breaking news
kurnool
-
వీల్‌చైర్ యాత్రలో ఉద్రిక్త వాతావరణం!
-
సుగాలి పార్వతి అడ్డగింత.. కర్నూలులో ఉద్రిక్తత
సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసుకు తొమ్మిదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఆమె తల్లి పార్వతి చేపట్టిన యాత్రను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. యాత్ర చేపట్టకుండా అడ్డుకోవడంతో పాటు బంధువులతోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో కర్నూలులో ఉద్రిక్తత నెలకొంది.సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరగాలనే డిమాండ్‌తో ఆమె తల్లి పార్వతి చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు నుంచి అమరావతి వరకు వీల్‌చైర్ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. తన గోడును ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు అమరావతికి వెళ్లాలని భావించారు.అయితే యాత్రకు అనుమతి లేదని పోలీసులు ఆమెకు తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ ముందుగానే ఆమె నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. యాత్రకు సిద్ధమైన సమయంలోనూ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నేటితో తొమ్మిదేళ్లు..సుగాలి ప్రీతి కేసుకు నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. 2017లో కర్నూలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. అప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు తమ కుమార్తెకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు. కేసులో దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని వారు పలుమార్లు ప్రభుత్వాలను కోరారు. సంవత్సరాలు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని ప్రీతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పవన్ మోసంపై పార్వతి ఆవేదనజనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పార్వతి గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ తన కుమార్తె కేసులో న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘న్యాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు’’ అంటూ ఆమె వాపోయారు.జగన్ హయాంలో న్యాయంవైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. సుగాలి ప్రీతి కేసులో న్యాయం అందించేందుకు ప్రయత్నించారు. కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించే ప్రయత్నం చేయడంతో పాటు ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత కూడా అందించారు. అయితే తిరిగి కూటమి అధికారంలోకి వచ్చాక కేసును పక్కన పడేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.పోరాటం కొనసాగిస్తాతన కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని పార్వతి చెబుతున్నారు. వీల్‌చైర్ యాత్రను పోలీసులు అడ్డుకోవడంపై ఆమె, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనుమతి లేకుండా యాత్ర చేపట్టేందుకు వీలు లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సుగాలి ప్రీతి కేసుకు తొమ్మిదేళ్లు పూర్తయిన రోజే.. న్యాయం కోసం ఆమె తల్లి చేపట్టిన యాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించడం మరోసారి ఈ కేసును చర్చలోకి తెచ్చింది. -
డ్యూటీ వేయమంటే గదికి రమ్మంటున్నారు
కర్నూలు(హాస్పిటల్): ‘ఫోన్లో మాట్లాడుతున్నానని నన్ను అకారణంగా సస్పెండ్ చేశారు. పనిచేసుకుంటానని, ఉద్యోగం తిరిగి ఇవ్వాలని కోరితే నా గదికి రా అని అంటున్నారు. నేను అలాంటిదాన్ని కాదంటే, ఇంకెవరినైనా తీసుకుని రమ్మని వేధిస్తున్నారు’ అని పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ మేనేజర్లపై ఓ మహిళ ఆరోపణలు చేశారు. మహిళలను వేధిస్తున్నారంటూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు సోమవారం ధర్నా చేశారు. అందులో రెండు నెలల క్రితం సస్పెండైన ఓ మహిళ మాట్లాడుతూ.. మేనేజర్లు చెప్పినట్లు వినకపోతే మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని, పని ఒత్తిడితో సతమతమయ్యేలా చేస్తున్నారని వాపోయారు. కొందరితో వారి ఇళ్లల్లోనూ పనిచేయించుకుంటున్నారని, దీనిపై ఎవరైనాప్రశ్నస్తే వారిపైనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు యువత రాష్ట్ర నేత జూటూరు రవికుమార్ మాట్లాడుతూ.. శానిటేషన్ ఏజెన్సీ మేనేజర్లు రత్నరాజు, రమణతోపాటు, మీడియేటర్ హరిప్రసాద్‌తో మాట్లాడేందుకు తాము వెళ్లామని, ఈ క్రమంలో వారి ఫరీ్నచర్ వారే పగులగొట్టుకుని, తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు తమకు బంధువని చెబుతూ అందరినీ బెదిరింపులకు గురిచేస్తూ, వారి అక్రమాలను బయటకు రాకుండా చేస్తున్నారని అన్నారు. -
సుగాలి ప్రీతి తల్లి వీల్ చైర్ యాత్ర పార్వతిని అడ్డుకున్న పోలీసులు..
-
‘అక్రమ కేసులకు భయపడేది లేదు’
కర్నూలు: తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. అక్రమ కేసులు పెడితే భయపడతామని అనుకోవడం పొరపాటన్నారు. అక్రమ కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు కాటసాని. కర్నూలు జిల్లా పర్యటనలో తమ పార్దీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వచ్చిన ప్రజాదరణ చూసి తమపై కేసులు పెట్టారని, వాటికి తామేమీ భయపడమన్నారు. ‘మీ కేసులతో వైఎస్ జగన్ నుంచి మమ్మల్ని వేరు చేయలేరు. ఇచ్చిన హామీలలను కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడంతోనే వైఎస్ జగన్‌కు ప్రజల ఆదరణ పెరుగుతుంది. వైఎస్ జగన్‌తో ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మకంతోనే జనాలు నీరాజనం పడుతున్నారు. కూటమి ప్రభుత్వం మాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించింది. వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. జన సమీకరణ చేశారంటూ పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. మీరు పెట్టే తప్పుడు కేసులపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటానికి సిద్ధం’ అని హెచ్చరించారు. -
పోలీసులే దొంగలు! విరూపాక్షి ఇంట్లో సీసీ ఫుటేజీ... సంచలన నిజాలు బయటపెట్టిన జగన్
-
రిపీట్... రిపీట్.. రిపీట్ పోలీసులకు జగన్ మాస్ కౌంటర్
-
కర్నూలు జైలులో బాబు సర్కార్ రెడ్‌బుక్ అరాచకం
సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలు జైలులో కూటమి సర్కార్ రెడ్‌బుక్ అరాచకానికి తెరలేపింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అవమానించేందుకు కుట్రలు చేసింది. కావాలనే గ్రిల్స్ వెనుక నిలబెట్టి జైలు సిబ్బంది ఫొటోలు తీశారు. అడిగితే పైనుంచి వచ్చిన ఆదేశాలంటూ జైలు సిబ్బంది చెప్పారు. చంద్రబాబు సర్కార్ కుట్రలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబుది శాడిస్ట్ మెంటాలిటీ. నన్ను అవమానించాలని చూశారు. మాజీ సీఎం అని చూడకుండా నన్ను అవమానించాలని చూశారు. ..నన్ను గ్రిల్ వెనుక నిలబెట్టి ఫొటో తీయించారు. అడిగితే పై నుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్పారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. బాబు నాటిన తప్పుడు విత్తనాలే రేపు విషవృక్షాలవుతాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘వెన్నుపోటు పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తుంది. బీసీ నాయకులపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?. సీదిరి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ చేస్తే. వెన్నుపోటు పార్టీ కుట్ర కేసుగా మార్చింది. మహిళా ఎస్ఐని చంపబోయాడని చింతాడ రవిపై కేసు పెట్టారు. ముస్తఫా, కారుమూరి సునీల్‌పై కూడా అక్రమ కేసులు కట్టారు. ఇప్పుడేమో విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
విరుపాక్షి ఏమైనా ఉగ్రవాదా ? కూటమికి జగన్ వార్నింగ్..
-
భార్య బట్టలను భర్తే చింపించే స్థాయికి తల దించుకో చంద్రబాబు!
-
LIVE: MLA విరూపాక్షితో ములాఖత్ అనంతరం YS జగన్ సంచలన PRESS MEET
-
ఎమ్మెల్యే విరుపాక్షితో YS జగన్ ములాఖత్
-
కర్నూలు జైలు వద్దకు చేరుకున్న YS జగన్
-
ఇసుక వేస్తే రాలనంత జనం.. దద్దరిల్లిన కర్నూలు
-
కాన్వాయ్ పై టవల్ విసిరిన అభిమాని.. జగన్ ఏం చేశాడో చూడండి
-
జగన్ అన్న వస్తే చరిత్ర మారుతుంది! YS జగన్ పర్యటనలో వైరల్ ఫ్లెక్సీ
-
కర్నూల్ లో జగన్ జన సునామి
-
ఒక MLAని అరెస్ట్ చేయాలంటే... కనీసం ప్రోటోకాల్ లేదా..
-
కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)
-
కర్నూలులో జగన్ తుఫాన్
-
భారీ గజమాలతో ఘన స్వాగతం
-
Watch Live: కర్నూలు దద్దరిల్లేలా జగన్ భారీ ర్యాలీ
-
కర్నూల్ లో దుమ్ములేపిన జగన్ కాన్వాయ్
-
బైరెడ్డి నే ఆపుదాం అని చూశారు.. దెబ్బకి ఇచ్చిపడేసాడు
-
కర్నూలు చేరుకున్న వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ మద్దతు కావాలి.. సుగాలి ప్రీతి తల్లి
సాక్షి, కర్నూలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు అన్యాయమే జరిగిందని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆరోపించారు. తమ కుమార్తెకు న్యాయం జరగక తొమ్మిదేళ్లు గడిచిపోయాయని, ఇప్పటికీ న్యాయం కోసం పోరాడాల్సి వస్తోందని పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా సుగాలి పార్వతి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. మాకు జరిగిన అన్యాయం కోసమే పోరాటం చేస్తున్నాం. మా బిడ్డను కోల్పోయి 9 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదు. అందుకే వీల్‌చైర్ యాత్ర చేయబోతున్నాను. మా పోరాటానికి మద్దతు కావాలి. అందుకే వైఎస్ జగన్‌ను కలవడానికి వచ్చాను. చంద్రబాబు, పవన్ మహిళల పట్ల ఇదేనా మీ భద్రత అని ప్రశ్నించారు. -
ఇప్పుడు జగనన్నను కలిసి ఒకే ఒక్క మాట చెప్పాలి
-
మీకే మంచిది చెపున్నా.. జగన్ పర్యటనపై ఆంక్షలు.. పోలీసులకు కాటసాని వార్నింగ్
-
వైఎస్ జగన్ కర్నూల్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే
-
YS జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్ ఇదే... పోలీసులకు మా విజ్ఞప్తి ఏంటంటే..?
-
దద్దరిల్లిన కర్నూల్.. కొట్టినా.. అరెస్ట్ చేసినా YSRCP నిరసనలు
-
ఈనెల 13న కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్
కర్నూలు (టౌన్): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13వ తేదీన కర్నూలుకు రానున్నట్లు ఎమ్మెల్సీ, పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డీనేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. ఆదివారం కర్నూలులో తలశిల మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లి నుంచి కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సబ్‌జైలుకు వెళ్లి విరూపాక్షిని పరామర్శిస్తారని వెల్లడించారు. -
జైల్లో MLA విరూపాక్షిని పరామర్శించిన బైరెడ్డి
-
కర్నూలు పార్లమెంట్ ఇంచార్జ్ గా నియామకం.. మీ అందరికీ మాట ఇస్తున్నా...
-
'మా వాళ్లను గలీజుగా మాట్లాడినా చూస్తూ ఊరుకోం' : మంత్రి టీజీ భరత్
-
ఎమ్యెల్యే విరుపాక్షిపై అసత్య ప్రచారం.. భార్య వస్త్రాలు చించుతున్న టీడీపీ నాయకుడు నాగరాజు
-
ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్
-
ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి : కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం అంటూ ఆదివారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైఎస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు ! బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైనా కేసులు! ప్రశ్నిస్తే అరెస్టులు ! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం?ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం?చంద్రబాబు… నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని అనిపిస్తోంది. చిప్పగిరి మండలం నేమకళ్లులో వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీవాళ్లు దాడిచేస్తే, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు.ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో… కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో… ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో… ప్రజలకు తెలియకూడదనే హార్డ్‌డిస్కులను తీసుకెళ్లారా? చంద్రబాబు.. సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా?శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రజాస్పందనను చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా?గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా ఇదే రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ… తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైఎస్సార్సీపీ నాయకుడని కేసు పెడతారా?రాష్ట్రంలోని Gen-Z తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? అని. కాని, ఈ ప్రశ్నలకు మీ దగ్గర మీ తనయుడు లోకేష్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.చంద్రబాబు.. గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా… ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా… ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా… ఎన్ని పోలీసు బలగాలను దించినా… వైఎస్సార్సీపీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు. ప్రజల వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు’ అని పునరుద్ఘాటించారు. నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం!దాడి చేసినవారికి రక్షణ… బాధితులపై కేసులతో రాజకీయ కక్ష!@ncbn గారూ.. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైయస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు ! బాధితులకు అండగా నిలబడితే…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2026 -
ఏం బెదిరిస్తున్నావా..? పోలీసులు Vs ఎమ్మెల్యే విరుపాక్షి
-
ఇంట్లోకి దూరి కొట్టారు.. చంపేస్తారా..? వైకుంఠ జ్యోతిపై విరూపాక్షి ఫైర్
-
రాడ్లు, కత్తులతో టీడీపీ నేతల దాడి.. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్..
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్.. చిప్పగిరిలో ఉద్రిక్తత
సాక్షి, కర్నూలు: కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో శనివారం అర్ధరాత్రి పోలీసులు హైడ్రామాకు తెరలేపారు. వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి రాత్రి 2.45 గంటలకు భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగులగొట్టి ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరినీ చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా హార్డ్ డిస్కులను పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిప్పగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, టీడీపీ నాయకుడు నాగరాజు వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే ఎమ్మెల్యే వీరుపాక్షి పరామర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోనలేదు. అంతటితో ఆగకుండా గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ విరుపాక్షిపై సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. అనంతరం, ఎమ్మెల్యే నివాసానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు.. దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిన విరూపాక్షి, చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. -
ఆటలో ఓడిపోయినందుకు కర్నూలులో అర్థరాత్రి కాల్పులు
-
లోకేష్ రాజీనామా చేయకుంటే AP దద్దరిల్లిపోద్ది..
-
కర్నూలులో కాల్పుల కలకలం
కర్నూలు: కర్నూలు నగరంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. జోహ్రాపురం రోడ్లో ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఓ బ్యాడ్మింటన్ అకాడమీలో పోటీలకు వచ్చి, కాల్పులకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పోటీలకు వచ్చి గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. కాల్పులకు పాల్పడ్డ వారు తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనంలో వచ్చినట్లు తెలుస్తోంది. -
చంద్రబాబు పర్యటన.. అధికారుల అతి ఉత్సాహం!
కర్నూలు: అధికారం ఉందనే అండతో సామాన్యుల జీవితాలతో ఆడేసుకుంటోంది కూటమి సర్కారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో భాగంగా కర్నూలు జిల్లా ఆస్పరిలో అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించారు. రైతు అనుమతి లేకుండా జొన్న పంటను జేసీబీతో దున్నేశారు అధికారులు. పశువులకు మేత లేకుండా చేసేశారు. దాంతో ఆ పొలానికి సంబంధించి రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. పశువులకు మేత లేకుండా చేస్తారా అంటూ అధికారులపై ఆగ్రహవ వ్యక్తం చేశాడు. వీఐపీ పార్కింగ్ కోసమని తన పొంట పొలాన్ని దున్నేస్తారా అంటూ మండిపడ్డాడు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, వేసిన పంటకు డబ్బులు ఇవ్వకుండా పంటను ఎలా దున్నుతారు ఆవేదన చెందుతున్నాడు. ఇది పశువుల కోసం వేసుకున్న పంట అయ్యా.. దీన్ని ఇలా దున్నేస్తారా అయ్యా అంటూ గుండె బరువెక్కెలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు తన పశువులకు మేత ఎలా అంటూ చెమర్చిన కళ్లతో దున్నేసిన పొలాన్ని చూసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
కర్నూలులో ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
ఆంధ్రప్రదేశ్: కర్నూల్ జిల్లాలో ఈరోజు ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలో లారీ ఢీకొనడంతో ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా ఫ్లైఓవర్‌పై ఏపీ స్పెషల్ బెటాలియన్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి వాకింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో వెనుకనుంచి వచ్చిన లారీ అతనిని బలంగా ఢీకొనడంతో ఫ్లైఓవర్ పై నుండి క్రిందపడి కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఏపీ స్పెషల్ బెటాలియన్‌లో పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. -
సీఐ అరాచకం.. వేధింపులు తాళలేక బాధితుడు ఆత్మహత్యాయత్నం
కర్నూలు: జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. కేసు విచారణ పేరుతో పోలీసులు సాగించిన వేధింపులు ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చాయి. సీఐ టార్చర్ తట్టుకోలేక ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది.బాధితుల కథనం ప్రకారం.. ఒక కేసు విషయమై విచారణ కోసమంటూ హనుమంతు రెడ్డిని సీఐ శ్రీనివాస్ నాయక్ ఆస్పరి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే విచారణ సమయంలో సీఐ శ్రీనివాస్ నాయక్ తనను తీవ్రంగా మానసిక, శారీరక వేధింపులకు గురిచేశాడని బాధితుడు ఆరోపించారు. సీఐ వేధింపులను భరించలేక, తీవ్ర మనస్తాపానికి గురైన హనుమంతు రెడ్డి అందరూ చూస్తుండగానే పోలీస్ స్టేషన్ లోపలే పురుగుల మందు తాగాడు.దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన పోలీసులు, అతని పరిస్థితి విషమించడంతో వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కర్నూలు జీజీహెచ్.. బాధిత కార్మికులకు అండగా ఉంటాం : వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో (జీజీహెచ్) అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమను కొత్త కాంట్రాక్టర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించడంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.కూటమి ప్రభుత్వ హయాంలో కర్నూలు జీజీహెచ్‌లో శానిటేషన్ పనుల కాంట్రాక్ట్‌ను పద్మావతి హాస్పిటాలిటీ ఏజెన్సీకి అప్పగించిన అనంతరం, ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించారని కార్మికులు తెలిపారు. దీంతో తమ కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటూ, తమకు న్యాయం చేయాలని వైయస్ జగన్‌ను కోరారు.వారి సమస్యలను ఓపికగా విన్న వైయస్ జగన్, ఉద్యోగాలు కోల్పోయిన పారిశుధ్య కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వారి ఉద్యోగాల పరిరక్షణ కోసం అవసరమైన న్యాయపరమైన సహాయాన్ని పార్టీ లీగల్ సెల్ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ అన్ని విధాలా తోడుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
స్వామీ.. మా అత్త త్వరగా చనిపోయేలా చూడు!..కోడలి వింత లేఖ వైరల్!
సాక్షి, అనంతపురం: సాధారణంగా భక్తులు కోర్టు కేసులు గెలవాలనో, అప్పులు తీరాలనో, ఉద్యోగాలు రావాలనో లేదా కుటుంబాలు చల్లగా ఉండాలనో కోరుకుంటూ హుండీలలో ఉత్తరాలు వేస్తుంటారు. కానీ, ఓ భక్తుడు ఏకంగా తన అత్తగారి మరణాన్ని కాంక్షిస్తూ కరెన్సీ నోటుపై అభ్యర్థనతో రాసిన వింత లేఖ వెలుగులోకి వచ్చింది.ఆలయ అధికారులు,స్థానిక భక్తుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. గురువారం ఆలయ హుండీని లెక్కించగా, ఓ రూ.20 నోటుపై 'స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఆమె త్వరగా చనిపోయేలా చూడు’ అని రాసి ఉన్న వినతి కనిపించింది. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారుఅయితే ఆ వింత లేఖ రాసిన సదరు మహిళ ఎవరు అనేది తెలియరాలేదు. ఆమె అత్తగారి నుంచి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, వేధింపులు ఏ స్థాయికి చేరితే.. చివరికి ఎవరికీ చెప్పుకోలేక ఇలా నేరుగా భగవంతుడికే తన ఆవేదనను నివేదించుకుందనే కోణంలో సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా, హుండీ లెక్కింపులో దొరికిన ఈ రూ. 20 నోటు తాలూకు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని హాస్యాస్పదంగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం సమాజంలో అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లోపించడానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో భక్తులు తమ వ్యక్తిగత బాధలను, దేవాలయాల లోపాలను హుండీ లేఖల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడం పెరిగిపోతోందని, ఇటీవల కొండగట్టు అంజనేయ స్వామి ఆలయంలోనూ ఇలాంటి వింత లేఖలే బయటపడిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ‘ఆలయంలో భక్తులకు కనీస వసతులు కల్పించే వరకు తాము హుండీలో ఒక్క రూపాయి కూడా వేయం’ అని భక్తులు స్పష్టం చేశారు. ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విసిగిపోయి, హుండీని వేదికగా చేసుకుని భక్తులు డిమాండ్లతో కూడిన వినూత్న నిరసన లేఖలు వేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. -
'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)
-
మీడియా ముందే పోలీసుల ఓవరాక్షన్
-
ఈ ఉద్యోగం చేయలేను.. తనువు చాలిస్తున్నా..
కర్నూలు(సెంట్రల్): ‘అనారోగ్యం అని చెప్పినా వినిపించుకోకుండా విధులు నిర్వర్తించాల్సిందేనంటూ అధికారులు ఆదేశించారు. ఈ మానసిక ఒత్తిడిని భరించలేను..’అంటూ కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌లోని 28వ వార్డు రెవెన్యూ సెక్రటరీ (వీఆర్వో) ఎస్ఎండీ షేక్ మహమ్మద్ హుసేన్ (45) శనివారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు అర్బర్ తహసీల్దార్ డి.రవికుమార్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) ధనుంజయలే తన ఆత్మహత్యకు కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. డిస్క్ ఆపరేషన్.. అయినా తప్పని పనిభారం సిబ్బంది కొరత కారణంగా 30, 31వ వార్డు సచివాలయ బాధ్యతలను కూడా హుస్సేన్‌కు అప్పగించారు. అంతేకాక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో 37వ వార్డు బీఎల్ఓ విధులను కూడా కేటాయించారు. దీనికి తోడు తన వార్డుల పరిధిలో జనగణన విధులు ఉంటాయి. అదనంగా సచివాలయ ఉద్యోగులు సాధారణంగా చేసే దాదాపు 25 రకాల సర్వేలు సరేసరి. ఇక జూన్ 15 నుంచి ఎస్ఐఆర్ పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో బూత్ లెవల్ ఆఫీసర్ విధుల్లో భాగంగా ఇంటింటి సర్వే చేయాలి.ఇంత పనిభారం నేపథ్యంలో మూడు నెలల క్రితం హుస్సేన్ సెలవు పెట్టి నడుము నొప్పి కారణంగా ఆపరేషన్ చేయించుకున్నాడు. కోలుకుని ఇటీవలే విధుల్లో చేరాడు. ఈనేపథ్యంలో బీఎల్ఓ విధులు నిర్వర్తిస్తే క్షేత్రస్థాయిలో తిరిగే సమయంలో నొప్పి వస్తుందని భావించి విషయాన్ని తహసీల్దార్ డి.రవికుమార్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ్‌కు తెలియజేశాడు. ఆ విధుల నుంచి తప్పించాలని కోరాడు. అయితే వారు అవేమీ పట్టించుకోకుండా విధులు నిర్వర్తించాల్సిందేనని ఆదేశించడంతో ఉద్యోగంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహంతో కలెక్టరేట్‌ను ముట్టడించిన ఉద్యోగులు హుస్సేన్ మరణ వార్త సచివాలయ ఉద్యోగులను తీవ్రంగా కలచివేసింది. తోటి మిత్రుడు పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10గంటలకే కలెక్టరేట్ చేరుకుని హుస్సేన్ మృతదేహాన్ని గాంధీ విగ్రహం ఎదుట ఉంచి ‘ఇది ప్రభుత్వ హత్యే’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక్క హుస్సేన్ సమస్య మాత్రమే కాదని, తమ అందరికీ పని ఒత్తిడి ఉందని ఆవేదన వెలిబుచ్చారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు సచివాలయ ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.టీసీ, వీసీల్లో అందరి ముందే పురోగతి లేదని అవమానిస్తున్నారని, తాము చెప్పేది ఏ మాత్రం వినడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పని ఒత్తిడికి కారణమవుతున్న ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హుస్సేన్ మరణానికి కలెక్టరే బయటకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అయితే ఆమె బయటకు రాకుండా డీఆర్వో సి.వెంకటనారాయణమ్మను పంపారు.ఆమె వచ్చి హుసేన్ భార్య షేక్ ఖాజాబీ, కుమారులు షేక్ మౌలాలి, షేక్ ఖాజా, కూతూరు షేక్ సానతోపాటు కొందరు సచివాలయ ఉద్యోగులను వెంట బెట్టుకుని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందించి హుస్సేన్ కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా రూ.50 వేలతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కారణంగా ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2.30 గంటల వరకు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కుటుంబ సభ్యుల వేధింపులే కారణం: కలెక్టర్ హుస్సేన్ ఆత్మహత్యకు పని ఒత్తిడి కారణం కాదని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పేర్కొనడం గమనార్హం. అతని మానసిక స్థితి సరిగా లేదని కలెక్టర్ పేర్కొన్నారు. భార్య, పిల్లలే హుస్సేన్‌ను కొట్టేవారని, కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే.. ఎందరు ఉద్యోగులు మిగులుతారని ఆమె ఎదురు ప్రశి్నంచారు. సూసైడ్‌నోట్ నిజానిజాలపై విచారణ జరిపిస్తామని కూడా ఆమె తెలిపారు. -
విషాదం: తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతైన విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంత్రాలయంలోని బంంధువుల ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి పూజకు బంధువులు హాజరయ్యారు. పూజ అయిపోయిన తర్వాత సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి వెళ్లారు వారు. వారిలో ఆరుగురు ఈత కొట్టడం కోసం దిగగా, వారిలో ఆదోనికి చెందిన అపర్ణ ముందుగానే సురక్షితంగా బయటకొచ్చేసింది. మిగతా ఐదుగురు నదిలో చిక్కుకుపోయి గల్లంతయ్యారు. అక్కడ నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయలేక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుని ఐదుగురు గల్లంతయ్యారు. దాంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. గల్లంతైన వారిలో ఇద్దకు హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర, సతీష్లుగా గుర్తించగా మరో ఇద్దరిని మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర, ధనులుగా గుర్తించారు, ఉరవకొండకు చెందిన సంధ్య అనే యువతి కూడా ఉంది. వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ధను మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు, మత్య్సకారులు గాలిస్తున్నారు. -
మురళి నా జీవితాన్ని నాశనం చేశాడు..!
కర్నూలు: మండల పరిధిలోని సూగూరు గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన కురువ మురళి నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ప్రియుడి మాటలను నమ్మి శారీరకంగా ఒక్కటయ్యారు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి నట్టేట ముంచాడు. రెండు పర్యాయాలు గర్భం దాల్చగా మందు బిల్లలు వేయించి గర్భస్రావం చేయించినట్లు బాధితురాలు వాపోతోంది. ఎలాగో పెద్దలను ఒప్పిస్తాడని ఎంతో నమ్ముకుంది. చివరకు ప్రియుడు తమ ప్రేమను కాదనుకున్నాడు. మోజు తీరాక కులం అడ్డుపెట్టుకుని ఉడాయించాడు. దీంతో ఇటీవల ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టింది. అప్పటికే ఇంటికి తాళాలు వేసుకుని ఉడాయించడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు మంత్రాలయం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అక్కడకు చేరుకోగానే కొందరు పెద్దలు బాధితులను ఏమార్చారు. బాధితురాలికి న్యాయం చేస్తామంటూ ఊరికి తీసుకొచ్చారు. వంచన విలువ రూ.15 లక్షలు ప్రేమ పెళ్లికి అక్షింతలు వేయాల్సిన పెద్దలు వంచనకు విలువ కడుతూ పంచాయితీ చేపట్టారు. రూ.15 లక్షలు ఇచ్చేందుకు రాజీ కుదిర్చారు. ఇప్పటికే ప్రియుడి కుటుంబ సభ్యులు రూ.4 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. ఇందులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు వాటాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయిననూ బాధితురాలు తనను మోసగించిన మురళితోనే వివాహం చేయాలని పట్టుబట్టినట్లు సమాచారం. కాగా ప్రియుడు మురళి గ్రామానికి ఆరు నెలలు దూరంగా ఉండాలని నిర్ణయించారు. బాధితురాలు ఒప్పుకుంటే మిగిలిన కాస్త బ్యాలెన్స్ చేతిలో పెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులోనూ కొందరు అధికారులు అతి తెలివి ప్రదర్శించారు. బాధితురాలితో తనకు మురళితో ఎలాంటి సంబంధం లేదన్నట్లు సంతకాలు పెట్టించారు. బాధితురాలు తిరగబడకుండా పెద్దల సమక్షంలో సంకెళ్లు వేసుకునేలా చేయడం గమనార్హం. బలమైనా పోక్సో చట్టాలు ఉన్న నేపథ్యంలోనూ ఇలాంటి పంచాయితీలు చోటు చేసుకోవడం దారుణం. -
టీడీపీ ఖాకీచకంపై..కర్నూలులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ (ఫొటోలు)
-
యువతితో ఎస్ఐ వివాహేతర సంబంధం..!
కర్నూలు: కర్నూలు నగరంలో ట్రాఫిక్ ఎస్ఐగా పని చేస్తున్న హరిప్రసాద్‌ను డిస్మిస్ చేస్తూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐకి వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు హరిప్రసాద్‌ను విధుల నుంచి తొలగించారు. వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలేనికి చెందిన హరిప్రసాద్ 2013లో ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించారు. పది రోజుల క్రితం నంద్యాల జిల్లా నుంచి కర్నూలు ట్రాఫిక్ విభాగానికి బదిలీపై వచ్చారు. హరిప్రసాద్‌కు యువతితో వివాహేతర సంబంధం విషయంలో రెండు నెలలుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది. చివరకు యువతి కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అంతర్గత విచారణ జరిపించి డిస్మిస్ చేశారు.కాగా, హరిప్రసాద్ ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐగా పనిచేసే సమయంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా చాగలమర్రి టోల్‌ప్లాజా వద్ద పట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఎస్ఐ హరిప్రసాద్‌ను వీఆర్‌కు పంపారు. -
గొంతులో కత్తి దిగబడితే 3 రోజులకు తీస్తామన్నారు
కర్నూలు(హాస్పిటల్): వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగా ప్రత్యర్థులు అతని గొంతులో కత్తి(సర్జికల్ బ్లేడ్)తో బలంగా పొడిచారు. పెనుగులాటలో సర్జికల్ బ్లేడ్ కాస్తా విరిగి అతని గొంతులో సగం ఇరుక్కుపోయింది. రక్తం కారుతున్న అతన్ని కుటుంబసభ్యులు మోసుకుని పెద్దాసుపత్రికి వెళితే వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. బ్లేడ్ తీసేందుకు మూడు రోజులు పడుతుందన్నారు. ప్రాణభీతితో అతన్ని కుటుంబసభ్యులు డబ్బులు ఖర్చు చేసి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించి బతికించుకున్నారు. ఈ విషాద ఘటన మూడు రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన ఉప్పరి అశోక్(29) వ్యాపారం రీత్యా కర్నూలు నగరంలో నివాసం ఉంటున్నాడు.అతను వివాహ వేడుకలకు ఉపయోగించే రథాలను తయారు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ వ్యాపారంలో ప్రత్యర్థులతో అతనికి విభేదాలు రావడంతో ఈ నెల 5న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంటి వద్ద అతనిపై దాడి చేశారు. వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్‌తో గొంతు కోసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో అతని గొంతులోకి సర్జికల్ బ్లేడ్ దిగబడింది. పెనుగులాటలో ఆ బ్లేడ్ సగం విరిగిపోయి గొంతులోనే ఇరుక్కుపోయింది. వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. రాత్రి పది గంటలైనా సరైన వైద్యం అందించకపోగా ఆపరేషన్ చేయడానికి, ఇరుక్కుపోయిన బ్లేడ్ తీయడానికి మూడు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులకు క్యాజువాలిటీలోని వైద్యులు తెలిపారు. దీంతో ఎలాగైనా అశోక్ ప్రాణాలు దక్కించుకోవాలన్న ఉద్దేశంతో అదే రోజు రాత్రి 10 గంటలకు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి వెంటనే ఆపరేషన్ చేసి బ్లేడ్ తీయడమే కాకుండా దెబ్బతిన్న శరీర భాగాలను సరిచేయడంతో అతని ప్రాణాలు దక్కాయి. ప్రాణాలు పోస్తారని పెద్దాసుపత్రికి వెళితే కనీసం పట్టించుకోలేదని, ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా ఆపరేషన్ చేయడానికి మూడు రోజులు పడుతుందని చెప్పడం పట్ల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి
-
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
పెళ్లి కాలేదని సర్టిఫికెట్ తెస్తేనే ఆపరేషన్ చేస్తాం
కర్నూలు (హాస్పిటల్): అనారోగ్యంతో ఆరోగ్యశ్రీ కార్డు చేతబట్టుకుని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతికి, “నీకు ఇంకా పెళ్లి కాలేదని సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే ఆపరేషన్ చేస్తాం” అని ఆ ఆస్పత్రి యాజమాన్యం వెనక్కి పంపించిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది.వివరాలు.. ఓ యువతి అనారోగ్యంగా ఉండడంతో కర్నూలు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా, పరీక్షించిన వైద్యులు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. తనకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కార్డు ఉందని ఆమె వైద్యులకు చూపించింది. అయితే అందులో ఆమె పేరు తల్లిదండ్రులతో పాటు ఉండటంతో అక్కడి వైద్య సిబ్బందికి అనుమానం వచ్చింది.చాలామంది వివాహమైనా ఉచితంగా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునేందుకు కార్డులో పేరు తీయించుకోవడం లేదని, నీవు కూడా అలాగే చేసి ఉంటావని భావించారు. అందుకే ముందుగా “నీకు పెళ్లి కాలేదని సర్టిఫికెట్ తెచ్చుకోవాలి” అని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో ఆమె కంగుతింది.సాధారణంగా వివాహమైతే సర్టిఫికెట్ ఇస్తారు.. కానీ పెళ్లి కాలేదని ఎవరు సర్టిఫికెట్ ఇస్తారని ఆ యువతి ప్రశ్నించింది. అయితే అదంతా తమకు సంబంధం లేదని, పెళ్లి కాలేదని సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే ఉచితంగా ఆపరేషన్ చేస్తామని ఆస్పత్రి నిర్వాహకులు తేల్చిచెప్పారు. -
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. భారీ క్యూలైన్..
సాక్షి, కర్నూలు: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. డీజిల్ కొరత తీవ్రతరం కావడంతో పెట్రోల్ కూడా దొరుకుతుందో లేదో అనే భయంతో లీటర్ల కొద్దీ పెట్రోల్ తీసుకువెళ్తున్నారు. బంకుల వద్ద గంటల తరబడి పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు.కర్నూలులో పెట్రోల్, డీజిల్ కొరతపెట్రోలు బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ఆందోళన చెందుతున్న వాహనదారులుపెట్రోలు దొరకదు అనే భయంతో వాహనదారుల్లో టెన్షన్. గంటల కొద్దీ పెట్రోల్ కోసం ఖాళీ బాటిల్స్‌లో వాహనదారుల బారులు.పెట్రోల్, డీజిల్ కోసం ఆందోళన చెందుతున్న వినియోగదారులు.తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతున్న వాహనదారులు.స్పందించిన కర్నూలు కలెక్టర్పెట్రోలు కొరతపై స్పందించిన కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి స్పందిస్తూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 166 పెట్రోల్ బంకుల్లో 13 లక్షల లీటర్ల పెట్రోల్, 11 లక్షల లీటర్ల డిజిల్ అందుబాటులో ఉందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ దొరకదని భయంతో ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తున్నారని, దీంతో బంకులు ఖాళీ అవుతున్నాయని.. ఫలితంగా 32 బంకులు మూతపడ్డాయని చెప్పారు. అక్రమంగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నందిగామలో డీజిల్ కొరత..డీజిల్ కొరత కారణంగా నందిగామలో సామాన్యుల అవస్థలుబంకుల వద్ద బారులు తీరుతున్న వాహనాలుకొన్ని బంకుల్లో రేషన్ పద్దతిలో డీజిల్..కారుకి 10, లారీకి 50 లీటర్లు మాత్రమే..నిన్నటి నుండి బంకుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న వాహనదారులురెండు గంటలపైన వాహనం లైన్లో ఉండే 15 లీటర్లు మాత్రమే కొడుతున్నారంటూ వాహనదారుల ఆవేదనడీజిల్ కొరత నేపధ్యంలో కొన్ని బంకుల్లో టిన్నుల్లో డీజిల్ కొట్టించుకుంటున్న వాహనదారులుడీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని వాహనదారుల ఆవేదన. మచిలీపట్నంలోనూ బారులుమచిలీపట్నం పలు పెట్రోల్ బంక్ లలో డీజీల్ కొరతమచిలీపట్నంలోని రెండు బంక్ లలో మాత్రమే దొరుకుతున్న డీజిల్రెండు బంకుల వద్ద బారులు తీరిన వాహనాలుఆంక్షలు విధించి వాహనాలలో డీజిల్ నింపుతున్న బంక్ సిబ్బందిపలుచోట్ల పెట్రోల్ బంకు సిబ్బందితో వాగ్వివాదానికి దిగిన వాహనదారులు కాకినాడ జిల్లాడీజిల్ కోసం పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్న వాహనదారులుపలు బంకుల వద్ద క్యూ లైన్లో ఆటోలుకొన్ని బంకులలో 2 లీటర్లే కొట్టడంతో ఆవేదన చెందుతున్న ఆటో డ్రైవర్లు.ప్లాస్టిక్ టిన్నుల్లో డీజిల్ కొట్టించుకుంటున్న వినియోగదారులుడీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్న మాటలకు, బంకుల వద్ద పరిస్ధితికి పొంతన లేదని మండిపడుతున్న ఆటో డ్రైవర్లు. -
పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ.. వాహనదారుల విలవిల
కర్నూలు(సెంట్రల్): పశ్చిమాసియా యుద్ధంతో ఓ వైపు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్న నేపథ్యంలో జిల్లా వాసులను పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. నాలుగైదు రోజులుగా జిల్లాలో ఒక్కొక్కటి పెట్రోల్ బంకు మూత పడుతుండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బంకుల ఎదుట నోస్టాక్ బోర్డులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వరకు బంకులు మూతపడడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆకస్మికంగా పెట్రోల్ బంకులు మూత పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కర్నూలుతోపాటు పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో నిల్వలు లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ, అధికార యంత్రాంగం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 132 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటికి సరాసరిగా రోజుకు లక్షన్నర లీటర్ల పెట్రోలు, లక్షన్నర లీటర్ల డీజిల్ సరఫరా జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ప్రస్తుతం రోజుకు పెట్రోల్ 90 వేల లీటర్లు, డీజిల్ 90 వేల లీటర్లు మాత్రమే సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు అయ్యే సరఫరాలో కర్నూలు, ఆదోని ప్రాంతాలకు ఎక్కువ కేటాయింపు ఉంది. అయితే రూరల్ ఏరియాల్లో రోజురోజుకు స్టాక్ ఖాళీ కావడంతో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, కర్నూలుతోపాటు పలు ప్రాంతాల్లో దాదాపు 50 బంకుల వరకు మూతపడ్డాయి. దీంతో ఆ ప్రాంత వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కోసం అగచాట్లు పడుతున్నారు. స్టాక్ ఉన్న బంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలవాల్సి వస్తోంది. వారం రోజులుగా నిలిచిన సరఫరా.. మూత పడిన బంకుల్లో ఎక్కువగా హెచ్‌పీ, ఐఓసీ పెట్రోల్ బంకులు ఉన్నాయి. వారం రోజులుగా కడప నుంచి హెచ్‌పీ పెట్రో ఉత్పత్తుల సరఫరా జరగడం లేదు. దీంతో మూడు రోజులుగా జిల్లాలోని పలు బంకులు మూతపడుతున్నాయి. ముఖ్యంగా ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, కర్నూలులో కూడా హెచ్‌పీ బంకులు మూతపడ్డాయి. మూతపడిన జాబితాలో ఐఓసీ బంకులు ఉన్నా వాటి సంఖ్య తక్కువగా ఉంది. పెట్రోల్, డీజిల్ సరఫరాలో జాప్యాన్ని ముందే పసిగట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతే లేదని చెబుతున్నా అధికారులు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అధిక విని యోగం వల్లే కొరత అంటూ దాట వేస్తున్నారనే విమర్శ లు ఉన్నాయి. రెండు, మూడు రోజుల్లో అవసరం మేరకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరగకపోతే మరికొన్ని పెట్రోల్ బంకులు మూత పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆయిల్ కంపెనీలతో మాట్లాడాల్సి ఉంది. లే దంటే ప్రజలు మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇబ్బంది లేకుండా చేస్తాం జిల్లాలో చాలా చోట్లా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. పత్తికొండ, ఆలూరు, కర్నూలులో మూతపడిన విషయాలు మా దృష్టికి రాలేదు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఎన్ని పెట్రోల్ బంకులు మూత పడ్డాయో వివరాలు తెప్పించుకుంటున్నాం. అససరం మేరకు పెట్రోల్ స్టాక్ ఉంది. అయితే ప్రజలే అవసరం కంటే ఎక్కువ గా వినియోగిస్తుండడంతోనే సమస్య ఉత్ప న్నం అవుతోంది. కాగా, మూతపడిన బంకుల కు రాత్రిలోపు పెట్రో ఉత్పత్తుల సరఫరా జరుగుతుంది. బుధవారం నుంచి ఇబ్బంది ఉండదు. – ఎం రాజారఘువీర్, డీఎస్ఓ, కర్నూలు స్టాక్ ఉన్న బంకుల్లో రద్దీ.. చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలుస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూత పడుతుండడంతో స్టాక్ ఉన్న బంకుల వద్దకు వాహనదారులు క్యూ కడుతున్నారు. పెట్రోల్ కొరత భయంతో వాహనదారులు పరుగులు పెడుతున్నారు. అక్కడ గంటల కొద్ది క్యూలో నిలుచుని పెట్రోల్, డీజిల్ తీసుకెళ్తున్నారు. ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండలలో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. -
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
లోకేష్ వేస్ట్.. క్లాస్ రూమ్ లో మందు.. మద్యానికి బానిసగా గురుకుల విద్యార్థులు
-
కర్నూలు రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం విచారకమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం మరో 13 మంది గాయపడటం, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. -
కర్నూలులో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
సాక్షి, కర్నూలు: జిల్లాలో గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం- రెడీమిక్స్ లారీ ఢీ కొట్టి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం ధాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. మరోవైపు లారీ కూడా ఓ పక్కకు ఒరిగి పడిపోయింది. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి, వాహన డ్రైవర్‌తో సహా మరో వ్యక్తి. గాయపడినవాళ్లలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పేర్లు.. కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షి. కర్ణాటక చిక్మంగళూరు వాసులుగా గుర్తించారు. మంత్రాలయ శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో బొలెరోలో 16 మంది ఉన్నారు. మృతదేహాలను ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. -
ఇల్లు కట్టాలంటే రూ.50 లక్షలు లంచం ఆదోని ఎమ్మెల్యే అవినీతి బాగోతం
-
పెళ్లింట తీవ్ర విషాదం : నలుగురు మృత్యువాత
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బందువుల పెళ్లికి వచ్చిన వారిని మృత్యువు కబళించింది. దీంతో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇల్లు ఒక్కసారిగా బంధువుల రోదనలతో విషాదంగా మారిపోయింది.కర్నూలు జిల్లాలోని కందుకూరు గ్రామానికి పెళ్లికి వచ్చారు కర్ణాటకకు చెందిన కొంతమంది బంధువులు. దాదాపు 15 మంది కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద స్నానానికి దిగారు. అయితే అనుకోకుండా వీరు ప్రమాదానికి గురైనారు. దీంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను కర్ణాటకలోని కురిడి గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. దాసరి శివాసనంద, దాసరి ఉమావతి, దాసరి రత్నమ్మ మహేష్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)
-
పశ్చిమాసియా యుద్ధం కారణంగా కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత
-
మంత్రి భరత్ అనుచరుల అరాచకం
కర్నూలు: మంత్రి టీజీ భరత్ అనుచరుల అరాచకాలు కర్నూలులో శృతిమించాయి. మద్యం మత్తులో మహిళా పోలీసు అధికారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాక అడ్డొచ్చిన ఆర్ఎస్ఐపై తిరగబడి వీరంగం సృష్టించిన ఘటన వెలుగుచూసింది. మంత్రి టీజీ భరత్ ముఖ్య అనుచరులు భీమిశెట్టి మనోజ్ కుమార్, వంశీ, సాయి ఈ నెల 11న రాత్రి టానిక్ వైన్స్‌లో బీర్లు కొని.. అక్కడి ఐదు రోడ్ల కూడలిలో రోడ్డుపైనే తాగి బాటిళ్లను పగలగొడుతుండగా అదే దారిలో స్కూటీపై వెళ్తున్న మహిళా ఎస్ఐ వారించారు. దీంతో వారు ఆమెపై దురుసుగా ప్రవర్తించారు.మద్యం మత్తులో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా అదే సమయంలో ఆర్ఎస్ఐ రమేష్ విధి నిర్వహణలో భాగంగా అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని ఆర్ఎస్ఐ వారిని దండించడంతో ఆయనపై తిరగబడి దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ఆర్ఎస్ఐ వెంటనే క్యూఆర్టీ, బ్లూ కోల్ట్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న మంత్రి అనుచరులు ముగ్గురునీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి తమదైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు.ఇందులో ఒకరు ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్మద్యం మత్తులో మహిళా ఎస్ఐ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మంత్రి అనుచరుడు భీమిశెట్టి మనోజ్ కుమార్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) స్టేట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇతను గతంలో టీడీపీ తరపున 44వ వార్డు కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మంత్రి అండతో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్తున్నాడు. ఉద్యోగులకు పోస్టింగులు, బదిలీల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నట్లు మనోజ్‌పై మంత్రికి గతంలో ఫిర్యాదులు కూడా అందాయి.నాలుగు నెలల క్రితం ఓ మహిళా అధికారికి కర్నూలు డీఎంహెచ్‌వో పోస్టింగ్ ఇప్పిస్తానని చెప్పి రూ.6 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇతనితోపాటు మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మరొకరు వైన్ షాపు నిర్వాహకులు, సాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ముగ్గురు కూడా మంత్రికి అత్యంత సన్నిహితులు కావడంతో కనీసం కేసు కూడా నమోదు చేయకుండా వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
కూలర్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం ఎగిసి పడుతున్న మంటలు
సాక్షి, కర్నూలు: వేసవి వచ్చింది లేదో అప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో వరుస పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా కర్నూల్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. కర్నూలు బాలాజీ నగర్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రెండుగ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. ఫలితంగా చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో తీవ్ర భయాందోళలను నెలకొన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఆస్థి నష్టం లక్షల్లో ఉంటుందని ప్రాథమిక అంచనా. ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియో -
రేషన్ బియ్యం మాఫియా ఘర్షణ కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు
-
Kurnool bus tragedy : ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
కర్నూలు సమీపంలోని జాతీయ రహదారి NH-44 పై జరిగిన భయానక బస్సు అగ్నిప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక చర్యలు ప్రారంభించింది. ఈ ఘటనలో 19 మంది అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, రహదారి భద్రతా అమలు లోపాలు, వాహన ఫిట్నెస్ తనిఖీల నిర్లక్ష్యం, రక్షణ చర్యల ఆలస్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ తమిళనాడు తెలుగు యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కెతిరెడ్డి జగదీశ్వర రెడ్డి గత ఏడాది అక్టోబరు10వ తేదీన NHRCకి ఫిర్యాదు సమర్పించారు.ఈ ఫిర్యాదును పరిశీలించిన మానవ హక్కుల కమిషన్ 30-01-2026న దీనిని గంభీర మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి కింది అధికారులకు నోటీసులు జారీ చేసింది. రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, భారత ప్రభుత్వంరవాణా కమిషనర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంసంబంధిత శాఖలు రెండు వారాల్లోగా చర్యల నివేదిక (Action Taken Report) సమర్పించాలని ఆదేశించింది.ఈ చర్యలు బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా సంస్కరణలకు దారితీస్తాయని రెడ్డి తెలిపారు. -
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్‌లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్‌లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా -
సీఎం చంద్రబాబుకు నిరసన సెగ
సాక్షి,కర్నూలు: సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పర్యటనలో విద్యార్థి సంఘాలు చంద్రబాబు కాన్వాయ్ ఎదుట నిరసన చేపట్టాయి. అధికారం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదంటూ ప్రశ్నించారు.సీఎం గోబ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘం నేతలను ఈడ్చిపడేశారు. అనంతరం, విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. -
ఓటుకు నోటు భయం.. రాయలసీమ లిఫ్ట్ తాకట్టు: సజ్జల
సాక్షి, కర్నూలు జిల్లా: పోతిరెడ్డి పాడు నిరసన ఆరంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. సీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారంటూ మండిపడ్డారు. ఇవాళ చలో పోతిరెడ్డిపాడుకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. సీమ లిఫ్ట్ పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. చలో పోతిరెడ్డిపాడుకు ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.ముందుగా వైఎస్సార్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పలువురు నేతలు పోతిరెడ్డిపాడును సందర్శించారు. అనంతరం పోతిరెడ్డిపాడు దగ్గర నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయలసీమ జిల్లాల నుంచి బహిరంగ సభకు రైతులు తరలివచ్చారు. ఈ సభలో వైఎస్సార్సీపీ సీమ జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు శైలజానాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి, విశ్వేశ్వరరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు మంగమ్మ శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, కంగాటి శ్రీదేవి, బుట్టా రేణుక పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతలను నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ప్రజానీకం కన్నెర్ర చేస్తోంది. ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని నినదిస్తోంది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న ‘జల’కంటక సర్కారుపై గళమెత్తి గర్జిస్తోంది. ‘తీరుమారకుంటే పతనం తప్పదు ఖబడ్దార్’ అంటూ హెచ్చరిస్తోంది. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నిజాలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు?. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేకపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు. తెలంగాణ మాదిరే రాయలసీమకు 800 అడుగుల స్థాయిలోనే శ్రీశైలం నీరు రావాలి. చంద్రబాబుకు ఓటుకు నోటు భయం ఉంది. హైదరాబాద్‌లో ఆస్తులను కాపాడుకునేందుకు రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే కారణంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దారుణం. రైతులకు సమృద్ధిగా నీరందిస్తేనే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ ఏనాడో గుర్తించారు. సీమ తాగు సాగు నీటి కష్టాలకు ఏకైక పరిష్కారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడమే. 80 శాతం పూర్తయిన ప్రాజెక్టును ఆపేయడం మహాపాపం అని చంద్రబాబు గుర్తించాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబుకు రాయలసీమ ప్రయోజనాలు పట్టవు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్‌కు తాకట్టు పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల్లోనే తెలంగాణ తీసుకుంటూ ఉంటే రాయలసీమ ఎందుకు తీసుకోకూడదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఇప్పుడు అర్ధాంతరంగా పనులు నిలిపివేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ సుభిక్షంగా ఉందంటే అది ఒక్క వైఎస్సార్ వలనే.. రాయలసీమ ప్రజలు నిత్యం సుభిక్షంగా ఉండాలని వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకువచ్చారన్నారు. రేవంత్ రెడ్డి మాటలు విని చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపారని సతీష్‌రెడ్డి మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగలేదు. కరువు సమయంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వైఎస్ జగన్ తెచ్చిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు అపాల్సి వచ్చింది?. రేవంత్ మాటలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు సమాధానం చెప్పాలి. జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎంఎస్‌ఎస్‌కి పిడికెడు మట్టి తీయలేదు. రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. రాయలసీమ రైతులపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోంది. పోతిరెడ్డిపాడు నిరసన ఆరంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉదృతం చేస్తాం’’ అని సతీష్‌రెడ్డి హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఏనాడు రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమకు వచ్చిన ఎయిమ్స్, హైకోర్టు తరలించుకు పోయారు.శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టాడన్నారు. రాయలసీమ ద్రోహిగా చరిత్రలో చంద్రబాబు మిగిలి పోతారన్నారు. రాయలసీమకు మేలు చేసిన ఏకైక కుటుంబం వైఎస్సార్ మాత్రమే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయాలని వైఎస్ జగన్ శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాలి. సీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించాలి. -
ఏపీలో మరో బస్సు ప్రమాదం.. అదుపు తప్పి..
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఇవాళ(మంగళవారం) తెల్లవారుజామున కర్నూలు శివారు రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కె.కావేరి ట్రావెల్స్ బస్సు.. డివైడర్‌ను ఢీకొట్టింది. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరగ్గా.. ఈ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారుబస్సు మితిమీరిన వేగంతో రాంగ్ రూట్లోకి దూసుకుపోయింది. అదే సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మరో బస్సులో ప్రయాణీకులను తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. -
ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఎక్కించిన యువతి
-
కంపెనీ ఇక్కడ పెట్టి ఉద్యోగాలు ఎవరికో ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు
-
Kurnool : యాక్సిడెంట్ కేసులో యువకులను చితకబాదిన SI శ్రీనివాస్
-
రాతివనం.. అపురూపం
-
మీ హద్దు ఇదే.. దళిత అధికారిణి ని అడ్డుకున్న పూజారి
-
Kurnool : పిచ్చి పిచ్చి డిబేట్ పెడితే.. ఎల్లో మీడియాకు ఇచ్చిపడేసిన మహిళలు
-
ఒకరు, ఇద్దరు కాదు.. ఐదుగురు
కర్నూలు జిల్లా: ప్రమాదాల నివారణకు అధికారులు ఓ వైపు రోడ్డు భద్రతా వారోత్సవాలు అంటూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా వాహనదారుల్లో కొంతైనా మార్పు రావడం లేదు. అందుబాటులో రవాణా సౌకర్యాలు సరిగా లేకనో.. త్వరగా చేరుకోవాలనో పలువురు ప్రాణాలకు తెగించి ప్రయాణం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం గోనెగండ్ల బస్టాండ్ వద్ద బైక్‌పై వెళ్తున్న వారని చూస్తే వామ్మో అనాల్సిందే. బైక్ నడుపుతున్న వ్యక్తికి అసలే హెల్మెట్ లేదు.. ఆపై బైక్‌పై ఐదుగురు. అందులో ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోజూ పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుని మరణాలు సంభవిస్తున్నా వాహనదారులకు కనువిప్పు కలగడం లేదు. -
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో YSRCP నేతలు
-
కర్నూలు జిల్లా గోనెగండ్లలో జాయింట్ కలెక్టర్ ను అడ్డుకున్న రైతులు
-
‘14 నెలలకే నూరేళ్లు నిండాయా నాయనా’..
నంద్యాల జిల్లా: బుడి బుడి అడుగుల చప్పుళ్లు ఆగిపోయాయి.. బోసి నవ్వులు మాయమయ్యాయి. నాలుగు నెలల క్రితం జరిగిన మొదటి పుట్టిన రోజు వేడుకల సందడిని కుటుంబీకులు ఇంకా మరువక ముందే విధి ఆ చిన్నారిని వారికి దూరం చేసింది. ఊహించని ఘటన ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. అప్పటి వరకు కుటుంబీకుల మధ్య ఆడుకుంటున్న చిన్నారిని క్షణాల్లో మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబళించింది. నెహ్రూనగర్‌లో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. 14 నెలల వయస్సున్న బాలుడు ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గొడుగు శంకరయ్య, లావణ్యకు రెండేళ్ల క్రితం పెళ్లైంది. వీరి కుమారుడు గొడుగు చేతన్ (14 నెలలు) ఉన్నాడు. నాలుగు నెలల క్రితమే మొదటి పుట్టిన రోజు వేడుకలను బంధువుల మధ్య ఆర్భాటంగా నిర్వహించారు. శంకరయ్య ఇంటి సమీపంలోనే గొడుగు వెంకటేశ్వర్లు గృహ నిర్మాణం చేపట్టాడు. సిమెంట్ ఇటుకలను ఆదివారం ఉదయం కర్నూలు నుంచి తెప్పించాడు. అన్లోడ్ అనంతరం ట్రాక్టర్.. శంకరయ్య ఇంటి మీదుగా వెళ్తుండగా ఇంట్లో నుంచి చిన్నారి చేతన్ హఠాత్తుగా రోడ్డు పైకి పరుగెడుతూ వచ్చి ట్రాలీ టైరు కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో బాలుడి తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ముచ్చుమర్రి ఎస్ఐ నరేంద్ర నెహ్రూనగర్ చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాలుడి తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ మహబూబ్ బాషా పై కేసు నమోదు చేశారు. ‘14 నెలలకే నూరేళ్లు నిండాయా నాయనా’.. అంటూ కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు బంధువులు, గ్రామస్తులను కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. -
Kurnool Road Incident: వైయస్ జగన్ దిగ్భ్రాంతి
-
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
-
AP: ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి దుర్మరణం
కర్నూల్: జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తెలిసిందే. గత రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు, బస్సు ప్రమాదాలు తీవ్రంగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24న జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇదొక పెద్ద విషాదం. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా పలు రోడ్డు ప్రమాదాలు నమోదై, అనేక ప్రాణనష్టం జరిగింది.గత నెలలో హైదరాబాద్–బెంగళూరు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగింంది. బైక్‌ను ఢీకొట్టిన బస్సులో మంటలు వ్యాపించి క్షణాల్లో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. 2025లో ఇప్పటివరకు): 15,462 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అత్యధిక శాతం ప్రమాదాలకు ఓవర్ స్పీడింగ్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. కార్లు, బస్సులు, బైక్‌లు నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధిక ప్రమాదాలు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. కాగా, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో శామీర్‌పేట వద్ద ఓఆర్ఆర్పై కారు అగ్నికి ఆహుతైంది. కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. డ్రైవర్ తేరుకునేలోపే కారును మంటలు చుట్టుముట్టడంతో ఇక తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. కీసర వెళ్తండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ఏసీవేసుకుని పడుకున్న సమయంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఇదిలా ఉంచితే, ఈ నెలలోనే సంగారెడ్డి ఓఆర్ఆర్పై ఒక కారు అగ్ని ప్రమాదం బారిన పడింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు కానీ కారు అగ్నికి ఆహుతైంది. గత నెలలో పఠాన్‌చెరువు సమీపంలో ముతంగి ఓఆర్ఆర్పై ఓ కారులో మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఎవరూ కూడా ప్రమాదం బారిన పడకుండా తప్పించుకున్నారు.ఓఆర్ఆర్పై ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే 14449 నెంబరుకు కాల్ చేయవచ్చు. ప్రమాదాలు కానీ, వాహనాల బ్రేక్‌డౌన్, పెట్రోలు, డీజిల్ ఖాళీ అయినా, పంక్చర్లు అయినా ఈ నెంబరుకు కాల్ చేస్తే సాయం అందుతుంది. ఇది కాకుండా పోలీసుల హెల్్పలైన్ 100, ఆంబులెన్స్ కోసం 108, అగ్ని ప్రమాదాల సందర్భంలో 101కు కాల్ చేసి సాయం అందుకోవచ్చు.కార్లు అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణాలు..ఓఆర్ఆర్పై వేగంగా డ్రైవ్ చేయడం కూడా కార్లు తరుచు ప్రమాదంబారిన పడటానికి ప్రధాన కారణం. కార్లను అత్యంత వేగంగా, ఓఆర్ఆర్పై నిర్దేశించిన వేగం కంటే కారును నడుపుతున్న సందర్భాల్లో ఇంజిన్ ఓవర్‌హీట్ అవుతూ ఉంటుంది. దాంతో కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఆయిల్ లీక్ అంశం కూడా కార్లు తొందరగా అగ్నికి ఆహుతి కావడానికి మరో కారణం. ఇక ఎలక్ట్రికల్ లోపాలతో కూడా కార్లు అగ్ని ప్రమాదం బారిన పడుతున్నాయి.ఓఆర్ఆర్పై ఏదైనా కారు ప్రమాదానికి గురైనప్పుడు అగ్ని మాపక వంటి సహాయక చర్యలు చేపట్టడం ఆలస్యం అవుతుంది. ఓఆర్ఆర్ పై ప్రమాదం సమాచారం అందుకున్న తర్వాత స్పాట్‌కు ఎమర్జెన్సీ సర్వీసులు చేరుకోవడం అత్యంత కష్టంతో కూడుకున్నదిగా మారింది. గ ఓఆర్ఆర్పై కార్లు అగ్ని ప్రమాదం బారినపడ్డప్పుడు ఎమర్జెన్సీ సర్వీసులు సరైన సమయానికి రావడం అనేది ఏవో కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది.డ్రైవర్లు ఇలా చేస్తే..రెగ్యులర్‌గా కార్లను చెక్ చేయడం అనేది డ్రైవర్లు పనిగా పెట్టుకోవాలి. వాహనం ఎలక్రికల్ వైరింగ్,ఆయిల్ ట్యాంక్, టైర్లు వంటి రెగ్యులర్ాగా జరిగేప్రాసెస్గా ఉండాలిఓఆర్ఆర్పై ాకార్లను పార్కింగ్ చేయడం అనేది మానేయాలి. ఓఆర్ఆర్ై వాహనాలను నిలిపి ఉంచడం అనేది నిషిద్ధమే కాదు.. ప్రమాదం కూడా .కారు నుంచి పొగలు రావడం గమనిస్తే వెంటనే నిలిపివేయాలి. వెంటనే కారు నుంచి దిగిపోవాలి. -
ఢిల్లీ పేలుడు..చిన్న పోస్టర్‌తో.. జైషే కుట్రపై గర్జించిన తెలుగు సింహం!
న్యూఢిల్లీ: భారత్‌లో భారీ ఉగ్రహింసకు స్కెచ్ వేసిన జైషే మహ్మద్ ఉగ్రకుట్రను ఓ చిన్న పోస్టర్ ద్వారా భగ్నం చేయడం విశేషం. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు వ్యూహరచన చేసిన జైషే మహ్మద్ పోస్టర్లను నెల క్రితమే ఓ పోలీసు అధికారి గుర్తించి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఫలితంగా దేశాన్ని పెను విధ్వంసం నుంచి కాపాడగలిగారు. ఈ ఘనత సాధించిన అధికారి మన తెలుగువారే కావడం గర్వకారణం.తెలుగు ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి, జైషే మహ్మద్ కుట్రను ఛేదించి తన శౌర్యాన్ని చాటారు. ఇప్పటికే ఆరు సార్లు రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకం అందుకున్న ఆయన, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. ఇది ఆయనకు ఆరో అవార్డు కావడం విశేషం.పోస్టర్‌తో బండారం బట్టబయలు 2019 వరకు కాశ్మీర్లో ఉగ్రసంస్థలు సైనిక అధికారులను బెదిరిస్తూ పోస్టర్లు వేయడం సాధారణంగా జరిగేది. కానీ ఆర్మీ అప్రమత్తతతో ఆ కార్యకలాపాలు తగ్గాయి. అయితే, గత నెలలో శ్రీనగర్‌లో రహస్యంగా తరలిస్తున్న జైషే మహ్మద్ పోస్టర్లను ఐపీఎస్ సందీప్ గమనించారు. వెంటనే సీసీటీవీ ఫుటేజీ తెప్పించి, ముగ్గురు యువకులు పోస్టర్లు తరలిస్తున్న దృశ్యాలను గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి విచారించగా, షోపియాన్‌కు చెందిన మత గురువు ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఆధ్వర్యంలో జైషే కుట్ర జరుగుతున్నట్లు వెల్లడైంది.ఉగ్రవాదుల అరెస్టు..పేలుడు పదార్థాల స్వాధీనం విచారణలో జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు స్కెచ్ వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఫరిదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో డాక్టర్లుగా పనిచేస్తున్న ముజమ్మీల్ షకీల్, అదీల్ అహ్మద్, లక్నోకు చెందిన షాహీన్ సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2900 కిలోల పేలుడు పదార్థాలు, అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్, అలాగే రెండు AK-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. పుల్వామాకు చెందిన మరో డాక్టర్ ఉమర్ పరారీలో ఉండగా, అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.సందీప్ చక్రవర్తి ప్రస్థానం కర్నూలులో జన్మించిన సందీప్ చక్రవర్తి, మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించి, మెడిసిన్ పట్టభద్రులయ్యారు. అనంతరం సివిల్స్‌లో ర్యాంకు సాధించి 2014లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం శ్రీనగర్‌లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) గా సేవలందిస్తున్నారు. పూంచ్ ఏఎస్పీగా తన సర్వీసు ప్రారంభించిన ఆయన, హంద్వారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్, శ్రీనగర్ సౌత్ జోన్, బారాముల్లా వంటి కీలక ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించారు.ఆరు రాష్ట్రపతి శౌర్య పతకాలుసందీప్ ఇప్పటివరకు ఆరు రాష్ట్రపతి శౌర్య పతకాలు, నాలుగు జమ్మూ అండ్ కశ్మీర్ గ్యాలంట్రీ మెడల్స్, ఇండియన్ ఆర్మీ చీఫ్ కమెండేషన్ డిస్క్ సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ముగ్గురు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆపరేషన్ మహదేవ్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. -
YSRCP Leaders: బాబు అరాచక పాలన ఎలా ఉందంటే.... ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో..
-
బాల్యానికి మూడు 'ముల్లు'
కర్నూలు(హాస్పిటల్): పేదరికం, నిరక్షరాస్యత, బాలికల ఎదుగుదలపై ఆందోళన, అభద్రతాభావం వంటి కారణాలతో కర్నూలు జిల్లాలో బాల్యవివాహాలు అధికమవుతున్నాయి. ఇందులో అధికారులు కొన్ని మాత్రమే అడ్డుకుంటుండగా అధిక శాతం గుట్టుచప్పుడు కాకుండా, ఆధార్‌కార్డులో వయస్సు మార్చి వివాహ తంతు జరిపించేస్తున్నారు. వీటిలో అధికశాతం గ్రామ పెద్దల సహకారంతోనే జరుగుతున్నా అడిగే నాథుడు కరువయ్యారు. బిడ్డకు మూడుముళ్లు పడితే భారం తగ్గిపోతుందన్న భావనతో గ్రామాల్లో కూతురు పుష్పవతి అయితే చాలు ఏ అయ్యకు కట్టబెడదామా అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఈ కారణంగా బాలికల చదువు మధ్యలోనే ఆగిపోతూ వారి భవిష్యత్ నాశనమవుతోంది. మరోవైపు చిన్నవయస్సులో గర్భవతి కావడంతో ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 4,754 మంది బాలికలు తల్లులు జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 38,779 మంది గర్భం దాల్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. అందులో 19 ఏళ్లలోపు బాలికలు 4,754 మంది ఉన్నారు. వీరిలో కర్నూలు డివిజన్లో 10.27శాతం, ఆదోని డివిజన్లో 12.75శాతం, పత్తికొండ డివిజన్లో అధికంగా 15.04శాతం మంది గర్భం దాల్చారు. జిల్లాలో 10 నెలల కాలంలో జరిగిన మొత్తం వివాహాల్లో 16 ఏళ్లకు 814 (21.5శాతం), 17 ఏళ్లకు 888(23.6శాతం), 18 ఏళ్లకు 1,237(32.8శాతం), 19 ఏళ్లకు 595(15.8శాతం) వివాహం చేసుకున్నారు. 19 ఏళ్లకు పైగా కేవలం 236 మంది అమ్మాయిలు మాత్రమే వివాహం చేసుకున్నారు. అది కూడా కర్నూలు నగరంలాంటి చోట్ల మాత్రమే వివాహ వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తున్నారు. గ్రామాల్లో వివాహ వయస్సు చూపించేందుకు అధిక శాతం ఆధార్‌కార్డులో 63.4 శాతం మంది వయస్సును తప్పుగా నమోదు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చదువుకూ అమ్మాయి దూరం ఆదోని, పత్తికొండ డివిజన్లలో ఆడపిల్లలు ఎక్కువగా చదువుకునేందుకు ఇష్టపడటం లేదు. అమ్మాయిని చదువుకోసం దూరంగా పంపించేందుకు భయపడటం, అభద్రతభావం, సామాజిక పరిస్థితులతో మధ్యలోనే చదువు మాన్పించేస్తున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేక 1,614(44.4శాతం) మంది, ఆర్థిక కారణాలతో 1,473(36.6శాతం) మంది, మిగిలిన వారు కుటుంబసమస్యలతో ఏడుగురు, సామాజిక రుగ్మతలతో 105 మంది, తల్లిదండ్రుల ఒత్తిడితో 388 మంది, మరికొందరు ప్రేమవివాహాల కారణంగా బా లికలు మధ్యలోనే చదువు మానేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా జరిగిన వివాహాల్లో అధికంగా 89.1శాతం పెద్దలు కుదుర్చిన వివాహాలు కాగా దాని తర్వాతి స్థానంలో 8.4శాతం మంది తమకు నిచ్చిన వారిని ప్రేమవివాహాలు చేసుకున్నారు. కమిటీలు ఉన్నా చర్యలు నామమాత్రమే! జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీని అరికట్టేందుకు జిల్లా స్థాయి, డివిజన్ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. జిల్లా›స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్/చైర్పర్సన్ కాగా, కన్వినర్‌గా జిల్లా ఎస్పీ, డీఎంహెచ్ఓ, సభ్యులుగా గైనకాలజీ హెచ్ఓడీ, ఐసీడీఎస్ అధికారి, డీఈఓ, ఆర్ఐఓ, డివిజన్ స్థాయిలో చైర్మన్/చైర్‌పర్సన్‌గా ఆర్డీఓ, కన్వినర్‌గా డిప్యూటీ డీఎంహెచ్ఓ, సభ్యులుగా స్థానిక డీఎస్పీ ఉంటారు. ఈ కమిటిలు బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పాఠశాలలకు కౌమారదశ బాలికలకు పునరుత్పత్తి ఆరోగ్యం, న్యాయపరమైన హక్కులు, లైఫ్ స్కిల్స్ గురించి వివరించారు. బాల్యవివాహాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. కౌమార దశ బాలికలకు వచ్చే సమస్యలపై ఆరోగ్యశిబిరాలు నిర్వహించాలి. కానీ అధికారులు మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. గ్రామాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నా చర్యలు కరువయ్యాయి. ఆదోని, పత్తికొండ డివిజన్లలో అధికంగర్భం దాల్చే వారిలో నిరక్షరాస్యులైన బాలికలే అధికంగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 10 నెలల్లో నమోదైన గర్భిణుల్లో ఐదవ తరగతి వరకు చదివిన వారు 23.5శాతం, పది ఫెయిలైన వారు 18.8శాతం, 6 లేదా 7వ తరగతి చదివిన వారు 14.7శాతం, 8 లేదా 9వ తరగతి చదివిన వారు 13.8శాతం మంది ఉన్నారు. ఆదోని, పత్తికొండ డివిజన్లలో అధికంగా అక్షరాస్యత తక్కువగా ఉంటోంది. దీనికి తోడు పేదరికం, వర్షపాతం తక్కువగా ఉండటం, ఫలితంగా పంటలు సరిగ్గా పండకపోవడం, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం, అమ్మాయిల భద్రత గురించి ఆందోళన, సామాజికపరమైన అంశాలు వంటి కారణాలతో బాల్యవివాహాలు అధికంగా జరుగుతున్నాయి. పుష్పవతి అయిన బాలికలను ఒకరికిచ్చి పెళ్లి జరిపిస్తే తమ బాధ్యత తీరిపోతుందని నమ్మే వారు అధికంగా ఉన్నారు. చెడు వ్యసనాల కారణంగా భార్య లేదా భర్త మరణించడంతో ఒంటరివారైన పిల్లల వివాహాలు కూడా త్వరగా జరిపించేస్తున్నారు. ఇందులో అమ్మాయిల అవ్వాతాతలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ... ఆదోని పట్టణంలోని పట్టణంలోని ఇందిరానగర్‌లో బాల్య వివాహాన్ని టూటౌన్ పోలీసులు అడ్డగించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్యవివాహాలతో జరిగే నష్టాలను వివరించారు. కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఏం చేయాలి..అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండే వరకు ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయరాదు. బాల్య వివాహాలు చేసే వారి గురించి చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, పోలీసు హెల్ప్‌లైన్ 100, ఉమెన్ హెల్ప్‌లైన్ 181 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం చిన్న వయస్సులో గర్భం దాలిస్తే బాలికకు రక్తహీనత ఏర్పడటం, కడుపులో బిడ్డ సరిగ్గా ఎదగకపోవడం, అబార్షన్లు జరుగుతాయి. అమ్మాయికి పెల్విన్బోరాన్ వృద్ధి చెందక ముందే వివాహం చేయడం వల్ల వారికి ప్రసవం కష్టమై సిజేరియన్ చేయాల్సి వస్తుంది. బీపీ, ఫిట్స్, నెలలు నిండకముందే బిడ్డ జన్మించడం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొన్నిసార్లు అవిటితనం ఉన్న పిల్లలు జన్మించే అవకాశం ఉంది. –డాక్టర్ ఎస్.సావిత్రి, గైనకాలజీ హెచ్‌వోడీ, కర్నూలు పెద్దాసుపత్రి అనారోగ్య సమస్యలు బాల్య వివాహాలతో చాలా మంది కౌమార దశ పూర్తి గాకుండానే గర్భం దాలుస్తున్నారు. ఈ కారణంగా వారికి నెలలు నిండకుండా శిశువు జన్మించడం, సరైన సమయంలో జన్మించినా బరువు తక్కువగా ఉండటం జరుగుతుంది. ఇలాంటి పిల్లలకు బుద్ధిమాంద్యం, చురుకుగా లేకపోవడం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. తల్లులకు ప్రసవం తర్వాత తల్లిపాలు సరిగ్గా పడవు. దీంతో శిశువులు పలుమార్లు ఇన్ఫెక్షన్లకు గురై అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. – డాక్టర్ అమరనాథరెడ్డి, చిన్నపిల్లల వైద్యుడు, కర్నూలుటీనేజీ ప్రెగ్నెన్సీపై అవగాహన కార్యక్రమాలు జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా ఐసీడీఎస్ శాఖతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నాయని తెలిస్తే స్థానిక పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బందితో కలిసి వెళ్లి పెళ్లి జరగకుండా చూస్తున్నాం. అప్పటికే వివాహం జరిగి ఉంటే ఆమె టీనేజీలో గర్భం దాల్చకుండా ఆరోగ్య సిబ్బందిచే అవగాహన కల్పిస్తున్నాం. టీనేజీలో గర్భం దాల్చడం వల్ల వచ్చే దుష్పరిణాల గురించి బాలికలకు, వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. –డాక్టర్ ఎల్.భాస్కర్, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ -
కర్నూలు కిమ్స్ వైద్యుల అరుదైన చికిత్స.. యువతికి రిలీఫ్
కర్నూలు, సాక్షి: గర్భాశయంలో ఫైబ్రాయిడ్ ఏర్పడడంతో పాతికేళ్ల వయసులోనే బేతంచర్లకు చెందిన ఓ యువతికి హిస్టరెక్టమీ (గర్బాశయ తొలగింపు) శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఫైబ్రాయిడ్ కారణంగా ఆమెకు తరచు రక్తస్రావం అవుతుండటంతో ఆ శస్త్రచికిత్స తప్పలేదు. అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో దానికి కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలిపారు. అయితే, హిస్టరెక్టమీ చేసిన తర్వాత ఆమెకు తరచు మూత్రం లీక్ అవ్వడం మొదలైంది. దీనివల్ల ఆమె ఎక్కడకూ బయటకు వెళ్లలేకపోవడం, తరచు దుర్వాసనతో శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ వై.మనోజ్ కుమార్ ఆమెకు ఒక సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి, పూర్తి ఊరట కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు.“నంద్యాల జిల్లా బేతంచర్లకు చెందిన పాతికేళ్ల యువతికి తప్పనిసరి పరిస్థితిలో హిస్టరెక్టమీ చేయాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాతి నుంచి ఆమెకు మూత్రం లీక్ అవుతుండడంతో మా వద్దకు వచ్చారు. ఇక్కడ ఆమెకు సీటీ సిస్టోగ్రఫీ లాంటి కొన్ని పరీక్షలు చేస్తే.. ఆమెకు మూడు వెసికోవెజైనల్ ఫిస్టులాలు ఏర్పడ్డాయని తెలిసింది. ఇవి మూత్రకోశానికి, యోనికి మధ్యన ఏర్పడతాయి. శస్త్రచికిత్స కారణంగా ఏర్పడిన ఈ ఫిస్టులాల వల్లే ఆమెకు మూత్రం లీక్ అయ్యే సమస్య తలెత్తింది. ఇలా జరగడం వల్ల రోగులు సమాజానికి, తమ కుటుంబసభ్యులకు కూడా దూరమై, క్రమంగా ఆత్మవిశ్వాసం కోల్పోతారు. బయటకు రావడానికి ఇబ్బంది పడతారు.ఈ కేసు సంక్లిష్టమైనది. ఎందుకంటే మూడింటిలో ఒక ఫిస్టులా మూత్రనాళానికి చాలా దగ్గరగా ఉంది. అందువల్ల దాని మరమ్మతును అత్యంత జాగ్రత్తగా, కచ్చితత్వంతో చేయాల్సి ఉంటుంది. దానికితోడు మొదటి శస్త్రచికిత్స జరిగిన తర్వాత కణజాలాలు స్థిరపడేందుకు కనీసం మూడు నెలలు ఆగాల్సి ఉంటుంది. వాళ్లు రెండు నెలల తర్వాత మా వద్దకు వచ్చారు. దాంతో మరో నెలరోజులు ఆగమని చెప్పి, ఆ తర్వాత శస్త్రచికిత్స చేపట్టాం. ఈ శస్త్రచికిత్సలో మూత్రాశయాన్ని, యోనిని వేరు చేసి, దెబ్బతిన్న భాగాలను శుభ్రపరచి, కొత్త పొరలతో పునర్నిర్మాణం చేశాం. అత్యంత కచ్చితత్వం, జాగ్రత్తలతో మూడు ఫిస్టులాలనూ మూసేశాం. శస్త్రచికిత్స తర్వాత రోగి బాగా కోలుకున్నారు. మొత్తం క్యాథెటర్లు, ట్యూబులు కూడా తీసేసి ఆమెను డిశ్చార్జి చేశాం. ఇప్పుడు మూత్రం లీకేజి లేకపోవడంతో ఆమెకు పూర్తి ఆత్మవిశ్వాసం వచ్చింది. ఇంతకుముందు కంటే ఎంతో సంతోషంగా ఉన్నారు.వెసికో వెజైనల్ ఫిస్టులా అనేది మహిళల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే సమస్య. ఇది కేవలం శారీరక సమస్య కాదు, సామాజిక అవరోధం కూడా. సమయానికి గుర్తించి సరైన చికిత్స చేస్తే పూర్తిగా నయం అవుతుంది. ఈ రోగి మళ్లీ సాధారణ జీవితానికి రావడం మా మొత్తం బృందానికి గొప్ప సంతృప్తినిచ్చింది” అని డాక్టర్ వై. మనోజ్ కుమార్ వివరించారు. -
కర్నూలు ఘటన: ‘ఈ దుఖం నాతోనే ఉండిపోవాలి’
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన బస్సులో కరిగి ముద్దగా మారిన మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఏమని చెప్పాలి.. వారికి ఈ శరీరాన్ని ఎలా చూపాలి.. చూపితే వారు తట్టుకోగలరా.. ఇంతటి దుఃఖం మాతోనే ముగిసిపోనీ.. కర్నూలులోనే కుమారునికి అంత్యక్రియలు చేస్తాం’ అని ఆ తండ్రి బోరున విలపిస్తూ భావోద్వేగంతో చెప్పిన మాటలు కంటతడి పెట్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు.వీరిలో తమిళనాడులోని ధర్మపురం జిల్లా పాలక్కాడ్ తాలూకా మాదగేరి గ్రామానికి చెందిన రాజన్ మారప్పన్ కుమారుడు ప్రశాంత్ (29) కూడా ఉన్నాడు. ఇతను హైదరాబాద్‌లో చిప్స్ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు. అతడికి ఏడాదిన్నర క్రితమే వివాహం కాగా.. ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. స్వస్థలానికి వెళ్లి భార్యాపిల్లలను చూసేందుకు గురువారం రాత్రి హైదరాబాద్‌లో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు కర్నూలు దాటగానే మంటల్లో కాలిపోయింది. ఇందులో ప్రశాంత్ సజీవదహనయ్యారు. సోమవారం తమిళనాడుకు చెందిన ప్రశాంత్ మృతదేహానికి కూడా కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు అధికారులను కోరారు. కర్నూలు నుంచి 800 కి.మీ. దూరంలో ఉన్న మాదగేరికి వెళ్లాలంటే రెండు రోజుల సమయం పడుతుందని.. మరణించి ఇప్పటికే మూడు రోజుల సమయం దాటిందని, ఇప్పుడు స్వగ్రామానికి వెళ్లేలోపు ఐదు రోజులు పూర్తవుతుందని తండ్రి రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కాలిపోయిన మాంసం ముద్దగా మారిన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు చూపించి వారిని మరింత క్షోభకు గురిచేయలేమని, కేవలం అస్థికలు మాత్రమే తీసుకెళ్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సద్గురుదత్త కృపాలయం గ్యాస్ క్రిమేషన్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించి అస్థికల్ని అందజేశారు. వాటిని ప్రశాంత్ తండ్రి రాజన్ మారప్పన్తో పాటు సోదరుడు మణి, స్నేహితులు తీసుకెళ్లారు. -
భగవంతుడా.. మాకే ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావయ్యా..
వింజమూరు (ఉదయగిరి): ‘కడసారిది వీడ్కోలు.. కన్నీటితో మా చేవ్రాలు.. కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది’ అంటూ కుటుంబ సభ్యులు, బంధువుల రోదనల మధ్య ఊరంతా తరలివచ్చి.. కర్నూలులో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో సజీవ దహనమైన గోళ్ల రమేష్, భార్య అనూష, ఇద్దరు పిల్లలు మన్విత, శశాంక్ అంత్యక్రియలు సోమవారం గోళ్లవారిపల్లిలో విషణ్ణ వదనాల మధ్య నిర్వహించారు. భగవంతుడా.. మాకే ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావయ్యా.. మేము చేసిన పాపం ఏమిటీ? కనికరం లేదా ఆ బిడ్డలైనా బతికించకూడదా అంటూ మృతుల బంధువులు రోదించడం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యమయ్యారు. అగ్ని కీలల్లో చిక్కొని బొగ్గులైన మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరూ పగ వారికి కూడా ఇంత కష్టం రాకూడదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్ , భార్య, బిడ్డలకు డీఏన్ఏ టెస్ట్‌లు నిర్వహించి ఆదివారం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. రాత్రికి గోళ్లవారిపల్లికి ప్రత్యేక అంబులెన్స్‌ల ద్వారా చేర్చారు. సోమవారం ఉదయం అంతమయాత్ర నిర్వహించారు.ఆ కుటుంబాలను ఆదుకుంటాంఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ బాఽధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకొంటామని తెలిపారు. ఇప్పటికే టీడీపీ తరఫున రూ.10 లక్షలు వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి రూ.5 లక్షలు, కాకర్ల ట్రస్టు తరఫున తాను రూ.3 లక్షలు, స్వర్ణభారతి ట్రస్టు వారు రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షలు వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బస్సుకు సంబంధించి బీమాతో పాటు మరికొంత సహాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గూడా నర్సారెడ్డి, జూపల్లి రాజారావు, ఎంపీపీ మోహన్‌రెడ్డి, బండారు సత్యనారాయణ, మాజీ ఎంఈఓ జి.ఓబులరెడ్డి, కలిగిరి సీఐ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
24X7 మద్యం.. ఊరూరా సాక్ష్యం!
-
కర్నూలు బస్సు ప్రమాదం.. రమేష్ కుటుంబాన్ని వెంటాడుతున్న ప్రమాదాలు
సాక్షి,అమరావతి: హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు(డీడీ 01ఎన్9490) శుక్రవారం తెల్లవారు జామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన గోళ్ల రమేష్(31) కుటుంబాన్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి.సోమవారం కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన రమేష్ కుటుంబసభ్యుల అంత్యక్రియల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా వారి కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో రమేష్ కుటుంబసభ్యుల ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వింజమూరు (మం) గోళ్ళవారి పల్లి నుండి విజయవాడ వెళ్తుండగా కారు టైర్ పంచర్ కావడంతో కల్వర్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితుడు.. ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన గుణసాయి అనే ప్రయాణికుడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోలుకుంటున్నాడు. మచిలీపట్నంకు చెందిన ఈయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు రావడంతో ఆ పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యాయి. దీంతో అతన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరి్పంచారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్‌ఐసీయులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. శనివారం వరకు విషమంగా ఉన్న అతని ఆరోగ్యం వైద్యుల కృషి ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడింది. ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి.. బస్సు ప్రమాదంలో కీలక సాక్షిగా ఉన్న ఎర్రిస్వామి శనివారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో కడుపునొప్పితో చేరాడు. బైక్ నుంచి అతను కింద పడటంతో కడుపు వద్ద గీరుకుపోయింది. దీనికితోడు పలుచోట్ల నొప్పులు ఉండటంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేరి్పంచారు. అతనికి అ్రల్టాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసిన వైద్యులు.. లోపల ఎలాంటి గాయాల్లేవని నిర్ధారించారు. మరికొన్ని పరీక్షలు చేసి కోలుకుంటే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిసింది.స్వగ్రామానికి చేరిన తల్లీకుమార్తె మృతదేహాలుమరోవైపు.. బస్సు ఘటనలో సజీవ దహనమైన తల్లీకుమార్తె మృతదేహాలు ఆదివారం అర్ధరాత్రి స్వస్థలానికి చేరుకున్నాయి. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం శుక్రవారం రాత్రి సంధ్యారాణి తల్లి, చందన తండ్రి నుంచి నమూనాలు సేకరించగా, ఆదివారం ఉదయం ఫలితాలు రావడంతో అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు కర్నూలుకు వెళ్లారు. సాయంత్రం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మెదక్ మండలం శివాయిపల్లికి తరలించారు. వాటిని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. -
వేమూరి కావేరి బస్సు ప్రమాదంపై రెండు ఎఫ్ఐఆర్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కావేరి బస్సు ప్రమాద ఘటనపై చిక్కుముడి వీడింది. బైక్, బస్సు ప్రమాదం ఒకటి కాదని.. రెండు వేర్వేరు ప్రమాదాలని పోలీసులు తేల్చారు. బైకర్స్ మద్యం సేవించి లక్ష్మీపురం నుంచి బయలుదేరగా చిన్నటేకూరు దాటిన తర్వాత వారి బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శివశంకర్ అక్కడికక్కడే మృతిచెందగా, వెనుక కూర్చున్న ఎర్రిస్వామి కిందపడిపోయాడు. ఈ ఘటన తర్వాత కొన్ని వాహనాలు ఇదే దారిలో వెళ్లాయి. 13 నిమిషాల తర్వాత వచి్చన కావేరి బస్సు డ్రైవర్.. ఆ బైక్‌ను గుర్తించడంలో విఫలమై ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది.నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ నెల 24న బైక్‌ను ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుపై సెక్షన్ 12(ఏ), 106(1) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఏ1గా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా బస్సు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణలో రెండూ వేర్వేరు ఘటనలని తేలాక ఈ నెల 25న మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చాకలి ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు మృతిచెందిన బైకర్ శివశంకర్‌పై సెక్షన్ 281, 125(ఏ), 106(1) కింద కేసు నమోదు చేశారు. విచారణ ఇంకా కొనసాగుతోందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మృతదేహాలు అప్పగింత డీఎన్ఏ శాంపిల్స్ రిపోర్ట్‌ను ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ) జిల్లా కలెక్టర్‌కు పంపడంతో మృతదేహాలను బాధిత కుటుంబాలకు అందజేశారు. కర్నూలు జనరల్ ఆస్పత్రి మార్చురీ వద్ద భీతావహ వాతావరణంలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఆదివారం 17 మృతదేహాలను బంధువులకు అప్పగించగా.. బిహార్ వాసి అమృత్‌కుమార్ మృతదేహాన్ని తాము తీసుకెళ్లలేమని, ఆనవాళ్లు కూడా లేని మాంసపు ముద్దకు ఇక్కడే అంత్యక్రియలు చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. దీంతో కర్నూలు కార్పొరేషన్ అధికారులు అమృత్‌కుమార్ అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇక తమిళనాడు వాసి ప్రశాంత్ మృతదేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆరాంఘర్‌లో బస్సు ఎక్కింది కుప్పం వాసి త్రిమూర్తి.. హైదరాబాద్‌లోని ఆరాంఘర్‌లో బస్సు ఎక్కిన ప్రయాణికుడిని కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం యామగానిపల్లెకు చెందిన త్రిమూర్తిగా గుర్తించడంతో డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చెక్కుల పంపిణీ పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం బస్సు ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందజేసింది. గద్వాల ఆర్డీవో అలివేలు చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున హోంమంత్రి అనిత ప్రకటించినట్లుగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని త్వరలో అందజేస్తామని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితుడు కర్నూలు (హాస్పిటల్): కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన గుణసాయి అనే ప్రయాణికుడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోలుకుంటున్నాడు. మచిలీపట్నంకు చెందిన ఈయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు రావడంతో ఆ పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యాయి. దీంతో అతన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్‌ఐసీయులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. శనివారం వరకు విషమంగా ఉన్న అతని ఆరోగ్యం వైద్యుల కృషి ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడింది. ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి.. బస్సు ప్రమాదంలో కీలక సాక్షిగా ఉన్న ఎర్రిస్వామి శనివారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో కడుపునొప్పితో చేరాడు. బైక్ నుంచి అతను కింద పడటంతో కడుపు వద్ద గీరుకుపోయింది. దీనికితోడు పలుచోట్ల నొప్పులు ఉండటంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేరి్పంచారు. అతనికి అ్రల్టాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసిన వైద్యులు.. లోపల ఎలాంటి గాయాల్లేవని నిర్ధారించారు. మరికొన్ని పరీక్షలు చేసి కోలుకుంటే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిసింది. -
అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కర్నూలు యువకుడు
రాంచీ వేదికగా జరిగిన నాలుగో దక్షిణాసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో (South Asian Athletics Championship 2025) ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన మొగలి వెంకట్రాం రెడ్డి (Mogali Venkatramreddy) సత్తా చాటాడు. 800 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ ఈవెంట్‌ను వెంకట్రాం రెడ్డి 1:52.37 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.ఈ గేమ్స్‌లో భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు.వెంకట్రాం రెడ్డి పతకం సాధించిన అనంతరం హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అథ్లెటిక్స్ కోచ్ డా. జి.వి. సుబ్బారావు స్పందించారు. "ఇది దేశానికి గర్వకారణం. వెంకట్రాం రెడ్డి అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించాడు. ఇది అతని శ్రమకు ఫలితమని అన్నాడు.వెంకట్రాం రెడ్డి ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 800 మీటర్లు, 1500 మీటర్ల ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించి "గోల్డెన్ డబుల్" సాధించాడు. చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..! -
కర్నూలు బస్సు ప్రమాదం..19 మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తి
సాక్షి,కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన 19 మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు కర్నూలు వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగంలో జరిగాయి. ఇప్పటి వరకు డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన మొత్తం మృతదేహాల రిపోర్ట్ వివరాల్ని వైద్యులు ఎస్పీకి అందించారు. వాటి ఆధారంగా అధికారులు భౌతిక కాయల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేలా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 14 మృత దేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో బిహార్ చెందిన ఆర్గా అనే వ్యక్తి మృతదేహానికి వారి కుటుంబ సభ్యులు కర్నూలు జోహరాపురంలో అంత్యక్రియలు చేశారు. బిహార్‌కు తీసుకుని వెళ్లేందుకు సమయం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో అక్కడ అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు బస్సు ప్రమాదంలో ఇంకా రెండు మృతదేహాల డిఎన్ఎ రిపోర్టు అందాల్సి ఉండగా.. ఇప్పటి దాకా 17 మృతదేహాల డీఎన్ఏ రిపోర్ట్‌లను అధికారులు పొందారు. ఈ రోజు రాత్రికి 19 మృతదేహాల్లో 18 మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. తమిళనాడుకు చెందిన మృతుడు ప్రశాంత్ కుటుంబ సభ్యులు రేపు కర్నూలుకి రానున్న నేపద్యంలో ఆ మృత దేహాన్ని రేపు అప్పగించనున్నారని సమాచారం. -
కర్నూలు ప్రమాదం: వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులే.. సజ్జనార్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదంపై(Kurnool Bus Fire Accident) హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్(VC Sajjanar) స్పందించారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!!. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!?.సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండండి. వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండి. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది’ అని పోస్టు చేశారు. Drunk drivers are terrorists. Period.Drunk drivers are terrorists and their actions are nothing short of acts of terror on our roads. The horrific #Kurnool bus accident, which claimed the lives of 20 innocent people, was not an accident in the truest sense. It was a preventable… pic.twitter.com/oXTp0uOt2k— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 26, 2025 -
Kurnool: ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమా?
కర్నూలు(సెంట్రల్): ఎగిసిపడుతున్న అగ్ని కీలలు.. మరో వైపు ప్రయాణికుల ఆర్తనాదాలు.. కళ్ల ముందు భయానక వాతావరణం.. ఆ సమయంలో కొందరు వ్యక్తులు మృత్యువును సైతం ఎదిరించి కొందరి ప్రాణాలను కాపాడారు. కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రయాణికులను కాపాడేందుకు వాహనదారులు ఎంతో ధైర్యంగా సాహసం చేసి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. బస్సులో కళ్లెదుటే మంటల్లో ఆహుతవుతున్నా ప్రయాణికులను కొందరు వాహనదారులు ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నం చేశారు. మంటల్లో దగ్ధమవుతున్న బస్సు డోర్లు, కిటికీలు, అద్దాలు పగలగొట్టి కొందరిని బయటకు లాగారు. ఫలితంగా 43 మంది ఉన్న కావేరి ట్రావెల్స్‌లో 24 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఎంత ప్రయతి్నంచినప్పటికీ 19 మందిని కాపాడలేకపోవడంతో అగ్నికి ఆహుతై బస్సులోనే ప్రాణాలను వదిలి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ప్రమాద సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించాడు. అతడిని చూసి ప్రేరణ పొందిన మరికొంతమంది తమలో మానవత్వాన్ని నిద్రలేపి ముందుకొచ్చారు. ఈ క్రమంలో మంటలు ఉద్ధృతమవుతున్న సమయంలో బస్సు కిటికీలు, అద్దాలను బద్దలు కొట్టి ఐదుగురును బయటకు లాగినట్లు తెలుస్తోంది. అంతేకాక వెంటనే పోలీసులు, ఫైర్, 108 అంబులెన్స్‌లకు సమచారం ఇచ్చారు. అయితే అప్పటికే అంబుల్సెన్‌లు చేరుకోకపోవడంతో తమ సొంత వాహనాల్లో ప్రమాదం నుంచి బయట పడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరికొంత మందిని కాపాడే ప్రయత్నంలో ఉండగా ఒక్క ధాటిగా మంటలు ఎగిసిపడటంతో మిగతా వారిని కాపాడలేకపోయారు. కళ్ల ముందు కొందరు మంటల్లో ఆహుతి అవుతున్న వారిని చూసి బరువెక్కిన హృదయాలతో చలించిపోయారు. వెనక డోర్‌ను బద్దలు కొట్టి.. బస్సులోని వ్యక్తుల ప్రాణాలను కాపాడడంలో బస్సు రెండో డ్రైవరు, క్లీనరు కూడా కీలకంగా వ్యవహరించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణికులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వెనక డోర్‌ను బద్దలు కొట్టి దాదాపు 10 మంది దాకా బయటకు వెళ్లేలే చేశారని సమాచా రం. అప్పటికే కొంతమంది ప్రయాణికులు డోర్‌ను బద్దలు కొట్టేందుకు ప్రయతి్నస్తున్నా ఓపెన్ కాకపోవడంతో వారు పెద్ద రాడ్డు తీసుకొని బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు. వారు తమకేమి అనుకొని రన్నింగ్ డ్రైవర్ మాదిరిగా పారిపోయి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగేది. కొందరు సోషల్ మీడియా కోసం తాపత్రయం... బస్సు ప్రమాద సమయంలో కొందరు మాత్రం తమలో మానవత్వం లేదనే విధంగా ఘటన స్థలంలో వ్యవహరించినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. కళ్లముందు మంటల్లో ప్రాణాలు కలిసి పోతుంటే కాపాడే ప్రయత్నం చేయకుండా సోషల్ మీడియా కోసం ఫొటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ కనిపించారని చెప్పారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయతి్నంచి ఉంటే మరికొంతమంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది. ఇప్పటికైనా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ప్రయతి్నంచాల్సిన అవసరం ఉంది. పత్తాలేని పెట్రోలింగ్ వాహనం.. 44వ జాతీయ రహదారిలో ఎన్హెచ్ఏఐ(నేషనల్ హై అథారిటీ ఆఫ్ ఇండియా) రోడ్డు భద్రతను గాలికొదిలినట్లు తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే క్షణాల్లో అక్కడ ఉండాల్సిన పెట్రోలింగ్ వాహనం, అంబులెన్స్‌లు కనిపించలేదు. ఈ ప్రమాద ఘటనన జరిగిన ప్రదేశం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో పుల్లూరు టోల్‌ప్లాజా, 24 కిలోమీటర్ల పరిధిలో అమడగుంట్ల టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఆయా టోల్ ప్లాజాల పరిధిలో పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉండాలి. అయితే ప్రమాద సంఘటనకు రెండు టోల్ ప్లాజాల నుంచి ఎలాంటి పెట్రోలింగ్ వాహనాలు రాలేదు. చివరికి అమడగుంట్ల టోల్ ప్లాజాకు సంబంధించి అంబులెన్స్ కూడా రాకపోవడంతో చిత్తూరు జాతీయ రహదారి 40కు చెందిన నన్నూరు టోల్ ప్లాజా అంబులెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి టోల్ ఫీజులను వసూలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఎన్హెచ్ఏఐ..రోడ్డులో వెళ్లే వాహనాలు, ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవడంలేదని తేటతెల్లమవుతోంది. ఎట్టా కాలిందో సూడు.. ఎంత నరకం చూశారో పాపం దగ్ధమైన బస్సును చూస్తూ వాహనదారుల దిగ్భ్రాంతి ప్రమాదంతో జిల్లా ప్రజల్లో విషాదం వెల్దుర్తి: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై బస్సు ప్రమాద ఘటన నుంచి జిల్లా ప్రజలు ఇంకా తేరుకోలేక పోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున చావుకేకతో ఉలిక్కిపడిన జనం శనివారం కూడా అదే ప్రమాద విషయాన్ని చర్చించుకుంటూ కనిపించారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై విశ్లేషిస్తూ కనిపించారు. కాగా జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాద ఘటన స్థలంలో నిలిచి పక్కనే దగ్ధమైన బస్సును పరిశీలిస్తున్నారు. ‘అబ్బా ఎట్టా కాలిపోయిందో సూడు బస్సు.. ఈ బస్సే ఇట్టయిందంటే ఆ మంటలకు బస్సులో చచ్చిపోయిన్నోళ్లు ఎంత నరకం అనుభవించింటారో కదా’ అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కనిపించారు. జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వివిధ రాష్ట్రాల ప్రయాణికులు, వాహనదారులు బస్సు దుర్ఘటను చూసి అయ్యో పాపం అంటూ వెళ్తున్నారు. బైక్ పడిన ప్రాంతం, చనిపోయిన బైకిస్ట్ గురించి, బస్సు ఈడ్చుకుంటూ వెళ్లిన ఆనవాళ్లు, పూర్తిగా దగ్ధమైన బస్సుపై వివిధ రకాలుగా వి చారు.‘ ఒక వ్యక్తి వల్ల ఇంత ఘోరం జరిగిందా? ప్రమాదానికి మద్యం కారణం’ అంటూ కొందరు ఘటనా స్థలంలో చర్చించుకుంటూ కనిపించారు. వెనుకాల వచ్చిన వాహనదారులు రోడ్డుపై పడిన బైక్‌ను పక్కకు తీసినా సరిపోయేదని.. ప్రైవేటు వాహనాల వేగాన్ని నియంత్రించాలని.. ప్రమాద సమయంలో వాహనదారులు ఇంకా స్పందించి ఉంటే బాగుండేది’ అని మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరో వైపు సంఘటన స్థలంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బైక్ పడిన ప్రాంతం నుంచి బస్సు దగ్ధమైన చోటు వరకు చోటు చేసుకున్న పరిణామాలపై వివరాలు సేకరిస్తూ కనిపించారు. ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమా? కొందరు ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించడం చాలా బాధాకరం. వారిలో మానవత్వం లేదు. మనిషి ప్రాణాలకు విలువ కనిపించలేదు. కళ్ల ముందే ప్రాణ భయంతో కాపాడండి అంటూ మహిళలు, పిల్లలు అరుపులు, కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో ప్రొజెక్టు చేసుకున్నారు. అయితే కొందరు మాత్రం వారిలో ఇంకా మానవత్వం చావలేదని నిరూపించారు. ప్రాణాలకు తెగించి కొందరిని కాలే బస్సు నుంచి బయటకు లాగారు. ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఎంత మంచివాడంటే చెప్పలేం. అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకొని సహాయక చర్యల్లో పాల్గొని కొందరిని ప్రాణాల నుంచి రక్షించారు. – హైమారెడ్డి, హైదరాబాద్, ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షి -
అర్హత లేకున్నా హెవీ డ్రైవింగ్ లైసెన్స్!
కారెంపూడి: కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.మొదట లారీ క్లీనర్‌గా, తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం. -
బస్ ఫైర్ ప్రమాదానికి కారణం అయిన వ్యక్తి
-
కర్నూలు ఘటన: బైకర్ శివశంకర్ వీడియో వైరల్
సాక్షి, కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో ద్వారా శివశంకర్ మద్యం సేవించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. బస్సు ప్రమాద ఘటనలో పల్నాడు జిల్లాలకు చెందిన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు బైక్‌కు పెట్రోల్ కొట్టించినట్టు వీడియోలో కనిపిస్తోంది. అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో శివశంకర్‌తో పాటుగా అతడి స్నేహితుడు కలిసి పెట్రోల్ బంక్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కడే బైక్‌పై వెళ్లినట్టు వీడియోలో ఉంది. శివశంకర్ బంక్‌లో ఉన్న సమయంలో స్టంట్ చేయడం, తడబడుతున్నట్టుగా కూడా కనిపించింది. బైక్ స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్లిన వెంటనే స్కిడ్ అయినట్టుగా వీడియోలో స్పష్టంగా ఉంది. దీంతో, అతడు మద్యం సేవించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండగా.. శివశంకర్ వచ్చిన బైక్ చాలా దారుణంగా ఉంది.. బైక్‌కు హెడ్‌లైట్ లేకపోవడం గమనార్హం. పైగా అతడు ర్యాష్ డ్రైవింగ్ చేసే విధంగా కనిపించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ ప్రమాదానికి సంబంధించి బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యపై ఉలిందకోండా పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసును ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదు చేయగా... బస్సు నడిపిస్తున్న ముత్యాల లక్ష్మయ్య, అతని సహచరుడు జి. శివనారాయణని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మయ్యపై సెక్షన్ 125/A, 106 C, సంబంధిత నిబంధనల ఆధారంగా కేసులు నమోదు చేసి, 19 మంది ప్రయాణికుల మరణానికి బాద్యుడుగా పేర్కొన్నారు. అలాగే, బస్సు మేనేజ్మెంట్ కూడా ఈ ఘటనకు బాధ్యులుగా ఉంచారు.ఇది కూడా చదవండి: కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త కోణం.. వందల ఫోన్లు పేలడం వల్లే మంటలు..ఇదిలా ఉండగా.. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో బస్సులో నిద్రిస్తున్నప్పటికీ, అప్రమత్తమై పలువురి ప్రాణాలను కాపాడి హీరోగా ప్రశంసలు అందుకున్న రెండో డ్రైవర్ శివనారాయణ (30) ఇప్పుడు పోలీసుల అనుమానపు నీడలో చిక్కుకున్నాడు. విచారణలో అతడు తన వాంగ్మూలాన్ని మార్చడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే, ప్రమాద సమయంలో బస్సు నడుపుతున్న డ్రైవర్ లక్ష్మయ్య.. నిద్రిస్తున్న రెండో డ్రైవర్ శివనారాయణను నిద్ర లేపాడు. వెంటనే స్పందించిన శివనారాయణ పొగతో నిండిపోయి, డోర్లు తెరుచుకోని స్థితిలో ఉన్న బస్సు కిటికీలను ఒక రాడ్‌తో పగలగొట్టి చాలా మంది ప్రయాణికులను బయటకు లాగాడు. "నన్ను మొదట బయటకు లాగింది ఒక యువకుడే. అతడే రెండో డ్రైవర్ అని నాకు తర్వాత తెలిసింది" అంటూ ప్రాణాలతో బయటపడిన సుబ్రమణ్యం అనే ప్రయాణికుడు చెప్పాడు. అనుమానాలకు కారణమేంటి?ప్రమాదం జరిగిన వెంటనే అసలు డ్రైవర్ లక్ష్మయ్య ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. పోలీసులు శివనారాయణను అదుపులోకి తీసుకుని విచారించగా అతను తన వాంగ్మూలాన్ని మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. మొదట బస్సు ఒక వాహనాన్ని ఢీకొట్టిందని, అది తీవ్రమైన ప్రమాదం కావచ్చని లక్ష్మయ్య తనను నిద్రలేపాడని చెప్పాడు. తర్వాత బస్సు కింద మోటార్ సైకిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించామని తెలిపాడు. అయితే, ఆ తర్వాత మాట మార్చి 'అంతకుముందే జరిగిన వేరే ప్రమాదంలో మోటార్‌సైకిల్, దానిపై ఉన్న వ్యక్తి రోడ్డుపై పడి ఉన్నారని, అది గమనించని లక్ష్మయ్య వారిపై నుంచి బస్సును నడపడంతో మంటలు చెలరేగాయని' చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బస్సు యజమానులు తమ సంస్థపై విచారణ జరగకుండా ఉండేందుకు డ్రైవర్లను తప్పుదారి పట్టించేలా ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
కర్నూలు ప్రమాదంలో కొత్త కోణం!.. 400 ఫోన్లు పేలడం వల్లే మంటలు
సాక్షి, అమరావతి: కర్నూలు చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బస్సు ప్రమాదానికి సంబంధించిన మరో కొత్త కోణాన్ని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. బస్సు లగేజీ క్యాబిన్లో వందల సంఖ్యలో మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ టీమ్స్ తెలిపాయి.వివరాల ప్రకారం.. ఫోరెన్సిక్ బృందాలు శుక్రవారం ఉదయం ఘటనాస్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించాయి. ఈ క్రమంలో బస్సులో మొబైల్ ఫోన్లను తరలించినట్టు గుర్తించాయి. ‘ప్రమాదం సందర్భంగా ట్రావెల్స్ బస్సు.. బైకును ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చింది. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా.. కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు’ అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ బస్సును నిలిపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోరు నుంచి దిగి వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రమాద ఘటనలో తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. సెల్ఫోన్లు పేలిపోయేందుకు అవకాశం ఉందా?ఛార్జింగ్ చేస్తూండగా సెల్ఫోన్లో మంటలు చెలరేగడం.. కొన్ని సందర్భాల్లో పేలిపోవడం మనం చూస్తూంటాం. అయితే కర్నూలు వద్ద శుక్రవారం తెల్లవారు జరిగిన బస్సు దగ్ధం ఘటనకు కూడా సెల్ఫోన్లు పేలిపోవడం కారణమని తాజాగా అనుమానిస్తున్నారు. మరి.. కేవలం రవాణా చేస్తున్నంత మాత్రన సెల్ఫోన్లు పేలిపోయేందుకు అవకాశం ఉందా? అంటే అవును అంటున్నారు నిపుణులు. చాలా అరుదుగా జరిగేదైనప్పటికీ ప్యాకెట్లలో ఉంచిన సెల్ఫోన్లు పేలిపోయేందుకు చాలా కారణాలే ఉంటాయని విశ్లేషిస్తున్నారు.వీరు చెబుతున్న దాని ప్రకారం.. బ్యాటరీలు డ్యామేజ్ అయినా.. కొంత ఎత్తు నుంచి కిందపడ్డా.. బ్యాటరీలకు చిల్లులు పడ్డా ఫోన్లో షార్క్ సర్క్యూట్ అయ్యేందుకు అవకాశం ఉంది. తద్వారా ఇవి పేలిపోగలవు. విపరీతమైన వేడి కూడా ఫోన్లు పేలిపోయేందుకు కారణం కాగలవు. మండే ఎండలో తలుపులన్నీ బిగించి సెల్‌ఫోన్‌ను కారులో ఉంచినా. విడికి వాటిల్లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు కరిగిపోతాయి. ఈ క్రమంలోనే పేలుడు సంభవించవచ్చు. కొన్ని కొత్తఫోన్లలో బ్యాటరీల్లోనే లోపాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఫ్యాక్టరీల నుంచి బయటకు వచ్చే టప్పుడు అనేక రకాల భద్రత పరీక్షలు నిర్వహిస్తూంటారు కానీ.. కొన్ని సందర్భాల్లో లోపాలున్న బ్యాటరీలు కూడా మార్కెట్లోకి వచ్చేస్తూంటాయి.పార్సెల్ ఆఫీసుల్లో పోలీసులు తనిఖీలు?ఈ ప్రమాదంలో ఫోన్లు పేలడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ పార్సిల్ ఆఫీసుల్లో.. ఆర్టీవో అధికారులు గానీ, పోలీసులు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. ఇలాంటి పేలుడు పదార్థాలకు ప్రధాన కారణంగా ఉన్నటువంటి మొబైల్ ఫోన్లను, సంబంధిత ఇతర వస్తువులను గాని బస్సులలో పంపించకూడదని ఇప్పటికైనా అధికారులు హెచ్చరించే అవకాశం ఏమైనా వుందా? చూడాల్సి ఉంది. -
ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ
కర్నూలు (హాస్పిటల్)/ రావులపాలెం/ఇంకొల్లు(చినగంజాం): ఒక్కగానొక్క కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వారి ఆశలను నెరవేర్చి ఆ యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి కుటుంబానికి తోడుగా నిలబడ్డాడు. బస్సు ప్రమాదం ఆ యువకుడిని కబళించింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సీహెచ్.శ్రీనివాసరావు బ్యాంకులో అప్రెంటిస్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమారుడు మేఘనాథ్‌తో పాటు ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. మేఘనాథ్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉంటున్నాడు. దీపావళి పండుగకు హైదరాబాద్‌కు వచ్చిన మేఘనాథ్.. తిరిగి గురువారం రాత్రి బెంగళూరు బయలుదేరాడు. బస్సు ఎక్కానని రాత్రి 10.30 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అవే అతని చివరి మాటలయ్యాయి. అదే అతనికి చివరి పుట్టినరోజు ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లా అంబోదల ప్రాంతానికి చెందిన కె.దీపక్‌కుమార్ (24) బెంగళూరులోని కేపీఎంజీ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని తండ్రి కె.శ్రీనివాసరావు, తల్లి కె.లీలారాణి ఉద్యోగ రీత్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీపక్‌కుమార్ తన పుట్టిన రోజు 16వ తేదీతో పాటు దీపావళి పండుగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చాడు. పుట్టిన రోజుతో పాటు పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నాడు. ఆ ఆనంద క్షణాలను మూట గట్టుకుని బెంగళూరుకు గురువారం రాత్రి పయనమయ్యాడు. తాను బస్సెక్కానని ఇంటికి మెసేజ్ కూడా పెట్టాడు. బస్సు ప్రమాదం అతనికి ఇదే చివరి పుట్టిన రోజుగా మారుస్తుందని ఊహించలేకపోయాడు. తల్లీ కూతురు మృతి హైదరాబాద్‌కు చెందిన చందన బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. ఆమె ఇటీవల దీపావళి పండుగ కోసం హైదారాబాద్‌కు వచ్చింది. ఎంతో వైభవంగా ఆమె కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను జరుపుకుంది. అయితే తిరిగి బెంగళూరుకు వెళ్లేందుకు తల్లి సంధ్యారాణిని కూడా తన వెంట తీసుకెళ్లింది. దీంతో రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధం కావడంతో ఇద్దరూ విగత జీవులుగా మిగిలారు. మళ్లీ త్వరలో వస్తానంటూ.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభికి చెందిన చిట్టోజు మేఘనాథ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన తండ్రి శ్రీనివాసాచారి గ్రామంలోని ఐఓబీలో బంగారం తూకం వేసే ఉద్యోగి. మేఘనాథ్ భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీకెండ్లో మేఘనాథ్ నగరానికి వచ్చి వెళుతుంటాడు. ఇటీవల దీపావళి సెలవులకు వచ్చిన మేఘనాథ్.. బెంగళూరు వెళ్లేందుకు ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కాక ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. మళ్లీ త్వరలో వస్తానని పిల్లలకూ చెప్పాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే మేఘనాథ్ మృత్యు ఒడికి చేరాడని తెలిసి ఆ కుటుంబం రోదన వర్ణనాతీతం. మేఘనాథ్ తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, విజయలక్ష్మి, చెల్లి యశ్వని ఘటనా స్థలానికి వెళ్లి గుండెలవిసేలా రోదించారు. వల్లభిలో విషాదం అలుముకుంది. -
కాలిపోతున్నాం.. కాపాడండి..
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జాతీయ రహదారి–44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు చివరి వరకు ప్రాణాలను కాపాడుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌ను బస్సు ఢీకొట్టి.. అలాగే 300 మీటర్ల మేర బైక్‌ను లాక్కు పోవడంతో తొలుత బస్సు ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. దీంతో ముందు ఉన్న వారు బస్సు మధ్యకు వచ్చి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడానికి విఫల యత్నం చేశారు. అంతలో మంటలు అలుము కోవడంతో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడి కిందపడి పోయారు. ఈ క్రమంలో ‘కాలిపోతున్నాం.. కాపాడండి.. బయటకు లాగేయండి.. దేవుడా కాపాడు..’ అంటూ ఆర్తనాదాలు చేశారు. వారి అరుపులు బయటకు వినిపిస్తున్నా తాము ఏమీ చేయలేని పరిస్థితి అని అప్పటికే బస్సులోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న వారు తెలిపారు. తొలుత మంటలను అదుపు చేయడానికి నీళ్ల బాటిళ్లతో డ్రైవర్ ప్రయత్నం చేశాడని, అలా కాకుండా ఆయన ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి ఉంటే మరింత మంది ప్రాణాలతో బయటపడే వారని చెప్పారు.పెద్ద కుదుపు రావడంతో ఒక్కసారిగా లేచాం మాది కర్ణాటకలోని బసవ కల్యాణం. పనిపై హైదరాబాద్ వెళ్లి తిరిగి వెళ్తున్నాను. అర్ధరాత్రి 2.30 – 2.40 గంటల మధ్య ప్రమాదం జరిగింది. అందరూ నిద్రలో ఉన్నారు. అయితే ఒక్కసారిగా పెద్ద కుదుపు రావడంతో చాలా మంది నిద్ర లేచారు. నేనూ అప్పుడే లేచాను. ఏమి జరిగిందోనని చూసుకునేలోపే మంటలు వచ్చాయి. ఎమర్జెన్సీ విండోలు తెరుచుకొని వెళ్లాలని డ్రైవర్ అరిచాడు. వెంటనే నేను ముందుకు వెళ్లి డ్రైవర్ సీటులో నుంచి కిందకు దూకేశాను. – ఆకాష్, బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి కాపాడండని అరుపులు వినిపించాయి ఒక్కసారిగా బాంబు పడ్డట్లు పెద్ద శబ్దం వినిపించడంతో రోడ్డు వైపు చూశాను. కొద్ది దూరంలో బస్సు మంటల్లో తగలబడిపోతూ కనిపించింది. పరుగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాను. అయితే పెద్ద ఎత్తున మంటలు వస్తుండడంతో ఏమీ చేయలేకపోయాను. బస్సులో నుంచి కాపాడండి.. మంటల్లో కాలిపోతున్నామని కేకలు వినిపించాయి. ఆడోళ్ల గోడు చెవులారా విన్నాను. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. నా జీవితంలో ఇలాంటి ఘటనను చూడలేదు. – మల్లికార్జున, నాయకల్లు (ఘటన స్థలికి సమీపంలోని కేఫ్‌లో సెక్యూరిటీ గార్డు) ఫైర్ ముందు నుంచి వచ్చింది బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో 2.30 గంటలప్పుడు బస్సు ముందు నుంచి ఫైర్ వచ్చింది. దీంతో అందరూ వెనక్కి వెళ్లారు. ఎమర్జెన్సీ డోర్ తెరచుకోకపోవడంతో వెనక డోర్‌ను పగలగొట్టే ప్రయత్నం చేశారు. నేను మధ్యలో ఉన్న గ్లాస్‌ను పగలగొట్టి దూకేశాను. బెంగళూరుకు ఇంటర్వ్యూ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. – అశ్విన్, హైదరాబాద్, కూకట్పల్లికళ్ల ముందే కాలిపోయారు బస్సు కళ్ల ముందే కాలిపోయింది. ఆ సమయంలో నేను మెలకువగా ఉండడంతో డ్రైవర్ సీటు నుంచి కిందకు దూకేశాను. నేను దూకిన తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచి్చంది. ఆ తర్వాత మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఆర్పాలన్నా ఏమి చేయలేని పరిస్థితి. కాపాడాలని కేకలు వినిపించాయి. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదు. – జయంత్ కుశ్వాల్, హైదరాబాద్ -
మృత్యుశకటం
బస్సు డ్రైవర్ చేసిన తప్పు 19 మంది సజీవ దహనానికి కారణమైంది! నిద్రలో ఉన్న వారిని శాశ్వత నిద్రలోకి పంపింది. కొన్ని కుటుంబాలను చిదిమేసి శాశ్వత చీకట్లు నింపింది. ఘటనా స్థలిని చూసిన వారి కంట నీరు తెప్పించింది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కలచి వేసింది. నిమిషాల వ్యవధిలో కొన్ని కుటుంబాలు, కొన్ని కుటుంబాల పెద్ద దిక్కులు, భవిష్యత్ ఆశలు అగ్నికీలలకు ఆహుతయ్యాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు,చావు కేకలతో ఎన్హెచ్ృ44 భీతిల్లింది. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా బొగ్గు, మసిగా మారాయి. ఈ భీతావహ ఘటన స్లీపర్ బస్సు ప్రయాణాలపై మరోమారు పెద్ద చర్చనే లేవనెత్తింది.సాక్షి ప్రతినిధి కర్నూలు/ కర్నూలు (హాస్పిటల్): హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ (స్కానియా) బస్సు (డీడీ 01ఎన్9490) శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... మొత్తం 44 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో హైదరాబాద్‌లో బయలుదేరిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 2.14 గంటలకు కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా దాటింది. 2.30 గంటలకు టాయిలెట్ కోసం కర్నూలులో ఆపారు. కొంత మంది మాత్రమే బస్సు దిగారు. మిగిలిన వారంతా గాఢనిద్రలో ఉన్నారు. ఆ తర్వాత బయలుదేరిన బస్సు చిన్నటేకూరు దాటగానే 2.45 గంటలకు ఓ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న శివశంకర్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ప్రమాదం తర్వాత కూడా ఆపకుండా డ్రైవర్ బస్సును ముందుకు నడిపాడు. ఇదే పెను ప్రమాదానికి కారణమైంది. ఆ సమయంలో బస్సు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత ముందుకు వెళ్లిపోతే ప్రమాదం తమపైకి రాదని భావించిన డ్రైవర్ బస్సును వేగంగా నడిపారు. శివశంకర్ రోడ్డు పక్కన పడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో బస్సు బైక్‌ను 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఆ రాపిడికి మంటలు రేగాయి. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలిపోయి మంటలు చెలరేగాయి. బస్సు ఎడమ వైపు డోర్ల భాగంలో మంటలు కనిపించాయి. అప్పుడు డ్రైవర్ బస్సును ఆపాడు. డ్రైవర్ లక్ష్మయ్యతో పాటు మరో డ్రైవర్ వాటర్ బాటిళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈలోపు ముందు భాగంతోపాటు బస్సు మధ్య భాగంలో కూడా మంటలు వ్యాపించాయి. బైక్‌ను ఢీకొట్టడంతో బస్సు డోర్‌లోని సెన్సార్ వైర్లు తెగిపోయాయి. దీంతో డోర్ పూర్తిగా లాక్ అయి తెరుచుకోలేదు. దీంతో డ్రైవర్లు భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులోంచి దూకేశారు. మంటల ధాటికి దట్టమైన పొగ బస్సు మొత్తం కమ్ముకుంది. ఒకరి ముఖం మరొకరికి కన్పించని పరిస్థితి. పొగ, మంటల ధాటికి ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడక ఆర్తనాదాలు పెట్టారు. క్షణాల్లో మంటలు డోర్ కర్టన్లు, బెడ్షీట్లు, బెడ్లకు అంటుకుని అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. కొందరు మాత్రం బస్సు అద్దాలు పగులగొట్టి కిందకు దూకి గాయాలతో బయటపడ్డారు. తక్కిన వారు ప్రమాదం నుంచి తప్పించుకోలేక అగ్నికి ఆహుతయ్యారు. బస్సు మొత్తం నిమిషాల వ్యవధిలో పూర్తిగా దగ్ధమైంది. జాతీయ రహదారిపై వెళుతున్న వాహనదారులు ప్రమాద ఘటనను వీడియో, ఫొటోలు తీసి పోలీసు అధికారులకు పంపారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్‌తో మంటలను అదుపు చేశారు. డ్రైవర్లు సహా 27 మంది ప్రయాణికులు సురక్షితం హైదరాబాద్‌లో బస్సు ఎక్కడానికి 40 మంది టికెట్ బుక్ చేసుకున్నారు. వీరిలో ఒకరు వ్యక్తిగత కారణాలతో ప్రయాణం రద్దు చేసుకోవడంతో బస్సు ఎక్కలేదు. మిగతా 39 మందితోపాటు నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ లెక్కన 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆపై హైదరాబాద్ శివారు ప్రాంతం ఆరంఘర్‌లో టికెట్ ముందుగా బుక్ చేసుకోని ఒకరు బస్సు ఎక్కారు. ఇద్దరు డ్రైవర్లతో కలిపి బస్సులో 46 మంది ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే కర్ణాటకలోని బాగేపల్లిలో బస్సు దిగాల్సి ఉంది. మిగతా వారంతా బెంగళూరుకు వెళ్లాల్సిన వారే. వీరిలో ప్రమాదం తర్వాత 27 మంది ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాద సమయంలో అద్దాలు ధ్వంసం చేసి దూకడంతో పాదాలు, కాళ్లకు గాయాలయ్యాయి. కొంత మందికి తలపై కూడా చిన్నచిన్న గాయాలయ్యాయి. వీరిలో 23 మంది పెద్దవాళ్లు, ఇద్దరు పిల్లలు కాగా.. మరో ఇద్దరు డ్రైవర్లు. తక్కిన 19 మంది చనిపోయారు. మృతుల్లో 17 మంది పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను పోలీసులు 108లో కర్నూలు జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇంకొందరు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు కర్నూలు సమీపంలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రయాణికుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు యాజమాన్యంపై 125 (ఎ), 106 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఉలిందకొండ పీఎస్ ఎస్ఐ ధనుంజయ తెలిపారు. బస్సు డ్రైవర్లు శివనారాయణ, మిరియాల లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని ప్రమాద ఘటనకు దారితీసిన కారణాలపై విచారిస్తున్నారు. పనికి వెళ్లొస్తానని అటే వెళ్లిపోయాడు..అమ్మా డోన్ వద్ద పని ఉందంట. మాట్లాడుకుని మళ్లీ వస్తానని రాత్రి పోయినోడు మళ్లీ రాకుండానే పోయినాడు...అంటూ ఆ తల్లి గంటల తరబడి మార్చురీ వద్ద విలపిస్తున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. కర్నూలు జిల్లా కర్నూలు మండలం బి.తాండ్రపాడుకు గ్రామానికి చెందిన నాగన్న కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆయన భార్య యశోదమ్మ ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసింది. ఇందులో పెద్దవాడైన శ్రీహరి గౌండా పనిచేస్తుండగా చిన్నవాడైన శివశంకర్ గ్రానైట్ పనులకు వెళ్లేవాడు. శివశంకర్ ఎప్పటిలాగే గురువారం రాత్రి కూడా డోన్ వద్ద పని ఉందని మాట్లాడుకుని వస్తానని వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ తల్లికి ఫోన్ చేయలేదు. ఉదయం లేచే సరికి బైక్‌పై వెళుతూ బస్సు కింద పడి శివశంకర్ మృతిచెందాడని పోలీసులు చెప్పడంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. అద్దాలు పగలగొట్టినా బయటకు రాలేని పరిస్థితి స్లీపర్ కోచ్ బస్సులో లోయర్, అప్పర్ బెర్త్‌లు ఉన్నాయి. అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు అద్దాలు పగలగొట్టి సులభంగా బయటకు దూకారు. గాయాలతో బయటపడ్డారు. అప్పర్ బెర్త్ అద్దాలు ధ్వంసం చేస్తే బయటకు దూకేయొచ్చు. కానీ లోయర్ బెర్త్‌లో అద్దాలు ధ్వంసం చేసినా, ఐరన్ యాంగ్లర్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో మనిషి దూరలేని పరిస్థితి! అప్పర్ బెర్త్ లాగే, లోయర్ బెర్త్‌లు కూడా ఉండి ఉంటే అద్దాలు ధ్వంసం చేసి ఇంకొందరు కిందకు దూకి ప్రాణాలతో బయట పడే అవకాశం ఉండేది. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర పోలీసులు బస్సును పరిశీలించారు. ఇనుప కడ్డీలు మినహా బస్సులో ఏమీ మిగల్లేదు. నల్లటి మసి దిబ్బలు మాత్రమే కన్పించాయి. తెల్లవారిన తర్వాత కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్లా, డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు వైద్యాధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. వీరి సమక్షంలో బూడిదను తొలగించి.. నల్లగా బొగ్గులా మారిన మాంసపు ముద్దలను అతి కష్టం మీద వెలికి తీశారు. మొత్తం 19 మృతదేహాలను ప్రత్యేక టెంట్లో ఉంచారు. వాటి నుంచి ఫోరెన్సిక్ అధికారులు డీఎన్ఏ పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకున్నారు. మృతదేహాలకు వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాలను కర్నూలు జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 14 మంది మృతుల కుటుంబ సభ్యుల డీఎన్ఏ శాంపుల్స్ కూడా వైద్యులు సేకరించారు.బస్సు ఆపి ఉంటే ప్రమాదం తప్పేది బస్సు బైక్‌ను ఢీకొట్టిన వెంటనే నిలిపేసి ఉంటే అసలు ప్రమాదమే జరిగేది కాదు. బైక్‌పై ప్రయాణించే శివశంకర్ మాత్రమే చనిపోయేవాడు. అయితే, ప్రమాదం తమపైకి రాకుండా ఉండేందుకు డ్రైవర్ లక్ష్మయ్య బస్సును అదే వేగంతోనే నడిపాడు. దీంతో బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడం, 300 మీటర్ల మేర రోడ్డుకు రాపిడికి గురై పెట్రోలు ట్యాంకు పగలడం, మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించడంతో పెను ప్రమాదం సంభవించింది. కాగా, బస్సు ప్రమాద ఘటన అధికారులతో పాటు అందరినీ తీవ్రంగా కలచి వేసింది. నేషనల్ హైవేపై అటు, ఇటు వెళ్లే వాహనదారులు బస్సును, అందులో బూడిదైన మృతదేహాలను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు మృతదేహాలను వెలికి తీసి మాంసం ముద్దలను పక్కనే టెంట్‌లోకి తీసుకెళుతున్న దృశ్యాలను చూసి ఘటనాస్థలిలోని వ్యక్తులు చలించిపోయారు. పలువురు కన్నీరు పెట్టుకున్నారు. ఓ మహిళ మృతదేహంపై మంగళసూత్రం దండ కనిపించింది. బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ వారి వివరాలు 1. అశ్విన్‌రెడ్డి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 2. ఎం.సత్యనారాయణ, ఖమ్మం– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 3. జి.సుబ్రహ్మణ్యం, కాకినాడ– కర్నూలు అశ్విని హాస్పిటల్లో చికిత్స 4. గుణసాయి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 5. ఆండోజు నవీన్‌కుమార్, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 6. నేలకుర్తి రమేష్, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస 7. శ్రీలక్ష్మి, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస 8. వేణు గుండ, ప్రకాశం జిల్లా– బెంగళూరు వెళ్లిపోయారు 9. శ్రీహర్ష, నెల్లూరు– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ 10. శివ, బళ్లారి–బెంగళూరు వెళ్లిపోయారు 11. గ్లోరియా ఎల్సాశామ్ కేరళ– బెంగళూరు వెళ్లిపోయారు 12. ఎంజి. రామరెడ్డి, తూర్పుగోదావరి– హైదరాబాద్ వెళ్లిపోయారు 13. జయసూర్య, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 14. ఉమాపతి, హైదరాబాద్–బెంగళూరు వెళ్లిపోయారు 15. పంకజ్, బీదర్– పోలీస్ స్టేషన్లో ఉన్నారు 16. చరిత్, హైదరాబాద్– బెంగళూరు వెళ్లారు 17. హారిక, బెంగళూరు– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 18. కీర్తి, హైదరాబాద్– హైదరాబాద్ వెళ్లారు 19. వేణుగోపాల్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా– హిందుపురం వెళ్లారు 20. ఆకాష్, బీదర్– కర్నూలులో ఉన్నారు 21. మహమ్మద్ ఖైజర్, బెంగళూరు– బెంగళూరు వెళ్లారు 22. జయంత్ కుశ్వల, హైదరాబాద్– కర్నూలులో ఉన్నారు 23. కె.అశోక్, రంగారెడ్డి జిల్లా– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ 24. జశ్విత, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస 25. అఖీర, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస 26. మిర్యాల లక్ష్మయ్య (డ్రైవర్)– పల్నాడు జిల్లా27. శివనారాయణ (డ్రైవర్)– ప్రకాశం జిల్లాకంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతోపాటు సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కర్నూల్ కలెక్టరేట్ 08518277305 కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి 9121101059, 9494609814, 9052951010 ఘటనాస్థలం 9121101061 పోలీసు కంట్రోల్ రూమ్ 9121101075మృతుల వివరాలుపేరు రాష్ట్రం 1. జి.ధాత్రి (27) పూనూరు, బాపట్ల, ఏపీ 2. జి.రమేష్ (31)3. అనూష (28) 4.శశాంక్ (7) 5.మన్విత (4) 6. కె. శ్రీనివాసరెడ్డి (39) రావులపాలెం ,ఆంధ్రప్రదేశ్ 7. చందన (23) తెలంగాణ8.సంధ్యారాణి (43) తెలంగాణ 9. అనూష (22) తెలంగాణ 10. గిరిరావు (48) తెలంగాణ 11.ఆర్గా బండోపాధ్యాయ(32) తెలంగాణ12. మేఘనాథ్ (25) తెలంగాణ13. ఫిలోమన్ బేబీ(64) కర్ణాటక14. కిషోర్‌కుమార్(41) కర్ణాటక15. ప్రశాంత్(32) తమిళనాడు16.యువన్ శంకర్‌రాజ్(22) తమిళనాడు 17. కె.దీపక్‌కుమార్ (24) ఒడిశా 18.అమృత్‌కుమార్ (18) బిహార్ 19.గుర్తు తెలియని వ్యక్తి (50) (ఆరంఘర్ వద్ద బస్ ఎక్కాడు) 20 శివశంకర్ (23, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి) బి.తాండ్రపాడు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాల వారీగా మృతుల సంఖ్యఆంధ్రప్రదేశ్ 7 తెలంగాణ 6 కర్ణాటక 2 తమిళనాడు 2 బిహార్ 1 ఒడిశా 1 గుర్తుతెలియని వ్యక్తి 1 -
Kurnool: శభాష్ రమేష్.. మంటల మధ్య ఆరుగురి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో!
సాక్షి,కర్నూలు: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి తర్వాత కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదైపోయింది. అత్యంత విషాదకరంగా 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న రమేష్ అనే వ్యక్తి తన తోటి ఆరుగురు ప్రయాణికుల్ని ప్రాణాలకు తెగించి కాపాడాడు. ప్రమాద సమయంలో బస్సులో మంటలు చెలరేగి, చుట్టూ వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బస్సులో చిక్కుకుపోయారు. బయట నుంచి సహాయం అందించేందుకు వీలుకాలేదు. అప్పుడే నేనున్నాంటూ బస్సులో రమేష్ అనే ప్రయాణికుడు ప్రాణాలకు తెగించాడు. బస్సు అద్దం పగలగొట్టి తనతో పాటు మరో ఆరుగురిని బయటకు రప్పించాడు. ఈ విషయాన్ని ప్రమాదం జరిగిన సమయంలో హిందూపురం నుంచి నంద్యాలకు వెళ్తున్న ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో నేను హిందూపురం నుంచి నంద్యాలకు నా కారులో వెళ్తున్నా. అద్దలు పగలగొట్టుకుని బయటకు వస్తున్న ఆరుగురు ప్రయాణికుల్ని నా కారులో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా. మంటలు వ్యాపిస్తుంటే బస్సు లోపల రమేష్ అనే వ్యక్తి అద్దాలు పగలగొట్టి ప్రయాణికుల ప్రాణాల్ని కాపాడారు. ఆస్పత్రికి చికిత్స పొందుతున్న రమేష్‌తో పాటు మిగిలిన ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. బస్సు చుట్టూ మంటలు అంటుకున్నాయి. లోపలి నుంచి బయటకు వచ్చేందుకు.. బయట నుంచి బస్సు లోపలికి వెళ్లి ప్రయాణికుల్ని కాపాడేందుకు వీలు లేదు’ అని పేర్కొన్నారు. సదరు హిందూపురం నివాసి సైతం ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికుల్ని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందడంతో వారి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వ్యక్తి కూడా ప్రాణదాతగా నిలిచి ప్రశంసలందుకుంటున్నాడు. ఆరుగురి ప్రాణాలను కాపాడిన రమేష్ అనే ప్రయాణికుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Jana Varahi Media | Pawankalyan | Janasena (@jana_varahi_media) -
Kurnool: బస్సును తరలిస్తుండగా తిరగబడ్డ క్రేన్..
-
Kurnool: మరో ప్రమాదం.. బస్సును తొలగిస్తుండగా క్రేన్ బోల్తా
సాక్షి,కర్నూలు: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రమాదానికి కారణమైన బస్సును రోడ్డుపై నుంచి తొలగిస్తుండగా క్రేన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్‌కు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్రేన్ ఆపరేటర్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ బస్సు పల్సర్ బైక్‌ను ఢీకొట్టి మంటలు జరిగాయి. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు ఆగకుండా 300 మీటర్లు ముందుకు ఈడ్చుకుని వెళ్లడంతో ఘోరం జరిగింది.బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 19మంది మరణించినట్లు ఏపీ హోంమంత్రి అనిత అధికారికంగా ప్రకటించారు. -
Kurnool Bus Fire Incident: డ్రైవర్ చేసిన పొరపాటు ఇదే..
-
‘స్లీపర్’లోనే ఎందుకీ ప్రమాదాలు?
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదై పోయింది. ఫిట్నెస్ లేని బస్సు, పైగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చేశారు. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడగా, 27 మంది ప్రాణాలతో బతికిబయటపడ్డారు. అయితే బస్సులు అగ్ని ప్రమాదాలకు గురైన సమయంలో అత్యధికంగా ప్రాణానష్టమే కన్పిస్తుంది. ప్రధానంగా ప్లీపర్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైందంటే ప్రాణనష్టం అనేది భారీగా ఉంటుంది. పది రోజుల క్రితం రాజస్థాన్‌లోనూ ఇదేతరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతోన్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరి ఈ ప్రమాదాలకు కారణాలేంటనేది ఒక్కసారి చూస్తే..!డ్రైవర్లకు అలసట.. నిద్రమత్తుసుమారు 250 కిలోమీటర్ల నుంచి 1,000 కి.మీ దాటే వరకూ కూడా ఎక్కువగా ప్రయాణికులు స్లీపర్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ డ్రైవర్లకు అలసట అనేది కీలకంగా మారుతుంది. డ్రైవర్లు అలసట బారిన పడి, నిద్ర మత్తులోకి జారుకోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2018లో నిర్వహించిన ఓ సర్వేలో.. తాము డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తుకు లోనవుతున్నట్లు 25 శాతం మంది డ్రైవర్లు ఏడేళ్ల నాడు నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించారు. డిజైన్ సురక్షితమేనా?స్లీపర్ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు డిజైన్ లోపం కూడా భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడానికి ప్రధాన కారణంగా కనబడుతోంది. బస్సులో పడుకోవడానికి ఏమీ ఇబ్బంది లేకపోయినా, బస్సులో బెర్త్‌లు, సీట్ల మధ్య ఉన్న గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది. కేవలం సింగిల్ మనిషి మాత్రమే వెళ్లేలా ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇది కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఒకర్ని తోసుకుంటూ ఇంకొకరు వెళ్లడం మరింత గందరగోళాన్ని సృష్టించి తొక్కిసలాటకు కూడా కారణమయ్యే చాన్స్‌లు కూడా అత్యధికంగా అనేది నిపుణులు అభిప్రాయం. సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువమంది లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఎత్తు కూడా మరొక సమస్య. వీటి ఎత్తు 8-9 అడుగుల వరకు ఉంటుంది. బస్సు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా ఉంటుంది. రెండు-మూడు నిమిషాల్లో బయట పడితేనే..బస్సు ప్రమాదం జరిగినప్పుడు చాలా స్వల్ప సమయంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రెండు, మూడు నిమిషాల్లో తప్పించుకుంటే ప్రాణాలతో బయటపడుతున్నారు. లేకపోతే అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. స్లీపర్ బస్సులు సాధారంగా ఏసీ బస్సులే అధికంగా ఉంటాయి. ఏసీ బస్సుల్లో ప్రమాదం జరిగితే డోర్స్ ఓపెన్ కావడం కూడా కష్టమే. ఏమైనా అద్దాలు బ్రేక్ చేయాలంటే కూడా ఎంతో కొంత సమయం ఉండాలి. అంటే ఇక్కడ మేల్కొని ఉన్న ప్రయాణికులే ఎంతో కొంత ప్రతిఘటించి బయటకు వచ్చే చాన్స్ ఉంటుంది. ఆ కంగారు, తొందరలో మిగతా వారిని నిద్ర లేపే చాన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. నిద్ర నుంచి ప్రయాణికులు మేల్కొనే సరికి వారు ప్రమాదంలో చిక్కుకుని కొట్టుమిట్లాడుతున్న ఘటనలే మనకు తరచు కనిపిస్తూ ఉన్నాయి. చైనాలో అందుకే నిషేధించారా?చైనా స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించింది. ఈ నిర్ణయం ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు రక్షణ లేకపోవడం, సురక్షితంగా బయటపడే అవకాశం లేకపోవడం వంటి కారణాల వల్ల తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చకు వచ్చింది. చైనా, జర్మనీ వంటి దేశాలు స్లీపర్ బస్సులపై నిషేధం విధించగా, భారత్‌లో మాత్రం ఇంకా కఠిన చర్యలు తీసుకోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి:కర్నూలు శివారులో ఘోరం.. -
కర్నూలు బస్సు ప్రమాదం: ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుల వివరాలు
సాక్షి,కర్నూలు : కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు (నంబర్ DD01 N9490) కర్నూలు ప్రజానగర్‌కు చెందిన శంకర్ పల్సర్ బైక్ ఢీకొట్టింది. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులు తేరుకునేలోపే భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన,సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు :బస్సు ప్రమాద ఘటనలో మృతుల వివరాలు:1. జె. ఫిలోమిన్ బేబీ (64)2. కిషోర్ (64)3. ప్రశాంత్ (32)4. ఆర్గా బందోపధ్యాయ (23)5. యువన్ శంకర్ రాజా (22)6. మేఘనాథ్ (25)7. ధాత్రి (27)8. అమృత్ కుమార్ (18)9. చందన మంగ (23)10. అనూష (22)11. గిరి రావు (48)12. కేనుగు దీపక్ కుమార్ (24)13. జి. రమేష్ 14. జి అనూష 15. మనిత16. కేశనాథ్ 17. సంధ్యారాణి 18. కర్రీ శ్రీనివాస రెడ్డి 19. పంచాల శివశంకర్ (ద్విచక్ర వాహనదారుడు) 20. బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన ఒకరి పేరు తెలియాల్సి ఉంది.సురక్షితంగా ఉన్న ప్రయాణికులు:శ్రీలక్ష్మి, జస్విత (8), అభీరా (1.8) కపర్ అశోక్ (27) అశ్విన్ రెడ్డి ఆకాశ్ జయంత్ కుశ్వాల్ – మధ్యప్రదేశ్ (హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు)పంకజ్ ప్రజాపతి శివా గ్లోరియా ఎల్సా సామ్ – బెంగళూరుచారిత్ (21) మొహమ్మద్ ఖిజర్ (51) తరుణ్ (27) – బస్సులో ఎక్కకముందే ప్రయాణం రద్దు చేసుకున్నారుగాయపడిన ప్రయాణికులు:మన్నెంపల్లి సత్యనారాయణ (27), తండ్రి ఎం. రవి – సత్తుపల్లి, ఖమ్మం జిల్లాబడంత్ర జయసూర్య (24), తండ్రి సుబ్బరాయుడు – మియాపూర్, హైదరాబాద్అండోజ్ నవీన్ కుమార్ (26), తండ్రి కృష్ణాచారి – హయత్‌నగర్, హైదరాబాద్సరస్వతి హారిక (30), తండ్రి రంగరాజు – బెంగళూరునెలకుర్తి రమేష్ (36) – దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లాముసలూరి శ్రీహర్ష (25) – నెల్లూరు జిల్లాపునుపట్టి కీర్తి (28) – ఎస్.ఆర్. నగర్, హైదరాబాద్వేణుగోపాల్ రెడ్డి (24) – తెలంగాణఎం.జి. రామరెడ్డి – తూర్పు గోదావరి జిల్లాఘంటసాల సుబ్రమణ్యం – కాకినాడ, ఆంధ్రప్రదేశ్గుణ సాయి – తూర్పు గోదావరి జిల్లా డ్రైవర్ల వివరాలు 1.లక్ష్మయ్య, పల్నాడు జిల్లా – ప్రధాన డ్రైవర్. సంఘటన సమయంలో బస్సు నడుపుతున్నారు. ప్రమాదం తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం లక్ష్మయ్య పోలీసుల అదుపులో ఉన్నారు. 2.శివనారాయణ, ప్రకాశం జిల్లా – స్పేర్ డ్రైవర్. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది.ప్రయాణికుల రాష్ట్రాలవారీగా: • తెలంగాణ రాష్ట్రం – 6 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – 11 • మధ్యప్రదేశ్ – 1 • కర్ణాటక రాష్ట్రం – 4మరో ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారు తెలియాల్సి ఉంది. -
కర్నూలు బస్సు ప్రమాదం.. మరణాలపై హోంమంత్రి అనిత అధికారిక ప్రకటన
సాక్షి,అమరావతి: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణాలపై ఏపీ హోంమంత్రి అనిత అధికారిక ప్రకటన చేశారు.(Kurnool Bus Fire Accident)కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ..‘వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19మంది మృతి చెందగా.. 27మంది ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడ్డ ఆరుగురిలో ముగ్గురికి ప్రాక్చర్లు అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి. మృతదేహాలను గుర్తించేందుకు 16మంది ఫోరెన్సిక్ నిపుణులను ఏర్పాటు చేసినట్లు’ వెల్లడించారు. -
కర్నూలు ప్రమాదం.. ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి
సాక్షి, హైదరాబాద్: కర్నూలులో(Kurnool Bus Fire Accident) జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతిచెందారు. వారిని ఏపీకి చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణకు చెందిన అనూషరెడ్డిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూషరెడ్డి.. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ధాత్రి ఇటీవల హైదరాబాద్‌లోని మేనమామ ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు గురువారం రాత్రి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.అదే బస్సులో అనూషరెడ్డి కూడా వెళ్లారు. దీపావళికి స్వగ్రామానికి వచ్చిన ఆమె గురువారం రాత్రి బెంగళూరుకు బయల్దేరారు. ఖైరతాబాద్‌లో అనూషరెడ్డి బస్సు ఎక్కి ఈ దుర్ఘటనలో మృతిచెందారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అనూష మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు.ఇదిలా ఉండగా.. వేమురి కావేరి ట్రావెల్స్(vemuri Kaveri Travels) బస్సు ప్రమాదం బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా.. గాయపడిన క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణీకులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
కర్నూలు ప్రమాదం: ప్రయాణికుల వివరాలు ఇవిగో..
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. కాగా, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై అగ్ని ప్రమాదానికి గురైంది. బైక్, బస్సు ఢీకొన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ శివశంకర్ మృతి చెందాడు. ఇక, బస్సులు ప్రయాణించిన వారి జాబితా ఇలా ఉంది. బస్సు ప్రయాణికుల జాబితా ఇదే.. అశ్విన్‌రెడ్డి(36),జి.ధాత్రి(27),కీర్తి(30)పంకజ్(28), యువన్ శంకర్రాజు(22)తరుణ్(27), ఆకాశ్(31),గిరిరావు(48),బున సాయి(33), గణేశ్(30), జయంత్ పుష్వాహా(27)పిల్వామిన్ బేబి(64),కిశోర్ కుమార్(41)రమేష్, అతని ముగ్గురు కుటుంబ సభ్యులురమేష్(30), అనూష(22), మహ్మద్ ఖైజర్(51), దీపక్ కుమార్ 24అన్డోజ్ నవీన్‌కుమార్(26), ప్రశాంత్(32)ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్(25)వేణు గుండ(33), చరిత్(21), చందన మంగ(23)సంధ్యారాణి మంగ(43), గ్లోరియా ఎల్లెస శ్యామ్(28)సూర్య(24)హారిక(30), శ్రీహర్ష(24)శివ(24), శ్రీనివాసరెడ్డి(40), సుబ్రహ్మణ్యం(26)కె.అశోక్(27),ఎం.జి.రామారెడ్డి(50)ఉమాపతి(32), అమృత్ కుమార్(18), వేణుగోపాల్‌రెడ్డి(24).ప్రమాదం నుంచి తప్పించుకున్న 21 మంది వివరాలు.. -
అయ్యో శివుడా!.. గుండెలవిసేలా రోదిస్తున్న యశోదమ్మ
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది మృతి చెందినట్టు సమాచారం. అయితే.. బస్సు, బైక్ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం సందర్బంగా బైక్‌ను బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన బైకర్ శంకర్ చనిపోయాడు. శంకర్‌ను కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.కాగా, శివశంకర్ మరణంతో అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఇలా మృతి చెందడం పట్ల విలపిస్తోంది. గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసే శివశంకర్ నిన్న తెల్లవారుజామున డోన్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బస్సు ముందుభాగంలోకి బైక్ వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం కారణంగా బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉండగా.. వారిలో ఇద్దరు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్టు సమాచారం. ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో నల్లగొండకు చెందిన అనూషా రెడ్డి మృతి..ఇదిలా ఉండగా.. ఘటనా స్థలానికి ఫొరెన్సిక్ బృందం చేరుకుంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగిస్తున్నారు. అలాగే, ఘటన స్థలానికి రవాణా శాఖ అధికారులు చేరుకున్నారు. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని అధికారులు తెలిపారు. కావేరి ట్రావెల్స్ పేరిట ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు. 2018 మే 2న రిజిస్ట్రేషన్ చేశారు. తల్లీకూతుళ్లు మిస్సింగ్.. ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయ్యింది. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గా ఉంది. 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెట్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి. అన్ని కోణాల్లో పూర్థి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
కర్నూలు బస్సు ప్రమాదం.. ప్రయాణికుల షాకింగ్ నిజాలు
-
కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం రియాక్షన్
-
కర్నూలు ఘోర ప్రమాదం.. బస్సుపై డేంజర్ డ్రైవింగ్ చలానాలు
సాక్షి, కర్నూలు: ఘోర ప్రమాదానికి గురైన బస్సుపై భారీగా ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్ ఉన్నాయని రవాణా శాఖ వెల్లడించింది. 2024 నుంచి చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జనవరి(2024) నుంచి అక్టోబర్ (2025) వరకు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. రూ.23120 చలానా పెండింగ్‌లో ఉంది. హైస్పీడ్, డేంజర్ డ్రైవింగ్ కారణంగా రెండు చలానాలు బస్సుపై ఉన్నాయి. తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి. బస్సు ఫిట్నెస్, అనుమతులు.. ఒడిశా పరిధిలోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికితీశారు. బస్సు ప్రమాదస్థలిలో ఫోరెన్సిక్ బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ప్రమాద ఘటన నేపథ్యంలో కూకట్‌పల్లిలోని వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన కార్యాలయం వద్దకు మీడియా చేరుకోగానే సిబ్బంది మూసేస్తూ కనిపించారు. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటనకు వీ కావేరీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణం ఉందని అధికారుల మాటలతో స్పష్టవుతోంది. -
Kurnool Bus Incident: 2 నిమిషాలు.. 22 ప్రాణాలు..!
-
బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన కుటుంబం మృతి
-
పాసెంజర్స్ ని వదిలేసి పారిపోయిన డ్రైవర్, క్లీనర్
-
కర్నూలు బస్సు ప్రమాద ఘటన.. YS జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
-
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం ఆరా
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణమే ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్కో సీఎండీ హరీష్‌ను వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం హెల్స్ లైన్ ఏర్పాటు చేసిందిఎం.శ్రీరామచంద్ర- అసిస్టెంట్ సెక్రటరీ-991291954ఈ.చిట్టిబాబు-సెక్షన్ ఆఫీసర్-9440854433గద్వాల్ కలెక్టరేట్లోని కంట్రోల్ రూం నంబర్-9502271122కలెక్టరేట్లోని హెల్ప్ డెస్క్ నంబర్ 9100901599- 9100901598కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూం నంబర్ 9100901604గద్వాల్ పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 8712661828బాధిత కుటుంబాలు.. ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. -
నా బిడ్డను చంపేశారు కదరా! గుండెల్ని పిండేసే వీడియో
-
బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఢిల్లీ: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటన విచారకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మృతులకు సంతాపం ప్రకటించారు.The loss of lives in a tragic bus fire accident in Kurnool, Andhra Pradesh is deeply unfortunate. I extend my heartfelt condolences to the bereaved family members and pray for the speedy recovery of those injured.— President of India (@rashtrapatibhvn) October 24, 2025ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని కార్యాలయం.. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే, క్షతగాత్రులకు 50వేల తక్షణ సాయం ఇవ్వనున్నట్టు తెలిపింది. Extremely saddened by the loss of lives due to a mishap in Kurnool district of Andhra Pradesh. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be…— PMO India (@PMOIndia) October 24, 2025 -
నిర్లక్ష్యంతో బతుకులు బుగ్గి.. కర్నూలులో ఘోర ప్రమాదం (చిత్రాలు)
-
కర్నూలు ప్రమాదం.. నెల్లూరు రమేష్ కుటుంబ సభ్యులు మృతి
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం సజీవ దహనమైంది. నెల్లూరుకు చెందిన రమేష్ సహా అతడి భార్య, పిల్లలు చనిపోయారు. దీంతో, వారి బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో నలుగురు నెల్లూరు జిల్లా వాసులు చనిపోయారు. వారిని వింజమూరు మండలం గోల్లవారిపాలెంకు చెందిన గోళ్ళ రమేష్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. వీరంతా హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొల్ల రమేష్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) మృతి చెందారు. బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు.ఇక, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ డీడీ01ఎన్9490 బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. -
కర్నూలు శివారులో ఘోరం..
సాక్షి, కర్నూలు/హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదై పోయింది. ఫిట్నెస్ లేని బస్సు, పైగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో మరణాలపై ఏపీ హోమంత్రి అనిత అధికారిక ప్రకటన చేశారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. 27మంది ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. గాయపడ్డ ఆరుగురిలో ముగ్గురికి ప్రాక్చర్లు అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే.. కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059 అలాగే.. ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075, ఇక.. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు 9494609814, 9052951010గా కర్నూలు కలెక్టర్ డా. సిరి తెలిపారు. బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చని సూచించారు. మృత్యు ప్రయాణం ఇలా..వి కావేరి ట్రావెల్స్ మెయిన్ ఆఫీస్ పటాన్ చెరులో ఉంది. కూకట్ పల్లిలో మరో కార్యాలయం ఉంది. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు(డీడీ01ఎన్9490).. రాత్రి 9.30గం. పటాన్చెరు నుంచి ప్రారంభమైంది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకొని బెంగళూరు వైపు బయల్దేరింది. .. అర్ధరాత్రి 3గం.30ని. ప్రాంతంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టింది. బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ను అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లడం.. దాని పెట్రోల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగడంతో మంటలు వ్యాపించాయి. దీంతో.. బస్సును ఆపేసిన డ్రైవర్.. విషయాన్ని హెల్పర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి వాటర్ బబుల్‌తో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బస్సు హఠాత్తుగా ఆగడంతో కొందరు ప్రయాణికులకు మెలుకువ వచ్చి ఏం జరుగుతుందా? అని లేచి చూశారు. ఈలోపే.. మంటలు బస్సుకు అంటుకోవడం ప్రారంభించాయి. అది గమనించి డ్రైవర్ పారిపోగా.. హెల్పర్ ప్రయాణికులను అరుస్తూ బయటకు పిలిచాడు. డోర్ తెరిచి లేకపోవడంతో, ఎమర్జెన్సీ ద్వారం కూడా తెరుచుకోకపోవడంతో.. అద్దాలు పగలకొట్టుకుని కొందరు బయటకు దూకేశారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. గాఢ నిద్రలోఉన్నవాళ్లు, స్లీపర్ బెర్త్‌లో నిద్రిస్తున్నవాళ్లు.. మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేశారు. నిమిషాల్లో బస్సుకు మంటలు వ్యాపించి అందులోనే సజీవ దహనం అయ్యారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న నవీన్ తన కారులో గాయపడ్డ ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. హైమారెడ్డి అనే మరో మహిళ మంటలు చెలరేగడాన్ని చూసి అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో అందరూ వీడియోలు తీస్తున్నారని వాపోతూ ఆమె తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. (Kurnool Travels Bus Fire Accident)డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని.. బైక్‌ను ఢీ కొట్టినప్పుడే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘‘మంటలు అంటుకోగానే అద్దాలు బద్దలు కొట్టి బయటకు దూకేశాం. అప్పటికే మా సోదరుడి కుటుంబం మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ వాళ్ల రక్షణ వాళ్లు చూసుకున్నారు. ప్రమాణికులను పట్టించుకోలేదు’’ అని గాయపడ్డ ఓ ప్యాసింజర్ వాపోయారు. అలాగే.. ఘటన జరిగిన తర్వాత వాళ్ల రక్షణ చూసుకున్నారే తప్ప.. తమను అప్రమత్తం చేయలేదని, అది జరిగి ఉంటే ప్రయాణికులంతా క్షేమంగా బయటపడేవాళ్లని చికిత్స పొందుతున్న మరో ప్రయాణికుడు తెలిపాడు.మృతుల సంఖ్య పెరగొచ్చు: డీఐజీప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే ఘోరం జరిగిపోయింది. ఘటన నుంచి 23 మంది బయటపడ్డారు. ప్రమాద తీవ్రతను డ్రైవర్ అంచనా వేయలేదు. ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికి తీశాం. చికిత్స పొందుతున్నవాళ్ల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరగొచ్చు అని డీఐజీ కోయప్రవీణ్ అన్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన బైక్ సైతం బస్సు కిందే కాలిన స్థితిలో ఉండిపోగా.. బైకర్ మృతదేహం రోడ్డు పక్కనే పడి ఉంది. అతని పేరు శివ శంకర్‌గా తెలుస్తోంది. కొడుకు మృతితో యశోదమ్మ బోరున విలపిస్తూ కనిపించింది.ట్రావెల్స్ నిర్లక్ష్యం కూడా..ఘటన నేపథ్యంలో.. కూకట్‌పల్లిలోని వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన కార్యాలయం వద్దకు మీడియా చేరుకోగానే సిబ్బంది మూసేస్తూ కనిపించారు. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటనకు వీ కావేరీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణం ఉందని అధికారుల మాటలతో స్పష్టవుతోంది. బస్సు నిర్మాణంలో ప్రికాషన్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేలా బస్సులో ఎలాంటి ఏర్పాట్లు లేవని డీఐజీ చెబుతున్నారు. అదే సమయంలో.. ట్రావెల్స్ ఓనర్ పేరు వేమూరి వినోద్ అని, బస్సు ఫిట్నెస్ వాలిడిటీ ఈ ఏడాది మార్చితోనే(31-03-2025) ముగిసిందని, అలాగే.. ఇన్సూరెన్స్ వాలిడిటీ, పొల్యూషన్ కాల పరిమితి కిందటి ఏడాది ఏప్రిల్‌తోనే ముగిశాయని ప్రచారం నడుస్తోంది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ప్రయాణికుల జాబితాలో.. 39 మంది, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలామంది హైదరాబాద్‌కు చెందిన వాళ్లే ఉన్నారు. బస్సులో ఎక్కువగా 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఉన్నట్లు లిస్ట్‌ను బట్టి అర్థమవుతోంది. ప్రమాదం నుంచి బయటపడ్డవాళ్లు.. రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం.. మరికొందరు. -
ప్రమాదం ఎలా జరిగిందంటే.. విస్తుపోయే నిజాలు
-
కాలిపోయిన బస్సు వద్ద కుటుంబం కోసం వెతుకులాట
-
తగలబడిన బస్సు.. నిద్రలోనే ప్రాణాలు..!
-
ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కర్నూలు ఘోర బస్సు ప్రమాదంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (YS Jagan On Kurnool Bus Accident). ఘటన ఎంతో కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఆయన.. వాళ్లకు ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని, అలాగే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ‘‘కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు సజీవ దహనమవడం అత్యంత విషాదకరం. ఈ ఘోర ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి’’ అని ట్వీట్ చేశారు. The news of the tragic bus fire accident near Chinna Tekur village in Kurnool district is deeply distressing. I extend my heartfelt condolences to the families who lost their loved ones. I urge the government to ensure all necessary assistance and medical support to the injured…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2025మరోవైపు.. ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన విచారం వ్యక్తం చేశారని సమాచారం(CM Chandrababu On Kurnool Accident). ఆ వెంటనే సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి.. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.I am shocked to learn about the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district. My heartfelt condolences go out to the families of those who have lost their loved ones. Government authorities will extend all possible support to the injured and…— N Chandrababu Naidu (@ncbn) October 24, 2025ఇటు.. కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుములు రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (CM Revanth Reddy On Kurnool Bus Accident). మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్యాసింజర్స్ లిస్ట్‌లో అత్యధికం హైదరాబాద్‌కు చెందిన వారే ఉండడం గమనార్హం.కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు.…— Telangana CMO (@TelanganaCMO) October 24, 2025కేటీఆర్ దిగ్భ్రాంతి.. కర్నూలు బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.స్థానిక అధికారులు అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టి క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని,ప్రభుత్వo బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నాను అని అన్నారు. మంత్రి నారా లోకేష్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురి కావడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఘటన ఎంతో బాధించిందని.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారాయన. The news of the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district is heartbreaking. I extend my deepest sympathies to the families who have lost loved ones. Wishing speedy recovery to those injured.— Lokesh Nara (@naralokesh) October 24, 2025ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్..కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల పరిస్థితిని కర్నూలు జీజీహెచ్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు మంత్రికి వివరించారు. దీంతో.. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు సూచించారు. ‘‘బస్సులోనే ఇంకా భౌతిక కాయాలున్నాయి. పరిస్థితులకనుగుణంగా ఘటనా స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఫోరెన్సిక్ వైద్యులను ఘటనా స్థలానికి పంపించాం. భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్థానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నాం. స్వల్పగాయాలతో 12 మంది ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. బస్సులో (ఎత్తు) నుంచి దిగడంవల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది’’ అని ఆయన అన్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ఓల్వో బస్సు కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైందని తెలిసి తీవ్ర ద్రిగ్బాంతి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన పై కర్నూలు జిల్లా అధికారులతో మాట్లాడడం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం అయినట్టు తెలిసింది.మృతుల కుటుంబాలకు నా ప్రగడ సంతాపాన్ని తెలియజేస్తున్న. వెంటనే క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్న.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారం.. కర్నూలు జిల్లాలో బస్ ఘోర ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడం పట్ల ఆయన ఆందోన వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి..ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు మరణించడం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.ఇదీ చదవండి: బైక్‌ను ఢీ కొట్టడం వల్లే బస్సు కాలిపోయిందా? -
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురి సజీవ దహనం
కర్నూలు, సాక్షి: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నెంబర్ డీడీ01ఎన్9490 సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. డ్రైవర్, హెల్పర్‌తో పాటు పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరికొందరు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. అర్ధరాత్రి 3.30గం. ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ‘‘బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. బైక్‌ను ఢీ కొటటడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించి మరో డ్రైవర్‌ను నిద్ర లేపాడు. చిన్నపాటి ప్రమాదం అనుకుని వాటర్ బబుల్‌తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అంతలోనే మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్ర లేపాడు. ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టి మరికొందరు బయటపడ్డారు. గాయపడ్డవాళ్లు కర్నూలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేం’’ అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. డ్రైవర్ పరారీలో ఉండగా.. స్పేర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. ఐక్యూ పంపారు.. అమెజాన్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
సాక్షి,కర్నూలు: అమెజాన్ సంస్థకు కర్నూలు జిల్లా కన్జ్యూమర్ కోర్టు షాకిచ్చింది. అమెజాన్ సంస్థపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఇటీవల ఓ వినియోగదారుడు రూ.80,000 చెల్లించి ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ పెట్టాడు. బుదులుగా అమెజాన్ ఐక్యూ ఫోన్‌ను డెలివరీ చేసింది.దీంతో కంగుతిన్న బాధితుడు బాధితుడు కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. అమెజాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కోపోద్రికుడైన కష్టమర్ కర్నూలు జిల్లా కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించారు.విచారణ చేపట్టిన కోర్టు.. అమెజాన్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్‌కు ఐఫోన్ డెలివరీ చేయాలని, లేదంటే రూ.80వేలు రిఫండ్ చేయాలని సూచించింది. అదనంగా రూ.25,000 నష్టపరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది. అయితే, అమెజాన్ సంస్థ ఆ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా వేసింది. -
Kurnool: సెక్యూరిటీ కళ్లుగప్పి.. ప్రధానిని కలిసి !
కర్నూలు: సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పేరుతో ఈనెల 16వ తేదీన కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద ఎన్డీఏ ప్రభుత్వం బహిరంగ సభ నిర్వహించింది. ప్రధాని మోదీ హాజరైన ఈసభలో ఆదోనికి చెందిన ఓ బీజేపీ నాయకుడు ప్రధాని సెక్యూరిటీ కళ్లుగప్పి ఇతరుల ఐడీతో ఆయనను కలిశారు. తర్వాత ఆ ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో చర్చ మొదలైంది. ప్రధానిని కలిసే వారి జాబితాలో సదరు నాయకుడి పేరు లేకపోయినా ఎలా కలిశారని ఆరా తీస్తున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ టీం ఆదోనిలో పర్యటించి ఆ నాయకుడి వివరాలు సేకరించినట్లు సమాచారం. -
Kurnool: ఘోర అగ్ని ప్రమాదం
-
తయారీ కేంద్రంగా భారత్, 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే లక్ష్యం... కర్నూలు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడి
-
కర్నూలులో రూ.2,880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్ మిషన్ కు శంకుస్థాపన
-
కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన..
-
కర్నూలు చేరుకున్న మోదీ
సాక్షి, కర్నూలు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi Kurnool tour) కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శివారులోని నన్నూరు టోల్గేట్ సమీపంలో ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరుతో భారీ బహిరంగ సభ జరుగనుంది. సభ వేదిక కోసం 450 ఎకరాల్లో ప్రాంగణం సిద్ధం చేశారు. పర్యటన సందర్బంగా ప్రధాని.. కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పర్యటన ఇలా.. 7.50 AM: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం10.20 AM: కర్నూలు ఎయిర్పోర్ట్10.25 AM: సున్నిపెంటకు హెలికాఫ్టర్11.10 AM: శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరిక11.45 AM: భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం12.45 PM: భ్రమరాంబ గెస్ట్ హౌస్ తిరిగి చేరిక1.25 PM: సున్నిపెంటకు రోడ్డు మార్గంలో బయల్దేరి1.40 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక2.30 PM: రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు4.00 PM: బహిరంగ సభ4.15 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక4.40 PM: కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరి7.15 PM: ఢిల్లీకి చేరి పర్యటన ముగింపుకర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులు..రూ.2,880 కోట్లతో కర్నూలు-3 పూలింగ్ స్టేషన్‌ను అనుసంధానించేలా ఏర్పాటుచేసిన ట్రాన్స్మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు ప్రధాని శంకుస్థాపన.రెండు కారిడార్లలో సుమారు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తాయన్న కేంద్రం.రెండు కారిడార్ల ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని ప్రకటించిన కేంద్రం.రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్లు ఆస్కారం కల్పిస్తాయన్న కేంద్రం.రూ.960 కోట్లతో సబ్బవరం-షీలానగర్ రహదారికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని.రూ.1,140 కోట్లతో పీలేరు-కాలురు నాలుగు వరుసల రహదారి విస్తరణకు శంకుస్థాపన.గుడివాడ-నూజెండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ. -
నేడు కర్నూలుకు వస్తున్నా: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: గురువారం(నేడు) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. ‘ఈనెల 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తా. ఆ తర్వాత కర్నూలులో విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలు, తదితర రంగాలకు సంబంధించిన రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు నిర్వహించే శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాల్లో పాల్గొంటాను’ అని ప్రధాని తెలిపారు. -
సర్పదోషాలను పరిహరించే పంచలింగాల క్షేత్రం గురించి తెలుసా?
దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే పానవట్టం పై అయిదు లింగాలు వెలసిన దివ్యధామం కర్నూలులోని పంచలింగాల క్షేత్రం. పరీక్షిన్మహారాజు కుమారుడు జనమేజయుడి చేతుల మీదుగా ప్రతిష్థిమైన ఈ ఆలయ సందర్శనం సర్పదోషాలను పరిహరించడంలో ప్రసిద్ధి గాంచింది. స్థల పురాణం ఏం చెబుతోందంటే... పూర్వం సర్పయాగాన్ని నిర్వహించిన జనమేజయ మహారాజు సర్పదోష నివారణ కోసం దేశ నలుమూలల కోటి లింగాలను ప్రతిష్టించారు. ఆ కోటి లింగాలలో చిట్టచివర ప్రతిష్టించినదే ఈ పంచలింగాల క్షేత్రం. ఇక్కడ జనమేజయుడు అనేకమంది యోగులు, మంత్ర సిద్ధుల చేత పంచలింగాలను ప్రతిష్టించి సర్పదోషం నుండి విముక్తి పొందినట్టుగా గంగా పురాణంలో ప్రస్తావించబడినది. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ఈ ఆలయం విరూపాక్ష ముఖ ద్వారంగా విలసిల్లింది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయులు దర్శించారని అక్కడి ఆలయం ముందు ఉండే శిలా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ శాసనాలలో విజయ నగర సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు కూడా నేటì కీ కనిపిస్తాయి. రాయల సీమ కూడా ఈ ప్రాంతం నుండే ఆరంభం అయినట్టు ఇక్కడ లభించే శిలాశాసనాల ద్వారా తెలియవస్తుంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ప్రతిష్టించబడిన వీరభద్రుడు, సకల కోరికలు తీర్చేటువంటి చాముండి మాతను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇంకా ఈ ఆలయం చుట్టు అనేక శివాలయాలు వెలిశాయి. కానీ కాలక్రమేణా ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ గదాధరుడు అయినటువంటి గయా నారాయణుడిని కూడా దర్శించుకోవచ్చు. పూర్వం ఈ క్షేత్రాన్ని దక్షిణ గయగా కూడా పిలిచేవారట. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు సర్పదోషం, నవగ్రహ దోషం, మృత్యుదోషం, కుజ దోషం వంటి అనేక దోషాలు కూడా నివృత్తి అవుతాయని ఆలయ అర్చకుడు తెలిపారు. ఆలయానికి తూర్పు ముఖంగా ప్రవహిస్తున్న తుంగాతీరాన్ని ఆనుకుని వెలసిన ఈ క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ ఆలయాల నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం దేవాదాయ శాఖ వారు చూస్తున్నారు.పంచభూతాల స్వరూపమే పంచలింగాల ఆకాశం, గాలి, నీరు, నిప్పు, వాయువు, భూమి ఈ పంచభూతాల స్వరూపమే ఇక్కడి పరమశివుడి స్వరూపంగా భక్తులు భావిస్తారు. ఇక్కడి ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉండి భక్తుల మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఎంతోమంది ఋషులు ఇక్కడ తపస్సు ఆచరించి పరమశివుడి అనుగ్రహాన్ని పొందినట్టు ఆలయ పండితులు, చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు.ఎలా వెళ్లాలంటే..?కర్నూలు నుంచి కేవలం 5కి.మీ దూరంలో ఈ పంచలింగాల గ్రామం ఉంది. తుంగభద్ర నది తీరాన్ని ఆనుకుని ఈ గ్రామం ఉంది. ఈ ప్రాంతానికి సమీపంలో కాల్వబుగ్గ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం ఉంటుంది. అలాగే కర్నూలులో కొండారెడ్డి బురుజు, కొమ్మచెరువు ఆంజనేయ స్వామి ఆలయం, సమీపంలో అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలు చూడదగ్గ సందర్శనీయ ప్రదేశాలు.


