దరు చీఫ్ సైంటిస్టులు ఇక్కడి నుంచి వచ్చినవారే. నిజానికి, సలహాలు ఇవ్వడమంటే నాకు ఇష్టం ఉండదు. నేను ఇష్టపడిన ఉదంతాలను, జీవితాను భవాలను కొన్ని చెబుతాను. సలహాలు వాటిలోనే అంతర్లీనంగా ఉంటాయి. ప్రపంచంలో ఒక టెక్ కంపెనీకి ఇంత సుదీర్ఘ కాలంగా సీఈఓగా ఉన్నది బహుశా నేనే అనుకుంటా. నేను ఈ 31 ఏళ్ళ వృత్తి జీవితంలో ఎంచుకున్న రంగం నుంచి బయటపడకుండా చూసు కున్నాను. విసుగు చెందలేదు. ఉద్వాసనకు గురయ్యే పరిస్థితులు తెచ్చుకోలేదు. మేధాపరమైన నిజాయతీ, ఒదిగి ఉండటం మా కంపెనీని కాపాడాయని చెప్పగలను. ఏఐ వెంట పరుగెత్తాలి!‘కుడా’ అనే ప్రోగ్రామింగ్ మోడల్ తయారు చేసేందుకు మాకు 20 ఏళ్ళకు పైగా పట్టింది. అది నేడు కంప్యూటింగ్ రంగాన్ని విప్లవా త్మకంగా మారుస్తోంది. టెక్నాలజీ పరంగా ఎన్నో పర్యవసానాలకు దారితీయగల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోకి దిగాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్లను ప్రోత్సహిస్తాను. ఏకకాలంలో, బహు ముఖాలుగా వికసనం పొందుతూ ముందుకు సాగుతున్న టెక్నాలజీ అదొక్కటే!ఏఐ వెంట నడవడం కాదు పరుగెత్తండని నేను ‘తైవాన్ యూనివర్సిటీ’ విద్యార్థులకు సూచించాను. ఏఐ విప్లవంతో మమేకం కండని చెప్పాను. ఆ తర్వాత, ఒక ఏడాది గడిచేటప్పటికే అది నమ్మలేనంతగా మారిపోయింది. ఈ అసాధారణ పరిణామాలను మీరు అంతర్ దృష్టితో అవగాహన చేసుకోవాలి. మీ ముందున్న ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్‌గా తీసు కుని ముందుకు సాగండి. ఆధునిక కంప్యూటింగ్ మూలాలు ఐబీఎం సిస్టమ్ 360లో ఉన్నాయి. నేను పుట్టిన ఏడాది తర్వాత, అది మార్కెట్లోకి వచ్చింది. చిప్‌ల రూపకల్పన నేర్చుకున్న 1980లలోని తొలి తరం వి.ఎల్. ఎస్.ఐ. ఇంజినీర్లలో నేనొకడిని. అప్పటి పాఠ్య పుస్తకాన్ని కాల్టెక్లో చదివినవారే తయారు చేశారు. ఆ పుస్తకం ఐసీ డిజైన్‌ను విప్లవీకరించింది. మా తరం సూపర్ జైంట్ చిప్‌లు డిజైన్ చేసేందుకు, అంతి మంగా సీపీయూ తయారీకి వీలు కల్పించింది. కంప్యూటింగ్‌లో బ్రహ్మాండమైన వృద్ధికి సీపీయూ బాటలు పర చింది. ప్రపంచం అంతకు ముందెన్నడూ చూడనంత సామూహిక ఉత్పత్తి మొదలైంది. అది పైకి కనిపించనిది. తేలిగ్గా కాపీ చేయదగి నది. అదే సాఫ్ట్వేర్. నేను మీలాగా విద్యార్థిగా ఉన్నప్పుడు అది చాలా స్వల్ప స్థాయిలో ఉంది. సాఫ్ట్‌వేర్‌ను విక్రయించి సొమ్ము చేసు కోవచ్చుననే భావన అప్పట్లో ఒక స్వైర కల్పన మాత్రమే. నేడు అది అత్యంత ముఖ్యమైన వస్తువు అయిపోయింది. ఎన్విడియా తీసుకొచ్చిన ‘కుడా’ ఫలితంగా కంప్యూటింగ్‌లో వచ్చిన వేగం మరింత ముందుకు సాగేందుకు తోవ చూపింది.అలెక్స్ నెట్‌కు శిక్షణ ఇచ్చేందుకు కొందరు ఎన్విడియాకు చెందిన ‘కుడా జీపీయూ’లను ఉపయోగించుకున్నారు. డీప్ లెర్నింగ్ ఆవిర్భవించింది. ఆ కీలక పరిణామం ఏఐ విప్లవానికి నాంది పలికింది. భారీ జీపీయూ క్లస్టర్లను నిర్మించకుండా డీప్ లెర్నింగ్‌కు ఉన్న పరిమితులను అన్వేషించేదెట్లా? వాటిని నిర్మించడానికి కోట్లాది డాలర్లు అవసరం. అంత ఖర్చు పెట్టినా ఫలితం ఉంటుందా? క్లస్టర్లను నిర్మించకపోతే, అది ఎప్పటికీ మనకు తెలియదు. వేలాది ఇంజినీర్లు డీప్ లెర్నింగ్ పైన, అడ్వాన్సింగ్, స్కేలింగ్ డీప్ లెర్నింగ్ పైన పదేళ్ళపాటు కృషి చేశారు. మా మొదటి ఏఐ సూపర్ కంప్యూ టర్ డీజీఎక్స్–1ను శాన్ఫ్రాన్సిస్కోలోని ఒక స్టార్టప్‌కు 2016లో అందించాం. ఏఐపై పనిచేస్తున్న నా స్నేహితుల బృందం ‘ఓపెన్ ఏఐ’ పేరుతో ఆ కంపెనీని నెలకొల్పింది. వాళ్లే ‘చాట్‌జీపీటీ’ తెచ్చారు.తోటమాలి నేర్పిన పాఠంఏఐలో తదుపరి అల రోబోటిక్స్ కాబోతోంది. రోబోలు, రోబో టిక్ వాహనాలు, హ్యూమనాయిడ్ రోబోలు, చివరకు రోబోలు కాప లాగా ఉండి నడిపించే భారీ గిడ్డంగులను నిర్మించే వందలాది కంపె నీలతో మేం కలసి పనిచేస్తున్నాం. కానీ, మా రోబోటిక్స్ పయనంలో చాలా ఎదురుదెబ్బలు తిన్నాం. డీప్ లెర్నింగ్ అంటే ఎవరికీ అర్థం కాని సమయంలో కలన గణితాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచపు మొదటి రోబోటిక్ కంప్యూటర్ను నిర్మించాం. మేం పరిస్థితులకు తగ్గట్లుగా ఒదిగిపోయే, మార్పు చెందే, చతికిల పడినా తిరిగి లేవ గలిగిన శక్తిని అభివృద్ధి చేసుకున్నాం. మా పిల్లలు చిన్న వయసులో ఉండగా, ఒక వేసవిని జపాన్‌లో గడిపాం. ఒక వారాంతంలో క్యోటో వెళ్ళి, సిల్వర్ టెంపుల్ చూశాం. అది ఆకర్షణీయమైన మోస్ గార్డెన్‌కు ప్రసిద్ధి. అక్కడ ఒక ఒంటరి తోటమాలిని గమనించాను. అక్కడ ప్రపంచంలో దాదాపు ప్రతి రకం నాచునూ పెంచుతారు. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాను. ‘నిర్జీవంగా మారిన నాచును తొలగిస్తున్నాను’ అని జవాబిచ్చాడు. ‘కానీ మీ గార్డెన్ చాలా పెద్దది కదా!’ అన్నాను. ‘నేను 25 ఏళ్ళుగా ఈ తోట ఆలనాపాలనా చూస్తున్నాను. నాకు కావలసినంత సమయం ఉంది’ అని జవాబిచ్చాడు. జీవితంలో నేను నేర్చుకున్న అత్యంత సునిశితమైన పాఠాలలో అదొకటి. ఈ తోటమాలి తనకు వచ్చిన కళకు అంకితమయ్యాడు. మనమూ అదే బాటలో నడిస్తే, మనకు కావాల్సినంత సమయం ఉంటుంది. నేను చేయవలసిన పనుల ప్రాధాన్య క్రమాన్ని రాసుకుని, ప్రతి రోజూ ఉదయం, ఆ జాబితాలోని మొదటి పనితో ప్రారంభిస్తా.ఏ పని తర్వాత ఏ పని చేయాలన్న విషయంలో చాలా స్పష్టతతో ఉంటాను. నేను పనిలో ఉండగా ఎవరన్నా వచ్చి ఏదో చెప్పి లేదా అడిగి అవాంతరం కల్పించినా ‘నాకు చాలా సమయం ఉంది. నా పని పూర్తి చేసుకోగలను’ అని చెబుతాను.సూపర్ పవర్స్మనం పడే వేదనలు, కష్టాలు మన వ్యక్తిత్వాన్ని పటిష్ఠ పరు స్తాయి. ఒకటి కాకపోతే మరొకటి ప్రయత్నించి చూద్దామనే లక్షణం అలవడుతుంది. నా సామర్థ్యాలలో నేను ఎక్కువ విలువ ఇచ్చు కునేది నా ఇంటెలిజెన్స్‌కు కాదు. కష్టనష్టాలను భరించగల నా సహనశీలతకు; ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత, ఆ పనిపై సుదీర్ఘమైన కాలం పనిచేయగల నా పట్టుదలకు; ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడగల శక్తికి; త్వరలోనే మరో అవకాశం రాబోతోందనే నా ఆశాభావానికి! వాటినే నేను నా ‘సూపర్ పవర్లు’గా పరిగణిస్తాను. మీకు కావాల్సింది కనుగొనగలరని భావిస్తున్నాను. మొదటి రోజునే ఒక నిర్ణయానికి వచ్చేయాలని అనుకోవద్దు. తక్కువ కాలంలోనే దాన్ని కనుగొనగలగడం కూడా ముఖ్యం కాదు. కానీ, మీ జీవిత కాలాన్ని అంకితం చేయడానికి ఒక పనిని మీరు కనుగొన గలరని ఆశిస్తున్నాను. మీ నైపుణ్యాలకు దానిలో పదును పెట్టుకోండి. అది మీ జీవితకాల కృషి కావాలి. చివరగా, చెప్పేది ఒక్కటే. జీవితంలో దేని తర్వాత ఏమిటో నిర్ణయించుకోవాలి. జీవితంలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. చేయవలసిన పనులు అనేకం ఉంటాయి. కానీ, ప్రాధాన్య క్రమాన్ని ఏర్పరచుకోండి. ముఖ్యమైన పనులు చేసేందుకు కావలసినంత సమయం చిక్కుతుంది. -
కాలిఫోర్నియాలో హెచ్‌సీఎల్ ఏఐ ఇన్నోవేషన్ ల్యాబ్
ప్రముఖ టెక్ కంపెనీ.. హెచ్‌సీఎల్ టెక్ (HCLTech).. ఎన్వీడియా సహకారంతో కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో ఒక ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రారంభించింది. ఇది ఫిజికల్ ఏఐ, కాగ్నిటివ్ రోబోటిక్స్‌కు సంబంధించిన అనువర్తనాలను అన్వేషించడానికి సహాయపడుతుంది.హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ ఏఐ ల్యాబ్ నెట్‌వర్క్‌తో అనుసంధానించబడిన ఈ ప్రత్యేక సౌకర్యం.. అనేక ఎన్వీడియా ప్లాట్‌ఫామ్‌లను మిళితం చేస్తుంది. ఇందులో ఎన్వీడియా హోలోస్కాన్, ఎన్వీడియా మెట్రోపాలిష్, ఎన్వీడియా జెట్సన్ వంటివాటితో పాటు.. విజన్ ఎక్స్, కైనెటిక్ ఏఐ, స్మాక్ ట్విన్ కూడా ఉన్నాయి. వాస్తవ ప్రపంచంలో ఉత్పాదకత, స్థితిస్థాపకత, స్థిరత్వాన్ని పెంచడానికి సంస్థలకు సహాయపడటానికి ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయపడుతుంది.జనరేటివ్ ఫిజికల్ ఏఐ పారిశ్రామిక ఆటోమేషన్‌ను విప్లవాత్మకంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. కానీ డిజిటల్ సిమ్యులేషన్ నుంచి వాస్తవ-ప్రపంచ విస్తరణకు అంతరాన్ని తగ్గించడం ఒక క్లిష్టమైన సవాలుగా మిగిలిపోయింది. అయితే కొత్త ఇన్నోవేషన్ ల్యాబ్.. కార్యాచరణ వాస్తవికతగా మార్చడానికి అవసరమైన సంక్లిష్ట స్వయంప్రతిపత్తి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని ఎన్వీడియా రోబోటిక్స్ అండ్ ఎడ్జ్ ఏఐ వీపీ దీపు తల్లా అన్నారు -
ఎన్విడియా విశ్వరూపం.. దేశాల జీడీపీలనే మించి..
యుఎస్ చిప్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) కొత్త మైలురాయిని తాకింది. 5 ట్రిలియన్ డాలర్ల (రూ.442 లక్షల కోట్లు) మార్కెట్ విలువను చేరుకున్న ప్రపంచంలోని మొదటి సంస్థగా నిలిచింది. సాధారణ గ్రాఫిక్స్-చిప్ డిజైనర్ నుండి ప్రారంభమైన ఎన్విడియా అనతి కాలంలోనే ఏఐ టైటాన్‌గా ఎదిగింది. పెరుగుతున్న ఏఐ బూమ్ దాని చిప్స్ కోసం డిమాండ్‌ను పెంచుతోంది. ఎన్విడియా స్టాక్స్‌ను రికార్డు గరిష్టాలకు నడిపిస్తోంది.ఎన్విడియా కంపెనీ 2023 జూన్‌లో మొదటిసారిగా 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకుంది. తర్వాత వేగంగా పెరుగుతూ మూడు నెలల క్రితం 4 ట్రిలియన్ డాలర్ల వాల్యుయేషన్ మార్కును తాకింది. ఈ చిప్ మేకర్ షేర్ ధర బుధవారం (అక్టోబర్ 29) ఉదయం 5.6% పెరిగి 212 డాలర్లకు చేరుకుంది. చైనాలో ఎన్విడియా అమ్మకాల గురించి మదుపరుల్లో ఆశావాదం ఈ పెరుగుదలకు కారణమైంది.ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచిన ఎన్విడియా.. ఏఐ వ్యయ కేళిలో అతిపెద్ద విజేతగా అవతరించింది. సాంకేతిక రంగంలో ప్రత్యర్థులను అధిగమించింది. అనేక ఏఐ కంపెనీలకు ఎన్విడియా చిప్లే మూలం కావడంతో ఓపెన్ ఏఐ, ఒరాకిల్‌తో సహా ప్రముఖ ఏఐ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.దేశాల జీడీపీలను మించిన మార్కెట్ విలువప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం.. ఎన్విడియా మార్కెట్ విలువ ఇప్పుడు యూఎస్, చైనా మినహా ప్రతి దేశం జీడీపీనీ మించిపోయింది. అలాగే యూఎస్ స్టాక్ మార్కెట్లోని ఎస్అండ్పీ 500 సూచీలో మొత్తం రంగాల విలువ కంటే ఎక్కువ.మైక్రోసాఫ్ట్, యాపిల్ కూడా ఇటీవల 4ట్రిలియన్ డాలర్ల విలువ మార్కును దాటాయి. ఏఐ ఖర్చు గురించి వాల్ స్ట్రీట్ లో పెరుగుతున్న ఆశావాదంతో విస్తృత టెక్ ర్యాలీని బలోపేతం చేశాయి. ఈ సంవత్సరం అమెరికన్ స్టాక్ మార్కెట్లో అద్భుతమైన లాభాలు గడించిన సంస్థల్లో ఏఐ-సంబంధిత సంస్థలే 80% వాటాను కలిగి ఉన్నాయి.ఇదీ చదవండి: అదానీ గ్రూప్ షేర్లదే అదృష్టం! -
చైనా సంచలనం.. అమెరికా చిప్ లేకుండా ‘బ్రెయిన్’ ఏఐ నమూనా
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా మరో కీలక అడుగు వేసింది. స్పైకింగ్‌బ్రెయిన్ 1.0 (SpikingBrain 1.0) అనే “మెదడు ప్రేరిత” లాంగ్వేజ్ మోడల్‌ను విడుదల చేసింది. ఇది ఎన్విడియా చిప్‌లు లేకుండానే సంప్రదాయ ఏఐ మోడళ్ల కంటే 100 రెట్లు వేగంగా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.ఈ మోడల్‌ను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ అభివృద్ధి చేసింది. ఇది న్యూరోమార్ఫిక్ డిజైన్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే మన మెదడు లాగా, అవసరమైన న్యూరాన్లు మాత్రమే స్పందిస్తాయి. ఈ “స్పైకింగ్ కంప్యూటేషన్” పద్ధతి వల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. అలాగే ట్రైనింగ్ డేటా అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది.స్పైకింగ్‌బ్రెయిన్.. చాట్‌జీపీటీ (ChatGPT) లాంటి మోడళ్లకు అవసరమైన ట్రైనింగ్ డేటాలో కేవలం 2 శాతం మాత్రమే ఉపయోగించి, వాటితో సమానమైన పనితీరును అందిస్తుందని ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధకుడు లి గువోకి తెలిపారు. ఈ మోడల్ చైనాలోనే అభివృద్ధి చేసిన మెటాఎక్స్ చిప్‌లపై పనిచేస్తుంది. అమెరికా జీపీయూ ఎగుమతి నియంత్రణలకు లోనవకుండా, స్వతంత్ర ఏఐ మౌలిక సదుపాయాల వైపు చైనా అడుగులు వేస్తోంది.స్పైకింగ్‌బ్రెయిన్.. దాని డెమో సైట్ లో తనను తాను ఇలా పరిచయం చేసుకుంటుంది. "హలో! నేను స్పైకింగ్ బ్రెయిన్ 1.0, లేదా 'షుంక్సీ', మెదడు-ప్రేరేపిత ఏఐ మోడల్ని. మానవ మెదడు సమాచారాన్ని స్పైకింగ్ కంప్యూటేషన్ పద్ధతితో ప్రాసెస్ చేసే విధానాన్ని నేను మిళితం చేస్తాను. పూర్తిగా చైనీస్ టెక్నాలజీపై నిర్మించిన శక్తివంతమైన, నమ్మదగిన, శక్తి-సమర్థవంతమైన ఏఐ సేవలను అందించగలను" అంటోంది. -
అమాంతం ఎగిసిన షేర్లు.. ‘ప్లాన్’గా అమ్మేసిన సీఈవో
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ జాక్‌పాట్ కొట్టారు. అమాంతం ఎగిసిన షేర్లను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ వారం ఆయన 2,01,404 కంపెనీ షేర్లను విక్రయించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) వద్ద ఫారం 4 ఫైలింగ్ ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో తాను అనుసరించిన ముందస్తు ‘10 బి 5-1’ ట్రేడింగ్ ప్లాన్ కింద ఆగస్టు 11, 12, 13 తేదీలలో లావాదేవీలు జరిగాయి.ఈ షేర్లను 180.026 డాలర్ల నుంచి 183.6417 డాలర్ల వరకు విక్రయించి మొత్తం 40,959,534 డాలర్ల (సుమారు రూ.334 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించారు. ఇన్వెస్టింగ్.కామ్ (Investing.com) నివేదిక ప్రకారం.. ఎన్విడియా స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి 184.48 డాలర్లకు దగ్గరగా ట్రేడ్ కావడంతో ఈ లావాదేవీలు జరిగాయి. ఎన్విడియా గత 12 నెలల్లో 86% ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఈ లావాదేవీల తర్వాత హువాంగ్ కు కంపెనీలో ఇంకా 72,998,225 షేర్లు ఉన్నాయి.ఏమిటీ 10బి5-1 ట్రేడింగ్ ప్లాన్?రూల్ 10బి5-1 అనేది యూఎస్ ఎస్ఈసీ నుండి వచ్చిన నిబంధన. ఇది పబ్లిక్ లిస్టెడ్ సంస్థలలోని ఇన్సైడర్లు తమ వాటాలను ముందుగానే విక్రయించే ప్రణాళికను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది. ఈ నియమం ప్రకారం, ప్రధాన వాటాదారులు నిర్ణీత సమయంలో నిర్ణీత సంఖ్యలో షేర్ల అమ్మకాన్ని షెడ్యూల్ చేయవచ్చు. తద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు ఆస్కారం ఉండదు. చాలా మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు ఈ కారణంగా 10b5-1 ప్లాన్ లను ఉపయోగిస్తారు. -
సీఈఓ కనుసన్నల్లోనే వేతన పెంపు
కార్పొరేట్ నిర్ణయాలు తీసుకునేందుకు చాలా సంస్థలు అల్గారిథమ్స్, సంబంధిత విభాగాలను వాడుకుంటాయి. అందుకు భిన్నంగా ప్రపంచ టాప్ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ వైఖరి వేరుగా ఉంది. అతను ఎన్విడియాలోని దాదాపు 42,000 మంది ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి వేతనాలను వ్యక్తిగతంగా సమీక్షిస్తారు. ‘మీ సిబ్బందిని జాగ్రత్తగా చూసుకుంటే.. మిగిలినవన్నీ వాటంతటవే వస్తాయి’ అనే ఫిలాసఫీని నమ్ముతానని హువాంగ్ తెలిపారు.వేతన పెంపు నిర్ణయంలో వ్యక్తిగత ప్రమేయం వ్యూహాత్మకమైనదని హువాంగ్ నమ్ముతున్నారు. ఉద్యోగులకు ఇచ్చే పరిహారాన్ని కేవలం హెచ్ఆర్కు వదిలేయడం సరికాదని, ప్రతి నెలా తానూ వేతన డేటాను సమీక్షిస్తానని చెప్పారు. అయితే మొత్తం సమాచారాన్ని క్రమబద్ధీకరించడానికి, దాన్ని విశ్లేషించడానికి సహాయపడే మెషిన్ లెర్నింగ్ టూల్స్‌ను వాడుతానని తెలిపారు. కానీ తుది నిర్ణయం మాత్రం తనదేనని స్పష్టం చేశారు.ఎన్విడియా టాప్ టాలెంట్‌ను నిలుపుకోవడమే కాకుండా, నాయకత్వ బృందాన్ని విజయవంతంగా అభివృద్ధి చేస్తోందన్నారు. కంపెనీ తన సిబ్బందినిసైతం బిలియనీర్లుగా తీర్చిదిద్దిందని తెలిపారు. వేతన నిర్ణయాల్లో వ్యక్తిగత ప్రమేయం పారదర్శకత, కంపెనీ విధేయతతో కూడిన సంస్కృతిని పెంపొందిస్తోందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: కోడింగ్ ఉద్యోగాల కథ కంచికేనా?ఎన్విడియా నిర్వహణ ఖర్చులు రెట్టింపు అయినప్పటికీ హువాంగ్ దీన్ని అవసరమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు. దీని ఫలితంగానే కంపెనీ విలువ 2023లో 1 ట్రిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 4 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని గుర్తు చేశారు. ఇది ఎన్విడియాను ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ సంస్థగా మార్చిందని చెప్పారు. ఎన్విడియా ఉద్యోగుల్లో 76% మంది మిలియనీర్లని గర్వంగా తెలిపారు. -
గూగుల్ క్రోమ్‌కు సవాల్.. ఎన్విడియా ఏఐ వచ్చేస్తోంది!
ప్రపంచవ్యాప్తంగా వెబ్ బ్రౌజర్ల మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ క్రోమ్‌కు సవాల్ విసిరేందుకు టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఎన్విడియాకు చెందిన పర్పెక్స్సిటీ ఏఐ సిద్ధమవుతోంది. త్వరలోనే కామెట్ పేరుతో ఏఐ ఆధారిత సామర్థ్యంగల వెబ్ బ్రౌజర్‌ను తీసుకురానుంది. – సాక్షి, సెంట్రల్డెస్క్మార్కెట్.యూఎస్ అనే సంస్థ నివేదిక ప్రకారం 2024లో 4.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్ల మార్కెట్.. 2034 నాటికి 76.8 బిలియన్ డాలర్లకు చేరుకొనే అవకాశం ఉంది. స్టాట్‌కౌంటర్ అనే సంస్థ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి ప్రపంచ వెబ్ బ్రౌజర్ల మార్కెట్లో క్రోమ్ 68 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికం మంది యూజర్లు ఉపయోగిస్తున్న వెబ్ బ్రౌజర్‌గా మార్కెట్‌ను సుస్థిరం చేసుకొని ఇతర ప్రముఖ వెబ్ బ్రౌజర్లయిన సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్ఫాక్స్కు అందనంత ఎత్తులో ఉంది.యూజర్లకు లభించేవి ఇవీ..సాధారణ బ్రౌజర్లతో పోలిస్తే ఏఐ ఆధారిత బ్రౌజర్లు యూజర్లు కోరిన కంటెంట్‌ను సంక్షిప్తంగా అందించగలవు. అలాగే టాస్క్‌లను ఆటోమేట్ చేయగలవు. ఉదాహరణకు ఈ–మెయిళ్లకు ఆటోమెటిక్‌గా రిప్లైలు పంపడం, సోషల్ మీడియా పోస్ట్‌లను షెడ్యూల్ చేయడం, దరఖాస్తుల్లోని డేటాను సంగ్రహించడం లాంటివి అన్నమాట.ముఖ్యంగా సందర్భానుసారంగా జవాబులు అందించగలవు. అంటే యూజర్లు అందించే ఇన్పుట్లు, డేటా హిస్టరీని పరిగణనలోకి తీసుకొని, వాటిని విశ్లేషించి జవాబులను అందించడం, వివిధ డేటా సోర్స్‌ల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి నేరుగా సమాధానాలు ఇవ్వ డం చేయగలవు. అపాయింట్మెంట్ల బుకింగ్‌లు, ఉత్పత్తులను పోల్చడం వంటి సంక్లిష్ట పనులను కూడా చక్కబెట్టగలవు. -
ఐటీ రంగంలో అసాధారణ విజయాన్ని సాధించిన ఎన్వీడియా కంపెనీ
-
ఎన్విడియా.. ఎన్ని వందల లక్షల కోట్లయ్యా!!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంటూ ఎన్విడియా కార్పొరేషన్ చరిత్ర సృష్టించింది. 4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ .342 లక్షల కోట్లు) మార్కెట్ విలువను చేరుకున్న మొదటి పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా నిలిచింది. అత్యాధునిక ఏఐ ప్రాసెసర్లకు డిమాండ్ పెరగడంతో షేరు ధర 164 డాలర్లను దాటడంతో బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఈ మైలురాయిని సాధించింది.ఈ వాల్యుయేషన్ తో మైక్రోసాఫ్ట్ (3.75 ట్రిలియన్ డాలర్లు), యాపిల్ (3.19 ట్రిలియన్ డాలర్లు)లను అధిగమించి ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2023 జూన్‌లో తొలిసారి ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటిన ఈ చిప్ తయారీ కంపెనీ తర్వాత ఒక్క ఏడాదిలోనే తన మార్కెట్ వ్యాల్యూను ఏకంగా మూడు రెట్లు పెంచుకుంది. అలా 3 ట్రిలియన్ డాలర్ల కంపెనీల సరసన నిలిచిన ఎన్విడియా వేగంగా 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌నూ దాటేసి టాప్ కంపెనీగా నిలిచింది.తోడైన కృత్రిమ మేధ విప్లవంగ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ)ల్లో ఎన్విడియా ఆధిపత్యం ఏఐ మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా నిలిచింది. జనరేటివ్ ఏఐ మోడల్స్ నుంచి అటానమస్ వెహికల్స్, డీప్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్స్ వరకు అన్నింటికీ ఈ కంపెనీ తయారు చేసిన చిప్స్‌ను వినియోగిస్తున్నారు. 2025 మొదటి త్రైమాసికంలో ఎన్విడియా 70% ఆదాయ పెరుగుదలను నమోదు చేసింది. 44 బిలియన్ డాలర్లను దాటింది. ఇది విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ విపరీతంగా ఉందని, మనం కొత్త పారిశ్రామిక యుగ ఆవిర్భావాన్ని చూస్తున్నామని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చెబుతున్నారు.ప్రపంచ మార్కెట్లపై ప్రభావంఎన్విడియా ఇప్పుడు ఎస్ అండ్ పీ 500 లో 7.3% వాటాను కలిగి ఉంది. ఇది వారసత్వ టెక్ దిగ్గజాలను అధిగమించింది. దీని పెరుగుదల పెట్టుబడి పోర్ట్ఫక్షలియోలు, టెక్ రంగ డైనమిక్స్‌ను పునర్నిర్వచించింది.ఓ వైపు ఎగుమతి ఆంక్షలు, పెరుగుతున్న పోటీ ఉన్నప్పటికీ, ఎన్విడియా వృద్ధి "స్థితిస్థాపకంగా, అంతర్జాతీయంగా" ఉందని విశ్లేషకులు అంటున్నారు.ఇండియన్ బడ్డెట్‌కు 10 రెట్లుఎన్విడియా మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ .342.66 లక్షల కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి భారతీయ సంస్థల మార్కెట్ విలువను కలిపినా దీని కంటే తక్కువే. ఇది కేంద్ర బడ్జెట్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. -
ఎన్విడియాతో ఐటీ దిగ్గజాల జత
గ్లోబల్ చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియాతో దేశీ ఐటీ దిగ్గజాలు విప్రో, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ చేతులు కలిపాయి. వివిధ పరిశ్రమలకు ఏఐ ఆధారిత విభిన్న సొల్యూషన్లు అందించే బాటలో ఎన్విడియాతో విడిగా భాగస్వామ్యాలకు తెరతీస్తున్నాయి. చిప్ తయారీ దిగ్గజం ప్రస్తుతం కాలిఫోర్నియాలో నిర్వహిస్తున్న జీపీయూ టెక్నాలజీ వార్షిక సదస్సు(జీటీసీ)లో భాగంగా దేశీ ఐటీ కంపెనీలు ఎన్విడియా టెక్నాలజీల ఆధారంగా అందిస్తున్న సేవలను ప్రదర్శిస్తున్నాయి.ఈ సందర్భంగా ఎన్విడియా ఏఐ సాఫ్ట్వేర్ ఆధారిత అటానమస్ ఫార్మాకోవిజిలెన్స్(పీవీ) సొల్యూషన్లు టెక్ మహీంద్రా విడుదల చేసింది. వీటిని ఔషధ భద్రత నిర్వహణలో వినియోగిస్తారు. తద్వారా వేగవంత, కచ్చితమైన పీవీ ప్రాసెస్‌కు వీలుంటుంది. ఎన్విడియా ఏఐ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సహాయంతో విప్రో కొత్తతరహా ఏజెంటిక్ ఏఐ సర్వీసులను ప్రవేశపెట్టింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ ప్రత్యేక ఇన్ఫ్రా, డేటా, వర్క్‌ఫోర్స్, బిజినెస్ నెట్‌వర్క్స్‌ను పటిష్టపరచుకోవడంతోపాటు ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి, అమలు చేసేందుకు వీలుంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ తదితర రంగాలలో పౌర సేవలను భారీగా మెరుగుపరచేందుకు విప్రో ఎకోసిస్టమ్ వినియోగపడనుంది.ఇదీ చదవండి: ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథంఎన్విడియా జెట్సన్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవడం ద్వారా ఏఐ ఆధారిత రైల్వే ట్రాక్ తనిఖీ సొల్యూషన్ ట్రాక్ఈఐను ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ విడుదల చేసింది. తద్వారా రియల్ టైమ్ లోపాల గుర్తింపు, నిర్వహణలో మద్దతు తదితర ప్రపంచవ్యాప్త రైల్వే నెట్‌వర్క్‌ల భద్రతను పెంచేందుకు సహాయపడనుంది. ఎన్విడియా జీటీసీ 2025ను ఈ నెల 17–21 మధ్య కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో నిర్వహిస్తోంది. ఏఐలో తాజా ఆధునికతలను ప్రదర్శించేందుకు సదస్సు ఉపపయోగపడుతోంది. -
Sai Divesh Chowdary : అమెరికాలో హైదరాబాద్ కుర్రాడికి రూ. 3 కోట్ల ప్యాకేజీ
హైదరాబాదీ కుర్రోడు బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో భారీ వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా 3 కోట్ల రూపాయలం ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. హైదరాబాద్(Hyderabad)లోని ఎల్బీనగర్ చిత్రా లేఅవుట్‌కు చెందిన గుడె సాయి దివేశ్ చౌదరి (Gude Sai Divesh Chowdary) కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. చిప్‌మేకర్ ఎన్విడియాలో ఉద్యోగం సాధించిన సాయిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పట్టుదలకు, మారుపేరుగా నిలిచి, ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువు చదివిన సాయి దివేశ్ తనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. దివేశ్ తండ్రి కృష్ణ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తల్లి రమాదేవి పబ్లిక్ స్కూల్లో టీచర్‌గా పదేళ్ల పాటు పనిచేశారు. చిన్నప్పటినుంచీ చదువులో అద్భుత ప్రతిభ కనబరిచేవాడు సాయి దివేశ్. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు హైదరాబాద్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు.ఇంటర్లో అత్యుత్తమ స్కోర్ సాధించి, ఎన్ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే న్యూటానిక్స్ కంపెనీలో రూ.40లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అయితే ఉన్నత చదువు చదవాలనే లక్ష్యంతో లాస్ఏంజెల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఎన్విడియా కంపెనీలో డెవలప్మెంట్ ఇంజీనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేవలం చదువు మాత్రమే కాదు క్రీడలు, పలు పోటీ పరీక్షల్లో ఎపుడూ ముందుండేడట. అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం పొందిన దివేశ్, ప్రస్తుతం ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. విశేషమైన ప్రతిభతో, ప్రపంచ టెక్నాలజీ రంగంలో దివేశ్ సత్తా చాటుకోవాలంటూ నెటిజన్లు శుభాకాంక్షలందించారు.కాగా 2025లో టాప్ ఏఐ చిప్ తయారీ కంపెనీల్లో టాప్‌లో ఉందీ కంపెనీ 530.7 బిలియన్ల డాలర్ల మార్కెట్ క్యాప్తోప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించింది ఎన్విడియా. ఇది A100 ,H100 వంటి శక్తివంతమైన GPUలకు ప్రసిద్ధి చెందింది. ఏఐ సృష్టిస్తున్న విప్తవాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించింది. వివిధ అప్లికేషన్లలో AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడం , అమలు చేయడం కోసం వీటిని వినియోగిస్తారు. -
రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించనున్నట్లు రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ప్రకటించారు. భారతదేశంలో కృత్రిమ మేధ (AI), డిజిటల్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతుండడంతో రిలయన్స్ ఈ ప్రకటన చేయడం టెక్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా ఆధారిత టెక్ కంపెనీ ఎన్విడియా సహకారంతో అత్యాధునిక బ్లాక్వెల్ ఏఐ ప్రాసెసర్లతో నడిచే ఈ డేటా సెంటర్ మూడు గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.భారతదేశంలో కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అక్టోబర్ 2024లో రిలయన్స్, ఎన్విడియా మధ్య భాగస్వామ్యం కుదిరినట్లు ఇరు సంస్థలు గతంలోనే ప్రకటించాయి. గతంలో జరిగిన ఎన్విడియా ఏఐ సమ్మిట్(AI Summit) 2024 సందర్భంగా సంస్థ సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఏఐ విభాగంలో ఇండియా సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. ‘భారతదేశం తన సొంత కృత్రిమ మేధను తయారు చేయడం పూర్తి అర్థవంతమైన చర్యగా భావిస్తున్నాం. స్థానికంగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల డేటా భద్రత సవాళ్లు ఏర్పడవు’ అని హువాంగ్ అన్నారు. ఇండియాలో మెరుగైన డిజిటల్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి కలిగిన ఏఐ ఆవశ్యకతను ఎత్తిచూపుతూ ముఖేష్ అంబానీ ఈ చర్యలు చేపట్టడంతో టెక్ నిపుణుల దృష్టిని ఆకర్షించారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు ఏఐ చేదోడుజామ్నగర్లో లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్‌తో(ఎల్ఎల్ఎం) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్‌లకు సహకారం, ఏఐ ప్రాజెక్టులు, ఎల్ఎల్ఎం అభివృద్ధికి రూ.10,000 కోట్లకు పైగా కేటాయించాలని రిలయన్స్ నిర్ణయించింది. డేటా సెంటర్ల అభివృద్ధికి ప్రభుత్వ మద్దతు కూడా లభిస్తుందని కంపెనీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వేలాది హై-స్కిల్డ్ ఉద్యోగాలను సృష్టిస్తుందని, ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఇండియాను ముందువరుసలో ఉంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. సుస్థిర ఇంధన వనరులకు పెద్దపీట వేసే రిలయన్స్ సోలార్, పవన, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులతో సహా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఈ డేటా సెంటర్‌కు అవసరమైన ఎనర్జీని సరఫరా చేస్తారని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
గర్ల్‌ఫ్రెండ్‌కు మాటిచ్చి! ‘సీఈవో’గానే మనువాడి..
ఎన్వీడియా సీఈఓ 'జెన్సన్ హువాంగ్' గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ఈయన ఇటీవల హాంగ్ కాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లో తన భార్య 'లోరీ హువాంగ్'ను ఎలా ఆకట్టుకున్నారనే విషయాలను వెల్లడించారు.జెన్సన్ హువాంగ్ ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో మొదటిసారి లోరీని కలుసుకున్నప్పుడు ఆమెను ఆకట్టుకోవడానికి.. ఆమె వద్దకు వెళ్లి, మీరు నా హోంవర్క్ చూడాలనుకుంటున్నారా?.. అని అడిగినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రతి ఆదివారం నాతో కలిసి హోంవర్క్ చేస్తే.. తప్పకుండా మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు, అని వాగ్దానం చేశారు. నిజానికి అప్పుడు హువాంగ్ వయస్సు కేవలం 17, లోరీ వయస్సు 19 సంవత్సరాలు.జెన్సన్ హువాంగ్ మాటలు విన్న లోరీ.. అతన్ని తెలివైనవాడిగా భావించిందని, ఆ తరువాత ఇద్దరూ కలిసి హోంవర్క్ చేసుకునే వాళ్లమని పేర్కొన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు.. నేను 30 ఏళ్ల వయసుకే సీఈఓ అవుతానని జెన్సన్ చెప్పినట్లు వెల్లడించారు. చెప్పినట్లుగానే సీఈఓ అయ్యాను, దీంతో లోరీకి నమ్మకం కుదిరింది.సీఈఓ అయిన తరువాత ఐదేళ్లకు లోరిని పెళ్లి చేసుకున్నట్లు జెన్సన్ తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కూతురు మాడిసన్ (ఎన్విడియాలో మార్కెటింగ్ డైరెక్టర్), కుమారుడు స్పెన్సర్ (ఎన్విడియాలో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్). ప్రస్తుతం జెన్సన్ హువాంగ్ నికర విలువ రూ. 9 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. -
ఎన్విడియాతో రిలయన్స్ జట్టు
ముంబై: అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా, దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా చేతులు కలిపాయి. భారత్‌లో కృత్రిమ మేధ (ఏఐ) కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయనున్నాయి. రిలయన్స్‌కి చెందిన కొత్త డేటా సెంటర్లో ఎన్విడియాకి చెందిన బ్లాక్వెల్ ఏఐ చిప్‌లను వినియోగించనున్నారు. ఎన్విడియా ఏఐ సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో జెన్సెన్ హువాంగ్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. భాగస్వామ్యం కింద రూపొందించే అప్లికేషన్లను రిలయన్స్ .. భారత్‌లోని వినియోగదార్లకు కూడా అందించే అవకాశం ఉందని హువాంగ్ తెలిపారు. అయితే, ఈ భాగస్వామ్యానికి సంబంధించి పెట్టుబడులు, నెలకొల్పబోయే మౌలిక సదుపాయాల సామర్థ్యాలు మొదలైన వివరాలను వెల్లడించలేదు. ‘చిప్‌ల డిజైనింగ్‌లో భారత్‌కి ఇప్పటికే ప్రపంచ స్థాయి నైపుణ్యాలు ఉన్నాయి. ఎన్విడియా చిప్‌లను హైదరాబాద్, బెంగళూరు, పుణెలో డిజైన్ చేస్తున్నారు. ఎన్విడియాలో మూడో వంతు ఉద్యోగులు ఇక్కడే ఉన్నారు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ సేవలతో ప్రపంచానికి ఐటీ బ్యాక్ ఆఫీస్‌గా పేరొందిన భారత్ ఇకపై అవే నైపుణ్యాలను ఉపయోగించి ఏఐ ఎగుమతి దేశంగా ఎదగవచ్చని చెప్పారు. 2024లో భారత కంప్యూటింగ్ సామర్థ్యాలు 20 రెట్లు వృద్ధి చెందుతాయని, త్వరలోనే ప్రభావవంతమైన ఏఐ సొల్యూషన్స్‌ను ఎగుమతి చేస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో రెండో స్థానంలో ఉన్న ఎన్విడియాకు .. భారత్‌లో హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. భారీ ఇంటెలిజెన్స్ మార్కెట్‌గా భారత్: అంబానీ భారత్ ప్రస్తుతం కొత్త తరం ఇంటెలిజెన్స్ సాంకేతికత ముంగిట్లో ఉందని, రాబోయే రోజుల్లో వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు. ‘అతిపెద్ద ఇంటెలిజెన్స్ మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతుంది. మనకు ఆ సత్తా ఉంది. ప్రపంచానికి కేవలం సీఈవోలనే కాదు ఏఐ సరీ్వసులను కూడా ఎగుమతి చేసే దేశంగా భారత్ ఎదుగుతుంది‘ అని అంబానీ వ్యాఖ్యానించారు. దేశీయంగా పటిష్టమైన ఏఐ ఇన్ఫ్రా ఉంటే స్థానికంగా సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ మార్కెట్లో భారత్ కీలక దేశంగా మారగలదని ఆయన చెప్పారు. అమెరికా, చైనాలతో పాటు భారత్‌లో అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని అంబానీ చెప్పారు. డేటాను అత్యంత చౌకగా అందిస్తూ సంచలనం సృష్టించినట్లుగానే ఇంటెలిజెన్స్ విషయంలోనూ గొప్ప విజయాలతో ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపర్చగలదని ఆయన పేర్కొన్నారు.ఇన్ఫీ, టీసీఎస్‌లతో కూడా.. భారత మార్కెట్లో కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రోలతో చేతులు కలుపుతున్నట్లు హువాంగ్ తెలిపారు. ఎన్విడియా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫాం ఆధారిత ఏఐ సొల్యూషన్స్‌ను వినియోగించుకోవడంలో క్లయింట్లకు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తోడ్పడనున్నాయి. అలాగే ఇండస్ 2.0 అనే ఏఐ నమూనాను అభివృద్ధి చేసేందుకు ఎన్విడియా మోడల్‌ను టెక్ మహీంద్రా ఉపయోగించనుంది. అటు టాటా కమ్యూనికేషన్స్, యోటా డేటా సర్వీసెస్ వంటి సంస్థలకు ఎన్విడియా తమ హాపర్ ఏఐ చిప్‌లను సరఫరా చేయనుంది. -
ఎన్వీడియా ఏఐ చిప్.. దిగ్గజ కంపెనీలపై ప్రభావం
నేడు దిగ్గజ కంపెనీలు చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగిస్తున్నాయి. ఈ జాబితాలో ఎన్వీడియా కూడా ఉంది. సంస్థ ఏఐ ద్వారా చిప్‌లను తయారు చేయడం ప్రారంభించింది. దీంతో ప్రారంభంలో ఉత్పత్తి కొంత తక్కువగా ఉండొచ్చని, సరఫరాలలో కొంత ఆలస్యం అవ్వొచ్చని సమాచారం.ఎన్వీడియా చిప్‌ల తయారీ ఆలస్యం.. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి వాటిపైన పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ తన ఫ్లాగ్షిప్ గ్రేస్ హాప్పర్ AI సూపర్‌చిప్‌ను అనుసరించి మార్చిలో.. తన బ్లాక్వెల్ ఏఐ చిప్‌లను ఆవిష్కరించింది. ఇది ఉత్పత్తిని వేగవంతం చేస్తుందని సమాచారం. ఆ తరువాత సరఫరా వేగవంతం అవుతుంది.మార్కెట్లో హాప్పర్ డిమాండ్ ఎక్కువగా ఉంది, కాబట్టి ఉత్పత్తిని వేగవంతం చేయడానికి సంస్థ శ్రమిస్తోంది. అయితే ఈ వారం మైక్రోసాఫ్ట్, మరొక ప్రధాన క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్‌కు చిప్‌ల సరఫరా ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఎన్వీడియా తెలిపింది. -
నేను చాలా టాయిలెట్లను శుభ్రం చేశాను: ఎన్వీడియా సీఈఓ
'ఒక వ్యక్తి ఎంత ఎత్తు ఎదిగినా (అభివృద్ధి చెందినా) వచ్చిన దారిని మర్చిపోకూడదు' అంటారు. దీనికి చక్కని ఉదాహరణ ఎన్వీడియా కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జెన్సన్ హువాంగ్'. ప్రస్తుతం ప్రపంచంలోనే 13వ ధనవంతుడుగా ఉన్న ఈయన ఒకప్పుడు టేబుల్స్ క్లీన్ చేసారు, గిన్నెలు కడిగారు, టాయిలెట్లను కూడా శుభ్రం చేసినట్లు తానే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకున్నారు.జెన్సన్ హువాంగ్.. గత కొన్ని రోజులక్రితం స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యార్థులతో మాట్లాడుతూ తానూ గతంలో చేసిన పనులను గురించి వివరించారు. నేను చాలా టాయిలెట్లను శుభ్రం చేసాను, మీ అందరి కంటే ఎక్కువ టాయిలెట్లను నేను శుభ్రం చేసానని చెప్పారు. మీరు అసాధారణమైన పనులు చేయాలనుకుంటే, అది సులభం కాదని కూడా ఆయన వెల్లడించారు.హువాంగ్ ప్రపంచంలోని అతిపెద్ద చిప్‌మేకింగ్ కంపెనీకి చీఫ్‌గా ఉన్నప్పటికీ.. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల దగ్గర కూడా చాలా వినయంగా ఉంటారు. ఇదే ఆయన విజయానికి రహస్యమని పలువురు సన్నిహితులు చెబుతారు. -
ఎన్విడియా సీఈఓ నోట.. తోటమాలి నేర్పిన పాఠం
మనిషి జీవితంలో ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. తీక్షణంగా పరిశీలిస్తే.. ప్రకృతి కూడా మనకు ఎన్నెన్నో జీవిత సత్యాలను చెబుతుంది. నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించి.. జీవితంలో ఎంతోమందికి ఆదర్శమైన వారు కూడా తమకంటే ఉన్నతులు లేదా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని పాఠాలను నేర్చుకుని ఉంటారు. ఇటీవల ఎన్వీడియా సీఈఓ 'జెన్సన్ హువాంగ్' (Jensen Huang) ఓ తోటమాలి నుంచి తాను నేర్చుకున్న జీవిత పాఠాన్ని వెల్లడించారు.జెన్సన్ హువాంగ్ గత వారం కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై, అక్కడ ప్రసంగిస్తూ.. జపాన్‌లోని క్యోటోలో తాను సిల్వర్ టెంపుల్ సందర్శించడానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడ ఎక్కువ ఎండగా ఉంది, ఆ ఎండలో కూడా ఓ తోటమాలి అక్కడ పనిచేస్తూ కనిపించారు. ఆయన దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను, ఆయన ఇక్కడ పిచ్చి మొక్కలు తొలగిస్తున్నాను. ఈ తోటకు 25 సంవత్సరాలుగా తోటమాలిగా పని చేస్తున్నాను అని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.తోట పెద్దదిగా ఉంది పని చేయడానికి సాధ్యమవుతుందా అని నేను అడిగినప్పుడు.. ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పనులను సమయం కేటాయిస్తాను అని పేర్కొన్నట్లు జెన్సన్ చెప్పారు. ఆ తోటమాలి చెప్పిన మాటలు జీవితంలో విలువైన పాఠాలను నేర్పినట్లు చెప్పుకొచ్చారు.మనకు జీవితంలో ఎన్నెన్నో పనులు, వాటికి ఎన్నెన్నో ఆటంకాలు. అవన్నింటిని చూసి భయపడవకూడదు, అన్నీ చేయాల్సిన అవసరమూ లేదు. నీకు జీవితంలో ఏదైతే ముఖ్యమైందో, దేనికైతే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందో దానికి సమయాన్ని కేటాయించు. సమయం మిగిలి ఉంటే మిగిలిన పనులు చెయ్యి. తప్పకుండా సక్సెస్ సాధిస్తావన్నని ఆ తోటమాలి మాటలకు అర్థమని స్పష్టంగా తెలుస్తోంది. -
యాపిల్ ను దాటేసిన ఎన్విడియా..
-
ఎన్విడియా సరికొత్త రికార్డ్.. మైక్రోసాఫ్ట్ తరువాత..
ఎన్విడియా కంపెనీ యాపిల్‌ను అధిగమించింది.. మైక్రోసాఫ్ట్ తర్వాత రెండవ అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా మారింది. బుధవారం నాటికి షేర్స్ 5 శాతం పెరగటం వల్ల కంపెనీ విలువ 3.004 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మార్కెట్ ముగిసే నాటికి యాపిల్ (2.99 ట్రిలియన్ డాలర్స్) కంపెనీ విలువ కంటే ఎన్విడియా విలువ పెరిగింది.మైక్రోసాఫ్ట్ విలువ 3.15 ట్రిలియన్స్. దీంతో ప్రపంచంలో అత్యంత విలువైన రెండో కంపెనీగా ఎన్విడియా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 2002 చివరి వరకు ఎన్విడియా యాపిల్ కంటే విలువైన కంపెనీ. అయితే యాపిల్ కంపెనీ ఎప్పుడైతే మొదటి ఐఫోన్ విడుదల చేసిందో.. ఆ తరువాత ఎన్విడియాను అధిగమించింది.ఎన్విడియా సంస్థ యాపిల్ కంపెనీకి అధిగమించిన సందర్భంగా కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ మాట్లాడుతూ.. ఏఐ యాక్సిలరేటర్లను ప్రతి సంవత్సరం అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నాటికి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జెన్సన్ హువాంగ్ సంపద 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెరిగి ఏకంగా 107.4 బిలియన్లకు చేరింది.


