ఇటీవల మిస్ యూనివర్స్ ఆయా దేశాలు తమ ప్రతినిధ్యులుగా అందగత్తెలను ఎంపిక చేశాయి. ఇటీవలే మిస్ యూనివర్స్ పాకిస్థాన్‌గా మిస్బా అర్షద్ విజయం సాదించడం చూశాం. ఆ తదనంతరమే భారత్,థాయిలాండ్‌లు కూడా మిస్ యూనివర్స్ 2026కి తమ ప్రతినిధులను ఎంపిక చేశాయి.
నవంబర్ 24, 2026న ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే అందగత్తెలను ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే భారత్ మిస్ యూనివర్స ఇండియాగా కిరీటం గెలుచుకున్న కేరళ అమ్మాయి కజియా లిజ్ మెజో గెలుపై పాకిస్థాన్ మిస్ యూనివర్స్ మిస్బా అర్షద్ ఇలా స్పందించింది.
ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మిస్ యూనివర్స్ ఇండియా 2026గా కజియా లిజ్ మెజో ఫోటోను షేర్ చేస్తూ. ‘చాలా అందంగా ఉన్నారు, మీకు అభినందనలు. దీనికి పూర్తిగా అర్హులు మీరు. త్వరలోనే ప్యూర్టో రికోలో కలుద్దాం!’ అని రాసుకొచ్చింది. అలాగే మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ 2026గా కిరీటం గెలుచుకున్న తరీనా బోటెస్‌ను కూడా అభినందిస్తూ..ఇది ఒక అమూల్యమైన క్షణం అని రాశారు పోస్ట్‌లో.
అంతేగాదు 'పాకిస్తానీ పేజెంట్స్' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ, తరీనా బోట్స్, మిస్బా అర్షద్, కజియా లిజ్ మెజోల కొలాజ్‌ల ఫోటోలను పంచుతూ "టీమ్ ఆసియా: బలపడుతోంది" అని రాసి ఉంది. అంతేగాదు గతవారమే ముగ్గురు అందమైన రాణులు కిరీటధారణ చేయడం చూశాం. ఇది టీమ్ ఆసియాను మరింత బలంగా, సొగసైనదిగా చేసింది అని క్యాప్షన్ జోడించి మరిపోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌నే రీ షేర్‌చేస్తూ మిస్బా అర్షద్ హార్ట్-ఐస్ ఎమోజీతో ఇలా స్పందించిందామె.


