గాల్లో ఎగిరే బైక్‌..! 'స్కై స్కూటర్‌'.. | Worlds first Star Wars style hoverbike By Polish Startup | Sakshi
Sakshi News home page

గాల్లో ఎగిరే బైక్‌..! 'స్కై స్కూటర్‌'..

Jun 22 2025 10:52 AM | Updated on Jun 22 2025 11:21 AM

Worlds first Star Wars style hoverbike By Polish Startup

రోజూ ట్రాఫిక్‌లో గంటసేపు వేచి ఉండి, రెండు సార్లు హారన్‌ కొట్టి, మూడోసారి ఆరెంజ్‌ లైట్‌లో బ్రేక్‌ వేసి, చివరికి కాళ్లు బైక్‌ పెడల్స్‌పై కంటే నేలపైనే పెట్టుకుంటూ ప్రయాణం చేస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి ప్రయాణ కష్టాలన్నింటికీ ఓ సింపుల్‌ జెట్‌ ఇంజిన్‌ పరిష్కారం చూపుతోంది. ఇది ‘హోవర్‌ బైక్‌’. 

పోలండ్‌కు చెందిన ‘వోలోనాట్‌’ అనే సంస్థ, అచ్చం ‘స్టార్‌ వార్స్‌’ సినిమాలో స్కైవాకర్‌ వాడిన స్పీడర్‌ బైక్‌ మాదిరిగా, చక్రాలు లేకుండా, ప్రొపెల్లర్లు లేకుండా, గాల్లో తేలిపోయేలా ఈ బైక్‌ను రూపొందించింది. గంటకు 200 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లే ఈ హోవర్‌ బైక్‌ స్టార్ట్‌ చేసిన క్షణమే, నేలను తాకకుండా నేరుగా గాల్లోకి దూసుకెళ్లిపోతుంది. 

అయితే ఇంకా అసలు మజా ఏంటంటే.. దీనికి స్టీరింగ్‌ ఎలా ఉందో? బ్రేకులు ఎక్కడ పెడతారో? ధర ఎంతవుతుందో? ఇవన్నీ ఇంకా మిస్టరీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇది కేవలం ట్రయల్‌ రైడ్‌లో మాత్రమే కనిపించింది. కాని, ఇప్పటికే ఇది సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి వస్తే, ఇక మన ట్రాఫిక్‌ పోలీసులు గాలిలో ఎగిరే ఈ బైక్‌ల వెంబడి డ్రోన్లు పంపించి ఫైన్‌ వేయాల్సిన రోజులు వస్తాయేమో! 
(చదవండి: అరుదైన వేడుక ‘ఈస్టర్న్‌ మహా కుంభమేళా’..! ప్రకృతిని, స్త్రీ శక్తిని..)

Advertisement
 
Advertisement
Advertisement