మిస్ యూనివర్స్ 2026 పొటీలు దాదాపు తుదీ ఘట్టానికి చేరవవుతున్నాయి. ఈ అంతర్జాతీయ అందాల పోటీలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సదరు సంస్థ నవంబర్ 12న కొత్త కిరీటాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకుందట. అందులో భాగంగా జార్జ్ విట్టెల్స్, మైసన్ డి ఈ కళ్లుచెదిరే కొంగొత్త కిరీటాన్ని ఆవిష్కరించారు. అందుకు సంబంధంచిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్.
‘శాశ్వతపు వారసత్వపు తేజస్సు’ని పరిచయం చేస్తున్నాం అనే క్యాప్షన్ జోడించి మరి ఇలా పేర్కొంది పోస్ట్‌లో. ఇందులో ఏకంగా 3,150 వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఇది 75 ఏళ్ల మిస్ యూనివర్స్ చరిత్ర తోపాటు దీని గతం, వర్తమానం, భవిష్యత్తుల వేడుకను జరుపుకునే అసాధారణమైన కిరీటంగా అభివర్ణించింది. కాగా, ఈ మిస్ యూనివర్స్ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్ని కిరీటాలు చేరాయంటే..
మొత్తం 12 కిరీటాలు..
ఏళ్లుగా మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ తన ప్రత్యేక మైలురాళ్లను గుర్తించడానికి కొత్త కిరీటాలను ప్రవేశపెట్టింది. ప్రతి కిరీటం ఒక కొత్త ప్రయాణానికి, కొత్త అవకాశాలకు ప్రతీకగా నిలిచింది, ఈ కిరీటం ఒక టైటిల్ హోల్డర్ నుంచి మరొకరికి అందించబడుతుంది. తన 75 ఏళ్ల అందాల పోటీల చరిత్రలో మొత్తం 12 విభిన్న కిరీటాలను చవిచూసిందట.
రోమనోవ్ ఇంపీరియల్ నప్షియల్ క్రౌన్ (1952): ఇది మొట్టమొదటి మిస్ యూనివర్స్ కిరీటం, ఇందులో 1,529 వజ్రాలు ఉన్నాయి. దీనిని ఆర్మీ కుసెలా గెలుచుకున్నారు.
క్రిస్టియన్ మార్టెల్ క్రౌన్ (1953): దీని కాంస్య డిజైన్ కారణంగా మెటాలిక్ బ్రాంజ్ క్రౌన్ అని పిలిచేవారు. 1953లో క్రిస్టియన్ మార్టెల్ ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు.
స్టార్ ఆఫ్ ది యూనివర్స్ క్రౌన్ (1954-1960): దీని పైభాగంలో ఉన్న నక్షత్రం కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది. ఇందులో స్వచ్ఛమైన బంగారం, ప్లాటినంతో చేసిన సుమారు 1,000 ఓరియంటల్ కల్చర్డ్ నల్ల ముత్యాలు పొదిగి ఉన్నాయి.
రైన్‌స్టోన్ క్రౌన్ (1961-1962): రైన్‌స్టోన్‌లతో తయారు చేసిన ఈ కిరీటం మిస్ యూనివర్స్ అందాల పోటీ 10వ వార్షికోత్సవానికి గుర్తుగా నిలిచింది.
కోవెంట్రీ క్రౌన్ (1963-2001): ఆభరణాల వ్యాపారి సారా కోవెంట్రీ, మధ్యలో రాజదండం పట్టుకున్న స్త్రీ ఆకృతిని చేర్చి, రైన్‌స్టోన్ కిరీటాన్ని పునఃరూపకల్పన చేశారు. దీనిని లేడీ క్రౌన్ అని పిలిచేవారు.
మికిమోటో ఫీనిక్స్ క్రౌన్ (2002-2008 మరియు 2017-2018): ఇది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ 51వ వార్షికోత్సవానికి గుర్తుగా నిలిచింది. ఇందులో దాదాపు 30 క్యారెట్ల బరువున్న 500 సహజమైన రంగులేని వజ్రాలు, 120 సౌత్ సీ, అకోయా ముత్యాలు ఉన్నాయి.
CAO కిరీటం (2008): వియత్నాంలో రూపొందించిన ఈ కిరీటం, 18 క్యారెట్ల తెలుపు, పసుపు బంగారంలో పొదిగిన 1,000 విలువైన రాళ్ల కలయిక. ఇందులో 555 తెల్లని వజ్రాలు, 10 స్మోకీ క్వార్ట్జ్ స్ఫటికాలు, 375 కాగ్నాక్ వజ్రాలు, 19 మోర్గానైట్ రత్నాలు ఉన్నాయి.
డైమండ్ నెక్సస్ పీస్ క్రౌన్ (2009-2013): ఇది 1,371 రత్నాలతో పొదగబడింది. మిస్ యూనివర్స్ HIV/AIDS విద్య, అవగాహన వేదికకు ప్రాతినిధ్యం వహించడానికి కృత్రిమ కెంపులను కలిగి ఉంది.
DIC కిరీటం (2014-2016): ఈ కిరీటంపై పది మంది కళాకారులు పనిచేశారు. దీనిని పూర్తి చేయడానికి వారికి నాలుగు నెలల సమయం పట్టింది. ఇది మాన్‌హాటన్ స్కైలైన్‌ను గుర్తుచేసేలా ఉంది . దీన్ని 18 క్యారెట్ల తెలుపు బంగారంలో పొదగబడిన ఐదు నీలి పుష్యరాగాలు, 311 వజ్రాలు, 33 వేడి-కాల్చిన స్ఫటికాలు, 198 నీలి నీలమణి ముక్కలను కలిగి ఉంది.
మౌవాద్ పవర్ ఆఫ్ యూనిటీ క్రౌన్ (2019-2021): ఇందులో 62.83 క్యారెట్ల బరువున్న బంగారు కానరీ వజ్రం పొదిగి ఉంది. ఇది వైవిధ్యం, ఆశయం, సౌందర్యం సమాజానికి ప్రతీకగా నిలిచింది.
మౌవాద్ ఫోర్స్ ఫర్ గుడ్ క్రౌన్ (2022-2023): దీనిని 110 క్యారెట్ల నీలి నీలమణులతో, మధ్యలో రాయల్ బ్లూ నీలమణితో మరియు 48 క్యారెట్ల తెల్ల వజ్రాలతో అలంకరించారు.
జ్యుయెల్మర్ లుమియెర్ డి ఎల్'ఇన్ఫిని క్రౌన్ (2024-2025): దీనిని సాంప్రదాయ ఫిలిపినో, ఫ్రెంచ్ ఆభరణాల రూపకల్పన పద్ధతులను ఉపయోగించి చేతితో తయారు చేశారు. దీనిలో వందలాది వజ్రాలు, 23 బంగారు దక్షిణ సముద్ర ముత్యాలు పొదిగి ఉన్నాయి. దీన్ని బంగారం, ప్లాటినంతో తయారు చేశారు
కాగా, మిస్ యూనివర్స్ ఫైనల్ పోటీలు నవంబర్ 24న శాన్ జువాన్‌లోని జోస్ మిగెల్ అగ్రెలాట్ కొలీజియంలో జరగనున్నాయి. ఇక భారత్‌కి కేరళకు చెందిన కజియా లిజ్ మెజో ప్రాతినిథ్యం వహిస్తోంది.
ఇదీ చదవండి: ఆత్మగౌరవ వివాహ పద్ధతిలో ఒక్కటైన అనిరుధ్-కావ్య మారన్‌లు! ఎలా నిర్వహిస్తారంటే..


