సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ఈ నెల 24 నుంచి 29 వరకు అమెరికాలో పర్యటించేందుకు సీఎం షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి ఈ నెల 23న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఆ తర్వాత 24 నుంచి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పెట్టుబడులు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది.
అయితే, చివరి నిమిషంలో విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి నిరాకరణ రావడంతో అమెరికా పర్యటనకు బ్రేక్ పడింది. దీంతో సీఎం పర్యటన రద్దు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే లండన్ పర్యటనలో ఉన్న సీఎం.. 23న హైదరాబాద్ చేరుకున్న తర్వాత రాష్ట్రంలో పలు కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. అమెరికా పర్యటన రద్దుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ పర్యటన రద్దు కావడంతో కేవలం అధికారులు మాత్రమే అమెరికా పర్యటనకు వెళ్లున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో విద్యాసంస్థలతో ఎంవోయూలు చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హార్వర్డ్, MIT, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్‌తో భాగస్వామ్యాలపై చర్చలు జరగనున్నాయి.
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి..‘ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావడమే లక్ష్యం. హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ ప్రయోజనాలు రాజకీయాలకు అతీతం. విద్య, నైపుణ్యాలు, శిక్షణలో ప్రపంచ అత్యుత్తమ సంస్థలను తెలంగాణకు తీసుకొస్తాం. పిల్లలను విదేశాలకు పంపడం కాదు.. ప్రపంచ అత్యుత్తమ విద్యను తెలంగాణకు తీసుకురావాలి. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు’ అని చెప్పుకొచ్చారు.
ఇక, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ సహా బ్రిటన్‌లోని ప్రముఖ విద్యాసంస్థలతో సీఎం భేటీ అయ్యారు. LSE, London Business School, University of London ప్రతినిధులతో సమావేశాలు జరిగాయి. బ్రిటన్‌లో ప్రముఖ స్పోర్ట్స్, స్కిల్లింగ్ సంస్థలతోనూ సీఎం చర్చలు జరిపినట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు


