కారులో సీఎన్‌జీ నింపుతుండగా బిగ్ బ్లాస్ట్ | CNG Car Explodes While Refuelling At Gujarat's Karjan | Sakshi
Sakshi News home page

కారులో సీఎన్‌జీ నింపుతుండగా బిగ్ బ్లాస్ట్

Oct 3 2026 2:49 PM | Updated on Oct 3 2026 2:59 PM

CNG Car Explodes While Refuelling At Gujarat's Karjan

గుజరాత్‌లోని వడోదర జిల్లా కర్జన్ టోల్ ప్లాజా సమీపంలో కారులో సీఎన్‌జీ గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో సమీపంలోని రెండు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. పేలుడు ధాటికి వాహనదారులు, బంక్ సిబ్బంది ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ షాకింగ్‌ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అక్టోబర్‌ 1న ఈ ఘటన మధ్యాహ్నం సమయంలో నేషనల్ హైవే-48పై జిందాల్ కంపెనీకి ఎదురుగా ఉన్న సీఎన్‌జీ స్టేషన్‌లో జరిగింది. కారులో సీఎన్‌జీ నింపుతున్న సమయంలో గ్యాస్ ట్యాంక్ అకస్మాత్తుగా పేలిపోయి.. భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కారు వెనుక భాగంలోని కొన్ని ముక్కలు, పగిలిన అద్దాలు వాహనం నుంచి కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి.

కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. సీఎన్‌జీ నింపే సమయంలో భద్రతా ప్రమాణాలపై ఈ ఘటన ఆందోళనలను రేకెత్తించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement