సాక్షి,కర్నూలు: సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పర్యటనలో విద్యార్థి సంఘాలు చంద్రబాబు కాన్వాయ్ ఎదుట నిరసన చేపట్టాయి. అధికారం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదంటూ ప్రశ్నించారు.

సీఎం గోబ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘం నేతలను ఈడ్చిపడేశారు. అనంతరం, విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు.


