యూదులను చంపేయాలి  | Omani co-pilot mused about killing Jews in disturbing social media posts | Sakshi
Sakshi News home page

యూదులను చంపేయాలి 

Oct 3 2026 5:40 AM | Updated on Oct 3 2026 5:40 AM

Omani co-pilot mused about killing Jews in disturbing social media posts

 సోషల్‌ మీడియాలో ఒమానీ కో–పైలట్‌ వ్యాఖ్యలు? 

ఇజ్రాయెలీ అధికారి వెల్లడి

న్యూఢిల్లీ: కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను కత్తితో పొడిచి ఫ్లై దుబాయ్‌ విమానాన్ని హైజాక్‌ చేసే ప్రయత్నం చేసిన ఒమాన్‌ దేశపు కో–పైలట్‌ సోషల్‌ మీడియాలో యూదులను హత్య చేయడం గురించి మాట్లాడినట్లు ఇజ్రాయెలీ అధికారి ఒకరు టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌కు తెలిపారు. అంతేకాకుండా... హైజాక్‌ యత్నం జరిగినప్పుడు ఈ కోపైలట్‌ తనను చంపేయమని కూడా ఎమిరేట్స్‌కు చెందిన సిబ్బందిని కోరినట్లు ప్రయాణీకుల సంభాషణలను బట్టి తెలిసిందని ఆ అధికారి తెలిపారు.

అవసరమైతే ఆత్మహత్య చేసుకునేందుకూ సిద్ధంగా ఉన్నాడని, అతడి సోషల్‌ మీడియా అకౌంట్లను చూస్తే పూర్తిగా జిహాదీ భావజాలం కలిగిన వ్యక్తని తెలుస్తుందని ఆ అధికారి వివరించారు. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహూ కూడా కోపైలట్‌ ఇస్లామిక్‌ మతోన్మాది అని విచారణలో తెలిసినట్లు చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం. 

మరోవైపు ఐన్యూస్‌24 విలేకరి సమాచారం ప్రకారం ఈ ఒమానీ కోపైలట్‌ నుంచి స్వా«దీనం చేసుకున్న వస్తువుల్లో ‘ఫ్రీ పాలస్తీన్‌’ వర్గాలు ముద్రించిన కొన్ని కరపత్రాలు ఉన్నాయి. ఘటన సమయంలోనూ అతడు పలుమార్లు పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడాడని, ఆ విలేకరి ఎమిరేట్స్‌ సిబ్బందిని ఉటంకిస్తూ చెప్పారు. దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళుతున్న విమానం బుధవారం అకస్మాత్తుగా సుమారు 17,000 అడుగుల దిగువకు చేరడం... ప్రయాణీకులు, సిబ్బంది కో–పైలట్‌ను అడ్డుకోవడంతో హైజాక్‌ యత్నం విఫలం కావడం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement