కర్నూలు జిల్లా: ప్రమాదాల నివారణకు అధికారులు ఓ వైపు రోడ్డు భద్రతా వారోత్సవాలు అంటూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా వాహనదారుల్లో కొంతైనా మార్పు రావడం లేదు. అందుబాటులో రవాణా సౌకర్యాలు సరిగా లేకనో.. త్వరగా చేరుకోవాలనో పలువురు ప్రాణాలకు తెగించి ప్రయాణం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం గోనెగండ్ల బస్టాండ్ వద్ద బైక్‌పై వెళ్తున్న వారని చూస్తే వామ్మో అనాల్సిందే. బైక్ నడుపుతున్న వ్యక్తికి అసలే హెల్మెట్ లేదు.. ఆపై బైక్‌పై ఐదుగురు. అందులో ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోజూ పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుని మరణాలు సంభవిస్తున్నా వాహనదారులకు కనువిప్పు కలగడం లేదు.


