భారతీయ టెకీకి సర్‌‘ప్రైజ్’‌.. పుట్టినరోజు నెలలోనే అదృష్టం! | Indian IT engineer win Dh25000 Big Ticket birthday surprise Abu Dhabi | Sakshi
Sakshi News home page

భారతీయ టెకీకి సర్‌‘ప్రైజ్’‌.. పుట్టినరోజు నెలలోనే అదృష్టం!

Oct 3 2026 12:54 AM | Updated on Oct 3 2026 12:58 AM

Indian IT engineer win Dh25000 Big Ticket birthday surprise Abu Dhabi

దుబాయ్‌: యూఏఈలో నివసిస్తున్న భారతీయ ఐటీ ఇంజనీర్‌కు పుట్టినరోజు నెలలోనే అనూహ్యమైన కానుక లభించింది. అబుదాబిలో నివసిస్తున్న ముంబైకి చెందిన కునాల్‌ పిళ్లై (34), తన స్నేహితుల బృందంతో కలిసి పాల్గొన్న బిగ్‌ టికెట్‌ వీక్లీ ఈ-డ్రాలో 25,000 దిర్హామ్‌లు (సుమారు రూ.6.5 లక్షలు) గెలుచుకున్నాడు. ఈ విజయం అతడికి ఆనందంతోపాటు పుట్టినరోజు వేడుకలకు మరో ప్రత్యేక కారణాన్ని అందించింది.

స్నేహితులతో కలిసి టికెట్లు కొనుగోలు

ముంబైకి చెందిన కునాల్‌ పిళ్లై గత 11 ఏళ్లుగా భార్యతో కలిసి అబుదాబిలో నివసిస్తున్నాడు. స్నేహితుల ద్వారా బిగ్‌ టికెట్‌ గురించి తెలుసుకున్న అతడు ఏడాది క్రితం నుంచి ఈ డ్రాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. క్రమంగా ఇది అతడి భార్యతోపాటు మరో సన్నిహిత దంపతులతో కలిసి సరదాగా పాల్గొనే కార్యక్రమంగా మారింది.

తాజాగా వీరంతా కలిసి ఆరు టికెట్లు కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన నంబర్ల ఎంపికను కూడా పంచుకున్నారు. తాను మూడు నంబర్లు ఎంచుకోగా, మిగిలిన మూడు నంబర్లను తన స్నేహితుడు ఎంపిక చేసినట్లు కునాల్‌ తెలిపాడు. ఈ క్రమంలోనే వారి బృందానికి అదృష్టం వరించింది.

విజేతగా ఎంపికైనట్లు బిగ్‌ టికెట్‌ నిర్వాహకుల నుంచి ఫోన్‌ వచ్చినప్పుడు తొలుత ఆశ్చర్యపోయానని కునాల్‌ చెప్పాడు. అది నిజంగా బిగ్‌ టికెట్‌ నుంచి వచ్చిన కాల్‌ అని నిర్ధారించుకున్న తర్వాత ఎంతో సంతోషం కలిగిందని, తాము బహుమతి గెలుచుకున్నామన్న విషయాన్ని నమ్మలేకపోయానని వివరించాడు.

పుట్టినరోజు వేడుకలకు అదనపు ఆనందం

కునాల్‌ పుట్టినరోజు నెలలోనే ఈ బహుమతి రావడంతో అతడి ఆనందం రెట్టింపైంది. గెలుచుకున్న నగదును తన బృందంలోని సభ్యులతో పంచుకోనున్నారు. తనకు వచ్చే వాటాలో కొంత మొత్తాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేస్తూ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని భావిస్తున్నాడు. ఈ విజయం తమ బృందాన్ని భవిష్యత్తులోనూ బిగ్‌ టికెట్‌ డ్రాల్లో పాల్గొనేలా ప్రోత్సహించిందని తెలిపాడు.

అక్టోబర్‌ డ్రాలో రూ. కోట్ల బహుమతి

బిగ్‌ టికెట్‌ అక్టోబర్‌ నెలకు సంబంధించి రూ. కోట్ల విలువైన బహుమతులను ప్రకటించింది. ఇందులో ప్రధాన ఆకర్షణగా 2.5 కోట్ల దిర్హామ్‌ల గ్రాండ్‌ ప్రైజ్‌ ఉంది. నవంబర్‌ 3న నిర్వహించే ప్రత్యక్ష డ్రాలో ఈ బహుమతి విజేతను ప్రకటించనున్నారు. సెప్టెంబర్‌ డ్రాల్లో చిన్న మొత్తాల నగదు బహుమతులు గెలుచుకున్న వారితోపాటు, తదుపరి డ్రా కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ ప్రకటన ఆసక్తిని పెంచుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement