జస్ట్‌ మూడు నెలల్లో 20 కేజీల బరువు..! ఐతే ఆహారంలో.. | Health tips: Fitness Influencer Loses 20 Kg In 3 Months, | Sakshi
Sakshi News home page

Weight Loss Tips: జస్ట్‌ మూడు నెలల్లో 20 కేజీల బరువు..! ఐతే ఆహారంలో..

Aug 25 2026 11:31 AM | Updated on Aug 25 2026 11:33 AM

Health tips: Fitness Influencer Loses 20 Kg In 3 Months,

బరువు తగ్గడం అంటే అత్యంత కష్టమైన పని కాదని..సునాయాసం ఎంజాయ్‌ చేస్తే తగ్గొచ్చని చూపిస్తున్నారు పలువురు. అందుకు క్రమశిక్షణ, నిలకడ తోపాటు ఆహారంపై మంచి స్పృహ కూడా కలిగి ఉండటం అత్యంత ప్రధానం. అచ్చం అలానే తూచా తప్పకుండా అనుసరించి జస్ట్‌ మూడు నెలల్లో కిలోలు కొద్దీ బరువు తగ్గి  అందర్నీ ఆశ్చర్యపర్చింది ఈ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌. ఆమె బరువుని తగ్గించుకోవడంలో హెల్ప్‌ అయిన ఫిట్‌నెస్‌ మంత్ర ఏంటో సవివరంగా చూద్దామా..!.

ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ జ్యోతి ఉపాధ్యాయ్‌ ఒక సాధారణ ఫిట్‌నెస్‌ మంత్రాని అనుసరించినట్లు వెల్లడించింది. అదే ఆమెకు మూడు నెలల్లో 20 కిలోలు పైనే తగ్గడానికి సహాయపడినట్లు పేర్కొంది. తాను క్రమం తప్పని వ్యాయామం, ఇంట్లో చేసిన సాధారణ భోజనం తదితరాలన్నింటిని నిలకడగా చేయడం వంటి వాటిపై దృష్టిపెట్టినట్లు తెలిపింది. అంతేగాదు భారతీయ ఆహారంలో సులభంగా లభించే, అత్యంత సుపరిచితమైన పదార్థాలనే తన డైట్‌లో చేర్చుకున్నట్లు వెల్లడించింది. 

అలాగే తాను వ్యాయామం చేసేముందు తప్పనిసరిగా స్వెట్ బెల్ట్ ధరిస్తానని తెలిపింది. అలాగే తన తాజా వర్కౌట్‌లలో  95 కేజీల డెడ్‌లిఫ్ట్‌ను కూడా పూర్తి చేసినట్లు పేర్కొంది. క్రమం తప్పని శిక్షణతో తన బలం నెమ్మదిగా మెరుగుపడుతోందని అంటోంది. ఇక ఆహారం విషయానికొస్తే..ఎండుద్రాక్ష, ఓట్స్‌, ఇంట్లోనే తయారుచేసే పనీర్‌ తీసుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే మధ్యాహ్న భోజనంలో రోటీలు, పెరుగు, కూరగాయలు, సలాడ్‌, పనీర్‌ కూర, రాత్రి భోజనంలో తేలికగా ఉండేలా బొప్పాయి మాత్రమే తీసుకుంటానని పేర్కొంది.

ఇక్కడ తనకు 20 కేజీల బరువు తగ్గడం అనేది క్రమం తప్పని వ్యాయామాలు, నియంత్రిత ఆహారం, నిలకడగా పాటించే దినచర్యల వల్లే సాధ్యమైందని అంటోంది. తక్కువ కేలరీలు తీసుకుంటూ..శారీరకంగా చురుకుగా ఉన్నప్పుడే బరువు తగ్గడం సులభమవుతుందని నొక్కి చెబుతోంది. 

ముఖ్యంగా తగినంత నీరు తాగడం, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపకరిస్తాయని చెబుతోందామె. చివరగా వెయిట్‌లాస్‌ జర్నీలో సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే సరైనవని నొక్కి చెప్పింది ఇన్‌ఫ్లుయెన్సర్‌ జ్యోతి.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: తొలి అడుగుల నుంచి.. ఫస్ట్‌ ఫ్లైట్‌ జర్నీ వరకు..! కుమార్తె భావోద్వేగ పోస్ట్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement