bike
-
వైజాగ్ బీచ్ రోడ్డులో రచ్చ
-
టెన్త్ ఫెయిల్, బైక్ మెకానిక్.. ఇప్పుడు రూ. 350 కోట్ల స్టార్ హీరో
మీరు ఇలాంటి హీరోను అరుదుగా చూస్తారు.. బహుషా భవిష్యత్‌లో కనిపించకపోవచ్చు. థియేటర్ల వద్ద కటౌట్లు పెట్టొద్దని హుకూం జారీ చేస్తాడు. ఎట్టి పరిస్థితిలో పాలాభిషేకాలు చేయొద్దని వేడుకుంటాడు. సినిమా విడుదల సమయంలో ఎలాంటి హంగామా, వేడుకలు వద్దని సూచిస్తాడు. ఇంతకీ ఎవరా స్టార్ అనుకుంటున్నారా..? కోలీవుడ్ హీరో అజిత్.. చిత్ర పరిశ్రమలో ఇలాంటి ప్రవర్తన ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులూ ఫిదా అవుతుండటం విశేషం.సికింద్రాబాద్‌లో జన్మించిన అజిత్అజిత్ నాన్న సుబ్రమణిది తమిళకుటుంబమే అయినప్పటికీ పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించిన మోహినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దేశ విభజన తర్వాత కోల్‌కతాలో స్థిరపడ్డారు. పెళ్ళయ్యాక ఆయనకి సికింద్రాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదారేళ్లపాటున్నారు. రెండో సంతానంగా అజిత్ జన్మించారు. తర్వాత వారు చెన్నై వెళ్లి అక్కడే స్థరపడ్డారు. దీంతో అజిత్‌కి ఏ ప్రాంతీయ భాషా సరిగ్గా రాలేదు. ఆపై స్కూల్లో ఎప్పుడూ అట్టడుగు ర్యాంకే. చివరకు ఆయన్ను పదో తరగతి పరీక్షలకు కూడా అనుమతించలేదు. అలా ఖాళీగా ఉన్నప్పుడే ఓసారి వాళ్ల నాన్నతో ఆఫీసుకెళ్లాడు. అక్కడి ఎండీ గదిలో ఉన్న రేసు బైకుల ఫోటోలను చూసి ఫిదా అయ్యాడు. తానూ ఆ రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే రాయల్ ఎన్ఫీల్డ్ బైకు తయారీ కంపెనీలో మెకానిక్ పనిలో చేరాడు. అలా పదహారేళ్లకే రిపేరింగ్ నేర్చుకుని డబ్బు సంపాదన మొదలుపెట్టాడు. కానీ, అతని తల్లిదండ్రులకి ఆ వర్క్ నచ్చలేదు..! మావాడు మెకానిక్ అంటే అందరూ నవ్వుతున్నారంటూ అజిత్‌పై వాళ్లనాన్న కోప్పడేవాడు. బలవంతంగా మెకానిక్ పనికి ఫుల్స్టాప్ పెట్టించి ఓ గార్మెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు.అక్కడ పనిచేస్తున్నా సరే, అజిత్ రేసులపైన ఆశలు వదులుకోలేదు. తన జీతం డబ్బు మొత్తం పెట్టి బైకు రేసుల్లో పాల్గొనేవాడు. కానీ , ఆ సమయంలో అజిత్‌కు ఎక్కువగా ఎస్పీబీ చరణ్ సాయపడ్డాడు. పదో తరగతిలో మొదలైన ఆ స్నేహమే అజిత్ సినిమాల్లోకి రావడానికి మూల కారణమైంది. గార్మెంట్ ఎక్స్పోర్టింగ్ బిజినెస్ ప్రారంభించిన అజిత్‌కు నష్టాలు వచ్చాయి. అన్నయ్య అమెరికాలో స్థిరపడ్డాడు. తమ్ముడు ఐఐటీ మద్రాసులో చేరాడు. వారికి డబ్బు సర్ధడమే కుటుంబానికి కష్టంగా మారింది. తొలి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది.. ఇప్పటికీ నో ఫోన్అప్పుడే గొల్లపూడి మారుతీరావు కుమారుడు సినిమా మొదలు పెట్టాడు. ఆ సినిమా నిర్మాతకు అజిత్‌ను పరిచయం చేసింది ఎస్పీ బాలసుబ్రమణ్యమే.. అలా అజిత్ కెరీర్లో ఫస్ట్ సినిమా 'ప్రేమ పుస్తకం' తెలుగు పరిశ్రమ నుంచే పడ్డాయి. అక్కడ మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఏమీ లేని స్థాయి నుంచి ప్రస్తుతం రూ. 350 కోట్ల ఆస్తితో నిలదొక్కుకున్నాడు.ఈ కాలంలో మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించని సూపర్ స్టార్ ఒకరు ఉన్నారని చెబితే అది అజిత్ మాత్రమేనని చెప్పవచ్చు. సోషల్ మీడియాకు ఆయన పూర్తిగా దూరంగా ఉంటారు. తనకంటూ యాక్టివ్ ఫ్యాన్ క్లబ్‌లు లేవు. ఎలాంటి వేడుకల్లో పాల్గొనడు. ప్రమోషనల్ యాడ్స్‌లో నటించడు. సినిమా, కారు రేసింగ్లలోనే కోట్ల రూపాయలు సంపాదించాడు.అభిమాన సంఘాలు వద్దని ఎందుకు చెప్పారు..?రాజకీయాల్లో అజిత్ రాబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందుకు అభిమాన సంఘాలిను ఉపయోగించుకుంటున్నాడు అని ప్రచారం జరిగింది. దీంతో ఆ సంఘాలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించాడు. సినిమా హీరోలను అభిమానించే వారికి గొప్ప గుణపాఠం కూడా చెప్పాడు. 'డియర్ సార్,మేడమ్.. ఒక సినిమా నటుడి కోసం మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు. నేనొక మెకానిక్‌ని.. అక్కడి నుంచి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కారణం కరెక్ట్ సమయాన్ని ఉపయోగించడమే. నామీద ప్రేమతో మీరు సమయాన్ని వృథా చేయకండి. అందుకే ఈ అభిమాన సంఘాలను పూర్తిగా రద్దు చేస్తున్నాను. మీ పని అంత మీ కెరీర్‌పైనా పెట్టిండి. భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరాలి. మీరు పట్టుదలతో కరెక్ట్‌గా సమయాన్ని ఉపయోగిస్తే భారీ విజయాలను అందుకుంటారు. -
ఖరీదైన బైక్ కొన్న మాధవన్.. భారత్‌లో మొదటి వ్యక్తిగా రికార్డ్
జాతీయ ఉత్తమ నటుడు ఆర్ మాధవన్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దాదాపుగా 7 భాషాల సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో ఆయన కూడా ఒకరు. ఆయనకు బైకులంటే చాలా ఇష్టం. ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ రంగంలో బిగ్గెస్ట్ బ్రాండ్‌గా గర్తింపు ఉన్న బ్రిక్ట్సన్ క్రోమ్‌వెల్ 1200 సీసీ బైక్‌ను మాధవన్ కొనుగొలు చేశారు. రెట్రో డిజైన్‌తో పాటు ఆధునిక ఇంజనీరింగ్ వర్క్ స్టైల్‌తో ఉన్న ఈ బైక్‌ను కొనుగోలు చేసిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు.ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బ్రిక్ట్సన్ అధికారికంగా భారతదేశంలో తన విక్రయాలను ప్రారంభించింది. నటుడు ఆర్. మాధవన్ తొలి బైక్ క్రోమ్‌వెల్ 1200 సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న వాహనాన్ని కొనుగోలు చేశారు. మోటోహాస్ భాగస్వామ్యంతో బ్రిక్ట్సన్ భారతదేశంలో అడుగు పెడుతోంది. బెంగళూరు, కోల్హాపూర్, గోవా, అహ్మదాబాద్, సంగ్లీ వంటి నగరాల్లో డీలర్‌షిప్‌లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. జైపూర్, మైసూర్, కోల్‌కతా, పూణే, ముంబైలలో షోరూమ్‌లు రానున్నాయి. ఈ బైక్ కంపెనీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించనున్నారు. కొత్త బైక్‌పై తన కుమారుడు వేదాంత్ పేరును చేర్చాడు.ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ ధర రూ. 7.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. హై-పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ విభాగంలో ఇది ఒక ఆకర్షణీయమైన ఎంపిక అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బ్రిక్ట్సన్ క్రోమ్‌వెల్ 1200 సీసీ ఇంజన్‌తో కలిగి ఉండి 108Nm టార్క్‌తో పనిచేస్తుంది. నిస్సిన్ బ్రేక్‌లు, బాష్ ABS, KYB అడ్జస్టబుల్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ-థెఫ్ట్ కీ సిస్టమ్, TFT డిస్ప్లే, పిరెల్లి ఫాంటమ్ ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ప్రీమియం ఫీచర్లతో బైక్ ఉంది. -
సూపర్ హెల్మెటూ కాదంట పెట్టుకోకుంటే బండి స్టార్టు
-
బైక్ రైడ్ .. రికార్డ్ బ్రేక్..
సాక్షి, హైదరాబాద్: వేగవంతమైన రైడ్ చేసిన అతిపిన్న వయస్కుడైన బైకర్‌గా ఇటీవల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు çఅందుకున్నాడు కొండా సిద్ధార్్థ. నగరవాసి అయిన మంచిర్యాలకు చెందిన సిద్ధార్థ్ ప్రస్తుతం సొంత వ్యాపారం చేస్తున్నాడు. ఈ సందర్భంగా తను పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే.. జాలీరైడ్ చేద్దామనుకున్నా.. బైక్ మీద తోచినదారిన సాగిపోవాలని, మార్గ మధ్యంలోనే పని చేసుకుంటూ, సంపాదించుకుంటూ ఆ డబ్బునే ఖర్చు చేసుకుంటూ యాత్ర చేయాలనేది నా ఆలోచన. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ మేనేజర్ విమలేష్ కుమార్ నాన్ రిపీటింగ్ రైడ్ గురించి నాకు తొలుత పరిచయం చేశాడు. తనే ఆ తర్వాత కూడా మార్గనిర్దేశం చేస్తూ సహకరించారు. ఈ రైడ్స్ ద్వారా మంచి సందేశాలు అందించవచ్చని, అలాగే రికార్డ్స్ సాధించొచ్చని తెలుసుకున్నాక.. ఆ దిశగా నేనెందుకు ప్రయత్నం చేయకూడదు? అని ప్రశ్నించుకున్నా.. నా యాత్రకు అవయవ దానం, జంతువుల సంక్షేమంపై అవగాహన కల్పించడమే లక్ష్యం మార్చుకున్నా. కేవలం 96 రోజుల్లో 40,708.5 కిమీ ప్రయాణంలో 28 రాష్ట్రాలు 2,731 ప్రదేశాల మీదుగా సాగిపోయా. ఇందులో ఓ కేంద్ర పాలిత ప్రాంతం కూడా కవర్ అయ్యింది. ఈ రైడ్‌లో.. 3వ రికార్డ్.. ప్రపంచంలో ఈ తరహా నాన్ రిపీటింగ్ మారథాన్ ట్రిప్ ఫీట్‌ను సాధించిన ముగ్గురు పిన్న వయసు రైడర్లలో చైనా నుంచి ఒకరు, చెన్నై నుంచి మరొకరు మాత్రమే ఉన్నారు. అలా మన దేశం నుంచి నేను కూడా వారి సరసన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరును నమోదు చేసుకున్నా. ప్రస్తుతం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేయాలనుకుంటున్నా. లడఖ్‌లో రెండు వారాల పాటు మంచు కురుస్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు ద్రాస్‌లో రోడ్డుకు అడ్డంగా మంచు చరియలు విరిగిపడుతున్నప్పుడు.. కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. అదృష్టవశాత్తూ ఈ డేంజరస్ ప్రయాణంలో ఎలాంటి ప్రమాదానికీ గురికాలేదు. ప్రమాదాల నివారణకు..ఈ రైడ్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411 అనే అడ్వెంచర్ బైక్ ఉపయోగించా. జర్మనీ నుంచి ప్రత్యేక హెల్మెట్‌ను దిగుమతి చేసుకున్నా. స్లీపింగ్ బ్యాగ్, కెమెరాతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి జంతువులకు కట్టడానికి కాలర్ టైలను తీసుకువెళ్లా, క్యాంపింగ్ టెంట్, మెడికల్ కిట్, మోటర్‌బైక్ ఉపకరణాలు దగ్గర ఉంచుకున్నా. యుఎస్ లోని ఓ ఇన్స్టిట్యూట్ నుంచి ఫైర్ సేఫ్టీ సంబంధిత కోర్సును అభ్యసించా. -
తండ్రికి స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇచ్చిన రింకూ సింగ్.. వీడియో
టీమిండియా స్టార్ ప్లేయర్, కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ డౌన్ టు ఎర్త్ క్రికెటర్లలో ఒకడు. పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్.. తనకు ఇష్టమైన ఆటకోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకొనొక దశలో స్వీపర్‌గా పనిచేసిన రింకూ.. ఇప్పుడు భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.అయితే రింకూ సింగ్ విజయం వెనక అతడి తండ్రిది ఖన్‌చంద్ర సింగ్ కీలక పాత్ర. ఖన్‌చంద్ర సిలిండర్ల మోస్తే వచ్చే డబ్బుతో రింకూ క్రికెట్ ఆడేవాడు. అతడి సంపాదనతో కుటుంబం మొత్తం గడిచేది. అయితే తాజాగా రింకూ సింగ్ తన తండ్రిపై ప్రేమను చాటుకున్నాడు. తన తండ్రికి రింకూ ఖరీదైన నింజా స్పోర్ట్స్ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ బైక్ ఖరీదు రూ. 3.19 లక్షలగా ఉన్నట్లు తెలుస్తోంది. నింజా స్పోర్ట్స్ బైక్‌తో రింకూ తండ్రి అలీఘడ్‌లో చక్కర్లు కొడుతున్నాడు. ఆ సిటీలోని చిన్న చిన్న వీధుల్లో అతను కవాసాకి నింజా బైక్‌ను రైడ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా తన తనయుడు స్టార్ క్రికెటర్ అయినప్పటికి.. ఖన్‌చంద్ర ఇంకా వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే పనని వదలకపోవడం విశేషం. మరోవైపు రింకూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించారు. త్వరలోనే ఎంగేజ్మెంట్ జరిగే అవకాశముంది. కాగా రింకూ సింగ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. బుధవారం జరగనున్న తొలి టీ20లో రింకూ ఆడనున్నాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే! అతడికి నో ఛాన్స్? View this post on Instagram A post shared by Sonu Lefti (@sonulefti0700) -
‘అఫ్జల్‌గంజ్’ కేసులో పురోగతి
హైదరాబాద్, సాక్షి: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పురోగతి చోటు చేసుకుంది. దోపిడీ కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్‌లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. నిందితులిద్దరి బీహార్ లేదంటే జార్ఖండ్ పారిపోయి ఉంటారని ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ బీదర్ పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.తొలుత తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేట వరకు వెళ్లిన దుండగులు.. అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆపై గజ్వేల్ నుంచి అదిలాబాదు వరకు లారీలో ప్రయాణించినట్లు గుర్తించారు.అదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా బీదర్-హైదరాబాదు పోలీసుల ప్రత్యేక బృందాలు బీహార్‌తో పాటు జార్ఖండ్‌కు చేరుకున్నాయి. ‘కాల్పుల’ వాహనం దొరికిందిసాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకతో పాటు నగరంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన దుండగులు వినియోగించిన వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని మహాత్మా గాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) పార్కింగ్ నుంచి ఈ వాహనాన్ని మంగళవారం రికవరీ చేశారు. నిందితుల ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్న అధికారులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 750 సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌ను వడపోసిన సిటీ పోలీసులు మరిన్ని కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టారు. నేరం జరిగిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న దుండగులు.. హైదరాబాద్‌లోనే షెల్డర్ తీసుకుని, బీదర్‌లో నేరం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బీదర్‌లోని శివాజీ జంక్షన్ వద్ద ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనాన్ని కొల్లగొట్టడానికి దుండగులు బైక్‌పై వెళ్లారు. ఈ వాహనానికి ‘ఏపీ’ రిజి్రస్టేషన్‌తో కూడిన నకిలీ నంబర్ ప్లేట్ ఉంది. దీన్ని హైదరాబాద్ లేదా శివారు ప్రాంతాల్లో చోరీ చేసి ఉంటారని భావిస్తున్న అధికారులు.. ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. బీదర్‌లో నేరం చేసిన తర్వాత రాయ్‌పూర్ వెళ్లడానికి అఫ్జల్‌గంజ్‌కు వచి్చన దుండగులు.. రోషన్ ట్రావెల్స్ వద్దకు ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చారు. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు మంగళవారం ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉన్న అనుమానాస్పద వాహనాలను పరిశీలించారు. గురువారం పార్క్ చేసిన వాటి వివరాలు ఆరా తీసి నిందితులు వాడింది గుర్తించారు. నిందితులు సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వద్ద ఎక్కిన ఆటోలో గజ్వేల్ వెళ్లాలని ప్రయత్నించి, తిరుమలగిరిలో దిగిపోయారు. అక్కడ నుంచి శుక్రవారం మధ్యాహా్ననికి ఆదిలాబాద్ చేరుకున్న దుండగులు సరిహద్దులు దాటించి మహారాష్ట్రలో ప్రవేశించినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఆద్యంతం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన నిందితుల ఆచూకీ కనిపెట్టడానికి పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. -
హార్లే డేవిడ్సన్ బైక్‌ను తలపించే కొత్త మోడల్ (ఫొటోలు)
-
ఏథర్ కొత్త మోడళ్లు.. ధర ఎంతంటే..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ 2025లో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఇందులో విభిన్న వేరియంట్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. స్కూటర్ బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ధర నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రతి వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించే దూరాల్లో మార్పు ఉంటుందని తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం మోడల్‌ను అనుసరించి ఎక్స్‌షోరూమ్ ధర కింది విధంగా ఉంది.ఏథర్ 450ఎస్ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 122 కిమీ.ఏథర్ 450ఎక్స్ 2.9 కిలోవాట్2.9 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ధర రూ.1,46,999(ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 126 కిమీ.ఏథర్ 450ఎక్స్ 3.7 కిలోవాట్ 3.7 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ఐడీసీ(ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) రేంజ్ 161 కి.మీ, ధర రూ.1,56,999(ఎక్స్-షోరూమ్).ఏథర్ 450 అపెక్స్ధర రూ.1,99,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 157 కి.మీ.ఇదీ చదవండి: మస్క్ మంచి మనసు.. భారీ విరాళంఏథర్ 450 ఎక్స్, 450 అపెక్స్ మోడళ్లు మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్‌ను కలిగి ఉన్నాయి. ఇది స్మూత్ సర్ఫేస్(తక్కువ ఘర్షణ కలిగిన ఉపరితలాలు)పై స్కూటర్ జారిపోకుండా నిరోధిస్తుంది. దాంతో రైడర్ భద్రతను పెంచినట్లు కంపెనీ తెలిపింది. రైడర్లు బైక్ నడుపుతున్న సమయంలో రెయిన్ మోడ్, రోడ్ మోడ్, ర్యాలీ మోడ్ అనే మూడు విభిన్న మోడ్‌లను ఎంచుకోవచ్చని పేర్కొంది. -
భవిష్యత్తులో ఇలాంటి బైకులే!.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
-
బైక్ పార్కింగ్ చేస్తే ఖతం
-
క్లాసిక్ లుక్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ మోడల్ (ఫొటోలు)
-
‘రయ్’న దూసుకుపోయే ట్రెక్కింగ్ బైక్ (ఫొటోలు)
-
అదిరిపోయే ఎలక్ట్రిక్ ట్రెక్కింగ్ బైక్ (ఫొటోలు)
-
బండెక్కిన ఒంటె
-
బీఎండబ్ల్యూ కొత్త అడ్వెంచర్ బైక్ (ఫొటోలు)
-
వాహనం చిన్నదే.. ప్రయోజనాలు ఎన్నో: దీని రేటెంతో తెలుసా?
-
రామాంతపూర్ వివేక్ నగర్ లో పేలిన బ్యాటరీ బైక్
-
దూసుకెళ్లే రేసుగుర్రం.. రాకెట్ వన్ బైక్ (ఫోటోలు)
-
బైక్ కొనలేదని విద్యార్థి ఆత్మహత్య
పీఎంపాలెం: పుట్టిన రోజు నాడు విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి బైక్ కొనలేదని కోపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ప్రాణస్నేహితులను దుఃఖ సాగరంలో ముంచెత్తాడు. పీఎంపాలెం గాయత్రీనగర్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సోమవారం జరిగిన సంఘటనకు సంబంధించిన సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. పేరిశెట్టి సూర్యనారాయణ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామం నుంచి సుమారు ఆరేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. ప్రస్తుతం ఓ కళాశాలలో హాస్టల్ కుక్‌గా పనిచేస్తూ పీఎంపాలెం గాయత్రీనగర్‌లో భార్య గంగ, పెద్ద కుమారుడు గణేష్ , 9వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడు లోకేష్‌తో కలిసి నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం పుట్టిన రోజు కావడంతో సాయంత్రం కేక్ కట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో ఇంటి తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. అనుకోని పరిణామంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు వేలాడుతున్న గణేష్‌ను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు.బైక్ కొనమని తండ్రితో గొడవవిద్యార్థి గణేష్ ఎప్పటి నుంచో బైక్ కొనమని తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. బైక్ కొనే స్థోమత ఆ కుటుంబానికి లేదు. ఇదే విషయం తల్లిదండ్రులు గణేష్ నచ్చచెప్పినప్పటికీ వినేవాడు కాదు. ఈ విషయంపైనే తండ్రితో గొడవ పడినట్టు స్థానికులు చెబుతున్నారు. బైక్ కొనే స్థోమత లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
HYD: మీర్పేట్లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నగరం మీర్పేట్లో సోమవారం(అక్టోబర్7) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నందన వనం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.టూ వీలర్‌ను లారీ ఢీకొనడంతో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మీద నుంచి లారీ వెళ్లడంతో వారి మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. ఇదీ చదవండి: భారీగా సైబర్ నేరగాళ్ల అరెస్ట్ -
మైలార్‌దేవ్‌పల్లిలో లారీ బీభత్సం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మైలార్ దేవ్పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు అత్తాపూర్‌కు చెందిన రాజుగా గుర్తించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.అత్తాపూర్ నుండి మోటార్ సైకిల్ పై చంద్రాయన్ గుట్ట వైపు రాజు అతని స్నేహితుడు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దుర్గా నగర్ చౌరస్తా వద్దకు రాగానే ముందు వెళ్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం -
ఇదేం మాస్ రా మావా..!
-
రూలర్స్..రూల్స్ బ్రేక్
ఈ ఫొటోల్లో రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ ద్విచక్ర వాహనదారులను నిలిపివేసి... హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి రూ.1,030 అపరాధ రుసుం విధించడంతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు.ఈ ఫొటోల్లో ఏకంగా జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చొని మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌ను పరిశీలించారు. వాహనం నడుపుతున్న వ్యక్తి గానీ వెనుక కూర్చున్న కలెక్టర్, గణబాబు గానీ హెల్మెట్ ధరించలేదు. ద్విచక్ర వాహనం మీద ప్రయాణించే ఇద్దరూ హెల్మెట్లు ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను స్వయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు తుంగలో తొక్కుతున్నా.. అటువైపు కనీసం రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదు. చట్టం అధికారం ఉన్న వాడికి చుట్టమనే నానుడి ఇటువంటి అధికారులు, ప్రజాప్రతినిధుల వల్ల మరింత బలపడినట్టయింది.గోపాలపట్నం: జిల్లాలో హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నారంటూ... ఈ నెల ఒకటి నుంచి 5వ తేదీ వరకు 1,199 మందికి రూ.1,035 అపరాధ రుసుం విధించడంతో పాటు లైసెన్సులను తాత్కాలికంగా మూడు నెలల పాటు రద్దు చేశారు. మూడు నెలల వరకు వీరెవ్వరూ వాహనాన్ని నడిపేందుకు అవకాశం లేదు. వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు కఠినంగా వ్యవహరించాల్సిందే. దీనిని ఎవరూ తప్పుపట్టడం లేదు. అయితే సాధారణ ప్రజలకు ఒక విధంగా.. అధికారం ఉన్న వారి పట్ల మరో విధంగా ప్రవర్తించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.విస్తృతంగా తనిఖీలుద్విచక్రవాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని సుప్రీం కోర్టు ఆదేశాలను ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు పలు చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి రూ.1035 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు. కేవలం ఐదు రోజుల్లో 1,199 మంది లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. వీరు మూడు నెలల తరువాత రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి జరిమానా విధించిన రశీదు, ఆధార్ కార్డు అందజేస్తే లైసెన్సును పునరుద్ధరిస్తారు.హెల్మెట్ ధారణ తప్పనిసరిహెల్మెట్లు లేకుండా ప్రయాణించడంతోనే చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్నవారు కూడా కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని కొద్ది రోజులుగా అవగాహన కల్పించాం. ఈ నెల ఒకటో తేదీ నుంచి నిబంధనలను అమలు చేస్తున్నాం. ఐదు రోజుల్లో 1,199 మంది లైసెన్సులను రద్దు చేశాం. పోలీసుల వద్ద సుమారు 3 వేల వరకు ఈ రశీదులున్నాయి. వాటిని కూడా సేకరించి రద్దు చేసే చర్యలు చేపడతాం.– రాజారత్నం, ఉప రవాణా కమిషనర్, విశాఖ -
శంషాబాద్‌లో యువకుడి హల్చల్
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. తొండుపల్లిలో ట్రాఫిక్ పోలీసులతో యువకుడు గొడవ పెట్టుకున్నాడు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను ఆపి చెకింగ్ చేస్తుండగా.. యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నీళ్లలో కొట్టుకుపోయిన బైక్
-
Souo s2000 GL: బైకులలో బాహుబలి!.. 2000 సీసీ ఇంజిన్ (ఫోటోలు)
-
ఎంత అమానుషం: భార్యను తాడుతో కట్టేసి.. బైక్‌పై ఈడ్చుకెళ్లిన భర్త
రాజస్థాన్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. తాగిన మైకంలో ఓ భర్త తన భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు. భార్య కాళ్లకు తాడు వేసి దానిని బైక్‌కు కట్టి కొంతదూరం లాక్కెళ్లాడు. ఈ ఘోర దృశ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో.. మట్టి, రాళ్లు కలిగిన నేల మీద మహిళను ఈడ్చుకెళ్తుండే.. ఆమె నొప్పితో బాధపడుతూ సాయం కోసం అరవడం వినిపిస్తోంది. అక్కడే ఓ మహిళ, మరో వ్యక్తి (వీడియో తీస్తున్న అతను) ఉన్నప్పటికీ దీనిని ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. నాగౌర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.మహిళను కొంతదూరం లాక్కెళ్లిన తర్వాత అతడు బైక్ దిగి ఓ సాధించినట్లు నడుం మీద చేయి వేసి దర్జాగా నిల్చొని ఉన్నాడు. గాయాలపాలైన భార్య మెల్లగా లేచి ఏడుస్తూ నిలబడి ఉంటుంది. అయితే ఈ 40 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు చెందిన ఘటన గత నెలలో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలోషేర్ చేయడంతో చక్కర్లు కొడుతోంది. అయితే జైసల్మేర్‌లో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లాలని భార్య అనుకోగా..భర్త ఆమెపై ఈ విధంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిని ప్రేమ్ రామ్ మేఘ్వాల్గా(32) గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మేఘ్వాల్ నిరుద్యోగి, డ్రగ్స్ బానిసైనట్లు పంచౌడీ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ సురేంద్ర కుమార్ తెలిపారు. ప్రస్తుతం మహిళ పంజాబ్‌లోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు సమాచారం.Shocking incident in Nagaur: A man, under the influence of alcohol,tied his wife to the back of a bike and dragged her on the road.The video went viral, leading to the man's arrest. Prior to this, the wife was reportedly held captive at home. She is now with her mother in Punjab. pic.twitter.com/Nfik4CJpqj— Smriti Sharma (@SmritiSharma_) August 13, 2024 -
తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం.. ఇద్దరి మృతి
సాక్షి,హైదరాబాద్: తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం(ఆగస్టు 7) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డుపై చివరి మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో దానిపై వెళ్తున్న ఇద్దరు కిందపడ్డారు. కిందపడ్డవారి మీద నుంచి వెనుక నుంచి వస్తున్న బస్సు వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఘోర ప్రమాదం కారణంగా ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్‌జామ్ అయింది. -
హైదరాబాద్ గోల్కొండలో కారు బీభత్సం
-
కారుతో ఢీకొట్టి.. 4 కి.మీ.ఈడ్చుకెళ్లి..
