జార్ఖండ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్‌ షాక్‌ | Supreme Court Hearing on JPSC Civil Services Prelims 2025 Irregularities | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్‌ షాక్‌

Aug 24 2026 1:39 PM | Updated on Aug 24 2026 1:43 PM

Supreme Court Hearing on JPSC Civil Services Prelims 2025 Irregularities

సాక్షి, ఢిల్లీ: జార్ఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బిగ్‌ షాక్‌ తగలింది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు.. జార్ఖండ్ ప్రభుత్వం, JPSC తదితరులకు నోటీసులు జారీ చేసింది. అయితే ప్రస్తుతానికి CBI దర్యాప్తుకు లేదా పరీక్ష రద్దుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వలేదు.

జార్ఖండ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్‌-2025లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలో అక్రమాలపై సీబీఐతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ప్రత్యామ్నాయంగా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. పరీక్షలో అవకతవకలపై విద్యార్థులు నిరంతరం ఆందోళనలు చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రశ్నపత్రాల తయారీ, పంపిణీ నుంచి ఓఎంఆర్‌ షీట్లు, సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ రికార్డుల వరకు మొత్తం పరీక్షా ప్రక్రియను పరిశీలించాలని కోరారు. కీలక ఆధారాలను భద్రపరచాలని విజ్ఞప్తి చేశారు.

చదవండి: బీహార్‌లో పొలిటికల్ ట్విస్ట్.. సీఎం రేసులోకి నితీష్ వారసుడు?

దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో విచారణ సందర్భంగా అవసరమైతే ఫోరెన్సిక్ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుందని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. కేసును పరిశీలించిన ధర్మాసనం.. జార్ఖండ్ ప్రభుత్వం, JPSC తదితరులకు నోటీసులు జారీ చేసింది. అయితే ప్రస్తుతానికి CBI దర్యాప్తుకు లేదా పరీక్ష రద్దుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వలేదు. సంబంధిత పక్షాల సమాధానాలు వచ్చిన తర్వాత తదుపరి విచారణలో కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement