పిల్లలపై ర్యాంకుల భారం మోపవద్దు..! హీరో సూర్య పేరెంటింగ్‌ టిప్స్‌ | Actor Suriya Parenting Tips, Don’t Let Marks And Competition Steal Your Child’s Childhood, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

ర్యాంకుల విషయంలో పిల్లల పట్ల అలా వ్యవహరించొద్దు..! హీరో సూర్య పేరెంటింగ్‌ టిప్స్‌

Aug 23 2026 12:45 PM | Updated on Aug 23 2026 1:19 PM

Hero Suriya Urged Parents To Stop Burdening Children With Ranks

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ మూవీతో మంచి హిట్‌ అందుకున్న హీరో సూర్య తల్లిదండ్రులను పిల్లలు విషయంలో అలా వ్యవహరించొద్దంటూ చక్కటి పేరెంటింగ్‌ సలహాలు సూచనలు ఇచ్చారు. పిల్లల పెంపకంలో ఆ విషయంలో ప్రతి పేరెంట్‌ని ఆ విధంగా ఉండొద్దని నొక్కి చెప్పారు. అందరి తల్లిదండ్రులు పిల్లల మార్కుల విషయంలో ఎలా ప్రవర్తిస్తే ప్రయోజనకరంగా ఉంటుందో వివరించడమే గాక తండ్రిగా తన అనుభవాన్ని కూడా షేర్‌ చేసుకున్నారు. మరి అవేంటో చూసేద్దామా..!.

ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో పిల్లల మార్కుల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన తీరు గురించి చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. బాల్యాన్ని ఆస్వాదించకుండా వాళ్లను ఎలా పోటీ వాతావరణంలోకి తోసేస్తున్నారో మాట్లాడారు. దయచేసి పిల్లలను పెంచేటప్పుడు ప్రతి పేరెంట్‌ వారి బాల్యాన్ని కోల్పోయేలా అస్సలు చేయొద్దని హితవు పలికారు. ఎందుకంటే విద్యావ్యవస్థలో అధిక కటాఫ్‌ మార్కుల పట్ల ఉన్న క్రేజ్‌పై తల్లిదండ్రల్లో ఉండే ఆందోళన తెలియకుండానే పిల్లలకు సంక్రమిస్తుందని అన్నారు. 

దాంతో వాళ్లకు 18 మార్కుల వస్తే సంతోషంగా ఉండదు..ఫస్ట్‌ అయితేనే హ్యాపీ అనే ఆలోచనకు వచ్చేస్తారు. తెలియకుండానే మొగ్గదశలోనే వారిలో ఆ భావన నాటుకుపోతోందన్నారు. అధిక కటాఫ్‌ మార్కులనేవి తీవ్రమైన పోటీకి దారితీసి..పిల్లల్లో తెలియని ఒత్తిడిని కలుగజేస్తాయి. యూనివర్సిటీలు  99.9 శాతం కటాఫ్ అడుగుతుంటాయి, అక్కడ చాలా పోటీ ఉంటుంది, అని పిల్లల్లో నూరిపోస్తుంటారు. 

దాంతో వాళ్లు తమ మధురమైన బాల్యాన్ని ఆస్వాదించకుండా చేసేస్తాం. నిజానికి దాన్ని ఎలా ఛాలెంజింగ్‌గా తీసుకుంటూ బాల్యాన్ని కూడా ఎలా ఎంజాయ్‌ చేయాలో వాళ్లకు నేర్పించమని అన్నారు. అలాగే పిల్లల సక్సెస్‌ని జరుపుకునే విధానంపై కూడా మండిపడ్డారు. "మా పిల్లాడికి ఇన్ని మార్కులు వచ్చాయంటూ పక్కంటి వాళ్లతో గర్వంగా చెప్పడంతో వాళ్ల బిడ్డ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆలోచించరు. సక్సెస్‌ని ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకోవచ్చు..పక్కవాళ్లకు..తక్కువ మార్కులు వచ్చే పిల్లాడి మనసులో బాధ కలుగజేసేలా కాదని." అంటున్నారు హీరో సూర్య. అ

దేసమయంలో తాను పోటీతత్వానికి వ్యతిరేకం కాదని అన్నారు.  తీవ్రమైన పోటీతత్వం మంచిదే. కానీ దాని విషయంలో  అతి అస్సలు వదని అన్నారు. ఈ సందర్భంగా తన పిల్లల విషయంలో తండ్రిగా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు సూర్య. 

కుమారుడి స్పోర్స్‌ డే ఘటన..
తన కుమారుడు దేవ్ పాఠశాల స్పోర్ట్స్ డే నాటి ఒక సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. పిల్లలు సహజంగానే ఎంతటి సానుభూతితో ఉంటారో అర్థం చేసుకోవడంలో ఆ సంఘటన తన దృక్పథాన్ని మార్చిందని ఆయన చెప్పారు. పిల్లలు పరుగెత్తుకుంటూ వెళ్లి, ఒక వాటర్ బాటిల్ తీసుకుని, తిరిగి ముగింపు రేఖకు చేరుకోవాల్సిన ఒక పరుగు పందెంలో దేవ్ పాల్గొన్నట్లు చెప్పారు. 

"అయితే దేవ్‌ అత్యంత వేగంగా పరిగెత్తే వారిలో ఒకడు, కానీ ఆ రోజు పరుగుపందెంలో తనకిష్టమైన బ్లూ కలర్‌ బాటిల్‌ తోపాటు పింక్‌ కలర్‌ బాటిల్‌ తీసుకొచ్చాడు. దాంతో అతడు అందులో గెలవలేకపోయాడు. ఆ తర్వాత నాతో అప్పా నాకు నీలం రంగు ఇష్టం కాబట్టి వెళ్లి నా నీలం రంగు బాటిల్ తీసుకున్నాను, కానీ అక్కకు గులాబీ రంగు అంటే ఇష్టం అందుకని ఆమె కోసం ఇది కూడా తీసుకొచ్చానని చెప్పాడు. ఇప్పుడు మన దగ్గర రెండు బాటిల్స్‌ ఉన్నాయి ఒకటి నా కోసం, ఇంకొకటి అక్క కోసం అని అనందంగా అన్నాడు. 

ఫలితం కంటే నా కుమారుడు తన అక్కు ఇచ్చిన ప్రాధాన్యత మనసుకు హత్తుకుంది. అలాగే తన సహా విద్యార్థి పట్ల దేవ్‌ ప్రవర్తించిన తీరు కూడా నన్ను ఆకట్టుకుందన్నారు. ఎందుకంటే దేవ్‌ తాను ఓడిపోయానని బాధపడకుండా తన బలాలు గుర్తిస్తూనే తరగతిలో అత్యంత వేగంగా పరుగెత్తినందుకు ఆ అబ్బాయిని ప్రశంసించాడు. పైగా అతడు అత్యంత వేగంగా పరిగెట్టగలడు, నేను బొమ్మలు బాగా గీయగలను అని అన్నాడు. అంతేగాదు అతడు నా అంత బాగా గీయలేడు నాన్న అని చెప్పిన తీరు నన్ను ఎంతగానో కదిలించింది." అని సూర్య అన్నారు. 

ఇక్కడ ఆ విధంగా ఆలోచించమని దేవ్‌కి ఎవ్వరూ శిక్షణ ఇవ్వలేదు, అయినా తను కొన్ని విషయాల్లో తన స్నేహితుడు కొన్ని విషయాల్లో రాణించగలడు అని చెప్పగలిగే ఒక స్పష్టత అతడికి ఉండటం నిజంగా అభింనందించదగ్గ విషయం అని అన్నారు సూర్య. కాగా సూర్య జ్యోతిక దంపతులకు 2007లో దియా అనే కుమార్తె, 2010లో దేవ్‌ అనే కుమారుడు జన్మించారు. తమ పిల్లలు బీ-కరికులం పాఠశాలల్లో చదవడం కోసం చెన్నై నుంచి ముంబైకి మకాం మార్చేశారు ఈ దంపతులు.

(చదవండి: అనీమియా @ డిమెన్షియా!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement