మద్యం మత్తులో తల్లిపై దాడి.. అక్కడికక్కడే మృతి | Assault on mother while under the influence of alcohol | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో తల్లిపై దాడి.. అక్కడికక్కడే మృతి

Aug 23 2026 4:24 PM | Updated on Aug 23 2026 4:29 PM

Assault on mother while under the influence of alcohol

సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ కుమారుడు కన్న తల్లిపై కిరాతకంగా దాడి చేసి చంపాడు. స్థానిక గాంధీనగర్‌లో రజియా అనే మహిళ తన కుమారుడితో కలిసి నివాసం ఉంటుంది. అయితే పుల్లుగా తాగిన తన కుమారుడు మద్యం మత్తులో తల్లి తలపై బలమైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలైన రజియా అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement