తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రతీ ఏడాది ఎంతోమంది యువతీ యువకులు సిటీ ఆఫ్ డ్రీమ్స్ ముంబైకి క్యూ కడతారు. కానీ ఆ కలలను సాకారం చేసుకుని, ప్రతిభతో సక్సెస్ అయ్యేది మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు స్టాండప్ కమెడియన్ షారన్ వర్మ (Sharon Verma) ఒకరు. ముంబై మహా నగరానికి తాను ఎలా వచ్చిందీ, గత నాలుగేళ్లలో జరిగిన విషయాలన్నింటినీ ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.
"ఖచ్చితంగా నాలుగేళ్ల క్రితం, హాట్‌స్టార్‌లో రైటింగ్ ఉద్యోగం రావడంతో నేను ముంబైకి వచ్చాను. నా జేబులో కేవలం రూ. 100 మాత్రమే ఉండేవి, మిగిలిన రూ. 1.2 లక్షలు బ్యాంకు ఖాతాలో పొదుపుగా ఉండేవి," అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
నాలుగు సంవత్సరాల క్రితం హాట్‌స్టార్‌లో రైటింగ్ ఉద్యోగం రావడంతో షారన్ ముంబైకి వెళ్లారు. అప్పుడు ఆమె దగ్గర జేబులో కేవలం రూ. 100, బ్యాంకు ఖాతాలో రూ. 1.2 లక్షల పొదుపు మాత్రమే ఉన్నాయి. తన కరియర్ ప్రారంభంలో ముంబైలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రవీనా టాండన్ వంటి ప్రముఖ నటుల కోసం ఆమె పనిచేశారు. లోకల్ రైలు ప్రయాణాలు తనకు ఇబ్బందిగా అనిపించినప్పటికీ, ఆఫీసు నుండి కనిపించే ముంబై స్కైలైన్ దృశ్యాలు ఆ కష్టాన్ని మరిపించేవట. అంతేకాదు విద్యా బాలన్ తన పట్ల ఎంతో దయతో ఉండేవారని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం స్టాండప్ కమెడియన్‌గా తనను తాను నిరూపించుకుంటోంది.
ఇదీ చదవండి: కస్టడీ పోరు : నాలుగేళ్లపాపను కాల్చి చంపి, ఆత్మహత్య
స్టాండప్ కామెడియన్‌గా
2024లో ఓపెన్-మైక్ షోలలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించిన ఆమె, ఫిబ్రవరి 2025 నాటికి ఫుల్ టైమ్ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిస్థాయిలో స్టాండప్ కామెడీపై దృష్టి పెట్టారు. సమయ్ రైనా హోస్ట్ చేసిన 'ఇండియాస్ గాట్ లేటెంట్' సీజన్ 1లో వీక్ ఇండిపెండెంట్ విమెన్ అంటూవ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆమె ఈ షోలో న్యాయనిర్ణేతలలో ఒకరిగా కనిపించారు. ఈ షో తరువాత షారన్ గణనీయమైన ప్రజాదరణ పొందింది. "బలహీనమైన స్వతంత్ర మహిళ"గా ఆమె షోస్ ఆకట్టుకున్నాయి. జనాల్ని కట్టిపడేసేలా సమయస్ఫూర్తి, హాస్య చతురత, ఆమె పంచ్ డైలాగ్స్, స్మార్ట్‌నెస్ ఉండేవి. షారన్ వర్మ 1998 ఏప్రిల్ 8, 1998న బిహార్‌లోని పాట్నాలో జన్మించింది. ప్రాథమిక విద్యను పాట్నాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో అభ్యసించింది. పాఠశాల రోజుల్లోనే రచనపై ఆసక్తి ఉండేది. తరువాత షారన్ ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని హన్స్‌రాజ్ కళాశాలలో ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించింది.
ఇదీ చదవండి: 12 ఏళ్ల కొడుకు గొంతు నులిమి? కష్టాల్లో ప్రముఖ నటి