మునిపల్లి (అందోల్): బైక్‌పై వెళుతు న్న ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాయపడి న వ్యక్తి కారు బంపర్ లో ఇరు క్కుపోయినా పట్టించుకోలేదు. నాలుగు కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లడంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. బుదేరా ఎస్ఐ రాజేశ్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వన పర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల కానపురం తండాకు చెందిన మెగావత్ వెంకటేశం (22) హైదరాబాద్ మియాపూర్‌లో ఉంటూ ఎల్ఎల్బీ చదువుతున్నాడు. జహీరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి బైక్‌పై మియాపూర్‌కు పయన య్యాడు. హైదరాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ కర్ణాటకలోని గానుగాపూర్ దైవదర్శ నానికి వెళ్లి కారులో తిరిగి వస్తూ.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పరిధిలో ముంబై జాతీయ రహదారిపై వెంకటేశాన్ని వేగంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ పక్కకు పడిపోగా వెంకటేశం కారు బంపర్‌లో చిక్కుకున్నాడు. ఈ విషయం తెలిసినా కూడా రాజ్‌కుమార్.. కారుతో అలాగే నాలుగు కిలోమీటర్లు వెళ్లిపోయాడు. ఈ క్ర మంలో లింగంపల్లి టోల్గేట్ వద్ద ఆగిన కారు.. మృతదేహం ఇరుక్కుపోవడం వల్ల ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో టోల్గేట్ సిబ్బంది వచ్చి చూడగా.. మృతదే హం ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశాన్ని సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు చెప్పారు.ఛిద్రమైన శరీరం..కారులో ఇరుక్కున్న వెంకటేశం మృతదేహం పూర్తిగా ఛిద్రమైంది. వీపుభాగం మొ త్తం కాలిపోయింది. కాళ్లు విరిగిపోయాయి. తలకు తీవ్ర గాయం కావడంతో రక్త స్రావమైంది. చేతులు నెంబర్ ప్లేట్లో, కొన్ని శరీర భాగాలు పొగగొట్టంలో ఇరు క్కుపోయాయి. రోడ్డు ప్రమాదం జరగడంతో భయపడి తాను కారు అపకుండా వచ్చానని రాజ్‌కుమార్ అంగీకరించినట్టు బుదేరా ఎస్ఐ రాజేశ్‌నాయక్ తెలిపారు. -
రీల్స్ మోజులో ప్రాణం పోయింది
లింగోజిగూడ/వర్ధన్నపేట: ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం బైక్‌పై చేసిన స్టంట్ అదుపుతప్పి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు కోనాపురానికి చెందిన మేడ రాజు, మహబూబీ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఎల్బీనగర్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలో నివాసముంటున్నారు.మేడ రాజు కుమారుడు శివ (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం తన స్నేహితులు సంపత్, పవన్, విజయ్‌తో కలిసి బైక్‌లపై ఎల్బీనగర్ పెద్దఅంబర్‌పేట వైపు బయల్దేరారు. కేటీయం బైక్ ను శివ నడుపుతుండగా సంపత్ వెనుక కూర్చున్నాడు. శివ తన బైక్‌తో రీల్స్ కోసం స్టంట్లు చేస్తుండగా, మరో బైక్‌పై ఉన్న పవన్, విజయ్‌లు వీడియో తీస్తున్నారు. హయత్‌నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద శివ నడుపుతున్న బైక్.. స్కూటర్‌ను ఢీ కొట్టడంతో అదుపుతప్పి కిందపడ్డారు.శివ, సంపత్‌లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. శివ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రగాయాలతో సంపత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శివ మృతదేహాన్ని ఆదివారం రాత్రి స్వగ్రామం కోనాపురానికి తరలించారు. హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
CNG-Powered Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ (ఫొటోలు)
-
అమెరికా ఆటల పోటీలో... మన మహిళా పోలీస్
వేసపోగు శ్యామల... హైదరాబాద్, సైఫాబాద్ ట్రాఫిక్ ఏ.ఎస్.ఐ. ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ‘2024 పాన్ అమెరికన్ మాస్టర్స్ గేమ్స్’కి ఆహ్వానం అందుకున్నారామె. ఈ నెల 12 నుంచి 21 వరకు యూఎస్ఏలోని ఓహియో రాష్ట్రం, క్లీవ్‌ల్యాండ్‌లో జరగనున్న పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలలో పాల్గొంటున్న సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి నేటి వరకు తన ప్రస్థానాన్ని ‘సాక్షి’ ఫ్యామిలీతో పంచుకున్నారు.‘‘నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్, కర్నూలు పట్టణంలోని సిమెంట్‌నగర్‌లో. నాన్న మిలటరీ ఆఫీసర్ అమ్మ స్టాఫ్‌నర్స్. ఏడుగురు అక్కలు, ఇద్దరు అన్నల గారాల చెల్లిని నేను. మా పేరెంట్స్ మమ్మల్నందరినీ బాగా చదివించారు. నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక అన్న మిలటరీలో ఉన్నారు. ఒక అక్క, నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాం. నా ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ నగరంలోని గోపాల్పురం. విద్యార్థి దశ నుంచి మంచి క్రీడాకారిణిని. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఖోఖో, కబడీ, త్రో బాల్, వాలీ బాల్, బ్యాడ్మింటన్‌లో లెక్కలేనన్ని పతకాలందుకున్నాను. షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో జాతీయస్థాయి పతకాలందుకున్నాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. నేను ఇప్పుడు మీ ముందు ఇంత అడ్వెంచరస్‌గా కనిపిస్తున్నానంటే కారణం ఈ నేపథ్యమే.ఈ ఉద్యోగం ఆడవాళ్లకెందుకు?స్త్రీపురుష సమానత్వ సాధన కోసం ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. మాలాంటి ఎందరో పోలీసింగ్, దేశరక్షణ వంటి క్లిష్టమైన విధులను భుజాలకెత్తుకున్నాం. కానీ సమాజం మాత్రం అంత ముందు చూపుతో లేదన్న వాస్తవాన్ని మా డిపార్ట్మెంట్లోనే చూశాను. ‘ఆఫ్టరాల్ ఉమన్, జస్ట్ కానిస్టేబుల్, యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వస్తారు, వెళ్తారు. జీతం దండగ’ అనే మాటలు మేము వినాలనే అనేవాళ్లు. నాలో కసి ఎంతగా పెరిగిపోయిందంటే... వాహనం కొనేటప్పుడు చిన్నవి వద్దని 350 సీసీ బుల్లెట్ తీసుకున్నాను. ‘ఏ అసైన్మెంట్ అయినా ఇవ్వండి’ అన్నాను చాలెంజింగ్‌గా. నైట్ పెట్రోలింగ్ చేయమన్నారు.అది కూడా సింగిల్‌గా. ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా వరుసగా 60రోజులు రాత్రి పది నుంచి రెండు గంటల వరకు బైక్ మీద హైదరాబాద్ సిటీ పెట్రోలింగ్ చేశాను. ఆ డ్యూటీతో వార్తాపత్రికలు, టీవీలు నన్ను స్టార్‌ని చేశాయి. ‘ఎంటైర్ ఆల్ ఇండియా చాలెంజింగ్ ఉమన్ ఆఫీసర్’ అని అప్పటి సీపీ అంజనీకుమార్ సత్కరించారు. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌గా ఏసీపీ రంగారావు చేతుల మీదుగా సత్కారం అందుకున్నాను.బుల్లెట్ పై వస్తా... ఆకతాయిల భరతం పడతా!పోలీసులంటే శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ అడ్రస్ చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, భరోసా, షీ టీమ్స్, తెలంగాణ స్టేట్ పోలీస్ కౌన్సెలింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, కరోనా సమయంలో అనారోగ్యంతో ప్రయాణించవద్దు– వ్యాప్తికి కారణం కావద్దనే ప్రచారం, ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం, ఆత్మహత్యల నివారణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ... ‘మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. నిలబెట్టుకోవడం, కాలరాసుకోవడం రెండూ మన నిర్ణయాల మీదనే ఉంటాయ’ని చెప్పేదాన్ని. గణేశ్ ఉత్సవాల సమయంలో మహిళలను తాకుతూ విసిగించడం, మెడల్లో దండలు అపహరించే పోకిరీల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది మా డి΄ార్ట్‌మెంట్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిల భరతం పట్టడం చాలా సంతోషాన్నిచ్చింది. సరదాకొద్దీ సోలో రైడ్లుచిన్నప్పటి నుంచి టామ్‌బాయ్‌లా పెరిగాను. బైక్ అంటే నా దృష్టిలో డ్యూటీ చేయడానికి ఉపకరించే వాహనం కాదు. బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. ‘వరల్డ్ మోటార్‌సైకిల్ డే’ సందర్భంగా బైక్ రైడ్ చేశాను. బైకర్లీగ్ విజేతను కూడా. ‘ఉమన్ సేఫ్ రైడర్ ఇన్ తెలంగాణ’ పురస్కారం కూడా అందుకున్నాను. అడ్వెంచరస్ స్పోర్ట్స్ అంటే ఇష్టం.గుర్గావ్లో ΄ారాషూట్ డైవింగ్, పారాగ్లైడింగ్ చేశాను. నా సాహసాలకు గాను సావిత్రిబాయి ఫూలే పురస్కారం, సోషల్ సర్వీస్‌కు గాను హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకోవడం అత్యంత సంతృప్తినిచ్చిన సందర్భాలు. మొత్తం నాలుగు మెడల్స్, మూడు అవార్డులు అందుకున్నాను.పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఆటల పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పతకాలందుకున్నాను. దానికి కొనసాగింపుగానే ప్రస్తుతం యూఎస్‌లో జరిగే క్రీడలకు ఆహ్వానం అందింది. వీసా కూడా వచ్చింది. నా దగ్గరున్న డబ్బు ఖర్చయి పోయింది. యూఎస్ వెళ్లిరావడానికి స్పాన్సర్షిప్ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రపంచంలోని 50 దేశాల క్రీడాకారులు ΄ాల్గొనే ఈ పోటీలకు వెళ్లగలిగితే మాత్రం భారత్‌కు విజేతగా పతకాలతో తిరిగి వస్తాను’’ అన్నారు శ్యామల మెండైన ఆత్మవిశ్వాసంతో. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్చ్ఠ్బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. -
బంగారు బైక్ నడుపుతున్న గోల్డ్ మ్యాన్
-
మగ్గంలా పనిచేసే రోబో గురించి.. ఎప్పుడైనా విన్నారా!?
ఈ రోబో మగ్గంలా పనిచేస్తుంది. అయితే నూలు దుస్తులు, పట్టు వస్త్రాలు కాదు, ఊలు దుస్తులు నేస్తుంది. ఇది ఊలు దుస్తులను చకచకా నేసి, కోరుకున్న డిజైన్లలో అల్లేస్తుంది. ఈ రోబో మగ్గాన్ని డచ్ డిజైనర్ క్రిస్టీన్ మీండెర్స్మా రూపొందించారు..త్రీడీ ప్రింటర్లు పొరలు పొరలుగా వస్తువులను ముద్రించిన పద్ధతిలోనే ఈ రోబో మగ్గం పొరలు పొరలుగా ఊలు దుస్తులను నేస్తుంది. ఈ రోబో మగ్గానికి ‘ఫ్లాక్స్ వోబో’ అని పేరు పెట్టారు. ఊలు పరిశ్రమలో నేసే ముందు ఊలును నీటితో తడుపుతారు. అయితే, ఈ రోబో మగ్గానికి నేరుగా ఊలు అందిస్తే చాలు, ఏమాత్రం తడపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి దీనిని నమూనాగా రూపొందించారు. త్వరలోనే పారిశ్రామిక స్థాయిలో దీని ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.హైడ్రోజన్ బైక్..పెట్రోల్‌తో నడిచే బైక్‌లకు పోటీగా ఇటీవలి కాలంలో లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ బైక్‌ల వాడకం పెరిగింది. లిథియం అయాన్ బ్యాటరీలను మించిన సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే బైక్‌లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ‘హైడ్రోరైడ్ యూరోప్ ఏజీ’ కంపెనీ రకరకాల మోడల్స్‌లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది.వీటికి 180 హైడ్రోజన్ సెల్‌తో పాటు, 25 సెంటీమీటర్ల పొడవైన హైడ్రోజన్ కంటెయినర్ ఉంటుంది. కంటెయినర్‌లోని హైడ్రోజన్ 1 మెగాపాస్కల్ పీడనంతో ఉంటుంది. ఈ హైడ్రోజన్ నుంచి ఇందులోని ఫ్యూయల్ సెల్ విద్యుత్తును తయారుచేసుకుంటుంది. ఒక కంటెయినర్‌ను పూర్తిగా నింపి అమర్చుకుంటే, ఈ బైక్‌పై ఏకధాటిగా 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ బైక్‌కు అమర్చుకునే విధంగా హైడ్రో జనరేటర్ కూడా ఉంటుంది.ఒకవేళ మార్గమధ్యంలో కంటెయినర్‌లోని హైడ్రోజన్ ఖాళీ అయిపోతే, ఈ జనరేటర్లో 200 మిల్లీలీటర్ల డిస్టిల్డ్ వాటర్‌ను నింపుకుంటే చాలు. దీని నుంచి ఉత్పత్తయ్యే హైడ్రోజన్ దాదాపు ఐదారు గంటల ప్రయాణానికి తగినంత ఇంధనంగా సరిపోతుంది. అయితే, హైడ్రోరైడ్ యూరోప్ ఏజీ’ కంపెనీ నేరుగా విక్రయానికి పెట్టకుండా.. యూరోప్‌లోని ఎంపిక చేసిన నగరాల్లో కస్టమర్లకు అద్దెకు ఇస్తోంది.ఉభయచర డ్రోన్..ఇప్పటి వరకు గాల్లోకి ఎగిరే డ్రోన్లు మాత్రమే తెలుసు. అయితే, కెనడియన్ కంపెనీ ‘ఏరోమావో’ ఉభయచర డ్రోన్‌ను రూపొందించింది. ఇది గాలిలో ఎగరడమే కాదు, నీటిలోనూ ప్రయాణించగలదు. ఈ డ్రోన్‌ను ‘వీటీ నాట్–వీటీఓఎస్ఎల్’ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్రాండ్ పేరుకు అర్థమేమిటంటే, ‘వెర్టికల్ టేకాఫ్ అండ్ షార్ట్ ల్యాండింగ్’. మ్యాపుల చిత్రణ, మనుషులు చొరబడలేని ప్రదేశాల్లో కూడా సర్వే జరపడం, వ్యవసాయ అవసరాలకు, నిఘా పనులకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు.గాల్లోకి ఎగిరేటప్పుడు దీని గరిష్ఠ వేగం గంటకు 85 కిలోమీటర్లు అయితే, నీటిలో ప్రయాణించేటప్పుడు గంటకు 55 కిలోమీటర్లు. రీచార్జబుల్ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసినట్లయితే, గంటన్నర సేపు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. దీని ధర 11,170 డాలర్లు (రూ.9.31 లక్షలు). -
‘గ్రేట్‌వాల్ మోటార్’ మొదటి బైక్.. (ఫొటోలు)
-
టీడీపీ నేతలే నా బైక్ తగలబెట్టారు: YSRCP నేత పిచ్చయ్య
-
బైక్‌పైనే ముద్దుముచ్చట
దొడ్డబళ్లాపురం: సిలికాన్ సిటీలో కొందరు జంటలు వెర్రిగా ప్రవర్తిస్తుంటారు. అదే మాదిరిగా ఒక యువకుడు తన లవర్‌ను ఒళ్లో కూర్చోబెట్టుకుని బైక్ నడిపిన వీడియో బయటకు వచ్చింది. యలహంక సమీపంలో ఎయిర్‌పోర్టు రోడ్డులో ఒక యువకుడు బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద యువతిని కూర్చోబెట్టుకుని కేరింతలు కొడుతూ దూసుకెళ్లాడు.ఇద్దరూ హెల్మెట్ కూడా ధరించలేదు. కొందరు పౌరులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోకిరీ జంట నిర్వాకం వైరల్‌గా మారింది. మే 17న ఈ తతంగం జరిగినట్టు తెలుస్తోంది. ఆ జంటకు చీవాట్లు పెడుతూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. -
మార్కెట్లో కొత్త ఈవీ బైక్.. ధర ఎంతంటే?
దేశీయ ఆటోమొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వాహనదారులు పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాలకు స్వస్తిచెబుతున్నారు. ధర కాస్త ఎక్కువే అయినా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ తరుణంలో పూణే ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVoomi కొత్త ఎలక్ట్రిక్ స్కూట్ మార్కెట్‌కు పరిచయం చేసింది. JeetX ZE పేరుతో విడుదల చేసిన బైక్ ధర రూ. 80,000 (ఎక్స్-షోరూమ్) ధర ఉండగా... దీని రేంజ్ 170 కిమీల పరిధిని వరకు ఉంది.మూడు విభిన్న వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ బైక్ నార్డో గ్రే, అల్ట్రా రెడ్, అర్బన్ గ్రీన్ ఇలా ఎనిమిది రకాల రంగుల్లో JeetX ZE 2.1 కిలోవాట్ల పీక్ పవర్ కోసం రేట్ బీఎల్డీసీ మోటార్‌కు కనెక్ట్ చేసిన 3 కిలోవాట్ గంటల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. గంటకు గరిష్టంగా 57 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయొచ్చు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 5.5 గంటల సమయం పడుతుంది. 2.5 గంటల కంటే తక్కువ సమయంలో 50 శాతం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. -
ద్విచక్ర వాహనంపై ఐదుగురు.. రూ. 17 వేల జరిమానా!
సాధారణంగా మనం ద్విచక్ర వాహనంపై ఇద్దరు లేదా ముగ్గురు రైడర్లను చూసి ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఒక బైక్‌పై ఐదుగురు కుర్రాళ్లు ప్రయాణిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఐదుగురు కుర్రాళ్లు బైక్‌పై వెళుతుండగా వారిని ట్రాఫిక్ పోలీసులు గమనించి, వారికి భారీ మొత్తంలో చలానా జారీచేశారు. ఈ ఉదంతం చిత్రకూట్ జిల్లాలోని ఖోహ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ బైక్‌పై ఐదుగురు కూర్చొని గ్రామంలో ఉల్లాసంగా తిరుగుతున్నారు. ఇంతలో వారికి ట్రాఫిక్ పోలీసులు తారసడ్డారు. చిత్రకూట్ ట్రాఫిక్ టీఎస్ఐ శైలేంద్రకుమార్ సింగ్ ఆ బైక్ నడిపే కుర్రాళ్లను అడ్డుకుని, వారికి రూ.17 వేలు చలానా జారీ చేయడంతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం గురించి చిత్రకూట్ ట్రాఫిక్ టీఎస్ఐ శైలేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ కార్వీ కొత్వాలి ప్రాంతంలోని ఖోహ్ గ్రామంలో ఐదుగురు కుర్రాళ్లు బైక్‌పై వెళుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని గమనించామన్నారు. తరువాత వారిని ఆపి, వారి పేరు, చిరునామా తెలుసుకున్నామని, డ్రైవింగ్ లైసెన్స్ ను తనిఖీ చేశామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తున్న ఈ ఐదుగురు కుర్రాళ్లకు రూ.17 వేలు చలాన్ జారీ చేశామన్నారు. అలాగే ఆ వాహనాన్ని సీజ్ చేశమన్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి
మునగాల, మోతె (కోదాడ)/నంగునూరు (సిద్దిపేట): సూ ర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయా రు. వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా మోతె మండ ల కేంద్రం శివారులో ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆ స్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మునగాల మండలం విజయరాఘవపురం గ్రామానికి చెందిన పది మంది, రేపాల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళా వ్యవసాయ కూ లీలు మోతె మండలం హుస్సేనాబాద్‌లోని మిర్చి తోటలో కాయలు ఏరేందుకు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్య లో ఖమ్మం జిల్లా మధిర నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు మోతె శివారులో యూటర్న్ తీసుకునే క్రమంలో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయరాఘవపురం గ్రామానికి చెందిన కందుల నాగమ్మ(55), చెవుల నారాయణమ్మ(56), రేపాల గ్రామానికి చెందిన పోకల అనసూర్య (65) తీవ్ర గా యాలతో ఘటనా స్థలంలోనే మృతిచెందారు. విజయరాఘవపురానికి చెందిన రెమిడాల సౌభాగ్యమ్మ(75) సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. విజయరాఘవపురం గ్రామానికి చెందిన కందుల గురువయ్య (65) ను హైదరాబాద్‌కు తరలించగా అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. రేపాల గ్రామానికి చెందిన సొంపంగు లక్ష్మి తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యు లు హైదరాబాద్‌కు తరలించారు. విజయరాఘవపురం గ్రా మానికి చెందిన కత్తి విజయమ్మ, పాలపాటి మంగమ్మ సూ ర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ టో డ్రైవర్ పవన్‌తో పాటు మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. కోదాడ డీఎస్పీ ఎం.శ్రీధర్‌రెడ్డి, మునగాల సీఐ డి.రామకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలో ముగ్గురు మృతి కారు బైకును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెంద గా మరో ఏడుగురికి గాయాలయ్యా యి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ వద్ద జరి గింది. కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన జక్కుల అనిల్, భార్య మమత, అతని బావమరిది బాబురాజు, భార్య కీర్తన, పిల్లలు చర ణ్, భానుప్రసాద్, వైష్ణవి, హన్విక, నాన్సి, ప్రణయ్‌తో కలసి హుస్నాబాద్‌లో జరిగిన బంధువుల పెళ్లికి కారు లో వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు ఢీకొ ట్టి రోడ్డు కిందకు ఈడ్చుకెళ్లింది. దీంతో పక్కనే ఉన్న కాల్వలో బైక్, కారు పడిపోయాయి. ఈ ప్రమాదంలో బద్దిపడగకు చెందిన కట్ట రవి (55), నాగరాజుపల్లికి చెందిన ముక్కెర అయిలయ్య (58), జక్కుల మమత (28) అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారిలో బాబురాజు పరిస్థితి విషమంగా ఉండగా గాయాలపాలైన చిన్నారులను సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వచ్చి కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Bike Mileage Tips: మీ బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా.. ఇవి పాటించాల్సిందే..
మోటార్ బైక్ కొత్తదైనా చాలామంది మైలేజ్ ఇవ్వడం లేదని ఆందోళన చెందుతుంటారు. అయితే బైక్ నడుపుతున్నపుడు కొన్ని తప్పులు చేయడం వల్ల మైలేజ్ తగ్గుందని నిపుణులు చెబుతున్నారు. బైక్ మైలేజ్ పెరగాలంటే ఈ కింది విషయాలపై జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. గేర్ మార్చకపోవడం బైక్ నడుపుతున్నపుడు బైక్ వేగానికి తగ్గట్టుగా గేర్ మార్చడం చాలా ముఖ్యం. మెయిన్ రోడ్డు(పెద్ద రోడ్లు, రహదారులు)పై అధిక వేగంతో బైక్‌ను స్థిరవేగంతో నడపాలంటే ఎక్కువ గేర్‌లో ఉండాలి. దీనివల్ల ఇంజిన్‌పై పెద్దగా ఒత్తిడి ఉండదు. దాంతో మంచి మైలేజ్ ఇస్తుంది. తక్కువ వేగంతో నడపాల్సి వస్తే రెండు లేదు మూడో గేర్‌లో బైక్‌ను నడపాలి. ఇలా చేయడం వల్ల బైక్ తక్కువ వేగంలో ఆగదు. ఎప్పుడూ కాలు బ్రేక్ పైనే.. బైక్ నడుపుతున్నపుడు చాలా మంది బ్రేక్‌పై కాలు ఉంచుతారు. అయితే బ్రేక్‌పై కాలు ఉంచి డ్రైవింగ్ చేయడం చెడ్డ అలవాటేం కాదు. ఇది వెంటనే బ్రేక్ వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతిసారి బ్రేక్‌లపై ఒత్తిడి ఉంచితే స్వేచ్ఛగా ముందుకు కదలదు. ఇలా చేయడం వల్ల బైక్ నడపడానికి ఎక్కువ యాక్సిలేటర్ ఇవ్వాలి. దాంతో కొంత మైలేజ్‌పై ప్రభావంపడే అవకాశం ఉంది. అలా అని బ్రేక్ వాడకూడదని కాదు. అనవసరమైన సందర్భాల్లోనూ బ్రేక్ వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: యాప్‌ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే.. తక్కువ గాలి.. టైర్లలో తక్కువగా గాలి ఉండటం వల్ల బైక్ మైలేజ్ క్షీణిస్తుంది. మెరుగైన మైలేజీ కోసం టైర్లో సరిపడా గాలి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పెట్రోల్ పంపులు ఎయిర్ ప్రెజర్ మెషీన్ సదుపాయాన్ని కలిగి ఉంటున్నాయి. దాంతో ఉచితంగానే టైర్ల్లో గాలి చెక్ చేసుకోవచ్చు. -
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న యువకునికి గుండెపోటు వచ్చి, బైక్‌పై పైనుంచి కింద పడ్డాడు. బాధితుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇండోర్ పరిధిలోని ముసాఖేడీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతానికి చెందిన రాహుల్ రైక్వార్‌కు బైక్‌పై వెళుతుండగా గుండెపోటు వచ్చినట్లు ఆజాద్ నగర్ పోలీసులు తెలిపారు. రాహుల్ వయసు 26 ఏళ్లు. రాహుల్ తన తమ్మునితో కలిసి ఏదో పనిమీద బైక్‌మీద బయలు దేరాడు. బైక్‌పై వెనుక రాహుల్ కూర్చోగా, అతని తమ్ముడు బైక్ నడుపుతున్నాడు. దారిలో రాహుల్‌కు గుండె నొప్పి వచ్చింది. దీంతో బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. దీనిని గమనించిన అతని తమ్ముడు చుట్టుపక్కలవారి సాయంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాధితుని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. కాగా మృతుడు రాహుల్‌కు ఏడాదిన్నర కుమార్తె ఉంది. కాగా చిన్నవయసులో గుండెపోటుకు క్రమరహిత దినచర్య, అనారోగ్యకర ఆహారం, జంక్ ఫుడ్, నిద్రలేమి, ఒత్తిడి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. -
ఎంత ఎమర్జెన్సీ అయితే మాత్రం ఇదేమిటి తమ్ముడూ!
అమీర్‌ఖాన్, మాధవన్, శర్మన్ జోషిల ‘త్రీ ఇడియెట్స్’ సినిమాలోని సన్నివేశాలను ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటాం. అందులో ఒకటి హాస్పిటల్ సీన్. అనారోగ్యంతో బాధపడుతున్న శర్మన్ తండ్రిని అమీర్‌ఖాన్ స్కూటర్‌పై కూర్చోబెట్టుకొని, భుజాలకు కట్టేసుకొని ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకువెళ్లే సీన్ ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఒక హాస్పిటల్లో అచ్చం ఇలాంటి సీనే కనిపించింది. అపస్మారకస్థితిలో ఉన్న తన తాతను బైక్‌పై కూర్చోపెట్టుకొని ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకువెళ్లాడు ఒక వ్యక్తి. సదరు ఈ వ్యక్తి ఇదే ఆస్పత్రిలో పనిచేస్తాడట. ‘ఎక్స్’లో ఒక యూజర్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ‘త్రీఇడియెట్స్’ సినిమా సీన్‌ను గుర్తు తెస్తుంది. -
సంచిలో పట్టే ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతంటే?
ఎక్కడకు వెళ్లినా అక్కడ ఒక వాహనం అందుబాటులో ఉంటే ఆ సౌకర్యమే వేరు. రైళ్లలోను, విమానాల్లోను దూరప్రాంతాలకు వెళ్లే వాళ్లు గమ్యం చేరుకున్నాక ఆటో లేదా ట్యాక్సీని ఆశ్రయించక తప్పదు. వెంట సొంత వాహనాన్ని తీసుకువెళ్లగలిగితే బాగుంటుందనుకున్నా, అందుకు వీలుండదు. అయితే, ఎక్కడకైనా తేలికగా సంచిలో పెట్టుకుని తీసుకుపోగలిగే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జపాన్‌కు చెందిన ‘ఆర్మా’ ఇటీవల విడుదల చేసింది. పని పూర్తయ్యాక దీన్ని సులువుగా మడిచేసుకుని సంచిలో లేదా సూట్‌కేసులో సర్దేసుకోవచ్చు. దీని బరువు 4.5 కిలోలు మాత్రమే! అంటే, స్కూలు పిల్లల పుస్తకాల బ్యాగు కంటే తక్కువే! కాబట్టి దీనిని మోసుకుపోవడం కష్టమేమీ కాదు. దీని గరిష్ఠ వేగం గంటకు 30 కిలోమీటర్లు. రద్దీగా ఉన్న ట్రాఫిక్‌లో వాహనాల మధ్య కాస్తంత చోటులోంచి దీనిపై సులువుగా ప్రయాణించవచ్చు. దీని ధర 1.35 లక్షల యువాన్లు (రూ.76,203) మాత్రమే! -
కల్వర్టు గుంతలో పడిన కారు
శంషాబాద్ రూరల్: రహదారిపై అదుపు తప్పిన కారు నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడింది. గుంతలోని నీళ్లలో మునిగి ఊపిరాడక తల్లీ, కొడుకు మృతి చెందిన దుర్ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈసీఐఎల్‌లోని శ్రీరాంనగర్ కాలనీ వాసి మెరువ ఆదిశేషరెడ్డి(57) బాబా ఆటోమిక్ రీసెర్స్ సెంటర్లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా సొంత ఊరైన ఏపీ నంద్యాల సమీపంలోని జిల్లెల గ్రామానికి తన తల్లి ఎం.రాములమ్మ(88)ను తీసుకుని ఈసీఐఎల్ నుంచి కారులో శనివారం బయలుదేరాడు. మార్గ మధ్యలో మండలంలోని ఘాంసిమిగూడ శివారులో బెంగళూరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటో, బైక్‌ను ఢీకొడుతూ.. నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడింది. నీళ్లలో మునిగి మృత్యువాత.. కారు ఢీకొనడంతో బైక్‌తో పాటు ఆటో కూడా గుంత నీళ్లలో పడిపోయాయి. కారులో ఉన్న ఆదిశేషరెడ్డి, రాములమ్మ అందులోని నుంచి బయటకు రాలేకపోయారు. నీళ్లలో మునిగి ఊపిరాడక మృతి చెందారు. ఆటోలో ఉన్న ముగ్గురిలో డ్రైవర్ రాయన్నగూడ సిద్దయ్యకు గాయాలయ్యాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న గొల్ల ఆంజనేయులు(25)కు కాలు విరగగా బాలికకు గాయాలయ్యాయి. వీరందరనీ స్థానికులు గుంతలో నుంచి బయటకు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
బైక్ ఆఫ్ అవడంతో బైక్ సీటు తెరిచి చూస్తే.. ఒక్కసారిగా షాక్!
మహబూబ్‌నగర్: బైక్ ఆఫ్ అయితుందని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లిన యువకులకు సీటు కింద పాము కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌కు చెందిన బాలు, వినయ్ అక్కడే ఓ పరిశ్రమలో పని చేసేవారు. కంపెనీ పని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడిపత్రికి వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణంలో కర్నూల్ వద్ద బైక్‌లో పెట్రోల్ పోయించుకున్నారు. అడ్డాకుల సమీపంలోకి రాగానే బైక్ ఆఫ్ అయితుండటంతో స్థానికంగా ఉన్న మెకానిక్ దగ్గరికి వచ్చారు. దాన్ని బాగు చేసే క్రమంలో బైక్ సీటు తీయగా దాని కింద పాము కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత యువకులంతా కలిసి దాన్ని బయటకు తీసి చంపేశారు. ఇవి చదవండి: ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ బుక్.. తెరిచిచూస్తే షాక్! -
బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకును ఢీకొట్టిన కారు.. తండ్రి మృతి!
దామరగిద్ద: తోట నారు తెచ్చేందుకు బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకును కారు ఢీకొట్టిన ప్రమాదంలో తండ్రి మృతి చెందగా.. కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం పిడెంపల్లి గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పిడెంపల్లికి చెందిన సుదర్శర్‌రెడ్డి (43) తోటనారు తెచ్చేందుకుగాను తన కుమారుడు సాయి యశ్వంత్‌రెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. స్టేజీ వద్ద ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో సుదర్శన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా. అతడి కుమారుడు సాయి యశ్వంత్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని సాయి యశ్వంత్‌రెడ్డిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు చంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ ఎండీ ఖాజాపాషాపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. లారీ ఢీకొని మరో వ్యక్తి.. మహబూబ్‌నగర్ క్రైం: రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలై మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వన్‌టౌన్ ఎస్ఐ నవీద్ వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని మేకలబండకు చెందిన సయ్యద్ ఖాసీం (45) వన్‌టౌన్ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య షాహెదాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. -
ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. సంస్థ రియాక్షన్ ఇదే..
బైక్ట్యాక్సీలపై ఆడా..మగా తేడా లేకుండా అందరికీ అవగాహన పెరుగుతోంది. మహిళలు ఎక్కువగా తమ గమ్యస్థానాలు చేరడానికి ఇటీవల బైక్ట్యాక్సీలను వినియోగించుకుంటున్నారు. అయితే తాజాగా ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఓ మహిళను లైంగికంగా వేధించిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ర్యాపిడో డ్రైవర్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆరోపించడంతో సదరు సంస్థ అతని ఐడీని సస్పెండ్ చేసింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. మహిళ ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో టిన్ ఫ్యాక్టరీ ప్రాంతం నుంచి కోరమంగళకు రాపిడో బైక్‌పై వెళ్తుండగా డ్రైవర్ తనను లైంగికంగా వేధించినట్లు తెలిపారు. ఫోన్లో బ్యాటరీ తక్కువగా ఉందని చెప్పి ర్యాపిడో డ్రైవర్ రూట్ నావిగేట్ చేయడానికి తన ఫోన్ కావాలని అడిగాడన్నారు. ఆ తర్వాత బైక్‌పై వెళ్తుండగా తన పర్సనల్ విషయాలు అడిగాడని, పెట్రోల్ పంపులో అనుచితంగా తనను రెండు సార్లు తాకాడని వెల్లడించారు. ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి.. చాలాకాలంగా ర్యాపిడో యాప్ ఉపయోగిస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని మహిళ చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయగా.. ఈ విషయాన్ని పరిశీలించి డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని కంపెనీ వెల్లడించినట్లు బాధితురాలు తెలిపారు. ఆమె ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు ర్యాపిడో ప్రకటించిందని మహిళ వివరించారు. -
వేడర్ ఎలక్ట్రిక్ బైక్స్ డెలివరీ షురూ.. ఎప్పటి నుంచి అంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తమ వేడర్ మోటర్‌బైక్ డెలివరీలను డిసెంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. వాహన నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) సర్టిఫికేషన్ లభించినట్లు సంస్థ సీఈవో నెమిన్ వోరా తెలిపారు. 7 అంగుళాల ఆండ్రాయిడ్ డిస్ప్లే, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 125 కి.మీ. రేంజి, గంటకు 85 కి.మీ. టాప్ స్పీడ్, కాంబీ బ్రేకింగ్ సిస్టం, 4 గంటల్లోనే పూర్తిగా చార్జ్ అయ్యే లిథియం అయాన్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. -
పండగ బోనస్‌తో వాళ్లు హ్యాపీ!
-
ఎన్నికల ప్రచారంలో బైక్ ర్యాలీలకు యూత్‘ఫుల్’ డిమాండ్
హైదరాబాద్: యూత్‌లో ఎన్నికల జోష్ వచ్చేసింది. బండి చేతిలో ఉంటే చాలు ‘జెండా’ ఎత్తుకుంటున్నారు. కండువాలు కప్పేసుకుంటున్నారు. జైకొట్టి హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో యువత ముందంజలో ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల పక్షాన ప్రచారం చేసిపెట్టేందుకు యువకులకు భారీ డిమాండ్ వచ్చింది. సాధారణంగా ఎన్నికలు రాగానే ఆయా పార్టీలకు చెందిన నాయకులకు, కార్యకర్తలకు చేతినిండా పని ఉంటుంది. రాత్రింబవళ్లు వ్యూహ ప్రతి వ్యూహాల్లో, ప్రచార ఎత్తుగడల్లో తలమునకలై ఉంటారు. మరోవైపు ప్రచారంలో తమ ఆధిక్యతను ప్రదర్శించేందుకు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. సంఖ్యాబలాన్ని చాటుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి సహకరించే యువతకు అనూహ్యమైన డిమాండ్ వచ్చేసింది. గల్లీలు, బస్తీల్లో ఉండే యువకులే కాకుండా డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థులను కూడా రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి తరలిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వీలైన సమయంలో అప్పటికప్పుడు పార్టీల కండువాలు ధరించి బైక్ ర్యాలీలతో హడలెత్తించేందుకు కుర్రకారు సైతం ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ ట్రెండ్ బలంగా కొనసాగుతోంది. మెజారిటీని ప్రదర్శించేందుకు దీన్ని ఒక అవకాశంగా భావిస్తున్నారు. ఇదో ‘పార్టీ’టైమ్ జాబ్ ... సాధారణంగా డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్న కుర్రాళ్లకు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇచ్చే ఆఫర్లు పార్ట్‌టైమ్ జాబ్‌గా మారాయి. ప్రతి రోజు ప్రచారానికి వచ్చే వారికి రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు చెల్లిస్తున్నారు. ఇక మధ్యాహ్నం బిర్యానీ, వీలైతే సాయంత్రం బీరు సంగతి సరేసరి. గల్లీబాయ్స్ మాత్రమే కాదు. ప్రైవేట్ హాస్టళ్లల్లో ఉండే బ్యాచిలర్స్, నిరుద్యోగయువతకు ఇదో ఉపాధిగా మారింది. ‘ఇప్పట్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. ఖాళీగా ఉంటే ఖర్చులు తప్పవు కదా. అందుకే ప్రచారానికి వెళ్తున్నాను’ అని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ చెప్పాడు. ఇంటి కిరాయి, రోజువారి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, సదరు పార్టీవాళ్లు ఇచ్చే డబ్బులతో కొంత ఊరట లభిస్తుందని పేర్కొన్నాడు. సాధారణంగా ఎన్నికలు రాగానే కళాకారులకు, సోషల్‌మీడియా సైనికులకు డిమాండ్ ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో అడ్డాకూలీల సేవలను కూడా రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో బైక్ ర్యాలీలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా యువకులకు ఎక్కువ డిమాండ్ ఉంది. ‘రాత్రింబవళ్లు జెండాలు పట్టుకొని తిరగవలసిన అవసరం లేదు కదా. ఉదయం, సాయంత్రం రెండు, మూడు గంటలు ర్యాలీలకు వెళితే చాలు. సరదాగా ఉంటుంది. పైగా ఖర్చులకు డబ్బులొచ్చేస్తాయి.’ అని సికింద్రాబాద్‌కు చెందిన యువకుడు అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీల ప్రచారానికి తరలి వచ్చే యువకులతో పెట్రోల్ బంకులకు, హోటళ్లకు సైతం గిరాకీ పెరిగింది. అందరూ ఇప్పుడు రెండు చేతులా ఆర్జిస్తున్నారు. బైక్ ట్యాక్సీ వాలాలకూ ఆఫర్... ఓలా, ఉబెర్ వంటి సంస్థల్లో పని చేసే ట్యాక్సీ బైక్ డ్రైవర్లు, యాప్ ఆధారిత సేవలను అందజేసే డెలివరీబాయ్స్ కూడా శ్రీజస్ట్ ఫర్ ఛేంజ్శ్రీను కోరుకుంటున్నట్లు ఒక పార్టీకి చెందిన నాయకుడొకరు చెప్పారు. ఒకవైపు ఆయా సంస్థల్లో పని చేస్తూనే వీలైన వేళల్లో ర్యాలీలకు, ప్రదర్శనలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. రొటీన్ విధులకు భిన్నంగా పార్టీ ప్రచారానికి వస్తున్నట్లు పేర్కొన్నారు. -
మంచుదారుల్లోనూ దూసుకెళ్లే ఎలక్ట్రిక్ బైక్.. ధర ఎంతంటే?
చాలావరకు ద్విచక్ర వాహనాలు సమతలమైన రోడ్ల మీదనే సజావుగా నడుస్తాయి. ప్రత్యేకంగా దృఢమైన టైర్లతో రూపొందించినవి ఎగుడు దిగుడు దారుల్లోనూ ప్రయాణించగలవు. మంచు పేరుకుపోయిన దారుల్లో నడిచే వాహనాలు చాలా అరుదు. నిత్యం భారీగా మంచు కురిసే దేశాల్లో వాహనాలు నడపడం అంత తేలిక కాదు. రోడ్ల మీద గాని, ఎగుడు దిగుడు కొండ దారుల్లో గాని ఎంతగా మంచు పేరుకుపోయినా తేలికగా నడపగల ద్విచక్ర వాహనాన్ని రూపొందించింది కెనడియన్ కంపెనీ ‘రాకీ మౌంటెయిన్’. ‘పవర్ ప్లే’ పేరుతో ఎగుడు దిగుడు మంచుదారుల్లోనూ అత్యంత సునాయాసంగా దూసుకుపోయే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను తీర్చిదిద్దింది. దీనికి అమర్చిన ‘డైనేమ్–4.0’ మోటారు గరిష్ఠంగా 700 వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి, అడుగుకు 79 పౌండ్ల శక్తితో చక్రాలు తిరిగేలా చేస్తుంది. దీనివల్ల వాహనం మంచును చీల్చుకుంటూ దూసుకుపోగలదు. మంచు దారుల్లో ప్రయాణించే ‘పవర్ ప్లే’ బైక్ ‘ఎ50’, ‘ఎ30’ మోడల్స్‌లో దొరుకుతుంది. వీటి ధరలు 6199 డాలర్లు (రూ.5.15 లక్షలు), 5889 డాలర్లు (రూ.4.89 లక్షలు). -
హత‘విధీ’.. ఆనందాన్ని చిదిమేసింది
కారంపూడి: ప్రసవ వేదన పడుతున్న భార్యను ఆస్పత్రిలో చేర్చి.. ఆస్పత్రి ఖర్చులకోసం డబ్బు తీసుకుని బైక్‌పై వెళ్తున్న భర్త ప్రమాదవశాత్తూ బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. భార్యను తరలించిన అంబులెన్స్‌లోనే అతడిని కూడా అదే ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాలు విడిచాడు. అప్పటికే భార్య ప్రసవించగా.. పుట్టిన పాపను కూడా చూసుకోకుండా ఆ తండ్రి కన్ను మూయడంతో అక్కడి వారి హృదయాలు బరువెక్కాయి. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా కారంపూడి ఇందిరా నగర్ కాలనీ గనిగుంతలుకు చెందిన బత్తిన ఆనంద్ (33) భార్య రామాంజనికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో శుక్రవారం 108లో గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె వెంట వాళ్ల అమ్మ, చిన్నమ్మ, ఆశా వర్కర్ ఏసమ్మ వెళ్లారు. భర్తను కూడా అంబులెన్స్ ఎక్కమంటే ఆస్పత్రి ఖర్చులకు డబ్బు తీసుకు వస్తానని ఆగిపోయాడు. శనివారం వేకువజామున డబ్బు తీసుకుని బైక్‌పై నర్సరావుపేట బయలుదేరాడు. మార్గమధ్యంలో జూలకల్లు అడ్డరోడ్డు వద్ద రోడ్డు పక్కన కంకర చిప్స్ ఉండటంతో బైక్ అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కాగా.. కొంతసేపటి వరకు ఎవరూ చూడకపోవడంతో చాలా రక్తం పోయింది. ఆ తరువాత ఓ వ్యక్తి గమనించి 108కు ఫోన్ చేయడంతో భార్యను ఆస్పత్రి తీసుకెళ్లిన అంబులెన్సే వచ్చి అతన్ని కూడా నర్సరావుపేటలో భార్య ఉన్న ఆస్పత్రికే తీసుకెళ్లింది. అప్పటికే రక్తం ఎక్కువగా పోవడంతో ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే ఆనంద్ మృతి చెందాడు. అదే ఆస్పత్రిలో ఉన్న భార్యకు సకాలంలో సరైన వైద్యం అందడంతో ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను కూడా చూసుకునే భాగ్యానికి నోచుకోని ఆనంద్ మృతి ఘటన బంధుమిత్రులను కలచి వేస్తోంది. ఇదిలా ఉంటే రామాంజనికి ఇది నాలుగో కాన్పు. ఇంతకుముందు ఇద్దరు అమ్మాయిలు.. ఒక అబ్బాయి ఉన్నారు. -
యమహా ఎలక్ట్రిక్ బైక్ ఎలా ఉందో చూశారా?
-
ఆటోమొబైల్ రంగంలో సుజుకి సరికొత్త సంచలనం.. నాలుగు చక్రాల బైక్‌తో
-
జీవన ప్రయాణంలో అవసరంగా మారిన వాహనం
ఒకప్పుడు ఎవరికైనా బైక్, కారు ఉందంటే వాళ్లు ధనవంతులు అని గుర్తింపు ఉండేది. గ్రామాల్లోకి బైకుల్లో, కార్లలో ఎవరైనా వస్తే ప్రజలు ఆసక్తిగా చూస్తుండేవాళ్లు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో బైక్ ఉండటం సర్వసాధారణంగా మారిపోయింది. మధ్య తరగతి ప్రజల్లో కార్ల వినియోగం కూడా పెరిగింది. మారిన జీవన శైలి.. ఉద్యోగ, ఉపాధి అవసరాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ మోటారు వాహనం తప్పనిసరి అయ్యింది. నంద్యాల: ఇళ్ల ముందు, దుకాణాలు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు, టీకొట్ల ఎదుట.. ఇలా ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్ చేసి కనిపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల వినియోగానికి ఈ దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో దాదాపు ప్రతి ఇంటికి ఒక మోటారు వాహనం ఉందంటే అతిశయోక్తి కాదేమే. జిల్లాలో వివిధ రకాల వాహనాలు 3,45,884 ఉండగా.. వీటిలో అత్యధికంగా 3,12,613 ద్విచక్ర వాహనాలు ఉండటం విశేషం. అవసరాల నిమిత్తం ఒక్కొక్కరు ఒక బైక్ ఉపయోగిస్తున్నారు. సాధారణ కూలీ పనులకు వెళ్లే వారితో పాటు వ్యాపారులు, ఉద్యోగులు ఇలా అన్ని రకాల వర్గాల ప్రజలు ద్విచక్ర వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో రోజుకు సగటున 45–50 వాహనాల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈకోవలో నెలకు వెయ్యికి పైగానే వాహనాలు రిజి్రస్టేషన్లు అవుతున్నాయి. వాహనాల అమ్మకాలు, విక్రయాలు, రిజి్రస్టేషన్లతో రవాణా శాఖకు ఆదాయం పెరుగుతోంది. ప్రతి రోజూ బైక్‌లు, కార్లు, లారీలు, బస్సులు, ఆటోలు, అంబులెన్స్‌లు, స్కూల్ బస్సులు తదితర వాహనాలు అన్నీ కలిపి భారీ సంఖ్యలో రోడ్డెక్కుతున్నాయి. వ్యక్తిగత వాహనాలతో పాటు ప్రజారవాణా వాహనాలకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లోకి ఆధునిక మోడళ్లు.. వాహన తయారీ కంపెనీలు తరచూ మార్కెట్లోకి కొత్త ఫీచర్లతో ఆకట్టుకునే వాహనాల మోడళ్లను విడుదల చేస్తున్నారు. దీంతో వినియోగదారులు కొత్త వాటిపై ఆసక్తి చూపుతున్నారు. బీఎస్–4 తర్వాత మార్కెట్లోకి బీఎస్–6 వాహనాలు వచ్చాయి. వీటి కొనుగోలుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. నచ్చిన బైక్, కారు ముందుగానే బుకింగ్ చేసుకొని డెలివరీకి నెలల సమయం పడుతున్నా అంత వరకు వేచి చూస్తున్నారు. పురుషులతో పాటు మహిళలు సైతం డ్రైవింగ్‌లో శిక్షణ పొందుతున్నారు. ఫలితంగా స్కూటర్ల విక్రయాలకు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావడంతో ఇటీవల కాలంలో చాలా మంది వాటిపై మొగ్గు చూపుతున్నారు. ఇవి కాలుష్య రహితంగా ఉండటంతోపాటు పెట్రోల్ ఖర్చు లేకపోవడంతో ఈ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న ట్రాక్టర్ల సంఖ్య.. జిల్లాలో వ్యవసాయంపైనే ఎక్కువ భాగం రైతులు ఆధారపడ్డారు. గతంలో ఎద్దులతో వ్యవసాయం, ఇతర పనులు చేసేవాళ్లు. కాలక్రమేణా వ్యవసాయంలో సాంకేతిక విప్లవం రావడంతో రైతులు ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. ట్రాక్టర్లతో తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే వెసులుబాటు ఉంటుంది. పైగా కూలీల ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ట్రాక్టర్లతోనే సేద్యం, కలుపు మొక్కలు తొలగించడం తదితర పనులు చేస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తోంది. కుటుంబాలతో ప్రయాణించేందుకు.. సాధారణ, మధ్య తరగతి వర్గాల నుంచి మొదలు కొని ప్రతి ఒక్కరికి బైక్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంట్లో బైక్ ఉంటే స్థానికంగా, ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేయడానికి ఉపయోగపడుతుందని కొనుగోలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలు, తీర్థయాత్రలు, ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. లేటెస్ట్ కార్లు మార్కెట్లోకి అడుగుపెట్టడమే ఆలస్యం పట్టణాలతో పాటు పల్లెల్లో సైతం వాలిపోతున్నాయి. వ్యాపారులు, రైతులు ఎక్కువ భాగం కార్లను ఉపయోగిస్తున్నారు. కార్లు కొనుగోలు చేయాలంటే గతంలో మాదిరిగా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కారు ధరలో కొంత మేర డౌన్‌పేమెంట్ చెల్లించి మిగిలిన సొమ్మును సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటు ఉంది. బైక్ తప్పనిసరి ప్రస్తుతం బైక్‌లు, కార్లు ప్రతి ఒక్కరికీ అవసరమవుతున్నాయి. ఏచిన్న పనికి వెళ్లాలన్నా బైక్ లేనిదే బయటకు వెళ్లడం లేదు. మాకు గ్రామ సమీపంలో నాపరాతి గని ఉంది. అక్కడికి వెళ్లాలంటే తప్పక బైక్ అవసరం ఉంటుంది. అత్యవసర పనులతో పాటు కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లేందుకు జీపు కొనుగోలు చేశాం. – సుధాకర్, అంకిరెడ్డిపల్లె వాహనాల సంఖ్య పెరుగుతోంది జిల్లాలో రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి రోజు వివిధ రకాల కొత్త వాహనాలు 45 నుంచి 50 వరకు రిజి్రస్టేషన్లు జరుగుతుంటాయి. ఈ లెక్కన నెలకు 1200కు పైగానే ఉంటాయి. ఎక్కువ భాగం ద్విచక్రవాహనాలే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. – శివారెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి -
టీవీఎస్–బీఎండబ్ల్యూ తొలి ఎలక్ట్రిక్ బైక్ తయారీ ప్రారంభం
హోసూరు: బీఎండబ్ల్యూ మోటోరాడ్ సహకారంతో టీవీఎస్ మోటార్ కంపెనీ, తొలి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ‘సీఈ 2’ తయారీని శుక్రవారం హోసూరు ప్లాంట్‌లో ప్రారంభించింది. బీఎండబ్ల్యూ, టీవీఎస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ జీ310 సీసీ మోటారు సైకిల్ లక్షన్నర వాహనాన్ని విడుదల చేశారు. టీవీఎస్ మోటార్, బీఎండబ్ల్యూ మోటార్ సంయక్తంగా బీఎండబ్ల్యూ జీ310ఆర్, బీఎండబ్ల్యూ 310 జీఎస్, బీఎండబ్ల్యూ జీ310ఆర్ఆర్, టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310, టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 310 వాహనాలను విక్రయిస్తున్నాయి. ఇరు కంపెనీలు అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ బైక్ సీఈ02ను తొలుత యూరప్ మార్కెట్లో విక్రయించనున్నారు. తర్వాత భారత్ మార్కెట్లో విడుదల చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. సీఈ2 తయారీ, 310 సీసీ బైక్ 1,50,000 యూనిట్‌ను ఒకే రోజు ఉత్పత్తి చేయడం ప్రత్యేక సందర్భంగా కంపెనీ సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ గ్రూప్ విక్రయాల్లో టీవీఎస్ మోటార్ వాటా 12 శాతంగా ఉంటుందని తెలిపారు. రెండు గ్రూపుల మధ్య బంధం మరిన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్..!
కరీంనగర్: రాత్రి సమయంలో బైక్ స్పీడ్ బ్రేకర్ పైనుంచి వెళ్లడంతో ఓ యువకుడు ఎగిరి బండరాయిపై పడి, అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలంలోని నవాబుపేట్‌కు చెందిన బోయిని అజయ్(27) శుక్రవారం ద్విచక్రవాహనంపై హుస్నాబాద్ వెళ్లాడు. రాత్రి 9.30 గంటల సమయంలో స్వగ్రామం వస్తున్నాడు. గ్రామ క్రాసింగ్ వద్ద స్పీడ్ బ్రేకర్‌ను గమనించకుండా వెళ్లడంతో ఎగిరి బండరాయిపై పడ్డాడు. అతని తలకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. మృతుడికి తల్లి అనసూర్య, తండ్రి లక్ష్మయ్య, ఒక అక్క, చెల్లెలు ఉన్నారు. అక్కకు వివాహం చేశారు. అజయ్ అవివాహితుడు కాగా హుస్నాబాద్‌లోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
ఇనుపరేకు బాక్సులో యువతి మృతదేహం.. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు!
ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ జిల్లాలో ఇటీవల పోలీసులకు ఒక ఇనుపరేకు బాక్సులో 16 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమయ్యింది. దీంతో ఆమె ఎవరు? ఆమెను హత్య చేసింది ఎవరు? అనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక మల్టీనేషనల్ కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర శ్రీవాస్తవ ఈ యువతిని హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. మృతురాలితో గతంలో ఉపేంద్రకు అఫైర్ నడిచిందని, అయితే ఆమె మరొక యువకునితో సన్నిహితంగా ఉంటుండంతో ఉపేంద్ర ఆమెను హెచ్చరించాడని పోలీసుల విచారణలో తేలింది. ఆమె ఉపేంద్ర మాటలను పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపధ్యంలో ఉపేంద్ర ఆమెను హత్య చేశాడు. తరువాత బజారుకు వెళ్లి, ఒక ఐరన్ బాక్సు కొనుగోలు చేశాడు. ఆమె మృతదేహాన్ని ఆ బాక్సులో ఉంచి, దానిని బైక్‌కు కట్టి 40 కిలోమీటర్ల దూరంలోని అడవిలో ఆ బాక్సును వదిలేసి వచ్చాడు. ఈ సంగతి ఇక పోలీసులకు తెలియదని ఉపేంద్ర భావించాడు. అయితే అతను ఊహించని విధంగా పోలీసులు అతనిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉపేంద్ర శ్రీవాస్తవ తాను ఉంటున్న ఇంటికి సమీపంలోని 16 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరువాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపధ్యంలో ఉపేంద్ర వారణాసిలోని మహామాన్పురి కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. దానిలో వారిద్దరూ ఉండసాగారు. సాయంత్రం కాగానే ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయేవారు. ఇంతలో ఉపేంద్రకు ఆ యువతి ఎవరితోనే మాట్లాడుతున్నదనే అనుమానం వచ్చింది. ఆమెను ఈ విషయమై నిలదీశాడు. దీంతో ఇద్దరిమధ్య వివాదం నెలకొంది. ఈ నేపధ్యంలో ఆగ్రహానికి గురైన ఉపేంద్ర ఆమెను గొంతునొక్కి హత్య చేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని బాక్సులో పెట్టి, దానిని బైక్‌కు కట్టి వారణాసికి 40 కిలోమీటర్ల దూరంలోని బదోహీ నేషనల్ హైవే మీదుగా లాలానగర్ సమీపంలోని అడవులలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాక్సును కిందకు దించి, బైక్ ట్యాకులోని పెట్రోల్ బయటకు తీసి, దానితో బాక్సుకు నిప్పంటించాడు. ఇలా చేయడం ద్వారా తన నేరాన్ని ఎవరూ గ్రహించలేరని ఉపేంద్ర భావించాడు. అయితే స్థానికులు ఈ అనుమానాస్పద బాక్సును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా పోలీసులు హైవేలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. వాటిలో నిందితుడు తన బైక్‌కు ఈ బాక్సును కట్టి ప్రయాణిస్తున్న దృశ్యం కనిపించింది. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడు ఉపేంద్ర శ్రీవాస్తవ్‌ను అరెస్టు చేశారు. అతని దగ్గరి నుంచి బైక్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు తదపరి చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ భారత యువరాణి బ్రిటన్‌లో మహిళల కోసం ఎందుకు పోరాడారు? -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా మూడు వాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. వడమాలపేట చెక్‌పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో కారు ఢీకొట్టగా, ప్రమాదానికి గురైన కారును బైక్ ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
మీ బైక్ సైలెన్సర్ సౌండ్ మారిందో.. జర జాగ్రత్త..!
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల అధిక శబ్దాలతో వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో వాహనదారులతో పాటు వృద్ధులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే శబ్దకాలు ష్యంతో అవస్థలు పడుతున్నామని పలువురు పోలీ స్‌స్టేషన్ మెట్లెక్కారు. దీంతో ఇటీవల పట్టణ పోలీ సులు అలాంటి సైలెన్సర్లు అమర్చి వాహనాలు న డుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. మెకానిక్ షాప్‌లకు నోటీసులు.. అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను అమర్చే మెకానిక్ షాప్‌లకు నోటీసులు పంపిస్తాం. అయినా వినకుంటే కేసులు నమోదు చేస్తాం. అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను అమర్చుకునే ద్విచక్ర వాహనదారులకు మొదటిసారిగా జరిమానా విధించి తర్వాత కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతాం. శబ్ద కాలుష్యం ద్వారా జరిగే అనర్థాలకు ఎవరు కారణం కావద్దు. లేదంటే తగిన చర్యలు తీసుకుంటాం. - గంగారెడ్డి, నిర్మల్ డీఎస్పీ సౌండ్‌తో ఇబ్బంది అవుతుంది.. సౌండ్ వచ్చే ద్విచక్ర వాహనాలతో పట్ట ణంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. మైనర్లు సైతం ద్విచక్ర వాహనాలకు సౌండ్ వచ్చే సైలెన్సర్లు బిగించి రోడ్డు మీద వెళ్లేవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాగే ద్విచక్ర వాహనాలతో రోడ్లపై ఇష్టానుసారంగా నడుపుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై పోలీసులు సీరియస్‌గా వ్యవహరించాలి. - శంకర్ యాదవ్, మంజులాపూర్ కంపెనీ అమర్చిన సైలెన్సర్లు మార్చుతూ.. ద్విచక్ర వాహనానికి కంపెనీ అమర్చిన సైలెన్సర్లు మాడిపై చేస్తున్నారా..? అయితే మీకు షాక్ ఇచ్చేందుకు పట్టణ పోలీసులు సిద్ధమయ్యారు. శబ్ద కాలు ష్యంపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు అధిక శబ్దాలు చేసే వారి వాహనాల పని పడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. రోడ్డు రోలర్‌తో తొక్కిస్తూ.. అధిక సౌండ్ చేసే బైక్‌లను పట్టుకుని వాటి సైలెన్సర్లను తొలగించి పట్టణ నడి ఒడ్డున గల చౌరస్తాలో రోడ్‌రోలర్‌తో వాటిని పోలీసులు తొక్కించి నుజ్జునుజ్జు చేయిస్తున్నారు. 2023లో ఇప్పటివరకు 126 సై లెన్సర్లను తొలగించారు. ఇందులో నుంచి 100 ద్వి చక్ర వాహనాలకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మిగతా 26 ద్విచక్ర వాహనాలను ఆర్టీ వోకు అప్పజెప్పారు. దీంతో ఆర్టీవో ఒక్కొక్క వాహనానికి రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. కొన్ని ద్విచక్ర వాహనాలకు పలువురు నేటికీ అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. శబ్ద కాలుష్యంపై ఫిర్యాదులు.. ఖరీదైన ద్విచక్ర వాహనాలు నడిపేవారు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడుతున్నారని నిర్మల్‌లో ఫి ర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సైలెన్సర్లు వాడడంతో శబ్ద కాలుష్యంతో పాటు, వృద్ధుల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడనుంది. అంతేకాకుండా రో డ్డుపై వెళ్లే మిగతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరుతున్నారు. విక్రయదారులపై చర్యలు శూన్యం.. మార్కెట్లో విచ్చలవిడిగా మెకానిక్ షాపుల్లో అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు విక్రయిస్తున్నారు. మొదట గా సైలెన్సర్లు విక్రయించే షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకుంటే అమ్మడం ఆపేస్తారని సూచిస్తున్నారు. పోలీసులు వారిని కట్టడి చేస్తే ఎవరు అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు అమర్చుకోలేరని వాపోతున్నారు. -
మార్కెట్లోకి మళ్లీ హీరో కరిజ్మా..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా కరిజ్మా బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 సీసీ బైక్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.72 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంటుంది. ప్రీమియం సెగ్మెంట్లో తమ వాటాన్ని పెంచుకునే దిశగా తమకు ఇది మరో మైలురాయి అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. తాము ప్రస్తుతం ఈ విభాగంలో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, మార్కెట్ వాటా 4–5 శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పూర్తి స్థాయిలో వేగవంతంగా రూపొందించుకోనున్నట్లు గుప్తా చెప్పారు. ప్రస్తుతం 150 సీసీ లోపు సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ ఇకపై 150 సీసీ నుంచి 450 సీసీ వరకు బైక్‌ల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది వ్యవధిలో ప్రతి మూడు నెలలకోసారి ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
ముసలోడే కానీ.. మహానుభావుడు, బైక్‌పై స్టంట్స్ చేసిన వృద్ధుడు
రోడ్ల మీద రయ్రయ్ అంటూ కుర్రాళ్లు చేసే స్టంట్స్ గురించి తెలిసిందే. ఇందులో పెద్ద విశేషం ఏముంది? కానీ కొంతమంది వయసుతో సంబంధం లేని పనులు చేస్తుంటారు. అలా కొన్నిసార్లు వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఓ వృద్దుడు యువకుడిలా మారి బైక్‌పై విన్యాసాలతో ఆశ్చర్యపోయేలా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో జరుగుతున్న వింతలు, విశేషాలు క్షణాల్లో మన కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. సరికొత్త విషయాలు, గమ్మత్తైన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. బైక్‌పై ఓ వృద్ధుడు విన్యాసాలు చేశాడు. బైక్‌ను నడుపుతూ ఒక్కసారిగా హ్యాండిల్‌ని విడిచిపెట్టేశాడు. బైక్‌పై జంప్స్ చేస్తే హుశారుగా స్టంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది. చాలామంది నెటిజన్లు వృద్ధుడి విన్యాసాలకు షాక్ అవుతుంటే, మరికొందరు మాత్రం.. తాతగారికి ఈ వయసులో అవసరమా? పొరపాటున కిందపడితే ఎంత ప్రమాదం? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. इन्हीं हरकतों की वजह से सरकार ने पुरानी पेंशन योजना बंद की है। 😅 pic.twitter.com/9On89AL5SJ — Ankit Yadav Bojha (@Ankitydv92) August 13, 2023 -
బైకుకు ట్రాక్టర్ టైర్
-
పంజాబ్‌లో దారుణం.. కన్నకూతురిని కిరాతకంగా..
చండీగఢ్: పంజాబ్‌లో దారుణం వెలుగుచూసింది. 20ఏళ్ల కూతురిని తండ్రి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె పట్ల క్రూరంగా వ్యవహరించాడు. కూతురు మృతదేహాన్ని బైక్‌కు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. అనంతరం బాడీని రైల్వే ట్రాక్ సమీపంలో పడేశాడు. అమృత్సర్ జిల్లాలో గురువారం జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. నిందితుడిని నిహాంగ్ సిక్కుగా గుర్తించిన పోలీసులు శుక్రవారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. జండియాలా పట్టణం పరిధిలోని ముచ్చల్ గ్రామంంలో బావు అనే వ్యక్తి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి 20 ఏళ్ల కూతురు ఉంది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో వాళ్లెవరికి చెప్పకుండా కూతురు బయటకు వెళ్లి మరునాడు గురువారం తిరిగి వచ్చింది. దీంతో తండ్రి బావు కూతురిపై ఆవేశంతో రెచ్చిపోయాడు. పదునైన ఆయుధంతో కొట్టి చంపాడు. కుటుంబ సభ్యులను సైతం ఇంట్లోనే నిర్భంధించి.. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం కూతురు మృతదేహాన్ని బైక్‌కు తాడుతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. కూతురిపై ఉన్న అనుమానం కారణంగానే ఆమెను అంతమోదించినట్లు ప్రాధిమిక విచారణలో తేలింది. చదవండి: అవమానించిన అత్తింటి బంధువులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య ఆత్మహత్య -
దొంగల తెలివి మామూలుగా లేదు.. 3 రోజుల్లోనే రాష్ట్రాలు దాటించేశారు..
సాక్షి, శ్రీకాకుళం: పలాసలో దొంగిలించిన బైక్ రూపు రేఖలు మార్చి మూడు రోజుల్లోనే రాష్ట్రాలు దాటించేసిన ఘటన పలాసలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి బైక్ యజమాని తెలిపిన వివరాల మేరకు.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఉదయ్‌శంకర్ పాత్రో మే 27న తన బండిని పోగొట్టుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎంతగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. అక్కడకు మూడు రోజుల తర్వాత ఆగ్రాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతియాబాద్ పోలీసుల నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ వాహన తనిఖీల్లో పోలీసులకు ఓ బండి దొరికిందని, ఇంజిన్ వివరాలను పరిశీలిస్తే పలాసకు చెందిన బైక్ అని నిర్ధారణ జరిగిందని వారు చెప్పారు. అయితే ఆ వాహనం ఫొటోలు చూసి ఉదయశంకర్ పోల్చుకోలేకపోయారు. తన బండి అలా ఉండదని చెప్పేశారు. కానీ అక్కడి పోలీసులు మాత్రం ఇంజిన్ వివరాలు మీ పేరు మీదే ఉన్నాయని స్పష్టం చేశారు. ట్యాంక్ కవర్ చింపేసి, అద్దాలు తీసేసి రూపురేఖలు మార్చేశారని వివరించారు. దీంతో ఆయన వెంటనే ఫతియాబాద్ వెళ్లి వాహనాన్ని పరిశీలించి అక్కడి పోలీసులకు సీ–బుక్ చూపించడంతో వివరాలన్నీ సరిపోయాయి. దీంతో ఆయనకు ష్యూరిటీపై బైక్‌ను తిరిగి అప్పగించారు. బైక్ దొంగతనాలు చేస్తున్న దొంగలు తెలివి మీరిపోయారని, రెండు మూడు రోజుల్లోనే బైక్ రూపురేఖలు మార్చేసి లారీలు ఎక్కించి రాష్ట్రాలు దాటించేస్తున్నారని బాధితుడు తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చదవండి: AP: కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ -
హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బైక్ బుకింగ్స్ నిలిపివేత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బైక్ 25,597 యూనిట్లు బుకింగ్స్‌ను నమోదు చేసిందని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. జూలై 4న బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం బుకింగ్స్ నిలిపివేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. సెప్టెంబరులో తయారీ మొదలుపెట్టి అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపింది. ఎక్స్‌షోరూంలో ఎక్స్440 ధరలు డెనిమ్ వేరియంట్ రూ.2.39 లక్షలు, వివిడ్ రూ.2.59 లక్షలు, ఎస్ వేరియంట్ రూ.2.79 లక్షలు ఉంది. ‘ప్రీమియం విభాగంలోకి ప్రవేశించడంపై కస్టమర్లు చూపుతున్న విశ్వాసాన్ని చూస్తుంటే సంతోషం కలుగుతోంది. బుకింగ్స్ ఎక్కువ భాగం టాప్ ఎండ్ మోడల్ నుండి వస్తున్నాయి. వినియోగదార్లు సరైన బ్రాండ్, మోడల్‌కు ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని దీనినిబట్టి స్పష్టం అవుతోంది. ప్రీమియం విభాగంలో గెలుపొందేందుకు కంపెనీ ప్రయాణానికి ఇది ప్రారంభం మాత్రమే’ అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. హార్లే డేవిడ్సన్ బైక్స్ అభివృద్ధి, విక్రయం కోసం 2020 అక్టోబరులో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. -
తండ్రి బైక్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై.. ఎవరికీ చెప్పకుండా..
హైదరాబాద్: బైక్ కొనివ్వమంటే తల్లిదండ్రులు నిరాకరించారని అలిగి ఓ బాలుడు ఇంట్లో నుంచి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోనీ గౌరీ శంకర్ కాలనీ సరస్వతి స్కూల్ సమీపంలో నివసించే సి.గోవర్ధన్ గత నెల 31వ తేదీన తండ్రి వెంకటయ్యను తనకు బైక్ కొనివ్వాలంటూ అడిగాడు. అయితే తనకు ఆ స్థోమత లేదని తండ్రి చెప్పాడు. ఇక ఎప్పటికీ బైక్ కొనివ్వలేడని మనస్తాపానికి గురైన గోవర్ధన్ అదే రోజు రాత్రి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిపోయాడు. గత నాలుగు రోజుల పాటు తల్లిదండ్రులు కొడుకు కోసం అన్ని ప్రాంతాలు గాలించినా ఫలితం లేకపోవడంతో తన కొడుకు కనిపించడం లేదంటూ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని బాలుడికోసం గాలిస్తున్నారు. -
రెండు కాదు ఏకంగా 4 చక్రాల బైక్
-
దయ చేసి ఇలాంటి స్టంట్లు చేయొద్దు
-
రోడ్డుపై అర్థనగ్నంగా యువతి నృత్యం.. ఒళ్లు మండిన యువకుడు చేసిన పని ఇదే..
రీల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న యువత ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఏమి చేసేందుకైనా వెనుకాడటం లేదు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిపివేసి డ్యాన్స్ చేయడం, రైలుకు ఎదురుగా నిలుచుని పోజులు కొట్టడం లాంటి ఎన్నో చేష్టలు చేసేవారు కూడా ఎందరో ఉన్నారు. అయితే ఇటువంటి సందర్బాల్లో కొందరు.. పోలీసుల చేతికి చిక్కుతున్నారు. తాజాగా ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక యువతి అర్థనగ్నంగా నిలుచుని డాన్స్ చేస్తూ ఉంటుంది. మ్యూజిక్కు అనుగుణంగా తన నడుమును వయ్యారంగా తిప్పుతుంది. ఆమె రోడ్డు మధ్యలో నిలుచుని వయ్యారాలు ఒలకబోస్తుడటంతో ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఈ డాన్స్ వేన్తున్న యువతి స్నేహితురాలు దీనినినంతా వీడియో తీస్తుంటుంది. డాన్స్ చేస్తున్న యువతి ఈ రోడ్డుంతా తనదే అన్నట్లు ఎవరినీ పట్టించుకోకుండా డాన్స్ చేస్తుంటుంది. అయితే ఆమె తీరుకు ఆగ్రహించిన ఒక యువకుడు తన బైక్ ముందుకు పోనిచ్చి , ఆ యువతిని ఒక్క దెబ్బ కొట్టి వెళ్లిపోతాడు. ఈ వీడియో @Bornakang అనే పేరుగల యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 8 మిలియన్లు వ్యూస్ దక్కాయి. 85 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకారకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రోడ్డుపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తూ ఇలా డాన్స్ చేయడం తగినది కాదని వారంటున్నారు. ఇది కూడా చదవండి: 6 అంగుళాల భూమి కోసం దారుణ హత్య.. కాల్ చేసినా స్పందించని పోలీసులు! I can’t even blame him pic.twitter.com/lWydnPjk7b — Lance🇱🇨 (@Bornakang) July 26, 2023 -
పెట్రోల్‌కు బదులు నీళ్లు.. కొంత దూరం వెళ్లగానే..
మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కు బదులు నీళ్లు రావడంతో ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... వాహనదారులు శనివారం హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో తమ వాహనాల్లో పెట్రోల్ పోసుకొని కొంత దూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోయాయి. దీంతో మెకానిక్‌లను సంప్రదించగా ఇంజన్‌లోకి పెట్రోల్‌కు బదులుగా నీళ్లు చేరాయని తెలిపారు. వాహనంలోని పెట్రోల్‌ను తీసి పరిశీలించగా నీరు ఉండడంతో కల్తీ జరిగినట్లు గుర్తించారు. పెట్రోల్‌ను బాటిల్లో తీసుకుని వాహనదారులు వందల సంఖ్యలో బంక్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో బ్లూ కోర్ట్ సిబ్బంది జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమనిగించారు. పెట్రోల్ బంక్ సిబ్బంది మా తప్పిదం ఏమి లేదని ట్యాంకర్ వచ్చి బంక్‌ల్లో పెట్రోల్ పోసి వెళ్లిపోయిందని తెలుపడం గమనార్హం. మరి పెట్రోల్ కల్తీ ఎక్కడ జరిగిందనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. జరిగిన పొరపాటుకు వాహనదారుల బండి నంబర్లు ఫోన్ నంబర్ రాసుకుని మళ్లీ ఎంత పెట్రోల్ పోయించుకున్నారో అంత పోసేందుకు ఒప్పందం చేసుకోవడంతో ఆందోళన సద్దుమనిగింది. -
లిఫ్ట్ అడిగి.. బైక్‌తో ఉడాయించాడు!
భద్రాద్రి: ఓ యువకుడు లిఫ్ట్ అడిగి బైక్‌తో ఉడాయించిన ఘటన శనివారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. టీడీపీ మండల అధ్యక్షుడు కొమరం దామోదర్‌రావు ఉదయం బైక్‌పై సీతానగరం నుంచి లక్ష్మీనగరం వస్తున్నాడు. ఈ క్రమంలో సీతానగరం గ్రామం దగ్గర ఓ యువకుడు లిఫ్ట్ అడిగి వాహనం ఎక్కాడు. చిన్ననల్లబల్లి వచ్చాక బైక్‌లో పెట్రోల్ కొట్టించారు. అనంతరం స్టార్ట్ కాకపోవడంతో దామోదర్‌రావుతోపాటు సదరు యువకుడు ద్విచక్రవాహనాన్ని తోసుకుంటూ మెకానిక్ దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ రిపేర్ చేస్తుండగా అత్యవసర పని ఉండటంతో దామోదర్‌రావు ఆటోలో లక్ష్మీనగరం బయల్దేరాడు. ఆటో ఎక్కాక అనుమానం వచ్చి.. తాను వచ్చే వరకు బైక్ ఎవరికీ ఇవ్వొద్దని మెకానిక్కు చెప్పాలంటూ ఇద్దరు గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వారు మెకానిక్ షాపు వద్దకు వచ్చే లోపే లిఫ్ట్ అడిగిన యువకుడు స్టార్ట్ చేసి చూస్తానంటూ బైక్‌తో ఉడాయించాడు. దీంతో దామోదర్‌రావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
బైక్‌పై ఫోన్.. రింగ్ రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడ్డాడు..!
డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడితే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కూడా ప్రమాదానికి సెల్‌ఫోనే కారణం.. కానీ ఇది పూర్తిగా విభిన్నం. ఏ వాహనం అతన్ని టచ్ చేయకుండానే బైక్‌పై నుంచి కిందపడ్డాడు. ఈ తీరు చూస్తే తప్పకుండా నవ్వు ఆపుకోలేరు. వీడియోలో చూపిన విధంగా.. ఫోన్ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్‌ను నడుపుతున్నాడు. కూడలిలో సిగ్నల్ రావడంతో బైక్‌ను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఓ పక్క ఫోన్‌ను చెవి వద్ద పెట్టుకుని మరో పక్క బైక్‌ను అదుపు చేయలేక పోయాడు. రింగు రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడిపోయాడు. విచిత్రమేమంటే.. కిందపడిపోతున్నా.. అతను సెల్‌ఫోన్ విడవకపోవడం గమనార్హం. Important call ayy untadi 🏃♂️🏃♂️😂😂 pic.twitter.com/JHAJj5LQGj — Pakkinti Uncle (@Idly_Baba) July 18, 2023 ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాపం.. చాలా ముఖ్యమైన కాల్ అనుకుంటా.. కిందపడిపోతున్నా చెవి వద్ద ఫోన్ తీయకుండా మాట్లాడుతున్నాడంటూ కామెంట్లు పెట్టారు. ఇదీ చదవండి: Viral Video: అమ్మా! తల్లి ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్లో.. -
బైక్‌పై లవర్స్ రొమాన్స్.. రహదారిపై అందరూ చూస్తుండగానే..!
ఢిల్లీ: ఈ మధ్య యువత రెచ్చిపోతున్నారు. పబ్లిసిటీ కోసం పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్‌గా ఫీల్ అయిపోయి అసభ్యకర చేష్టలతో వార్తల్లో కెక్కుతున్నారు. తాజాగా దేశ రాజధాని ప్రధాన రహదారిపై ఓ యువతీ యువకులు బైక్‌పై అభ్యంతకరంగా ప్రయాణించారు. Idiot's of Delhi Time - 7:15pm Day - Sunday 16-July Outer Ring Road flyover, Near Mangolpuri@dtptraffic pic.twitter.com/d0t6GKuZS5 — 𝖀𝖗𝖇𝖆𝖓 𝖀𝖙𝖘𝖆𝖛 🗨️🦂 (@Buntea) July 16, 2023 ఢిల్లీలోని అవుటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ మంగోల్పురీ సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్పీడ్‌గా వెళ్తోన్న బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై యువకుడికి ఎదురుగా కూర్చున్న యువతి అతన్ని గట్టిగా కౌగిలించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. యువకునితో పాటు యువతి కూడా హెల్మెట్ పెట్టుకుని ఉంది. ఈ అంశంపై నెటిజన్లు ఫైరవుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దీన్ని ఈ దృశ్యాలను వీడియో తీశారు. అనంతరం ట్విటర్లో పోస్టు చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదీ చదవండి: దారుణం.. తాజ్‌మహల్ చూసేందుకు వచ్చిన టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి -
జగన్ వీరాభిమాని బైక్ యాత్ర
అనకాపల్లి టౌన్: ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకోవాలని కోరుతూ జగన్ వీరాభిమాని పాస్టర్ అడవికొట్టు రాజు చేపట్టిన బైక్ యాత్రకు స్థానిక వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి సోమవారం ఘన స్వాగతం లభించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మే 15వ తేదీన తన బైక్ యాత్ర ప్రారంభించాడు. ఇందులో భాగంగా అనకాపల్లి మండలం సీహెచ్ఎన్ అగ్రహారం చేరుకున్నాడు. ఇక్కడ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ను కలిశాడు. జగన్మోహన్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్న రాజు సంకల్పం నెరవేరాలని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. సదరు వ్యక్తి బైక్ యాత్ర పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం చేరుకుంది. -
ఆ బైక్ సేల్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 50 లక్షల యూనిట్ల యాక్సిస్–125 స్కూటర్లను ఉత్పత్తి చేసి ఈ ఘనతను సాధించింది. వినియోగదార్ల అభిరుచులకు అనుగుణంగా దాదాపు ఏటా ఈ మోడల్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. భారత్‌లో 2007లో యాక్సిస్–125 స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో దేశంలో 125 సీసీ విభాగంలో ఉన్న ఏకైక స్కూటర్ ఇదే. -
తెలంగాణ, ఏపీల్లో కొట్టేసిన బైక్ ఎక్కడికి వెళ్తున్నాయంటే..!
జయపురం: అంతర్ రాష్ట్ర బైక్ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జయపురం సబ్ డవిజనల్ పోలీసు అధికారి హరీష్ బి.సి స్థానిక పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరుచుగా బైక్‌లు దొంగలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టు చేయబడినవారు జయపురం విక్రమనగర్ లాల్సాహి గ్రామానికి చెందిన ఎల్.అఖిల్ ఉరఫ్ ఉదయ్(22), బొయిపరిగుడ సమితి దసమంతపూర్కు చెందిన కృష్ణ నాయిక్ (19)లుగా వెల్లడించారు. వారిద్దరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచామని, అలాగే నవరంగపూర్ జిల్లా కొడింగ సమితి చొటాహండికి చెందిన పద్మణ హరిజన్ ఉరఫ్ గులెట్(25)ని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నామని వెల్లడించారు. నిందితుల నుంచి 11 మోటారు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ముఠాలో ఇకెంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఇలా పట్టుబడ్డారు జయపురం పవర్ హౌస్ కాలనీలో ఉంటున్న జి.గణేష్ తన బైక్ దొంగిలించబడిందని ఫిర్యాదు చేశాడు. ఆ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నట్లు తెలిసిందని ఆయన తెలియజేశారు. పోలీసులు నిందితులు దొంగిలించిన బైక్‌ను వెంబడించి గాంధీ కూడలి వద్ద పట్టుకున్నారు. వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా తాము అనేక బైక్‌లు దొంగిలించి నవరంగపూర్ జిల్లా కొడింగ సమితి ఛొటాహండి గ్రామంలో పద్మన్ హరిజన్‌కు అమ్మినట్లు తెలియజేశారు. అనంతరం పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ మహంతి బెహర, ఏఎస్ఐ విష్ణు మడకామిలతో ఒక టీమ్ ఏర్పాటు చేశారు. కొడింగ పోలీసుల సహకారంతో చొటాహండి గ్రామంలో దాడి నిర్వహించగా, ఆ సమయంలో పద్మన్ 10 బైక్‌లు అమ్మేందుకు పెట్టాడని తెలిపారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న బైక్‌లలో జయపురం పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగలించబడిన 4 బైక్‌లు, కొరాపుట్ పట్టణం, జయపురం సదర్, కుంధ్రా పోలీసుస్టేషన్ల పరిధిలో ఒక్కొక్క బైక్‌లు కాగా, రెండు బైక్‌లు ఛత్తిష్‌ఘడ్ రాష్ట్ర జగదల్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలోనివి. అలాగే బెలడిల్లా పోలీసుస్టేషన్ పరిధిలో ఒకటి కాగా, తెలంగాణ రాష్ట్రం నల్గొండ పోలీసుస్టేషన్ పరిధిలో ఒక బైక్ దొంగిలించబడిందని వివరించారు. టార్గెట్ తెలంగాణ, ఏపీ ఒడిషాలోని ఈ దొంగల బ్యాచ్ ప్రధానంగా చిన్న పట్టణాలను టార్గెట్ చేస్తోంది. పెద్దగా హడావిడి లేకుండా.. తమ పని తాము చేసుకుపోతుంది. సిసి సర్వైలెన్స్ పెద్దగా లేని చోట.. బైక్ లను క్షణాల్లో మాయం చేయడం వీరి విధానం. ఎంతగా తాళాలు వేసినా.. వీరికున్న నైపుణ్యంతో సులభంగా అన్ లాక్ చేస్తారు. అదేవిధంగా నంబరు లేని ఒక బైక్ సైతం వారి నుంచి సీజ్ చేసినట్లు వెల్లడించారు. బైక్‌ల యజమానులు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి వారి బైక్‌లను తీసుకెళ్లవచ్చని తెలియజేశారు. సమావేశంలో జయపురం పట్టణ పోలీసు అధికారి సంబిత్ కుమార్ బెహర, ఎస్ఐ సంజయ కుమార్ మహంతి, సిద్ధార్ధ కుమార్ బెహరలు పాల్గొన్నారు. -
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. రాంగ్రూట్లో వచ్చి బైక్‌ను ఢీకొట్టి.
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటలకు రాంగ్ రూట్లో వస్తున్న బీఎండబ్ల్యూ కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా బైక్‌ను కొంత దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ఘటనలో జీహెచ్ఎంసీ ఏరియా మేనేజర్ పనిచేస్తున్న బాలచందర్ తీవ్రంగా గాయపడ్డారు. నికులు బాల చందర్‌ను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారు నెంబర్ (TS09EJ5688) పోలీసులు నిర్థారించారు. ఈ సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మళ్ళీ మార్కెట్ లోకి యమహా RX 100
-
కొత్త వెర్షన్ బీఎండబ్ల్యూ బైక్ భలే ఉందే.. ధర ఎంతంటే?
ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్‌లో న్యూ వెర్షన్ బైక్‌ను విడుదల చేసింది. 1000ఆర్ఆర్ పేరుతో లాంచ్ చేసిన బైక్ ప్రారంభ ధర రూ.49 లక్షలుగా ఉంది. అప్డేట్ చేసిన ఎం 1000 ఆర్ఆర్ను సైతం వాహనదారులకు పరిచయం చేసింది. దీని ధర రూ.49లక్షలుగా ఉంది. ఎం 1000 ఆర్ఆర్ కాంపిటీషన్ పేరిట తీసుకొచ్చిన మరో బైక్ ధర రూ.55 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ వేరియంట్లో బ్లాక్‌స్ట్రోమ్ మెటాలిక్ అండ్ ఎం మోటార్‌స్పోర్ట్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ సూపర్ బైక్‌లో లిక్విడ్ కూల్డ్ 999సీసీ, ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్, 212హెచ్‌పీ, 113 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. కేవలం 3.1 సెకన్లలో 0-100 కేపీఎంహెచ్ స్పీడ్ అందుకోగలదు. అయితే, టాప్ స్పీడ్ 314కేపీఎంహెచ్ వరకు దూసుకెళ్లగలదు. కంప్లీట్ బిల్ట్ అప్ యూనిట్ (సీబీయూ) తో వస్తున్న ఈ బైక్ ప్రీ ఆర్డర్లు అన్ని బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా అథరైజ్డ్ డీలర్ల వద్ద జూన్ 28 నుంచి ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. 2023 నవంబర్ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని పేర్కొంది. -
బైకు తెచ్చిన భారీ లాభం.. పాత బైక్‌కు రూ.3 కోట్లు!
హాలీవుడ్ సినిమా ‘ఘోస్ట్ రైడర్’లో హీరో కంటే, ఆ హీరో నడిపిన మోటర్ బైక్ బాగా పాపులర్ అయింది. అలా సామాన్యులకు కూడా స్పోర్ట్స్ బైక్స్‌పై ఆసక్తిని పెంచింది ఆ సినిమా. అయితే, స్వతహాగానే చాలామంది అబ్బాయిలకు మోటర్‌బైక్స్, కారులంటే చాలా పిచ్చి. అలాంటి ఓ పిచ్చితోనే యూకేకు చెందిన వాకర్స్, 1973లోనే 150 పౌండ్లు (రూ. 16 వేలు) ఖర్చు పెట్టి 1931 నాటి రోల్స్‌రాయ్స్ కంపెనీ తయారు చేసిన ‘బ్రౌ సుపీరియర్ ఎస్ఎస్100’ మోడల్ బైక్ కొనుగోలు చేశాడు. ఈ మోటర్ బైక్ గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్‌బైక్. దాదాపు ఇరవై సంవత్సరాలు సంతోషంగా ఈ సూపర్‌బైక్‌ను నడిపిన వాకర్స్.. తర్వాత కారు కొని, బైకును మూడు దశాబ్దాలకుపైగా గ్యారేజ్‌కే పరిమితం చేశాడు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకెంతో ఇష్టమైన ఈ సూపర్బైకును వేలానికి ఉంచడంతో కళ్లుచెదిరే ధర పలికింది. ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ సూపర్‌బైక్‌ను 2.80 లక్షల పౌండ్లు (రూ.3 కోట్లు) చెల్లించి కొనుగోలు చేశాడు. అంటే రెండు వేల రెట్ల లాభం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాభై ఏళ్ల తర్వాత కూడా ఈ మోటర్‌బైకు మంచి కండిషన్లోనే ఉండటం. ఇక వచ్చిన డబ్బును తన కాలి శస్త్రచికిత్సకు ఉపయోగిస్తానని వాకర్స్ చెప్పాడు. -
ముచ్చటపడి కొనుక్కున్న బైక్.. మొదటి నుంచీ సమస్యలే.. చిర్రెత్తుకొచ్చి
హిందూపురం: సేవా లోపం కారణంగా అసహనానికి గురైన ఓ యువకుడు షోరూం ఎదుట తన నూతన ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు.. హిందూపురంలోని పెనుకొండ రోడ్డులో ఉన్న టీవీఎస్ షోరూంలో బీరేపల్లికి చెందిన మనోజ్ ఫైనాన్స్ కింద ఓ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. పట్టుమని ఐదు నెలలు కూడా గడవక ముందే వాహనంలో సమస్యలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. సమస్య తలెత్తిన ప్రతిసారీ తాత్కాలిక మరమ్మతులతో సరిబెడుతూ వచ్చారు. అయినా సాంకేతిక సమస్యలు తప్పలేదు. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి వాహనం మరమ్మతుకు గురవడంతో షోరూంకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో షోరూం నిర్వాహకులతో వాగ్వాదం జరిగి అసహనానికి గురైన మనోజ్ వెంటనే షోరూం ఎదుట తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఘటనతో నివ్వెర పోయిన షోరూం నిర్వహకులు వెంటనే మంటల్ని అదుపు చేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. -
యువకుడి బైక్‌పై మహిళ.. గమనించిన భర్త.. వారిని వెంబడించి..
సాక్షి, హైదరాబాద్: యువకుడి బైక్‌పై వెళుతున్న భార్యను గమనించిన భర్త.. వారిని వెంబడించి ఆ యువకుడిపై కత్తులతో దాడి చేసిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆజంపురా కట్టెలగూడాకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు యూసుఫ్(30) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో బైక్‌పై వెళుతున్నాడన్న విషయం తెలుసుకున్న భర్త, బంధువులు వెంబడించి హత్య చేసి పరారయ్యారు. మృతుడికి సదరు మహిళతో వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు పీఎస్‌లో లొంగిపోయినట్లు తెలిసింది.. ఘటనా స్థలాన్ని సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ మనోహర్ క్లూస్ టీం సందర్శించి వివరాలు సేకరించారు. కాగా హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో 5 హత్యలు చోటుచేసుకోవడం నగరవాసుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. అర్ధరాత్రి టప్పాఛబుత్రలో ఇద్దరు ట్రాన్స్జెండర్లను గుర్తుతెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో రెండు హత్యలు జరిగాయి. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో కొట్టి చంపారు దుండగులు. తాగతాజగా. చాదర్‌ఘాట్ సమీపంలో మరో హత్య జరిగింది. వరుస హత్యలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చదవండి: స్వామీజీ లీలలు.. గొలుసులతో కట్టేసి రెండేళ్లుగా అఘాయిత్యం -
ఎండలకు పల్సర్ బైక్ దగ్ధం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలో తీవ్రమైన ఎండ ధాటికి ఆదివారం ఉదయం 11.10 గంటల ప్రాంతంలో ఓ బైక్ కాలిపోయింది. శ్రీకాకుళం ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్‌మెన్ బి.శృంగార నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గుర్ల వాసి బెవర శ్రీనివాసరావు తన భార్యతో కలిసి అరసవల్లి, శ్రీకూర్మం, రాజులమ్మ తల్లి దర్శనానికి ఆదివారం వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో బండి నుంచి కాలిన వాసన రావడంతో అప్రమత్తమై బండి దిగి చూసేసరికి బ్యాటరీ వద్ద నిప్పు కనిపించింది. కొన్ని క్షణాల్లోనే ఆయిల్ ట్యాంక్ పైన మంటలు చెలరేగాయి. వెంటనే పక్కనే ఉన్న దుకాణాల సముదాయాల వారు నీళ్లు చల్లి, గోనెసంచితో మంటలను ఆర్పారు. ఈలోగా అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద తీరును, ద్విచక్రవాహనాన్ని పరిశీలించి మంటలను పూర్తిగా అదుపు చేశారు. వాహనంలో తక్కువ ఇంధనం ఉండటంతో ప్రమాదం తప్పిందని అంతా భావించారు. వానల కోసం వరుణ యాగం కాశీబుగ్గ: మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలగడానికి వానలు కురవాలని కోరుతూ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 10వ వార్డు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వార్డు కౌన్సిలర్ శర్వాన గీతారవి ఆధ్వర్యంలో వరుణ యాగం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున బిందెలతో నీళ్లు తీసుకువచ్చి శివుడిని అభిషేకించారు. -
మామూలు తెలివికాదు ఇది
-
హెల్మెట్లు చాలావరకూ నలుపు రంగులోనే ఎందుకుంటాయంటే..
ద్విచక్రవాహం నడిపేవారందరికీ హెల్మెట్కున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసేవుంటుంది. హెల్మెట్ పెట్టుకుని వాహనం నడపడం వలన ప్రమాదాల బారి నుంచి తప్పించుకోగలుగుతాం. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిలో చాలామంది తలకు గాయాలై మరణిస్తున్నారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. అందుకే వాహనం నడిపే ప్రతీఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం చెబుతోంది. చాలావరకూ హెల్మెట్లు నలుపు రంగులోనే ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. ఇలానే ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దీనికి గల కారణం ఏమిటో, దీనివెనుకనున్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి హెల్మెట్లు నలుపు రంగులో ఉండటం వెనుక సైన్స్ కన్నా వాటి ఉత్పత్తిదారుల లాభమే అధికంగా ఉంది. హెల్మెట్ తయారీ కంపెనీలు వాటి తయారీలో వినియోగించే ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్ నలుపు రంగులోనే ఉంటాయి. వీటి ప్రాసెస్‌లో వివిధ మెటీరియల్స్ వినియోగిస్తారు. ఫలితంగా పూర్తి మిక్చర్ కలర్ లేదా పిగ్మెంట్ బ్లాక్‌గా మారుతుంది. కంపెనీలు ఖర్చును తగ్గించుకునేందుకు ఈ పిగ్మెంట్తోనే హెల్మెట్లను తయారు చేస్తాయి. ఇది కూడా కారణమేనట! మరోవైపు చూస్తే పలు కంపెనీలు ఫ్యాషన్‌ను దృష్టిలో పెట్టుకుని నలుపు రంగు హెల్మెట్లను తయారు చేస్తాయని కొందరు చెబుతుంటారు. వాహనం నడిపేవారు ఏ రంగు దుస్తులు ధరించినా, వాటికి నలుపురంగు హెల్మెట్ మ్యాచ్ అవుతుంది. దీంతో వారు హుందాగా కనిపిస్తారుట. అలాగే సాధారణంగా జుట్టు నలుపురంగులోనే ఉంటున్న కారణంగా హెల్మెట్‌ను కూడా నలుపు రంగులోనే తయారు చేస్తారని చెబుతారు. పైగా నలుపురంగు హెల్మెట్లను యువత అత్యధికంగా ఇష్టపడతారని పలు సర్వేలు తెలిపాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2021లో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 46,593 మంది హెల్మెట్ ధరించని కారణంగా మృతి చెందారు. ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్... ఆదాయంలో టాప్ వన్! -
నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్
మన గతంలో చాలామంది సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తల స్టోరీల గురించి తెలుసుకున్నాం. వీరిలో చాలామంది ఆదాయంలో ఖర్చుకంటే పొదుపునకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. విలాసాలకు పోకుండా, సాధారణ జీవితాన్ని గడుపుతూనే ఎన్నో ఉన్నత శిఖరాల నధి రోహించిన వారి జర్నీల గురించి విన్నాం. ఈ లిస్ట్‌లో తాజాగా వీసీ మీడియా కోఫౌండర్, కంటెంట్ స్పెషలిస్ట్ సుశ్రుత్ మిశ్రా చేరారు. డబ్బును ఎప్పుడు, ఎక్కడ,ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడమే తెలివైన వ్యాపారవేత్త లక్షణం.ఎంత డబ్బు సంపాదించాం అన్నది ముఖ్యంకాదు. ఎంత పొదుపు చేయగలిగాం, పెట్టుబడి ద్వారా ఎంత రిటర్న్స్ సాధించాం అనేది ముఖ్యం. ఈ క్రమంలో సుశ్రుత్ మిశ్రా ట్వీట్ వైరల్‌గా మారింది. 1.7 మిలియన్ల వ్యూస్‌ను, 12.8 వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) నెలకు 1.5 లక్షలకు పైగా సంపాదించే 23 ఏళ్ల సుశ్రుత్ మిశ్రా తనకు యాపిల్ ఐఫోన్ గానీ, కారుకానీ, కనీసం బైక్ కూడా లేదని ట్వీట్ చేశాడు. ఈ విలాసాలకంటే రిటైర్ అయిన తల్లిదండ్రులు ఆనందంగా గడిపేలా చూడటం, బిల్లులు చెల్లింపులు, భవిష్యత్తు ఎదుగుదల ప్రణాళికలే ఇందుకు కారణమని మిశ్రా చెప్పుకొచ్చాడు. కొడుకుగా అమ్మనాన్నల బాధ్యత అని తెలిపారు. దీన్ని అందరికీ తెలిసేలా గ్లామరైజ్ చేయాలనుకున్నా అంటూ ట్వీట్ చేశాడు. సుశ్రుత్ మిశ్రా లైఫ్ స్టైల్ చాలామందకి ప్రేరణగా నిలిచింది. ఇది ఇండియా స్టోరీ. 2011లో రూ. 35 వేల జీతం ఉన్నపుడు తాను కూడా ఇలాగే చేశానని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. (లేఆఫ్స్ సెగ: అయ్యయ్యో మార్క్ ఏందయ్యా ఇది!) తనకూ పైబాధ్యతలన్నీ ఉన్నాయి..కుటుంబ ఖర్చులు, చెల్లెలి చదువు భవిష్యత్తు పెట్టుబడులు. అమ్మ మందులు, సొంత ఇంటి కోసం పొదుపు, కొన్ని ఇతర ఖర్చులు ఇవన్నీ నా కోరికల కంటే మించినవి..కానీ బైక్, ఐఫోన్‌ను సొంతం చేసుకోవడం మీకెందుకు అడ్డంకిగా ఉన్నాయి? అని మరొక వినియోగదారు కమెంట్ చేశారు. కాగా కంటెంట్, మార్కెటింగ్ ఏజెన్సీ వ్యాపారాన్ని సుశ్రుత్ మిశ్రా, రోషన్ శర్మ కలిసి స్థాపించారు. (అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) I'm a 23yo with ₹1.5 lakh+ monthly income. Yet: - I don't own any 'Apple' - I don't live on my own - I don't have a bike/car Why? Responsibilities of an Indian son who: - Retired his parents - Pays all the bills - Plans for his family's future I want to glamourize this. — Sushrut Mishra (@SushrutKM) June 9, 2023 -
ఎండకు తట్టుకోలేక రోడ్డుమీద స్నానం చేసిన యువకుడు
-
జగన్ మరోసారి సీఎం కావాలంటూ నియోజకవర్గాల్లో బైక్ యాత్ర
-
సెల్ఫోన్లో వాయిస్‌తో బైక్ ఆపరేటింగ్
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నంకు చెందిన యువకుడు కొంగొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. దాదాపు 20 నూతన సాంకేతిక ఆవిష్కరణలు చేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బాల్యం నుంచి సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న రాసంశెట్టి ప్రణయ్ విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో సీఈసీ బ్రాంచ్‌లో నెల రోజుల కిందటే బీటెక్ పూర్తి చేశాడు. రెండు రోజుల క్రితం సెల్‌ఫోన్‌తో వాయిస్ ద్వారా బైక్ ఆపరేటింగ్ విధానాన్ని కనుగొన్నాడు. మచిలీపట్నం నగరపాలక సంస్థ 9వ డివిజన్ కార్పొరేటర్ రాసంశెట్టి వాణిశ్రీ, చంటి దంపతుల కుమారుడే ఈ ప్రణయ్. సెల్ఫోన్లో వాయిస్ వినిపించటంతో బైక్ సెల్ప్, కిక్, తాళం లేకుండానే ఆన్ అయ్యేలా రెండు రోజుల క్రితం తన బైక్‌కు అమర్చాడు. బ్లూటూత్ వాయిస్ ద్వారా బైక్ సీటు కింద అమర్చిన ఆర్డినోబోర్డ్ పని చేయటం ద్వారా ఇది పనిచేసేలా రూపొందించాడు. అతని బండి పేరు లక్కీ కావటంతో అన్‌లాక్ లక్కీ అంటే మీటరు ఆనయ్యేలా, స్టార్ట్ లక్కీ అంటే స్టార్ట్ అయ్యేలా, స్టాప్ అంటే ఆగేలా దీనిని రూపొందించాడు. 15 నుంచి 20 మీటర్ల దూరం నుంచి బండిని ఆపరేటింగ్ చేసినా ఇది పనిచేస్తోంది. వెయ్యి రూపాయల ఖర్చుతో దీనిని తయారు చేశాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను ఇచ్చే పలు ఆవిష్కరణలకు ప్రణయ్ ప్రయత్నిస్తూ ఫలితాలను సాధిస్తున్నాడు. నూతన ఆవిష్కరణలు చేస్తున్న ప్రణయ్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) అభినందించారు. ఆవిష్కరణలు ఇవే.... ► ప్రణయ్ తాతయ్య కమ్మిలి మాధవరావు వృద్ధాప్యంతో ఉండటంతో టీవీ, ప్యాన్, లైట్ల స్విచ్‌లు వేసేందుకు వెళ్లటం ఇబ్బందిగా ఉండటంతో ఆయన కోర్కె మేరకు వీటిని రిమోట్, ఫోన్ వాయిస్ ద్వారా కంట్రోల్ చేసేలా తయారుచేశాడు. దీనిని మాధవరావు గత ఏడాదిగా వినియోగిస్తున్నారు. ► 2022 ఆగస్టులో ఉత్తరాఖండ్‌లో జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాక్‌థాన్ పోటీల్లో ప్రణయ్ నేతృత్వం వహించిన ప్రాజెక్టు జాతీయస్థాయిలో ప్రథమస్థానాన్ని సాధించి లక్ష రూపాయల బహుమతి అందుకోవటం జరిగింది. బ్లూ వాయిస్ సీఎన్సీ మిషన్ రైటింగ్ అనే ప్రాజెక్టుకు ఈ బహుమతి వచ్చింది. ఈ మిషన్ వల్ల రాయడానికి వీలు లేని దివ్యాంగులు రాతపరీక్షకు హాజరైతే వేరే వ్యక్తులు అవసరం లేకుండా ఈ మిషన్ వాయిస్ ద్వారా పరీక్ష రాస్తుంది. జాతీయస్థాయిలో జరిగిన ఈ పోటీల్లో 150 ప్రదర్శనలు రాగా ప్రణయ్ బృందం ప్రదర్శన జాతీయస్థాయిలో మొదటి బహుమతి గెలుచుకుంది. ► ప్రణయ్ ఇంట్లోని ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు నీటి సరఫరాకు మోటారు నిర్వహణ చేసేందుకు మూడేళ్ల క్రితమే సెన్సార్ల ద్వారా పని చేసే విధానాన్ని వినియోగిస్తున్నారు. దీని ద్వారా వాటర్ ట్యాంకులో నీరు ఖాళీ అయినప్పుడు మోటార్ ఆనవ్వటం, ట్యాంకు నీటితో నిండగానే మోటారు ఆగిపోవటం జరుగుతోంది. ► ఆటోమేటిక్ బాత్రూమ్ లైట్ విధానంతో బాత్రూమ్లో అడుగుపెట్టగానే లైట్ వెలగటం, బయటకు రాగానే లైట్ ఆగేలా ప్రణయ్ ఏర్పాటు చేశాడు. అలాగే స్ట్రీట్ లైట్లు చీకటి పడగానే వెలగటం, వెలుతురు రాగానే ఆగిపోవటం వంటి విధానాన్ని రూపొందించాడు. దీంతో పాటు వైఫై కార్, వాయిస్ కంట్రోల్ కార్, అబ్స్టాకిల్ అవాయిడింగ్ రోబోట్, లైట్ డిపెన్డెంట్ రిజిష్టర్ తదితర ఆవిష్కరణలను చేశాడు. రైటింగ్ మిషన్ అందించాలనే లక్ష్యం రాయలేని వికలాంగులకు బ్లూ వాయిస్ సీఎన్సీ రైటింగ్ మిషన్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను. రానున్న రోజుల్లో పాఠశాలల్లో, కళాశాలలో చదివి రాయలేని వికలాంగులకు ప్రభుత్వ సాయంతో మిషన్‌ను అందించాలని కృషి చేస్తున్నాను. మరిన్ని నూతన ఆవిష్కరణలతో ప్రజలకు ఉపయోగపడేలా పని చేయాలన్నదే నా కోరిక. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో దాదాపు 20 నూతన సాంకేతిక ఆవిష్కరణలు చేశాను. – రాసంశెట్టి ప్రణయ్, మచిలీపట్నం -
కొడుకు జల్సా రైడ్లు.. పెండింగ్ చలాన్లతో తండ్రి ఆత్మహత్య
వరంగల్: ట్రాఫిక్ చలాన్లు కట్టలేదని పోలీసులు వాహనాన్ని పట్టుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. తన తండ్రి మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణమని కుమారుడు సూర్య హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతుడి కుటుంబసభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి(54) నగరంలోని ఓ బట్టల షాపులో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మల్లారెడ్డిపల్లి నుంచి బైక్‌పై వరంగల్‌కు వెళ్లి విధులు నిర్వహించి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆ బైక్‌పై 9 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు నమోదయ్యాయి. ఈ నెల 21న ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా చూడగా చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో వాటిని కట్టి బైక్ తీసుకెళ్లాలని చెప్పారు. దీంతె అతను మల్లారెడ్డిపల్లికి ఆటోలో వెళ్లాడు. వాహనం లేకపోవడం వల్ల విధులకు వెళ్లలేనని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు వచ్చి రూ.3వేలు ఇచ్చి వెళ్లారని బంధువులు ఆరోపించారు. -
క్యాన్‌లో పెట్రోల్ పోయించుకుంటూ ఉండగా ఒక్కసారిగా మంటలు
-
బుల్లెట్ బాబులు..పని పట్టిన ట్రాఫిక్ పోలీసులు (ఫొటోలు)
-
బైక్ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు..
-
బైక్ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు..
సాక్షి, కరీంనగర్: చెవులను రణగొణ ధ్వనులతో ఠారెత్తించే ద్విచక్ర వాహనాల సైలెన్సర్స్‌ను కరీంనగర్ పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించేశారు. సౌండ్ పొల్యూషన్‌కు కారణమవుతున్న బైక్స్‌ను పట్టుకున్నారు. ఆయా వాహనాలకు చెందిన యువకులను, వారి తల్లిదండ్రులను పిలిపించి కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే.. వారి కళ్లముందే రోడ్ రోలర్ తో సైలెన్సర్స్‌ను తొక్కించేసి.. తునాతునుకలుగా ధ్వంసం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వామ్మో.. అర్ధరాత్రి ఇదేం పని.. బైక్‌లో పెట్రోల్ తీసి నిప్పంటించిన మహిళ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ చేసిన పని షాక్‌కు గురిచేస్తోంది. ఇంటిముందు పార్క్ చేసిన ఓ బైక్ వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ఆమె.. అందులోనుంచి పెట్రోల్ లీక్ చేసింది. ఆ తర్వాత అగ్గిపెట్టె వెలిగించి బైక్‌కు నిప్పంటించింది. దీంతో మంటలు చెలరేగి బైక్ కాలిబుడిదైపోయింది. మంటలు రాగానే సదరు మహిళ అక్కడి నుంచి పరారైంది. కాసేపటికే మరో బైక్‌లో నుంచి కూడా పెట్రోల్ తీసేందుకు ప్రయత్నించింది. అయితే స్థానికులు గమనించి ఆమెను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి వాళ్లు వచ్చాక అప్పగించారు. #WATCH | A woman was found taking out petrol from a bike and setting it on fire in Jaitpur police station area of Delhi's South East District last night. She was later trying to put another bike on fire during which locals caught her and handed her over to police: Delhi Police… pic.twitter.com/EXqSZ1f8nQ — ANI (@ANI) May 12, 2023 అయితే ఈ మహిళ ఎందుకు ఇలా చేసిందనే విషయంపై స్పష్టత లేదు. వ్యక్తిగత కక్షలేమైనా ఉన్నాయా? లేక ఇతర కారణాలున్నాయా? అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. మహిళ బైక్‌కు నిప్పంటించిన దశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. అర్ధరాత్రి సమయంలో ఈమె ఇలా ఎందుకు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అత్తింటి వేధింపులకు యువ డాక్టర్ బలి.. కారు ఇస్తామన్నా.. -
సెవెన్ సీటర్ బైక్ : ఇది కదా.. మేకిన్ ఇండియా అంటే..
మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపిస్తున్నారు ఔత్సాహిక వేత్తలు.పెద్దగా చదువుకోకున్నా, టెక్నాలజీ గురించి తెలియకపోయినా.. పరిశోధనలు చేస్తున్నారు. పెరుగుతున్న అవసరాలు తీర్చుకునేందుకు సరికొత్త దారులు వెతుకుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో చూస్తే.. ఆశ్చర్యపోతాం. తమ అవసరాలు తీర్చుకునేందుకు ఓ యువకుడు అత్యంత చౌకగా సోలార్ బైక్‌ను రూపొందించుకున్నాడు. మార్కెట్లో దొరికే వివిధ వస్తువులను ఉపయోగించి ఏకంగా సెవెన్ సీటర్ బైక్ తయారు చేశాడు. ఈ ఆవిష్కరణపై ప్రశ్నించినప్పుడు ఆత్మవిశ్వాసంతో బదులిచ్చాడు. "ఈ బైక్‌పై ఏడుగురు ప్రయాణం చేయవచ్చు. పైగా ఇది సోలార్ తో నడుస్తుంది. దీనిపై 200 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయవచ్చు. దీన్ని తయారు చేయడానికి 8 నుంచి 10వేల దాకా ఖర్చు వచ్చింది. చూశారుగా నా సోలార్ బైక్" నిజమే.. భారత్ లాంటి ఎదుగుతున్న దేశాలకు ఇప్పుడు మరెన్నో ఆవిష్కరణలు కావాలి. దానికి బ్రాండ్ పేర్లు పెట్టి భారీగా ధర నిర్ణయించేకంటే.. చౌకగా ప్రజల అవసరాలు తీర్చే.. వినూత్న ఆవిష్కరణలు కావాలి. అప్పుడే మేకిన్ ఇండియాకు నిజమైన అర్థం దొరుకుతుంది. So much sustainable innovation in one product - produced from scrap, seven seater vehicle, solar energy and shade from the sun! Frugal innovations like this make me proud of our India! pic.twitter.com/rwx1GQBNVW — Harsh Goenka (@hvgoenka) April 29, 2023 చదవండి👉 చాట్‌జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో! -
యువకుడి సాహసయాత్ర.. నార్పల టు లడఖ్
అనంతపురం డెస్క్ : మనం బైక్‌పై వంద, రెండు వందల కిలోమీటర్లు తిరగ్గానే బాగా అలసిపోతాం. బైక్‌లో కంటే బస్సులోనో, రైల్లోనో వెళ్లి ఉంటే బాగుండేదని అనుకుంటాం. కానీ ఆ యువకుడు అలా ఆలోచించలేదు. బైక్‌పై దేశాన్ని చుట్టేయాలన్న తన కోరికను నెరవేర్చుకునేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాడు. ఒకట్రెండు కాదు..ఏకంగా 177 రోజులు బైక్‌యాత్ర చేపట్టాడు. 10,020 కిలోమీటర్ల సుదీర్ఘదూరం ప్రయాణించాడు. అందరితో శభాష్ అనిపించుకున్న ఆ యువకుడే నార్పల మండల కేంద్రానికి చెందిన యనమచింతల బాలకృష్ణ అలియాస్ బాలు. ఆసక్తే ముందుకు నడిపించింది.. బాలు తల్లిదండ్రులు నార్పలలో హోటల్ నిర్వహిస్తున్నారు. అతను కూడా మొబైల్ సర్వీస్ సెంటర్‌తో పాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకున్నాడు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) చదివినప్పటికీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి లేదు. బైక్‌పై సుదూర ప్రాంతాలకు, కొత్త ప్రదేశాలకు వెళ్లిరావడం హాబీగా మలచుకున్నాడు. ఈ క్రమంలోనే గతంలో రామేశ్వరం, ఊటీతో పాటు కర్ణాటకలోని పలు ప్రదేశాలను బైక్‌పై వెళ్లి చూసొచ్చాడు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి కూడా వెళ్లాడు. ఈ కోవలోనే లడఖ్ యాత్రను కూడా విజయవంతంగా పూర్తి చేసి పలువురి మన్ననలు పొందాడు. సెకండ్ హ్యాండ్ బైక్‌పై యాత్ర బాలు లడఖ్ యాత్రకు అపాచీ 200 సీసీ సెకండ్ హ్యాండ్ బైక్ పై 2022 జూలై 13న నార్పల నుంచి బయలుదేరాడు. మొదట శ్రీశైల మల్లన్నను దర్శించుకుని యాత్ర కొనసాగించాడు. హైదరాబాద్, నాగపూర్, జాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, ఢిల్లీ, కురుక్షేత్ర, చండీగఢ్, అమృత్సర్, జమ్మూ, చీనాబ్ బ్రిడ్జ్, శ్రీనగర్, కార్గిల్ మీదుగా లడఖ్ చేరుకున్నాడు. మార్గమధ్యంలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించి..వాటికి సంబంధించిన వివరాలు సేకరించాడు. లడఖ్ నుంచి తిరుగు ప్రయాణంలో హిమాచల్‌ప్రదేశ్ మీదుగా కాంగ్రా, ధర్మశాల, జ్వాలాముఖి, నైనాదేవి, కేదర్‌నాథ్‌కు వెళ్లాడు. తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ఈ ఏడాది జనవరి ఐదో తేదీన నార్పలకు చేరుకున్నాడు. సుదీర్ఘయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చిన బాలును గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. బైక్‌యాత్రలో భాగంగా బాలు పలు వీడియోలు చిత్రీకరించాడు. వాటిలో కొన్నింటిని తన యూట్యూబ్ చానెల్ (బాలు సన్‌రైజ్ ట్రావెలర్)లో అప్లోడ్ చేశాడు. ఆదుకున్న జవాన్లు ప్రపంచంలోనే రెండవ అత్యంత చల్లని ప్రదేశమైన ద్రాస్ వద్ద (కార్గిల్‌కు సమీపంలో) మైనస్ 10 డిగ్రీల చలిని తట్టుకోలేక బాలు తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. దగ్గరలోని వైద్యశాలకు వెళ్లి చూపించుకోగా.. మూడు రోజుల విశ్రాంతి తీసుకోవాలని డాక్టరు సూచించారు. అప్పుడు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో భారత ఆర్మీ జవాన్లు తమ క్యాంపులో ఉండటానికి చోటు కల్పించారు. ఆరోగ్యం కుదుట పడేవరకు బాగా చూసుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడగానే బాలు యాత్ర కొనసాగించాడు. కాగా.. బాలు తీసుకెళ్లిన నగదును జమ్మూలోని డార్మెటరీలో దొంగలు అపహరించారు. దీంతో తల్లిదండ్రులు, స్నేహితులు ఆన్లైన్లో డబ్బు పంపి ఆదుకున్నారు. ఎవరెస్ట్‌కు వెళ్లాలనుంది నాకు బైక్ రైడింగ్‌తో పాటు ట్రెక్కింగ్ కూడా ఇష్టమే. కాలేజీ రోజుల్లో తరచూ ట్రెక్కింగ్ వెళ్లేవాడిని. ఎవరెస్ట్‌ను అధిరోహించాలన్నది లక్ష్యం. కనీసం బేస్ క్యాంపు దాకా వెళ్లినా నా లక్ష్యం నెరవేరినట్టే. బైక్‌యాత్రలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను సందర్శించా. ఎక్కడా హోటల్లో విడిది చేయలేదు. డార్మెటరీలు, ఆలయాలు, గురుద్వారాల్లో విడిది చేస్తూ వెళ్లా. దీనివల్ల తక్కువ బడ్జెట్లోనే యాత్ర పూర్తి చేయగలిగా. వాఘా, సుచిత్ఘర్, కార్గిల్ దగ్గర.. ఇలా మూడుచోట్ల పాకిస్తాన్ బార్డర్‌ను చూడడం మరచిపోలేని అనుభూతి. – బాలకృష్ణ, నార్పల -
ఎండలో బండి నడుపుతున్నారా? జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్టే
రాత్రికి వంద రూపాయల పెట్రోల్ వేయించా... మాములుగా అయితే బండి రోజులు నడుస్తుంది. అలాంటిది ఒక్క రోజుకే పెట్రోల్ నిల్ అని చూపుతోందని సురేష్ ఆందోళన చెందాడు. ఈ సమస్య సురేష్ ఒక్కడిదే కాదు... జిల్లా వ్యాప్తంగా వాహనాలు వినియోగిస్తున్న అందరి అనుభవం. వేయించున్నా పెట్రోల్ ఏంమైంది? పెట్రోల్ బంకులోనే తక్కువగా వేస్తున్నారా? లేదా ఎవరైనా దొంగలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవేవి కాదని నిపుణులు చెబుతున్నారు. మండుతున్న ఎండల వేడికి వాహనాల్లోని పెట్రోల్ ఆవిరవుతుండడమే కారణంగా విశ్లేషిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి హిందూపురం: అసలే వేసవికాలం... గతంలో ఎన్నడూ లేనంతగా సూరీడు భగభగ మంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఇలాంటి తరుణంలో వాహనాలను ఎక్కడబడితే అక్కడ ఎండలో ఉంచేస్తే పెట్రోల్ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయం. వాహనదారులు వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే కొత్త సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ నెలాఖరు నుంచి మే మాసం లోపు 43.1 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్క్‌కు చేరుకోవడంతో ఎండ వేడిమికి జనం విలవిల్లాడుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి.. మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉదయం 8 గంటలకే ఎండ వేడిమి ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఒకవేళ తప్పనిసరైతే ద్విచక్ర వాహనాలు లేదా, కార్లలో అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనాలను ఎండలో ఎక్కడబడితే అక్కడే ఆపేస్తున్నారు. దీంతో ఎండ వేడిమికి ఆయా వాహనాల్లోని ఇంధనం ఆవిరైపోతోంది. ఇది ఒక్కోసారి అగ్నిప్రమాదాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్కింగ్ జోన్లు లేక అవస్థలు.. జిల్లాలోని హిందూపురం, పుట్టపర్తి, కదిరి మున్సిపాల్టీలతో పాటు పంచాయతీ కేంద్రాల్లో పార్కింగ్ జోన్లు లేక వాహదారులు అవస్థలు పడుతున్నారు. కాయగూరలకు ఇతర అవసరాలకు వాహనాల్లో వెళ్లినప్పుడు ఎండలోనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధనం ఆవిరై పోతుండడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల 2,77,235 వాహనాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లోని 139 పెట్రోలు బంకుల్లో గతంలో రోజు వారీ 139 వేల లీటర్ల పెట్రోలు, డీజిల్ విక్రయాలు సాగేవి. వేసవి ఆరంభం నుంచి ఇది పెరుగుతూ వస్తోంది. తాజాగా 210 వేల లీటర్ల మార్క్‌ను చేరుకుంది.వేసవిలో వాహనదారులు అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎండ వేడిమికి పెట్రోల్ ట్యాంకుల్లో గ్యాస్ ఏర్పడి పేలిపోయే ప్రమాదముంది. రాత్రి పూట బైక్‌ను నిలిపి ఉంచినప్డుపు ఓ సారి ట్యాంక్ మూత తీసి మళ్లీ మూసి వేయాలి. మందపాటి సీటు కవర్లు వాడడం మంచిది. పెట్రోల్ ట్యాంకులను సైతం కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలను నీడలోనే పార్కింగ్ చేయడం ఉత్తమం. – షాజహాన్, మెకానిక్, హిందూపురం -
Viral Video:అమ్మాయితో పెట్టుకుంటే అంతే మరి.. సరదా తీరిందా?
బైక్, కారు వంటి వాహనాలు నడపడం చాలా సులువని అందరూ అనుకుంటారు. కానీ అందుకు ఎంతో శిక్షణ అవసరం. ఎక్కువగా బండి నడపడం వచ్చిన వాళ్ల దగ్గర డ్రైవింగ్ నేర్చుకుంటారు. లేదంటే ప్రత్యేకంగా డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఉంటాయి. అయితే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పించడం అంతా ఈజీ కాదని భావిస్తుంటారు. మహిళలు రోడ్డు మీద బండి నడపడం చూసిన కొంతమంది భయపడుతుంటారు. ఇప్పుడీ వార్త చదివితే.. ఈ విషయం నిజమేననిపిస్తుంది. అసలేం జరిగిందంటే.. కాలేజీ గ్రౌండ్లో ఓ యువకుడు మరో విద్యార్థినికి టూ వీలర్ నడపడం నేర్పించేందుకు రెడీ అయ్యారు. యువతిని ముందు కూర్చొబెట్టి వెనకాల అతడు కూర్చున్నాడు. ఇద్దరు కలిసి మెల్లగా కొంతదూరం వెళ్లారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. బ్రేక్ బదులు స్కూటీ ఎక్సలేటర్‌ను యువతి ఒక్కసారిగా పెంచడంతో బండి రెండు మూడు వంకర్లు తిరుగుతూ ముందుకు వెళ్లింది. అబ్బాయి బండిని ఆపేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఇంకేముంది చివరికి ఇద్దరు బొక్కబొర్లా పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పడం అంతా ఈజీ కాదు బ్రో. సరదా తీరిందా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అమ్మాయిలను ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదని ఇలాగే రోడ్డుపై పడేస్తారు. ఇలాంటివి జరిగినప్పుడే డ్రైవింగ్ చేస్తున్న అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది. వాళ్లకు డిస్టెన్స్ మెయింట్ చేయడం బెటర్’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg) -
వార్నీ... ఇలాంటి ఐడియాలు వీళ్ళకి ఎలా వస్తాయో!
-
చీరకట్టులో బైక్‌పై వరల్డ్ టూర్
రమాబాయి లత్‌పతే 9 గజాల మహారాష్ట్ర నౌవారీ చీరలో40 దేశాలు బైక్ మీద చుట్టి రావడానికిమార్చి 8న గేట్ వే ఆఫ్ ఇండియా నుంచిబయలుదేరింది.365 రోజుల పాటు ప్రయాణం సాగించివచ్చే ఏడాది మార్చి 8కి ముంబై చేరనుంది.‘భారత్ కీ బేటీ’ ఏదైనా చేయగలదని నరేంద్ర మోడీ అన్న మాటలే తననీ సాహసయాత్రకు పురిగొల్పాయని చెబుతోంది. బైక్ యాత్రలు చేసిన మహిళలు చాలా మందే ఉన్నారు. కాని చీర మీద బైక్ నడుపుతూ ప్రపంచ దేశాలు చుట్టి రావాలనే కోరిక మాత్రం రమాబాయి లత్‌పతేకే వచ్చింది. పుణెకు చెందిన రమాబాయి అంట్రప్రెన్యూర్. కాని బైక్ మీద విహారాలు ఆమెకు ఇష్టం. ఆ విహారాల కోసమే ప్రత్యేకమైన బైక్ ఏర్పాటు చేసుకుంది. ఇటీవల ‘జి20’ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడి ‘భారతీయ స్త్రీలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు’ అని చేసిన వ్యాఖ్య రమాబాయి లత్‌పతేను ఇన్‌స్పయిర్ చేసింది. ‘నా డిక్షనరీలో భయం అనే మాటకు విలువ లేదు. బాల్యం నుంచి నేను చాలా ధైర్యంగా నా జీవితంలో ముందుకు సాగాను. ఆ ధైర్యంతోనే ప్రపంచ యాత్ర చేయాలనిపించింది. అయితే ఆ యాత్రలో ఏ దేశంలో అడుగు పెట్టినా నేను ‘భారత్ కీ బేటీ’ అనిపించుకోవాలంటే మన సాంస్కృతిక చిహ్నమైన చీరలో ఉండటం అవసరం అని భావించాను. మహారాష్ట్ర స్త్రీలు ధరించే 9 గజాల నౌవారి చీర చాలా ప్రసిద్ధం. ఆ చీరలతోనే నా యాత్ర మొత్తం చేస్తాను’ అంది రమాబాయి లత్‌పతే. మొదలైన యాత్ర సాధారణ జనం, మీడియా ఉత్సుకతతో చూస్తుండగా ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి మార్చి 8న రమాబాయి లత్‌పతే యాత్ర మొదలైంది. ఈ యాత్ర గురించి, అందునా మహరాష్ట్ర సంస్కృతి ప్రాముఖ్యం ఉండటం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆమె యాత్రను ప్రోత్సహిస్తూ శుభాకాంక్షలు తెలియచేశారు. ‘నా మొత్తం యాత్రకు కోటి రూపాయలు అవుతుంది. ఇందుకోసం నాకున్న నగలు, నా ఎస్.యు.వి అమ్మేశాను. కొంత లోటు ఏర్పడింది. నా యాత్రను ప్రోత్సహించేందుకు మనిషికి 1 రూపాయి చొప్పున చందా ఇవ్వాలని అప్పీలు చేశాను. అలా కొంత సాయం వచ్చింది. మంచి పని మొదలెడితే సాయం అదే అందుతుంది’ అంది రమాబాయి లత్‌పతే. కఠినమైన యాత్ర రమాబాయి లత్‌పతే మొత్తం 80 వేల కిలోమీటర్లు ఈ యాత్రలో తన బైక్ మీద తిరగనుంది. నలభై దేశాల వాతావరణాన్ని తట్టుకోవాలి. అతి శీతల, అత్యల్ప ఉష్ణోగ్రతలు భరించాలి. భద్రత ఒక సమస్య. అలాగే ఆహారం కూడా. ‘అయినా నేను వెనుకాడను’ అని బయలుదేరింది రమాబాయి. ముంబై నుంచి ఆమె ఢిల్లీకి చేరుకున్నాక అక్కడి నుంచి విమానం ద్వారా ఆమె బైక్‌తో పాటుగా ఆస్ట్రేలియా చేరుకుంటుంది. ఆస్ట్రేలియాలో పెర్త్ నుంచి సిడ్నీ వరకు 1600 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణిస్తుంది. కాని ఆ దారిలో జనావాసాలు పెద్దగా ఉండవు. వాతావరణం కూడా కఠినంగా ఉంటుంది. దారి మధ్యలో ఆమె టెంట్ వేసుకుని విడిది చేయక తప్పదు. ఆ ఛాలెంజ్‌ను రమాబాయి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా నుంచి ఆక్లాండ్ (న్యూజిలాండ్)కు, అక్కడి నుంచి శాంటియాగో (చిలీ), ఆ తర్వాత బొగోటా (కొలంబియా), ఆ తర్వాత అమెరికా అక్కడి నుంచి కెనడాలకు బైక్ మీదే ఆమె ప్రయాణం సాగుతుంది. ఆపై సముద్ర మార్గంలో బైక్‌ను లండన్‌కు చేరవేసి అక్కడి నుంచి తిరిగి బైక్ మీద పోలాండ్, రోమ్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, టునీషియా, జోర్డాన్... ఇలా ప్రయాణించి మళ్లీ సముద్రం మీదుగా సౌదీ చేరుకుని ఆ ఎడారి దేశాలన్నీ చుట్టి గుజరాత్లో ప్రవేశించి వచ్చే ఏడాది మార్చి 8కి గేట్ వే ఆఫ్ ఇండియా చేరుకుంటుంది. ఈ మొత్తం యాత్రలో మిగిలిన దేశాలతోపాటు జి 20 నుంచి 12 దేశాలు ఉంటాయి. ప్రయాణాలు చేయండి ‘స్త్రీలు నాలుగు గోడల మధ్య ఉండటం వల్ల ప్రపంచం ఏమీ తెలియదు. ప్రయాణాలకు భయపడాల్సింది లేదు. వీలైనన్ని ప్రయాణాలు చేసి లోకం ఎంత విశాలమో తెలుసుకోండి’ అంటోంది రమాబాయి. -
హవ్వా! రోడ్డు మీద ఇదేం పని.. హద్దులు మీరిన ప్రేమ జంట
సమాజంలో నివసిస్తున్నప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు, కట్టుబాట్లు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ ప్రజలు జీవితం సాగించాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఇవేమి తమకు పట్టవంటూ విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ నలుగురిలో నవ్వులు పాలవతుంటారు. తాజాగా ఓ ప్రేమికులు బైక్‌పై ప్రయాణిస్తూ రోడ్డు మీద హద్దులు మీరి ప్రవర్తించిన వింత ఘటన రాజస్థాన్‌లో జైపూర్‌లో చోటచేసుకుంది. ఆ వీడియోలో.. హోలీ జరుపుకున్న అనంతరం ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొన్న లవర్.. ప్రేమికుడిని హగ్ చేసుకోని కూర్చుని రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంది. దీనంతటిని వెనుక కారులో ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేస్తున్నాడు. ఇదంతా తెలిసినా ఆ జంట ఏ మాత్రం భయపడకుండా వారి పనిలో వారు ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ జంట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. వాహనదారుడి నిర్లక్ష్యం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు మార్చి 7న మోటారు వాహనాల చట్టం 1988, రాజస్థాన్ మోటారు వాహనాల చట్టం 1990 ప్రకారం మోటారుబైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ జంటకు రూ. 5,000 జరిమానా కూడా విధించారు పోలీసులు. -
గజరాజుకు కోపమొస్తే అట్లనే ఉంటది మరి!
-
లగ్జరీ బైక్‌పై హీరోయిన్ సందడి, లుక్స్‌లో ఎక్కడా తగ్గేదెలే!
గత నెలలో టూ వీలర్ లైసెన్స్ టెస్టుకు హాజరై వార్తల్లో నిలిచిన మంజు వారియర్, తాజాగా రూ. 21 లక్షల బైక్ కొనుగోలు చేసి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అయ్యాయి. తునివు సినిమాలో అజిత్ సరసన నటించిన ఈ మలయాళీ భామ ఆయన స్ఫూర్తితోనే ఖరీదైన 'బిఎండబ్ల్యు ఆర్ 1250 జిఎస్' బైక్ కొనుకోలు చేసింది. ఈ విషయాన్ని మంజు వారియర్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఇందులో బైక్ డెలివరీ తీసుకోవడం, రైడింగ్ చేయడం వంటి దృష్ట్యాలు చూడవచ్చు. బిఎండబ్ల్యు ఆర్ 1250 జిఎస్ బైక్ భారతీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఒకటి. అజిత్ వంటి సెలబ్రిటీలు ఈ బైక్ కొనుగోలు చేశారు. బహుశా ఇంతటి ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన మొదటి సినీ నటి మంజు వారియర్ కావచ్చు. ఇప్పటికే ఈమె వద్ద ల్యాండ్ రోవర్, మారుతి బాలెనొ కార్లతో పాటు మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు కూడా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు రైడింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఈ బైక్స్ రూపొందించబడ్డాయి. ఈ బైక్ ట్విన్-సిలిండర్ 1254సిసి ఇంజన్ 134 బిహెచ్పి పవర్ 143 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇది 20 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పరంగా ఈ బైక్ తనకు తానే సాటిగా ఉంటుంది. A tiny step of courage is always a good place ❤️ P.S : Got to go a looooong way before I become a good rider, so if you see me fumbling on the roads, please be patient with me 😊🙏 Thank you for being an inspiration to many like me #AK #AjithKumar sir ❤️🙏#bmw #gs1250 #bmwkochi pic.twitter.com/XoiB9vZUVO — Manju Warrier (@ManjuWarrier4) February 17, 2023 -
‘రెడ్ హాట్’ ఆనంద్ మహీంద్ర ట్వీట్: ఇంతకీ అదేంటి?
సాక్షి, ముంబై: ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఆనంద్ మహీంద్రా తాజాగా 'రెడ్ హాట్' (Red Hot) అంటూ ట్విటర్లో ఒక ఫోటో షేర్ చేశారు. ఇందులో యెజ్డీ రోడ్‌స్టర్ డ్యూయెల్ కలర్ బైక్ చూడవచ్చు. ధర 2.40 లక్షలు ఇటీవలే కంపెనీ తన యెజ్డీ రోడ్‌స్టర్ బైకుని క్రిమ్సన్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో విడుదల చేసింది. దీని ధర రూ. 2.04 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కలర్ ఆప్సన్ కాకుండా యెజ్డీ రోడ్‌స్టర్ స్మోక్ గ్రే, సిన్ సిల్వర్, హంటర్ గ్రీన్, గాలియంట్ గ్రే, స్టీల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ బైక్ కలర్ ఆప్సన్ కాకుండా ఎటువంటి అప్డేట్స్ పొందలేదు. ఇందులోని 334 సిసి సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 29.3 బిహెచ్పి పవర్, 29 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 6 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. పనితీరు పరంగా దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. యెజ్డీ రోడ్‌స్టర్ రౌండ్ హెడ్‌ల్యాంప్, డిజిటల్ స్పీడోమీటర్, హెడ్‌లైట్ గ్రిల్, USB టైప్-సి ఛార్జింగ్ సాకెట్, సింగిల్-పీస్ సీట్ కలిగి సేడ్ లో కీ హోల్పొందుతుంది . ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్లు. సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. Red Hot… https://t.co/VPV2OKDyjX — anand mahindra (@anandmahindra) February 15, 2023 -
3 నెలల క్రితమే పెళ్లి.. వివాహితను బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు
సాక్షి,మెదక్ : నార్సింగిలో ఇద్దరి అదృశ్యం మిస్టరీగా మారింది. మండల కేంద్రానికి చెందిన వివాహిత, మరో యువకుడు ఒకే బైక్‌పై సోమవారం రామాయంపేటలో కలిసి తిరిగినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయినట్టు తెలిసింది. అయితే ఆ బైక్ , ఇద్దరి చెప్పులు మంగళవారం ఉదయం నార్సింగి చెరువు వద్ద లభ్యమయ్యాయి. కూతురు కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదైంది. సదరు యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. శివరాత్రి పండగ నిమిత్తం ఈనెల తొమ్మిదివ తేదీన ఆమెను అత్తగారింటినుంచి నార్సింగి తీసుకొచ్చారు. చెరువు వద్ద బైక్, చెప్పులు లభించడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని ముందుగా అందరూ అనుమానించారు. విషయం తెలియగానే గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. పోలీసులు గజ ఈతగాళ్లు, వలలతో చెరువులో గాలించినా ఇద్దరి ఆచూకీ లభించలేదు. అయితే అందరి దృష్టిని మళ్లించడానికే బైక్, చెప్పులు చెరువు వద్ద విడిచి వెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మిస్టరీగా మారిన ఈకేసును త్వరలోనే చేధిస్తామని నార్సింగి ఎస్ఐ నర్సింలు పేర్కొన్నారు. -
బైక్ ను ఢికొన్న ట్రాక్టర్.. పెళ్లి అయిన నాలుగు రోజులకే నవ దంపతులు మృతి
-
జగన్ మళ్లీ సీఎం కావాలంటూ బైక్ యాత్ర
చిత్తూరు (కార్పొరేషన్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో ఓ యువకుడు హైదరాబాద్ నుంచి బైక్ యాత్ర చేపట్టాడు. ఈ నెల 6న ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం చిత్తూరు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు వీరాభిమాని అయిన వీరబాబు మాట్లాడుతూ.. ‘మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం. 2009లో ఖమ్మంలోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్‌లో చేరాను. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్‌మెంట్స్ ద్వారా నాలుగేళ్లు (రూ.1.60 లక్షల ఖర్చుతో) బీటెక్ పూర్తి చేశా. ఆ తరువాత హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించా. వైఎస్సార్ తనయుడు సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో హైదరాబాద్ నుంచి విజయనగరానికి బైక్ యాత్ర మొదలుపెట్టా. ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు ముగిస్తున్నా. రోజుకు 100 నుంచి 120 కిలోమీటర్లు వెళ్తున్నా. రాత్రివేళ ఎక్కడికక్కడ లాడ్జిలో బసచేస్తూ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కింద నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నా. జగనన్న అందిస్తున్న పథకాలు ఎంతగానో నచ్చాయి. అందుకే.. ఆయనే మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బైక్ యాత్ర చేపట్టా’ అని వివరించారు. చదవండి: బెజవాడలో టీడీపీ గూండాల బరితెగింపు -
కొత్త బైక్ కొన్న శ్రీహాస్.. ఆ పాటతో పార్టీ అడిగిన సిరి, వీడియో వైరల్
బుల్లితెర జోడి శ్రీహాన్, సిరి హన్మంత్ల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో కలిసి నటించిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ ప్రేమికులుగా మారారు. అయితే ఈ జంటకు బాగా పేరొచ్చింది మాత్రం బిగ్‌బాస్ రియాల్టీ షో వల్లే. బిగ్‌బాస్ ఐదో సీజన్లో సిరి, ఆరో సీజన్లో శ్రీహాన్ పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరు తమదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. శ్రీహాన్ అయితే చివరి వరకు హౌస్‌లో ఉండి రన్నరఫ్‌గా నిలిచాడు. వాస్తవానికి అతను కూడా విన్నరనే చెప్పాలి. ఆడియన్స్ వేసిన ఓట్ల పరంగా శ్రీహాన్ విజేతగా నిలిచినప్పటికీ.. నాగార్జున ఆఫర్ చేసిన రూ.40 లక్షల సూట్ కేసుకి తలొంచడంతో రేవంత్ విజేతగా నిలిచాడు. మొత్తానికి బిగ్‌బాస్ కారణంగా శ్రీహాన్.. అటు అభిమానుల్ని పెంచుకోవడంతో పాటు, ఇటు డబ్బులు కూడా బాగానే సంపాదించాడు. ప్రస్తుతం ఆ డబ్బుతో లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా శ్రీహాన్ కొత్త బైక్‌ని కొన్నాడు. ప్రియురాలు సిరి, అతని కుమారుడు(సిరి, శ్రీహాన్ కలిసి ఓ పిల్లాడిని దత్తత తీసుకున్నారు)తో కలిసి కొత్త బైక్‌కి పూజలు కూడా చేయించారు. దీనికి సంబంధించిన వీడియోని సిరి తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘వేర్ ఈజ్ ద పార్టీ’పాట రూపంలో బాయ్ఫ్రేండ్ని పార్టీ అడిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by siri shrihan vibes 💙✨ (@siri_shrihan_vibes) -
ఎలక్ట్రిక్ వాహన రంగానికి పూర్తి ప్రోత్సాహం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. దేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్న ఈ–మొబిలిటీ వీక్‌లో భాగంగా ఈ–మోటార్ షోను బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 24/7 విద్యుత్‌ను అందించే సామర్థ్యం, ప్రగతిశీల ‘ఈవీ’వినియోగ పాలసీలతో దేశంలోనే అత్యంత విద్యుదీకరించిన రాష్ట్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సెల్ మాన్యుఫాక్చరింగ్, సెల్ కాంపోనెంట్ తయారీ, బ్యాటరీ మారి్పడి స్టేషన్లు, 2–వీలర్, 3–వీలర్, బస్సుల్లో ఈవీ తయారీ...ఇలా విద్యుత్ వాహన రంగానికి సంబంధించి తెలంగాణ సమగ్ర వ్యూహాన్ని అనుసరిస్తోందన్నారు. అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీల అభివృద్ధిలో నగరం అగ్రగామిగా ఉందని, రానున్న రోజుల్లో ఈ–మోటార్ షో ఆటోమొబైల్ కంపెనీలకు మార్గదర్శక వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ మోటార్ షోను ఆద్యంతం ఆసక్తిగా తిలకించిన ఆయన హాప్ ఓఎక్స్ఓ సిటీ బైక్ సహా పలు ఈవీ వాహనాలను ఆవిష్కరించారు. ఈ ప్రదర్శన 3 రోజులపాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. -
దొంగల దుశ్చర్య: కారును బైక్‌తో ఢీకొట్టి..వెంబడించి..
సాక్షి, బనశంకరి: బెంగళూరు నగరంలో అర్ధరాత్రి ఇద్దరు దొంగలు బైక్‌పై ఓ కారును ఢీకొట్టి వారిని ఐదు కిలోమీటర్లు వెంబడించారు. ఈ ఘటనతో కారులో ఉన్న దంపతులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలు... ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సర్జాపుర రోడ్డులో దంపతులు కారులో ఇంటికి వెళ్తున్నారు. ఎదురుగా బైక్‌లో వచ్చిన వ్యక్తులు అదే పనిగా కారును ఢీకొట్టాడు. డ్యాష్‌బోర్డులో ఉన్న కెమెరాలో ఈ దృశ్యం రికార్డయింది. అనంతరం బైక్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కారు వద్దకు వెళ్లి దంపతులను కిందకు దిగాలని అడిగాడు. వారు నిరాకరించడంతో కిటికీ అద్దాలపై కొట్టాడు. దీంతో వారు రివర్స్ తీసుకుని ముందుకు వెళ్లిపోతుండగా ఐదు కిలోమీటర్లు బైక్‌లో వీరి వాహనాన్ని వెంబడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నగర ప్రజలకు రక్షణ లేదనే విషయం అవగతమవుతోందని నెటిజన్లు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. సర్జాపుర రోడ్డు సోపాస్ మోర్ వద్ద ఈ ఘటన జరిగింది. రోడ్ల పక్కన విద్యుత్ దీపాలు అమర్చి గస్తీ పెంచాలని నెటిజన్లు నగర ట్రాఫిక్ పోలీసులు, బీబీఎంపీ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తూర్పువిభాగ ట్రాఫిక్ డీసీపీ కళాకృష్ణస్వామి తెలిపారు. Horrific incident reported on Sarjapur road near Sofas & More around 3 am today. Miscreant riders collided purposefully to a couple traveling in car. They chased the car for 5km till their society in Chikkanayakanahalli. Don't open your car in night. Use dash cam. @BlrCityPolice. pic.twitter.com/4QVYtBZ67B — Citizens Movement, East Bengaluru (@east_bengaluru) January 29, 2023 (చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు..) -
బైకులపై ఇంటింటికి వెళ్తున్న హరిదాసులు
-
ఠారెత్తించే ఘోర ప్రమాదం..కానీ చివర్లో అదిరిపోయే ట్విస్ట్
ఇంతవరకు ఎన్నో ఘోర ప్రమాదాలు చూసి ఉంటాం. చచ్చిపోతారు నోడౌట్ అనేంత దారుణమైన ప్రమాదాల బారినపడినవారు సైతం బతికిన ఉదంతాలు చూశాం. ఇవన్నీ ఒకత్తైతే ఇక్కడ జరిగిన ప్రమాదం చూస్తో వామ్మో అని బిగిసుకుపోతాం. ఎందుకంటే కచ్చితంగా బయటపడే ఛాన్స్‌లేదు అనేంత దారుణమైన ప్రమాదం. వివరాల్లోకెళ్తే...ఒక టూవీలర్ వాహనదారుడు రాత్రిపూటా రద్దీ లేకపోవడంతో రోడ్డును క్రాస్ చేస్తున్నాడు. ఇంతలో సడెన్‌గా ట్రక్కు వచ్చింది. ఐతే రెండు కూడా చాలా వేగంగానే వస్తున్నాయి. ఇద్దరూ ఓ రేంజ్ స్పీడ్‌లో వచ్చారు. కచ్చితం దారుణం ఢీ కొట్టారు. ఎవ్వరూ బతికే అవకాశం లేదనిపించేలా గగ్గుర్పాటుకు గురి చేసే ఘటన. అలాంటిది ఊహించని విధంగా ప్రమాదం జరగదు. చివర్లో భలే గమత్తుగా బైకర్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. అసలు అదేలా సాధ్యం అనిపిస్తుంది. మిరాకిల్ ఘటన అంటే ఇదేనేమో అన్నంత ఆశ్చర్యంగా ఉంటుంది. బహుశా వారిద్దరికీ భూమ్మీద నూకలు ఉండబట్టి..ప్రమాదం నుంచి సునాయాసంగా బయటపడ్డారు అని అనాలో అర్థంకాదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఊపిరాగిపోతుందేమో అన్నంత రేంజ్లో ఉంటుంది ఆ ఘటన. ऐसी गति राखिये, दुर्घटना कभी ना होय, औरन भी सुरक्षित रहै, आपौ सुरक्षित होय. pic.twitter.com/Gvy6B96EdD — Dipanshu Kabra (@ipskabra) January 5, 2023 (చదవండి: నువ్వు తోపు సామీ.. పాలు అమ్మేందుకు హార్లే డేవిడ్సన్ బైక్‌తో.. ) -
డుకాటీ బైక్ రూ.72 లక్షలు
న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్‌బైక్స్ తయారీ సంస్థ డుకాటీ ఈ ఏడాది భారత్‌కు స్ట్రీట్‌ఫైటర్ వీ4 లంబోర్గీని మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. 208 హెచ్‌పీ పవర్‌తో 1,103 సీసీ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. డుకాటీ క్విక్ షిఫ్ట్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్, హైడ్రాలికల్లీ కంట్రోల్డ్ స్లిప్పర్ డ్రై క్లచ్ ఏర్పాటు ఉంది. ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.72 లక్షలు ఉండే అవకాశం ఉంది. దీనితోపాటు మరో ఎనమిది మోడళ్లు 2023లో భారత్‌లో రంగ ప్రవేశం చేయనున్నాయి. ఈ బైక్‌లు రూ.10.39 లక్షల నుంచి లభిస్తాయి. 2022లో కంపెనీ భారత్‌లో ఐదేళ్ల గరిష్టం.. 15 శాతం వృద్ధి సాధించింది. -
మద్యం మత్తు తెచ్చిన చేటు...ఇదే అవకాశంగా భావించి...
కొచ్చి: ఒక మహిళ మద్యం మత్తులో ఉండటంతో అఘాయిత్యానికి తెగబడ్డాడు ఒక రాపిడో బైక్ డ్రైవర్. ఈఘటన కేరళలో చోటు చేసకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....22 ఏళ్ల కేరళ మహిళపై సాముహిక అత్యాచారం జరిగింది. స్నేహితుడి ఇంటికి వెళ్లిన మహిళ తిరుగు ప్రయాణంలో రైడ్ షేరింగ్ అప్లికేషన్ ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకుంది. ఐతే ఆమె ఆ సమయంలో మద్యం మత్తులో ఉంది. ఆమె గమ్యస్థానానికి వచ్చినా దిగే పరిస్థితిలో లేదు. దీంతో దీన్నే అవకాశంగా తీసుకున్న ఆ డ్రైవర్ ఆ మహిళను తన ఇంటికి తీసుకువెళ్లి తన సహచరుడితో కలసి ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె స్ప్రుహలోకి రావడంతో తీవ్ర నొప్పికి గురయ్యింది. దీంతో ఆమె నిందితుడి ఇంటి నుంచి బయటపడి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి పోలీసులు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు భాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఈ ఘటనలో బాధితురాలు పశ్చిమ బెంగాల్ చెందిన మహిళ కాగా, నిందితులిద్దరూ బెంగళూరు చెందిన వారని చెప్పారు. (చదవండి: తండ్రికి గుండె నొప్పి వచ్చిందని...కంగారులో కారుని వేగంగా పోనివ్వడంతో...) -
ఫాస్టెస్ట్ ఈ-బైక్.. వాటి వేరియంట్లపై ఓ లుక్కేద్దాం!
బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' (Ultraviolette) ఇటీవల ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ 'F77' లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కంపెనీ లాంచ్ సమయంలోనే మూడు వేరియంట్స్ (ఎఫ్77, రీకాన్, ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్) గురించి వెల్లడించింది. అయితే బైక్ ప్రేమికులు చాలా మంది ఈ మూడు వేరియంట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని చాలా కుతూహలంతో ఉన్నారు. ఈ మూడు వేరియంట్స్ డిజైన్, ఫీచర్స్, రేంజ్ వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రండి. అల్ట్రావయోలెట్ ఎఫ్77: ఎఫ్77 అనేది కంపెనీ మూడు వేరియంట్స్ లో మొదటి మోడల్ (బేస్ మోడల్). దీని ధర రూ. 3.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ బైక్ 7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 207 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వేగం, 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 లోని బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీ వారంటీని అందిస్తుంది. అయితే దీనిని 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీ వారంటీకీ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇది కొనుగోలుదారులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక కలర్ ఆప్సన్ విషయానికి వస్తే, ఎఫ్77 బ్లాక్, సిల్వర్, రెడ్ కలర్లో అందుబాటులో ఉంటుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 రీకాన్: అల్ట్రావయోలెట్ మరో వేరియంట్ అయిన ఎఫ్77 రీకాన్ విషయానికి వస్తే, దీని ధర రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 307 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఇందులో 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించింది. ఈ బైక్ కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ, 8.0 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగాన్ని అందుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే ఇది బేస్ మోడల్ కంటే కూడా ఎక్కువ వేగవంతంమైన బైక్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ విషయానికి వస్తే, స్టాండర్డ్ గా 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీల వారంటీని పొందవచ్చు. అయితే దీనిని 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీ వారంటీకీ అప్డేట్ చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే బేస్ మోడల్ ఏ కలర్ ఆప్సన్లో లభిస్తుంది. అదే కలర్స్ (బ్లాక్, సిల్వర్, రెడ్) ఇది కూడా లభిస్తుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్: ఇక చివరగా ఇందులోని చివరి మోడల్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ పేరుకి తగిన విధంగానే ఇది లిమిటెడ్ యూనిట్లలో మాత్రమే లభిస్తుంది. కావున ఇది కేవలం 77 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే ఈ బైక్ కేవలం 77 మంచి కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 5.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధరను బట్టి చూస్తే ఇది కంపెనీ అత్యంత ఖరీదైన బైక్. అయితే పనితీరు విషయంలో మిగిలిన రెండు బైకులంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్‌లో రీకాన్ వేరియంట్లో ఉన్న అదే బ్యాటరీ (10.3 కిలోవాట్) ఉంటుంది. కావున రేంజ్ కూడా రీకాన్ మోడల్ మాదిరిగానే 307 కిమీ ఉంటుంది. ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ, 7.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీ వారంటీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. బుకింగ్స్, డెలివరీ: కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైకుని మార్కెట్లో లాంచ్ చేయకముందు నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు రూ. 10,000 చెల్లించి కంపెనీ అధికారిక వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మొదట బెంగళూరులో ప్రారంభమవుతాయి. ఆ తరువాత దశల వారిగా డెలివరీలు ప్రారభించనుంది కంపెనీ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ బైక్ భారతీయ తీరాలను కూడా దాటి విదేశాలలో కూడా విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
వైరల్ వీడియో : బైక్ పై ఎంతమంది వెళ్తున్నారో లెక్క పెట్టగలరా ..?
-
బైక్‌ను నెత్తిన పెట్టుకొని.. బస్సెక్కించాడు.. వైరలవుతున్న వీడియో
కుటుంబాన్ని పోషించేందుకు ప్రతి ఒక్కరూ రకరకాల పనులు చేస్తుంటారు. పొట్ట కూటి కోసం కొందరు ఎంత కష్టమైనా భరిస్తుంటారు. తమ శక్తికి మించి చెమట చిందిస్తారు. తాజాగా అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా బైక్‌ను పైకి లేపేందుకు కూడా మనకు శక్తి సరిపోదు.. అలాంటిది ఓ వ్యక్తి బైక్‌ను తలపై పెట్టుకొని ఏకంగా బస్సు మీదకు ఎక్కించాడు. ముందుగా బైక్‌ను తన నెత్తిన పెట్టుకుని బస్సు దగ్గరకు నడుస్తూ వచ్చాడు. బస్సుకు ఎడమ పక్కగా ఉన్న ఇనుప గ్రిల్స్‌కు ఏర్పాటు చేసిన నిచ్చెన సాయంతో పైకి వచ్చాడు. తన మెడను బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు టాప్‌పైన ఉన్న క్యారియర్‌పై బైక్‌ను దించేశాడు. బైక్‌ను నెత్తిన పెట్టుకుని కొద్ది దూరం నడిచి బస్సు టాప్‌పైకి ఎక్కించారు. అయితే అది ఎక్కడ జరిగిందో, అతనెవరనేదానిపై స్పష్టత లేదు. గుల్జార్ సాహెబ్ అనే వ్యక్తి.. ఈ వీడియోను శుక్రవారం తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు దీనిని 76 వేలకుపైగా మంది చూడగా, 5 వేలకుపైగా లైకులు వచ్చాయి. ఎలాంటి సాయం లేకుండా బైక్‌ను నెత్తిన పెట్టుకొని మోసిన వ్యక్తిని సూపర్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: సత్యేందర్ జైన్ మరో వీడియో రిలీజ్ చేసిన బీజేపీ -
Hyderabad: ద్విచక్ర వాహనాలే టాప్.. మెట్రోకు ఆదరణ అంతంతే !
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ ప్రజా రవాణాలో సింహభాగం వాటా ద్విచక్ర వాహనాలదే కావడం విశేషం. నిత్యం సిటీలో వ్యక్తిగత వాహనాలపై రాకపోకలు సాగించే వారు 39 శాతం ఉండగా.. బస్సుల్లో జర్నీ చేసే వారు 34 శాతం ఉన్నారు. ఇక ఆటోలు, క్యాబ్‌ల్లో రాకపోకలు సాగించేవారు 17 శాతం మంది.. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో జర్నీ చేసేవారు కేవలం 10 శాతం మించకపోవడం గమనార్హం. నగరంలో కాలుష్యాన్ని, కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మెట్రో ప్రజల ఆదరణను చూరగొనలేకపోయింది. ఇవే శాపం.. ► నగర మెట్రో నిర్మాణ, నిర్వహణ వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. ఒక కిలోమీటరు మేర ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.272 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. ప్రస్తుతం నగర మెట్రో నిత్యం రూ.కోటి నష్టంతో నెట్టుకొస్తోంది. మెట్రో డిపోలు, స్టేషన్లు, రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, సాంకేతిక నష్టాలను అరికట్టేందుకు ఎక్కువ వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ► ఇక రెండో దశ మెట్రో ఏర్పాటుకు అవసరమైన రూ.8,400 కోట్లు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఆ స్థాయిలో నిధులు విడుదల చేసే పరిస్థితులో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రెండో దశ మెట్రో మార్గాన్ని పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందన్న అంశంపై పలు అనుమానాలు నెలకొంటున్నాయి. మెట్రోతో కాలుష్యం తగ్గిందిలా.. ► గతేడాది సరాసరి లెక్కను పరిశీలిస్తే సుమారు 3.8 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు నగర వాతావరణంలో చేరకుండా మెట్రో నివారించడం విశేషం. నగర మెట్రో రైళ్లు విద్యుత్ ఆధారంగా పని చేస్తున్న విషయం విదితమే. స్టేషన్లలో విద్యుత్ అవసరాలకు సౌర విద్యుత్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. మెట్రో రైళ్లు గతేడాది సుమారు 1.6 కోట్ల లీటర్ల ఇంధనాన్ని సైతం ఆదా చేసినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ► మూడు బోగీలుండే మెట్రో రైలులో ఏకకాలంలో 975 మంది ప్రయాణించవచ్చు. ఇక కాలుష్య ఉద్గారాల విషయానికి వస్తే 30 కిలోమీటర్లు మెట్రోలో జర్నీ చేస్తే కేవలం 190 కిలోల కార్బన్ డయాక్సైడ్ కాలుష్యం విడుదల అవుతుంది. అదే బస్సులో కేవలం 50 మంది ప్రయాణించవచ్చు. కాగా.. ఒక మెట్రో రైలులో ప్రయాణించేవారి సంఖ్య 20 సిటీ బస్సులతో సమానం. వీటిలో జర్నీ చేస్తే ఏకంగా 405 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలై పర్యావరణ హననం జరుగుతోంది. ► ద్విచక్ర వాహనంపై ఇద్దరు జర్నీ చేసే వీలుంది. సుమారు 975 మంది జర్నీ చేయాలంటే 488 వాహనాలు అవసరం. వీటిపై 30 కిలోమీటర్లు జర్నీ చేస్తే 730 కిలోల సీఓ 2 కాలుష్యం విడుదల అవుతుంది. కారులో నలుగురు వ్యక్తులు జర్నీ చేయవచ్చు. 975 మంది 30 కి.మీ మేర జర్నీ చేసేందుకు 244 కార్లు అవసరం అవుతాయి. ఇన్ని కార్లలో జర్నీ చేస్తే ఏకంగా 1200 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు చెబుతున్నాయి. అంటే బస్సు, కారు, ద్విచక్రవాహనాలతో సిటీ కిక్కిరిసిపోయి.. పొగచూరుతుండగా.. మెట్రోతో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. (క్లిక్ చేయండి: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ) -
స్నేహితులతో సరదాగా బీచ్‌కు.. ఎంతో ఇష్టంగా కొనుకున్న కొత్త బైకే..
సాక్షి, విశాఖపట్నం: బీచ్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎంతో ఇష్టంగా కొనుక్కొన్న బైక్‌పై సరదాగా డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం, కుంతుర్ల గ్రామానికి చెందిన పూటి గిరి ప్రసాద్ నాయుడు(19) పాడేరులో మదర్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. స్నేహితుడు జె.జగదీష్‌తో కలసి బైక్‌పై బుధవారం విశాఖలో బంధువులు ఇంటికి వచ్చాడు. అదే రోజు సాయంత్రం ఇంటి నుంచి స్నేహితుడితో కలసి బైక్‌పై నగరం చూడడానికి బయలుదేరాడు. రాత్రయినా ఇంటికి చేరకుండా తిరిగారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటలు దాటిన తర్వాత బీచ్‌రోడ్డులో తెన్నేటి పార్కు నుంచి సాగర్‌నగర్ వైపు వెళ్తుండగా సీతకొండ చివరి మలుపు వద్ద కుక్క అడ్డు రావడంతో బైక్ డివైడర్, దానిపై ఉన్న ఎలక్ట్రికల్ పోల్‌ను ఢీకొంది. దీంతో కిందపడిన గిరిప్రసాద్ తలకు తీవ్రగాయమై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. వెనుక కూర్చొన్న అతని స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. స్వల్ప గాయాలైన స్నేహితుడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. గురువారం పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని ఆ యువకుడి కుటుంబ సభ్యులకు అçప్పగించారు. మృతుడి అక్క పి.ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గిరి తండ్రి మత్సలింగం నాయుడు ఉపాధ్యాయుడు. అమ్మ, అక్క ఉన్నారు. ఎంతో ఇష్టంగా ఇటీవల కొనుక్కొన్న కొత్త బైకే కుమారుడి ప్రాణాలు తీసిందంటూ మృతుడి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆ బైక్‌పై సరదాగా విశాఖ వచ్చి, ప్రాణాలు తీసుకున్నాడంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. చదవండి: భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు -
వైరల్ వీడియో: ఈ అమ్మాయి బైక్ ఎలా నడుపుతుందో చూస్తే షాక్ అవుతారు..!
-
మంచితనమే శాపమైన వేళ.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి దోచేశారు!
విజయనగర్‌కాలనీ(హైదరాబాద్): లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తిని చంపుతామని బెదిరించి అందినకాడికి దోచుకున్న సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ ఆర్.జి.శివమారుతి తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చంద్రాయణగుట్టకు చెందిన కె.జయంత్ ప్రైవేటు స్కూల్ టీచర్, ఈ నెల 6న సాయంత్రం రాజేంద్రనగర్ నుంచి మెహిదీపట్నం వైపు బైక్‌పై వెళుతున్నాడు. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 294 వద్ద ఆగాపురాకు చెందిన మహ్మద్ షాహిద్ అలియాస్ సైఫ్ అనే వ్యక్తి తన తల్లికి యాక్సిడెంట్ అయ్యిందని అర్జంట్‌గా వెళ్లాలని మోహిదీపట్నం వరకు లిఫ్ట్ అడిగి ఎక్కాడు. మెహిదీపట్నం పిల్లర్ నెంబర్ 28 వద్దకు రాగానే పక్కనే ఉన్న గల్లీలో దించాలని కోరాడు. అప్పటికే అక్కడ ఉన్న షాహిద్ స్నేహితులు షేక్ అక్రమ్, మహ్మద్ నసీర్ ముగ్గురు కలిసి జయంత్‌ను భోజగుట్ట స్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు. కొట్టి చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న రూ.40 వేలు లాక్కున్నారు. అతని ఫోన్ నంబర్ తీసుకుని బెదిరించి పలు దఫాలుగా గూగుల్ పే ద్వారా రూ.51 వేలు బదిలీ చేయించుకున్నారు. ఈ నెల 13న బాధితుడు ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. సమావేశంలో ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ జీహెచ్.శ్రీనివాస్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎస్.ఐ. కె.శ్రీనివాసతేజ, క్రైమ్ సిబ్బంది టి.రవీంద్రనాథ్, బి.విద్యాసాగర్, జె.అచ్చిరెడ్డి, జి.రాహుల్, బి.సంతోష్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: చంపేసి శవాన్ని సొంతూరుకు సాగనంపి..) -
ఏ తండ్రికి ఈ కష్టం రావొద్దు.. బైక్‌పై కూతురి మృతదేహంతో..!
సాక్షి, ఖమ్మం: చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతి చెందింది. స్వగ్రామం తరలించేందుకు ఆసుపత్రి అంబులెన్స్ లేదు. ప్రైవేటు వాహనాల్లో తరలించేందుకు ఆర్థిక స్తోమత లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె తండ్రి.. గుండెలనిండా దుఃఖాన్ని నింపుకొని బైక్‌పైనే మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాడు. ఈ హృదయవిదారక సంఘటన ఖమ్మం జిల్లాలోని ఏకనూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. కొత్త మేడేపల్లి గ్రామంలోని గిరిజన వర్గానికి చెందిన వెట్టి మల్లయ్య కూతురు వెట్టి సుక్కి(3) కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. దీంతో ఏకనూరు ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం జిల్లా మాతా, శిశు సంక్షేమ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం పాప మృతి చెందింది. అయితే, ఆమె మృతదేహాన్ని 65 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామం కొత్త మేడేపల్లికి తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులేక ద్విచక్రవాహనంపై తరలించాడు ఆమె తండ్రి వెట్టి మల్ల. ఆసుపత్రి అంబులెన్స్ ఇవ్వనన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదీ చదవండి: ధనబలం, అంగబలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: పాల్వాయి స్రవంతి -
బైక్‌లోకి దూరిన పాము.. బండి స్టార్ట్ చేయగానే బుసలు కొట్టుకుంటూ..
సాక్షి, వైఎస్సార్ కడప: సాధారణంగా పాములు ఏ తుప్పల్లోనో పొలం గట్టులపైనో కనిపిస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇళ్లలో, బాత్ రూం, షూలలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ బైకులో పాము కలకలం రేపింది. చిన్నమండెం మండలం బోనమల ఎంపీటీసీ వెంకటప్పనాయుడు పని నిమిత్తం బైక్‌లో మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చాడు. వాహనాన్ని ఆవరణలో నిలబెట్టి లోపలికి వెళ్లాడు. బయటకు వచ్చిన ఆయనతో స్థానికులు బైక్‌లో పాము దూరిందని ఆయనకు తెలియజేశారు. సీటు తీసి పరిశీలించగా పాము కనిపించలేదు. వాహనాన్ని స్టార్ట్ చేసి పక్కన వేచి ఉండగా శబ్దానికి బైక్‌లో నుంచి పాము బుసలు కొట్టుకుంటూ బయటకు వచ్చింది. దీంతో స్థానికులు దానిని కొట్టి చంపారు. -
కొత్త కారుతో గ్రాండ్ ఎంట్రీ .... పల్టీ కొట్టిందిగా!
ఒక వ్యక్తి కొత్త కారుతో గ్రాండ్‌గా ఎంటీ ఇస్తున్నాడు. కానీ అతనికి కొత్త కారుతో వచ్చిన ఆనందం కాస్త చేదు అనుభవాన్ని మిగిల్చింది. బ్రాండెడ్ టాటా నెక్సాన్ కారుతో చక్కటి పూల దండతో అలకరింపబడి ఉన్న కారుతో ఇంటికి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఐతే సెక్యూరిటీ గార్డు కూడా గేట్ తీసి చక్కగా దారి ఇచ్చాడు కూడా. కానీ సదరు వ్యక్తి కారుని లోపలి పోనిచ్చి పక్కనే పార్క్ చేసిన బైక్‌లపైకి పోనిచ్చాడు. దీంతో కారు ఆ బైక్లన్నింటిని ఢీ కొడుతూ ఒక పక్కకు పల్టీ కొట్టబోయింది. ఇంతలో సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి సదరు కారు నడుపుతున్న వ్యక్తికి సాయం అందిస్తాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వినోద్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. What a grand arrival home ? pic.twitter.com/ilSeNcKexD — Sqn Ldr Vinod Kumar (Retd) (@veekay122002) October 7, 2022 (చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు) -
ఎలక్ట్రిక్ వాటర్‌బైక్.. అదిరిపోయే ఓ స్పెషాలిటీ ఉందండోయ్!
వాటర్‌బైక్‌లు చాలాకాలంగా వాడుకలో ఉన్నవే! ఇప్పటి వరకు వాడుకలో ఉన్న వాటర్‌బైక్‌లన్నీ పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంగా ఉపయోగించుకుని నడిచేవే! కెనడాకు చెందిన ‘ఎన్వో’ కంపెనీ తొలిసారిగా పూర్తిగా విద్యుత్తుతోనే పనిచేసే 1500 వాట్ల మోటారుతో వాటర్‌బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది మిగిలిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జింగ్ చేసుకుంటే, గంటసేపు నిరాటంకంగా జలవిహారం చేయవచ్చు. నీటిలో ఇది గంటకు ఇరవై కిలోమీటర్ల గరిష్ఠవేగంతో ప్రయాణించగలదు. దీనికో ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన వాటర్బైక్లతో పోల్చుకుంటే దీని బరువు తక్కువే! కేవలం 50 కిలోల బరువు గల ఈ ఎలక్ట్రిక్ వాటర్ బైక్ 120 కిలోల బరువును తీసుకుపోగలదు. సరదా జలవిహారాలకు ఇది భేషైన వాహనం. చదవండి: పండుగ బోనస్: భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్! -
పండగకి బైక్ కొనాలనుకునేవాళ్ళకి షాక్
-
ఊళ్లల్లో కనుమరుగవుతున్న మెకానిక్ దుకాణాలు.. అదే కారణమా!
సామర్లకోట(కాకినాడ జిల్లా): భార్యా పిల్లలతో ఏ శుభ కార్యానికో, వ్యాహ్యాళికో వెళ్తున్న వెంకటేశ్వర్లు ద్విచక్రవాహనం ఏదో సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. కనుచూపు మేరలో మెకానిక్ షాపులు లేవు. భార్య బిడ్డలను ఆటోలో చేరాల్సిన చోటుకు పంపి అతడి వాహనాన్ని తోసుకుంటూ ముందుకు కదిలాడు. రెండు మైళ్లు చెమటోడ్చి వెళ్లాక.. ఏవో చిన్న పరికరాలు పెట్టుకుని ఓ చిన్న బండికి మరమ్మతు చేస్తున్నాడు 60కి దగ్గరలో ఉన్న వ్యక్తి. అసలే గ్రామీణ వాతావరణం. ఆపై మొండిగా తిరిగే బళ్లు. నట్లు, బోల్టులు పట్టేశాయి. వాటిని విప్పడానికి అతని శక్తి చాలడం లేదు. సత్తువ ఉన్న సహాయకుడు ఉంటే కొంత వెసులుబాటు ఉండేది. అదీ లేదు. బండిని తోసుకు రావడంతో సోష వచ్చి అక్కడే కూలబడ్డాడు వెంకటేశ్వర్లు. ఎప్పటికైతే అప్పుడే అవుతుందని కూర్చున్నాడు. ఇదీ ప్రస్తుతం మెకానిక్ దుకాణాలు, వాహన చోదకుల పరిస్థితి. సామర్లకోట మండల పరిధిలో సుమారు 70 వరకు మోటారు సైకిల్ మెకానిక్ షాపులు ఉన్నాయి. వీటిలో 20 షాపుల్లో మాత్రమే హెల్పర్లు ఉండగా, మిగిలిన వాటిలో దుకాణ యజమానులే మరమ్మతులు చేస్తున్నారు. కాగా ఆ 50 మందిలో 30 మంది 50 ఏళ్లు దాటిన వారే. చేసే ఓపిక లేకపోతే ఇంట సేదతీరడం తప్ప మరో పని చేయలేని పరిస్థితి వారిది. గతంలో ఏ మెకానిక్ దుకాణం చూసినా ఇద్దరు, ముగ్గురు చిన్నారులు సహాయకులుగా ఉండి బళ్ల మరమ్మతులు నేర్చుకునేవారు. చురుకైనవారైతే ఏడాదిలోనే పని నేర్చేసుకుని వేరే దుకాణం పెట్టేసేవాడు. మళ్లీ అతడి దగ్గరకి సహాయకులు చేరిక.. ఇలా సాగేది. నేటి పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంది. బడి ఈడు పిల్లలు బడిలోకే వెళ్లాలి. పనిముట్లు పట్టరాదు అనే నినాదంతో ఏ చిన్నారీ బాల్యాన్ని బాదరబందీ బతుకులకు బలిచేయకూడదని, ఏ ఒక్కరైనా భావి భారత పౌరుడిగా జాతి ఔన్నత్యాన్ని నిలిపేలా తయారు కాకపోతాడా అనే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దీంతో చిన్నారులు బడిబాట పడుతుంటే, సహాయకులు లేక, పని నేర్చుకునేవారు లేక మెకానిక్ దుకాణాలు కాలక్రమంలో అంతకంతకూ తగ్గిపోతున్నాయి. దీంతో వెంకటేశ్వర్లు లాంటి వాహన చోదకులకు అవస్థలు తప్పడం లేదు. ఏ చిన్న సమస్యకైనా సర్వీస్ సెంటర్‌కి వెళ్లాలంటే మరమ్మతు చార్జీతో పాటు అదనపు చార్జీలు వేసి చేటంత బిల్లు ఇస్తారు. గ్రామీణులు భరించలేని పరిస్థితి ఇది. వాహనం కొన్నప్పుడు ఇచ్చే ఫ్రీ సర్వీసులనే ఎవరూ చేయించుకోరు. నమ్మకస్తులైన సొంత మెకానిక్‌లతో సర్వీస్ చేయించుకుంటారు చాలామంది. పైగా సర్వీస్ సెంటర్లు కూడా దూరాభారం. వాహన చోదకుల సమస్యలకు ఆయా యాజమాన్యాలు సర్వీస్ సెంటర్లను గ్రామీణ స్థాయికి విస్తరించడం ఒకటే మార్గంగా కనిపిస్తోంది. వృత్తి విద్య శిక్షణ ఏర్పాటు చేయాలి.. ఇప్పటికే గృహ నిర్మాణ రంగంలో అనేక మందికి వృత్తి శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ కోర్సు లో మోటారు సైకిలు మెకానిక్‌పై కూడా కోర్సును ఏర్పాటు చేయాలి. సర్టిఫికెట్ల ఆధారంగా ఆయా మోటారు సైకిల్ సంస్థల్లో చేరే వీలుంటుంది. ఆసక్తి ఉన్న వారు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు. – ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్, సామర్లకోట హెల్పర్లు లేకపోతే షాపుల నిర్వహణ కష్టం సహాయకులు లేకపోతే మెకానిక్ షాపుల నిర్వహణ కష్టమే. గతంలో పిల్లలు పని నేర్చుకోడానికి వచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏదైనా వృత్తి విద్యా కోర్సుల ద్వారా ప్రాథమిక విషయాలు తెలుసుకున్న వారు తమ అనుభవాన్ని ఉపయోగించుకుంటే వారికీ, మాకూ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. – ఆండ్ర నూకరాజు, సీనియర్ మెకానిక్, సామర్లకోట -
సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు.. ఇంటి బయట మహిళ.. బైక్‌పై వచ్చి ఒక్కసారిగా..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చైన్ స్నాచర్స్ మరోసారి రెచ్చిపోయారు. ఇంటి బయట పనిచేస్తున్న ఓ మహిళ మెడలో నుంచి 5 తులాల చైన్‌ను బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. హైదరాబాద్ శివారులో నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు హైమావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగులు కోసం గాలింపు చేపట్టారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చదవండి: సినిమాను తలపించిన ఎటాక్ సీన్.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై వెంటపడి మరీ.. -
ట్రాఫిక్ సమస్యకి చెక్.. జుయ్‌మంటూ ఎగిరే బైకులు రాబోతున్నాయ్!
ప్రస్తుత రోజుల్లో నగరవాసులకు అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ట్రాఫిక్ జామ్. దీని వల్ల వాళ్ల సమయం వృథా కావడంతోపాటు వారి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇక సిటీ లైఫ్‌లో ట్రాఫిక్ సమస్య కూడా ఓ భాగమే అనుకుని ప్రజలు ముందుకు సాగిపోతున్నారు. అయితే త్వరలో ఈ సమస్యకు చెక్ పెడుతూ ట్రాఫిక్ చిక్కులు లేకుండా త్వరగా గమ్యం చేరుకోవచ్చట. ఎలా అంటారా.. జపనీస్ కంపెనీ తాజాగా గాల్లో ఎగిరే బైకును తయారు చేసింది. ఇటీవలే ఆ బైక్‌ను మీడియా ముందు ప్రదర్శించింది. జుయ్‌మంటూ వచ్చేస్తోంది ఎగిరే బైక్.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే బైక్. దీనికి XTURISMO hoverbike అని పేరు పెట్టారు. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్( AERWINS) టెక్నాలజీస్ తయారు చేసిన ఈ ఫ్లయింగ్ బైక్ గురువారం యునైటెడ్ స్టేట్స్‌లోని డెట్రాయిట్ నందు జరిగిన ఆటో షోలో ప్రదర్శించారు. ఈ హోవర్‌బైక్ ప్రముఖ స్టార్ వార్స్ సినిమాలోని బైక్‌లతో పొలిక ఉండడంతో అందరినీ ఆకర్షించింది. ఈ బైక్ గరిష్టంగా 100 kph (గంటకు 62 మైళ్లు) వేగంతో 40 నిమిషాల పాటు ప్రయాణించగలదు.ఈ బైకుపై ఒకరు కూర్చుని ప్రయాణం చేయవచ్చు. వచ్చే ఏడాది ఈ బైక్ అమెరికన్ మార్కెట్లోకి రానుంది. జపాన్‌లో ఇప్పటికే ఈ బైక్‌లు అమ్మకంలో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ బైక్ ధర చాలా ఎక్కువగా ఉంది. ఈ హోవర్‌బైక్ ధర $7,77,000 (భారత కరెన్సీ ప్రకారం 6 కోట్లు) ఉంటుంది. అయితే కంపెనీ సీఈఓ మాట్లాడుతూ.. ఈ మోడల్ ధరను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని అందుకోసం కంపెనీకి మరో 2-3 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. This is the world's first flying bike. The XTURISMO hoverbike is capable of flying for 40 minutes and can reach speeds of up to 62 mph pic.twitter.com/ZPZSHJsmZm — Reuters (@Reuters) September 16, 2022 చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్!
సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఆ యువకుడికి మహా ఇష్టం. ఆసక్తికి ఆలోచనలు తోడయ్యాయి. ఆవిష్కరణలు ఆరంభమయ్యాయి. డ్రైవర్‌లేని కార్లు, డబుల్ మైలేజీ ఇచ్చే బైక్‌లు, ఇ–బైక్‌లను తక్కువ ఖర్చుతో తయారుచేస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డేటా సైన్స్ విద్యను పూర్తిచేసిన గెంబలి గౌతమ్‌కు చిన్నప్పటి నుంచి సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడం మహా సరదా. ఆదే అలవాటుగా మారింది. మైక్రో ఆర్ట్ నుంచి వినూత్న వాహనాల తయారీ వరకు వినూత్నంగా సాగిపోతున్నాడు. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ.. పెట్రోల్ లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాలను సొంతంగా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయన ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఏ ఆవిష్కరణ అయినా ఔరా అనాల్సిందే. అతి తక్కువ ఖర్చుతో నడిచే స్కూటర్‌ను చూస్తే వావ్ అంటాం. తనకు నచ్చిన రంగులతో విభిన్నమైన ఆలోచనలతో దూసుకెళ్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. డబుల్ మైలేజ్.. డబుల్ ధమాకా.. ► పెట్రోల్ భారం తగ్గేలా గౌతమ్ సరికొత్త డివైజ్‌ను రూపొందించాడు. చైనాకు చెందిన హజ్ మోటారు వినియోగించి, బైక్‌లో కొన్ని మార్పులు చేశాడు. ఇప్పుడు లీటరు పెట్రోల్‌తో గతంలో నడిచిన దానికంటే డబుల్ మైలేజ్ వస్తోంది. ► ఇంట్లో ఉండే పాత ఇనుప సామగ్రిని వినియోగించి కేవలం రూ.13వేల ఖర్చుతో రెయిన్ బో స్కూటర్‌ను రూపొందించాడు. లిథియం బ్యాటరీ, మూలకు చేరిన కొన్ని వాహనాల పరికరాలను వినియోగించి దీనిని తయారు చేశాడు. తన మామయ్య కోరిక మేరకు దీనిని తీర్చిదిద్దానని, ఎంతోమందికి నచ్చడంతో ఈ తరహా బైక్స్ తయారు చేయాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని గౌతమ్ చెబుతున్నాడు. ► దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి స్టీరింగ్ లెస్ కారును తయారుచేసి దాన్ని రోడ్లపై నడుపుతూ గౌతమ్ అబ్బుర పరిచాడు. ఆయన రూపొందించిన కారుకు స్టీరింగ్ ఉండదు. కేవలం రూ.32 వేల ఖర్చుతో డిజైన్ చేసిన కారులో 350 వోల్టుల సామర్థ్యం కలిగిన 2 మోటార్లు, లిథియం బ్యాటరీ, కొంత ఐరన్ వినియోగించాడు. సోలార్‌తో పాటు బ్యాటరీతో నడిచేలా కారును తయారు చేశాడు. కాళ్ల వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా ఆపరేట్ అవుతుంటుంది. చేతులు లేని విభిన్న ప్రతిభావంతులను దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ రూపొందించినట్టు గౌతమ్ చెబుతున్నాడు. జీపీఆర్ఎస్ సిస్టమ్, బ్లూ టూత్ వంటి సదుపాయాలు ఈ కారు సొంతం. దీనికి లైసెన్స్‌తో పనిలేదు. గతంలో అంతర్జాతీయ సైన్స్దినోత్సవం సందర్భంగా ఈ కారుని చూసిన జపాన్ బృందం యువకుడి ప్రతిభను మెచ్చుకుంది. ప్రశంసల వర్షం కురిపించింది. విశాఖపట్నంలోని ఇద్దరు దివ్యాంగులకు రెండు కార్లు ప్రత్యేకంగా తయారు చేసి అందజేశాడు. పంటలకు పురుగుమందులు పిచికారీ చేసే స్ప్రేలను వినూత్నంగా తయారుచేసి రైతులకు అందజేస్తున్నాడు. 15 గంటల్లోనే ఈ బైక్ తయారీ తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటల పాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని రుజువు చేశాడు. వాహనం తయారీకి పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టం, హ్యాండ్‌బ్రేక్ ఉపయోగించాడు. రాత్రి కూడా సునాయసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్ లైట్ అమర్చాడు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జల్దు వినయ్ ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా పూర్తిచేసినట్టు యువకుడు తెలిపాడు. ఏ ఆలోచన వచ్చినా .. ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకూ స్టీరింగ్ లెస్ కారుతోపాటు రెయిన్ బో స్కూటర్, రెండింతలు మైలేజీ వచ్చేలా బైక్ డిజైన్‌లో మార్పులు చేశాను. సరికొత్త బైక్ తయారీకి ప్రయత్నిస్తున్నాను. రెయిన్ బో స్కూటర్ చాలా మందికి నచ్చడంతో ఇప్పటికే కొంత మంది డిజైన్ చేసి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి సరికొత్తగా ఆలోచించడం, ఏదో ఒకటి చేయాలన్న తపనతో అనేక విషయాలను నేర్చుకోవడం మొదలు పెట్టాను. చిన్నప్పుడు పిల్లలకు కరెంట్ వైర్లతో వెరైటీ ఐటెమ్స్ చేసి ఇవ్వడం, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులకు సహకారాన్ని అందించడం వంటివి చేశాను. అప్పుడే కొత్త ఆవిష్కరణల దిశగా నా అడుగులు పడ్డాయి. – జి.గౌతమ్, పార్వతీపురం చదవండి: ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా.. ఈ గ్యాడ్జెట్ మీకోసమే! -
నిందితుడిని దొంగతనం ఎందుకు చేశావ్ అంటే... రీజన్ వింటే అవాక్కే!
రోజు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులందరికీ బైక్‌లు ఉండవు. కొంతమంది బస్సుల్లోనూ, క్యాబ్‌ల్లోనూ ఆఫీసులకు వెళ్తుంటారు. ఐతే గంటల తరబడి వెయిట్ చేసి బస్సులో వెళ్లటం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ మహానగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే ఇబ్బంది పడ్డాడు. అందుకని ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా!... వివరాల్లోకెళ్తే...చెన్నైలోని ఒక వ్యక్తికి ప్రతిరోజు బస్సులో వెళ్లడం ఇష్టం లేక ఏకంగా బైక్‌ని దొంగలించాడు. ఈ మేరకు దినేష్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఆగస్టు 14న స్పెన్సర్ ప్లాజాలోని షాపు వద్ద ఉన్న పార్కంగ్ ప్రాంతంలో పార్క్ చేసి షాప్‌కి వెళ్లాడు. అంతే షాప్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి దినేష్ బైక్ ఉండదు. దీంతో సదరు వ్యక్తి పార్కింగ్ ఏరియాలో పెట్టిన బైక్‌ని దొంగలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఏరియాలోని పలు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా సదరు వ్యక్తిని నెరుకుండ్రం పార్థసారథిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సదరు నిందితుడిపై హత్యనేరం ఉందని, ఈ కేసు విషయమై రోజు సంతకం చేసేందుకు అన్నాసలై పరిధిలోని పోలీస్టేషన్‌కి వస్తుంటాడని తెలిపారు. ఐతే నిందితుడు పార్థసారథికి ఈ కేసు విషయమై సంతకం కోసం నెరుకుండ్రం నుంచి అన్నాసలైకి ప్రతి రోజు బస్సులో గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీంతో విసుగు చెందిన నిందితుడు బైక్‌ని ఎత్తుకోపోవాలని డిసైడ్ అయ్యి ఇలా చేశాడని పోలీసులు తెలిపారు. (చదవండి: పెళ్లికి నిరాకరిస్తోందని యువతిపై దాడి...ఆ తర్వాత అతను) -
Ajith: బైక్‌పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు..
అజిత్‌కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఆయన బైక్‌లో సుదీర్ఘ ప్రయాణాన్ని చేస్తుంటారు. అలా తాజాగా ఈసారి ఏకంగా హిమాలయాలకు వెళ్లారు. ప్రస్తుతం తన 61వ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. ఇటీవల ఫ్యామిలీతో ఐరోపా దేశాలు చుట్టి వచ్చిన అజిత్ చెన్నైకి తిరిగి రాగానే తాను నటిస్తున్న చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు. కాగా విశాఖపట్నంలో జరిగిన చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసి, అటునుంచి అటే తన మిత్ర బృందంతో బైకులో లడక్ వెళ్లి అటు నుంచి హిమాలయాలకు చేరుకున్నారు. ఆయనతో పాటు పొల్లాచి నగరం 8వ వార్డు అన్నాడీఎంకే కౌన్సిలర్ సెంథిల్ కూడా పాల్గొనటం విశేషం. ఆయనకు అజిత్ మాదిరిగానే బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో ఆయన అజిత్‌కు బాగా దగ్గర అయిపోయారు. హిమాలయాల్లో వారం పాటు బైక్ డ్రైవింగ్ చేసి ఆ తర్వాత చెన్నైకి చేరుకుంటారు. అనంతరం నటిస్తున్న చిత్ర డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. చదవండి: (మాజీ ప్రియుడిని అరెస్ట్ చేయించిన అమలాపాల్) -
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన ట్రైన్.. క్షణాల్లో తునాతునకలు!
లక్నో: రైలు పట్టాలు దాటే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. గేటు వేసినా ఆ ఏమౌతుందిలే అని వెళ్లే ప్రయత్నం చేస్తే.. ప్రాణాల మీదకే వస్తుంది. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతంలో జరిగింది. అయితే.. ఇక్కడ రైలు కింద పడి ముక్కలు ముక్కలు అయింది ఓ వ్యక్తి బైక్. ఆ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. గేటు వేసి ఉన్నా పట్టాలపైకి బైక్‌తో వెళ్లాడు. అయితే.. అవతలి ట్రాక్‌పై ఓ రైలు వెళ్తుండటంతో ఈ వైపు ఉన్న పట్టాలపై వేచి ఉన్నాడు. అప్పుడే మరో రైలు ఆ వ్యక్తి ఉన్న పట్టాలపై దూసుకొస్తోంది. అది గమనించిన సదరు వ్యక్తి బండిని వెనక్కి తిప్పే క్రమంలో పట్టాల మధ్యలో పడిపోయింది. దానిని లాగేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. అక్కడే వదిలేసి వెనక్కి పరిగెట్టాడు. క్షణాల వ్యవధిలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. ద్విచక్రవాహనంపై నుంచి వెళ్లింది. బైక్ తునాతునకలైంది. ఆగస్టు 26న జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రైల్వే పోలీసులు బైక్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో కిడ్నాపైన బాలుడు.. బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో ప్రత్యక్షం! -
కుటుంబాన్ని రిపేర్ చేస్తున్న మెకానిక్ రాధ
ఆ గ్యారేజ్‌లో రెంచ్‌లు, స్క్రూ డైవర్ల సందడితో గాజుల చప్పుడు కలిపి వినిపిస్తుంది. గ్రీజు అంటుకుపోయిన దుస్తులతో ఎప్పుడూ కనిపించే మెకానిక్ కాకుండా ఓ స్త్రీ చేతిలో రెంచీతో కొత్తగా కనిపిస్తుంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎంపీడీఓ కార్యాలయం రోడ్డులో ఉందీ మెకానిక్ షెడ్. భర్తకు అండగా నిలవడానికి భార్య మెకానిక్‌గా మారిన ఈ కథ ఆసక్తికరం. మట్టి అంటిన చేతులు నిజాయితీకి నిలువుటద్దాలు అంటారు కదా.. అలా నిజాయితీ కలిగిన ఓ మహిళ కథ ఇది. శ్రీకాకుళం: మహిళలు చాలా రంగాల్లో రాణిస్తున్నారు. చాలా మంది టీచర్లయ్యారు, ఇంకొందరు ప్రైవేటు సెక్టార్లలో రాణిస్తున్నారు, మరికొందరు రాజకీయా ల్లో ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారు.. అలా రాధ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసే తత్వం ఉంటే రంగంతో పని లేదని నిరూపిస్తున్నా రు ఈమె. వాస్తవానికి బైక్ మెకానిక్ రంగం మగాళ్ల రాజ్యం. రోజంతా దుమ్ము, ధూళి, గ్రీజులతో ఈ పని మొరటుగా ఉంటుంది. కానీ కుటుంబానికి తోడుగా ఉండేందుకు ఈ పనిని కూడా ఆమె బాధ్యతగా నెత్తికెత్తుకుంది. ► పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం రోడ్డులో గిరి మెకానిక్ షా పు ఉంది. అక్కడే రాధ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఎలాంటి వాహనం వచ్చినా ఇట్టే సమస్యను పసిగట్టి పరిష్కరించి పంపిస్తారు. వాస్తవానికి రాధ బైక్ మెకానిక్ పనులేవీ నేర్చుకోలేదు. కాలం ఆమెను ఈ రంగం వైపు నడిపించింది. ► పదహారేళ్ల కిందట రాధకు పోల గిరితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి స్వ స్థలం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా రంభ గ్రామం. అక్కడ ఉపాధి లేక పలాస వరకు వలస వచ్చారు. గిరికి బైక్ మెకానిక్ పనులు తెలుసు. కానీ ఆయనకు సరిగ్గా వినిపించదు. దీంతో వ్యాపారంపై ఆ ప్రభావం పడింది. కస్టమర్లు రావడం.. సమస్యను చెప్పడానికి ఆపసోపాలు పడడంతో గిరికి గిరాకీ తగ్గింది. కోవిడ్ రాకతో.. ► అసలే వ్యాపారం అంతంతమాత్రంగా ఉంటే అప్పుడే కోవిడ్ కేసులు ఉద్ధృతం కావడం మొదలయ్యాయి. ఫలితంగా ఉన్న ఉపాధి కాస్తా పోయింది. షెడ్‌కు బళ్లు రావడం మానేశాయి. ఓ వైపు కుటుంబానికి తిండీ తిప్పలు, ఇంటి అద్దె, షాపు అద్దె కట్టాల్సి రావడంతో వీరికి ఏం చేయాలో పాలుపోలేదు. ► ఈ కష్టకాలంలో గిరి భార్య రాధ ఆదర్శ ప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. తాను షెడ్లో ఉంటే తప్ప పరిస్థితులు చక్కబడవని గ్రహించి మెకానిక్ పనులు నేర్చుకోవడం మొదలుపెట్టారు. భర్త తోడుతో.. కోవిడ్ కాలంలో అద్దెల భారం పెరిగి కరోనా సమయంలో ఉపాధి లేక పస్తులు పడ్డా రు. పనిచేసేందుకు ఎవరినైనా పెడదామంటే అంత జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దీంతో రాధ స్వయంగా రోజూ దుకాణానికి వచ్చి సాయం చేసేది. సందేహాలు వస్తే గూగుల్, యూట్యూబ్‌లో వీడియోలు చూసి కొన్ని నేర్చుకునేవారు. కరోనా సమయంలో ఇంటి వద్దకు కొన్ని వాహనాలు వస్తే కాదనకుండా మరమ్మతులు చేసి పంపించేవారు. భర్తే ఆమెకు దగ్గరుండి విద్య నేర్పడం గమనార్హం. భర్త నేరి్పన విద్యతో అన్ని రకాల మరమ్మతులు చేస్తూ బైక్ మెకానిక్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సాధారణ వాహనాలతో పాటు పాతకాలం నాటి యమహా క్రక్స్ వంటి వాహానాలను కూడా ఆమె బాగు చేయగలరు.బీఎస్ 2 నుంచి బీఎస్ 6 వరకు స్కూటీలు, మోటారుసైకిళ్లు బాగు చేస్తున్నారు. భార్యాభర్తలం కష్టపడితేనే పైసలు కనిపిస్తున్నాయని, అందుకే సిగ్గు పడకుండా ఈ వృత్తిలో కొనసాగుతున్నానని ఆమె చెబుతున్నారు. పిల్లలను చక్కగా చదివించుకుని ఇక్కడే స్థిరపడాలని ఉందని ఆమె తెలిపారు. -
బజాజ్ సీటీ 125 ఎక్స్.. బోలెడు ఫీచర్లతో పాటు చార్జింగ్ సాకెట్ కూడా!
ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బజాజ్ త్వరలో దేశీయ మార్కెట్లోకి సీటీ 125 ఎక్స్(CT125X) పేరుతో కొత్త బైక్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ బైక్ ప్రస్తుతం ఉన్న CT110X కమ్యూటర్ బైక్ కంటే ఎత్తు కాస్త ఎక్కువగా ఉండబోతున్నట్లు సమాచారం. సీటీ 110ఎక్స్ తరహాలో రూపొందించిన ఈ బైక్ ఫీచర్ జాబితాను అప్డేట్ చేయడంతో పాటు బైక్ ఎక్స్టీరియర్ని కూడా కొత్త రంగులతో నింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధరను కస్టమర్లకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది బజాబ్. ప్రత్యేకతలు(అంచనా) ఇందులో.. టైల్లైట్ , టర్న్ ఇండికేటర్ల కోసం హాలోజన్ బల్బులు ఉన్నాయి. ట్యాంక్ గ్రిప్ ప్యాడ్లు, సీట్ కవర్, లగేజ్ క్యారియర్, అండర్ బెల్లీ ప్రొటెక్టర్ ప్లేట్ వంటివి ఫీచర్లు సాధారణ బైక్‌కు కాస్త భిన్నంగా దీన్ని నిలబెడుతుంది. ఇది కొత్త 125 సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో రాబోతున్నట్లు సమాచారం. మరో ప్రత్యేకత ఏంటంటే సీటీ 125 ఎక్స్ తరహాలో ఉండే ఈ కొత్త బైక్‌లో మొబైల్ చార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. దీంతో మనం బైక్‌పై ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మొబైల్ ఫోన్‌ను చార్జింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ బైక్ సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా బజాజ్.. 125 సీసీ సెగ్మెంట్ బైక్‌లు విడుదల చేయలేదు. అందుకే ఈ సెగ్మెంట్లో పట్టు పెంచుకునేందుకు సీటీ 125 ఎక్స్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం బజాజ్ సీటీ 110 ఎక్స్ ధర రూ.66 వేలు ఉండగా బజాజ్ సీటీ 125ఎక్స్ ధర దీనిపై అదనంగా 10 నుంచి 15 వేలు మధ్యలో ఉండనున్నట్లు సమాచారం. చదవండి: భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు -
రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్.. కొత్త లుక్ ఇలా ఉంటుందా?
ఒకప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ రోడ్డుపై వెళ్తుంటే..అందరి చూపు దానిపైనే ఉండేది. అందుకే ఆ బండి సైలెన్సర్‌కు సపరైట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా యూత్ అందరికి లైఫ్‌లో ఒక్కసారైన ఈ బైక్‌ను కొనుక్కోవాలనే డ్రీం ఉంటుంది. అలాంటి ఇండియన్ మోస్ట్ బైక్ బ్రాండ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్స్‌ను విడుదల చేయనుంది. భారత్‌లో రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350ని విడుదల చేసింది. ఈ తరుణంలో ఆటోమొబైల్ మార్కెట్లో ఎదురవుతున్న ఆటుపోట్లను తట్టుకొని, కాంపిటీషన్లో పై చేయి సాధించాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేయడం తప్పని సరని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తోంది. అందుకే 2026 నాటికి రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. యూకేకి చెందిన 'ఎలక్ట్రిక్ క్లాసిక్ కార్స్' సంస్థ 2020లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చేసింది. 125 సీసీ రేంజ్ బైక్స్ సైతం వినియోగదారుల్ని ఆకట్టుకున్నాయి. భారత్‌లో సైతం ఇదే తరహాలో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్‌ను ఎలక్ట్రిక్ బైక్స్‌గా మార్చేసి మార్కెట్‌కు పరిచయం చేస్తుందా? అనే సందేశాలు వ్యక్త మవుతున్నాయి. అవును, నాణ్యత, పనితీరు, బ్రాండ్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ బైక్స్‌ను అందించడం తొందరపాటులో లేదని రాయల్ ఎన్ఫీల్డ్ స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బైక్స్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ ..భవిష్యత్‌లో తయారు చేయనున్న ఎలక్ట్రిక్ బైక్ మోడళ్లు ఫీల్, సపరైట్ ఐకానిక్ లుక్ ఉండేలా ఆ సంస్థ శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి👉 డుగ్గుడుగ్గు మంటూ..రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్ వచ్చేస్తోంది! -
హోండా సీబీ300ఎఫ్ బైక్ లాంచ్, ధర ఎంతంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ)తాజాగా సీబీ300ఎఫ్ బైక్‌ను ఆవిష్కరించింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. డీలక్స్ ధర రూ. 2.25 లక్షలు కాగా డీలక్స్ ప్రో ధర రూ. 2.28 లక్షలుగా (ఢిల్లీలో ఎక్స్‌షోరూం) ఉంటుంది. బిగ్‌వింగ్ షోరూమ్‌లలో ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చని హెచ్ఎంఎస్ఐ ఎండీ అత్సుషి ఒగాటా తెలిపారు. 293 సీసీ ఇంజిను, అధునాతన ఆయిల్–కూలింగ్ టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టం తదితర ప్రత్యేకతలు ఈ బైక్‌లో ఉన్నాయి. -
అమానవీయ ఘటన: బైక్‌పై తల్లి మృతదేహంతో 80 కిలోమీటర్లు!
షాదోల్: ఆస్పత్రిలో శవ వాహనం లేకపోవడంతో ప్రైవేట్ వాహనదారులకు రూ.5 వేలు చెల్లించుకోలేక తల్లి మృతదేహాన్ని ఓ పేద యువకుడు ఏకంగా 80 కిలోమీటర్లు బైక్ మీదనే తీసుకెళ్లాడు! బెడ్‌షీట్‌లో చుట్టిన తల్లి శవాన్ని 100 రూపాయలతో కొన్న చెక్కపై పెట్టి బైక్‌కు కట్టి, మరొకరిని వెనక కూచోబెట్టి నడుపుకుంటూ వెళ్లాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనుప్పుర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల జైమంత్రి యాదవ్ ఛాతీ నొప్పికి చికిత్స పొందుతూ షాదోల్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి మరణించింది. శవ వాహనం లేదని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో మరో మార్గం లేక బైక్‌మీదే తీసుకెళ్లాల్సి వచ్చిందని కుమారుడు వాపోయాడు. కానీ అతను శవ వాహనం అడగనే లేదని మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ చెప్పారు. తమ వద్ద వాహనం లేని మాట నిజమే అయినా ఇలాంటప్పుడు జిల్లా ఆస్పత్రి నుంచో, స్థానిక సంస్థల నుంచో వాటిని సమకూరుస్తామన్నారు. -
ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి!.. ట్రాఫిక్ పోలీసులనే తికమక పెట్టాడు
బనశంకరి(బెంగళూరు): జరిమానా చెల్లించకుండా తప్పించుకునేందుకు ఓ ద్విచక్రవాహనదారుడు తన బుల్లెట్ బైక్‌కు ముందు, వెనుక వేర్వేరు నంబర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులను బోల్తా కొట్టించాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన మరిగౌడ పలు పర్యాయాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటంతో రూ.29 వేల జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముందు వైపు ఒక నంబర్, వెనుక వైపు మరో నంబర్ రాయించాడు.దీంతో పలు మార్లు ట్రాఫిక్ పోలీసులు ముందు ఒక నెంబర్ వెనక మరొకటి చూసి చూసి తికమక పడ్డారు. చివరికి ఈనెల 29వ తేదీన మరిగౌడ రాజాజీనగర కూలినగర వంతెన వద్ద సంచరిస్తుండగా ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 12 వరకు రిమాండ్ విధించారు. చదవండి: నిత్య పెళ్లికొడుకు సతీష్ తెలుగుతమ్ముడే! -
పిడుగుపాటుకు ఇద్దరు తోడల్లుళ్లు మృతి
వాంకిడి (ఆసిఫాబాద్): సాగులో మామకు ఆసరా ఇద్దామని బుధవారం అత్తగారింటికి వచ్చిన తోడల్లుళ్లు పిడుగుపాటుకు బలైపోయారు. ఈ హృదయ విదారక సంఘటన బుధవారం కొమురంభీం జిల్లాలో జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి. వాంకిడి మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన లోబడే రాంచందర్‌కు నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వాంకిడి మండలం కోమాటిగూడకు చెందిన వాడుగురే సంతోష్ (38)తో, రెండో కుమార్తెకు ఆసిఫాబాద్ మండలం ఆర్ఆర్ కాలనీకి చెందిన ఆదె సంతోష్ (36)తో వివాహం జరిపించారు. ఇంధాని ఎక్స్‌రోడ్డు వద్ద గల తన పత్తి చేనులో యూరియా వేసేందుకు రాంచందర్ ఇద్దరు అల్లుళ్లను బుధవారం ఇంటికి పిలిపించుకున్నాడు. పొద్దంతా కుటుంబ సభ్యులు పొలంలోనే గడిపారు. సాయంత్రం పని ముగించుకుని తోడల్లుళ్లు వాడుగురే సంతోష్, ఆదె సంతోష్ ఇద్దరు ఒకే బైక్‌పై ఇంటికి బయల్దేరారు. తేజాపూర్ గ్రామ శివారులో వీరి బైక్‌పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. వాడుగురే సంతోష్‌కు ఇద్దరు కుమారులు, ఆదె సంతోష్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
ర్యాపిడో డ్రైవర్‌గా మైక్రోసాఫ్ట్ ఉద్యోగి..ప్యాసింజర్‌కు ఊహించని అనుభవం!
కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు కొత్త దనాన్ని కోరుకుంటున్నారు. నాలుగు గోడల మధ్య కాకుండా నలుగురితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే జిమ్‌లు, ట్రెక్కింగ్, క్యాంపింగ్‌లు చేస్తున్నారు. మరికొందరు తాము ఉన్నత ఉద్యోగం చేస్తున్నామనే విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. క్యాబ్, టూవీలర్లకు డ్రైవర్లుగా మారిపోతున్నారు. బెంగళూరుకు చెందిన నిఖిల్ సేఠ్ తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. తాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకున్నట్లు తెలిపాడు. ర్యాపిడో బైక్ ఎక్కి వెళుతుండగా..మార్గం మధ్యలో ర్యాపిడో డ్రైవర్‌తో మాట కలిపినట్లు చెప్పాడు. మాటల సందర్భంలో తాను (ర్యాపిడో డ్రైవర్) మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. అంత పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నా..ర్యాపిడ్ ఎందుకు చేస్తున్నారు. అని ప్రశ్నించిన నిఖిల్ సేఠ్‌కు సదరు డ్రైవర్ నుంచి ఊహించిన సమాధానం ఎదురైంది. నేను మనుషుల్ని ప్రేమిస్తాను..వస్తువుల్ని వాడుకుంటాను సార్. నాకు మనుషులతో మాట్లాడడం అంటే మహా ఇష్టం. కానీ నేను మాట్లాడేందుకు నా చుట్టు పక్కల మనుషులు లేరు.అందుకే నేను వారితో మాట్లాడేందుకు ఇలా ర్యాపిడో డ్రైవర్‌గా అవతారం ఎత్తినట్లు చెప్పినట్లు నిఖిల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా..ఆ ట్విట్‌పై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. -
హిమాయత్ సాగర్ వరదల్లో చిక్కుకున్న వ్యక్తి.. కాపాడిన పోలీసులు
-
Hero Super Splendor Canvas Black Edition: అదిరిపోయే లుక్స్, డిజైన్‌తో
సాక్షి, ముంబై: హీరో కంపెనీ స్ప్లెండర్ మోడల్లో ఒక సూపర్ బైక్‌ను లాంచ్ చేసింది. సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశ పెట్టింది. రెండు వేరియంట్లలోలభించనున్న వీటి ధరలను కంపెనీ ప్రకటించింది. బేస్ డ్రమ్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 77,430 (ఎక్స్-షోరూమ్)గానూ, డిస్క్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 81,330 (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. హీరో సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ ఫీచర్లు, ఇంజన్ ప్రీమియం బోల్డ్ డిజైన్ , అప్డేటెడ్ టెక్నాలజీతో, కొత్త హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. లీటరుకు 60-68 కిలీమీటర్ల సెగ్మెంట్లో అత్యుత్తమ మైలేజీతో 13 శాతం వరకు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని హీరో వెల్లడించింది. డిస్క్ బ్రేక్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS)ఎంపికతో వస్తుంది. డిజి-అనలాగ్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ USB ఛార్జర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఉన్నాయి. 5 సంవత్సరాల వారంటీతో పాటు, గ్రాఫిక్స్‌తో కస్టమర్లు కస్టమైజ్ చేసుకునే చాన్స్ కూడాఉంది. ఈ బైక్‌లోని 125cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7500 RPM వద్ద 10.7 HP , 6000 RPM వద్ద 10.6 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అధునాతన ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇంజన్‌తో పాటు, వెట్ మల్టీ ప్లేట్ క్లచ్, సరికొత్త 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని అందించింది. చదవండి: 2022 Volvo XC40 Electric SUV: వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు లాంచ్, సూపర్ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీ! -
ఉదయం కార్పెంటర్ షాపులో పని.. రాత్రయితే బస్తీల్లో..
సాక్షి, హైదరాబాద్: ద్విచక్ర వాహనాలపై నగరంలో చక్కర్లు కొట్టాలనే ఉద్దేశంతో వాటి చోరీలు మొదలెట్టిన ఓ బాలుడు దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు. ఇతడి నుంచి ఈ దొంగ వాహనాలు ఖరీదు చేస్తున్న ముగ్గురు రిసీవర్లను పట్టుకున్నట్లు డీసీపీ డి.సునీత రెడ్డి శుక్రవారం వెల్లడించారు. జిర్రా ప్రాంతానికి చెందిన ఓ బాలుడు (15) స్కూలు స్థాయిలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. అప్పటి నుంచి ఓ కార్పెంటర్ షాపులో పని చేస్తున్నాడు. ద్విచక్ర వాహనాలపై సిటీలో తిరగాలన్నది అతడి కోరిక. అయితే బైక్స్ ఖరీదు చేయడానికి స్తోమత లేకపోవడంతో వాటిని చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. గోల్కొండ, హుమాయున్‌నగర్, బంజారాహిల్స్, లంగర్‌హౌస్, ఆసిఫ్నగర్ల్లోని బస్తీల్లో రాత్రి వేళల్లో సంచరించే వాడు. గల్లీల్లో పార్క్ చేసిన వాహనాల్లో హ్యాండిల్ లాక్ వేయని వాటిని గుర్తించేవాడు. అదును చూసుకుని వాటిని తస్కరించే బాలుడు తోసుకుంటూ కొద్దిదూరం వెళ్లేవాడు. ఆపై వైర్లు కలపడం ద్వారా వాటిని స్టార్ట్ చేసుకుని ఉడాయించే వాడు. ఆ వాహనంపై మోజు తీరే వరకు దానిపై చక్కర్లు కొట్టే వాడు. ఆపై ఎలాంటి పత్రాలు లేని వాటిని ఒక్కోటి రూ.10 వేల చొప్పున తన ప్రాంతంలోనే నివసించే సయ్యద్ నబీ, అబ్దుల్ అల్తాఫ్, మహ్మద్ ఫెరోజ్‌లకు విక్రయించాడు. ఇలా ఇప్పటి వరకు ఎనిమిది వాహనాలను బాలుడు తస్కరించాడు. దీనిపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, కె.నర్సింములు, షేక్ బుర్హాన్, కె.శీనయ్య వలపన్ని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ వాహనాలు ఖరీదు చేసిన ముగ్గురినీ అరెస్టు చేసి ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని గోల్కొండ పోలీసులకు అప్పగించారు. -
మోటార్‌బైక్‌పై దేశాన్ని చుట్టేస్తున్న నెల్లూరు యువకుడు
సాక్షి, నెల్లూరు డెస్క్: రోజుకో కొత్త ప్రదేశం.. కొత్త మనుషులు, కొత్త ఆచార వ్యవహారాలు.. కొత్త రుచులు.. ఇలా జీవితాన్ని ఆస్వాదించడం అందరికీ సాధ్యం కాదు. చాలామంది బిజీ లైఫ్‌లో పడి ప్రపంచాన్ని మర్చిపోతుంటారు. కొందరు మాత్రం ప్రయాణాలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. నెల్లూరు నగరానికి చెందిన వెంకట కార్తీక్ తూపిలి ఏడాదిపాటు దేశాన్నే తన ఇల్లుగా చేసుకునేందుకు మోటార్‌బైక్‌పై ముందుకు కదిలాడు. ఇప్పటికే పలు రాష్ట్రాలు చుట్టేశాడు. చదవండి: గోదావరి వరదలు.. ఏ హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు? నెల్లూరులోని ఉస్మాన్‌సాహెబ్‌పేటలో మల్లికార్జునరావు, సుజాత దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. తండ్రిది అరటికాయల వ్యాపారం. తల్లి గృహిణి. కొడుకు కార్తీక్ 2013 సంవత్సరంలో బీటెక్ చేశాడు. సంవత్సరంపాటు సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. అయితే ఇది తన గమ్యం కాదని తెలుసుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పి సివిల్స్ ప్రయత్నాలకు స్వస్తి పలికాడు. కొంతకాలంపాటు ఆహా, తదితర చోట్ల వెబ్ సిరీస్‌లకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. కొత్త ప్రపంచంలోకి.. కార్తీక్‌కు మొదటి నుంచి ప్రకృతి, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలకు వెళ్లి మనుషులతో మాట్లాడుతుంటాడు. ఫొటోలు తీసుకుని జ్ఞాపకాలుగా మార్చుకోవడం అలవాటు. తనను తాను కొత్తగా పరిచయం చేసుకునేందుకు ఇండియా మొత్తం చుట్టాలని 2021 చివర్లో నిర్ణయించుకున్నాడు. కొత్త ప్రదేశాలు చూడడం, మనుషులతో మమేకమవడం, మారుమూల పల్లెలకు వెళ్లి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?, వారి సంస్కృతి, సంప్రదాయాలేంటో తెలుసుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌బైక్‌పై యాత్రకు శ్రీకారం చుట్టాడు. 400 రోజులపాటు తన ప్రయాణం సాగేలా ప్రణాళిక వేసుకున్నాడు. మొత్తం 1,50,000 కిలోమీటర్లు తిరిగి లాంగెస్ట్ జర్నీ ఇన్ సింగిల్ కంట్రీ పేరుతో గిన్నీస్‌బుక్ రికార్డు సాధించాలని కార్తీక్‌కు ఉన్న మరో లక్ష్యం. అందుకోసం గిన్నీస్ రికార్డు సంస్థకు దరఖాస్తు చేశాడు. రోజుకు 350కి పైగా కి.మీ. కార్తీక్ తొలుత మన రాష్ట్రంలో ఐదురోజులపాటు వివిధ ప్రాంతాలు తిరిగి ఆ తర్వాత తమిళనాడుకి వెళ్లాడు. అలా పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, గోవా చుట్టి ప్రస్తుతం మహారాష్ట్రలో తిరుగుతున్నాడు. ఈనెల 17వ తేదీ నాటికి 41,200 కిలోమీటర్లు తిరిగాడు. రోజుకు 350 నుంచి 450 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాడు. తన పర్యటనలో భాగంగా అధికంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తాడు. మొదట్లో భయమేసింది కార్తీక్ దేశమంతా బైక్‌పై తిరుగుతానంటే మొదట్లో భయమేసింది. సంవత్సరానికి పైగా దూరంగా ఉండాలి. ఆలోచించుకోమని చెప్పాం. వాడికి పట్టుదల ఎక్కువ. జాగ్రత్తగా వెళ్తానన్నాడు. ప్రోత్సహించాం. రోజూ ఫోన్ చేసి మాట్లాడుతుంటాం. – మల్లికార్జునరావు, సుజాత, కార్తీక్ పేరెంట్స్ కుటుంబసభ్యుల సహకారం మోటార్‌బైక్ యాత్రకు కార్తీక్ కుటుంబసభ్యులు ఎంతగానో సహరిస్తున్నారు. తండ్రి ఆర్థికంగా అండగా నిలిచారు. అమ్మ, చెల్లి, బావ, స్నేహితులు పెళ్లూరు హరీ‹Ù, సూర్యప్రకాష్, సందీప్ (ఇతను 25,000 కి.మీ సైకిల్ యాత్ర చేశాడు.) ప్రోత్సాహం ఎంతో ఉందని కార్తీక్ చెబుతున్నాడు. ఏం చేస్తాడంటే.. ఉదయం లేచాక ఆరోజు ఎంత దూరం వెళ్లాలి?, చూడాల్సిన ప్రదేశాలేంటి?, ఎక్కడ ఆగాలి? తదితర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుంటాడు. దారి మధ్యలో గ్రామాల్లో ఆగుతాడు. స్కూళ్లు, ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడుతాడు. కొత్త ప్రదేశాలు చూస్తాడు. సాయంత్రం చీకటి పడే సమయానికి ప్రయాణాన్ని ముగిస్తాడు. ఎవరైనా గ్రామస్తులు, పట్టణవాసులు ఆశ్రయమిస్తే అక్కడుంటాడు. లేకపోతే స్కూల్స్, గురుద్వారాలు, ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండి పక్కరోజు ఉదయం మరో ఊరికి ప్రయాణమవుతాడు. ఇవి అందుబాటులో లేనప్పుడు ట్రావెలర్స్ కోసం ఉన్న కౌచ్ సర్ఫింగ్ యాప్‌ను ఉపయోగించుకుంటాడు. అటవీ ప్రాంతాలకు సమీపంలో టెంట్ వేసుకున్న సందర్భాలున్నాయి. ప్రయాణం ముగిసిన తర్వాత ఆరోజు చూసిన విశేషాలు, తీసిన ఫొటోలు తదితరాలను ది ట్రావెలర్ కార్తీక్ అనే ఇన్స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేస్తాడు. తిరిగిన రూట్, ఎన్ని కి.మీ ప్రయాణించింది తదితర వివరాలను గిన్నీస్‌బుక్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంటాడు. ఘన స్వాగతం చెబుతున్నారు యాత్ర మొదలుపెట్టినప్పుడు ఎన్నో అనుమానాలున్నాయి. వెళ్తున్న కొద్దీ అవన్నీ నివృత్తి అయిపోయాయి. కులం, మతం, భాషతో సంబంధం లేకుండా వెళ్లిన ప్రతిచోట బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రేమని పంచుతున్నారు. తమిళనాడులోని మల్లిపట్టినం హార్బర్లో టెంట్ వేసుకుని ఉన్నప్పుడు ప్రజలు వచ్చి ఊర్లోకి తీసుకెళ్లి ఆశ్రయమిచ్చారు. అక్కడి విశేషాలు చెప్పారు. మహారాష్ట్రలోని అహ్మద్పూర్కి వెళ్లినప్పుడు స్థానికులు ఘన స్వాగతం పలికారు. నన్ను చూసి హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి తాను బైక్‌పై ట్రావెలింగ్ చేస్తానన్నాడు. ప్రకృతి, ట్రావెలింగ్ జీవితాన్ని కొత్తగా చూపిస్తాయి. నా ప్రయాణంలో నేను ఎన్నో చూశాను. మా అమ్మా, నాన్న వల్లే ఈ యాత్ర సాగుతోంది. తల్లిదండ్రులు పిల్లలకు ఫ్రీడం ఇవ్వాలి. అప్పుడే వారు తమకు నచ్చిన రంగాల్లో రాణించగలరు. – కార్తీక్