వాకింగ్ అనేది ఫిట్‌నెస్ పరంగా మంచిదని అందరికీ తెలిసిందే. బరువు తగ్గడానికి బెస్ట్ చాలా బెస్ట్ అని చెబుతారు కానీ దీంతోపాటు కార్డియో వ్యాయామాలు, ఇతర వేగవంతమైన వర్కౌట్లు, డైట్ వంటివి తోడైతేనే ప్రభావవంతంగా ఉంటుంది. అలాంటిది ఈ మహిళ చాలా తక్కువ శ్రమతో.. అది కూడా జస్ట్ 30 నిమిషాల వాకింగ్‌తో ఏకంగా 33 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యఎలానో చూసేద్దామా..
బరువు తగ్గడానికి వాకింగ్‌కి మించి బెస్ట్ వ్యాయామం ఇంకొకటి ఉండదు. కాబట్టి దాన్నే ఇలా చేస్తే త్వరిగతిన కేలరీలు కరిగి బరువు సులభంగా తగ్గుతామని చెబుతోంది ఈ యోగా నిపుణురాలు శ్రద్ధ. ప్రతి రోజూ జస్ట్ 30 నిమిషాలు ఇలా నడిస్తే..బరువు అమాంతం తగ్గుతారని చెబుతోంది. తాను అలా చేసే 33 కిలోలకు పైనే బరువు తగ్గినట్లు వెల్లడించింది. అదెలాగో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వీడియో రూపంలో షేర్ చేసి మరి చూపించారు. వీడియోలో ట్రెడ్‌మిల్ 15% వాలులో ఉండేలా చూసుకుంటూ..వాక్ చేయాలి.
అంటే ఎత్తు మీద నుంచి వాకింగ్ చేయడం అన్నమాట. ఇలా వేగంగాచేస్తే చాలట. గంటకు మూడు లేదా 3.5 కిలోమీటర్ల వేగం చాలని అంటోందామె. జస్ట్ 30 నిమిషాల పాటు మూడు సార్లు చేస్తానని వెల్లడించింది. అలాగే వారానికి మూడు సార్లు వెయిట్ ట్రైనింగ్ చేస్తానని పేర్కొంది. మొదటగా 20 కిలోలు తగ్గినప్పుడూ వారానికి ఐదుసార్లు చేసినట్లు తెలిపింది. ఇక్కడ చేతులు ప్రీగా ఉండాలని హెచ్చరిస్తోంది. ట్రెడ్‌మీల్‌ని గట్టిగా అస్సలు పట్టుకోకూడదని చెబుతోంది యోగా నిపుణురాలు శ్రద్ధ.
ఇదేలా ఉపకరిస్తుందంటే..
ట్రెడ్‌మిల్‌తో ఫిట్‌నెస్ స్థాయి లక్ష్యాలకు అనుగుణంగా వ్యాయామం రూపొందించుకోవడానికి వేగాన్ని, వాలుని సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు.
వాలుగా నడవడం వల్ల ఎక్కువ వేగం అవసరం లేకుండానే వ్యాయామ తీవ్రత పెరుగుతుంది. ఇది ముఖ్యంగా కాళ్లు, పిరుదలలో ఎక్కువగా కండర సముహాలను ఉత్తేజపరుస్తుంది. అంటే చదునైనా ఉపరితలంపై నడవడంతో పోలిస్తే..ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.
15% నిటారు వాలు వర్సెస్ చదునైన ఉపరితలంపై పోల్చితే దాదాపు రెట్టింపు కేలరీలు ఖర్చు అవుతాయని అంటున్నారు. అచ్చం జాగింగ్ మాదిరిలా కేలరీల ఖర్చు అవుతాయట.
ఇలా నడవడం వల్ల శరీరంపై ఒత్తిడి తగ్గడమే గాక కీళ్లపై ప్రభావం కూడా తగ్గుతుందట.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
15% వాలు చాలా నిటారుగా ఉంటుంది కాబట్టి వేగంగా ప్రారంభిస్తే వెన్నుపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందనేది గ్రహించాలి.
ట్రెడ్‌మిల్ వేగాన్ని మితంగా గంటకు 2.0 నుంచి 2.5 మైళ్లకు సెట్ చేయాలి.
మొదట్లో 15% వాలు చాలా తీవ్రంగా అనిపిస్తే, 5% లేదా 7% తో ప్రారంభించి, కొన్ని వారాల పాటు క్రమంగా వాలును పెంచడానికి ప్రయత్నించాలి.
వెనక్కి వాలడం, ట్రెడ్‌మిల్ హ్యాండిల్స్‌ను గట్టిగా పట్టుకోవడం మానుకోవాలి.
ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని వాలుగా నడవడాన్ని దినచర్యలో భాగం చేసుకుని స్థిరంగా కొనసాగిస్తే.. బరువు తగ్గడం చాలా సులభం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు .
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా..!ఏకంగా క్రికెట్, ఫుట్‌బాల్..)


