కన్నడలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రచితా రామ్.. తెలుగులోనూ 'సూపర్ మచ్చి', తమిళం 'కూలీ' తదితర సినిమాలు చేసింది. అయితే తన పుట్టినరోజైన అక్టోబర్ 03న ప్రతి ఏడాది అభిమానులని కలిసి సెల్ఫీలు ఇస్తుంటుంది. ఈసారి కూడా అలానే జరగ్గా.. ఓ అభిమాని తుంటరి పనిచేసి ఈమెకు షాకిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
రచిత రామ్ దగ్గరకు వచ్చిన ఓ అభిమాని.. ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అలానే ఆమె రెండు బుగ్గలు పట్టుకుని గిల్లేసరికి ఆమె ఒకింత షాక్‌కి గురైంది. ఈ వీడియో వైరల్ కావడంతో క్యూట్ ఫ్యాన్ మూమెంట్ అని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం సదరు అభిమాని తీరుని విమర్శిస్తున్నారు.
(ఇదీ చదవండి: కలలో కూడా ఊహించలేదు.. కీర్తి సురేశ్)
😄 Be honest, what kind of fan are you—playful 😜 or calm 😇?
Which one are you? 👀#RachitaRam pic.twitter.com/F3A16HFc9W— Filmyyy__duniyaaa (@Filmyduniyaaa) October 3, 2026


