మీరట్‌లో జరిగిన బ్లూ డ్రమ్ ఘటన మరువక ముందే అదే తరహా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ముగ్గురు మహిళల దారుణ హత్యలకు సంబంధించిన భయానక ఘటన నాలుగేళ్ల తరువాత వెలుగు చూడటం కలకలం రేపింది. కోవిడ్-19 సమయంలో (2022లో) జరిగిన ఈ హత్యలపై అహ్మదాబాద్ పోలీసులు మాధవదాస్ (Madhavdas), ఊర్మిళ (Urmila) అనే దంపతులను అరెస్టు చేసి ట్రిపుల్ మర్డర్ కేసు నమోదు చేశారు.
హత్యకు గురైన నలుగురిలో ముగ్గురు మహిళలు. ఈ ముగ్గురు మహిళలను ఊపిరాడకుండా చేసి (దిండుతో అణచివేసి) హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శాంతాబెన్ శవాన్ని మూడు బస్తాల సిమెంట్‌తో నింపి ఇంట్లోని పెరట్లో గుంత తవ్వి పూడ్చి పెట్టారు. భగవతిని వేరే చోట పాతిపెట్టగా, మంజులాబెన్‌ను దహనం చేశారు. వీరిలో 70 ఏళ్ల వృద్ధురాలు శాంతాబెన్ వసవను హత్య చేసి, అనతరం సిమెంట్ డ్రమ్ములో పూడ్చిపెట్టారు. ఈ హత్య విచారణలో మిగిలిన హత్యలు కూడా బయటపడ్డాయి.
వీరిలో 70 ఏళ్ల వృద్ధురాలు శాంతాబెన్ వసవను హత్య చేసి, అనతరం సిమెంట్ డ్రమ్ములో పూడ్చిపెట్టారు. దర్యాప్తు అధికారులు ఇంటి ఆవరణలోని సిమెంట్ స్లాబ్‌ను పగలగొట్టి, సుమారు నాలుగు నుండి ఐదు అడుగుల లోతు వరకు తవ్విన తర్వాత, శాంతాబెన్ అవశేషాలు ఉన్న డ్రమ్‌ను బయటకు తీశారు.శాంతాబెన్ మృతదేహాన్ని డ్రమ్‌లో ఉంచి, మూడు బస్తాల సిమెంట్‌ను నీటితో కలిపి ఆ డ్రమ్‌ను నింపి, ఆపై దానిని ఒక గుంతలో పాతిపెట్టారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని మరో మందపాటి సిమెంట్ పొరతో కప్పివేశారు. హతుల్లో మరో మహిళ ఊర్మిళ సోదరి భాగవతి వాసవ. మూడో మహిళ మాధవ్ దాస్ తల్లి మంజులాబెన్ సాధు.
హత్యలు ఎలా బయటపడ్డాయి?
భార్యతో విభేదాల కారణంగా విడిపోయిన మాధవదాస్.. తన భార్య, ఆమె కజిన్ అఫ్జల్ కలిసి శాంతాబెన్‌ను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే విచారణలో ఆయన చెప్పిన మాటల్లో పొంతన లేక పోవడంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించగా, తామిద్దరం కలిసే ఈ హత్యలు చేసినట్లు మాధవదాస్ అంగీకరించాడు.
ఇదీ చదవండి: పేరుకే పింక్ ర్యాపిడోపై మండిపడిన ఇన్‌ఫ్లుయెన్సర్, నెటిజన్ల విమర్శలు
భార్యపై కోపంతో ఫిర్యాదు
భార్య తన కొడుకు, నగలు, నగదుతో వేరుగా ఉంటున్నందుకు ఆమెపై పగ తీర్చుకోవడానికే మాధవదాస్ ఈ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కోవిడ్ సమయాన్ని ఆసరాగా చేసుకుని శాంతాబెన్ ఆసుపత్రిలోనే చనిపోయిందని, నేరుగా శ్మశానవాటికకు తరలించినట్లు బంధువులను నమ్మించారు. శాంతాబెన్ హత్య తర్వాత కొంతకాలానికి టీబీతో బాధపడుతున్న భగవతిని దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపారని, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పారవేశారని ఆరోపణలు నమోదైనాయి. అలాగే పక్షవాతంతో బాధపడుతున్న మంజులాబెన్‌ను కూడా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపారని, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని దహనం చేశారని పోలీసులు తెలిపారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు శాంతాబెన్ అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ హత్యల వెనుక అసలు ఉద్దేశం (motive) ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: మోనాలిసా భోస్లేకు భారీ ఊరట : తండ్రికి మొట్టికాయలు


