‘అరెస్ట్‌’ ఇలా కూడా చేస్తారా? | UP Police Carry Protester on Shoulder in Lucknow Clash | Sakshi
Sakshi News home page

‘అరెస్ట్‌’ ఇలా కూడా చేస్తారా?

Oct 3 2026 8:45 AM | Updated on Oct 3 2026 8:45 AM

UP Police Carry Protester on Shoulder in Lucknow Clash

సీఈసీ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతోంది. అయితే నిరసనకారుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే.. ఓ కార్యకర్తను పోలీసులు ఏకంగా భుజాన వేసుకుని తీసుకెళ్లి అరెస్ట్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌ లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు జనపథ్‌ మార్కెట్‌ వద్ద ధర్నా చేపట్టారు.  ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, ఓటర్ల జాబితాలో మార్పులపై ఆరోపణలు చేస్తూ.. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో హజ్రత్‌గంజ్‌ చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించి ప్రదర్శనను అడ్డుకున్నారు. 

కార్యకర్త్లలో కొందరు అసెంబ్లీ వైపు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని ఈకో గార్డెన్‌కు తరలించారు. ఆ సమయంలోనే  ఓ పోలీసు అధికారి ఓ నిరసనకారుడిని రెండు చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లి పోలీసు వాహనం వద్ద దించిన దృశ్యం కెమెరాకు చిక్కింది. 

కొందరు ఫోన్లలో ఆ దృశ్యాన్ని బంధించగా.. అక్కడే ఉన్న మహిళా సిబ్బంది నవ్వుకున్నారు. అయితే ఆ సమయంలోనూ ఆ వ్యక్తి నినాదాలు ఆపలేదు. ఆ సమయంలోనే కొందరు ఎస్పీ కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కూడా కనిపించాయి. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అయ్యాయి.

పోలీసుల చర్యపై సోషల్‌ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అరెస్ట్‌ ఇలా కూడా చేస్తారా? అంటూ కొందరు వీడియోను సరదాగా మీమ్స్‌ చేస్తుండగా.. మరికొందరు పోలీసులు నిరసనను అదుపులోకి తీసుకున్న తీరును సమర్థిస్తున్నారు. ఇంకొందరు మాత్రం నిరసనకారులపై అధిక బలప్రయోగం జరిగిందని మండిపడుతున్నారు. 

ఇదీ చదవండి: దుబాయ్‌లో నర్సు ఉద్యోగమని తీసుకెళ్లారు! ఆపై పాపం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement