భారత కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే అది ప్రస్తుత కాలంలో చాలా అగమ్యగోచరంగా తయారైంది. ఎంతో ప్రాణప్రదంగా పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నవాళ్లే..కడదాక కలిసి ఉండలేకపోవడం బాధకరం. అది కూడా చిన్నచిన్న వాటికి, మనస్పర్థలతోటి విడాకులు తీసుకుంటున్నారు. తనకోసం అన్ని వదులుకుని వచ్చిందన్న భావం మగవాళ్లలో కొరవడం ఒక కారణమైతే..తన మాటే నెగ్గాలన్న అహంకారం మరొక కారణం అంటున్నారు మానసిక నిపుణుల. అచ్చం అలాంటి కారణాలతో ఈ టెక్ జంట విడిపోయింది. అందుకు గల కారణం చూస్తే..కన్నీళ్లు వస్తాయి. విమెన్ సాధికారత అన్న మాటలు వెగటుపుడుతాయి. దయచేసి మహిళల్ని మహారాణులు చేయకండి అర్థచేసుకోండి స్వామి..చాలు అని గొంతెత్తి అనాలనిపిస్తోంది.
అసలేం జరిగిందంటే..ఈ టెక్ జంట ప్రేమ కథ విడాకులతో ముగియడంతో నెట్టింట వైరల్‌గా మారింది. సర్వత్రా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ ప్రకారం. ఆ టెక్ జంట పాఠశాల రోజుల నుంచి ప్రేమించుకున్నారు. విజయవంతంగా జీవితాన్ని నిర్మించుకున్నారు. గుర్తింపును వెల్లడించిన ఆ ఇంజనీర్ జంటకు ఇద్దరు పిల్లుల, చక్కటి ఆర్థిక భద్రతా ఉంది.
ఆమె మంచి కష్టపడి పనిచేసే ఉద్యోగి. గర్భధారణ తర్వాత ఆరునెలలు మినహా ఎన్నడు విరామం తీసుకోలేదు. తొమ్మిదో నెల వరకు ఆఫీసుకు వెళ్లింది. పిల్లలు, భర్త కోసం పనిచేయడం ఆమెకు చాలా సంతోషాన్నిస్తుంది కూడా. రెండో గర్భధారణ తర్వాత ఆ మహిళ కంపెనీ మార్చింది. కొత్త టెక్నాలజీ నేర్చుకుంది. ఇప్పుడు తన భర్త కంటే అధిక వేతనం సంపాదిస్తోంది కూడా. అయితే అత్తగారు అనారోగ్యానికి గురి కావడంతో భర్త తన భార్యను ఉద్యోగం మానేసి ఆమె బాగోగులు చూసుకునే సంరక్షకురాలిగా మారాలని ఆదేశించాడు.
అందుకు ప్రెగ్నెన్సీ వల్ల చాలాసార్లు తాను ఉద్యోగానికి విరామం ఇచ్చాను..ఇప్పుడు నీ టైం వచ్చింది కాబట్టి మీరే జాబ్ మానేయండి, ఫైనాన్షియల్గా మొత్తం చూసుకుంటాను, అలాగే ఇంటి బాగోగుల్లో కూడా హెల్ప్ చేస్తానని చెప్పింది. అవసరమైతే పిల్లల్ని చూసుకునేందు వాళ్ల అమ్మను కూడా పిలిపిస్తానని అంది. అందుకు భర్త తల్లి ససేమిరా అంది. కోడలు తల్లి ఇక్కడకు రావడం సరైన కాదని..పైగా ఉద్యోగం కోడలే మానేయాలని పట్టుబట్టింది. పైగా అత్తగారిని చూసుకోవడం అనేది కోడలు బాధ్యతని ఆమె గట్టిగా విశ్వసిస్తోంది.
చివరికీ కోడలు ఉద్యోగం మానేయడం లేదనే అక్కసుతో ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. దాంతో విసుగుపోయిన ఆమె పిల్లలుతో సహా పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అలాగే భర్తకు ఓ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆమెకు ఇష్టమైతే తన ఇంటికి వచ్చి ఉండొచ్చని, తన అమ్మనాన్నలు చూసుకుంటారని అంది. అంతే భర్త ఉద్యోగం మానేయడం లేదనే కోపంతో..విడాకులు ఇస్తానని బెదిరిస్తూ లీగల్ నోటీసు పంపాడు. చివరికీ ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.
ఎంతో విజయవంతంగా నిర్మించుకున్న ఆజంట సంసారం విచ్చన్నమైంది, విడాకులు తీసుకున్నారు. ఇక్కడ ఒక మహిళ ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత సంపాదించినా..ఎంత ప్రేమించినా..త్యాగం చేసినా విలువ ఉండదు. జస్ట్ తన స్వాతంత్య్రాన్ని వదులుకోను అనగానే ఆ భార్య ఒక్కసారిగా పనికిరానిదిగా అయిపోయింది. నెటిజన్లు సైతం ఆమె తల్లికి అనారోగ్యంగా ఉంటే..ఆ భర్త ఉద్యోగం మానేస్తాడా? అని ప్రశ్నించారు, మరికొందరు ఇక్కడ ఆమె బాధ్యత నిరాకరించిందని కాదని, కేవలం తనకంటే ఎక్కువ సంపాదిస్తుందన్న విద్వేషం విడాకులకు దారితీసిందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.


