నోయిడాలో షాకింగ్ సూసైడ్ కలకలం రేపింది. గురుగ్రామ్‌కు చెందిన యువకుడు 41వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సూపసర్ నోవా హైరైజ్ అపార్ట్‌మెంట్స్ వద్ద ఘటన జరిగింది. ఆర్థిక సమస్యల కారణంగా అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనకు ముందు అతను బాల్కనీ దాటి, భవనం అంచుపై నడుస్తున్నట్లు వీడియోలో రికార్డయింది.
అదే సమయంలో పక్క బాల్కనీలో పనిచేస్తున్న ఏసీ టెక్నీషియన్ అతడిని గమనించి ఆపేందుకు ప్రయత్నించాడు. తాను డిప్రెషన్‌లో ఉన్నానని ఆ వ్యక్తి టెక్నీషియన్‌తో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. టెక్నీషియన్, అతని సహోద్యోగి అతడిని రక్షించేందుకు ఆ వ్యక్తి ఫ్లాట్ వైపు వెళ్లేలోపే అతను భవనం నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి కొంత కాలంగా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: కారులో సీఎన్‌జీ నింపుతుండగా బిగ్ బ్లాస్ట్
సుమారు మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు సూపర్‌నోవా స్పైరాలో చెక్-ఇన్ చేసినట్లు తెలిపారు. అంతకుముందు అతను వివిధ ప్రాంతాల్లోని హోటళ్లలో బస చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అతని తండ్రితో జరిగిన సంభాషణను కూడా పోలీసులు పరిశీలించారు. ఆర్థిక సమస్యకు సంబంధించి చర్చించినట్లు తెలిపారు. ఇంటికి తిరిగి రావాలని తండ్రి కోరినప్పటికీ.. అతను అందుకు నిరాకరించినట్లు ఆ చాట్‌లో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సెక్టార్-126 పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
नोएडा सेक्टर 94 सुपरनोवा सोसाइटी के एस्पायर टावर से कूदा युवक
युवक ने 43 वें फ्लोर से कूदा युवक
दो हिस्से में हुआ युवक का शव
शव गिरने के बाद बॉम्ब फटके की आवाज आई
शव के हुआ चीथड़े, कई हिस्से जमीन पर बिखरे
पुलिस शिनाख्त में जुटी@noidapolice @noidapolice pic.twitter.com/atAisurycT— Journalist Deepika singh (@Deepikasingh043) October 3, 2026


