కోటి కలలతో రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోయిన ఒక యువకుడి జీవితం విషాదంతమైంది. ఉన్నత చదువులు చదివినా కూడా ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన సాయిప్రదీప్ ఆత్మహత్య చేసుకున్న దిగ్బ్రాంతి రేపింది. హైదరాబాద్‌లోని దమ్మాయిగూడలోని శ్రీనివాసనగర్ కాలనీ చెందినవాడుగా పోలీసులు గుర్తించారు.
నివేదికల ప్రకారం, సాయి ప్రదీప్ 2024లో అమెరికాకు వెళ్లారు. ఇటీవల 'యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ శాన్ ఆంటోనియో'లో తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అతనికి సప్లై చైన్ అనలిస్ట్‌గా 5 సంవత్సరాల అనుభవం ఉన్నట్టు తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఫలితం దక్కకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైనాడు. దీంతో ఈ డిప్రెషన్‌తో ఆగస్టు 21న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని మృతదేహాన్ని భారతదేశానికి రప్పించడానికి మరియు అంత్యక్రియల ఖర్చులను భరించడానికి అతని కుటుంబం నిధుల సేకరణను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా అమెరికా కఠినమైన వలస విధానాలలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం, ఎన్నారైలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భవిష్యత్ అనిశ్చితి కెరీర్ కలలు, ఆర్థిక ఒత్తిడి వేలాది మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు


